• facebook
  • whatsapp
  • telegram

ఐబీపీఎస్ క్లర్కుల జీతాలు, ప్రమోషన్లు ఎలా ఉంటాయి?

జ‌న‌ర‌ల్ మేనేజర్ స్థాయి వ‌ర‌కు వెళ్లవచ్చు

అనుభ‌వంతో జీతంలో పెరుగుద‌ల‌

ఐబీపీఎస్ ప్ర‌క‌టించిన క్ల‌ర్క్ ఉద్యోగం బ్యాంకులో మొద‌టి మెట్టు లాంటిది. వాస్త‌వానికి ఇందులో అన్ని ర‌కాల ప‌నుల‌నూ నేర్చుకునే వీలుంటుంది. వినియోగ‌దారుకుల సంబంధించి చెక్కుల జారీ, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌, లోన్ల వివ‌రాలను తెలియ‌జేయ‌డం త‌దిత‌ర సేవ‌లు అందించాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల బ్యాంకు ప‌నుల్లో ఆరితేరిన‌వార‌వుతారు. ఇది భవిష్య‌త్తులోనూ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

జీత‌భ‌త్యాలు మాటేమిటి?

క్ల‌ర్క్ ఉద్యోగానికి ఎంపికైన వారికి జీతం రూ.11,760 ఉంటుంది. టీఏ, డీఏ ఇత‌ర అల‌వెన్సులు క‌లుపుకొని నెల‌కు రూ.20 వేల వ‌ర‌కు అందుతుంది. అనుభవం గ‌డించేకొద్దీ జీతం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది ప‌ర్మినెంట్ ఉద్యోగం కాబ‌ట్టి నిశ్చింత‌గా ఉండొచ్చు. అలా ఉంటూనే పైస్థాయికి వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు చేయాలి. 

ఉద్యోగోన్న‌తి ఎలా?

ఈ ఉద్యోగంలో చేరిన వారు ప‌ని అనుభ‌వంతో పైస్థాయికి చేరుకోవ‌చ్చు. అలాగే ఇటీవ‌ల బ్యాంకులు అవ‌లంబిస్తున్న విధానాల ద్వారానూ ఉద్యోగోన్న‌తులు పొంద‌వ‌చ్చు. ఫాస్ట్ ట్రాక్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అందులో ప‌ని చేసేవారికి రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఏటా ఇలాంటి ప‌రీక్ష‌లు ఉంటాయి. వాటిలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచే వారిని పైస్థాయికి ప్ర‌మోట్ చేస్తారు. ఇక మూడో మార్గంగా ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అందించే డిప్లొమా కోర్సులు పూర్తి చేయాలి. అలా చేసిన వారి అర్హ‌త‌ను బ‌ట్టి ఉద్యోగంలో ఉన్న‌త‌స్థాయికి చేరుకోవచ్చు.

బ్యాంకుల్లో ఉద్యోగ స్థాయి ఇలా..

ఏ బ్యాంకులో అయినా క్ల‌ర్క్ ఉద్యోగం ప్రారంభ ద‌శ. చిన్న వ‌య‌సులోనే ఈ జాబ్ సాధిస్తే త‌క్కువ వ‌య‌సులోనే పెద్ద స్థాయికి చేరుకోవ‌చ్చు. క్ల‌ర్క్ త‌ర్వాత‌ ఉద్యోగ స్థాయులు ఇలా ఉంటాయి.

1. ఆఫీస‌ర్ కేడ‌ర్‌

2. అసిస్టెంట్ మేనేజ‌ర్ (స్కేల్‌)

3. మేనేజ‌ర్ (స్కేల్‌)

4. సీనియ‌ర్ మేనేజ‌ర్ (స్కేల్‌)

5. చీఫ్ మేనేజర్‌(స్కేల్‌)

6. అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజర్ (స్కేల్‌)

7. డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (స్కేల్‌)

8. జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ (స్కేల్‌)

- డా. జీఎస్ గిరిధ‌ర్‌

డైరెక్ట‌ర్‌, రేస్‌

Posted Date : 16-07-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌