• facebook
  • whatsapp
  • telegram

ఎంబీబీఎస్‌తో ఉన్నత ఉద్యోగం

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ప్రకటన

ఎంబీబీఎస్‌ విద్యార్హతతో కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దాదాపు ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ప్రకటన వెలువడింది. మొత్తం 1261 ఖాళీలు ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూలతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంపికైనవారు రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు. 

ఎంబీబీఎస్‌ అనంతరం ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి యూపీఎస్‌సీ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ చక్కని అవకాశం. ఈ పోస్టుల్లో చేరినవారికి ఆకర్షణీయ వేతనం, మంచి హోదా సొంతమవుతాయి. పలు సౌకర్యాలనూ కల్పిస్తారు. మెడికల్‌ ఆఫీసర్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ హోదాలకు దళలవారీ చేరుకోవచ్చు.

ఎంపిక ఎలా?

ముందు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 500 మార్కులు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కో పేపర్‌ వ్యవధి రెండేసి గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. పరీక్షలో అర్హత సాధించినవారికి వంద మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్షలో విజయానికి ఎంబీబీఎస్‌ సిలబస్‌పై పట్టు కీలకం. గత సీఎంఎస్‌ ప్రశ్నపత్రాలతోపాటు నీట్‌ పీజీ, ఐఎన్‌ఐ సెట్‌ ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సునూ చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1261

విభాగాలవారీగా ఖాళీలు: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో 584, రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 300, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్లలో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ 377

వయసు: ఆగస్టు 1, 2023 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1991 తర్వాత జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 9 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు. 

పరీక్ష తేదీ: జులై 16

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి. 

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ బోధనలో రాణించాలని ఉందా?

‣ స్టాటిస్టిక్స్‌తో ఉన్నత ఉద్యోగం

‣ సమ్మర్‌ జాబ్‌తో లాభాలెన్నో..

‣ ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం

‣ బార్క్‌లో 4,162 కొలువులు

‣ మ్యూజిక్‌లో బెస్ట్‌ కోర్సులివిగో..

‣ చదువుకుంటూ సంపాదించు!

‣ దివ్యమైన కోర్సులకు వేదిక

Posted Date : 03-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.