• facebook
  • whatsapp
  • telegram

శతకం

‘దుష్ట సంహార నరసింహ దురిత దూర’

తెలుగు సాహితీ ప్రక్రియలో శతకాలకు విశిష్ట స్థానం ఉంది. ఒకే మకుటంతో కనీసం వంద పద్యాలున్న సాహిత్యమే శతకం. పాత తెలుగు గ్రంథాల్లో అధికశాతం శతకాలే ఉన్నాయంటే ఆ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యాన్ని, ఆదరణను అర్థం చేసుకోవచ్చు. దైవభక్తి, వర్ణన, బోధన, తత్వం, వేదాంతం, నైతిక, సమాజ నియమాలపై విమర్శ లాంటి ఎన్నో అంశాలపై వేలాది శతకాలు వెలువడ్డాయి. నాటికి, నేటికీ పండిత పామరులందరూ ఇష్టపడే ఆ తెలుగు శతకాలపై అభ్యర్థులకు తగిన అవగాహన ఉండాలి. శతక లక్షణాలు, ప్రధాన శతకాలు, శతకకర్తలు, ప్రత్యేకతలు, వాటిపై పరిశోధనలు చేసిన వ్యక్తుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

*  శతకం అంటే వంద పద్యాల రచన.

‘‘శతేన శతకం ప్రోక్తం’’ అన్నారు అమృతానంద యోగి.

*  సాధారణంగా శతకంలో 108 పద్యాలుంటాయి.

* శతకం సూత్రం - ఆత్మాశ్రయరీతి

* సాధారణంగా శతకాలు ఆత్మాశ్రయ ధోరణిలో ఉంటాయి.

* పద్యం చివర సంబోధనా పదాన్ని మకుటం అంటారు.

* ఈ పద్యాలు ముక్తకాలుగా, ఏ పద్యానికదే స్వతంత్ర భావం కలిగి ఉంటాయి.

*  మకుటం అనే పదానికి అర్థం - కిరీటం.

* మకుటంలో రకాలు 

1) ఏకపద మకుటం ఉన్న శతకాలు 

2) ద్విపాద మకుట శతకాలు 

3) ఏకపాద మకుట శతకాలు 

4) అర్ధపాద మకుట శతకాలు

ఏకపద మకుట శతకం: సుమతీ శతకం, భాస్కర శతకం

ఏకపాద మకుటం: వేమన శతకం, తెలుగు బాల శతకం

ద్విపాద మకుటం: ఆంధ్రనాయక శతకం

అర్ధపాత మకుటం: వృషాధిప శతకం

సమాస మకుటం: దాశరథీ శతకం


* తెలుగులో శతక ప్రక్రియ 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. మొదట శైవభక్తి శతకాలు వెలువడ్డాయి.


నమూనా ప్రశ్నలు


1.  ‘సంఖ్యా నియమాన్ని సంస్కృత ప్రాకృతం నుంచి శతక ప్రక్రియలోకి తీసుకున్నారు’ అని అభిప్రాయపడ్డవారు?

1) కె.గోపాలకృష్ణారావు     2) జి.వి.సుబ్రమణ్యం

3) వంగూరి సుబ్బారావు   4) కాశీనాథుని నాగేశ్వరరావు


2.  ముక్తకాలు అని పిలిచే ప్రక్రియ ఏది?

1) ప్రబంధం   2) ఉదాహరణం

3) పురాణం    4) శతకం


3.  తెలుగు సాహిత్యంలో మొదట మకుటం ఉన్న పద్యాలు నన్నయ భారతంలో ఏ ఉపాఖ్యానంలో కనిపిస్తున్నాయి?

1) అజగరోపాఖ్యానం    2) శకుంతలోపాఖ్యానం

3) ఉదంకోపాఖ్యానం   4) గరుడోపాఖ్యానం


4. ‘మకుటం’ అంటే? 

1) కిరీటం   2) కేయూరం

3) భుజకీర్తులు  4) అందియ


5.  ‘దారిద్య్ర విద్రావణ’ అనే మకుటంతో ఉన్న పద్యాలు ఏ కావ్యంలో కనిపిస్తున్నాయి?

1) భారతం     2) రామాయణం

3) నిర్వచనోత్తర రామాయణం 4) కుమార సంభవం


6.  కిందివాటిలో ఏకపద మకుటం ఉన్న శతకం-

1) దాశరథీ శతకం   2) వేమన శతకం

3) సుమతీ శతకం   4) నారసింహ శతకం


7. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండే లక్షణాన్ని ఏమంటారు?

1) ముక్తకం  2) ఛందోనియమం

3) మకుట నియమం   4) రస నియమం


8. అజా, రుద్రా, శివా అనే విభిన్న మకుటాలు కనిపిస్తున్న శతకం?

1) నీలకంఠేశ్వర శతకం    2) శివదేవ శతకం

3) శివతత్వ సారం     4) నగజా శతకం


9. శతకాలు ఏ కోవకు చెందినవి?

1) నిబద్ధ కావ్యాలు    2) అనిబద్ధ కావ్యాలు

3) ఖండ కావ్యాలు   4) రగడ కావ్యాలు


10. మానసబోధ శతకం ఏ కోవకు చెందిన శతకం-

1) విష్ణుభక్తి శతకం    2) రామభక్తి శతకం 

3) దేవీభక్తి శతకం     4) తాత్విక శతకం


11. కిందివాటిలో వ్యాజస్తుతి శతకం కానిది-

1) సింహాద్రి నారసింహ శతకం 

2) ఆంధ్ర నాయక శతకం

3) భద్రగిరి శతకం     

4) చిన్మయ శతకం


12. విసనకర్ర శతకం ఎవరు రాశారు?

1) మండపాక పార్వతీశ్వరశాస్త్రి

2) హరిబ్రహ్మేశ్వర కవులు

3) జొన్నలగడ్డ శారదాంబ     

4) వైదుర్సు అప్పయ్య


13. తొలి తెలుగు దూత శతకం ఏది?

1) ఇందు శతకం  2) సమదర్శనం 

3) వట్టిమాయ శతకం   4) చక్కట్ల దండక శతకం


14. సర్వేశ్వర శతకంలో పద్యాల సంఖ్య ఎంత?

1) 101   2) 108   3) 124   4) 142


15. బూతు కవిగా సుప్రసిద్ధుడైన శతక కవి?

1) కవి చౌడప్ప   2) శరభాంకుడు 

3) శ్రీగిరి కవి    4) శేషప్ప కవి


16. 12వ శతాబ్దిలో వచ్చిన శతకాన్ని గుర్తించండి-

1) శ్రీభర్గ శతకం   2) సరస్వతీ శతకం 

3) శ్రీగిరి శతకం   4) సర్వేశ్వర శతకం


17. ద్విపాద మకుటం ఉన్న శతకం-

1) బసవలింగ శతకం  2) నరసింహ శతకం 

3) అంబికా శతకం   4) శివదేవ శతకం


18. స్వీయ హృదయ నివేదన ఏ శతక లక్షణాన్ని సూచిస్తుంది?

1) వృత్త నియమం   2) ముక్తకం 

3) ఆత్మాశ్రయ కవితాధర్మం   4) మకుట నియమం


19. పద్యాదిలో మకుటం ఉన్న శతకం ఏది?

1) నీలకంఠేశ్వర శతకం   2) దారుణ శతకం 

3) సభారంజన శతకం   4) మణులమూట శతకం


20. శతక కవుల చరిత్ర రాసినది ఎవరు?

1) వంగూరి సుబ్బారావు    2) కె.గోపాలకృష్ణారావు

3) నిడదవోలు వెంకట్రావు   4) పేర్వారం జగన్నాథం


21. సంఖ్యాబద్ధమగు చాటు ప్రబంధం శతకం - అని నిర్వచించింది ఎవరు?

1) అప్పకవి    2) కస్తూరి రంగకవి 

3) అడిదం సూరకవి   4) లింగమకుంట తిమ్మకవి


22. శతక కవిత్రయంలో చేరని కవి?

1) మల్లికార్జున పండితుడు   2) పాల్కురికి సోమనాథుడ

3) యథావాక్కుల అన్నమయ్య    4) శివదేవయ్య


23. వృషాధిప శతకంలోని పద్యాలు ఏవి?

1) శార్దూల మత్తేభాలు    2) చంపకోత్పలమాలలు 

3) ఆటవెలది తేటగీతులు   4) కందము సీసాలు


24. వస్త్వైక్యంలేని శతక లక్షణం ఏది?

1) ఛందో నియమం   2) వృత్త నియమం 

3) ముక్తక నియమం   4) మకుట నియమం


25. కుక్కుటేశ్వర శతకం ఎవరి రచన?

1) అడిదం సూరకవి   2) ఫక్కి అప్పల నరసింహం 

3) వెన్నెలకంటి జన్నమంత్రి    4) కరాచిమంచి తిమ్మకవి


26. తొలి తెలుగు శతక కవయిత్రి ఎవరు?

1) దార్ల సుందరీమణి   2) ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ

3) గిడుగు లక్ష్మీకాంతమ్మ   4) చిల్లర భవానీదేవి


27. వృషాధిప శతకంలోని పద్యాలు ఎన్ని?

1) 100   2) 101   3) 108   4) 142


28. దాశరథీ శతకానికి వచ్చిన సుప్రసిద్ధ వ్యాఖ్యానం ఏది?

1) మానసోల్లాస వ్యాఖ్య   2) సుదర్శన వ్యాఖ్య 

3) దీపికా వ్యాఖ్య   4) వివేకానందినీ వ్యాఖ్య


29. తిక్కన కందాలను మించిన కందాలు తనవని ఆత్మవిశ్వాసంతో చెప్పిన శతక కవి?

1) గువ్వల చెన్నడు   2) శ్రీశ్రీ 

3) కవి చౌడప్ప   4) బద్దెన


30. భాస్కర శతకం నిండా పరచుకున్న అలంకారం?

1) ఉపమాలంకారం     2) ఉత్ప్రేక్షాలంకారం 

3) దృష్టాంతాలంకారం    4) దీపాకాలంకారం


31. ‘వేమన ప్రజాకవి’ అని అభిప్రాయపడింది ఎవరు?

1) సి.పి.బ్రౌన్‌   2) విలియం కాంబెల్‌ 

3) యమ్‌.జయదేవ్‌   4) యన్‌.గోపి 


32. ‘శతక వాజ్మయ బ్రహ్మ’ ఎవరు?

1) వేమన    2) కవి చౌడప్ప 

3) పాల్కురికి సోమన   4) శివదేవయ్య 


33. కీరవాణి శతకం రాసింది ఎవరు?

1) గంగుల నారాయణ 

2) పసుపులూరి సోమరాజుకవి

3) బొడ్డు బాపిరాజు     

4) గంగాధర కవి


34. శతక ప్రక్రియ ఏ శతకాలతో ఆరంభమైంది?

1) భక్తి శతకాలు   2) అధిక్షేప శతకాలు 

3) నీతి శతకాలు   4) వ్యాజస్తుతి శతకాలు


35. ఏకపాద మకుటం ఉన్న శతకం ఏది?

1) దాశరథీ శతకం     2) వేమన శతకం 

3) వృషాధిప శతకం   4) శ్రీకాళహస్తీశ్వర శతకం


36. ‘‘భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర’’ అనే మకుటం ఉన్న శతకం?

1) ఆంధ్రనాయక శతకం   2) నరసింహ శతకం 

3) దారుణ శతకం   4) నీలకంఠ శతకం


37. ఆటవెలది పద్యాలతో ఉన్న శతకం?

1) సర్వేశ్వర శతకం   2) వృషాధిప శతకం  

3) సుమతీ శతకం  4) వేమన శతకం 


38. ‘మానసబోధ శతకం’ కర్త ఎవరు?

1) తాడేపల్లి పానకాలరాయ కవి 

2) సుందర నారాయణ కవి 

3) కంచర్ల గోపన్న     

4) ధూర్జటి


39. తెలుగు శతక వాఙ్మయంపై విశేష పరిశోధన   చేసినవారు?

1) బిరుదురాజు రామరాజు 

2) కె. గోపాలకృష్ణారావు

3) జనమంచి శేషాద్రిశర్మ 

4) దివాకర్ల వెంకటావధాని 


40. సంఖ్యా నియమం, మకుటనియమం ఉన్న    శతకాల్లో మొదటిది?

1) శివతత్వ సారం   2) వృషాధిప శతకం 

3) శ్రీకాళహస్తీశ్వర శతకం   4) దాశరథీ శతకం


41. ‘కుక్కుటేశ్వర’ శతకకర్త?

1) ఏనుగు లక్ష్మణ కవి   2) కాకుత్సం శేషప్ప కవి

3) గువ్వల చెన్నడు    4) కుంచిమంచి తిమ్మకవి


42. 13వ శతాబ్దంలో వెలువడిన శతకాన్న  గుర్తించండి-

1) సుమతీ శతకం   2) నారాయణ శతకం 

3) శ్రీ వేంకటేశ్వర శతకం  4) తెలుగుబాల శతకం


43. మయూరుని సూర్య శతకంలోని పద్యాలు ఏవి?

1) సీస పద్యాలు   2) కంద పద్యాలు  

3) స్రగ్థరా పద్యాలు   4) పంచచామరం


44. రామలింగేశ్వర శతకకర్త ఎవరు?

1) ఫక్కిఅప్పల నరసింహం  2) శేషప్ప కవి   

3) మేన  4) అడిదం సూరకవి


45. తిక్కన రాసిన శతకం ఏది ?

1) శ్రీగిరి శతకం     2) శ్రీకృష్ణ శతకం 

3) నారాయణ శతకం    4) ఏదీకాదు


సమాధానాలు

1-1; 2-4; 3-3; 4-1; 5-4; 6-3; 7-1; 8-3; 9-2; 10-1; 11-4; 12-2; 13-1; 14-4; 15-1; 16-4; 17-2; 18-3; 19-2; 20-1; 21-1; 22-4; 23-2; 24-3; 25-4; 26-1; 27-3; 28-1; 29-3; 30-3; 31-2; 32-3; 33-4; 34-1; 35-2; 36-2; 37-4; 38-1; 39-2; 40-2; 41-4; 42-1; 43-3; 44-4; 45-2.


రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 18-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌