• facebook
  • whatsapp
  • telegram

భారతదేశం - భౌగోళిక స్వరూపాలు

మణిపుర్‌ కొండల్లో షిరుయ్‌ కలువలు!


పర్వతాలు, నదులు, మైదానాలు, పీఠభూమి, తీర ప్రాంతాలు తదితర భిన్న భౌగోళిక స్వరూపాలతో కూడిన విశాల దేశం భారత్‌. నవీన ముడుత పర్వతాలైన హిమాలయాలు దేశ ఉత్తర భాగంలో పొడవైన సహజ కోట గోడగా ఉండి అద్భుతమైన నైసర్గిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆహ్లాదాన్ని పంచే విడిది కేంద్రాలే కాదు, అతి ప్రమాదకరమైన లోయలు, కనుమలూ ఇక్కడ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పర్వతశ్రేణులు, ఎత్తయిన శిఖరాలు, ముఖ్యమైన కనుమలు, వాటి ప్రత్యేకతలు, కొండ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ జాతులు, జీవవైవిధ్య ప్రాంతాలు మొదలైన అంశాలపై అభ్యర్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. పీఠభూములు, మైదానాల్లో గుర్తించిన ఖనిజ సంపద, నేలల విస్తరణ తీరుతెన్నుల గురించి పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


1.    సీఎస్‌వో (సెంట్రల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌) అంచనాల ప్రకారం భారతదేశంలో అధికంగా విస్తరించినవి?

1) కొండలు      2) పర్వతాలు  

3) పీఠభూములు      4) మైదానాలు


2.  హిమాలయాల్లోని హిమాచల్‌ పర్వత శ్రేణి దాదాపుగా ఎన్నేళ్ల కిందట ఏర్పడింది?

1) 6.5 కోట్లు      2) 4.5 కోట్లు  

3) 1.4 కోట్లు     4) 3.2 కోట్లు


3.  కిందివాటిలో ఉత్తరాఖండ్‌లోని శిఖరాలను   గుర్తించండి.

ఎ) నందాదేవి      బి) నంగప్రభాత్‌  

సి) కామెట్‌      డి) అన్నపూర్ణ

1) ఎ, బి  2) బి,  సి  3) ఎ, సి  4) ఎ, డి


4. కిందివాటిలో సరాసరి 1.4 కోట్ల ఏళ్ల కిందట    ఏర్పడిన హిమాలయాలు?

1) హిమాద్రి  2) హిమాచల్‌  

3) శివాలిక్‌  4) ట్రాన్స్‌


5.ఆంగ్లేయులు మన దేశంలో మొదటిసారిగా భారత సర్వేక్షణ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1867  2) 1767  

3) 1917  4) 1837


6. కె-2 శిఖరానికి అత్యంత సమీపంలోని కనుమ ఏది?

1) ఖుంజెరబ్‌ కనుమ  2) ఆఘిల్‌ కనుమ

3) కారాకోరం కనుమ  4) సియాలా కనుమ


7. జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌లను వేరు చేస్తున్న  పర్వతాలు ఏవి?

1) లద్దాఖ్‌ పర్వతాలు  2) హిమాద్రి పర్వతాలు

3) హిమాచల్‌ పర్వతాలు 4) జస్కర్‌ పర్వతాలు


8. కిందివాటిలో ఉత్తరాఖండ్‌లోని పర్వత శ్రేణిని  గుర్తించండి.

1) పీర్‌ పంజాల్‌      2) మహభారత్‌ 

3) దౌలధార  4) నాగతిబ


9. చంబ లోయ ఏ పర్వతాల శ్రేణికి మధ్యలో ఉంది?

ఎ) పీర్‌ పంజాల్‌      బి) దౌలధార      

సి) కారాకోరం  డి) లద్దాఖ్‌

1) ఎ, బి  2) బి, సి   3) ఎ, సి  4) ఎ, డి


10. ఖజ్జియార్‌ వేసవి విడిది ప్రాంతం ఏ పర్వత శ్రేణిలో ఉంది?

1) పీర్‌ పంజాల్‌   2) దౌలదార  

3) లద్దాఖ్‌  4) కారాకోరం


11. థింపు లోయ ఏ పర్వతాల మధ్య విస్తరించి ఉంది?

ఎ) హిమాచల్‌       బి) హిమాద్రి  

సి) నలుపు పర్వతాలు  డి) శివాలిక్‌

1) ఎ, బి  2) బి, సి   3) సి, డి  4) ఎ, డి


12. డూన్స్‌ ఏ పర్వత సమూహాల మధ్య విస్తరించి ఉంటాయి?

ఎ) హిమాద్రి  బి) హిమాచల్‌  

సి) శివాలిక్‌  డి) ట్రాన్స్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) ఎ, డి


13. కుమవాన్‌ హిమాలయాలు ఏ నదుల మధ్య  విస్తరించి ఉంటాయి?    

ఎ) సింధు  బి) సట్లెజ్‌   

సి) కాళీ   డి) తీస్తా

1) ఎ, బి   2) ఎ, డి   3) బి, సి   4) ఎ, సి


14. ఉదంపుర్‌ డూన్‌ ఏ ప్రాంతంలో ఉంది?

1) జమ్ము-కశ్మీర్‌      2) హిమాచల్‌ ప్రదేశ్‌  

3) ఉత్తరాఖండ్‌      4) సిక్కిం


15. దెహ్రాదూన్‌ ఏ పర్వత శ్రేణుల పాదాల వద్ద ఉంది?

1) దౌలధార  2) పీర్‌ పంజాల్‌  

3) ముస్సోరి 4) కారాకోరం


16. శివాలిక్‌ పర్వతాల్లో భాగంగా అబోర్‌ పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?    

1) అస్సాం  2) సిక్కిం  

3) పశ్చిమ బెంగాల్‌  4) అరుణాచల్‌ ప్రదేశ్‌


17. కిందివాటిలో లోక్‌తక్‌ సరస్సు విస్తరించి ఉన్న పర్వత శ్రేణి ఏది?
1) నాగా కొండలు      2) కోహిమ కొండలు 

3) మణిపురి  4) మిజో కొండలు


18. నాగాలాండ్, మయన్మార్‌కు మధ్య జల విభాజకంగా పనిచేసే కొండలు? 

1) కోహిమ  2) లుషాయి  

3) అబోహర్‌  4) పాట్కాయ్‌


19. కిందివాటిలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పర్వత శ్రేణిని గుర్తించండి.

ఎ) మిష్మి  బి) డాప్లా   

సి) లుషాయి  డి) గారో

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) ఎ, డి


20. కిందివారిలో ఏ తెగవారు మిజో కొండల్లో నివసిస్తున్నారు?

1) బాల్డి    2) దృక్పా    

3) కుకి   4) సరుంగ్‌


21. కిందివాటిలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని తెగను గుర్తించండి.

1) లెప్బా   2) గుజ్జర్‌  

3) దృక్పా  4) బోటియా 


22. జంపుయ్‌ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

1) మిజోరాం 2) నాగాలాండ్‌  

3) త్రిపుర  4) మణిపుర్‌


23. షిరుయ్‌ కలువలు ఏ కొండల్లో పెరుగుతాయి?

1) నాగా కొండలు      2) లుషాయి  

3) పాట్కాయ్‌ భమ్‌  4) మణిపుర్‌


24. కిందివాటిలో దేన్ని దక్షిణ శిఖరంగా పిలుస్తారు?

1) కాంచన జంగ      2) లోట్సే  

3) మకాలు  4) మనస్లు


25. కిందివాటిలో నేపాల్‌లో లేని శిఖరం గుర్తించండి.

1) మకాలు  2) మనస్లు  

3) ధవళగిరి  4) గాడ్విన్‌ ఆస్టిన్‌


26. ప్రపంచంలో నాలుగో ఎత్తయిన శిఖరం ఏది?

1) కాంచన జంగ     2) లోట్సే  

3) మకాలు  4) అన్నపూర్ణ


27. కిందివాటిలో కిల్లర్‌ మౌంటెయిన్‌ అంటే?

1) నంగప్రభాత్‌  2) మనస్లు  

3) అన్నపూర్ణ   4) నందాదేవి


28. కిందివాటిలో సహ్యాద్రి పర్వత శ్రేణిలో లేని శిఖరం?

1) కల్సూబాయి      2) కుద్రేముఖ్‌  

3) సాల్హేర్‌  4) వందరాపు


29. కిందివాటిలో ‘జస్కార్‌ ముఖద్వారం’ అని ఏ   కనుమను పిలుస్తారు?

1) చాంగ్‌లా  2) పెన్సిలా  

3) అఘిల్‌  4) కారాకోరం


30. 1992లో చైనాతో వ్యాపారం కోసం ఉపయోగించిన కనుమ ఏది?

1) లిపులేఖ్‌  2) నిదిల  

3) నాథులా  4) జెలిప్‌లా


31. చైనా, మయన్మార్, భారతదేశ సరిహద్దుగా విస్తరించిన కనుమ ఏది?

1) దిహంగ్‌  2) దీపు  

3) బొమిడల  4) జెలిప్‌లా


32. కిందివాటిలో శవాల భూమిగా పిలిచే కనుమ ఏది?

1) షిప్‌కిలా  2) నిదిల 

3) లిపులేఖ్‌  4) రోహతంగ్‌


33. షిప్‌కిలా కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించే నది ఏది?

1) సట్లెజ్‌   2) రావి   

3) సింధు   4) చినాబ్‌


34. రాజస్థాన్‌లో రాగి గనులకు ప్రసిద్ధి చెందిన ఖేత్రి కింది ఏ ప్రాంతంలో ఉంది?

1) మధ్య ఆరావళి  2) ఈశాన్య ఆరావళి  

3) అభు కొండలు      4) మేవార్‌ పీఠభూమి


35. మార్వార్‌ కొండలు కింది ఏ పర్వత సమూహంలో భాగంగా విస్తరించి ఉన్నాయి?

1) ఈశాన్య ఆరావళి  2) దక్షిణ ఆరావళి  

3) మధ్య ఆరావళి   4) బొరఠ్‌ పీఠభూమి


36. కిందివాటిలో దక్కన్‌ తలుపులుగా పిలిచే కనుమ ఏది?

1) అసిర్‌ఘర్‌  2) గోరన్‌ఘాట్‌  

3) హల్దీఘాట్‌ 4) దేసూరి


37. సిజు గుహలు ఏ కొండల్లో ఉన్నాయి?

1) గారో  2) ఖాసి  

3) జయంతియా 4) మికిర్‌


38. క్రెమ్‌ పైలుత్‌ గుహ ఏ కొండల్లో ఉంది?

1) గారో  2) ఖాసి  

3) అబోర్‌ 4) జయంతియా


39. సిజు గుహలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి?

1) అల్యూమినియం 2) రాగి 

3) వెండి     4) సున్నపురాయి


40. కిందివాటిలో భారత ఉపఖండంలో అతిపొడవైన గుహ ఏది?

1) మహాదేవ్‌ గుహ  2) క్రెమ్‌ లింపుట్‌

3) క్రెమ్‌ లియాట్‌ప్రాహ్‌  4) క్రెమ్‌ లాహింగ్‌


41. కిందివాటిలో గర్‌జాట్‌ కొండల్లో ఉన్న బయోస్ఫియర్‌ రిజర్వును గుర్తించండి.

1) సుందర్‌బన్స్‌      2) సిమ్లిపాల్‌  

3) శేషాచలం 4) మన్నార్‌


42. కిందివాటిలో కర్ణాటక పీఠభూమిలోని జాతీయ పార్కును గుర్తించండి.

1) బన్నెర్‌ ఘట్ట      2) నాగర్‌ హల్‌ 

3) అన్షి దండేలి      4) బద్ర


43. కర్ణాటకలోని బాబా బుడాన్‌ కొండలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి?

1) సున్నపురాయి      2) గ్రానైట్‌  

3) వెండి  4) అల్యూనిమియం 


44. కిందివాటిలో ఏ నదిపై మహాత్మాగాంధీ జలపాతం ఉంది?

1) కావేరి  2) నేత్రావతి      

3) శరావతి 4) మాండవి


45. కాస్‌ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది?

1) మహారాష్ట్ర 2) మధ్యప్రదేశ్‌  

3) ఛత్తీస్‌గఢ్‌  4) ఝార్ఖండ్‌


46. సిగూర్‌ పీఠభూమి ఏ కొండల్లో భాగం?

1) బాబా బుడాన్‌      2) నీలగిరి  

3) అన్నామలై  4) సహ్యాద్రి


47. రాజమండ్రి శిలలు ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి?    

1) సున్నపురాయి      2) రాగి  

3) చమురు నిక్షేపాలు  4) బాక్సైట్‌


48. కర్నూలు, కడప శిలలు వేటికి ప్రసిద్ధి?

1) రాగి     2) వెండి  

3) బాక్సైట్‌ 4) సున్నపురాయి


49. కూర్గ్‌ కొండలు, రత్నగిరి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?

1) మధ్యప్రదేశ్‌      2) కర్ణాటక  

3) మహారాష్ట్ర     4) కేరళ


50. మహారాష్ట్రలో అధికంగా విస్తరించిన నేలలు ఏవి?

1) ఒండ్రు   2) ఎర్రనేలలు  

3) నల్లరేగడి   4) లాటరైట్‌


సమాధానాలు
 

1-4; 2-2; 3-3; 4-3; 5-2; 6-2; 7-4; 8-4; 9-1; 10-2; 11-2; 12-2; 13-3; 14-1; 15-3; 16-4; 17-3; 18-1; 19-1; 20-3; 21-2; 22-3; 23-4; 24-2; 25-4; 26-2; 27-1; 28-4; 29-2; 30-1; 31-2; 32-4; 33-1; 34-2; 35-3; 36-1; 37-1; 38-2; 39-4; 403; 412; 421; 432; 443; 45-1; 46-2; 47-3; 48-4; 49-2; 50-3.

రచయిత: బండ్ల శ్రీధర్‌ 


 

Posted Date : 05-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు