• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

చంపకమాలలో గురువులకు రెట్టింపు లఘువులు!



పద్యాలను క్రమబద్ధంగా రాయడానికి వినియోగించే భాషా విధానమే ఛందస్సు. సంస్కృత వేద రచనలో ఈ నియమం ఉంది. ఆ సంస్కృతం నుంచే పుట్టిన తెలుగులోనూ అదే ఒరవడి కొనసాగింది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో పాటు జాతులు, ఉపజాతులూ తెలుగు పద్యాల్లో ఉన్నాయి. అక్షరాన్ని పలికే సమయం   ఆధారంగా నిర్ణయమయ్యే గురువు, లఘువులపై నిర్మితమయ్యే ఛందస్సు తెలుగు   సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. ప్రధానంగా కావ్య నిర్మాణంలో వినియోగించే ఈ భాషా ప్రక్రియ గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. వివిధ రకాల పద్యాల్లోని గణాలు, యతి స్థానాల గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలి.


1.    పద్యం మొత్తంలో 16 సూర్య గణాలు ఉండే ఛందస్సు?    

1) తేటగీతి            2) కందం         

3) ద్విపద            4) ఆటవెలది


2.     వందనం (ఈ పద్యంలో ఉన్న గణమేది)?

1) భగణం              2) రగణం        

3) తగణం           4) జగణం


3.     కింది పద్యపాదంలోని గణాలను గుర్తించండి.    

‘‘అనల జ్యోతుల నీ పతివ్రతల ఁబాపాచారులై డాయు భూ’’

1) భ ర న భ భ ర వ     2) మ స జ స త త గ

3) స భ ర న మ య వ      4) న జ భ జ జ జ ర


4.     మొదట ఆరు ఇంద్రగణాలు, చివర రెండు సూర్య గణాలు ఉండే పద్యం?

1) తేటగీతి            2) ఆటవెలది       

3) కందం          4) సీసం


5.     ‘న జ భ జ జ జ ర’ - గణాలున్న పద్యం?

1) ఉత్పలమాల           2) శార్దూలం     

3) చంపకమాల    4) మత్తేభం


6.     కిందివాటిలో ప్రాస నియమం లేని పద్యం-

1) తేటగీతి             2) మత్తేభం         

2) శార్దూలం           4) కందం


7.     పొదలి యెండొండ దివియును భువియు దిశలు - ఇందులోని ఛందస్సు?

1) తేటగీతి             2) ద్విపద       

3) శార్దూలం            4) మత్తేభం


8.     ‘‘వెన్నెల వెల్లి పాల్కడలి వ్రేకదనంబున బేర్చి దిక్కటన్‌’’ - ఇది ఏ పద్యపాదం?

1) చంపకమాల           2) ఉత్పలమాల       

3) శార్దూలం          4) మత్తేభం


9.     ఘన వనజాత లోచనము గ్రక్కున మీలన మొందజేసే బ - ఇందులో భగణం?

1) ఘనవ  2) నజాత  3) లోచన  4) మొందజే


10. ప్రతి పాదంలో 21 అక్షరాలుండే పద్యం?

1) చంపకమాల           2) ఉత్పలమాల       

3) మత్తేభం           4) శార్దూలం


11. ‘భ’గణం ఉన్న పదం-

1) తనదే   2) పట్టుగ   3) కరిరా   4) స్థిరత


12. 14వ అక్షరం యతిమైత్రి ఉండే పద్యం?

1) చంపకమాల           2) ఉత్పలమాల         

3) మత్తేభం         4) శార్దూలం


13. ఒక మాత్ర కాలంలో ఉచ్ఛరించే అక్షరాన్ని ఏమంటారు?

1) గురువు  2) లఘువు  3) విసర్గ  4) ద్విత్వం


14. హ్రస్వమైన అచ్చులను ఏమంటారు?

1) లఘువులు         2) ఉపదలు        

3) గురువులు            4) పొల్లులు


15. శార్దూల విక్రీడితం అనే వృత్తంలో ఎన్ని అక్షరాలుఉన్నాయి?

1) 20    2) 21    3) 19    4) 22


16. ఉత్పలమాల వృత్తంలో రెండో గణం ఏది?

1) భగణం  2) రగణం  3) నగణం  4) తగణం


17. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు?

1) గురువులు             2) లఘువులు       

3) సంయుక్తాక్షరాలు       4) ద్విత్వాక్షరాలు


18. చంపకమాల వృత్తంలో యతి స్థానమేది?

1) 10 వ అక్షరం          2) 11 వ అక్షరం        

3) 13 వ అక్షరం          4) 14 వ అక్షరం


19. 13వ అక్షరం యతి స్థానంలో ఉన్న వృత్తమేది?

1) ఉత్పలమాల           2) చంపకమాల     

3) శార్దూలం         4) మత్తేభం


20. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలున్న పద్యం ఏది?

1) ఆటవెలది 2) కందం 3) మత్తకోకిల 4) తేటగీతి


21. రెండు, నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలున్న పద్యం?

1) తేటగీతి             2) కందం        

3) ఆటవెలది           4) మత్తకోకిల


22. ఒక గురువు, రెండు లఘువులున్న గణం పేరు?

1) జగణం  2) భగణం  3) రగణం  4) తగణం


23. లఘువు, గురువు, లఘువు ఉన్న గణం?

1) భగణం  2) రగణం  3) జగణం  4) తగణం


24. ‘శక్తి’ - పదానికి గురు లఘువులు-

1) UI    2) II    3) IU    4) UU


25. ‘వాచకం’ - ఈ పదంలో ఉన్న గణాలు-

1) IIU 2) UII 3) III 4) UIU


26. హారతి పళ్లెం గుర్రపు కళ్లెం - ఈ రెండు పద బంధాల్లో ఒకే రకమైన గణాలున్నాయి. సరైన గణాలు గుర్తించండి.

1) UUU III 2) UU IUU

3) UUI IU 4) UII UU


27. వందనం శ్రీరామా - ఈ పదబంధాల్లో గణాలు ఇలా ఉంటాయి-

1) III IIU 2) III UII

3) IUI UII 4) UIU UUU


28. ఒకే పదబంధంలోని ద్విత్వ సంయుక్తాక్షరాల ముందున్న అక్షరాలు ఛందస్సులో... అవుతాయి.

1) ప్రాసలు          2) యతులు     

3) గురువులు     4) లఘువులు 


29. ముత్యము - ఏ గణం?

1) మగణం  2) భగణం 3) యగణం  4) సగణం


30. వివిధ గ్రహాలు - గురు లఘువులను గుర్తించండి.

1) IIU IUI 2) IIU UUI

3) III IUI 4) III UUI


31. జాతి పద్యాలు ఎన్ని?

1) 8     2) 12     3) 14    4) 16


32. త - భ - జ - జ - గ - గ అనే గణాలుండే పద్యం?

1) వసంత తిలకం         2) ఉపేంద్ర వ్రజ         

3) మాలిని           4) పంచచామరం


33. ‘మానిని పద్యం’లోని మొదటి గురువును, రెండు లఘువులుగా మారిస్తే ఏర్పడే పద్యం?

1) స్రగ్ధర              2) తరలం       

3) మత్త కోకిల           4) కవిరాజవిరాజితం


34. 4 యగణాలుండే పద్యం ఏది?

1) స్రగ్విణి             2) భుజంగ ప్రయాతం      

3) తోదకం        4) ఏదీకాదు


35. ఏకాక్షర గణం ఉన్న పద్యం?

1) తరలం           2) మత్త కోకిల          

3) చంపకమాల          4) ఉత్పలమాల


36. గురువులకు రెట్టింపు లఘువులున్న పద్యం?

1) శార్దూలం            2) చంకపమాల       

3) మత్తేభం            4) ఏదీకాదు


37. మత్తకోకిలకు జంట వృత్తం?

1) మత్తేభం             2) కవిరాజ విరాజితం      

3) తరలం            4) పంచచామరం


38. భగణ బాహళ్యం ఉన్న పద్యం?

1) చంపకమాల           2) ఉత్పలమాల      

3) మత్తేభం          4) మత్త కోకిల


39. ‘స్రగ్ధర’ పద్యంలోని మొదటి గురువును, రెండు లఘువులుగా మారిస్తే ఏర్పడే పద్యం?

1) మహాస్రగ్ధర          2) తరలం        

3) కవిరాజు విరాజితం     4) మానిని


40. ఏడు సూర్యగణాలు, ఒక గురువు ఉండే పద్యం?

1) మధ్యాక్కర           2) తరువోజ        

3) ద్విపద          4) ఉత్సాహం


41. పద్యం మీద పద్యం చెప్పడం ఏ భాషా సంప్రదాయం?

1) ప్రాకృతం       2) కన్నడం       

3) తమిళం          4) సంస్కృతం


42. గురువు చివర ఉండదగిన పద్యం?

1) కందం             2) తేటగీతి          

3) తరువోజ          4) మధ్యాక్కర


43. ‘‘స - త - త - న - స - ర - ర - గ’’ అనే గణాలుండే పద్యం?

1) స్రగ్ధర            2) మానిని          

3) మాలిని           4) మహాస్రగ్ధర


44. ‘‘తర్కేందుకర ముని త్రయ తర్క విధులు’’ ఏ సంఖ్యను సూచిస్తుంది?

1) 1, 67, 77, 216      2) 6, 71, 08, 864

3) 41, 94, 304          4) 20, 97, 152


45. ‘చంపకమాల’ పద్యం ఏ ఛందంలో పుట్టింది?

1) ఆకృతి  2) సంకృతి  3) అతికృతి  4) ప్రకృతి


46. ‘‘భజసన భజసన భయ’’ గణాలున్న పద్యం?

1) మందాక్రాంత           2) లయగ్రాహి         

3) నర్కుటం          4) తోడకం


47. మూడు యతి స్థానాలున్న పద్యం?

1) మహా స్రగ్ధర          2) ద్విపద         

3) తరువోజ          4) స్రగ్ధర


48. 8వ అక్షరం యతి స్థానంగా ఉన్న పద్యాలు-

1) మాలిని, తోటకం    2) తరలం, భూతిలకం

3) పంచచామరం, తరలం     4) ఇంద్రవ్రజ ద్రుతవిలంబితం


49. ఆడవాళ్లు వడ్లు దంచే చోట పాడే తరువోజ ఛందాన్ని రెండు భాగాలు చేసినవారు?

1) పాల్కురికి సోమన     2) గౌరన 

3) తాళ్లపాక తిరు వెంగళనాథుడు 4) తాళ్లపాక అన్నమాచార్యులు


50. ‘ఉత్పలమాల’ ఏ ఛందంలో పుట్టింది?

1) కృతి  2) అతిధృతి  3) ప్రకృతి  4) ఏదీకాదు 


51. ‘శక్వరి’ ఛందంలో పుట్టిన వృత్తం?

1) శిఖరిణి     2) శార్దూలం 

3) స్రగ్ధర     4) వసంత తిలకం


52. విన్నకోట పెద్దన పేర్కొన్న చంద్రగణాలు ఎన్ని?

1) 10     2) 12     3) 14     4) 16


53. ‘భగణం’నకు అధిదేవత?

1) వాయు దేవుడు     2) చంద్రుడు 

3) భూమి     4) ఆకాశం


54. పద్యాదిలో ఏ గణం వాడితే ‘శుభం’ కలుగుతుంది?

1) సగణం  2) నగణం  3) మగణం  4) తగణం


55. ఛందస్సులో ఆకాశం ఏ సంఖ్యను సూచిస్తుంది?

1) 0      2) 1      3) 2      4) 7


56. ‘‘ఋతు నిధి ఖాబ్దులు’’ అనే పదం ఛందో వృత్తముల్లో ఏ సంఖ్యను సూచిస్తుంది?

1) 256   2) 512   3) 4069   4) 4096


57. 4వ గణం యతి స్థానంగా ఉన్న పద్యాలు-

1) ఆటవెలది, తేటగీతి      2) సీసం, కందం 

3) ఆటవెలది, తరువోజ     4) మానిని, మాలిని


58. నన్నయ మధ్యాక్కర పద్యానికి ఎన్నో గణం యతిస్థానంగా నియతం చేశాడు?

1) 3వ గణం     2) 4వ గణం 

3) 5వ గణం     4) 4, 5 గణాలు


59. ‘న - న - మ - య - య’ అనే గణాలున్న వృత్త పద్యం ఏది?

1) తరువోజ     2) ఉత్సాహం 

3) మాలిని     4) మానిని


60. కాళిదాసు మేఘదూతం కావ్యంలో వాడిన పద్యాలు ఏ వృత్తానికి చెందినవి?

1) భూతిలకం         2) మందాక్రాంతం 

3) లయగ్రాహి         4) మంగళమహాశ్రీ



సమాధానాలు

1-4; 2-2; 3-3; 4-4; 5-3; 6-1; 7-1; 8-2; 9-3; 10-1; 11-2; 12-3; 13-2; 14-1; 15-3; 16-2; 17-1; 18-2; 19-3; 20-4; 21-3; 22-2; 23-3; 24-1; 25-4; 26-4; 27-4; 28-3; 29-2; 30-3; 31-3; 32-1; 33-4; 34-2; 35-1; 36-2; 37-3; 382; 39-1; 40-4; 41-1; 42-1; 43-4; 44-1; 45-4; 46-2; 47-3; 48-4; 49-1; 50-1; 51-4; 52-4; 53-2; 54-3; 55-1; 56-4; 57-1; 58-3; 59-3; 60-2.


రచయిత: సూరె శ్రీనివాసులు  

Posted Date : 26-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌