• facebook
  • whatsapp
  • telegram

మల్టీ టాస్కింగ్‌లో ఇంగ్లిష్‌

జనరల్‌ ఇంగ్లిష్‌
సరిగా దృష్టిసారించి చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే ఇందులో ఎక్కువ మార్కులను తెచ్చుకోవచ్చు. ఇంగ్లిష్‌ అనగానే కంగారు పడాల్సిన పనిలేదు. పదో తరగతి స్థాయి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఆంగ్లభాషకు సంబంధించి సాధారణ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. పదసంపద, వ్యాకరణం, వాక్య నిర్మాణం, వివిధ పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలు వాటిని ఉపయోగించే విధానంపై ప్రశ్నలు ఉంటాయి. ఫిల్లింగ్‌ ద బ్లాంక్స్‌, ఎర్రర్‌ స్పాటింగ్‌ నుంచి దాదాపు పది వరకు ప్రశ్నలు వస్తున్నాయి. స్పెల్లింగ్‌, సిననిమ్స్‌, యాంటనిమ్స్‌పై ఆరు ప్రశ్నల వరకు అడుగుతున్నారు. ఈ విభాగానికి మార్కులను 50 నుంచి 25కి తగ్గించారు కాబట్టి ఈ ప్రశ్నల సంఖ్య తగ్గవచ్చు. కానీ ప్రాధాన్యం మాత్రం ఉంటుంది. వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌, ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌, యాక్టివ్‌ వాయిస్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్‌, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, క్లోజ్‌ టెస్ట్‌ తదితర అన్ని రకాల ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. పదసంపదపై పట్టు సాధించాలంటే ఆంగ్లదిన పత్రికలను రోజూ చదవాలి. ఆంగ్ల వ్యాకరణం కోసం ఏదైనా ప్రామాణిక గ్రామర్‌ పుస్తకాన్ని అధ్యయనం చేస్తే సరిపోతుంది.

Posted Date : 04-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌