• facebook
  • whatsapp
  • telegram

ఆర్మీలోకి ఆహ్వానం!

ఎంపికైతే ఉచిత విద్య, ఉద్యోగం
 

దేశ రక్షణ దళాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌లో చేరటం అంటే భవితను అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్‌ చేజిక్కించుకున్నట్టే! విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే చక్కని హోదాతో ఉద్యోగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకు వీలు కల్పించే ఆర్మీ ఎంట్రీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.
 

ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీం
ఇంటర్మీడియట్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగావకాశం కూడా అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. దానిలో భాగంగా 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం ప్రకటనను విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 90. అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ విధానంలో ఎంపికైనవారు కమిషన్‌ ట్రెయినింగ్‌లో అయిదేళ్ల ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. అనంతరం ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది.
 

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కనీసం 70శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత పొందినవారు ఈ ఎంట్రీ స్కీముకు పోటీపడవచ్చు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు ఉండాలి. అభ్యర్థులు 01.01.2000 నుంచి 01.01.2003 మధ్య జన్మించి ఉండాలి.
 

స్టేజ్‌ 1, 2 పరీక్షలు, ఇంటర్వ్యూ, శారీరక, వైద్య తదితర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.11.2018.
 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
 

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌