• facebook
  • whatsapp
  • telegram

రేఖీయ సమీకరణాలు

సరళరేఖ సంబంధాలకు సరైన వ్యక్తీకరణ!


ఒక వాహనం ప్రయాణించిన దూరం, దాని వేగానికి, కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వచ్చిన ఆదాయం నుంచి వ్యయాన్ని తీసేస్తే మిగులు లేదా లోటు వస్తుంది. గణితంలో ఈ అంశాలను ఒక సమీకరణ రూపంలో తెలియజేయవచ్చు. చరరాశుల మధ్య ఉండే సరళరేఖ సంబంధాలను సూచించే బీజగణిత వ్యక్తీకరణలను రేఖీయ సమీకరణాలు అంటారు. ఇంజినీరింగ్, సైన్స్, ఫైనాన్స్‌ తదితర రంగాల్లో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడతాయి. సంబంధిత మౌలికాంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వాటితోపాటు వివిధ రేఖీయ సమీకరణాల నిర్వచనాలను అర్థం చేసుకోవాలి. 


* చరరాశుల గరిష్ఠ ఘాతం ‘1’గా ఉన్న సమీకరణాన్ని రేఖీయ సమీకరణం అంటారు.


   ఉదా: x + y + z = 10


* ఒక రేఖీయ సమీకరణంలో ఒకే ఒక చరరాశి ఉంటే, ఆ సమీకరణాన్ని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం లేదా సామాన్య సమీకరణం అంటారు.


   ఉదా: x + 5 = 10


* సమానత్వపు (=) గుర్తు ఉండే అనిశ్చిత వాక్యాన్ని సమీకరణం అంటారు.


   ఉదా: x + y = 9


* సమీకరణాన్ని సత్యం చేయడానికి చరరాశికి బదులు ఏ విలువను ప్రతిక్షేపిస్తామో ఆ విలువను ఆ సమీకరణం యొక్క మూలం అంటారు. ఇలా చరరాశి విలువను కనుక్కోవడాన్ని సమీకరణ సాధన అంటారు.


* ఒక సమీకరణంలోని చరరాశులకు ఏ వాస్తవ విలువను ఇచ్చినా అది సత్య వాక్యమైతే ఆ సమీకరణాన్ని సర్వసమీకరణం అంటారు


   ఉదా: (a + b)2 = a2 + b2 + 2ab


* సత్యం లేదా అసత్యమని నిర్ణయించడానికి వీలయ్యే వాక్యాలను ప్రవచనాలు అంటారు. సత్యం లేదా అసత్యమని చెప్పడానికి వీల్లేని వాక్యాలను అనిశ్చిత వాక్యాలు అంటారు.


అసమీకరణాలు


* సమాసాలను జి లేదా చీ లతో కలిపితే, వాటిని అసమీకరణాలు అంటారు.


* రెండు రాశుల మొత్తం భేదం ఇచ్చినప్పుడు  

* అయిదు వరుస గుణిజాల మొత్తాన్ని, 5తో భాగిస్తే మధ్యరాశి వస్తుంది.

* ఒక రేఖీయ సమీకరణంలో రెండు చరరాశులు ఉంటే దాన్ని రెండు చర రాశుల్లో రేఖీయ సమీకరణం అంటారు.


   ఉదా: 4x + 2y = 100

* ఒక రేఖీయ సమీకరణాన్ని మరొక రేఖీయ సమీకరణంతో జత చేస్తే అలాంటి సమీకరణాల జతను సమీకరణాల వ్యవస్థ అంటారు. ఇవి   ప్రధానంగా మూడు రకాలు.


సమన్విత సమీకరణాలు 

*  రెండు చరరాశుల్లో రెండు సమన్విత సమీకరణాలు ఉంటే, వాటి సాధన ఏకైకం. ఏకైక సాధన ఉండాలంటే ఎన్ని చరరాశులు ఉంటే అన్ని సమీకరణాలు ఉండాలి. అప్పుడే ఏకైక సాధన ఉంటుంది.  


పరస్పర ఆధార సమీకరణాలు 

* ఏదైనా ఒక సమీకరణాన్ని ఒక స్థిర సంఖ్యతో గుణించగా వచ్చే సమీకరణం, దత్త సమీకరణం పరస్పర ఆధార వ్యవస్థకు చెందుతాయి. పరస్పర ఆధార సమీకరణాలకు అనంత సాధనలు ఉంటాయి.


అసంగత సమీకరణాలు 


* సాధన లేని సమీకరణాలను అసంగత సమీకరణాలు అంటారు. రెండు సమీకరణాల్లో చరరాశుల గుణకాలు ఒకే నిష్పత్తిలో మారి, స్థిరపదం వేరే నిష్పత్తిలో ఉంటే ఆ సమీకరణాలకు సాధన ఉండదు. 


మాదిరి ప్రశ్నలు 


1.  మిథున్‌ పుట్టినప్పుడు అతడి తల్లి వయసు 29 సంవత్సరాలు. ఈ దత్తాంశానికి సరిపోయే సమీకరణాన్ని రాయండి. 

1) y = 29   2) x = y + 29

3) x + y = 29     4) పైవన్నీ 


2.  2x + 3y = 5; 6x + 9y = 10 అనే సమీకరణ వ్యవస్థకు ఎన్ని సాధనలు ఉంటాయి?

1) 2    2) 5    3) అనంతం    4) సాధనలు ఉండవు


3. 8x + 5y = 9, 3x + 2y = 4 సమీకరణ  వ్యవస్థను సాధించండి.

1) x = 2, y = 5     2) x = −2, y = −5

3) x = −2, y = 5    4) x = 5, y = −2


4.  x + y = 6, x − y = 4  సమీకరణ వ్యవస్థకు ఎన్ని సాధనలు ఉంటాయి?

1) సున్నా    2) 1    3) అనంతం    4) సాధన ఉండదు


5. 3x − 5y = 2, 4x + ky = 5  అనే సమీకరణ వ్యవస్థకు ఒకే ఒక సాధన ఉంటే k విలువ దేనికి సమానం కాకూడదు?

6.    14 ను సాధించండి. 


 

7. 8x + 4 = 3(x − 1) + 7 8x + 4 = 3(x − 1) + 7 ను సాధించండి.     

1) x = 1   2) x = −1   3) x = 0   4) x = 2


8.    సాధించండి. 


9.    ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల భేదం 3. అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 143 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత?

1) 85    2) 69     3) 47    4) 36


10. లత ఒక సంఖ్యను తలచుకుని దాని నుంచి  5/2 ను తీసివేసి, వచ్చిన ఫలితాన్ని 8తో గుణించింది. వచ్చిన ఫలితం తాను తలచుకున్న సంఖ్యకు 3 రెట్లు అయితే ఆ సంఖ్య ఏది?

1) 24    2) 12     3) 36     4) 18


11. 15(y − 4) − 2(y − 9) + 5(y + 6) = 0 ను సాధించండి.


12. ఒక అకరణీయ సంఖ్య యొక్క హారం దాని లవం కంటే 8 ఎక్కువ. లవాన్ని 17 ఎక్కువ చేసి  హారాన్ని 1 తగ్గిస్తే వచ్చే సంఖ్య 3/2 అయితే ఆ అకరణీయ సంఖ్య ఎంత?


13. శ్రీకళ, వాణిల వయసులు 5 : 7 నిష్పత్తిలో ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3 : 4. అయితే వారి ప్రస్తుత వయసులు ఎంత?

1) 20, 26    2) 20, 28    3) 18, 28    4) 22, 28


14. తాత వయసు మనవరాలి వయసుకు 10 రెట్లు. అతడు ఆమె కంటే 54 ఏళ్లు పెద్దవాడు. అయితే  మనవరాలి వయసు ఎంత?

1) 6 సంవత్సరాలు     2) 4 సంవత్సరాలు 

3) 8 సంవత్సరాలు     4) 10 సంవత్సరాలు


15. అమన్‌ వయసు అతడి కొడుకు వయసుకు 3 రెట్లు. 10 సంవత్సరాల కిందట అతడి వయసుకు 5 రెట్లు. అయితే అమన్‌కు ఎన్నేళ్లు?

1) 20 సంవత్సరాలు     2) 40 సంవత్సరాలు

3) 50 సంవత్సరాలు     4) 60 సంవత్సరాలు


16. జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి,  3/4 వ వంతు ఆడుకుంటున్నాయి. మిగిలిన 9  కొలనులో నీరు తాగుతున్నాయి. అయితే గుంపులోని మొత్తం జింకలు ఎన్ని?

1) 68     2) 70     3) 72     4) 74


17. ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9. అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కంటే 27 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఏది?

1) 36     2) 63     3) 72     4) 27


18. ఒక రెండంకెల సంఖ్యలోని ఒక అంకె మరొక అంకెకు మూడు రెట్లు. ఈ రెండంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 88 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది?

1) 26     2) 62     3) 48    4) 1, 2


19. ఒకసంఖ్య నుంచి 1/2 ను తీసివేసి, ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది?


20. 8 యొక్క మూడు వరుస గుణిజాల మొత్తం 888. అయితే వాటిలో పెద్దసంఖ్య?

1) 288    2) 296   3) 304    4) 312


21. ఒక అకరణీయ సంఖ్యను 5/2 తో గుణించి, ఆ  లబ్ధానికి 2/3 ని కూడితే  -7/12 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఏది?



22. బ్యాంక్‌ క్యాషియర్‌ హరిత వద్ద రూ.100, రూ.50, రూ.10 విలువ గల నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల నిష్పత్తి 2 : 3 : 5. హరిత వద్ద ఉన్న మొత్తం సొమ్ము రూ.4,00,000 అయితే ఆమె దగ్గర  రూ.10 నోట్లు ఎన్ని ఉన్నాయి?

1) 50    2) 500    3) 5000   4) 5


23. కవిత వద్ద రూ.300 సొమ్ము ఉంది. ఆ సొమ్ము రూ.1, రూ.2, రూ.5 నాణేల రూపంలో ఉంది. రూ.2 నాణేల సంఖ్య రూ.5 నాణేల సంఖ్యకు మూడు రెట్లు. మొత్తం నాణేల సంఖ్య 160. అయితే రూ.2 ఉన్న నాణేల సంఖ్య ఎంత?

1) 60     2) 30    3) 80    4) 40

24. 3/7 రావడానికి అకరణీయ సంఖ్య -7/3  యొక్క  రెట్టింపునకు ఎంత కలపాలి? 


25. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి రూ.100, గెలవని వారికి రూ.25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతుల కోసం పంచాల్సిన మొత్తం రూ.3,000. పోటీలో పాల్గొన్నవారు 63 మంది అయితే గెలిచిన వారి సంఖ్య ఎంత?

1) 44    2) 34    3) 29    4) 19


26. ఒక పరీక్షలో 180 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇస్తారు. సమాధానం రాయని, తప్పుగా రాసిన వాటికి ఒక మార్కు తగ్గిస్తారు. ఒక అభ్యర్థికి ఈ పరీక్షలో 450 మార్కులు వస్తే అతడు రాసిన సరైన సమాధానాలు ఎన్ని?

1) 126  2) 54  3) 116 4) 136


సమాధానాలు


1-2; 2-4; 3-3; 4-2; 5-1; 6-1; 7-3; 8-4; 9-1;  10-2; 11-3; 12-1; 13-2; 14-1; 15-4; 16-3; 17-1; 18-4; 19-1; 20-3; 21-2; 22-3; 23-1; 24-1; 25-4; 26-1. 

Posted Date : 05-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌