• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వృక్షశరీరధర్మశాస్త్రం - శ్వాసక్రియ

ప్రశ్న‌లు - జ‌వాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. శ్వాసక్రియలో పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి విడుదల అవుతుంది. అవసరమైనప్పుడు ఈ శక్తి ఎలా నిల్వ చేయబడుతుంది లేదా విడుదల అవుతుంది?

జ: శ్వాసక్రియలో పదార్థాలు ఆక్సీకరణ చెంది, విడుదలైన శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు ATP జలవిశ్లేషణ చెంది, దానిలోని మూడో ఫాస్ఫేట్ విడిపోయి 7.6 K.Cal శక్తి విడుదల అవుతుంది. ఇది జీవన చర్యలకు తోడ్పడుతుంది.

2. శక్తి నగదు అంటే ఏమిటి? మొక్కలు, జంతువుల్లో శక్తి నగదుగా పనిచేసే పదార్థం ఏది?

జ: కణం లోపల ఎక్కడైనా, ఏ జీవ క్రియలోనైనా, ఎప్పుడైనా ఉపయోగపడే రసాయనిక శక్తి ప్రమాణాన్నే శక్తి నగదు (Currency of the Cell) అంటారు.

మొక్కలు, జంతువుల్లో శక్తి నగదుగా పనిచేసే పదార్థాన్ని ATP అంటారు.

3. శ్వాసక్రియలో విభిన్న అథస్థ పదార్థాలు ఆక్సీకరణ చెందుతాయి. శ్వాసక్రియ కోషంట్ (RQ) వల్ల ఏ పదార్థం (కార్బోహైడ్రేట్, కొవ్వు, ప్రొటీన్ లాంటివి) ఆక్సీకరణ చెందుతుందో ఎలా తెలుస్తుంది?

A, B దేన్ని సూచిస్తాయి? ఏ అథస్థ పదార్థాల RQ విలువలు 1, < 1, > 1 గా ఉంటాయి?

జ: కార్బోహైడ్రేట్ ఆక్సీకరణ చెందినప్పుడు RQ విలువ 1. కొవ్వుల RQ 0.7. ప్రొటీన్ల RQ 0.8 - 0.9 గా ఉంటుంది.

దీనిలో A = CO2, B = O2

RQ విలువలు

1   గ్లూకోజ్

<   ప్రొటీన్లు, కొవ్వులు

> 1   సేంద్రియ లేదా కర్బన ఆమ్లాలు

4. శ్వాసక్రియలో F0 - F1 రేణువుల విశిష్ట పాత్ర ఏమిటి?

జ: F0 -  F1 రేణువులు సంక్లిష్టం V రూపంలో ATP సింథేజ్‌గా పనిచేస్తాయి. శక్తిమంత ప్రోటాన్లు త్వచాన్ని దాటడానికి వీలు కల్పించే తూముగా F0 పనిచేస్తుంది. F1 అనేది తలభాగం. దీనిలో ఉన్న ADP ఒక ఫాస్ఫేట్‌ను గ్రహించి ATP గా మారడానికి F1 తోడ్పడుతుంది. ఇది నిరంతరం చలించే అతి చిన్న యంత్రం.

5. మానవుడు, ఈస్ట్‌ల్లో వాయురహిత శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది?

జ: వ్యాయామం చేస్తున్నపుడు కండరాల కణాల్లో; ఈస్ట్‌లో కణశ్వాస క్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అప్పుడు వాయురహిత శ్వాసక్రియ జరుగుతుంది. దీన్నే అవాయు శ్వాసక్రియ అంటారు.

6. అవికల్ప, వైకల్పిక అవాయు జీవులకు మధ్య భేదం ఏమిటి?

జ: అవికల్ప అవాయు జీవులు ఆక్సిజన్ లభించినప్పటికీ నశిస్తాయి. కానీ, వైకల్పిక అవాయు జీవులు ఆక్సిజన్ లభించినప్పుడు వాయుసహిత శ్వాసక్రియ జరుపుతాయి.

7. కిణ్వనం చర్య ఆర్థిక ప్రాముఖ్యాన్ని వివరించండి.

జ: కిణ్వన చర్యలో భాగంగా మొదట అవాయు పరిస్థితుల్లో గ్లూకోజ్ అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందుతుంది. ఇది వివిధ రకాల సూక్ష్మజీవుల ప్రత్యేక ఎంజైమ్‌ల చర్యల వల్ల ఆర్థికంగా ఉపయోగపడే వివిధ రకాల ఉత్పత్తులను ఏర్పరుస్తుంది.

అవి...

ఈస్ట్ - ఇథనాల్

లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా - లాక్టిక్ ఆమ్లం

క్లాస్ట్రీడియం జాతులు - అసిటోన్, బ్యుటనాల్, బ్యుటరిక్ ఆమ్లం.

ఆస్పర్జిల్లస్ - సిట్రిక్ ఆమ్లం

8. వాయుసహిత, వాయురహిత శ్వాసక్రియల్లో సాధారణ చర్య ఏది? ఇది ఎక్కడ జరుగుతుంది?

జ: వాయుసహిత, వాయురహిత శ్వాసక్రియల్లో సాధారణ చర్య గ్లైకాలిసిస్. ఇది కణద్రవ్యంలో జరుగుతుంది.

9. మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అని ఎందుకంటారు?

జ: ఆహార పదార్థాలు శ్వాసక్రియలో పాల్గొని, ఆక్సీకరణ చెంది, శక్తిని విడుదల చేసే చర్యల్లో ATP (రసాయనిక శక్తి ప్రమాణం) ఏర్పడుతుంది. ఇది మైటోకాండ్రియన్లలో జరుగుతుంది. కాబట్టి, మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు.

10. మైటోకాండ్రియాల్లోని F0 - F1 రేణువుల్లో జరిగే ATP ఉత్పత్తిని ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అని అనడానికి కారణమేమిటి?

జ: శ్వాసక్రియలో ఒక భాగం, చివరిదైన (ETS) ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో.... కణద్రవ్యం, మైటోకాండ్రియన్లలో  క్షయకరణ చెందిన సహ ఎంజైమ్‌లు (NADH2, FADH2) ఏర్పడతాయి. ఇవి ఆక్సీకరణ చెందినప్పుడు శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తితో F0 - F1 రేణువుల్లో ATP ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా ఆక్సీకరణ, క్షయకరణ చర్యల నుంచి లభించిన శక్తితో ATP (ఫాస్ఫారిలేషన్) ఏర్పడటాన్ని ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అంటారు.

11. గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయాల మధ్య అనుసంధానంగా పనిచేసే పదార్థమేది? దానిలో కర్బనాల సంఖ్య ఎంత?

జ: గ్లైకాలిసిస్, క్రెబ్స్ వలయాల మధ్య అనుసంధానంగా పనిచేసే పదార్థం ఎసిటైల్ కో ఎంజైమ్ A. దీనిలో కర్బనాల సంఖ్య 2.

12. ఏ సేంద్రియ కణపదార్థాలు శ్వాసక్రియ అథస్థ పదార్థాలుగా అసలు ఉపయోగపడవు?

జ: శుద్ధమైన ప్రొటీన్లు లేదా కొవ్వు ఆమ్లాలు శ్వాసక్రియలో అథస్థ పదార్థాలుగా ఉపయోగపడవు.

13. కార్బోహైడ్రేట్ల కంటే కొవ్వుల RQ విలువ ఎందుకు తక్కువగా ఉంటుంది?

జ: కార్బోహైడ్రేట్‌లో కార్బన్, ఆక్సిజన్‌ల సంఖ్య సమానంగా (C6H12O6) ఉంటుంది. శ్వాసక్రియలో ఇది ఆక్సీకరణ చెందినప్పుడు విడుదలయ్యే CO2, గ్రహించబడే O2 అణువుల సంఖ్య సమానం కాబట్టి, RQ విలువ 1.

కొవ్వుల్లో కార్బన్‌ల సంఖ్య ఎక్కువ, ఆక్సిజన్‌ల సంఖ్య తక్కువ (C51H98O6). ఇవి ఆక్సీకరణ చెందేటప్పుడు విడుదలైన CO2 సంఖ్య తక్కువ. గ్రహించబడే O2 ఎక్కువ. కాబట్టి, RQ విలువ 1 కంటే తక్కువ.

స్వల్ప సమాధాన ప్రశ్నలు

1. శ్వాసక్రియ ఒక శక్తి విమోచక చర్య. ఇది ఎంజైమ్‌ల నియంత్రణలో జరిగే విచ్ఛిన్నక్రియ. దీనిలో సేంద్రియ పదార్థాలు ఆక్సీకరణ చెంది విచ్ఛిన్నం అవుతాయి.

శ్వాసక్రియను వర్ణించే ఈ వాక్యాల్లో...

i) క్రమక్రమంగా జరిగే ఆక్సిడేటివ్ విచ్ఛిన్నం

ii) సేంద్రియ పదార్థం (అథస్థ పదార్థంగా వాడుకునేది) అనే వాటి అర్థం ఏమిటి?

జ: i) గ్లూకోజ్ (C6H12O6)నుంచి హైడ్రోజన్‌ను తొలగించడాన్ని ఆక్సీకరణం అంటారు. ఈ చర్యలో గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందుతుంది. దీన్నే ఆక్సిడేటివ్ విచ్ఛిన్నం అంటారు. ఈ చర్య అంతా ఒకేసారి జరగదు. ఈ చర్యలు (జీవాక్సీకరణం, డీకార్బాక్సిలేషన్) ఒకేసారి జరగవు. ఇవి ఆరు దఫాలుగా జరుగుతాయి. ప్రతిసారి ఒక్కోరకమైన ఎంజైమ్ పాల్గొంటుంది. క్షయకరణం చెందిన సహ ఎంజైమ్‌లు (NADH2, FADH2) ఏర్పడతాయి.

ii) సేంద్రియ పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌లు, సేంద్రియ ఆమ్లాలు. సాధారణంగా కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు అథస్థ పదార్థాలుగా పాల్గొనవు.

దీర్ఘ సమాధాన ప్రశ్నలు

1. క్రెబ్స్ వలయంలోని రసాయన చర్యలను వివరించండి.

జ: ఆక్సిడేటివ్ డీ కార్బాక్సిలేషన్‌లో ఏర్పడిన ఎసిటైల్ Co A క్రెబ్స్ వలయంలో పాల్గొని సంపూర్ణంగా విచ్ఛిన్నం (ఆక్సీకరణం) చెందుతుంది. ఇది మైటోకాండ్రియల్ మాత్రికలో జరుగుతుంది. దీనికి కావాల్సిన ఎంజైమ్‌లన్నీ (ఒక సక్సినిక్ డీ హైడ్రోజినేజ్ తప్ప) మాత్రికలోనే ఉంటాయి. సక్సినిక్ డీ హైడ్రోజినేజ్ లోపలి పొరలో లోపలి వైపు ఉంటుంది. దీనిలోని చర్యల క్రమాన్ని H. A. Krebs కనుక్కున్నారు. దీన్నే TCA (Tri Carboxylic Acid Cycle) లేదా Citric Acid Cycle లేదా Organic Acid Cycle లేదా Central Metabolic Pathway అంటారు. Amphibolic path-way అని కూడా అంటారు. ఒక ఎసిటైల్ Co A క్రెబ్స్ వలయంలో 3 NADH2, 1 FADH2, 1 ATP లను ఏర్పరిచి 2 CO2 లను విడుదల చేస్తుంది.

సంగ్రహ

(6) ఆక్సిడేటివ్ డీ కార్బాక్సిలేషన్ (రెండో కార్బాక్సిలేషన్, రెండో జీవ ఆక్సీకరణం)

ఆగ్జాలో అసిటిక్ ఆమ్లం పునరుద్ధరణ చెందుతుంది.

2. శ్వాసక్రియ జమా ఖర్చుల నివేదిక తయారీలో మనం పరిగణించే ఊహాగానాలు తెలపండి. ఇవి సజీవ వ్యవస్థలకు వర్తిస్తాయా? ఈ సందర్భంలో కిణ్వనం, వాయుసహిత శ్వాసక్రియలను పోల్చండి.

జ: వాయుసహిత ఆక్సీకరణలో ATP ఉత్పత్తికి సంబంధించిన జమా ఖర్చుల నివేదిక

I. గ్లైకాలిసిస్

గ్లూకోజ్‌ను ఫ్రక్టోజ్ - 1, 6 బిస్‌ఫాస్పేట్‌గా మార్చడానికి ఖర్చయిన ATP లు = - 2 ATP

మొదటి అథస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్‌లో (బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం

నుంచి 3 - ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు) ఏర్పడిన ATP లు = 2 ATP

రెండో అథస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ (ఫాస్ఫో ఈనాల్ పైరూవిక్

ఆమ్లం నుంచి పైరూవిక్ ఆమ్లం ఏర్పడేటప్పుడు) లో ఏర్పడే ATP = 2 ATP

ప్రత్యక్ష నికర ATP = 2 ATP

ఏర్పడిన NADH2లు = 2 NADH2

II. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్

ఏర్పడిన NADH2లు = 2 NADH2

III. క్రెబ్స్ వలయంలో

ఏర్పడిన NADH2 = 6 NADH2

ఏర్పడిన FADH2 = 2 FADH2

అథస్థ స్థాయి ఫాస్ఫారిలేషన్‌లో ఏర్పడిన ప్రత్యక్ష ATPలు    = 2 ATP

(సక్సినైల్ Co A నుంచి సక్సినిక్ ఆమ్లం ఏర్పడినప్పుడు)

IV. ఎలక్ట్రాన్ రవాణా చర్య

గ్లైకాలిసిస్‌కు చెందిన 2 NADH2 తో ఏర్పడే ATP = 2 × 2 = 4

ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్‌కు చెందిన 2 NADH2

 నుంచి ఏర్పడే ATP = 2 × 3 = 6

క్రెబ్స్ వలయానికి చెందిన 6 NADH2 నుంచి = 6× 3 = 18

క్రెబ్స్ వలయానికి చెందిన 2 FADH2 నుంచి = 2 × 2 = 4

ఈ విధంగా గ్లూకోజ్ ఏర్పరిచే ATP లు = 2 + 2 + 4 + 6 + 18 + 4   = 36 ATP.

శ్వాసక్రియ జమా ఖర్చుల నివేదిక అన్ని సజీవ వ్యవస్థలకు వర్తిస్తుంది.

కిణ్వనం, వాయు సహిత శ్వాసక్రియల మధ్య పోలిక

అభ్యాసాలు

1. కిందివాటి మధ్య భేదాలను తెలపండి.

a) శ్వాసక్రియ - దహనం b) గ్లైకాలిసిస్ - క్రెబ్స్ వలయం c) వాయుసహిత శ్వాసక్రియ - కిణ్వనం

జ:


    

2. శ్వాసక్రియా అథస్థ పదార్థాలు అంటే ఏమిటి? శ్వాసక్రియకు అతి సాధారణ అథస్థ పదార్థం ఏది?

జ: శ్వాసక్రియలో పాల్గొనే సేంద్రియ పదార్థాన్ని అథస్థ పదార్థం అంటారు.

ఉదా: కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, సేంద్రియ ఆమ్లాలు.

శ్వాసక్రియకు అతిసాధారణమైన అథస్థ పదార్థం గ్లూకోజ్ (కార్బోహైడ్రేట్).

3. గ్లైకాలిసిస్ చర్యను పథ రూపక పటంగా చూపండి.

జ:

              

4. వాయుసహిత శ్వాసక్రియలోని ముఖ్యచర్యలేవి? అవి ఏ ప్రదేశంలో జరుగుతాయి?

జ: వాయుసహిత శ్వాసక్రియలో 4 ముఖ్య చర్యలున్నాయి.

5. క్రెబ్స్ వలయం సమగ్ర రూపాన్ని పథరూపక పటం ద్వారా చూపండి.

జ: క్రెబ్స్ వలయం మైటోకాండ్రియల్ మాత్రికలో జరుగుతుంది. దీన్నే TCA వలయం అంటారు.

6. ETS ను విశదీకరించండి.

జ: వాయుసహిత శ్వాసక్రియలో ఏర్పడిన (క్షయకరణం చెందిన) సహఎంజైమ్‌లు ETSలో పాల్గొంటాయి.

ఇది మైటోకాండ్రియన్ లోపలి పొరలో జరుగుతుంది.

దీనిలో అయిదు ఎంజైమ్ సంక్లిష్టాలు పాల్గొంటాయి. అంతే కాకుండా UQ, Cyt - C అనే 2 చలనశీల  వాహకాలు కూడా పాల్గొంటాయి.

ఎంజైమ్ సంక్లిష్టాల వివరాలు

ఎంజైమ్ సంక్లిష్టం I = NADH డీ హైడ్రోజినేజ్

ఎంజైమ్ సంక్లిష్టం II = సక్సినిక్ డీహైడ్రోజినేజ్

ఎంజైమ్ సంక్లిష్టం III = సైటోక్రోమ్ bc1 సంక్లిష్టం

                           = సైటోక్రోమ్ C రిడక్టేజ్

ఎంజైమ్ సంక్లిష్టం IV = సైటోక్రోమ్ C ఆక్సిడేజ్.

దీనిలో Cyt a, a3 లతోపాటు 2 Cu2+ లు ఉంటాయి.

ఎంజైమ్ సంక్లిష్టం V = ATP సింథేజ్

మైటోకాండ్రియల్ NADH2 ETS లో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ సంక్లిష్టం II అవసరంలేదు.

FADH2 ETSలో పాల్గొన్నప్పుడు ఎంజైమ్ సంక్లిష్టం I అవసరం లేదు.

కణద్రవ్యంలోని NADH2 ETSలో పాల్గొన్నప్పుడు సంక్లిష్టం I, IIలు అవసరం లేదు.

సంక్లిష్టం Vలో 2 భాగాలున్నాయి. F0 లోపలి పొరలో, F1 మాత్రికలో ఉంటుంది.

 మైటోకాండ్రియల్ NADH2 సంక్లిష్టం I తో ఆక్సీకరణం చెందినప్పుడు మాత్రిక నుంచి 4H+  పెరి మైటోకాండ్రియల్ ప్రదేశంలోకి (PMS), ఒక జత e- సంక్లిష్టం I నుంచి UQ (యూబీక్వినోన్) చేరతాయి.

ఒక జత e- క్వినోన్ వలయం ద్వారా రవాణా చెంది సంక్లిష్టం III చేరినప్పుడు 4H+  మాత్రిక నుంచి పెరిమైటోకాండ్రియల్ (PMS) ప్రదేశానికి చేరతాయి. ఈ e- లు సంక్లిష్టం III నుంచి Cyt - C ద్వారా సంక్లిష్టం IV ను చేరతాయి. ఈ

2e-, 2H+  లను O2 స్వీకరించి H2O ఏర్పడుతుంది. 2H+  మాత్రమే సంక్లిష్టం IV ద్వారా పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం (PMS) చేరుతుంది. PMSలో H+  ల గాఢత ఎక్కువ అవుతుంది. పీటర్ మిట్చెల్ కెమీ ఆస్మాటిక్ నమూనా ప్రకారం ప్రోటాన్లు F0 (తూము) ద్వారా F1 లోకి

ప్రవేశించినప్పుడు ATP తయారవుతుంది. NADH2 ఆక్సీకరణ చెందినప్పుడు లభించిన శక్తితోపాటు (ప్రోటాన్ల ద్వారా), ఫాస్ఫారిలేషన్ జరగడం వల్ల ATP ఏర్పడుతుంది. కాబట్టి, దీన్ని ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అంటారు.

10H ల వల్ల 3 ATP లు ఏర్పడతాయి. 1 H+ వృథా అవుతుంది.

FADH2 పాల్గొన్నప్పుడు

సంక్లిష్టం II తో ఆక్సీకరణం చెందడం వల్ల FADH2 నుంచి ఒక జత e- UQ ను చేరుతుంది. UQ నుంచి eక్వినోన్ వలయం ద్వారా 4H+  PMS చేరుతుంది. UQ నుంచి e లు సంక్లిష్టం III, అక్కడ నుంచి Cyt - C ద్వారా సంక్లిష్టం IV ను చేరతాయి. దీని నుంచి 2 H+ PMS ను చేరతాయి. మిగిలిన 2H+, 2e-  లను ఆక్సిజన్ స్వీకరించడంతో నీరు ఏర్పడుంది.

ఈ విధంగా PMSలో చేరిన 6 H+ సంక్లిష్టం Vలోని F0 ద్వారా F1 లోకి చేరినప్పుడు 2 ATPలు ఏర్పడతాయి.

కణద్రవ్యంలో గ్లైకాలిసిస్‌లో ఏర్పడిన NADH2 లు ఆక్సీకరణ చెంది నేరుగా 2e-  లను UQ కు అందజేస్తాయి. FADH2 వల్లే 2 ATPలు ఏర్పడతాయి.

7. ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అంటే ఏమిటి?

జ: ETSలో క్షయకరణం చెందిన సహ ఎంజైమ్‌లు ఆక్సీకరణం చెందినప్పుడు శక్తి విడుదల అవుతుంది. ఈ శక్తి H+ లను చేరి, అవి సంక్లిష్టం V ద్వారా రవాణా చెందినప్పుడు ఫాస్ఫారిలేషన్ జరిగి ATP ఏర్పడుతుంది. ఈ మొత్తం చర్యను ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అంటారు.
 

8. శ్వాసక్రియలో శక్తి విడుదల ఆధారంగా కిందివాటిలో సరైన ఆరోహణ క్రమాన్ని గుర్తించండి.

a) 1 గ్రా. కొవ్వు   b) 1 గ్రా. ప్రొటీన్   c) 1 గ్రా. గ్లూకోజ్   d) 0.5 గ్రా. ప్రొటీన్ + 0.5 గ్రా. గ్లూకోజ్

జ: c > d > b > a

9. అస్థికండరాల వాయుసహిత గ్లైకాలిసిస్, ఈస్ట్ కణాల వాయురహిత శ్వాసక్రియల్లో ఏర్పడే అంత్య ఉత్పన్నాలను వరసగా తెలపండి.

జ: అస్థికండరాల వాయుసహిత గ్లైకాలిసిస్  2 పైరూవిక్ ఆమ్లం

ఈస్ట్ కణాల వాయు రహిత శ్వాసక్రియ  ఇథనాల్ + 2 CO2

10. ఒక వ్యక్తి నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ లేదా పండ్లరసం ఇస్తారు. కానీ, ఎక్కువ శక్తి ఉండే జున్ను పూసిన శాండ్‌విచ్ ఇవ్వరు. ఎందుకు?

జ: జున్ను అంటే కొవ్వు. శాండ్‌విచ్‌లో ప్రొటీన్‌లు ఉంటాయి. ఈ రెండింటిలో (కొవ్వు, ప్రొటీన్‌లు) శక్తి ఉంటుంది. నీరసంగా ఉన్న వ్యక్తికి వీటిని ఇవ్వరు. ఎందుకంటే ఆక్సీకరణ చెందడానికి వీటికి ఎక్కువ ఆక్సిజన్ అంటే ఎక్కువ సమయం పడుతుంది. అదే గ్లూకోజ్ తక్కువ సమయంలో శక్తినిస్తుంది.

11. ఒకవిధంగా హరితయుత మొక్కలు, సయనో బ్యాక్టీరియాలు భూమి పైన ఆహారం మొత్తాన్ని సంశ్లేషించాయి. వ్యాఖ్యానించండి.

జ: హరితయుత మొక్కలు, సయనో బ్యాక్టీరియాలు (స్వయం పోషితాలు) మాత్రమే ఈ ప్రపంచంలో స్వయంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. మిగతా ప్రాణులన్నీ అంటే పరపోషిత జీవులన్నీ (శిలీంద్రాలు, సూక్ష్మజీవులు, జంతువులు) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా స్వయంపోషితాలపై ఆధారపడతాయి.
 

12. జంతువుల్లో ఎరుపు కండర పోగులు, అవిరామంగా ఎక్కువ కాలం పాటు పని చేయగలవని మనకు తెలిసిన విషయమే. ఇదెలా సాధ్యం?

జ: జంతువుల్లో ఎరుపు కండర పోగుల కణాల్లో అధిక సంఖ్యలో మైటోకాండ్రియన్‌లు, కొవ్వులు అధికంగా నిల్వ చేయబడతాయి. అందువల్ల అవి అవిరామంగా, ఎక్కువకాలంపాటు పనిచేయగలవు

Posted Date : 02-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌