• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు

‘భూమి మీద స్వర్గం ఉంటే అది ఇదే!’

మధ్యయుగంలో ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మూడు శతాబ్దాలకు పైగా పాలించిన సుల్తానులు భారతదేశంలో అనేక మార్పులు, పరిణామాలకు నాంది పలికారు. దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను విశేషంగా ప్రభావితం చేశారు. ఉత్తర భారతంపై వరుస దండయాత్రలతో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించినప్పటి నుంచి మొగలుల రాక వరకు వీరి ప్రస్థానం, వంశాల క్రమం, పాలకుల విశేషాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. సుల్తాన్‌లు, వారి పాలన వివరాలతోపాటు సంబంధిత రచనలు, రచయితలు, సైనిక సంస్కరణలు, చేసిన యుద్ధాలు, చేపట్టిన నిర్మాణాలు,  సమకాలీన హిందూ రాజ్యాలపై    అవగాహన పెంచుకోవాలి.

1.    కిందివాటిని జతపరచండి.

ఎ) అల్‌బెరూనీ                1) కితాబ్‌-ఉల్‌-హింద్‌

బి) ఇబన్‌ బటూటా           2) రెహ్లా

సి) అమీర్‌ ఖుస్రూ             3) ఆషిఖి

డి) మిన్హజ్‌-ఉద్దీన్‌-సిరాజ్‌  4) తబాకత్‌-ఇ-నాసిరి

1) ఎ-1, బి-2, సి-3, డి-4        

2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-2, బి-4, సి-1, డి-3        

4) ఎ-1, బి-3, సి-4, డి-2


2.    ఇల్‌ టుట్‌ మిష్‌ కాలంలో ఏర్పడిన ‘చిహల్‌గని’ దేనికి సంబంధించింది?

1) సైన్యానికి అధిపతులు    

2) మొదటి సైనిక వర్గం

3) మతాధికారులు          

4) పరిపాలనలో రాజుకు సహాయకారులు


3.     ఢిల్లీని పాలించిన మొదటి మహిళా సుల్తాన్‌ ఎవరు?

1) రజియా సుల్తానా   2) హమీదాభాను బేగం

3) గుల్‌బదన్‌ బేగం    4) ఎవరూకాదు


4.     ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించిన తొలి స్వతంత్ర సుల్తాన్‌ ఎవరు?

1) బాల్బన్‌    2) ఇల్‌ టుట్‌ మిష్‌  

3) రక్నుద్దీన్‌   4) జలాలుద్దీన్‌


5.   బాల్బన్‌కు సంబంధించి ఇచ్చినవాటిలో సరికానిది?

1) ఈయన బానిస వంశంలో ముఖ్యుడు.

2) సుల్తాన్‌ దేవుడి నీడ అని చాటి చెప్పాడు.

3) చిహల్‌గనికి అత్యున్నత స్థానం ఇచ్చాడు.

4) తననితాను గొప్ప వంశానికి చెందినవాడిగా పేర్కొన్నాడు.


6.     బాల్బన్‌ కాలంలో అనుసరించిన ‘సిజ్దా’ అంటే?

1) సాష్టాంగ నమస్కారం చేయడం

2) నూతన సంవత్సర పండగ

3) సుల్తాన్‌ సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవడం

4) పైవన్నీ


7.     ఖిల్జీవంశ స్థాపకుడు?

1) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ     2) జలాలుద్దీన్‌ ఖిల్జీ   

3) ముబారక్‌ షా ఖిల్జీ    4) అల్లాఉద్దీన్‌ షా


8.     చిహల్‌గనిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) బాల్బన్‌     2) ఫిరోజ్‌ షా తుగ్లక్‌  

3) మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌      4) ఇబ్రహీం లోడి


9.     రజియా సుల్తానా ఏ వంశానికి చెందింది?

1) బానిస వంశం   2) ఖిల్జీ వంశం   

3) తుగ్లక్‌ వంశం    4) సయ్యద్‌ వంశం


10.    కింది ఢిల్లీ సుల్తానేట్‌ వంశాల సరైన వరుసక్రమం-

1) బానిస - ఖిల్జీ - సయ్యద్‌ - తుగ్లక్‌ - లోడి

2) బానిస - లోడి - తుగ్లక్‌ - సయ్యద్‌ - ఖిల్జీ

3) బానిస - ఖిల్జీ - తుగ్లక్‌ - సయ్యద్‌ - లోడి

4) బానిస - ఖిల్జీ - తుగ్లక్‌ - లోడి - సయ్యద్‌


11. ఏ ఢిల్లీ సుల్తాన్‌ దాడిలో భాగంగా చిత్తోడ్‌ రాణి ‘పద్మిని’ జౌహర్‌ చేసుకుని మరణించింది?

1) ఫిరోజ్‌ షా తుగ్లక్‌     2) మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌  

3) జలాలుద్దీన్‌ ఖిల్జీ     4) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ


12. కిందివారిలో ఎవరిని ‘భారతదేశపు రామచిలుక’ అని పిలుస్తారు?

1) అల్‌బెరూనీ     2) అమీర్‌ ఖుస్రూ 

 3) తాన్‌సేన్‌     4) ఇబన్‌ బటూటా


13. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర  సమయంలో కాకతీయ రాజ్య పాలకుడు ఎవరు?

1) గణపతి దేవుడు    2) మొదటి ప్రతాపరుద్రుడు 

3) రెండో ప్రోలరాజు   4) రెండో ప్రతాపరుద్రుడు


14. రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన సుల్తాన్‌?    

1) సికిందర్‌ లోడి     2) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ 

3) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌     4) జలాలుద్దీన్‌ ఖిల్జీ


15. ఎవరి పరిపాలన కాలంలో ఢిల్లీపై తైమూరు దండయాత్ర జరిగింది?

1) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌     2) నసిరుద్దీన్‌ తుగ్లక్‌ 

3) ఇబ్రహీం లోడి     4) బహలాల్‌ లోడి


16. మార్కెట్‌ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ     2) ముబారక్‌ షా ఖిల్జీ 

3) బాల్బన్‌     4) ఇల్‌ టుట్‌ మిష్‌


17. ‘థాగ్‌’ అంటే..?

1) సైనికుల హాజరు పట్టిక 

2) గుర్రాలకు వేసే రాజముద్ర

3) దారిదోపిడీ దొంగల ముఠా

4) మార్కెట్‌ నియమావళి


18. ఢిల్లీ సుల్తానుల దాడికి గురైన మొదటి దక్షిణ   భారత రాజ్యం?

1) కాకతీయ రాజ్యం     2) హోయసాల రాజ్యం 

3) యాదవ రాజ్యం     4) పాండ్య రాజ్యం


19. ఢిల్లీపై తైమూర్‌ దండయాత్ర ఎప్పుడు జరిగింది?

1) 1331  2) 1398   3) 1340  4) 1399


20. ఏ ఢిల్లీ సుల్తాన్‌ పాలనా కాలంలో విజయనగర, బహమనీ రాజ్యాలు వెలిశాయి?

1) ఫిరోజ్‌ షా తుగ్లక్‌     2) ఖజిర్‌ఖాన్‌ సయ్యద్‌

3) బహలాల్‌ లోడి      4) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌


21. మొగల్‌ పాలకుడు బాబర్‌ చేతిలో మరణించిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఇబ్రహీం లోడి       2) బహలాల్‌ లోడి

3) సికిందర్‌ లోడి      4) ఖుస్రూ ఖాన్‌


22. మొదటి తరైన్‌ యుద్ధం ఎవరెవరి మధ్య     జరిగింది?

1) మహ్మద్‌ ఘోరి - మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌

2) మహ్మద్‌ ఘజిని - ఫృథ్వీరాజ్‌ చౌహాన్‌

3) మహ్మద్‌ ఘోరి - రాజారతన్‌ సింగ్‌

4) మహ్మద్‌ ఘోరి - ఫృథ్వీరాజ్‌ చౌహాన్‌


23. టంకా, జిటాల్‌ అనే నాణేలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్‌ ఎవరు?

1) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌  2) ఫిరోజ్‌ షా తుగ్లక్‌

3) ఇల్‌ టుట్‌ మిష్‌      4) ఇబ్రహీం లోడి


24. కిందివారిలో మంగోలుల నాయకుడు?

1) తైమూర్‌ ఖాన్‌    2) చెంఘీజ్‌ ఖాన్‌

3) బాబర్‌       4) ఖజిర్‌ ఖాన్‌


25. కుతుబ్‌ మినార్‌కు సంబంధించి సరైంది?

1) దీన్ని కుతుబుద్దీన్‌ ఐబక్, ఇల్‌టుట్‌మిష్‌ నిర్మించారు

2) దీని నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయి ఉపయోగించారు               

3) సుమారు 74.1 మీ. ఎత్తులో ఉంది

4) పైవన్నీ 


26. ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని ఎలా   విభజించారు?

1) మండలాలు   2) ఇక్తాలు

3) మన్సబ్‌లు    4) వలనాడులు


27. ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు, శిల్పకళకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.

1) వీరి కాలంలో ఇండో - పర్షియన్‌ శైలిలో    నిర్మాణాలు నిర్మించారు

2) మినార్లు, కమానులు, డోములు నిర్మించారు

3) అలైదర్వాజా ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మొదటి మసీదు

4) ఆర్‌బెస్క్‌ విధానం అనుసరించారు


28. తుగ్లక్‌ వంశ స్థాపకుడు ఎవరు?

1) మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌    

2) ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌

3) ఫిరోజ్‌ షా తుగ్లక్‌      

4) నసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌


29. ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రధాన వృత్తి?

1) వ్యవసాయం   2) వ్యాపారం

3) పశుపోషణ   4) ఏదీకాదు


30. బానిస వంశస్థాపకుడు?

1) కుతుబుద్దీన్‌ ఐబక్‌    2) ఇల్‌ టుట్‌ మిష్‌

3) బాల్బన్‌    4) నాసిరుద్దీన్‌ మహ్మద్‌


31. ఎవరి మరణంతో ఢిల్లీ సుల్తాన్‌ల పాలన     అంతమైంది?

1) ఇబ్రహీం లోడి    2) బహలాల్‌ లోడి

3) ఖిజర్‌ఖాన్‌ సయ్యద్‌    4) ఖుస్రూ ఖాన్‌


32. ‘ఆర్కుట్‌ శైలి’ వీరి కాలంలోనిది?

1) ఢిల్లీ సుల్తాన్‌లు    2) మొగలులు

3) విజయనగర రాజులు    4) కాకతీయులు


33. కిందివాటిని జతపరచండి.

ఎ) ఖిల్జీ వంశం         1) ఖిజిర్‌ ఖాన్‌

బి) బానిస వంశం       2) బహలాల్‌

సి) లోడి వంశం        3) కుతుబుద్దీన్‌ ఐబక్‌

డి) సయ్యద్‌ వంశం      4) జలాలుద్దీన్‌

1) ఎ-4, బి-3, సి-2, డి-1

2) ఎ-1, బి-2, సి-3, డి-4

3) ఎ-2, బి-4, సి-1, డి-3

4) ఎ-4, బి-1, సి-2, డి-3


34. లాహోర్‌ రాజధానిగా పాలించిన సుల్తాన్‌?

1) ఇల్‌ టుట్‌ మిష్‌   2) మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌

3) కుతుబుద్దీన్‌ ఐబక్‌    4) బాల్బన్‌


35. అల్లాఉద్దీన్‌ ఖిల్జీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి.

1) ఢిల్లీ సుల్తానులందరిలో ప్రముఖుడు

2) జలాలుద్దీన్‌ ఖిల్జీ అనంతరం పాలించాడు

3) అలైదర్వాజా అనే కట్టడం నిర్మించాడు

4) పైవన్నీ 


36. రెండో తరైన్‌ యుద్ధం జరిగిన సంవత్సరం?

1) 1191   2) 1192    3) 1193  4) 1194


37. ‘కువ్వత్‌-ఉల్‌-ఇస్లాం’ అనే మసీదు ఏ ప్రాంతంలో ఉంది?

1) ఢిల్లీ   2) అజ్మీర్‌   3) చిత్తోడ్‌   4) దేవగిరి


38. ‘ఇక్తా’ విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్‌?

1) ఇల్‌ టుట్‌ మిష్‌    2) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ

3) బాల్బన్‌    4) ఫిరోజ్‌ షా తుగ్లక్‌


39. ‘‘భూమి మీద స్వర్గం ఉంటే అది ఇదే, అది ఇదే, అది ఇదే’’ అని కశ్మీర్‌ను వర్ణించింది ఎవరు?

1) అల్‌బెరూనీ    2) బదౌని

3) అమీర్‌ ఖుస్రూ    4) ఇబన్‌ బటూటా


40. తననుతాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్‌?

1) ముబారక్‌ షా ఖిల్జీ    2) ఖుస్రూ ఖాన్‌

3) అల్లాఉద్దీన్‌ ఖిల్జీ    4) ఇబ్రహీం లోడి

 

సమాధానాలు


1-1 ; 2-4 ; 3-1 ; 4-2 ; 5-3 ; 6-1; 7-2 ; 8-1 ; 9-1 ; 10-3 ; 11- 4 ; 12-2 ; 13- 4 ;14-2 ; 15-2  ; 16-1 ; 17-2 ; 18-3 ; 19-2 ; 20-4  ; 21-1 ; 22- 4 ; 23-3  ; 24-2 ; 25-4 ; 26-2 ; 27-3  ; 28- 2 ; 29-1  ; 30-1 ; 31-1 ; 32-1  ; 33-1 ; 34-3 ; 35- 4 ; 36-2 ; 37-1 ; 38-1 ; 39-3 ; 40-1.

Posted Date : 10-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌