మహారాష్ట్ర, భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా… గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
2. టెక్నీషియన్ అప్రెంటిస్
3. జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 49.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీహెచ్ఎం.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్/ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9,000. టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000.
వయోపరిమితి: 14-18 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను చీఫ్ జనరల్ మేనేజర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా, భండారా, మహారాష్ట్ర చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 13-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
PNB Apprentice: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 2,700 అప్రెంటిస్ ఖాళీలు
RRC: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో 1104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు