• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IDFC: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 

ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదవలేని ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రైవేట్ రంగానికి చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు చేయూతనందించేందుకు గాను ఉపకారవేతనాన్ని అందిస్తోంది. అర్హులైన ఎంబీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

* ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు ఎంబీఏ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

అర్హత: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు సూచించిన విద్యాసంస్థలో 2024 విద్యా సంవత్సరం రెండేళ్ల ఫుల్‌టైం ఎంబీఏ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలు మించకూడదు.

ఉపకారవేతనం: ఏడాదికి రూ.లక్ష చొప్పున రెండేళ్లకు రూ.2 లక్షలు అందుతుంది. మొత్తం 350 మందిని ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: బ్యాంకు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ సంబంధిత ధ్రువీకరణ పత్రాలైన డిగ్రీ మార్క్స్‌షీట్‌, ఆదాయ ధ్రువతపత్రం తదితరాలను అప్‌లోడ్‌ చేయాలి.

సందేహాల నివృత్తికి: mbascholarship@idfcfirstbank.com సంప్రదించవచ్చు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్లర్క్‌ కొలువు సాధనతో సులువు!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!



Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి