పోలీసుశాఖ ఉద్యోగులు వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారం చేరవేసే క్రమంలో మెయిల్, లెటర్లు/ వివిధ అప్లికేషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని క్లుప్తంగా వీలైనంత తక్కువ పదాల్లో, సూటిగా వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పై అధికారుల ఆదేశాలు ఇంగ్లిష్‌లోనే వస్తాయి. కాబట్టి ఇంగ్లిష్ భాషపై అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలానే ప్రశ్నలుంటాయి.
ఇంగ్లిష్
‣ గ్రామర్
‣ సెంటెన్స్ అరేంజ్మెంట్
‣ ఆర్టికల్స్
‣ ప్రిపొజిషన్స్
‣ హెల్పింగ్ వెర్బ్స్
‣ ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి
‣ తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం
‣ కాంప్రహెన్సివ్ పేరాగ్రాఫ్
‣ యాంటనిమ్స్
‣ సిననిమ్స్
‣ ఒకాబులరీపై ప్రశ్నలు వస్తాయి.
‣ గ్రామర్‌ను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏయే సందర్భాల్లో తప్పులు చేస్తున్నారో వాటిని నోట్స్‌లో రాసుకుంటూ మళ్లీ ఆ తప్పులు చేయకుండా ప్రయత్నించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం చేయాలి.