• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం 

బహుమతి కోసమే చదవడానికి అలవాటుపడితే!


 

పుట్టుకతో వచ్చే లక్షణాలు, నైపుణ్యాలకు తోడు పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్నే అభ్యసనం అంటారు. ప్రాథమిక తరగతుల్లోని పిల్లల్లో ఆటపాటలతోపాటు ఆలోచనలను పెంచుతూ, మానసిక వికాసం జరిగే విధంగా బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇందుకోసం పిల్లల మనస్తత్వం, ప్రవర్తనను, అవగాహన స్థాయిని అర్థం చేసుకోవడంతోపాటు తరగతి గదిలో అనుసరించాల్సిన అభ్యసనా పద్ధతులు, అందుకోసం శాస్త్రీయంగా ఉన్న సిద్ధాంతాలను కాబోయే ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. పిల్లల్లో తలెత్తే భయాలు, మానసిక సమస్యలను ఎలా పోగొట్టవచ్చో గ్రహించాలి.

1.     కేవలం ‘పరిశీలించదగిన ప్రవర్తనలు’పై ఆధారపడిన అభ్యసన సిద్ధాంతం?

1) సంజ్ఞానాత్మక వాదం    2) వికాస వాదం   

3) ప్రవర్తనా వాదం       4) నిర్మాణాత్మక వాదం


2.     ఒక వ్యక్తికి  స్వీటు షాప్‌ బోర్డులో తనకిష్టమైన పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది. ఇందుకు కారణమైన ఉద్దీపన/నిబంధన? 

1) నిబంధిత ఉద్దీపన    2) శాబ్ధిక నిబంధనం   

3) విచక్షణ నిబంధనం    4) పదనిబంధనం


3.     వైగోట్‌ స్కీ విశ్వాసం ప్రకారం..

1) భాషా సముపార్జన.. సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జనకు దారితీస్తుంది.

2) సంజ్ఞానాత్మక సామర్థ్యాల సముపార్జన భాషా   వికాసానికి వీలు కల్పిస్తుంది.

3) భాషల సముపార్జనలో సామాజికమైన అన్యోన్య చర్యలు ఏ రకమైన పాత్ర నిర్వహించవు.

4) భాషా సముపార్జనకు మూర్తిమత్వ వికాసంలో ఎలాంటి పాత్ర లేదు.


4.     టైప్‌రైటింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోవడం ఏ అభ్యసనానికి ఉదాహరణ?

1) నిబంధిత అభ్యసనం        2) యత్నదోష అభ్యసనం   

3) కార్యక్రమయుత అభ్యసనం   4) అంతర్‌దృష్టి అభ్యసనం


5.     ఒక ఉపాధ్యాయుడు సమస్యను పరిష్కరించడానికి పిల్లలను ప్రేరేపించేందుకు వారికి కొన్ని మిఠాయిలు ఆశ చూపిస్తే, అతడు వినియోగించింది?

1) ప్రాథమిక పునర్బలనం    2) గౌణ పునర్బలనం   

3) తృతీయ పునర్బలనం    4) ఏదీకాదు


6.     కింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ‘‘అభ్యసనం ప్రత్యక్ష ప్రక్రియ, అది భావాలు ప్రసారం చేయడం ద్వారా జరగదు’’ అని అన్నాడు?

1) థారన్‌డైక్‌       2) లెవిన్‌   

3) వర్థీమర్‌       4) కోహెలర్‌


7.     ఒక ఉపాధ్యాయుడు క్లిష్టమైన భావనలను కొన్ని సంతోషకరమైన ఉద్దీపనలతో ప్రవేశపెట్టి బోధించ ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ప్రయత్నాల అనంతరం విద్యార్థులు సబ్జెక్టును ఇష్టపడ్డారు. ఇందులో ఇమిడిఉన్న అభ్యసన సిద్ధాంతం?

1) యత్నదోష సిద్ధాంతం  2) శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం

3) ప్రత్యక్ష అభ్యసనం   4) కార్యసాధక నిబంధనం


8.     భాషను ఆర్జించే సాధనం అంటే?

1) భాషను అభ్యసించేందుకు కావాల్సిన అంతర్గత సామర్థ్యం.

2) భాషను అభ్యసించేందుకు ఉపాధ్యాయుడు పంపిణీ చేసిన సామగ్రి.

3) అనుకరణ ద్వారా భాషను ఆర్జించడం.

4) సాంకేతిక ఉపకరణాలు వినియోగించి భాషను ఆర్జించడం.


9.     ఉద్దీపన - ప్రతిస్పందనల మధ్య బంధం ఎందులో ఏర్పడుతుంది?

1) శాస్త్రీయ నిబంధనం    2) గెస్టాల్ట్‌ అభ్యసనం

3) యత్నదోష అభ్యసనం    4) కార్యసాధక నిబంధనం


10. సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాల ముఖ్య లక్షణం?

1) నిబంధనం     2) అలవాటు చేయడం

3) అనియత అభ్యసనం    4) బట్టీ అభ్యసనం


11. ఒక సంక్లిష్టమైన భావనను వివరించడంలో ఒక ఉపాధ్యాయుడు A అనే బోధనా పద్ధతిని ఉపయోగించాడు. దాని ద్వారా మంచి ఫలితాలు రాకపోవడంతో B అనే బోధనా పద్ధతికి మారాడు. ఆశించిన ఫలితాలు రావడంతో దానినే వినియోగిస్తున్నాడు. ఇది ఏ అభ్యసనా పద్ధతికి దగ్గరగా ఉంది?

1) కార్యసాధక నిబంధనం    2) శాస్త్రీయ నిబంధనం

3) పరిశీలనా అభ్యసనం    4) అంతర్‌దృష్టి అభ్యసనం


12. నిర్మాణవాద అభ్యసన పరిస్థితిలో ఉపాధ్యాయుడి పాత్ర?

1) క్రమశిక్షణను అమలు చేయడం    2) విజ్ఞానాన్ని ప్రసారం చేయడం

3) విలువలను సృష్టించడం    4) అభ్యసనానికి వీలు కల్పించడం


13. 9వ తరగతిలోని ముగ్గురు విద్యార్థులు అన్ని సాధన పరీక్షల్లో 1, 2, 3 స్థానాల్లోనే మారుతుంటారు. ఎప్పుడూ వీరు ఒకరిపై మరొకరు ఈర్ష్య పడుతుంటారు. కారణమేంటి?

1) క్రియాత్మక    2) భావాత్మక

3) మానసిక - చలనాత్మక    4) జ్ఞానాత్మక


14. కారు నడపడం నేర్చుకోవడాన్ని చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం?

1) యత్నదోష    2) అంతర్‌ దృష్టి   

3) శాస్త్రీయ    4) కార్యసాధక


15. అభ్యాసనియమాన్ని ఏ సంప్రదాయం ఏర్పరచింది?

1) ప్రవర్తనావాదం    2) నిర్మాణాత్మక వాదం

3) గెస్టాల్ట్‌ స్కూల్‌    4) మనోవిశ్లేషకులు


16. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?

1) బ్రూనర్‌     2) రోజర్స్‌            3) బండూర    4) వైగోట్‌ స్కీ


17. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన ఏది?

1) అనుగుణ్యం    2) సాంశీకరణం  

3) స్కీమా     4) సమతుల్యత


18. బండూర ప్రకారం కింది ప్రవర్తనా నమూనాలో ముఖ్యం కానిది?

1) సాంప్రదాయక నిబంధనం            2) పరిశీలకుల లక్షణాలు

3) అనుకరణ ప్రవర్తనా పర్యవసానాలు        4) నమూనా లక్షణాలు


19. శిశువును తెల్లటి ఎలుకకు భయపడేలా సాంప్రదాయక నిబంధనలో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లటి కుందేలును చూసి కూడా భయపడితే అది?

1) ఉద్దీపన - గుర్తించడం    2) ఉద్దీపన - విభేదీకరించడం

3) ఉద్దీపన - సాధారణీకరణం    4) ఉద్దీపన - విచక్షణ


20. ‘ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ గెస్టాల్ట్‌ సైకాలజీ’ అనే పుస్తకాన్ని రచించినవారు?

1) కర్ట్‌కోఫ్‌కా    2) మాక్స్‌వర్ధిమర్‌

3) కార్ల్‌యంగ్‌    4) కోహ్లెర్‌


21. కింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యల్లాంటి తక్కువ స్థాయి మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది?

1) మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం    2) ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం

3) వికాస మనోవిజ్ఞాన శాస్త్రం  4) మానవతావాదం


22. ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా    నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు?

1) అనుకూల పునర్బలనం        2) ప్రతికూల పునర్బలనం

3) కార్యసాధక నిబంధనం    4) విరమణ


23. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించింది?

1) సరికాని సంజ్ఞలను సరిచేసే చికిత్సాత్మక పద్ధతులు

2) జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు

3) పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం

4) ఆలోచించే సామర్థ్యాభివృద్ధి


24. వేటిని నొక్కి చెప్పే అభ్యసన పరిసరం కలిగించడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఆత్మభావన పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుడు సహాయపడొచ్చు?

1) నిష్పాదన లక్ష్యాలను సాధించే మూర్త పునర్బలనం

2) సాంఘిక పరస్పర చర్య కీలకంగా ఉండే బోధనాకృత్యాలు

3) వైయుక్తిక ప్రగతి, మానవశీల చింతన

4) ఒకేస్థాయి సాధన కలిగే విద్యార్థుల్లో అభ్యసించే అవకాశాలు


25. శాస్త్రీయ, కార్యసాధక నిబంధన ప్రక్రియలో అభ్యాసన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? 

1) S - R నిబంధనంలో కంటే R - S నిబంధనంలో క్రియాత్మకంగా ఉంటుంది.

2) R - S నిబంధనంలో కంటే S - R నిబంధనంలో క్రియాత్మకంగా ఉంటుంది.

3) S - R, R - S నిబంధనలు రెండింటిలోనూ క్రియాత్మకంగా ఉంటుంది.

4) S - R, R - S నిబంధనలు రెండింటిలోనూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది.


26. గెస్టాల్ట్‌ అభ్యసనం దేని ద్వారా జరుగుతుంది?

1) అంతర్బుద్ధి    2) అనుకరణ

3) ప్రత్యక్ష వ్యవస్థీకరణ    4) ఆశించడం


27. వైగోట్‌ స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష?

1) వ్యక్తిగత భాష    2) అహంకేంద్రక భాష

3) సంస్కృతిపరమైన భాష    4) సాంఘిక భాష


28. ఉపాధ్యాయుడు శిక్షించిన ఒకటో తరగతి విద్యార్థి ఉపాధ్యాయులందరి పట్ల భయం పెంపొందించుకుంటాడు. ఇది దేనికి ఉదాహరణ?

1) సాంఘిక అభ్యసన సిద్ధాంతం    2) నిబంధనా సిద్ధాంతం

3) గెస్టాల్ట్‌ సిద్ధాంతం       4) సంజ్ఞానాత్మక సిద్ధాంతం


29. ఒక 5వ తరగతి విద్యార్థి, తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం?

1) అంతర్‌దృష్టి అభ్యసనం    2) సాంఘిక అభ్యసనం

3) కార్యసాధక నిబంధనం   4) సాంప్రదాయక నిబంధనం


30. స్వయంవేగంతో అభ్యసించడం దేనిలో సాధ్యమవుతుంది?

1) కృత్యాధార అభ్యసనం    2) కార్యక్రమ బోధన

3) మొత్తం తరగతి బోధన   4) చిన్న సమూహాల్లో బోధన


31. కిందివాటిలో ఒకటి అభ్యాసకుడి అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది?

1) నిలుపుదల       2) వివేచనం   

3) అనుకరణ       4) పరిశీలన


32. సమస్యా పరిష్కారంలో నూతన పద్ధతిని ఏ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు?

1) S - R నిబంధనం    2) R - S నిబంధనం

3) అంతర్‌దృష్టి అభ్యసనం    4) సాంఘిక అభ్యసనం


33. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి బహుమతి పొందేందుకు మాత్రమే చదివేందుకు అలవాటు పడితే, ఇది దేనికి ఉదాహరణ?

1) కార్యసాధక నిబంధనా సిద్ధాంతం   

2) S - R నిబంధనా సిద్ధాంతం   

3) R - S నిబంధనా సిద్ధాంతం   

4) S - R, R - S నిబంధనా సిద్ధాంతాలు


34. శిశువు అతిముఖ్యమైన శోధనలకు ఎవరు మార్గదర్శకత్వం వహిస్తారని వైగోట్‌స్కీ సాంఘిక - సాంస్కృతిక సిద్ధాంతం సూచిస్తుంది?

1) తల్లిదండ్రులు మాత్రమే      2) ఇతర పిల్లలు

3) ట్యూటర్ల పాత్ర వహించే వయోజనులు  4)  తల్లిదండ్రులు లేదా పిల్లలు 


35. సాంప్రదాయక నిబంధనానికి ఉదాహరణ-

1) విద్యుత్తు ఘాతం నుంచి కుక్కలు అసహాయతను నేర్చుకోవడం

2) ఆహారం కోసం ఎలుక మీట నొక్కడం  3) గంట మోతకు కుక్క లాలాజలాన్ని స్రవించడం నేర్చుకోవడం 

4) పావురం ఆహారం విడుదల కోసం ‘కీ’ని ముక్కుతో కొట్టడం



సమాధానాలు

1-3; 2-1; 3-1; 4-2; 5-1; 6-1; 7-2; 8-1; 9-3; 10-1; 11-1; 12-4; 13-2; 14-1; 15-1; 16-4; 17-1; 18-1; 19-3; 20-1; 21-4; 22-2; 23-4; 24-3; 25-1; 26-3; 27-1; 28-2; 29-2; 30-2; 31-2; 32-3; 33-2; 34-3; 35-3.


 

రచయిత: కోటపాటి హరిబాబు  
 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌