ప్రశ్నలు - జవాబులు
2 మార్కులు
1. SF4, SF6 నిర్మాణాలను వివరించండి.
జ:
SF4
S సంకరీకరణం: sp3d
ఆకృతి: తూగుడు బల్ల
SF6
S సంకరీకరణం: sp3d2
ఆకృతి: అష్టముఖీయ
2. గది ఉష్ణోగ్రత వద్ద H2O ద్రవం కాగా H2S వాయువు. ఎందువల్ల?
జ:
ఆక్సిజన్ అల్ప పరమాణు సైజు , అధిక రుణవిద్యుదాత్మకత వల్ల అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడి H2O అణువులు దగ్గరగా రావడం వల్ల H2O ద్రవస్థితిని పొందుతుంది. H - S బంధాలు హైడ్రోజన్ బంధాలను ఏర్పరచలేకపోవడం వల్ల H2S వాయువుగానే ఉంటుంది.
3. ఎ) తటస్థ ఆక్సైడ్ బి) పెరాక్సైడ్ సి) సూపర్ ఆక్సైడ్ డి) ద్విస్వభావ ఆక్సైడ్లకు ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
జ: ఎ) NO బి)H2O2 సి)KO2 డి) H2O
4. ఎ)SO2 బి)SO3 సి)SF4 డి) SF6 ల్లో S సంకరీకరణాన్ని తెలపండి.
జ: ఎ)sp2 బి) sp2 సి)sp3d డి) sp3d2
5. 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటే ఏమిటి? దీన్ని ఎలా తొలగిస్తారు?
జ: మెర్క్యురీ O3 తో చర్య జరిపి Hg2O ను ఇస్తుంది. ఈ చర్యలో Hg లోహద్యుతిని, ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజుపాత్ర గోడలపై అంటుకోవడాన్ని (Hg2O ఏర్పడటం వల్ల) 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటారు.
Hg2O ను నీటిలో బాగా కుదిపితే తిరిగి పాదరస వక్రతలాన్ని పొందవచ్చు.
2 Hg + O3 → Hg2O + O2
6. ఓజోన్ ఎ)C2H2 బి)C2H4ల తో ఎలా చర్య జరుపుతుంది?
జ: ఎ) ఓజోన్ C2H2 తో ఎసిటలీన్ ఓజోనైడ్ను ఇస్తుంది.
C2H2 + O3 → C2H2 . O3
బి) ఓజోన్ C2H4 తో ఇథలీన్ ఓజోనైడ్ను ఇస్తుంది.
C2H4 + O3 → C2H4 . O3
7. ఓజోన్ ఉపయోగాలను ఏవైనా రెండింటిని తెలపండి.
జ: * క్రిమిసంహారిణిగా.
* నీటిని సూక్ష్మజీవిరహితంగా చేయడానికి.
8. ఏవైనా రెండు సల్ఫర్ ఆక్సీ ఆమ్లాల పేర్లు, ఫార్ములాలు, నిర్మాణాలను రాయండి.
జ:
9. SO2 ను యాంటీక్లోర్గా ఉపయోగించవచ్చు. వివరించండి.
జ: SO2 క్లోరిన్‌తో చర్య జరిపి సల్ఫ్యూరైల్ క్లోరైడ్‌ను ఏర్పరచడం ద్వారా Cl2 తొలగిపోతుంది. అందుకే SO2 ను యాంటీక్లోర్గా ఉపయోగించవచ్చు.
SO2 + Cl2 → SO2Cl2
10. O2, O3 ల్లో పారా అయస్కాంత పదార్థమేది?
జ: MOT సిద్ధాంతం ప్రకారం O2 లో 2 జతకూడని బంధ ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల O2 పారా అయస్కాంత పదార్థం, O3 డయా అయస్కాంత పదార్థం.
11. SO4-2, SO3 నిర్మాణాలను వివరించండి.
జ:
SO4-2
ఆకృతి: టెట్రాహెడ్రల్
S సంకరీకరణం:sp3
బంధకోణం: 10928'
SO3
ఆకృతి: సమతల త్రిభుజం
S సంకరీకరణం: sp2
బంధకోణం: 120
12. అమ్మోనియాను అనార్ద్ర పరచడానికి (తేమను తొలగించడానికి) గాఢ H2SO4 ను ఉపయోగించరు.
ఎందువల్ల? దీన్ని అనార్ద్ర పరచడానికి దేన్ని ఉపయోగిస్తారు?
జ: గాఢ H2SO4 అమ్మోనియాతో చర్య జరిపి (NH4)2SO4 ను ఇస్తుంది. కాబట్టి NH3 ని అనార్ద్ర పరచడానికి క్విక్ లైమ్ (CaO) ను ఉపయోగిస్తారు.
13. ఓజోన్ పొరకు ఎదురయ్యే 2 సవాళ్లను తెలపండి.
జ: * రిఫ్రిజిరేటర్లో వాడే ఫ్రియాన్లు.
* అతివేగంగా ప్రయాణించే జెట్ విమానాల నుంచి వెలువడే NO.
NO + O3 → NO2 + O2.
4 మార్కులు
1. ఆక్సిజన్ నుంచి ఓజోన్ను ఎలా తయారు చేస్తారు?
ఎ) PbS బి) తేమగా ఉండే KI సి) Hg డి) Ag లతో ఓజోన్ చర్యలను వివరించండి.
జ: శుద్ధ, పొడిగా ఉండే చల్లని ఆక్సిజన్ ద్వారా నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గాన్ని పంపిస్తే 10% ఓజోన్ తయారవుతుంది. ద్రవరూప O2 పరివేష్టితమై ఉన్న పాత్రలో పరిశుద్ధ ఓజోన్ను సంగ్రహిస్తారు.
3 O2 → 2 O3; H = +142 కి.జౌ./ మోల్
ఎ) ఓజోన్ నల్లని PbS ను తెల్లని PbSO4 గా ఆక్సీకరణం చేస్తుంది.
PbS + 4 O3→ PbSO4 + 4 O2
బి) ఓజోన్ తేమగా ఉండే KI ను I2 గా ఆక్సీకరణం చేస్తుంది.
2 KI + H2O + O3 → I2 + O2 + 2 KOH
సి) ఓజోన్ Hg తో చర్య జరిపితే లోహద్యుతిని, ద్రవ వక్రతలాన్ని కోల్పోయి గాజు పాత్రల గోడలపై అంటుకుంటుంది. దీన్నే 'టెయిలింగ్ ఆఫ్ మెర్క్యురీ' అంటారు.
2 Hg + O3 → Hg2O + O2
డి) ఓజోన్ Ag ను Ag2O గా ఆక్సీకరణం చేస్తుంది.
2 Ag + O3→ Ag2O + O2.