• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు 

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. చైనాలో రాచరిక పాలనను పడదోసిన తర్వాత రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి. వీటి మధ్య పోలికలు, తేడాలు ఏమిటి? (విషయ అవగాహన)

జ: చైనాలో రాచరిక పాలనను ప్రజలు తిరస్కరించారు. ప్రజలు, పాలనాధికారులు ఈ పాలనపై విసిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రకాల పాలనలు ఏర్పడ్డాయి.

అవి: 1. సన్-యెట్-సెన్ ఆధ్వర్యంలో గణతంత్ర రాజ్యం.

    2. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) గణతంత్ర రాజ్యం

2. భారత దేశం, నైజీరియాలలోని జాతీయ ఉద్యమాలను పోల్చండి. భారతదేశంలో ఇది ఎందుకు బలంగా ఉంది? (విషయ అవగాహన)

జ:

జాతీయ ఉద్యమం భారత్‌లో బలంగా ఉండటానికి కారణాలు:

* భారతీయుల్లో జాతీయ చైతన్యం, తదితర భావాలతో అన్నివర్గాల ప్రజలు ఏకతాటిపై నడవడం.

* గాంధీజీ అనుసరించిన అహింసాయుత పోరాటం.

* ఆంగ్ల భాష ద్వారా భారతీయులు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లాంటి అంశాలను తెలుసుకోగలగడం.

* బ్రిటిషర్లు భారతీయ సంపదను దోచుకుపోవడం.

* విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిషర్లపై భారతీయులు ద్వేషం పెంచుకోవడం.

* శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాలు భారతీయుల్లో జాతీయ భావనను పెంచడం.
 

3. స్వతంత్ర నైజీరియా దేశం ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన సవాళ్లతో పోలికలు, తేడాలు ఏమిటి? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)

జ: 1963 అక్టోబరు 1న నైజీరియా స్వాతంత్య్రం పొందినప్పటికీ, అనతికాలంలోనే పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది. సైనిక పాలనలో అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగాయి. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ, అవి ఫలించలేదు. చమురును వెలికితీయడం వల్ల అనేక పర్యావరణ సమస్యలేర్పడి, నిరసనలు వెల్లువెత్తాయి.

 

4. భారతదేశం, వియత్నాంలా స్వాతంత్య్రం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు. దీనికి కొన్ని కారణాలు పేర్కొనండి. (విషయ అవగాహన)

జ: * భారతదేశం, వియత్నాం దేశాల్లో జరిగిన పోరాటాలకు భిన్నంగా నైజీరియా ఉద్యమం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొనసాగింది.

* పాశ్చాత్య విద్యనభ్యసించిన నైజీరియాలోని మేధావులు ఉమ్మడి నైజీరియా దేశం అనే భావనను ప్రేరేపించారు.

* ఎన్ఎన్‌డీపీ 1923, 1928, 1933లో అన్ని స్థానాలను గెలుచుకుని బ్రిటిషర్లకు పెనుసవాలుగా మారింది.

* మకాలే బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా ప్రోత్సహించాడు.

* నైజీరియాలో వివిధ తెగల వారు సంయుక్తంగా వలస విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు.

* రెండు లక్ష్యాలతో నైజీరియన్‌లు ఉద్యమాన్ని నడిపించారు. అవి:

     1. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం

     2. వివిధ తెగల మధ్య ఐక్యమత్యం

ఈ విధంగా ఉద్యమాన్ని ఉద్దృతం చేశారు.

* ఖండాంతర ఆఫ్రికావాదం, ఖండాంతర నైజీరియా వాదం జాతీయ ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి.

* నైజీరియాలోని మూడు ప్రాంతాల్లో మూడు పార్టీలు ఏర్పడి బ్రిటిష్‌వారిపై పోరాటం సాగించాయి. ఈ కారణాల వల్ల భారతదేశం, వియత్నాంలాగ స్వాతంత్య్రం కోసం నైజీరియా మరీ అంత కష్టపడాల్సి రాలేదు.

రెండు మార్కుల ప్రశ్నలు
 

1. జాతీయతా భావం అంటే ఏమిటి? అది ఎలా రూపుదిద్దుకుంటుంది? (విషయ అవగాహన)

జ: ఏ దేశమైనా, తమ దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూ, దేశ ఐక్యతకు పాటు పడటాన్ని జాతీయతా భావం అంటారు.

* జనంలో ఆదరణ పొందిన ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, కవిత్వం, కథలు, సంగీతం లాంటివి జాతీయతాభావం రూపుదిద్దుకోవడానికి సహాయపడతాయి.
 

2. భూమిలేని రైతులకు, భూమిలేని కార్మికుడికి మధ్య తేడా ఏమిటి? (విషయ అవగాహన)

జ:  * కొంతమంది రైతులు, సొంత భూమి లేనప్పటికీ, భూస్వాముల నుంచి భూమిని కౌలుకు తీసుకునేవారు. వ్యవసాయం చేయడానికి భూమిని తీసుకున్నందుకు వీరు భూస్వాములకు కౌలు చెల్లించేవారు. అంతేకాకుండా వీరు భూస్వాముల ఇళ్లల్లోనూ, పొలాల్లోనూ పనిచేసి దుర్భర జీవనం గడిపేవారు.

* వ్యవసాయంపై భూమిలేని కార్మికులకు అంతగా అవగాహన ఉండదు. వీరు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉంటారు. వీరి ఆధీనంలో భూమి ఉండదు.

3. అమెరికా అంతటి బలమైన దేశాన్ని వియత్నాం లాంటి చిన్నదేశం ఎలా ఎదిరించగలిగింది? (ప్రశంస, సున్నితత్వం)

జ: * భూస్వాముల చేతుల్లో తరాలపాటు దోపిడీకి గురై, అప్పుడే కొంత భూమిని పొందిన లక్షలాది పేద రైతులు, తిరిగి తమ భూములను ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో, ధైర్యాన్ని కూడగట్టుకున్నారు.

* స్వాతంత్య్రం కోసం పోరాడటానికి వీలుగా ప్రజలకు జాతీయతా భావం ఇచ్చిన ప్రేరణ వల్లే అమెరికాను వియత్నాం ఎదిరించగలిగింది.

* అటు జాతీయతాభావం, ఇటు తిరిగి తాము ఎలాంటి కష్టాలను అనుభవించాలో అనే భావనతో రైతులు ధైర్యసాహసాలు ప్రదర్శించారు.

* భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన పేద రైతులు ప్రపంచంలోకెల్లా మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించగలిగారు.

4. భారతదేశంలో అమలైన భూసంస్కరణలను చైనాలో జరిగిన వాటితో పోల్చండి. (విషయ అవగాహన)

జ: * భారతదేశంలో భూసంస్కరణలు సరైన రీతిలో జరగలేదు. చైనాలో ప్రణాళికాబద్ధంగా భూసంస్కరణలు అమలు చేశారు.

* భారత్‌లో జమీందారుల ఆధీనంలో సాగుచేస్తున్న కౌలుదారులను ప్రభుత్వం భూయజమానులుగా గుర్తించినప్పటికీ, పెద్ద మొత్తంలో కౌలు చెల్లించలేక వారు కౌలుదారులుగా, వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. చైనాలో అలా కాకుండా భూస్వాముల భూమినంతటినీ స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేశారు.

* భారత్‌లో భూస్వాముల మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నప్పుడు, జమీందారులు తమ బంధువులు, దూరపు బంధువుల పేరున మిగులు భూమిని రాయించారు. చైనాలో పేద, మధ్యతరగతి ప్రజలతోనే భూసంస్కరణ సంఘాలు ఏర్పరచి, వారిని పని బృందాలు గా ఏర్పాటు చేసి వాటి ద్వారా విజయం సాధించారు.

5. భారతదేశంలో బ్రిటిషర్లు, వియత్నాంలో ఫ్రెంచివారు అనుసరించిన వలసపాలన విధానాలను పోల్చండి. (విషయ అవగాహన)

జ:

 

   

ఒక మార్కు ప్రశ్నలు

1. మహిళలు వేటిపై శ్రద్ధ పెట్టాలని చియాంగ్ అన్నాడు? (విషయ అవగాహన)

జ: పాతివ్రత్యం, రూపం, మాట, పని అనే నాలుగు సుగుణాలపై మహిళలు శ్రద్ధ పెట్టాలని చియాంగ్ అన్నాడు.
 

2. ఏజెంట్ ఆరెంజ్ అంటే ఏమిటి? (విషయ అవగాహన)

జ: చెట్లు, మొక్కలను చంపేసి, భూమిని చాలా సంవత్సరాల పాటు బీడుగా మార్చే విష పదార్థాన్ని 'ఏజెంట్ ఆరెంజ్' అంటారు.
 

3. గుయో మిండాంగ్ పార్టీ ఆశయాలేమిటి?  (ప్రశంస, సున్నితత్వం)

జ: భూసంస్కరణలు, జాతీయీకరణ గుయో మిండాంగ్ పార్టీ ఆశయాలు.
 

4. 20వ శతాబ్దంలో చైనాను ఎవరు పరిపాలించారు? (విషయ అవగాహన)

జ: 20వ శతాబ్దంలో చైనాను మంచూ రాజవంశం పరిపాలించింది.
 

5. నైజీరియాలో మొదటి రాజకీయపార్టీని ఎవరు స్థాపించారు? దాని పేరేమిటి?  (విషయ అవగాహన)

జ: క్రీ.శ.1923లో హెర్బర్ట్ మకాలే ఈ పార్టీని స్థాపించాడు. దీని పేరు నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (ఎన్ఎన్‌డీపీ).
 

6. సన్-యెట్-సేన్ సిద్ధాంతాలేవి?  (విషయ అవగాహన)

జ: జాతీయవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం (సన్, మిన్, చుయి) సన్-యెట్-సెన్ సిద్ధాంతాలు.

7. నైజీరియాలోని ముఖ్య తెగలు ఏవి?  (విషయ అవగాహన)

జ: ఉత్తర నైజీరియాలోని హౌసా-పులాని, ఆగ్నేయ నైజీరియాలోని ఈబో తెగ, నైరుతి భాగంలో యొరుబా తెగ నైజీరియాలోని ముఖ్యమైన తెగలు.
 

8. వియత్‌మీన్ అంటే ఏమిటి? (విషయ అవగాహన)

జ: జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన వియత్నాం స్వాతంత్య్ర సమితిని వియత్‌మీన్ అంటారు.
 

9. ఖండాంతర్గత ఆఫ్రికావాదం అంటే ఏమిటి?  (విషయ అవగాహన)

జ: దేశం, తెగ అనే భేదం లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడాన్ని ఖండాంతర్గత ఆఫ్రికావాదం అంటారు.


మ్యాప్ పాయింటింగ్ (పట నైపుణ్యాలు) 

  ప్రపంచ పటంలో కింద అడిగిన వాటిని గుర్తించండి.

* బ్రిటన్‌కు చెందిన వలసల్లో ఆసియాలో ఒక ప్రాంతం (భారత దేశం)

* బ్రిటన్‌కు చెందిన వలసల్లో ఆఫ్రికాలో ఒక ప్రాంతం (దక్షిణాఫ్రికా)

* హాలాండ్‌కు చెందిన ఒక ఆసియా ప్రాంతం (ఇండోనేషియా)

* హాలాండ్‌కు చెందిన ఒక ఆఫ్రికా వలస ప్రాంతం (పశ్చిమ సహారా)

* ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఆసియా ప్రాంతం (కాంబోడియా)

* ఫ్రాన్స్‌కు చెందిన ఒక ఆఫ్రికా వలస ప్రాంతం (మొరాకో)

* ఏ దేశానికి వలస పాలిత ప్రాంతంగా లేని ఆసియాలో రెండు దేశాలు (చైనా, రష్యా)

* ఏ దేశానికి వలస పాలిత ప్రాంతంగాలేని ఆఫ్రికాలోని ఒక దేశం. (ఇథియోపియా)

* ఆస్ట్రేలియా ఏ దేశానికి వలస పాలిత ప్రాంతంగా ఉంది? (ఇంగ్లండ్)

¤ వియత్నాం ¤ ఫ్రాన్స్ ¤ నైజీరియా ¤ అమెరికా ¤ కామెరూన్ ¤ పశ్చిమ సహారా ¤ ఆస్ట్రేలియా ¤ జపాను


 

రాదగిన ప్రశ్నలు 

1. దశాబ్దాల కాలంలో చైనాలో మహిళల పాత్రలో వచ్చిన మార్పులను గుర్తించండి. రష్యా, జర్మనీలో సంభవించిన మార్పులకూ, వీటికీ తేడాలు, పోలికలు ఏమిటి?  (విషయ అవగాహన)

2. చైనా, వియత్నాం, నైజీరియాల్లో వ్యవసాయ పద్ధతులు మార్చడానికి ఆ దేశాల్లో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? (విషయ అవగాహన)

3. వియత్నాం, నైజీరియా, చైనా దేశాల్లోని జాతీయ ఉద్యమాల్లో పాఠశాల విద్య పాత్ర ఏమిటి? (ప్రశంస, సున్నితత్వం)

4. యువ చైనీయులు పాత సంప్రదాయాలను, విదేశీ శక్తులను ఎందుకు వ్యతిరేకించసాగారు? (విషయ అవగాహన)

5. దేశ అభివృద్ధికి, స్వాతంత్య్రానికి స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు, వారి సమాన భాగస్వామ్యం అవసరమన్న దృక్పథంతో మీరు ఏకీభవిస్తారా? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)

6. జాతీయ వాదానికీ, ఖండాంతర ఆఫ్రికా భావానికి మధ్య తేడాలు ఏమిటో చర్చించండి.(విషయ అవగాహన)

7. పౌరులపైన, అడవులమీద నాపాలం, ఏజెంట్ ఆరెంజ్ లాంటి రసాయనిక ఆయుధాలను అమెరికా ఉపయోగించడం సరైందేనా? (విషయ అవగాహన)

8. యుద్ధంలో గెలవడానికి సీసీపీకి భూ సంస్కరణలు ఎలా దోహదపడ్డాయి?  (విషయ అవగాహన)

9. నైజీరియాలో చమురు వెలికితీయడంవల్ల ఏర్పడిన సమస్యలేవి? (విషయ అవగాహన)

Posted Date : 17-08-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు