• facebook
  • whatsapp
  • telegram

సామ‌ర్థ్య ప‌రీక్ష‌కే రీజ‌నింగ్‌

అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగ‌మే రీజ‌నింగ్‌. విద్యార్థి దశలో ఏ స్థాయిలోనూ ఈ విభాగంతో పరిచయం ఉండదు. కాబట్టి ప్రాథమికస్థాయి నుంచి సన్నద్ధత సాగించాలి. ముందుగా 1- 30 వరకూ వర్గాలు, 1- 15 వరకు ఘనాలు, ప్రాథమిక స్థాయిలోని గణితంపై కొంత పట్టుండాలి.
‣ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌లో బొమ్మలపై ప్రశ్నలుంటాయి. ఇందులో శ్రేణులు, భిన్న పరీక్ష, ఇచ్చిన బొమ్మలో అంతర్లీనంగా ఎన్ని త్రిభుజాలు/ చతురస్రాలు/ దీర్ఘచతురస్రాలున్నాయి వంటి ప్రశ్నలు అడగవచ్చు. వీటితోపాటు పాచికలు, మిర్రర్‌ ఇమేజ్‌, అనాలజీ చూసుకుంటే సరిపోతుంది.
‣ వెర్బల్‌ రీజనింగ్‌లో సామాజికంగా మనం గమనించే రక్తసంబంధాలపై ప్రశ్నలుంటాయి. శ్రేణుల్లో పెరిగేవీ, తగ్గేవీ, మధ్యలో సరి, బేసి వర్గాలు, ఘనాలు, భేదాలు మొదలైనవి ఉంటాయి. లెటర్‌ సిరీస్‌లో రాణించాలంటే ఇంగ్లిష్‌ అక్షర క్రమంలోని అక్షరాల స్థానాలను ముందు నుంచి వెనక్కు.. వెనుక నుంచి ముందుకూ ఠక్కున గుర్తుపట్టేలా అభ్యాసం చేయాలి.
‣ అనాలజీ, వర్గీకరణ (క్లాసిఫికేషన్‌), కోడింగ్‌- డీకోడింగ్‌, లాజికల్‌ వెన్‌ బొమ్మలు, సీటింగ్‌ అరేంజ్‌మెంట్లు, తప్పిపోయిన సంఖ్యను గుర్తించడం వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకుని సాధన చేయాలి. వీటి కోసం పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
‣ రీజనింగ్‌ కోసం ఆర్‌ఎస్‌ అగర్వాల్‌ వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌, లూసెంట్స్‌, టాటా మెక్‌గ్రాహిల్స్‌ పుస్తకాలు చదివితే ఉపయోగం.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌