• facebook
  • whatsapp
  • telegram

చ‌దివేద్దాం ఇలా!

రైల్వేలో కొలువు ద‌క్కించుకునేందుకు యువ‌త పోటీ ప‌డుతుంటారు. కానీ వాటికి ఎలా స‌న్న‌ద్ధం కావాలో చాలా మందికి తెలియ‌దు. వాటిని ఎలా చ‌ద‌వాలో తెలుసుకుందాం.

టెక్నిషియన్‌ పోస్టులకు రెండు అంచెల్లో, ఏఎల్‌పీ పోస్టుకు మూడు అంచెల్లో జరుగుతున్న పరీక్షలో మొదటిది సీబీటీ (కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌) క్వాలిఫయింగ్‌ పరీక్ష మాత్రమే. రెండో సీబీటీలోని పార్ట్‌-ఎ, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రెండో సీబీటీలోని పార్ట్‌-బి కూడా క్వాలిఫయింగ్‌ మాత్రమే.
అభ్యర్థులు మేథమేటిక్స్‌, అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టులు మొదటి సీబీటీ, రెండో సీబీటీ పరీక్షల్లో వస్తున్నాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపితే మొదటి సీబీటీలో క్వాలిఫై అవడంతోపాటు రెండో సీబీటీలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.
టెక్నికల్‌ సబ్జెక్టు అయిన బేసిక్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ రెండో సీబీటీలో పార్ట్‌-ఎలో ఉంటుంది. అభ్యర్థులు వారు పూర్తిచేసిన కోర్సుల్లోని సబ్జెక్టులే కాబట్టి, పునశ్చరణ చేస్తే సరిపోతుంది.
అరిథ్‌మెటిక్‌: సింప్లిఫికేషన్‌లో బాడ్‌మాస్‌, పెడ్‌మాస్‌ రూల్స్‌ వినియోగించే విధానం, నంబర్‌ సిస్టమ్స్‌, శాతాలు, రేషియో-ప్రపోర్షన్‌, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, ఎల్‌సీఎం, హెచ్‌ఎస్‌ఎఫ్‌, భాగస్వామ్యం, పైప్స్‌-సిస్టన్స్‌, క్యాలెండర్‌, గడియారాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
డేటా అనాలిసిస్‌, డేటా సఫిషియన్సీ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం సాధన చేయాలి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో పూర్తిచేయడం తెలిసుండాలి. శాతాలను ఆధారంగా తీసుకుని లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, నిష్పత్తి-అనుపాతం ప్రశ్నలను సాధన చేయాలి. ఇవన్నీ ఒకే కోణానికి చెందిన అంశాలు. లాజిక్‌ ఒకేవిధంగా ఉంటూ ప్రశ్నలో ఉపయోగించే భాష మాత్రమే వేరుగా ఉంటుంది. ఇలా సాధన చేస్తే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు.
మ్యాథమెటిక్స్‌: త్రికోణమితి, ఎత్తు-దూరం, ఆల్జీబ్రా, జామెట్రీలో ప్లేన్‌ జామెట్రీ, కోఆర్డినేట్‌ జామెట్రీ, ఎలిమెంట్రీ స్టాటిస్టిక్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి సంబంధించిన ఫార్ములాలన్నింటినీ ఒక దగ్గర రాసుకుని వాటిని ఎలా ఉపయోగించాలో సాధన చేయాలి. షార్ట్‌కట్స్‌ ఉపయోగించి తక్కువ సమయంలో సమాధానాలను గుర్తించడం అలవాటు చేసుకోవాలి.
* జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌: లాజికల్‌ రీజనింగ్‌ అంశాలైన నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మాన్‌ అవుట్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలో ఉన్న సమాచారాన్ని లింక్‌ చేస్తూ లాజిక్‌ను కనిపెట్టాలి. వెన్‌ చిత్రాలు, సిమిలారిటీస్‌, డిఫరెన్సెస్‌ వంటి క్లరికల్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలు, రిలేషన్‌షిప్‌, మేథమేటికల్‌ ఆపరేషన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధిస్తే క్రిటికల్‌ రీజనింగ్‌లోని ప్రశ్నలు సులువుగా చేయవచ్చు. సమాధానం గుర్తించకపోతే వెంటనే లాజిక్‌ మార్చి ప్రశ్నను పూర్తిచేయడం అలవాటు చేసుకోవాలి.
జనరల్‌ సైన్స్‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి.
* జనరల్‌ అవేర్‌నెస్‌, కరెంట్‌ అఫైర్స్‌: సమాజంలో చుట్టూ జరుగుతున్న శాస్త్రీయ, సాంకేతిక, భౌగోళిక, ఆర్థికవ్యవస్థలపై అవగాహన కలిగివుండాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లోని వ్యక్తులు, దేశాలు-రాజధానులు, కరెన్సీ, ఇటీవలి అంతర్జాతీయ సమావేశాలు మొదలైనవి ముఖ్యం.
బేసిక్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌: టెక్నికల్‌ సబ్జెక్టులో ఉండే అంశాల నుంచి సాధారణ ప్రశ్నలు వస్తాయి. బేసిక్‌ ఎలక్ట్రిసిటీ, యూనిట్‌ మెజర్‌మెంట్స్‌, సర్క్యూట్స్‌, స్పీడ్‌-వెలాసిటీ, హీట్‌-టెంపరేచర్‌, మెషిన్స్‌, లివర్‌, సేఫ్టీ-హెల్త్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌, యూనిట్స్‌, మాస్‌ వెయిట్‌-డెన్సిటీ. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్స్‌లోని ప్రొజెక్షన్స్‌, డ్రాయింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, జామెట్రిక్‌ ఫిగర్స్‌, సింబాలిక్‌ రెప్రజెంటేషన్స్‌ అంశాల్లోని సాధారణ ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు వారు చదువుతున్న పుస్తకాల్లోని ఈ అంశాలకు రివిజన్‌ పూర్తిచేసి ఆబ్జెక్టివ్‌ విధానాల్లో అడగటానికి అవకాశం ఉన్న ప్రశ్నలు గుర్తించి వాటికి సిద్ధమవ్వాలి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌