• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మ‌డి ప్రిపేరేష‌న్ అవ‌స‌రం

బ్యాంక్ ప‌రీక్ష‌ల్లో ప్రిలిమినరీ, మెయిన్స్‌ రెండింటిలో ఒకే సబ్జెక్టులున్నాయి. కాబట్టి అభ్యర్థులు రెండింటికీ కలిపే ప్రిపేర్‌ అవ్వాలి. అలాగే ప్రిలిమ్స్‌ తరువాత మెయిన్స్‌ పరీక్షకు 20-25 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. కాబట్టి మెయిన్స్‌ పరీక్షకు కూడా ఇప్పటినుంచే సన్నద్ధమవ్వాలి. మెయిన్స్‌కు చదివితే సహజంగానే ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ పూర్తవుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు రెండు నెలల సమయం ఉంది. ఆలోగా ప్రిలిమ్స్‌ విభాగాలతోపాటు మెయిన్స్‌ విభాగాలు కూడా పూర్తయ్యేవిధంగా చూసుకోవాలి. కొత్తగా బ్యాంక్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు రీజనింగ్‌, అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ అన్నీ నేర్చుకొని వీలైనన్ని వివిధ రకాల ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. పూర్తిస్థాయి మోడల్‌పేపర్‌లు సమయాన్నినిర్దేశించుకుని రోజుకు ఒకటైనా తప్పనిసరిగా రాయాలి. గతంలో జరిగిన ఎస్‌బీఐ పీఓ పరీక్ష ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నలు ఏ తరహా, ఏ స్థాయిలో ఉంటున్నాయో గమనించాలి. తమ ప్రిపరేషన్‌ ఆ స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఒక ప్రణాళికతో, నిబద్ధతగా సన్నద్ధమయితే అత్యధికులు కోరుకునే ఎస్‌బీఐ పీఓ ఉద్యోగం తప్పకుండా సంపాదించవచ్చు.

క్రెడిట్‌ ఆఫీసర్లు/రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ల బాధ్యతలు 
క్రెడిట్‌ ఆఫీసర్లు రుణ సంబంధ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అందుకే వీరిని లోన్‌ ఆఫీసర్లుగా కూడా వ్యవహరిస్తారు. దరఖాస్తుదారుల అప్లికేషన్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూడటం, ఆమోదించిన రుణాలు సకాలంలో దరఖాస్తుదారులకు విడుదలయ్యేలా చూడటం, వారు పొందిన రుణాలు తిరిగి సక్రమంగా బ్యాంకుకు చెల్లించే లాగా చూడటం వీరి విధులు. రిలేషన్‌షిప్‌ మేనేజర్‌లు బ్యాంక్‌ కస్టమర్ల/ ఖాతాదారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. అంటే బ్యాంక్‌ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను వారికి తెలపడం, సలహాలివ్వడం చేస్తారు.

రెండు గంటల పరీక్ష 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ ఆఫీసర్ల ఆన్‌లైన్‌ రాత పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజి, జనరల్‌ అవేర్‌నెస్‌, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లు ఉంటాయి. వీటిలో ఒక్కోదానికి 50 మార్కులు ఉంటాయి. మొత్తం పరీక్షా సమయం 2 గంటలు. వీటిలో ఆంగ్లం క్వాలిఫైయింగ్‌ కోసం మాత్రమే. వీటిలోని మార్కులను మెరిట్‌ లిస్ట్‌ కోసం పరిగణించరు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పరీక్షా విధానాన్ని పేర్కొనలేదు. ఇతర బ్యాంకు పరీక్షల్లోని విభాగాలే దీనిలో ఉండొచ్చు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజి: గ్రామర్‌ ఆధారంగా దాదాపు సగం ప్రశ్నలుంటాయి. పారా జంబుల్డ్‌, రీ అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, గ్రమాటికల్‌ ఎర్రర్‌ ఫైండింగ్‌, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌, క్లోజ్‌ టెస్ట్‌, సెంటెన్స్‌ కంప్లీషన్‌ మోడల్‌ ప్రశ్నలు బాగా ప్రాక్టీస్‌ చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, ఇంగ్లిష్‌ వొకాబులరీల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: దీనిలోని ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, స్టాండర్డ్‌ జి.కె.ల నుంచి ఉంటాయి. గత 5, 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ను చూసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, కేంద్రప్రభుత్వ పథకాలు మొదలైన వాటిని బాగా చూడాలి. ఆర్‌బీఐ, భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌ టర్మినాలజీ, బ్యాంక్‌లు - ట్యాగ్‌లైన్ల గురించి తెలుసుకోవాలి.

ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: ఆర్థిక వ్యవహారాలను చూసే బాధ్యత గల పోస్టు కాబట్టి అభ్యర్థులకు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌ పట్ల ఉన్న అవగాహన తెలుసుకునేందుకు దీన్ని ఈ పరీక్షలో చేర్చారు. డెఫినిషన్‌, ఇంట్రడక్షన్‌ టు ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌, సోర్సెస్‌ ఆఫ్‌ ఫైనాన్సింగ్‌, కాపిటలైజేషన్‌, కాపిటల్‌ స్ట్రక్చర్‌, కాస్ట్‌ ఆఫ్‌ కేపిటల్‌, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్‌ అనాలిసిస్‌, లివరేజ్‌, కేపిటల్‌ బడ్జెటింగ్‌, వర్కింగ్‌ కేపిటల్‌, వర్కింగ్‌ కేపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ సిస్టంతో పాటు ఇతర ముఖ్యమైన టాపిక్స్‌ను బాగా చూసుకోవాలి.

సబ్జెక్టులు మూడే! 
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ ఆఫీసర్ల పరీక్షలో కేవలం మూడు సబ్జెక్టులే ఉన్నాయి. సాధారణంగా బ్యాంక్‌ పరీక్షల్లో ఉండే ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ విభాగాలు దీనిలో లేవు. కాబట్టి పరీక్షకు ఉండే ఈ 50 రోజుల సమయం సన్నద్ధతకు సరిపోతుంది. ఇంగ్లిష్‌ విభాగంలో ఉత్తీర్ణులయ్యేమేరకు చూసుకొని మిగిలిన రెండు విభాగాల్లో వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందే ప్రయత్నం చేయాలి. అభ్యర్థులు అన్ని విభాగాలకూ సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి.

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌