• facebook
  • whatsapp
  • telegram

కొత్త రాజ్యాలు - రాజులు

నిశుంభసూదిని నిర్మాత విజయాలయుడు!


మధ్యయుగంలో భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తరాదిన రాజపుత్రులు శక్తిమంతులుగా ఆవిర్భవించారు. దక్షిణాదిన పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు పెద్ద రాజ్యాలను స్థాపించారు. ముఖ్యంగా చోళ సామ్రాజ్యం ఆర్థికంగా, సాంస్కృతికంగా వైభవాన్ని సాధించింది. అయితే స్వదేశీ పాలకుల అనైక్యత కారణంగా ముస్లింల వరుస దాడులు ఫలించి భారతదేశంలో ఇస్లాం అధికార స్థాపన జరిగింది. ఈ పరిణామ క్రమం, పెనుమార్పులకు దారితీసిన నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆ సమయంలో దక్షిణాది రాజ్యాలు, పాలకులు, పాలకవంశాలు, రాజకీయ వ్యవస్థ, సాంఘిక, ఆర్థిక, మత జీవనం, సాహిత్యం, కళాపోషణ, వర్ణ వ్యవస్థ స్థితిగతులు, సంబంధిత చారిత్రక ఆధారాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

1.     క్రీ.శ. 7వ శతాబ్దంలో ఉన్న ప్రముఖులు?

1) భూస్వాములు        2) యుద్ధయోధులు    

3) 1, 2         4) సైనికులు


2.     భూస్వాములు, యోధులు తమను తాము ఎలా ప్రకటించుకునేవారు?

1) మహాసామంతులుగా      2) మహామండలేశ్వరులుగా 

3) సామంతులుగా        4) 1, 2


3.     రాష్ట్రకూట వంశ స్థాపకుడు?

1) హిరణ్యగర్భ      2) దంతిదుర్గుడు   

3) మయూర శర్మ       4) రాజేంద్ర వర్మ


4.     రాష్ట్రకూటులు ఎవరి సామంతులు?

1) పల్లవులు      2) చోళులు  

3) చాళుక్యులు      4) పాండ్యులు


5.     దంతిదుర్గుడు చేసిన యాగం?

1) రాజసూయ      2) అశ్వమేధ   

3) హిరణ్యగర్భ (బంగారు గర్భం)   4) వాజపేయ


6.     కిందివాటిలో సరికాని వాక్యాలు?

ఎ) దంతిదుర్గుడు యాగాన్ని బ్రాహ్మణుల సహకారంతో నిర్వహించలేదు.

బి) దంతిదుర్గుడు పుట్టుకతో క్షత్రియుడు కాదు.

సి) దంతిదుర్గుడు దక్షిణ భారతీయుడు.

డి) దంతిదుర్గుడు హిరణ్యగర్భ అనే క్రతువుతో మరణించి తిరిగి జన్మించాడు.

1) ఎ, బి   2) బి, సి   3) బి, డి   4) ఎ, డి


7.     కిందివాటిలో సరైన వాక్యాలు?

ఎ) కదంబ వంశానికి చెందినవాడు మయూర శర్మ.

బి) ప్రతీహార రాజు హరిశ్చంద్రుడు బ్రాహ్మణుడు.

సి) వీరిద్దరూ సాంప్రదాయ వృత్తిని వదిలి రాజ్య  స్థాపన చేశారు.

డి) వీరు కర్ణాటక, రాజస్థాన్‌లలో రాజ్యాలను స్థాపించారు

1) ఎ, బి  2) ఎ, బి, సి 3) ఎ, డి  4) పైవన్నీ 


8. కిందివాటిలో సరైనవి?

ఎ) శాసనాల్లో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు.

బి) ప్రశస్తుల్లో పాలకుల ఘనత ఉంటుంది.

సి) ప్రశస్తులను బ్రాహ్మణుల ద్వారా లిఖింపజేసేవారు.

డి) ఈ ప్రశస్తులను మధ్యయుగ కాలంలో అధికంగా లిఖించారు.

1) ఎ, బి, సి, డి         2) ఎ, సి     

3) ఎ, బి, సి         4) బి, సి, డి


9.     మధ్య యుగంలో బ్రాహ్మణులకు చేసే భూదానాలు వేటిపై నమోదు చేసేవారు?

1) రాతి పలకలు      2) రాగి రేకులు  

3) శాసనాలు       4) తాటాకులు


10. రాజతరంగిణి ఏ శతాబ్ద కాలం నాటిది?

1) 11వ   2) 12వ   3) 13వ   4) 14వ


11. కశ్మీర్‌ రాజుల చరిత్రను తెలిపే సంస్కృత పద్యం రాసింది ఎవరు?

1) విశాఖదత్తుడు        2) భక్త కన్నప్ప   3) కల్హణుడు        4) ఎవరూకాదు


12. మధ్యయుగంలో రాజుల బిరుదులు?

1) మహారాజాధిరాజ      2) త్రిభువన చక్రవర్తి  

3) రాజ మార్తాండ       4) 1, 2


13. మధ్యయుగంలో రాజు వీరితో పరిపాలనను   పంచుకునేవారు?

1) రైతు సంఘాలు       2) వ్యాపార సంఘాలు   

3) బ్రాహ్మణ సంఘాలు    4) పైవన్నీ


14. ప్రకటన (ఎ): మధ్యయుగంలో వ్యవసాయదారులు పన్నును అద్దెగా భావించి రాజుకు చెల్లించేవారు.

కారణం (ఆర్‌): వ్యవసాయదారుడు భూమిని రాజు నుంచి కౌలుకు తీసుకున్నందు వల్ల.

1) ఎకి ఆర్‌ సరైంది.       2) ఎకి ఆర్‌ సరికానిది. 

3) ఎ, ఆర్‌ లు విరుద్ధ అంశాలు.  4) ఎ, ఆర్‌ లు సరైన వాక్యాలు.


15. పన్ను ద్వారా వసూలైన నగదును రాజు ఏ విధంగా వాడేవారు?

ఎ) పరిపాలనకు      

బి) దేవాలయాల నిర్మాణానికి

సి) కోటల నిర్మాణానికి   

డి) యుద్ధాలు చేయడానికి

1) ఎ, బి, సి, డి       2) ఎ, బి, సి   

3) బి, సి, డి       4) బి, సి


16. కనౌజ్‌ అనే ప్రాంతం ఏ లోయలో ఉంది?

1) గంగా లోయ      2) సింధూ లోయ  

3) నర్మద లోయ       4) పైవన్నీ


17. కనౌజ్‌ ప్రాంతం కోసం యుద్ధంలో పాల్గొన్న రాజులు?

1) రాష్ట్రకూటులు       2) పాలవంశపు రాజు  

3) ప్రతిహారులు       4) పైవారంతా


18. కనౌజ్‌ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం?

1) ద్వంద్వ 2) త్రైపాక్షిక 3) సప్తవర్ష 4) చతుర్ముఖ


19. భారత్‌పై గజనీ ఏ సంవత్సరాల మధ్య దాడి చేశాడు?

1) 1997 - 1990      2) 990 - 1030   

3) 997 - 1030      4) 900 - 1030


20. గజనీ మహమ్మద్‌కి సంబంధించి సరైన వాక్యాలు?

ఎ) ఇతడు అఫ్గానిస్థాన్‌ ప్రాంతానికి చెందినవాడు.

బి) దాదాపు ఏటా భారత్‌పై దాడి చేశాడు.

సి) ఇతడి ప్రధాన దాడి సోమనాథ్‌ దేవాలయంపై జరిగింది.

డి) మన దేశ సంపదతో తన రాజధానిని వైభవంగా మలిచాడు.

1) ఎ, బి, సి, డి       2) సి, డి   

3) ఎ, బి, సి      4) ఎ, సి. డి


21. మహమ్మద్‌ గజనీతో భారత్‌కు వచ్చినవారు?

1) ఘోరి 2) ఐబక్‌ 3) అబూబకర్‌ 4) అల్‌బిరూనీ


22. అల్‌బిరూనీ రాసిన గ్రంథం?

1) బాబర్‌నామా      2) అక్బర్‌నామా  

3) కితాబ్‌ అల్‌ హింద్‌      4) ఐనీ అక్బరీ


23. ఢిల్లీ, అజ్మీర్‌ ప్రాంతాలను పాలించిన రాజు?

1) కల్హణుడు        2) మూడో పృథ్వీరాజ్‌   

3) దంతిదుర్గుడు         4) పైవారంతా


24. 1191లో భారత్‌పై దాడి చేసినవారు ఎవరు?

1) గజనీ  2) ఐబక్‌   3) ఘోరీ  4) పైవారంతా


25. భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం?

1) 712   2) 1191   3) 1192   4) 1206


26. ముత్తురాయర్‌ అనే వంశస్థులు ఎవరి సామంతులు?

1) చోళులు 2) పాండ్యులు 3) పల్లవులు 4) చాళుక్యులు


27. చోళ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?

1) విజయాలయ చోళుడు       2) కరికాళ చోళుడు  

3) రాజేంద్ర చోళుడు      4) రాజరాజ చోళుడు


28. తంజావూరు, నిశుంభసూదిని ఆలయాలు నిర్మించిన రాజు?

1) విజయాలయ చోళుడు     2) కరికాళ చోళుడు  

3) రాజేంద్ర చోళుడు 4) మొదటి పరాంతకుడు


29. మొదటి రాజరాజు ఎప్పుడు రాజు అయ్యాడు?

1) క్రీ.శ.985       2) క్రీ.శ.885   

3) క్రీ.శ.685       4) క్రీ.శ.785


30. మొదటి రాజేంద్రుడి బిరుదులు?

1) గంగై కొండచోళ       2) తీర నెపోలియన్‌  

3) దక్షిణ భారత నెపోలియన్‌  4) 1, 2, 3


31. నౌకాదళాన్ని అభివృద్ధి చేసిన చోళ వంశపు రాజు?

1) రాజరాజ చోళుడు       2) రాజేంద్ర చోళుడు  

3) విజయాలయ చోళుడు       4) పైవారంతా


32. గంగైకొండ చోళపురంలో దేవాలయాలు నిర్మించినవారు?

1) రాజరాజ      2) రాజేంద్ర చోళుడు   

3) విజయాలయ చోళుడు    4) కరికాళ చోళుడు


33. కిందివాటిలో భిన్నమైన వాక్యం-

1) చోళులు నిర్మించిన దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలు మాత్రమే.

2) పాలకులు సమర్పించిన భూములతో దేవాలయాలు సంపన్నంగా ఉండేవి.

3) దేవాలయాల పరిసర ప్రాంతాల్లో పూజారులు పూలదండలు అల్లేవారు, నివసించేవారు.

4) దేవాలయాల పరిసర ప్రాంతాల్లో సంగీత వాయిద్యకారులు నివసించేవారు.


34. చోళుల కాలంలో ప్రసిద్ధి చెందిన విగ్రహాలు?

1) రాతి   2) రాగి   3) కాంస్యం  4) బంగారం


35. కావేరి నది పరిసర ప్రాంతాలు ఏ పంటకు ప్రసిద్ధి?

1) గోధుమ  2) జొన్న  3) వరి   4) బార్లీ


36. వ్యవసాయ అభివృద్ధికి, వర్షపు నీటి నిల్వకు బావులు, కాలువలు, చెరువులు తవ్వించినవారు?

1) చాళుక్యులు    2) చోళులు    

3) పల్లవులు    4) పాండ్యులు


37. చోళుల కాలంలో అతి చిన్న పరిపాలన భాగం?

1) నాడు 2) వలనాడు 3) ఉర్‌ 4) గ్రామ సమితి


38. నాడుల పాలనా బాధ్యత చూసేవారు ఏ కులానికి చెందినవారు?

1) వెల్లాల 2) వెల్లూమ 3) 1, 2 4) వెల్లూరు


39. చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు ఇచ్చే బిరుదు/లు?

1) మువ్వేంద వేలన్‌    2) అరయ్యార్‌

3) మహాసామంత    4) 1, 2


40. కిందివాటిని జత చేయండి.

ఎ) వెల్లన్‌ వాగై      1) బ్రాహ్మణేతరుల భూమి

బి) బ్రహ్మదేయ      2)బ్రాహ్మణుల భూమి

సి) శాలభోగ        3) పాఠశాల భూమి

డి) పళ్లిచ్చంద       4) జైనమతస్థుల భూమి

1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-2, బి-3, సి-4, డి-1

3) ఎ-3, బి-4, సి-1, డి-2  4) ఎ-1, బి-2, సి-4, డి-3


41. ‘నగరం’ అనే వర్తక సంఘాలు పరిపాలనలో ఏ విధంగా పాలు పంచుకునేవి?

1) ఎల్లప్పుడూ    2) సందర్భానుసారంగా

3) పరిపాలనతో సంబంధం లేదు    4) కేవలం వర్తకం


42. చోళుల సభ నిర్వహణ గురించి తెలిపే శాసనం?

1) ఉత్తర మేరూర్‌     2) జునాగఢ్‌ 

3) చెంగల్పట్టు    4) పైవన్నీ


43. చోళుల కాలంలో సభకు ఎన్నిక కావడానికి అర్హతలు?

ఎ) పన్ను చెల్లించే భూమి ఉండాలి.

బి) 35 - 70 ఏళ్ల మధ్య ఉండాలి.

సి) వేదాలు తెలిసి ఉండాలి.

డి) నిజాయతీగా ఉండాలి.

1) ఎ, బి    2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి    4) బి, సి, డి


44. 12వ శతాబ్ద కాలం నాటి పెరియ పురాణంలో చెప్పిన కులం?

1) అదనూరు     2) పులయులు 

3) దళితులు      4)  వెల్లాల 


సమాధానాలు

1-3, 2-4, 3-2, 4-3, 5-3, 6-4, 7-4, 8-1, 9-2,  10-2,  11-3, 12-4, 13-4, 14-2, 15-1, 16-1,  17-4, 18-2, 19-3, 20-1,  21-4, 22-3, 23-2,  24-3, 25-3, 26-3, 27-1, 28-1, 29-1, 30-4,  31-2, 32-2, 33-1, 34-3, 35-3, 36-2, 37-3, 38-1, 39-4, 40-1, 41-2, 42-1, 43-3, 44-2. 

Posted Date : 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌