• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - జనాభా

ఆ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు లేరు!


దేశ జనాభా పరిమాణంలో, విస్తరణ తీరులో తరచూ మార్పులు జరుగుతుంటాయి. వాటిని నిర్ణీత కాలపరిమితుల్లో అధ్యయనం చేసి, సరైన సామాజిక, ఆర్థిక విధానాలను రూపొందించుకుంటే అభివృద్ధికి దోహదపడతాయి. ఈ క్రమంలో ప్రాంతాలు, వర్గాల వారీగా జనాభా, అక్షరాస్యత, లింగనిష్పత్తి, జనసాంద్రత తదితర అంశాలను పోటీ పరీక్షార్థులు గణాంకాలతో సహా తెలుసుకోవాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా వృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవాలి. 


1.  
 2011 జనాభా లెక్కల ప్రకారం జైనుల అక్షరాస్యత శాతం?

1) 72 శాతం       2) 94 శాతం   

3) 80 శాతం           4) 65 శాతం


2.     2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం?

1) కేరళ      2) గోవా   

3) కర్ణాటక       4) బిహార్‌


3.     2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం?

1) గోవా        2) ఉత్తరాఖండ్‌     

3) మిజోరాం          4) ఉత్తరప్రదేశ్‌


4.     2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి అతి తక్కువ ఉన్న మతం?    

1)  జైన     2) సిక్కు 

3) బౌద్ధ      4) క్రైస్తవ


5.     1901 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి ఎంత?

1) 972   2) 973     3) 974       4) 975


6.     2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రెండో రాష్ట్రం?

1) బిహార్‌          2) పశ్చిమ బెంగాల్‌     

3) సిక్కిం          4) ఉత్తర్‌ప్రదేశ్‌


7. 2011 జనాభా లెక్కల ప్రకారం దిల్లీ జనసాంద్రత ఎంత? 

1) 10,001       2) 11,001   

3) 10,320       4) 11,320


8.     2011 జనాభా లెక్కల ప్రకారం రెండో అత్యల్ప జనసాంద్రత ఉన్న సాంబా (జమ్ము-కశ్మీర్‌) జిల్లా జనసాంద్రత?

1) 1            2) 2            3) 3              4) 4


9.     2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో స్త్రీ, పురుష నిష్పత్తి?

1) 1037     2) 1107      3) 1137      4) 1050 


10. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఉన్న జిల్లా మాహెలో లింగ నిష్పత్తి? 

1) 1142     2) 1107      3) 1146      4) 1176


11. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రెండో రాష్ట్రం?

1) మహారాష్ట్ర         2) మధ్యప్రదేశ్‌      

3) బిహార్‌         4) గోవా


12. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం?

1) గోవా          2) సిక్కిం     

3)  మిజోరాం         4) కేరళ  


13. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?

1) చండీగఢ్‌        2) పుదుచ్చేరి   

3) దిల్లీ         4) లద్దాఖ్‌


14. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలుర జనాభా ఎంత?

1) 6.78 కోట్లు         2) 8.57 కోట్లు     

3) 7.87 కోట్లు        4) 9.07 కోట్లు


15. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో బాల బాలికల జనాభా?    

1) 14.13 కోట్లు      2) 13.12 కోట్లు  

3) 12.13 కోట్లు      4) 14.15 కోట్లు


16. 2001 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా ఎంత?

1)  16.47 కోట్లు         2) 16.38 కోట్లు           

3) 16.45 కోట్లు        4) 16.77 కోట్లు


17. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం?    

1)  బిహార్‌         2) మేఘాలయ    

3) కేరళ        4) సిక్కిం


18. 2011 జనాభా లెక్కల ప్రకారం బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువగా ఉన్న రాష్ట్రం?

1)  సిక్కిం        2) కేరళ   

3)  గోవా       4) తమిళనాడు


19. బాలబాలికల జనాభా శాతం పరంగా తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం (2011 జనాభా లెక్కలు)?

1) లక్షదీవులు         2) పుదుచ్చేరి     

3) దిల్లీ         4) చండీగఢ్‌


20. పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం (2011 జనాభా లెక్కలు) ఏది?

1) పుదుచ్చేరి            2) అండమాన్‌ నికోబార్‌ దీవులు  

3) లక్షదీవులు      4) చండీగఢ్‌


21. పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం (2011 జనాభా లెక్కలు) ఏది?

1) చండీగఢ్‌       2) దిల్లీ      

3) పుదుచ్చేరి         4)  లక్షదీవులు


22. పట్టణాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం (2011 జనాభా లెక్కలు) ఏది?

1)  హరియాణా        2) కేరళ     

3) ఛత్తీస్‌గఢ్‌        4)  బిహార్‌


23. గ్రామాల్లో పిల్లల లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం (2011 జనాభా లెక్కలు) ఏది?

1)  కేరళ         2) హరియాణా     

3) ఛత్తీస్‌గఢ్‌        4) గోవా


24. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ మహిళల అక్షరాస్యత జనాభా?

1) 20.14 కోట్లు        2) 20.24 కోట్లు    

3) 20.17 కోట్లు          4) 20.11 కోట్లు


25. 2011 జనాభా ప్రకారం పట్టణాల్లో మహిళల అక్షరాస్యత శాతం?

1) 79.1 శాతం         2) 84 శాతం    

3) 73 శాతం          4) 64 శాతం


26. భారతదేశంలో చివరిసారిగా ఏ సంవత్సరంలో కులాలవారీగా జనాభాను లెక్కించారు?

1)  1961     2) 1971      3) 1981     4) 1931


27. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు అధికంగా ఉన్న రెండో రాష్ట్రం?

1)  బిహార్‌       2) పశ్చిమ బెంగాల్‌     

3) ఆంధ్రప్రదేశ్‌       4) ఉత్తర్‌ప్రదేశ్‌


28. ఎస్సీలు లేని రాష్ట్రం ఏది?

1) బిహార్‌         2) అస్సాం    

3)  నాగాలాండ్‌          4) మిజోరాం


29. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం? 

1) హరియాణా       2) హిమాచల్‌ ప్రదేశ్‌   

3) పంజాబ్‌         4) ఉత్తర్‌ప్రదేశ్‌


30. ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) చండీగఢ్‌        2) పుదుచ్చేరి    

3) దిల్లీ         4) లక్షదీవులు


31. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం?    

1) లక్షదీవులు         2) చండీగఢ్‌      

3) దిల్లీ          4) పుదుచ్చేరి


32. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా   అధికంగా ఉన్న రెండో రాష్ట్రం?

1) మధ్యప్రదేశ్‌         2) ఒడిశా     

3) గుజరాత్‌         4) మహారాష్ట్ర


33. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం?

1) త్రిపుర        2) గోవా      

3) మిజోరాం        4) కేరళ


34. ఎస్టీ జనాభా లేని రాష్ట్రం ఏది?

1) పంజాబ్‌        2) గోవా      

3) కేరళ         4) రాజస్థాన్‌


35. ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) అండమాన్‌ నికోబార్‌ దీవులు        2) లక్షదీవులు     

3) దిల్లీ        4) డామన్‌ డయ్యూ


36. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?

1) నాగాలాండ్‌        2) మిజోరాం   

3) కేరళ        4) మేఘాలయ


37. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?

1) చండీగఢ్‌        2) పుదుచ్చేరి      

3) డామన్‌ డయ్యూ          4) లక్షదీవులు


38. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా తక్కువ ఉన్న రెండో రాష్ట్రం ఏది?    

1) ఉత్తర్‌ప్రదేశ్‌        2) తమిళనాడు  

3) కేరళ        4) ఉత్తరాఖండ్‌


39. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని ఎస్టీ జనాభా ఎంత?

1)  20.14 కోట్లు       2) 10.14 కోట్లు    

3) 10.43 కోట్లు         4) 20.43 కోట్లు


40. భారతదేశంలోని మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతం ఎంత? 

1)  8.2 శాతం      2) 8.6 శాతం   

3) 9.2 శాతం         4) 9.6 శాతం


41. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ పురుషుల జనాభా?

1) 5.24 కోట్లు        2) 5.50 కోట్లు       

3) 4.36 కోట్లు        4) 5.19 కోట్లు


42. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ మహిళల జనాభా?

1)  10.35 కోట్లు      2) 9.79 కోట్లు      

3) 10.45 కోట్లు       4) 9.45 కోట్లు


43. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా?

1)  20.14 కోట్లు       2) 16.14 కోట్లు       

3) 17.24 కోట్లు        4) 16.20 కోట్లు


44. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ పురుషుల జనాభా?

1)  10.11 కోట్లు       2) 18.14 కోట్లు      

3) 10.35 కోట్లు         4) 10.17 కోట్లు


45. కిందివాటిలో ఎస్సీలు లేని కేంద్రపాలిత ప్రాంతం?

1) చండీగఢ్‌       2) దిల్లీ    

3) అండమాన్‌ నికోబార్‌ దీవులు         4) డామన్‌ డయ్యూ


46. 2011 జనాభా ప్రకారం భారతదేశ జనాభాలో ఎస్సీ జనాభా శాతం?

1)  16.2 శాతం       2) 16.6 శాతం   

3) 15.9 శాతం        4) 17.4 శాతం


47. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎస్సీ జనాభా?

1)  16.66  కోట్లు      2) 19.46  కోట్లు     

3) 20.14 కోట్లు        4) 19.50 కోట్లు


48. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాల్లో ఎస్సీ జనాభా శాతం?

1)  18.90 శాతం     2) 12.6 శాతం     

3) 18.5 శాతం      4) 19.40 శాతం


49. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లో ఎస్సీ జనాభా శాతం?

1) 18.90 శాతం       2) 12.6 శాతం      

3) 19.50 శాతం      4) 18.5 శాతం


50. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల లింగ నిష్పత్తి?

1)  945           2)  935       

3) 985            4) 1020



సమాధానాలు


1-2, 2-4; 3-3; 4-2; 5-1; 6-2; 7-4; 8-2; 9-1; 10-4; 11-3; 12-2; 13-3; 14-2; 15-3; 16-2; 17-2; 18-3; 19-2; 20-2; 21-2; 22-3; 23-3; 24-1; 25-1; 26-4; 27-2; 28-3; 29-3; 30-4; 31-2; 32-4; 33-2; 34-1; 35-3; 36-2; 37-4; 38-2; 39-3; 40-2; 41-1,42-2; 43-1; 44-3; 45-3; 46-2; 47-1; 48-3; 49-2; 50-1.



రచయిత: బండ్ల శ్రీధర్‌ 
 

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌