• facebook
  • whatsapp
  • telegram

క్లర్కు కొలువు సాధనకు ఉమ్మడి వ్యూహం!

11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,545 ఖాళీలతో ఐబీపీఎస్‌ ప్రకటన

ప్రభుత్వ బ్యాంకుల్లో క్లరికల్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 4545 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ఐబీపీఎస్‌ ద్వారా భర్తీచేసే 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కేవలం నాలుగు మాత్రమే పోస్టుల వివరాలు పేర్కొన్నాయి. ఇంకా ఏడు బ్యాంకులు ఖాళీల వివరాలు తెలియజేయాల్సి ఉంది. అందువల్ల పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగార్థులు క్లరికల్‌ పరీక్షలో విజయవంతం కావడానికి మెలకువలు తెలుసుకుందాం!

చివరి సంవత్సరం/ సెమిస్టర్‌వారికి అర్హత ఉందా? 

డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులకు పరీక్షా ఫలితాలు 21 జులై (దరఖాస్తుకు చివరి తేదీ)లోగా వెల్లడయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫలితాలు వస్తే దరఖాస్తుకు అవకాశం ఉండదు. 

సన్నద్ధత వ్యూహం ఇదీ

ఈ పరీక్షలో విజయం సాధించాలంటే ప్రిపరేషన్‌ ప్రణాళిక పక్కాగా నిర్దేశించుకుని దాన్ని అమలు చేయాలి. దీని కోసం నాలుగు ముఖ్యమైన విషయాలు పాటించాలి. 

1) పరీక్షపై అవగాహన  

2) ప్రిపరేషన్‌కు సమయ ప్రణాళిక 

3) టాపిక్స్‌ ప్రాధాన్యం 

4) టెస్ట్‌లు రాయడం

పరీక్షపై అవగాహన 

ముందుగా అభ్యర్థులు పరీక్షపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలో ఉండే సబ్జెక్టులు వాటిలోని ప్రశ్నల సంఖ్య, సమయం మొదలైన వాటిని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడే వివిధ సబ్జెక్టుల్లో ప్రతీ ప్రశ్నకు ఉండే సమయం, మార్కులు తెలుస్తాయి. వాటి ప్రాధాన్యం అర్థమవుతుంది. 

ప్రిపరేషన్‌కు సమయ ప్రణాళిక 

ప్రిలిమ్స్‌ పరీక్ష ఆగస్టు 26/27 తేదీల్లో ఉంది. ఈ 50 రోజుల సమయాన్ని సరిగ్గా ప్లాన్‌ చేసుకోవాలి. రోజుకు కనీసం 12-15 గంటల సమయం ప్రిపరేషన్‌కు వినియోగించాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, కరెంట్‌ అఫైర్స్‌లకు ఇదే వరుసలో 4:3:2:1 నిష్పత్తిలో రోజువారీ సమయాన్ని కేటాయించుకోవాలి. 25/30 రోజుల్లో సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ అన్నీ పూర్తిచేయాలి. ఆపై ప్రశ్నలను వేగంగా సాధించగలిగేలా బాగా సాధన చేయాలి. 

టాపిక్స్‌ ప్రాధాన్యం

వివిధ సబ్జెక్టుల్లో పరీక్షలో వచ్చే ప్రశ్నల సంఖ్యను బట్టి టాపిక్స్‌ ప్రాధాన్యాన్ని గుర్తించాలి. గతంలో జరిగిన పరీక్షల పేపర్లను గమనిస్తే ఇది అర్థమవుతుంది. ఆ ప్రాధాన్యాన్ని అనుసరించి ముందుగా ఎక్కువ ప్రశ్నలు వచ్చే ఆయా టాపిక్స్‌ను పూర్తి చేయాలి. ఆపై మిగిలిన టాపిక్స్‌ నేర్చుకోవాలి. ఏ టాపిక్‌నూ వదిలేయకూడదు. 

టెస్ట్‌లు రాయడం

సబ్జెక్టుల్లోని టాపిక్స్‌ నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్‌కు సంబంధించిన వివిధ తరహాల్లో ఉండే ప్రశ్నల టెస్ట్‌లకు సమయాన్ని నిర్దేశించుకుని రాయాలి. టాపిక్స్‌ అన్నీ పూర్తయ్యాక సెక్షన్లవారీగా ఆపై పరీక్ష మోడల్‌ పేపర్లను ప్రతి రోజూ రాయాలి. దీనివల్ల నిర్ణీత సమయంలో ప్రశ్నలను పూర్తిచేయడం అలవాటవుతుంది. అదేవిధంగా వివిధ సబ్జెక్టులు టాపిక్స్‌లో అభ్యర్థులకు ఉండే ఇబ్బందులు తెలుస్తాయి. వాటిని అధిగమించేలా తిరిగి ప్రిపేర్‌ అయ్యే అవకాశం ఉంటుంది. 

నోటిఫికేషన్‌ వివరాలు..

విద్యార్హత (21.07.2023 నాటికి): ఏదైనా డిగ్రీ 

వయసు (01.07.2023 నాటికి): 20 - 28 సంవత్సరాలు (జనరల్‌ అభ్యర్థులు)

దరఖాస్తు రుసుము: రూ.175 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, రూ.850 ఇతరులు 

దరఖాస్తుకు చివరి తేదీ: 21.07.2023

ప్రిలిమ్స్‌ పరీక్ష: ఆగస్టు 26/27, సెప్టెంబరు 2

మెయిన్స్‌ పరీక్ష: 07 అక్టోబరు 2023

వెబ్‌సైట్‌: https://www.ibps.in/


సబ్జెక్టులవారీగా ఏవి ముఖ్యం?

పరీక్షలో ప్రశ్నలు వచ్చే కొన్ని ముఖ్యమైన టాపిక్స్‌ను చూద్దాం.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ న్యూమరికల్‌ ఎబిలిటీ: సింప్లిఫికేషన్స్‌ (10-12 ప్రశ్నలు), నంబర్‌ సిరీస్‌ (5), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (5), డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (5-10), అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు (10-12).

అరిథ్‌మెటిక్‌లో పర్సంటేజి, యావరేజి, ప్రాబ్లమ్స్‌ ఆన్‌ ఏజెస్, రేషియో-ప్రపోర్షన్, ప్రాఫిట్‌-లాస్, డిస్కౌంట్స్, టైమ్‌-వర్క్, పైప్స్‌-సిస్టర్న్, టైమ్‌-డిస్టెన్స్, ప్రాబ్లమ్స్‌ ఆన్‌ ట్రైన్స్, బోట్స్‌-స్టీమ్స్, ఎలిగేషన్‌ - మిక్చర్స్, మెన్సురేషన్, పర్ముటేషన్‌-కాంబినేషన్, ప్రాబబిలిటీల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. 

రీజనింగ్‌: సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ పజిల్స్‌ (15-20 ప్రశ్నలు), బ్లడ్‌ రిలేషన్స్‌ (3-5), కోడింగ్‌-డీకోడింగ్‌ (5), డైరెక్షన్స్‌ (3-4), ఆర్డర్‌-ర్యాంకింగ్‌ (2-3), ఆల్ఫా-న్యూమరికల్‌ సిరీస్‌ (3-4), ఇన్‌ ఈక్వాలిటీస్‌ ప్రశ్నలు (5).. వీటితోపాటు లాజికల్‌/ఎనలిటికల్‌ రీజనింగ్‌ టాపిక్స్‌ అయిన స్టేట్‌మెంట్స్, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్, డెసిషన్‌ మేకింగ్‌ మొదలైనవి మెయిన్స్‌లో ఉంటాయి. 

ఇంగ్లిష్‌: దీనిలో ముఖ్యంగా గ్రామర్‌ ఆధార ప్రశ్నలు (సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, ఎర్రర్‌ ఫైండింగ్, సెంటెన్స్‌ కరెక్షన్, క్లోజ్‌ టెస్ట్, ఫిల్లర్స్‌ మొదలైనవి), కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ ప్రశ్నలు వస్తాయి. 

జనరల్‌ అవేర్‌నెస్‌: దీనికోసం గత 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఆర్థిక, బ్యాంకింగ్‌ సంబంధిత ప్రశ్నలు ఎక్కువ. దీనితోపాటు ముఖ్యమైన జాతీయ/ అంతర్జాతీయ దినోత్సవాలు, ముఖ్యమైన ప్రదేశాలు, వ్యక్తులు, అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్‌బీఐ మొదలైన వాటిని బాగా చూసుకోవాలి. 

ఉమ్మడి ప్రిపరేషన్‌

ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు రెండింటికీ కలిపే ఉమ్మడిగా ప్రిపేర్‌ అవ్వాలి. మెయిన్స్‌లో ఉండే సబ్జెక్టులే ప్రిలిమ్స్‌లో ఉంటాయి. కాబట్టి పెద్ద కష్టం కాదు. ప్రతీరోజూ అన్ని సబ్జెక్టులనూ కవర్‌ చేయాలి. అభ్యర్థులు నిరంతరం తమ సన్నద్ధత అనుకున్న విధంగా కొనసాగుతోందో లేదో తనిఖీ చేసుకోవాలి.  


స్టడీమెటీరియల్

ఇంగ్లిష్ లాంగ్వేజ్‌

రీజ‌నింగ్

కంప్యూటర్ నాలెడ్జ్‌

న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌

జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌

పాత ప్రశ్నప‌త్రాలు

నమూనా ప్రశ్నపత్రాలు

Posted Date : 05-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌