* ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థినులు మే 10 నుంచి 30 వరకు సిరిసిల్ల కళాశాలలో దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లోని గిరిజన గురుకుల ఆర్మ్డ్ ఫోర్సెస్ అకాడమీ (పురుషులు)లో బీఎస్సీ ఎంపీసీ, బీఏ హెచ్ఈపీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 10 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు గిరిజన గురుకుల సొసైటీ, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.