• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీర్లూ.. ఇండియన్ ఆర్మీలోకి ఇదిగో దారి!

టెక్నిక‌ల్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుకు ప్రక‌ట‌న విడుద‌ల‌

రాత ప‌రీక్ష లేదు, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌లు

 

 

సివిల్‌.. మెకానిక‌ల్‌.. ఎల‌క్ట్రిక‌ల్ త‌దిత‌ర విభాగాల ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వారు కొందరు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో, ఇంకొందరు ప్రైవేటు సంస్థ‌ల్లో చేరుతుంటారు. వీరిలో చాలామందికి దేశానికి సేవ చేయాల‌నే త‌ప‌న కూడా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసిన అలాంటి వారికి ఇప్పుడు ఇండియ‌న్ ఆర్మీలోకి వెళ్లే అవ‌కాశం వ‌చ్చింది. ఇండియ‌న్ ఆర్మీ 2022 జ‌న‌వ‌రిలో ప్రారంభించే 134వ టెక్నిక‌ల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)లోకి ఇంజినీరింగ్ అభ్య‌ర్థుల‌ను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌ను కోర్సులో చేర్పించి శిక్ష‌ణ ఇస్తుంది. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న‌వారిని విధుల్లోకి తీసుకుంటుంది. 

 

విభాగాలు.. ఖాళీలు 

కోర్సులో మొత్తం 40 ఖాళీలున్నాయి. వాటిలో సివిల్/ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ(10), మెకానిక‌ల్(2), ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్(3) కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ కంప్యూట‌ర్ టెక్నాల‌జీ/ ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్‌(8), ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(3), ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్(2), టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్(1), ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్(1), శాటిలైట్ క‌మ్యూనికేష‌న్(1), ఏరోనాటిక‌ల్‌/ ఏరోస్పేస్‌/ ఏవియోనిక్స్(2), మైక్రో ఎలక్ట్రానిక్స్‌అండ్‌మైక్రోవేవ్(1), ఎలక్ట్రానిక్స్‌అండ్‌ఇనుస్ట్రుమెంటేషన్‌(2), ఫైబర్ ఆప్టిక్స్‌(1), ప్రొడక్షన్‌(1), ఇండస్ట్రియల్‌మాన్యూఫ్యాక్చరింగ్‌(1), వర్క్‌షాప్‌టెక్నాలజీ(1) విభాగాలున్నాయి. 

 

అర్హ‌త ప్ర‌మాణాలు

అవివాహితులైన పురుష అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్థులు ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త సాధించాలి. ఇంజినీరింగ్ చివ‌రి ఏడాది చ‌దువుతున్న విద్యార్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌య‌సు జ‌న‌వ‌రి క‌, 2022 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. అంటే జులై 2, 1995 నుంచి జ‌న‌వ‌రి 1, 2022 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి. 

 

ఎంపిక విధానం

ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల మార్కుల‌కు క‌ట్ ఆఫ్ నిర్ణ‌యిస్తారు. దాన్ని బ‌ట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంత‌రం స‌ర్వీస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తుంది. త‌ర్వాత వైద్య ప‌రీక్ష‌లు ఉంటాయి. పై ప్ర‌క్రియల ఆధారంగా తుది ఎంపిక‌లు ఉంటాయి.

 

ద‌ర‌ఖాస్తు విధానం

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు సెప్టెంబ‌ర్ 15, 2021 వ‌ర‌కు గ‌డువు ఉంది. 

 

శిక్ష‌ణ ఇలా..

మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్య‌ర్థులకు ఇండియ‌న్ మిలిటరీ అకాడ‌మీ (ఐఎంఏ) డెహ్రాడూన్‌లో శిక్ష‌ణ ఉంటుంది. కోర్సు వ్య‌వ‌ధి 49 వారాలు. శిక్ష‌ణ‌లో చేరిన‌ప్ప‌టి నుంచే లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. షార్ట్ సర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్సీ) నిబంధ‌న‌ల ప్ర‌కారం వేత‌నం అందుతుంది. ఆ స‌మ‌యంలో నెల‌కు రూ. 56,100 చెల్లిస్తారు. విజ‌య‌వంతంగా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న అభ్య‌ర్థులు శాశ్వ‌త క‌మిష‌న్ ప‌రిధిలోకి వ‌స్తారు.  

 

ప్ర‌మోష‌న్లు.. జీత‌భ‌త్యాలు

అభ్య‌ర్థి.. లెఫ్టినెంట్ హోదాతో విధులు ప్రారంభిస్తాడు. ఆ స‌మ‌యంలో జీతం నెల‌కు రూ.56,100 నుంచి రూ.1,77,500 వ‌ర‌కు అందుతుంది. ఆ త‌ర్వాత‌ప్ర‌మోష‌న్లు, వేత‌నం ప‌రిశీలిస్తే.. కెప్టెన్ (రూ.61,300 - రూ.1,93,900), మేజ‌ర్ (రూ.69,400 - రూ.2,07,200), లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ (రూ.1,21,200 - రూ.2,12,400), క‌ల్న‌ల్ (1,30,600 - రూ.2,15,900), బ్రిగేడియ‌ర్ (1,39,600 - రూ.2,17,600), మేజ‌ర్ జ‌న‌ర‌ల్ (రూ.1,44,200 - రూ.2,18,200), లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ (రూ.1,82,200 - రూ.2,50,000) విధంగా ఉంటాయి. వీటికి ఇత‌ర అల‌వెన్సులు అంద‌నంగా అందుతాయి. 

 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
 

Posted Date : 20-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌