• facebook
  • whatsapp
  • telegram

నదీ వ్యవస్థ

మధ్యప్రదేశ్‌ మీదుగా ప్రవహించే మార్బుల్‌!
 


దేశ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ ప్రగతికి అవసరమైన అత్యంత అమూల్యమైన వనరు నదీవ్యవస్థ. సాగు, విద్యుత్తు ఉత్పత్తి, వస్తువులు, ప్రజల రవాణాకు చాలా కీలకమైన సహజ సంపద. ఆహార భద్రతకు కూడా దోహదపడుతుంది. జలచక్రంలో భూగర్భ జలాలను పునరుద్ధరించడంలో సాయపడుతుంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, వినోద ప్రదేశాలు ఎన్నో నదీ తీరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో  దేశంలోని నదులు, వాటి ప్రధాన ఉపనదులు, ప్రవాహ మార్గాలు, ప్రధాన నదికి ఉపనదులు ఉన్న దిక్కులు, నదీ తీర పట్టణాల గురించి పరీక్షార్థులు     సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్య నదుల పరీవాహక ప్రాంతాలు, రాష్ట్రాల వారీగా ప్రవహించే దూరం, వాటికి ఉన్న వివిధ పేర్లపై అవగాహన పెంచుకోవాలి.



1. కిందివాటిలో గోదావరి నదికి ఎడమవైపు ఉప నదులు కానివి గుర్తించండి.

ఎ) ప్రాణహిత     బి) వార్ధ 

సి) మంజీరా   డి) కిన్నెరసాని

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ    4) సి, డి


2. కిందివాటిలో గోదావరి నదికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి.

1) గోదావరిని కవుల నది అంటారు.

2) ఇండియన్‌ రైన్‌ నది అంటారు.

3) శిల్పుల నది అంటారు.

4) ఈ నది బైసన్‌ గార్జ్‌ను ఏర్పరిచింది.


3.  కిందివాటిలో సింధూ నది ఉపనదులకు   సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి.

1) సింధూ నది ఉపనదుల్లో అతిపెద్దది చీనాబ్‌.

2) అతి పొడవైన ఉప నది సట్లెజ్‌.

3) దీని ఉపనదుల్లో భారతదేశంలో జన్మించే ఉపనది కానిది సట్లెజ్‌.

4) సింధూ ఉపనదుల్లో చిన్నది రావి.


4.  కిందివాటిని జతపరచండి.

నది  నదీతీర పట్టణం
ఎ) తపతి  1) రూర్కెలా
బి) పెరియార్‌  2) అహ్మదాబాద్‌
సి) సబర్మతి 3) కాలడి
డి) బ్రాహ్మణి  4) కాక్రపార

1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-3, బి-4, సి-2, డి-1    4) ఎ-1, బి-4, సి-3, డి-2


5.  కిందివాటిలో కృష్ణానదికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి.

ఎ) కవుల నది అంటారు.

బి) తుంగభద్ర నది ఎడమవైపు ఉన్న ప్రధాన ఉప నది.

సి) కృష్ణా పరివాహక ప్రాంతం కర్ణాటకలో అధికంగా ఉంది.

డి) శిల్పుల నది అంటారు.

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి    4) డి, ఎ


6.  కిందివాటిలో కృష్ణా నది ఉపనదులు కానివి   గుర్తించండి.

ఎ) కొయనా     బి)ప్రవర     

సి) పెన్‌గంగా     డి) బీమా

1) ఎ, బి   2) బి, సి    3) సి, ఎ   4) డి, ఎ


7.  గంగా నదికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి.

ఎ) గంగా నది రెండో అత్యధిక దూరం బిహార్‌లో ప్రవహిస్తుంది.

బి) గంగా నది కుడివైపు ఉన్న ప్రధాన ఉపనది యమున.

సి) గంగా నది ఎడమవైపు ఉన్న చివరి ఉపనది తీస్తా.

డి) గంగా నది ఫరక్కా డ్యామ్‌ వద్ద పద్మ, హుగ్లీ నదులుగా విడిపోతుంది.

1) ఎ, బి   2) బి, సి   3) ఎ, సి    4) డి, ఎ


8. కిందివాటిని జతపరచండి.

రాష్ట్రం  గంగానది ప్రవహించే దూరం
 ఎ)ఉత్తరాఖండ్‌   1) 520 కి.మీ.
బి)ఉత్తర్‌ప్రదేశ్‌   2) 445 కి.మీ.
సి) బిహార్‌ 3) 1450 కి.మీ.
డి) పశ్చిమ బెంగాల్‌  4) 110 కి.మీ.

1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-1, బి-4, సి-2, డి-3

3) ఎ-4, బి-1, సి-3, డి-2     4) ఎ-4, బి-3, సి-2, డి-1


9. కిందివాటిలో గంగా నది ఎడమ వైపు ఉపనదులు కానివి గుర్తించండి.

ఎ) గండక్‌  బి) సోన్‌   సి) పున్‌పున్‌   4) గాగ్ర

1) ఎ, బి    2) బి, సి    3) సి, ఎ   4) డి, ఎ


10. కిందివాటిలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి   సరికాని సమాధానం గుర్తించండి.

ఎ) బ్రహ్మపుత్రను అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహంగ్‌ అంటారు.

బి) కుడివైపు ప్రధాన ఉప నదుల్లో సుబాన్‌సిరి ఒకటి.

సి) బ్రహ్మపుత్రను బంగ్లాదేశ్‌లో జాహ్నవి నది అంటారు.

డి) ఎడమవైపు ఉండే ప్రధాన ఉపనది మానస్‌.

1) ఎ, బి   2) ఎ, సి   3) సి, డి   4) డి, ఎ


11. కిందివాటిలో మహానది ఎడమ వైపు ఉండే ఉపనది కానిది గుర్తించండి.    

ఎ) షియోనాథ్‌     బి) హసడియో 

సి) ఓంగ్‌     డి) టేల్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) సి, డి


12. కిందివాటిలో పెన్నానదికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి.

ఎ) పెన్నాకు కుడివైపు ఉపనది జయమంగళి.

బి) పెన్నా నది కర్ణాటకలోని బ్రహ్మగిరి కొండల వద్ద ప్రారంభమవుతుంది.

సి) పెన్నాకు కుడివైపు ఉపనది చిత్రావతి.

డి) పెన్నా నదినే పినాకిని నది అంటారు.

1) ఎ, బి   2) సి, డి   3) డి, ఎ   4) బి, సి


13. కిందివాటిలో కావేరి నదికి ఉపనదులు కానివి గుర్తించండి.

ఎ) ఆర్కావతి     బి) లక్ష్మణ తీర్థ 

సి) ప్రవర     డి) ఘటప్రభ

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


14. కావేరి నదికి కుడివైపు ఉపనది కానిది?      

ఎ) లక్ష్మణ తీర్థ      బి) భవాని    

సి) హేమావతి    డి) ఆర్కావతి

1) ఎ, డి   2) సి, డి    3) డి, ఎ   4) ఎ, బి


15. కిందివాటిలో బ్రహ్మపుత్ర నది ఉపనది కానిది-

ఎ) తీస్తా     బి) ధన్‌సిరి 

 సి) మహానంద     డి) పున్‌పున్‌

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


16. కిందివాటిలో సరిగా జతపరచనిది గుర్తించండి.

1) గోదావరి - బాసర   2) కావేరి - కృష్ణరాజ సాగర్‌

3) యమున - మధుర  4) గాగ్ర - లఖ్‌నవూ


17. కిందివాటిలో సింధూ నది ఉపనదుల్లో  భిన్నమైనవి?

ఎ) బియాస్‌     బి) సట్లెజ్‌ 

సి) కిషన్‌ గంగా     డి) సుబ్ర

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) ఎ, డి


18. కిందివాటిలో యమునా నదికి సంబంధించని సమాధానం గుర్తించండి.

ఎ) యమునా నది ప్రధాన ఉపనదుల్లో బెట్వా ఒకటి.

బి) ఆగ్రా యమునా నది తీరాన ఉంది.

సి) యమునా నది గంగా నదికి ఎడమ వైపు ఉన్న ఉపనది.

డి) యమునా నదికి కుడివైపు ఉన్న ప్రధాన ఉప నది సోన్‌.

1) ఎ, బి   2) బి, సి   3) సి, ఎ   4) సి, డి


19. గోదావరి నది ఉపనదులు కానివి గుర్తించండి.

ఎ)పెన్‌గంగా     బి)వెన్‌గంగా 

సి) పంచగంగా     డి) దూద్‌గంగా

1) ఎ, బి   2) బి, సి   3) డి, ఎ   4) సి, డి 


20. తపతి నదికి సంబంధించి సరికాని వాక్యం   గుర్తించండి.

1) తపతి నది మొత్తం పొడవు 724 కి.మీ.

2) తపతి ఒక పగులు లోయ నది.

3) తపతి బరూచ్‌ వద్ద అరేబియా సముద్రంలో  కలుస్తుంది.

4) తపతి నది తీరంలో సూరత్‌ పట్టణం ఉంది.


21. కిందివాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

1) టిస్కో ఇనుము ఉక్కు కర్మాగారం సువర్ణరేఖ నది తీరాన ఉంది.

2) రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం బ్రాహ్మణి నది తీరాన ఉంది.

3) దుర్గాపుర్‌ ఇనుము ఉక్కు కర్మాగారం దామోదర్‌ నది తీరాన ఉంది.

4) తపతి నది తీరాన జబల్‌పుర్‌ పట్టణం ఉంది.


22. కిందివాటిని జతపరచండి.

 నది  నదీతీర పట్టణం
ఎ) తీస్తా 1) ఉజ్జయిని
బి) గోదావరి 2) కటక్‌
సి) మహానది 3) జల్పాయిగురి
డి) షిప్రా 4) నాందేడ్‌

1) ఎ-3, బి-4, సి-2, డి-1    2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-1, బి-2, సి-3, డి-4    4) ఎ-1, బి-4, సి-2, డి-3


23. కిందివాటిలో నర్మదా నదికి సంబంధించనిది.

ఎ) ఇది సాత్పురా, అజంతా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది.

బి) ఇది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో  పొడవైంది.

సి) దీన్నే మార్బుల్‌ నది అంటారు.

డి) ఇది మధ్యప్రదేశ్‌ మీదుగా అధిక దూరం  ప్రవహిస్తుంది.

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ 


24. కిందివాటిని జతపరచండి.

నది పొడవు
 ఎ) గోదావరి 1) 805 కి.మీ.
బి) కృష్ణా 2) 1465 కి.మీ.
సి) మహానది 3) 1401 కి.మీ.
డి) కావేరి 4) 858 కి.మీ.

1) ఎ-1, బి-2, సి-3, డి-4    2) ఎ-4, బి-3, సి-2, డి-1

3) ఎ-2, బి-3, సి-4, డి-1    4) ఎ-1, బి-4, సి-2, డి-3


25. కిందివాటిలో కేరళలో లేని నదిని గుర్తించండి.    

ఎ) భరతపూజ    బి) పెరియార్‌     

సి) మాండోవి    డి) జువారి

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ 


26. కిందివాటిలో కృష్ణానది ఉపనదులు కానివి.

ఎ) పంచగంగా     బి) మలప్రభ    

సి) పెన్‌గంగా    డి) శబరి

1) ఎ, బి  2) బి, సి   3) సి, డి   4) డి, ఎ 


27. కిందివాటిని జతపరచండి.

నది సముద్రంలో కలిసే ప్రాంతం
ఎ) కృష్ణా 1) సూరత్‌
బి) తపతి 2) హంసలదీవి
సి) స్వర్ణముఖి 3) బరూచ్‌
డి) నర్మద 4) అందాలమాల

1) ఎ-2, బి-1, సి-4, డి-3    2) ఎ-4, బి-2, సి-3, డి-1

3) ఎ-1, బి-2, సి-3, డి-4    4) ఎ-4, బి-3, సి-2, డి-1


28. కావేరి నదికి సంబంధించి సరికాని సమాధానాలు? 

ఎ) ఈ నదిని దక్షిణ గంగా అంటారు.

బి) కర్ణాటకలోని నందిదుర్గ కొండల వద్ద జన్మిస్తుంది.

సి) కర్ణాటకలో అధికంగా ప్రవహిస్తుంది.

డి) కావేరి నది ఒడ్డున శ్రీరంగ పట్టణం ఉంది.

1) ఎ, బి    2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


29. గోదావరి నదికి సంబంధించి సరికాని  సమాధానాలు గుర్తించండి.

ఎ) గోదావరి పరివాహక ప్రాంతం అధికంగా 49% వరకు మహారాష్ట్రలో ఉంది.

బి) గోదావరి పరీవాహక ప్రాంతంలో 20% మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.

సి) గోదావరికి ఎడమవైపు ప్రధాన ఉపనది మంజీరా.

డి) గోదావరికి కుడివైపు ఉపనది వెన్‌గంగా.

1) ఎ, బి   2) బి, సి   3) డి, ఎ   4) సి, డి


30. కింది నదుల్లో గోవాలో లేని నదులను గుర్తించండి.

ఎ) మాండోవి       బి) పెరియార్‌    

సి) శరావతి       డి) జువారి

1) ఎ, బి   2) బి, సి   3) సి, డి   4) డి, ఎ


31. కిందివాటిలో బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఎడమ వైపు ఉపనదులు గుర్తించండి.

ఎ)లోహిత్‌    బి) దిబాంగ్‌     

సి) మానస్‌  డి) తీస్తా

1) ఎ, డి    2) డి, సి   

3) ఎ, బి    4) బి, సి


సమాధానాలు


1-4; 2-3; 3-4; 4-2; 5-1; 6-2; 7-3; 8-4; 9-2; 10-3; 11-4; 12-1; 13-3; 14-2; 15-3; 16-4; 17-3; 18-4; 19-3; 20-3; 21-4; 22-1; 23-1; 24-3; 25-3; 26-3; 27-1; 28-2; 29-4; 30-4; 31-3.


 

రచయిత: బండ్ల శ్రీధర్‌  


 

Posted Date : 25-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు