• facebook
  • whatsapp
  • telegram

స్టెనోలకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం

దేశ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న గ్రేడ్ - సి, డి స్టెనోగ్రాఫర్ల ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలను త్వరలో ప్రకటిస్తారు. సాధారణంగా వందల సంఖ్యలో పోస్టులు వెలువడుతుంటాయి. వేగంగా, కచ్చితంగా సమాచారాన్ని రికార్డ్ చేయడంలో ఈ స్టెనోగ్రాఫర్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.

ఎవరు అర్హులు?
ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు గ్రూప్ - సి పోస్టులకు 1-8-2020 నాటికి 30 ఏళ్లు దాటకూడదు. గ్రూప్ - డి కి 27 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం
దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాలి. ఫీజు రూ 100. చివరి తేదీ నవంబరు 4, 2020.

పరీక్ష విధానం
కంప్యూటర్ ఆధారితంగా ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. మొదటిది జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండోది జనరల్ అవేర్ నెస్, మూడోది జనరల్ ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్. మొత్తం రెండు వందల మార్కులకు రెండు వందల ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది.

స్కిల్ టెస్ట్
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంచుకున్న భాషను అనుసరించి ఇంగ్లిష్, హిందీ భాషల్లో 10 నిమిషాల డిక్టేషన్ ఇస్తారు. గ్రూప్-డి పోస్టులకు దరఖాస్తు చేసిన వారు నిమిషానికి 80 పదాలు, గ్రూప్-సి అభ్యర్థులు నిమిషానికి 100 పదాలు రాయగలిగి ఉండాలి. డిక్టేషన్ ను టైప్ చేయడానికి గ్రూప్-డి ఇంగ్లిష్ అభ్యర్థులకు 50 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 65 నిమిషాల సమయం ఇస్తారు. అదే గ్రూప్- సి ఇంగ్లిష్ అభ్యర్థులకు 40 నిమిషాలు, హిందీ అభ్యర్థులకు 55 నిమిషాలు కేటాయించారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. అంతిమ సెలక్షన్ రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వూలు ఉండవు.

ప్రిపరేషన్ విధానం
జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్; ఇందులో వెర్బల్, నాన్-వెర్బల్ ప్రశ్నలు ఇస్తారు. సాధారణంగా అభ్యర్థుల్లోని నైరూప్య ఆలోచనలను (abstract ideas) పరీక్షించే విధంగా ఉంటాయి. గుర్తులు, వాటి మధ్య సంబంధాలను గుర్తించగలిగిన నేర్పు; అంకగణిత నైపుణ్యాలు, ఇతర రకాల విశ్లేషణాత్మక శక్తిని పరిశీలిస్తారు. ప్రధానంగా ప్రశ్నలు అనాలజీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రిలేషన్ షిప్ కాన్సెప్ట్స్, అరిథ్ మెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అరిథ్ మెటికల్ నంబర్ సిరీస్, నాన్-వెర్బల్ సిరీస్ తదితర విభాగాల నుంచి వస్తుంటాయి. 


జనరల్ అవేర్ నెస్; ఈ విభాగంలో నిత్య జీవితంలో అభ్యర్థి తన చుట్టూ ఉన్న పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలపై ఎంతమేరకు శాస్త్రీయ అవగాహన కలిగి ఉన్నాడనే అంశాన్ని పరిశీలిస్తారు. ప్రశ్నలు ప్రధానంగా భారతదేశం, చుట్టుపక్కల దేశాల్లో జరిగిన సంఘటనలపై ఉంటాయి. క్రీడలు, చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, భారత రాజ్యాంగం, సైంటిఫిక్ పరిశోధనలు తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ అభ్యర్థి సాధారణ నాలెడ్జ్ ను మాత్రమే పరిశీలిస్తాయి.  

ఎలాంటి లెక్కలు వేసే పని లేకుండా వేగంగా పూర్తి చేయగలిగిన విభాగం ఇది. కానీ పూర్తిస్థాయి స్కోరు ఆశించడం సాధ్యం కాదు. విషయావగాహన మేరకు మాత్రమే చేయగలిగిన విభాగం. స్టాక్ జీకే, సైన్స్ అండ్ టెక్నాలజీలపై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుత సంఘటల ఆధారంగా స్టాక్ జీకే, ఎస్ అండ్ టీ అంశాలను అభ్యర్థులు అధ్యయనం చేయాలి. జనాభా లెక్కలు, బడ్జెట్లు, అవార్డుల వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 


ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్; ఈ విభాగంలో అభ్యర్థి సాధారణ ఆంగ్లభాష నాలెడ్జ్ ను పరిశీలిస్తారు. వొకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సిననిమ్స్, ఆంటనిమ్స్ - వాటి ప్రయోగం తదితరాలతోపాటు ఆంగ్లంలో అభ్యర్థి రాత నైపుణ్యాలను పరిశీలిస్తారు. కాంప్రహెన్షన్ ను పెంచుకోడానికి రోజూ ఒక ఇంగ్లిష్ పేపర్ ను చదవడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల క్లోజ్ టెస్ట్, పేరా జంబుల్, వొకాబ్యులరీ ప్రశ్నలను తేలిగ్గా పరిష్కరించగలుగుతారు. 
మొదట పాత ప్రశ్రపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిని గమనించాలి. అనుగుణమైన ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. రీజనింగ్, అరిథిమెటిక్ అంశాలను వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయడమే విజయానికి దగ్గరిదారి.

Posted Date : 11-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌