• facebook
  • whatsapp
  • telegram

భక్తి ఉద్యమం

భక్తి మార్గంలో సామాజిక సంస్కరణ!


మధ్యయుగంలో భారతీయ సమాజాన్ని సంస్కరించి, అప్పటివరకు పాటిస్తున్న మత, మూఢవిశ్వాసాలను నిరసించిన ప్రయత్నాల్లో భక్తిఉద్యమానికి విశేష ప్రాధాన్యం ఉంది. సంప్రదాయ వాదాన్ని, బ్రాహ్మణులు బోధించిన కర్మకాండలు, ఆచరించిన మూఢాచారాలు, కులవ్యవస్థ, వర్ణభేదాలను భక్తి ఉద్యమకారులు వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషల్లో, ప్రజలకు తేలికగా అర్థమయ్యే శైలిలో రచనలు, బోధనలు, పాటలు, పద్యాలు, భజనలతో మోక్షసాధనకు భక్తిమార్గాన్ని అవలంబించాలని చాటారు. మానవత్వాన్ని, మతాల మధ్య సామరస్యాన్ని పెంచిన ఆ ఉద్యమాల తీరుపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. శంకరాచార్యుడు, నింబార్కుడు, కబీర్, గురునానక్, మీరాబాయి, తులసీదాస్, సూరదాస్, అన్నమాచార్యుడు వంటి ప్రసిద్ధ  ఉద్యమకారుల ప్రభావం,  ప్రత్యేకతలను తెలుసుకోవాలి.


1. కులోత్తుంగ చోళుడు బహిష్కరించిన భక్తి  ఉద్యమకారుడు?

1) ఆదిశంకరాచార్యులు   2) రామానుజాచార్యులు

 3) వల్లభాచార్యులు     4) చైతన్య మహాప్రభు



2. కిందివాటిలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన మఠం ఏది?

1) బద్రీనాథ్‌    2) శృంగేరి    3) పూరి    4) పైవన్నీ


 


3. సగుణ భక్తి అంటే అర్థం ఏమిటి?

1) దేవుడికి మానవ రూపం ఇచ్చి ఆరాధించడం

2) దేవుడికి రూపం లేకుండా ఆరాధించడం

3) అసలు దేవుడు లేడు అని నమ్మడం

4) దేవుడి మీద ప్రేమ ఉండక తాంత్రిక భక్తి ఉండటం    


 


4. కిందివారిలో ఎవరిని ‘ప్రచ్ఛన్న బుద్ధ’ అని  పిలుస్తారు?

1) ఆదిశంకరాచార్యులు    2) రామానందుడు

3) కబీర్‌    4) బసవేశ్వరుడు



5. ‘విశిష్టాద్వైతం’ను ప్రతిపాదించింది ఎవరు?

1) రామానందుడు    2) వల్లభాచార్యులు

3) రామానుజాచార్యులు    4) ఆదిశంకరాచార్యులు


 

6. రామానుజాచార్యులకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?    

1) రామానుజాచార్యుల విగ్రహాన్ని హైదరాబాద్‌లో అమిత్‌ షా ఆవిష్కరించారు.

2) ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు.

 3) దీన్ని రామానుజాచార్యుల 1000వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేశారు.

4) ఈ విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ అంటారు.


 


7. ఆదిశంకరాచార్యుల జన్మప్రదేశం?

 1) ఆంధ్రప్రదేశ్‌        2) కేరళ     3) కర్ణాటక      4) తమిళనాడు




8. ‘అద్వైతం’ అంటే ఏమిటి?

 1) ఆత్మ, పరమాత్మ రెండూ వేర్వేరు   2) జీవుడు వేరు, దేవుడు వేరు

3) ఆత్మ, పరమాత్మ రెండూ ఒక్కటే    4) పైవన్నీ

 


9.ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఎవరు?    

1) నింబార్కుడు    2) శ్రీపాదాచార్యులు

3) మధ్వాచార్యులు    4) శంకరాచార్యులు

10. రామానందుడికి సంబంధించి కిందివాటిలో సరికానిది?        

1) ఈయన ప్రయాగలో జన్మించారు.

2) రామానుజాచార్యుడి అనుచరుడు.

3) ఈయన శైవతత్వాన్ని ప్రచారం చేశారు.

4) ఈయన శిష్యులను ‘అవదూతలు’ అంటారు.




11. కింది భక్తి ఉద్యమకారులను వారి వృత్తులతో జతచేయండి.

ఎ) కబీర్‌       1) నేతకులం

బి) రవిదాస్‌     2) చర్మకార కులం

సి) సేన        3) మంగలి కులం

 డి) నరహరిదాస     4) కంసాలి కులం

 1) ఎ-1, బి-2, సి-3, డి-4

 2) ఎ-4, బి-3, సి-2, డి-1

 3) ఎ-1, బి-3, సి-2, డి-4

 4) ఎ-3, బి-4, సి-1, డి-2


12. కిందివారిలో ఎవరిని ‘ఆగ్రా అంధకవి’ అని పిలుస్తారు?

1) వల్లభాచార్యులు    2) సూరదాస్‌

3) రామానందుడు    4) చైతన్యుడు



13. ‘దాసబోధ’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

1) సమర్థ రామదాస్‌    2) భక్త తుకారాం

3) దాదాజి కొండాదేవ్‌    4) విద్యారణ్యస్వామి


14. ‘‘ప్రాంతీయ భాషలు ప్రవహించే సెలయేరు   లాంటివి’’ అని అన్న భక్తి ఉద్యమకారుడు?

 1) కబీర్‌    2) గురునానక్‌    3) జ్ఞానేశ్వర్‌    4) ఏక్‌నాథ్‌




15. కిందివారిలో మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు ఎవరు?

1) జ్ఞానేశ్వర్‌    2) భక్త తుకారాం    3) ఏక్‌నాథ్‌    4) చైతన్యుడు



16. కిందివారిలో భగవంతుడిని స్తుతించేందుకు     భజనలు చేసినవారు?    

1) కబీర్‌    2) గురునానక్‌  3) మీరాబాయి    4) పైవారంతా
 


17. కిందివాటిలో ‘జ్ఞానేశ్వరి’ అనే గ్రంథాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు?

1) మరాఠాగీత    2) భగవత్‌ దీపిక    3) 1, 2    4) అభంగాలు

18. సిక్కుమత స్థాపకుడు ఎవరు?

1) గురునానక్‌    2) గురు అంగధ్‌

3) గురు రామ్‌దాస్‌    4) గురు అర్జున్‌ సింగ్‌



19. ‘రామచరిత మానస్‌’ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?

1) చైతన్యప్రభు    2) సమర్థ రామదాసు

3) తులసీదాస్‌    4) జ్ఞానేశ్వర్‌

20. గురునానక్‌కు సంబంధించి సరికానిది ఏది?

1) ఈయన బాబర్‌కు సమకాలికుడు.

2) పునర్జన్మను అంగీకరించారు.

3) ‘లంగర్‌’ అనే భోజనశాలను ఏర్పాటు చేశారు.

4) ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించారు.

 


21. కిందివారిలో ఎవరి రచనలను ‘వచనాలు’ అంటారు?    

1) బసవేశ్వరుడు    2) గురునానక్‌

3) ఏక్‌నాథ్‌    4) నామ్‌దేవ్‌

 


22. బసవేశ్వరుడికి సంబంధించిన సంస్కరణ ఏది?

1) బాల్యవివాహాల నిషేధం 2) వితంతు వివాహాలు

3) సతీసహగమనం    4) పైవన్నీ



23. సిక్కు సాంప్రదాయమైన ఖల్సాను ప్రారంభించినవారు?

1) గురు అర్జున్‌ సింగ్‌    2) గురు రామ్‌దాస్‌

3) గురు గోవింద్‌ సింగ్‌    4) గురు హరగోవింద్‌



24. సిక్కుల పవిత్ర గ్రంథం ‘ఆదిగ్రంథ్‌’ను ఎవరు రచించారు?

1) గురు అర్జున్‌ సింగ్‌    2) గురు అంగధ్‌ 

3) గురు హరకిషన్‌    4) గురు గోవింద్‌ సింగ్‌


25. భక్తి ఉద్యమ ప్రధాన లక్షణం కానిది?

1) మానవుల్లో సమానత్వ భావం తీసుకురావడం

2) కులం, తెగ, వర్గ వ్యత్యాసాలను తిరస్కరించడం

3) బహుదేవతారాధనను అధికం చేయడం

4) మోక్షానికి భక్తి ప్రధానం అని చెప్పడం


 


26. కిందివాటిలో ఆదిశంకరాచార్యుల రచన కానిది?

1) వివేకచూడామణి    2) శివానందలహరి    

3) ఆత్మబోధ    4) బ్రహ్మసూత్ర

27. కిందివారిలో ఎవరి విధానాన్ని ‘పుష్టి మార్గం’ లేదా ‘భగవత్‌ అనుగ్రహ మార్గం’ అని అంటారు?

1) బసవేశ్వరుడు    2) వల్లభాచార్యుడు

3) రామానందుడు    4) రామానుజాచార్యులు


28. ‘‘రామ్, రహీం ఏక్‌ హై’’ అని అన్న భక్తి ఉద్యమకారుడు?

1) కబీర్‌    2) రవిదాస్‌    

3) చైతన్యుడు    4) గురు అర్జున్‌ సింగ్‌

29. మీరాబాయి ఏ రాజపుత్ర రాజు కోడలు?

1) రాణా ప్రతాప్‌ సింగ్‌    2) రాణా ఉదయ్‌ సింగ్‌

3) రాణా సంగ్రామ్‌ సింగ్‌    4) రాణా రంజిత్‌ సింగ్‌



 

30. కిందివారిలో ఎవరిని ‘ఆంధ్ర పదకవితా పితామహుడు’ అని పిలుస్తారు?

1) అల్లసాని పెద్దన    2) అన్నమాచార్యులు

3) చైతన్యుడు    4) వల్లభాచార్యులు

31. కిందివారిలో శంకరదేవుడికి సంబంధించి సరైంది?

1) శంకరదేవుడు అస్సాం ప్రాంత సాధువు.

2) ఈయన నామ్‌ఘర్‌లను ప్రారంభించారు.

3) గిరిజనులతో సహా అందరికీ వైష్ణవాన్ని ప్రభోదించారు.

4) పైవన్నీ

32. జతపరచండి.

ఎ) ఆళ్వారులు   1) శివుడిని పూజిస్తారు

బి) నాయనార్లు    2) విష్ణువును పూజిస్తారు

సి) సగుణ భక్తి      3) నిరాకారంగా దైవాన్ని పూజించడం

డి) నిర్గుణ భక్తి     4) దైవాన్ని ఆకారంలో పూజించడం

1) ఎ-2, బి-1, సి-4, డి-3

2) ఎ-2, బి-3, సి-4, డి-1

3) ఎ-1, బి-2, సి-3, డి-4

 4) ఎ-4, బి-2, సి-1, డి-3


33. ‘హరిలో అందరూ, అందరిలో హరి’ అనే బోధన ఎవరిది?    

1) మీరాబాయి    2) సంత్‌ రవిదాస్‌

3) చైతన్యుడు    4) రామానందుడు


34. చైతన్య మహాప్రభు భారత దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వైష్ణవ సాధువు?

1) దక్షిణ భారత దేశం    2) తూర్పు భారత దేశం

3) ఉత్తర భారత దేశం    4) పశ్చిమ భారత దేశం


35. కీర్తనలను స్వయంగా రచించి గానం చేసే   వ్యక్తులను ఏమంటారు?

1) సంకీర్తనకారుడు    2) వాగ్గేయకారుడు

3) కీర్తనాచార్యులు    4) కీర్తనకారుడు


36. కిందివారిలో ఎవరిని ‘శ్రీగౌరంగ’ అని పిలుస్తారు?

1) చైతన్య మహాప్రభు    2) తులసీదాస్‌

3) సమర్థ రామదాసు    4) రామానుజాచార్యులు


37. వీరశైవతత్వాన్ని ప్రచారం చేసినవారు?

1) బసవేశ్వరుడు    2) రామానందుడు

3) తులసీదాస్‌    4) చైతన్యుడు



38. ‘‘రాయిని మొక్కితే మోక్షం వస్తే నేను కొండనే మొక్కుతా’’ అని అన్నది?

1) గురునానక్‌    2) కబీర్‌    

3) రామానందుడు    4) సూరదాస్‌

39. తులసీదాస్‌ ఏ మొగల్‌ చక్రవర్తికి సమకాలికుడు?  

1) జహంగీర్‌    2) అక్బర్‌        

3) షాజహాన్‌    4) ఔరంగజేబు


40. ఔరంగజేబు ఉరి తీయించిన సిక్కు గురువు?

1) గురు తేజ్‌బహదూర్‌    2) గురు అర్జున్‌ సింగ్‌

3) గురు హరగోవింద్‌    4) గురు రామదాస్‌


సమాధానాలు

12; 24; 31; 41; 53; 61; 72; 83; 93; 103; 111; 122; 131; 141; 154; 164; 173; 181; 193; 204; 211; 224; 233; 241; 253; 264; 272; 281; 293; 302; 314; 321; 332; 342; 352; 361; 371; 382; 392; 401. 


రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు
 

Posted Date : 17-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌