పోలీసు నియామక ప్రక్రియలో పరుగు పోటీలు కూడా ముఖ్యమైనవి. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారికి శారీరక సామర్థ్య పరీక్షలు (పీఈటీ) జరుగుతాయి.
అభ్యర్థులు తేలికపాటి బరువుగల బ్రాండెడ్ స్పోర్ట్స్ షూ మాత్రమే ఎంచుకోవాలి. ఇందులో అడిడాస్, నైక్, లోటో, రీబాక్, ఈఎస్ఎస్, వైజయంతి, తదితర బ్రాండ్లను ఎంచుకోవచ్చు. కాటన్ సాక్స్‌లను మాత్రమే ఉపయోగించాలి.
‣ వీలైనంతవరకు గ్రౌండ్లో సాధన చేయాలి. అప్పుడప్పుడు మట్టిరోడ్డు ఎంచుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ తారురోడ్డును అసలు ఉపయోగించవద్దు.
‣ రన్నింగ్ చేసేటప్పుడు కాలి పిక్కలు, కండరాలు నొప్పికి గురవుతాయి. ఆ నొప్పులు తగ్గడానికి కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు చేయాలి.
‣ పరిగెత్తేటప్పుడు శరీరం ముందుకు వంచాలి. మడమల మీద పరిగెత్తకూడదు. కాళ్లు, చేతులు అనువైన, వ్యతిరేక దిశలో కదులుతూ ఉండాలి.
‣ పరుగు చివర్లో చేతుల కదలికలను పెంచడం ద్వారా పరుగు వేగాన్ని కొద్దిగా పెంచుకోవచ్చు.
‣ అభ్యర్థి సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఈవెంట్స్ ముగిసే వరకు మధ్యలో సాధన ఆపకూడదు. క్రమం తప్పకుండా సాధన చేయాలి. మధ్యలో ఆపితే సాధన అంతా వృధా అయి మళ్లీ మొదటికొస్తుంది.
‣ పరిగెత్తేటప్పుడు అవసరమైతే నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. కొందరు కేవలం ముక్కు ద్వారానే గాలి పీలుస్తుంటారు.
‣ పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానుకోవాలి. లేకపోతే శ్వాసపై నియంత్రణ కోల్పోతారు.
‣ అభ్యర్థులు సాధన దశ నుంచి ఈవెంట్స్ ముగిసేవరకు జలుబు బారినపడకుండా చూసుకోవాలి. దీనివల్ల శరీరంలోని శక్తిని కోల్పోయి నీరసపడతారు.
‣ శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తయ్యేవరకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజూ ఉడకబెట్టిన గుడ్లు, పాలు, డ్రైఫ్రూట్స్, పండ్లు కచ్చితంగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
‣ గ్రౌండ్లో సాధనకు ముందు, తర్వాత కనీసం అరగంటపాటు వామ్ అప్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఉదయం పూట 800 మీటర్లు, 100 మీటర్ల పరుగుకు అనుకూలంగా ఉంటుంది. వీటికి ఉదయమే సమయం కేటాయించుకుంటే మంచిది.
‣ గ్రౌండ్లోకి వచ్చినప్పటి నుంచి బయటకు వెళ్లేవరకు అభ్యర్థులు సపోర్టర్ కచ్చితంగా వేసుకోవాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు!
పరుగు పోటీలకు మెలకువలు
Posted Date : 14-02-2021
ప్రత్యేక కథనాలు
- ఏపీ పోలీస్ కొలువుకు సిద్ధమేనా?
- పోలీస్ ఉద్యోగాలకు మీరు సిద్ధమేనా?
- జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం
- కనీస అవగాహనకు తెలుగు
- వాక్య నిర్మాణం తెలియాలి
పాత ప్రశ్నపత్రాలు
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నపత్రం
- ఏపీ పోలీసు ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష-2022
విద్యా ఉద్యోగ సమాచారం
- Latest Current Affairs: 16-04-2024 Current Affairs (English)
- Latest Current Affairs: 16-04-2024 కరెంట్ అఫైర్స్ (తెలుగు)
- JEE Advanced: జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ టెస్టులు
- Civils: తప్పని గురి.. విజయతీరం చేరి
- Top Company: కొలువులకు అనువైన కంపెనీలు ఇవే..
- Civils: పంచరత్నాలు.. వావ్ అనిపించారు..!
నమూనా ప్రశ్నపత్రాలు
- ఎస్సై మోడల్ పేపర్ 1 - 2023
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 1 2023
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 3 2016
- ఎస్సై మోడల్ పేపర్ - 5 2016
- కానిస్టేబుల్ మోడల్ పేపర్ - 6 2016