• facebook
  • whatsapp
  • telegram

గోవుల కోసం ఆర్యుల యుద్ధం గవిష్టి!

ఆర్య నాగరికత


సింధు నాగరికత పతనానంతరం భారతదేశంలో ఆర్య నాగరికత విస్తరించింది. వైదిక సంస్కృతికి నాంది పలికింది. తొలి వేద, మలి వేద యుగాలుగా ప్రసిద్ధికెక్కింది. ఆర్యుల చరిత్రకు ఆధారం వేదాలు. వీరి హయాంలోనే ఉపఖండంలో జనపదాలు, మొట్టమొదటి రాజ్యాలు ఆవిర్భవించాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు, వర్ణాలు రూపుదిద్దుకుని శాశ్వతంగా స్థిరపడ్డాయి. ఈ పరిణామాలను, ఆర్యుల గురించి వేదాల్లో ఉన్న అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. మధ్య ఆసియా లేదా ఐరోపా మూలాలున్న ఆర్యులు ఇక్కడికి ఎందుకు వలస వచ్చారు,  వైదిక సంస్కృతిని ఏ విధంగా అభివృద్ధి చేశారు, జీవనవిధానం, అప్పటి నదుల పేర్లు, పాలనారీతులు, ప్రసిద్ధ రాజ వంశాల గురించి తగిన అవగాహనతో ఉండాలి.

1.    తొలి వేదకాలంలో ప్రాథమిక పరిపాలనా భాగం ఏది?

1) కుటుంబం      2) విశ్‌   

3) జన      4) గ్రామం


2.     కిందివాటిలో ఒకదానికి ప్రజాసభగా గుర్తింపు లేదు?
1) సభ       2) సమితి   
3) విధాత       4) గణ


3.     తొలి వేదకాలంలో హత్యకు శిక్ష ఏమిటి?
1) అంగచ్ఛేదన       2) దేశ బహిష్కరణ   
3) శిరచ్ఛేదన       4) రక్తపు పైకం


4.     కిందివారిలో రాజుకు న్యాయపాలనలో సహాయపడేవారు ఎవరు?
1) పురోహితుడు       2) సేనాని   
3) యువరాజు       4) శతపతి


5.     రుగ్వేద స్త్రీ విద్య ఎక్కువగా......
1) వేద సాహిత్యం       2) నృత్యం   
3) సంగీతం       4) 2, 3


6.     ‘యవ’ అంటే ఏమిటి?
1) బార్లీ       2) బియ్యం   
3) పప్పుధాన్యాలు       4) గోధుమ


7. నిష్క అనేది ఒక....
1) వస్త్రం      2) ఆభరణం  
3) వినోదం      4) తేనె


8.     ఆర్యుల అభిమాన వినోదం?
1) నృత్యం       2) సంగీతం   
3) జూదం       4) రథాల పందేలు


9.     కిందివారిలో ఎవరిని దాసదస్యులుగా పిలిచారు?
1) సింధు ప్రజలు       2) ఆర్యులు   
3) ఆంధ్రులు       4) ఎవరూకాదు


10. తొలివేద ఆర్యుల ముఖ్యవృత్తి?
1) వ్యవసాయం       2) పశుపోషణ   
3) వర్తక వ్యాపారం       4) 2, 3


11. ‘దశరాజగణ యుద్ధం’ రుగ్వేదంలోని ఏ మండలంలో ఉంది?
1) 2     2) 3     3) 7      4) 9


12. ఫణి అనే జాతి ముఖ్య వృత్తి?
1) పశుపోషణ       2) వ్యవసాయం   
3) వ్యాపారం       4) రాజసేవ


13. రుగ్వేద కాలంలో వర్ణం దేని ద్వారా మారుతుంది?
1) వయసు  2) వృత్తి   3) పుట్టుక   4) 2, 3


14. రుగ్వేద ఆర్యుల ప్రధాన దైవం?
1) ఇంద్రుడు  2) అగ్ని 3) వరుణుడు  4) సోమ


15. సోమ, సుర అనేవి?
1) మత్తు పానీయాలు       2) మధుర పానీయాలు   
3) స్వచ్ఛమైన నీరు       4) దేవుడికి సమర్పించిన పాలపదార్థాలు


16. రుగ్వేద కాలంలో మత విధానం?
1) ప్రకృతి దేవతారాధన     2) బహు దేవతారాధన   
3) ఏకేశ్వరోపాసన       4) పైవన్నీ


17. ఆర్యుల దైవమైన ఉషస్‌కు సమానమైన రోమన్‌ దేవుడు ఎవరు?
1) అహుర్‌మజ్ధ     2) జూపిటర్‌   
3) ఎరోస్‌       4) అరోరా


18. దశరాజ గణయుద్ధంలో భరత తెగకు నాయకుడు?
1) భరతుడు     2) సుధామ 
3) పురుకుత్స     4) త్రిస్య


19. ఆర్య తెగలకు గోవుల కోసం జరిగే యుద్ధాన్ని ఏమంటారు?
1) గోత్‌   2) గౌమిత్రి   3) గవిష్టి   4) గవలు


20. ఆర్యులు మొదటగా స్థిరపడిన ప్రాంతం?
1) బ్రహ్మపుత్ర ప్రాంతం     2) సప్తసింధు ప్రాంతం   
3) గంగలోయ ప్రాంతం      4) దక్కన్‌ పీఠభూమి


21. ‘ఆర్యన్‌’ అనే పదం దేనిని సూచిస్తుంది?
1) సాంప్రదాయ సంఘం     2) సంచార జాతి   
3) ప్రసంగ సమూహం      4) ఉన్నతమైన జాతి


22. రుగ్వేదంలో ఏ నది గురించి ప్రస్తావించలేదు?
1) సింధు      2) సరస్వతి  
3) తపతి      4) గంగా


23. కిందివారిలో రుగ్వేద కాలంలో నైతికత దేవుడు ఎవరు?
1) ఇంద్రుడు  2) రుద్ర  3) అగ్ని  4) వరుణుడు


24. చినాబ్‌ నదిని వేదకాలంలో ఏ పేరుతో పిలిచేవారు?
1) అసికిని  2) పరూష్ని  3) శతుద్రి  4) వితస్థ


25. వేదకాలంలో వితస్థ అనేది ఏ నది?
1) రావి  2) జీలం  3) చినాబ్‌   4) బియాస్‌


26. సుధామకు వ్యతిరేకంగా 10 మంది రాజుల సమాఖ్యకు నాయకత్వం వహించింది ఎవరు?
1) వశిష్ట     2) భరద్వాజ  
3) భరత      4) పురుకుత్స


27. ఆర్యుల జన్మస్థలం ఆర్కిటిక్‌ ప్రాంతం అని చెప్పినదెవరు?
1) బాలగంగాధర్‌ తిలక్‌     2) మాక్స్‌ముల్లర్‌   
3) దయానంద సరస్వతి     4) సంపూర్ణ ఆనంద్‌


28. రుగ్వేదంలోని గరిష్ఠ శ్లోకాలు ఎవరికి చెందినవి?
1) ఇంద్రుడు 2) బ్రహ్మ  3) విష్ణువు  4) సోమ


29. రుగ్వేదంలో ‘జన’ అనే పదం ఎన్నిసార్లు వస్తుంది?
1) 75    2) 175   3) 275    4) 375 


30. కిందివాటిలో రాజు ఎన్నికలో పాల్గొనేది?
1) సభ   2) సమితి   3) గణ   4) విధాత


31. ‘గోత్ర’ అనే పదాన్ని మొదటిసారి ఏ వేదంలో ఉపయోగించారు?
1) రుగ్వేదం       2) సామవేదం   
3) యజుర్వేదం       4) అధర్వణ వేదం


32. పది మంది రాజుల యుద్ధంలో భరతుల పురోహితుడు ఎవరు?
1) విశ్వామిత్ర  2) వశిష్ట  3) అత్రి   4) భృగు


33. వేదయుగంలో అత్యంత ప్రసిద్ధ హస్తకళాకారుడు ఎవరు?
1) వడ్రంగి       2) కమ్మరి   
3) కుమ్మరి       4) నేత నేసేవారు


34. రుగ్వేద ఆర్యుల పంచ జనానికి చెందని తెగ?
1) యదు  2) పురు  3) తుర్వస   4) కీకట


35. కిందివాటిలో కవల పిల్లలుగా వేటిని వర్ణిస్తారు?
1) సభ, సమితి       2) సమితి, విధాత   
3) విధాత, సభ       4) గణ, విధాత


36. ఆర్యులు పూజించే నది?
1) సింధు  2) రావి   3) చినాబ్‌  4) సరస్వతి


37. రుగ్వేద కాలపు ఆర్థిక వ్యవస్థ?
1) నగరాలు       2) గ్రామీణ   
3) రెండూ       4) ఏదీకాదు


38. కిందివారిలో ఆర్యుల యుద్ధ దేవుడు?
1) అగ్ని       2) ఇంద్రుడు   
3) సూర్యుడు       4) వరుణుడు


39. తొలి వేదకాలంలో మారకం మధ్యమంగా ఉపయోగించిన విలువ ప్రామాణిక యూనిట్‌?
1) ఆవు   2) ఫణా   3) నిష్క   4) 1, 3


40. ‘బ్రహ్మావర్తనం’ అనేది?
1) సరస్వతి - ద్రిశద్వతి ప్రాంతం       2) చంద్రభాగ - గంగా ప్రాంతం
3) గంగా - యమునా ప్రాంతం   4) కృష్ణా - గోదావరి ప్రాంతం


41. పురంధరుడు ఎవరు?
1) వరుణుడు 2) ఇంద్రుడు 3) అగ్ని 4) సోముడు


42. వేదకాలంలో ఏ జంతువును ‘అఘన్య’ అని పిలిచేవారు?
1) ఎద్దు   2) గొర్రె   3) ఆవు   4) ఏనుగు


43. ‘పెలిప్సోగుసెత్తి’ ఏ దేశానికి చెందినవారు? 
1) ఇటలీ  2) ఇంగ్లండ్‌  3) జర్మనీ  4) భారత్‌


44. కిందివారిలో ‘ఆర్యన్‌ అనే పదానికి అర్థం భాషే కాని జాతి కాదు’ అని అన్నదెవరు?
1) మాక్స్‌ముల్లర్‌           2) ఫెంకా    
3) విలియం జోన్స్‌        4) పెలిప్సోగుసెత్తి


45. కిందివాటిలో ఆర్యుల జన్మస్థానంగా ఏ ప్రాంతాన్ని ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు?
1) భారతదేశం        2) మధ్య ఆసియా     
3) హంగేరీ మైదానం       4) ఇటలీ


46. కిందివాటిలో ఆర్య తెగ కానిది-
1) త్రిత్సు  2) గాంధార  3) పారావత  4) పురు


47. కిందివాటిలో సెంతుమ్‌ వర్గానికి చెందనిది?
1) సంస్కృతం        2) పారశీకం     
3) తురక        4) లాటిన్‌


48. కిందివాటిలో తొలి వేద కాలం- 
1) క్రీ.పూ. 1000500   2) క్రీ.పూ. 15001000 
3) క్రీ.పూ. 1500600      4) క్రీ.పూ. 1000600 


49. రుగ్వేద ఆర్యుల కాలంలో ‘గోమత్‌’ అనే పదానికి అర్థం ఏమిటి?
1) వ్యాపారి        2) ధనవంతుడు    
3) కుమార్తె         4) కుమారుడు


50. కిందివారిలో సోమ మొక్క/ తీగ ఎక్కడ పెరుగుతుంది?
1) ముజావంత్‌ శిఖరం     2) దక్కన్‌ పీఠభూమి 
3) వింధ్య పర్వతాలు       4) పైవన్నీ


51. కిందివాటిలో అపస్థంభుని ఆదేశం మేరకు సంకలనం చేసిన వేదం?
1) రుగ్వేదం     2) అధర్వణ వేదం 
3) సామవేదం     4) యజుర్వేదం


52. ‘ఉద్గాత’ అంటే?
1) సామవేదాన్ని పఠించేవాడు    2) అధర్వణ వేదాన్ని పఠించేవాడు
3) రుగ్వేదాన్ని పఠించేవాడు  4) యజుర్వేదాన్ని పఠించేవాడు 


53. కౌతనేయ, జైమనీయ శాఖలు ఏ వేదానికి చెందినవి?
1) రుగ్వేదం      2) యజుర్వేదం  
3) సామవేదం      4) అధర్వణ వేదం


54. కృష్ణయజుర్వేదాన్ని ఇలా కూడా పిలుస్తారు?
1) వాజపనేయ సంహిత      2) శుక్ల సంహిత  
3) తైతరీయ సంహిత      4) పైవన్నీ 


55. ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదానికి చెందింది?
1) రుగ్వేదం     2) యజుర్వేదం  
3) సామవేదం     4) అధర్వణ వేదం


56. కిందివారిలో రుగ్వేదాన్ని పేర్కొన్న దేవుడు?
1) ఇంద్ర  2) అగ్ని  3) పర్జన్య  4) అందరూ


57. శాకల, బాష్కల, సాంఖ్యామాన శాఖలు ఏ వేదానికి చెందినవి?
1) రుగ్వేదం      2) యజుర్వేదం  
3) సామవేదం      4) అధర్వణ వేదం


58. కిందివాటిలో శృతి సాహిత్యానికి చెందనివి?
1) వేదాలు     2) ఉపవేదాలు  
3) బ్రాహ్మణాలు      4) అరణ్యాకాలు


59. వ్యాస మహర్షి వైశంపాయనుడికి చెప్పిన వేదం?
1) రుగ్వేదం      2) యజుర్వేదం  
3) సామవేదం      4) అధర్వణ వేదం


60. ఆర్యుల వేషం అయిన ‘ఉష్ణీషం’ అంటే?
1) ఉత్తరీయం          2) తలపాగ  
3) చెవి రింగులు         4) చేతి కడియాలు


సమాధానాలు


1-4; 2-4; 3-4; 4-1; 5-4; 6-1; 7-2; 8-4; 9-1; 10-2; 11-3; 12-3; 13-2; 14-1; 15-1; 16-4; 17-4; 18-2; 19-3; 20-2; 21-4; 22-3; 23-4; 24-1; 25-2; 26-4; 27-1; 28-1; 29-3; 30-2; 31-1; 32-2; 33-1; 34-4; 35-1; 36-4; 37-2; 38-2; 39-4; 40-1; 41-2; 42-3; 43-1; 44-1; 45-3; 46-3; 47-4; 48-2; 49-2; 50-1; 51-2; 52-1; 53-3; 54-3; 55-1; 56-4; 57-1; 58-2; 59-2; 60-2.  
 

 

 రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు

Posted Date : 23-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.