• facebook
  • whatsapp
  • telegram

ప్రిప‌రేష‌న్ ఇలా సాగిద్దాం

ఐబీపీఎస్‌ పీఓ, క్లర్క్‌ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టు అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఇతరులు మాత్రం అన్ని విభాగాలనూ చదవాలి. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లోని నాలుగు సబ్జెక్టులకు సన్నద్ధమవ్వాలి. 

ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌: పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్‌లకు ప్రాధాన్యం ఇచ్చి, తర్వాత తక్కువ మార్కుల అంశాలను చూసుకోవాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో నంబర్‌ సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, సింప్లిఫికేషన్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా సఫిషియన్సీ; రీజనింగ్‌లో బ్లడ్‌ రిలేషన్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, కోడింగ్‌ - డీకోడింగ్‌, సిలాగిజమ్‌, లెటర్‌, నంబర్‌ సిరీస్‌, ఇన్‌పుట్‌ - అవుట్‌పుట్‌, స్టేట్‌మెంట్‌; ఇంగ్లిష్‌లో రీడింగ్‌ కాంప్రెహెన్షన్‌, సెంటెన్సెస్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌ మొదలైన వాటి నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ముందుగా వీటిపై దృష్టి పెట్టాలి.

రోజూ ఒక మోడల్‌ పేపర్‌
అన్ని టాపిక్‌ల అధ్యయనం పూర్తయినా కాకపోయినా రోజూ ఒక మోడల్‌ పేపర్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల నిర్దేశిత సమయంలో ప్రశ్నలు పూర్తి చేయడం అలవాటవుతుంది. ఎలాంటి ప్రశ్నలు చేయాలో ఏవి వదిలేయాలో అర్థమవుతుంది.

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ కీలకం
మెయిన్స్‌ పరీక్షలోని ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టు, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. కాబట్టి ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగం ఈ పరీక్షలో చాలా కీలకమైంది. ఈ సబ్జెక్టును అభ్యర్థులు డిగ్రీ/పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో చదివే ఉంటారు కాబట్టి కొద్దిగా శ్రమిస్తే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్స్‌లో ఉండే సబ్జెక్టే అయినప్పటికీ ఇప్పటి నుంచే ప్రిపేర్‌ కావాలి. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ చేస్తూ గ్రాండ్‌ టెస్ట్‌ రాయడానికి ప్లాన్‌ చేసుకోవాలి. మూడు నెలలు బాగా కష్టపడితే బ్యాంక్‌ ఉద్యోగం సొంతమవుతుంది.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌