• facebook
  • whatsapp
  • telegram

కవి పరిచయాలు

ప్రతి పద్య చమత్కార చణుడు చేమకూర!



ప్రాచీన కాలం నుంచి ఎందరో కవులు, రచయితలు ఎన్నో రకాల రచనలు చేసి తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. ఆదికవి నన్నయ అక్షర రమ్యతతో మురిపిస్తే, పాల్కురికి మణిప్రవాళ శైలికి శ్రీకారం చుట్టాడు. శబ్దాలంకారాల సొగసులతో పోతన పామరులనూ పరవశింపజేశాడు. శ్రీనాథుడు రసాభ్యుదయచిత బంధాలతో రంజింపజేశాడు. ప్రతిపద్య చమత్కారాలతో చేమకూర కవి చేవ చాటాడు. అచ్చతెలుగు కావ్యాలతో పొన్నెగంటి మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇలాంటి మహామహుల వివరాలు, వారి రచనలు, ఇతర విశేషాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి రచనాశైలిలో విశిష్టతలను అర్థం చేసుకోవాలి. 


త్యాగనిరతి  


కవి: నన్నయ

కాలం: 11వ శతాబ్దం

బిరుదులు: ఆదికవి, వాగనుశాసనుడు

రచనలు: 1) ఆంధ్ర శబ్ద చింతామణి, 

       2) ఆంధ్ర మహాభారతంలో 2 1/2 పర్వాలు

కవితా లక్షణాలు:  ప్రసన్న కథాకలితార్థయుక్తి

 అక్షర రమ్యత బీ నానారుచిరార్థ సూక్తి నిధిత్వం

విశేషాలు: రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి.



బండారి బసవన్న

కవి: పాల్కురికి సోమనాథుడు

కాలం: 12వ శతాబ్దం

జన్మస్థలం: ఓరుగల్లు సమీపాన ఉన్న పాలకుర్తి (పాలకురికి)

రచనలు: అనుభవసారం, బసవ పురాణం, బసవోదాహరణం, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసాలు, పండితారాధ్య చరిత్రం, రగడలు, గద్యలు.

శైలి: మణిప్రవాళ శైలి వాడిన తొలి కవి.

విశేషాలు: తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. శతకం, ఉదాహరణం, రగడ మొదలైన ప్రక్రియలకు ఆద్యుడు పాల్కురికి సోమన.



దానశీలం

కవి: బమ్మెర పోతన 

జన్మస్థలం: వరంగల్లు (జనగామ) జిల్లా, బమ్మెర గ్రామం.

తల్లిదండ్రులు: లక్కమాంబ, కేసన

కాలం: 15వ శతాబ్దం

రచనలు: భాగవతం, వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం.

విశేషాలు:  శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఈయన రచన సాగుతుంది.

     పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత.

     భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు.



భిక్ష

కవి: శ్రీనాథుడు

కాలం: 1380  1470

బిరుదు: కవి సార్వభౌమ

తల్లిదండ్రులు: మారయ, భీమాంబ

రచనలు: మరుత్తరాట్‌ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర.

కవితా లక్షణాలు: ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి.

విశేషాలు:  శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి.

     విజయనగర ఫ్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదనా పటిమతో ఓడించి కనకాభిషేక గౌరవాన్ని, కవి సార్వభౌమ బిరుదును పొందారు.


ధర్మార్జునులు

కవి: చేమకూర వేంకట కవి

కాలం: 17వ శతాబ్దం

అలంకరించిన ఆస్థానం: రఘునాథ నాయకుడి ఆస్థాన కవి.

రచనలు: సారంగధర చరిత్ర, విజయ విలాసం.

విశేషాలు: భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ‘ప్రతిపద్య చమత్కారం’తో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని తీర్చిదిద్దాడు.



చెలిమి

కవి: పొన్నెగంటి తెలగనామాత్యుడు

కాలం: 16వ శతాబ్దం

నివాస స్థ్ధలం: గోలకొండ పరిసరాల్లోని పొట్ల చెరువు (పటాన్‌చెరువు)

తండ్రి పేరు: భావనా మాత్యుడు

రచన: యయాతి చరిత్ర

విశేషాలు:  అచ్చ తెలుగు కావ్య రచనకు స్వయంగా తానే నియమాలను ఏర్పరచి తదనంతర కవులకు   మార్గదర్శకుడయ్యాడు.

    ‘యయాతి చరిత్ర’ను ఒక మహమ్మదీయ సర్దారుకు అంకిత మీయడం కూడా ఒక ప్రత్యేకమైన అంశమే.


అభ్యాస ప్రశ్నలు


1.     తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చతెనుగు కావ్యం-

1) భాగవతం     2) భారతం 

3) యయాతి చరిత్ర     4) రుక్మిణీ కల్యాణం


2.     తెలుగు ‘మణిప్రవాళ శైలి’ ని వాడిన తొలికవి ఎవరు?

1) నన్నెచోడుడు     2) పాల్కురికి సోమనాథుడు 

3) నాచన సోమన    4) తిక్కన


3.     కిందివాటిలో దేశీకవితా ప్రక్రియకు చెందింది?

1) పద్యం      2) గద్యం  

3) ప్రబంధం      4) ద్విపద


4.     మానవ మాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడికే అంకితం చేస్తానని చెప్పిన కవి-

1) పోతన        2) తిక్కన

3) నన్నయ        4) పాల్కురికి సోమన


5.     ‘విజయ భవన’ అనే కవి పండిత సభను నిర్వహించిన కవి?

1) శ్రీకృష్ణదేవరాయలు     2) విజయ రాఘవ నాయకుడు

3) రఘునాథ నాయకుడు      4) పెద కోమటి వేమారెడ్డి


6.     కింది వాటిలో ఆమిర్‌ఖాన్‌కు అంకితమిచ్చిన కావ్యం?

1) నందనందన చరిత్ర      2) యయాతి చరిత్ర 

3) ధనంజయ విజయం     4) క్రీడాభిరామం


7.     నన్నయ భారతంలో రాసిన చివరి పద్యం?

1) శారద రాత్రులు...       2) కమ్మని లతాంతమునకు..... 

3) రయవిచల త్తురంగమ....     4) శ్రీవాణీ గిరిజా స్చిరాయ....


8. శ్రీనాథుడి చమత్కారానికి, లోకాను శీలనకు, జీవిత విధానానికి అద్దం పట్టేవి ఏవి?

1) సమస్యా పూరణలు      2) చాటువులు  

3) కావ్యాలు       4) వర్ణనలు


9. పోతన భాగవతాన్ని ఎవరికి అంకితమిచ్చాడు?

1) సర్వజ్ఞ సింగ భూపాలుడికి 2) శ్రీకృష్ణుడికి  

3) శివుడికి         4) శ్రీరాముడికి


10. ‘అభినవ భోజరాజు’ అనే బిరుదు ఎవరికి ఉంది?

1) శ్రీకృష్ణదేవరాయలు       2) రఘునాథ] నాయకుడు  

3) విజయ రాఘవ నాయకుడు         4) పెదకోమటి వేమారెడ్డి


11. ‘ప్రతి పద్య చమత్కార చణుడు’ అనే బిరుదున్న కవి?

1) పొన్నెగంటి తెలగన    2) పాల్కురికి సోమన 

3) చేమకూర వేంకట కవి  4) నన్నెచోడుడు


12. పల్నాటి వీర చరిత్ర ఎవరి రచన?

1) తిక్కన      2) మంచన  

3) తెలగన      4) శ్రీనాథుడు


13. పిల్ల వసుచరిత్ర అనే ప్రశంస పొందిన కావ్యం?

1) కళాపూర్ణోదయం      2) సారంగధర చరిత్ర 

3) విజయ విలాసం     4) క్రీడాభిరామం


14. శ్రీనాథుడు ఏ పద్య రచనలో మేటి?

1) సీస పద్యం     2) కంద పద్యం     

3) మత్తేభం      4) కవిరాజ విరాజితం


15. సంపూర్ణ శతక లక్షణాలున్న తొలి శతకం?

1) సుమతీ శతకం     2) శివతత్వ సారం 

3) వృషాధిప శతకం     4) భాస్కర శతకం


16. నన్నయ భారతంలో తొలి పర్వం?

1) ఆది పర్వం       2) సభా పర్వం    

3) అరణ్య పర్వం        4) విరాట పర్వం


17. పాల్కురికి సోమనాథుడి దీక్షా గురువు ఎవరు?

1) కరస్థలి విశ్వనాథయ్య        2) కట్టకూరి పోతిదేవర

3) గురులింగాచార్యులు      4) బసవేశ్వరుడు


18. చెన్నమల్లు సీసాలు లోని సీస పద్యాల సంఖ్య ఎంత?

1) 23     2) 32    3) 42    4) 24


19. త్యాగనిరతి భారతంలోని ఏ పర్వంలో ఉంది?

1) భీష్మ పర్వం       2) ఉద్యోగ పర్వం   

3) ఆది పర్వం        4) అరణ్య పర్వం  


20. ‘ధర్మార్జునులు’ పాఠం విజయ విలాసంలోని ఏ ఆశ్వాసంలో ఉంది?

1) ప్రథమాశ్వాసం       2) ద్వితీయాశ్వాసం   

3) తృతీయాశ్వాసం       4) చతుర్థాశ్వాసం


21. చేమకూర వేంకట కవి ‘సారంగధర చరిత్ర’కు దీపాల పిచ్చయ్య శాస్త్రి రాసిన వ్యాఖ్యానం?

1) అర్థదీపికా వ్యాఖ్య      2) సంజీవని వ్యాఖ్య   

3) సర్వంకష వ్యాఖ్య       4) జితకాశినీ వ్యాఖ్య


22. శ్రీనాథుడు తన కవిత్వంలో ఉందని చెప్పిన నన్నయ కవితా లక్షణం?

1) అక్షర రమ్యత    2) నానారుచిరార్థ సూక్తి నిధిత్వం   

3) ఉభయ వాక్ప్రౌఢి 4) ప్రసన్నకథా కలితార్థయుక్తి


23. భిక్ష పాఠాన్ని ఏ కావ్యం నుంచి గ్రహించారు?

1) కాశీఖండం        2) భీమఖండం    

3) హరవిలాసం       4) శివరాత్రి మహాత్మ్యం 


24. అచ్చ తెలుగు ఆదికవిగా సుప్రసిద్ధుడు ఎవరు?

1) నన్నయ        2) తిక్కన    

3) ఎర్రన        4) పొన్నెగంటి తెలగన


25. బసవపురాణంలోని ఆశ్వాసాల సంఖ్య?

1) 3     2) 5     3) 7     4) 12


26. పాల్కురికి సోమనాథుడి అనుభవ సారానికి కథా శ్రోత ఎవరు?

1) గొబ్బూరి సంగనామాత్యుడు        2) ముద్ద సంగయ్య    

3) గొడగి త్రిపురారి      4) బెజ్జ మహాదేవి


27. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏది?

1) బసవోదాహరణం      2) పండితారాధ్య చరిత్ర   

3) చతుర్వేద సారం      4) బసవ పురాణం 


28. నన్నయ ఇంద్ర విజయం రాశాడని పేర్కొన్న లాక్షణికుడు?

1) కస్తూరి రంగకవి        2) అప్పకవి    

3) అడిదం సూరకవి       4) వార్తాకవి రాఘవయ్య


29. తెలుగు భాషకు సంస్కృతంలో వచ్చిన మొదటి వ్యాకరణం?

1) కావ్యాలంకార చూడామణి   2) అప్పకవీయం   

3) బాల సరస్వతీయం      4) ఆంధ్ర శబ్దచింతామణి


30. చెలిమి పాఠాన్ని ‘యయాతి చరిత్ర’లోని ఏ ఆశ్వాసం నుంచి గ్రహించారు?

1) ద్వితీయాశ్వాసం  2) తృతీయాశ్వాసం    

3) చతుర్థాశ్వాసం     4) షష్ఠమాశ్వాసం



సమాధానాలు

1-3; 2-2; 3-4; 4-1; 5-3; 6-2; 7-1; 8-2; 9-4; 10-2; 11-3; 12-4; 13-3; 14-1; 15-3; 16-1; 17-3; 18-2; 19-4; 20-1; 21-4; 22-3; 23-1; 24-4; 25-3; 26-3; 27-2; 28-1; 29-4; 30-2.


 



రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 04-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌