• facebook
  • whatsapp
  • telegram

Isreal Jobs: ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు

* మే 20 నుంచి 24 వరకు న్యాక్‌లో వాక్‌ఇన్‌ స్కిల్‌టెస్ట్‌లు

* నెలకు రూ.1.20- 1.38 లక్షల వేతన ప్యాకేజీ

ఈనాడు, హైదరాబాద్‌: ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగంలో సెంట్రింగ్‌ (షట్టరింగ్‌ కార్పెంటర్స్‌), సిరామిక్‌ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్‌ బెండింగ్‌ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మే 20 నుంచి 24 వరకు హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌)లో టామ్‌కామ్, ఎన్‌ఎస్‌డీసీఐ, ఇజ్రాయెల్‌ ఇమ్మిగ్రేషన్‌ అథారిటీ సంయుక్తంగా వాక్‌ఇన్‌ పద్ధతిలో ప్రొఫెషనల్‌ స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ఈ పరీక్ష ఉంటుందని, ఈ రంగాల్లోని కార్మికులకు నెలవారీ వేతన ప్యాకేజీలు రూ.1.20 లక్షల నుంచి రూ.1.38 లక్షల వరకు ఉంటాయని వివరించారు. ఈ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 21-45 ఏళ్ల వయసుతో పాటు సంబంధిత రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలని వెల్లడించారు. మరిన్ని వివరాలకు టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌ లేదా 9985483931 / 8247838789 / 7893566493 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 
 

Published Date : 18-05-2024 20:21:39

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం