• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌తో ఇండియన్ ఆర్మీలోకి!

191 టెక్ మెన్‌, ఉమెన్ పోస్టుల భర్తీకి ప్రకటన

బీటెక్ విద్యార్థులకు చ‌క్క‌టి అవ‌కాశం

 

 

ఇంజినీరింగ్ చేసిన‌వాళ్లు సాఫ్ట్‌వేర్ వైపు అడుగులు వేయ‌డం స‌హజం. మ‌రికొంద‌రు బీటెక్ ప‌ట్టా ఉన్నా.. త‌మ అభిరుచికి అనుగుణంగా ఇత‌ర రంగాల వైపు వెళుతుంటారు. అయితే సాంకేతిక విద్య‌న‌భ్య‌సించినా.. దేశ ర‌క్ష‌ణలో కీల‌క పాత్ర పోషించే ఆర్మీలో చేరాల‌నుకునే  ఇంజినీరింగ్ విద్యార్థుల‌కూ ఓ మార్గముంది. అదే ఇండియ‌న్ ఆర్మీ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) విధానంలో టెక్ పోస్టుల భ‌ర్తీ. 

 

తాజాగా ఇండియ‌న్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రెయినింగ్ అకాడ‌మీ(ఓటీఏ) 2021 అక్టోబ‌రు సంవ‌త్స‌రానికి గాను 57వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(టెక్) మెన్‌, ‌వ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టెక్‌‌) ఉమెన్ కోర్సు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. వీటితోపాటు డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ విడోస్ నుంచి కూడా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎస్ఎస్‌సీ(టెక్) మెన్‌(175), (టెక్‌) ఉమెన్‌(14), విడోస్ డిఫెన్స్ ప‌ర్స‌న‌ల్ (2) పోస్టులు ఉన్నాయి.

 

విభాగాల వారీగా..

సివిల్‌/బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ, ఆర్కిటెక్చ‌ర్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, టెలీక‌మ్యూనికేష‌న్ త‌దిత‌ర విభాగాల్లోని పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

 

విద్యార్హ‌త ఇలా..

ఎస్ఎస్‌సీ(టెక్‌) మెన్‌/ఉమెన్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకునే వారు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. ప్ర‌స్తుతం ఆఖ‌రు సంవత్స‌రం చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌)(నాన్ యూపీఎస్సీ) పోస్టుల‌కు ఏదైనా గ్రాడ్యుయేష‌న్, ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌)-బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. 

 

వ‌య‌సు నిబంధ‌న‌

ఎస్ఎస్‌సీ (టెక్‌) మెన్‌/ ఉమెన్ పోస్టుల‌కు  01.10.2021 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్ఎస్‌సీ విడోస్ (నాన్ టెక్నిక‌ల్‌)(నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్‌సీ విడో (టెక్నిక‌ల్‌) పోస్టుల‌కు 01.10.2021 నాటికి 35 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

 

ద‌ర‌ఖాస్తు విధానం

ఆయా పోస్టుల‌కు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు తుది గ‌డువు జూన్ 23, 2021 వ‌ర‌కు ఉంది. 

 

ఎంపిక విధానం

ఎంపిక విధానం ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ముందుగా వచ్చిన దరఖాస్తులను వారి గ్రాడ్యుయేషన్‌(బీటెక్‌) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టు చేస్తారు. అనంత‌రం సెలక్షన్‌కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్య‌ర్థుల‌ప్రాంతాల‌ను బ‌ట్టి అలాహాబాద్‌, భోపాల్‌, బెంగ‌ళూరు, క‌పుర్త‌లాలో ముఖాముఖి పరీక్ష ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌టెస్టింగ్‌ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. రెండు దశల్లో అయిదు రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు. 

 

శిక్ష‌ణ ఇలా..

ఇంట‌ర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ఆఫీసర్స్‌ట్రైనింగ్‌అకాడమీ-చెన్నైలో శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్ అందుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌డిప్లొమా ఇన్‌డిఫెన్స్‌మేనేజ్‌మెంట్‌అండ్‌స్ట్రాటజిక్‌స్టడీస్‌డిగ్రీని మద్రాస్‌యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్‌కమిషన్‌లోకి (శాశ్వత ఉద్యోగం) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌పొడిగిస్తారు. అనంతరం వైదొలగాల్సి ఉంటుంది. 

 

లెఫ్టినెంట్‌గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌కల్నల్‌హోదాలకు చేరుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ.56,100 (లెవెల్‌10) మూల వేతనంతోపాటు మిలటరీ సర్వీస్‌పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఇత‌ర ప్రోత్సాహ‌కాలు అద‌నం.

 

వెబ్‌సైట్‌: http://joinindianarmy.nic.in/

Posted Date : 29-05-2021

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌