• facebook
  • whatsapp
  • telegram

క‌నీస మార్కులు త‌ప్ప‌నిస‌రి

బ్యాంకు ప‌రీక్ష‌ల్లో గతంలో కటాఫ్‌ మార్కులను గమనిస్తే ప్రస్తుత పరీక్ష కటాఫ్‌ మార్కులపై అంచనా వస్తుంది. జనరల్‌ అభ్యర్థులకు 2019లో 59.75, 2018లో 56.75గా ఉంది. ప్రస్తుతం కటాఫ్‌మార్కులు 59.75 కంటే ఎక్కువగా 61-63 వరకు ఉండే అవకాశముంది. అలాగే మెయిన్స్‌ పరీక్ష కటాఫ్‌ మార్కులు జనరల్‌ అభ్యర్థులకు 225 మార్కులకుగానూ 2018లో 71.5, 2018లో 74.5గా ఉంది. అంటే 2018 కంటే 2019 కటాఫ్‌ మార్కులు తక్కువగా ఉన్నాయి. ఇందుకు పేపర్‌ కఠినత్వం, అభ్యర్థుల సంఖ్య మొదలైనవి కారణమై ఉండొచ్చు. ప్రస్తుత పరీక్షలో 74.5 కంటే ఎక్కువగా 76-77 వరకు ఉండేలా చూసుకుంటే మంచిది.

ఇవి గమనించండి

 పోస్టులు: 1417
 విద్యార్హత (ఆగస్టు 26, 2020 నాటికి): ఏదైనా డిగ్రీ
 వయసు (ఆగస్టు 1, 2020 నాటికి): జనరల్‌ అభ్యర్థులకు 20-30 ఏళ్లు
 దరఖాస్తు చివరితేదీ: ఆగస్టు 26, 2020
 ప్రిలిమ్స్‌: 3, 10, 11 అక్టోబరు, 2020
 మెయిన్స్‌: నవంబరు 28, 2020
 దరఖాస్తు ఫీజు: రూ. 850 (ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూబీడీ వారికి  రూ.175
 వెబ్‌సైట్‌: 
www.ibps.in


తగినంత సమయముంది
ప్రిలిమ్స్‌ పరీక్ష మూడు విభాగాల్లో పరిమిత టాపిక్స్‌ నుంచే ప్రశ్నలు ఉంటాయి. ఈ టాపిక్స్‌ అన్నిటిపై 40-50 రోజుల్లో పట్టు సాధించవచ్చు. అందుచేత మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా తేలికగానే ఉత్తీర్ణులు అవొచ్చు. తర్వాత మెయిన్స్‌కు కూడా తగినంత సమయం ఉన్నందున దానికీ సిద్ధం కావొచ్చు. 
ప్రిలిమ్స్‌ అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్‌లో, అందులో ఉత్తీర్ణులైనవారికి తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మెయిన్స్‌లోని 225 మార్కులను 80 మార్కులకూ; ఇంటర్వ్యూలోని 100 మార్కులను 20 మార్కులకూ ...ఇలా మొత్తం 100 మార్కులకు కుదించి దాని ప్రకారం వచ్చిన మార్కులను బట్టి విజేతలను ఎంపిక చేస్తారు.   
మొదటిసారి పరీక్ష రాస్తున్నవారు ముందుగా పరీక్ష విధానం, సబ్జెక్టులు, సిలబస్‌పై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. సబ్జెక్టుల టాపిక్స్‌ అన్నింటికీ సిద్ధమవ్వాలి. వాటిలోని కాన్సెప్టులు నేర్చుకుని వివిధ రకాల ప్రశ్నలు సాధన చేయాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష సమయంలోగా వాటిలోని సబ్జెక్టులు, వాటిలోని టాపిక్స్‌ అన్నింటికీ పూర్తిగా సన్నద్ధమవ్వాలి. మెయిన్స్‌లోని టాపిక్స్‌కు సమయం ఉంటే ఇప్పటి నుంచే... లేదంటే ప్రిలిమ్స్‌ తరువాత ప్రిపేర్‌ అవ్వాలి. ప్రతిరోజూ ఆన్‌లైన్‌ పద్ధతిలో మాదిరి పరీక్షలను ప్రిలిమ్స్‌ వరకూ దాని మోడల్‌లో, మెయిన్స్‌కు దాని మోడల్‌లోనూ రాస్తుండాలి.
ప్రశ్నలను నిర్ణీత సమయంలోగా సాధించడం చాలా ముఖ్యం. మాదిరి ప్రశ్నపత్రాలు అందుకు సాయం చేస్తాయి. వేగం, కచ్చితత్వం, నిలకడతనం ఈ పరీక్షలో చాలా ముఖ్యం. వాటిని దృష్టిలో ఉంచుకుని సాధన చేయాలి. ఇందుకు ప్రతిరోజూ ఎన్నిగంటలు అవసరమవుతుందో ఎవరికి వారే అంచనా వేసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక, అమలు ఉండాలి. 

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌