• facebook
  • whatsapp
  • telegram

ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం - కాకతీయులు

సాగు భూములకు రక్షణగా కోట నిర్మాణం!
 


తెలుగు జాతిని సమైక్యం చేసిన తొలి పాలకులు శాతవాహనులే. కానీ మధ్యయుగంలో ఆ ఘనత కాకతీయులకు దక్కుతుంది. హైందవ సంస్కృతిని ఉద్ధరించి, వ్యవసాయం, కళలు, సాహిత్యాన్ని ప్రోత్సహించి ప్రజాక్షేమమే పరమావధిగా వారు గొప్ప పాలన అందించారు. చెరువుల తవ్వకం, ఆలయాల నిర్మాణంలో చెరగని ముద్రలు వేశారు. పశ్చిమ చాళుక్యుల అనంతరం అధికారం స్థాపించినప్పటి నుంచి, ముస్లిం దండయాత్రలతో అంతమయ్యే వరకు దక్షిణాదిన తెలుగునేలపై ఉజ్వలంగా వెలిగిన కాకతీయ సామ్రాజ్య వైభవంపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. నాటి పాలనా విధానం, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులు, పాలకుల వరుసక్రమం, వారి ప్రత్యేకతలు, రుద్రమదేవి విశిష్టతతో పాటు సరిహద్దు రాజ్యాలు, సమకాలీన రాజుల గురించి తెలుసుకోవాలి.


1.   తెలుగులో మొదటి పద్య కావ్యం?

1) మహాభారతం      2) మహాభాగవతం   3) రామాయణం    4) పైవన్నీ 



2.   కిందివాటిని జతపరచండి.

 ఎ)  విద్యానాథుడు 1) ప్రతాపరుద్ర యశోభూషణం
బి)వల్లభాచార్యుడు 2) క్రీడాభిరామం
సి) ఏకామ్రనాథుడు 3) ప్రతాపరుద్ర చరిత్ర
డి) జయప సేనాని 4)నృత్త రత్నావళి
1)ఎ-1, బి-2, సి-3, డి-4 

2) ఎ-3, బి-2, సి-1, డి-4 

3) ఎ-1, బి-2, సి-4, డి-3

4)  ఎ-3, బి-4, సి-2, డి-1



3.  శాసనాలు, సాహితీ ఆధారాల ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడు?

1)  రుద్రదేవుడు    2) గణపతిదేవుడు  

3) దుర్జయ    4) మొదటి ప్రతాపరుద్రుడు



4. ఎవరిని ఆంధ్రరాజులుగా కీర్తిస్తారు?

1)  శాతవాహనులు    2) విజయనగర రాజులు  

3) చాళుక్యులు     4) కాకతీయులు



5.  కాకతీయులు మొదటగా నిర్వహించిన ఉద్యోగం?

1) సైనికులు      2) సైన్యాధ్యక్షులు    3) రట్టడి      4)రాజులు



6. కాకతీయులు ఎవరి తర్వాత రాజ్యస్థాపన చేశారు?

1) తూర్పు చాళుక్యులు   2) పశ్చిమ చాళుక్యులు  

3) కళ్యాణ చాళుక్యులు   4) పైవారందరూ



7. రుద్రదేవుడి పాలనా కాలం?

1) 1158-1195       2) 1158-1199  

3) 1199-1262      4) 1262-1289



8. హనుమకొండ నుంచి రాజధాని మార్చినవారు?

1) రుద్రదేవుడు      2) రుద్రమదేవి  

3) గణపతిదేవుడు      4) పై అందరూ



9. హనుమకొండలో వేయి స్తంభాల గుడి నిర్మించినవారు?

1) రుద్రదేవుడు     2) గణపతి దేవుడు

3) రుద్రమదేవి     4) మహాదేవుడు



10. వరంగల్‌ కోట లోపల మొదటిగా ఉన్న వృత్తి పనివారు?

1) నేత      2)బుట్టలు అల్లేవారు  

3) స్వర్ణకారులు    4) పై అందరూ 



11. కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ)  రుద్రదేవుడు కోటను వ్యవసాయ భూములు, చెరువులకు రక్షణగా నిర్మించాడు.

బి) రాజధాని ఇరువైపులా అంతఃపుర భవనాలు ఉన్నాయి.

సి) రాజధాని నగరానికి నాలుగు ద్వారాలున్నాయి.

డి) రాజధాని మధ్య భాగంలో స్వయం భూదేవాలయం నిర్మించలేదు.

1) ఎ, సి     2) సి, డి    3) బి, సి   4) బి, డి



12. వరంగల్‌ నగరాన్ని ఎలా విభజించారు?

1) గ్రామాలు   2) మండలాలు    3) వాడలు    4) పైవన్నీ



13. రుద్రమదేవి పాలనా కాలం?

1) 1272-1289      2) 1252-1289  

3) 1262-1289    4) 1265-1289



14. రుద్రమదేవి గుణగణాల గురించి తెలుసుకోవడానికి ఆధారమైన ‘ప్రయాణకుని కరదీపిక’ను రాసినవారు?

1) ప్లీని   2) డోమింగో   3) మార్కోపోలో   4) మాజిలాన్‌ 



15. శాసనాల్లో రుద్రదేవ మహారాజుగా ఎవరిని  కీర్తించారు?

1) రుద్రదేవుడు   2) రెండో ప్రతాపరుద్రుడు  

3) రుద్రమదేవి   4) గణపతి దేవుడు



16. రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా కీర్తించినవారు?    

1) తమ్మయ్య    2) బొల్లి నాయకుడు  

3) మైలాంబ   4) ఎవరూ కాదు



17. కాకతీయుల కాలంలో ‘నాయంకరులుగా’ వేటిని పిలిచారు?

1) పెద్ద చెరువులు    2) గ్రామాలు  3) దేవాలయాలు    4) సామంత రాజులు



18. ‘నాయక’ అంటే?

1) సైనిక హోదా   2) యజమాని హోదా

3) మంత్రి హోదా   4) సామంత హోదా



19. ‘నాయకులకు’ సంబంధం లేనిది?

1) వీరు గ్రామాల్లో పన్ను వసూలు చేసేవారు.

2) సైన్యాన్ని పోషించి రాజుకు యుద్ధంలో సహాయపడాలి.

3) రాజుకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాట్లలో ఈ నాయకులు పాల్గొనేవారు కాదు.

4) రాజు విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో ఉంటారు.



20. 1270 సంక్రాంతి పర్వదినాన బొల్లినాయకుడు దానం ఇచ్చిన భూమి ఏ ప్రాంతంలోనిది?

1) వరంగల్‌   2) హనుమకొండ  3) చెందుప్పట్ల   4) క్రంజ గ్రామం 



21. వ్యవసాయ, దేవాలయ అభివృద్ధికి భూములు దానం చేసినవారు?    

1) ముప్పమాంబ   2) మైలాంబ   3) 1, 2    4) నరసరాయ



22. మోటుపల్లి అభయ శాసనాలు వేయించిన రాజు?

1) రుద్రదేవుడు   2) గణపతి దేవుడు      

3) రుద్రదేవ మహారాజు   4) రెండో ప్రతాపరుద్రుడు  



23. చెందుప్పట్ల శాసనం వేయించినవారు?

1) రుద్రమదేవి    2) పూల ముమ్మడి  

3) రుద్రదేవుడు   4) మహాదేవుడు



24. దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తానులు దాడి చేసిన సంవత్సరం?

1)1323   2) 1324   3) 1232   4) 1132



25. దక్షిణ భారతదేశంపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్‌?

1) ఇల్‌-టుట్‌-మిష్‌    2) ఐబక్‌  

3)  అల్లావుద్దీన్‌ ఖిల్జీ   4) మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌



26. పల్నాటి వీరుల చరిత్రను రాసినవారు?

1) శ్రీనాథుడు    2) నన్నయ  

3)  వల్లభాచార్య   4) తిక్కన



27. కాకతీయుల కాలం నాటి బంగారు నాణెం?

1) బిసాంత్‌   2) పాగా   3)  శ్రీ అహిత గజకేసరి   4) నిష్కము



28. యుద్ధవీరులకు కులంతో పనిలేదు అన్నవారు?

1) శ్రీనాథుడు    2) వినుకొండ వల్లభాచార్య   

3)  బాలచంద్రుడు    4) అన్నమయ్య



29. కాకతీయుల కాలంలో మోటుపల్లి రేవును సందర్శించింది ఎవరు?

1) మార్కోపోలో   2) మాజిలాన్‌   3)  న్యూనిజ్‌   4) పై అందరూ



30.  మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశం?

1) యాదవులు    2) హోయసాల   3) శాతవాహన   4) 1, 2



31. కిందివాటిని వరుసక్రమంలో అమర్చండి.

1) రుద్రదేవుడు   2) ప్రోలరాజు    3)  గణపతి దేవుడు    4) ప్రతాపరుద్రుడు

1) 1, 2, 3, 4    2) 2, 1, 3, 4    3) 4, 3, 2, 1   4) 3, 1, 2, 4



32. కళ్యాణి చాళుక్యుల రాజధాని ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ట్ర్రంలోని ఏ జిల్లాలో ఉంది?

1) బీదర్‌    2) బీరార్‌   3) పాలక్కడ్‌   4) పాల్వంచ



33. విక్రమాంక దేవ చరితంను రచించింది?

1) రన్న    2) పొన్న   3) బిల్హణ     4) కల్హ



34. చాళుక్యుల కాలంనాటి విద్యాలయాలను ఏమంటారు?

1) ఆరామం   2) మఠం   3) ఘటికలు   4)  పైవన్నీ



35. యాదవుల రాజధాని?

1) దేవగిరి   2) బీదర్‌   3) బీరార్‌   4) దేవదార్‌



36. యాదవుల్లో గొప్పరాజు?

1) బిల్లలుడు    2) బిల్లముడు   3) సింఘన   4) జైతంగి



37. హోయసాల రాజధాని నగరం?

1) దేవగిరి   2) ద్వారసముద్రం    3) కనగనహల్లి      4) నాసిక్‌



38. పాండ్యుల రాజధాని నగరం?    

1) మధుర    2) మధురై    3)  మరాఠి   4) మంగళగిరి



39. పాండ్యులలో గొప్పరాజు?

1) వెంకటపతిరాజు    2) కులశేఖరుడు   

3) నాలుగో వీరపాండ్య     4)సుందరపాండ్య



40. చరిత్రకారుల ప్రకారం కాకతీయులు ఏ ప్రాంతానికి చెందినవారు?

1) కాంచీపురం    2) కాకతిపురం   

3) కుంద గ్రామం   4) పైవన్నీ



41. కాకతీయ వంశంలో చివరివాడు?

1) రెండో ప్రోలరాజు   2) రెండో ప్రతాపరుద్రుడు 

3) రెండో బేతరాజు   4) రుద్రదేవుడు



42. కాకతీయ వంశంలో మొదటి స్వతంత్ర పాలకుడు?

1) రెండో ప్రోలరాజు   2) గుండ్యన   3) రెండో బేతరాజు    4) రుద్రదేవుడు



43. 63 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు?

1) రెండో ప్రోలరాజు    2) రుద్రదేవుడు   3) గణపతి దేవుడు   4) రుద్రమదేవి



44. మహామండలేశ్వర అనే బిరుదు పొందిన కాకతీయ రాజు?

1) రెండో ప్రోలరాజు   2) రుద్రదేవుడు  3) గణపతి దేవుడు   4) బేతరాజు



45. రుద్రమదేవి భర్త పేరు?

1) వీరభద్రుడు    2) అంబదేవుడు   

3) రెండో ప్రోలరాజు    4) బొల్లినాయకుడు



46. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో నాయకులు ఎంతమంది?

1) 71     2) 72    3) 81    4) 8



47. గ్రామ రికార్డులను భద్రపరిచే వ్యక్తి?

1) తలారి   2) కరణం  3) రట్టడి   4) అర్ధసిరి



48. నాయంకరులు అంటే?

1) అధికారులు   2) గ్రామాలు   3) రాజ్యం   4) పైవన్నీ



49. గీతరత్నావళి అనే గ్రంథం రచించింది?

1) రుద్రదేవుడు   2) నన్నయ   3) సోమనాథుడు   4) జయప సేనాని 



50. కాకతీయుల కాలంలో రాచపొలం చేసేవారిని ఏమంటారు?

1) సిరి   2) అర్ధసిరి   3) నాయకుడు   4) సేనాని



51. పల్నాటివీరుల చరిత్ర అనే గ్రంథం రచించింది?

1) వల్లభరాముడు   2) తిక్కన   3) శ్రీనాథుడు    4) విద్యానాథుడు



52. రుద్రేశ్వర ఆలయంగా పిలిచే దేవాలయం?

1) వేయిస్తంభాల గుడి       2) రామప్ప ఆలయం   

3) స్వయంభూ శివాలయం    4) ద్రాక్షారామం

సమాధానాలు
 

1-1; 2-1; 3-3; 4-4; 5-3; 6-2; 7-1; 8-1; 9-1; 10-2; 11-1; 12-3; 13-3; 14-3; 15-3; 16-2; 17-2; 18-1; 19-3; 20-4; 21-3; 22-2; 23-2; 24-1; 25-4; 26-1; 27-3; 28-3; 29-1; 30-4; 31-2; 32-1; 33-3; 34-3; 35-1; 36-3; 37-2; 38-2; 39-2; 40-2; 41-2; 42-1; 43-3; 44-3; 45-1; 46-2; 47-2; 48-2; 49-4; 50-2; 51-3; 52-1.

Posted Date : 15-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌