• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Inspire Manak 2025: ఇన్‌స్పైర్‌ మనక్‌ 2024-25 

* వినూత్న ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ

* 2025 ఏడాదికి ఇన్‌స్పైర్‌ ప్రతిపాదనల ఆహ్వానం 

* దరఖాస్తుకు సెప్టెంబరు 15 వరకు గడువు

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ‘ఇన్‌స్పైర్‌ మనక్‌’ పేరిట ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబరు 15 వరకు గడువును ఇచ్చింది.

ఆన్‌లైన్‌ ద్వారా వివరాల నమోదు 

2024-25 ఏడాదికి గానూ ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై ఒకటి నుంచి మొదలైంది. 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు అభ్యసించే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. ఉన్నత పాఠశాలల నుంచి ఐదు చొప్పున, ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మూడు చొప్పున నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. పాఠశాల అథారిటీ ఐచ్ఛికాన్ని క్లిక్‌చేసి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ చేసి, పాఠశాల వివరాలను పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈ-మెయిల్, యూజర్‌ ఐడీతో లింక్‌ రాగానే పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. దీని తర్వాత ప్రాజెక్టు నమూనాకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపర్చాలి.

పోటీలు.. ప్రోత్సాహకాలు

* జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తే.. అక్కడ ఉత్తమంగా ఉన్న వాటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చాటితే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ స్థాయి ప్రాజెక్టులకు ప్రభుత్వం పేటెంట్‌ హక్కులను ఇస్తుంది. జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తే రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవొచ్చు.

* జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో నమూనా ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేలు పారితోషికం ఇస్తారు.

* రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులకు సంబంధించి విద్యార్థులు పాల్గొని అక్కడ వారి ప్రతిభను, సామర్థ్యాన్ని చూపి జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైన ప్రాజెక్టులకు గానూ బాల మేధావులకు రూ.25వేల వరకు శాస్త్ర, సాంకేతిక మండలి శాఖ అదనపు నిధులను కేటాయిస్తోంది. 

ఏయే అంశాల్లో చేయాలంటే..

శాస్త్రీయంగా సమాజానికి ఉపయోగ పడేలా చేసిన ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, స్వచ్ఛభారత్, మేక్‌ ఇన్‌ ఇండియా, సమాజాభివృద్ధి, క్లీన్‌ ఇండియా, అంశాల ఆధారంగా ప్రాజెక్టులను రూపొందించాలి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :