• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIMHANS: నిమ్‌హాన్స్‌, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(నిమ్‌హాన్స్‌)… 2024-25 విద్యా సంవత్సరానికి కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులరు జూన్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

1. బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ: 11 సీట్లు

2. బీఎస్సీ నర్సింగ్: 85 సీట్లు

3. బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ: 11 సీట్లు

4. బీఎస్సీ క్లినికల్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 07 సీట్లు

5. సర్టిఫికెట్ల కోర్సు- న్యూరోపాథాలజీ టెక్నాలజీ: 02 సీట్లు

6. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ సైకియాట్రిక్/ మెంటల్ హెల్త్ నర్సింగ్: 45 సీట్లు

7. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ న్యూరోసైన్స్ నర్సింగ్: 09 సీట్లు

అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: బీఎస్సీ కోర్సుకు 17- 25 ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికేట్ కోర్సుకు గరిష్ఠంగా 40 ఏళ్లు; పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.750; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.06.2024.

బీఎస్సీ కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీ: 21.07.2024.

బీఎస్సీ కోర్సుల పరీక్ష ఫలితాల వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ, సర్జిఫికెట్‌ కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 01.08.2024.

డిప్లొమా కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 02.08.2024.

తరగతులు ప్రారంభం: 01.09.2024.


Some more information 
 
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 10-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :