• facebook
  • whatsapp
  • telegram

పరుగు పోటీలకు మెలకువలు

పోలీసు నియామ‌క ప్ర‌క్రియ‌లో ప‌రుగు పోటీలు కూడా ముఖ్యమైన‌వి. దీనిలో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారికి శారీరక సామర్థ్య పరీక్షలు (పీఈటీ) జరుగుతాయి. 
అభ్యర్థులు తేలికపాటి బరువుగల బ్రాండెడ్ స్పోర్ట్స్ షూ మాత్రమే ఎంచుకోవాలి. ఇందులో అడిడాస్, నైక్, లోటో, రీబాక్, ఈఎస్ఎస్, వైజయంతి, తదితర బ్రాండ్లను ఎంచుకోవచ్చు. కాటన్ సాక్స్‌లను మాత్రమే ఉపయోగించాలి. 
‣ వీలైనంతవరకు గ్రౌండ్‌లో సాధన చేయాలి. అప్పుడప్పుడు మట్టిరోడ్డు ఎంచుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ తారురోడ్డును అసలు ఉపయోగించవద్దు.
‣ రన్నింగ్ చేసేటప్పుడు కాలి పిక్కలు, కండరాలు నొప్పికి గురవుతాయి. ఆ నొప్పులు తగ్గడానికి కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. 
‣ పరిగెత్తేటప్పుడు శరీరం ముందుకు వంచాలి. మడమల మీద పరిగెత్తకూడదు. కాళ్లు, చేతులు అనువైన, వ్యతిరేక దిశలో కదులుతూ ఉండాలి. 
‣ పరుగు చివర్లో చేతుల కదలికలను పెంచడం ద్వారా పరుగు వేగాన్ని కొద్దిగా పెంచుకోవచ్చు. 
‣ అభ్యర్థి సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఈవెంట్స్ ముగిసే వరకు మధ్యలో సాధన ఆపకూడదు. క్రమం తప్పకుండా సాధన చేయాలి. మధ్యలో ఆపితే సాధన అంతా వృధా అయి మళ్లీ మొదటికొస్తుంది. 
‣ పరిగెత్తేటప్పుడు అవసరమైతే నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. కొందరు కేవలం ముక్కు ద్వారానే గాలి పీలుస్తుంటారు. 
‣ పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానుకోవాలి. లేకపోతే శ్వాసపై నియంత్రణ కోల్పోతారు. 
‣ అభ్యర్థులు సాధన దశ నుంచి ఈవెంట్స్ ముగిసేవరకు జలుబు బారినపడకుండా చూసుకోవాలి. దీనివల్ల శరీరంలోని శక్తిని కోల్పోయి నీరసపడతారు. 
‣ శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తయ్యేవరకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజూ ఉడకబెట్టిన గుడ్లు, పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు కచ్చితంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. 
‣ గ్రౌండ్‌లో సాధనకు ముందు, తర్వాత కనీసం అరగంటపాటు వామ్ అప్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఉదయం పూట 800 మీటర్లు, 100 మీటర్ల పరుగుకు అనుకూలంగా ఉంటుంది. వీటికి ఉదయమే సమయం కేటాయించుకుంటే మంచిది. 
‣ గ్రౌండ్‌లోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లేవరకు అభ్యర్థులు సపోర్టర్ కచ్చితంగా వేసుకోవాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు!

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌