• facebook
  • whatsapp
  • telegram

గ్రామర్‌ తెలిస్తే మార్కులు ఈజీ

పోటీ పరీక్షలకు ఇంగ్లిష్‌

 

 

టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్, టెట్, డీఎస్సీ, గురుకుల, ఎస్‌ఎస్‌సీ లాంటి అన్ని పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్‌కు ప్రాధాన్యం ఉంది. గ్రామర్‌కి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు subject - verb agreement నుంచి వస్తున్నాయి. ఎక్కువమంది అభ్యర్థులు తికమక పడి సరైన సమాధానాలు గుర్తించలేకపోతున్నారు. వ్యాకరణసూత్రాలు తెలియకపోవడమే దీనికి కారణం.  

 

మొదటగా గుర్తించాల్సిన విషయం ఇచ్చిన వాక్యంలో subject ఏక వచనంలో ఉందా? బహువచనంలో ఉందా? (సింగ్యులరా? ప్లూరలా?). ఈ విషయంపై పరిజ్ఞానం పెంచుకుంటే తప్పులు జరగవు. వ్యాకరణ నిబంధనలు గుర్తుంచుకుని ఎక్కువ ప్రశ్నలు సాధన చేస్తే ఈ టాపిక్‌పై పట్టు సాధించవచ్చు.  

 

కొన్ని  subjects 's' తో అంతమైనా అది plural కాకపోవచ్చు (ఉదా: Economics, Physics). మరికొన్ని సబ్జెక్ట్స్‌ 's' తో అంతం కానప్పటికీ అది plural అవొచ్చు (ఉదా: cattle). ఇలాంటి వాటిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి సాధన చేయాలి. దీనికి సంబంధించి కొన్ని rules and regulations చూద్దాం. 

 

Rule-1:

కొన్ని Nouns plural గా కనిపించినప్పటికీ అవి singular అవుతాయి. కాబట్టి verb singular గానే వాడాలి.

1) Name of subjects : Economics, Linguistics, Civics, Statistics, Physics

2) Name of books : The Arabian Nights

3) Name of diseases : Measles, Mumps, Rickets

4) Name of games : Billiards, Darts, Draughts

5) Name of countries : The United States, The West Indies

Eg: Economics is a difficult subject

 

Rule-2:

Sentence లోని Main Subject కు verb agreement ఉండాలి. 

Eg:

The quality of grapes is good here

Latha and not her friends is guilty

The appeal of the victims for transfer of the cases related to riots to some other states has been accepted

 

Rule-3:

రెండు subjects. Neither.. nor, either.. or, Not only.. but also, nor, or, None.. but తో జతగా ఉంటే verb దగ్గరి subject ప్రకారం రాయాలి. 

Either Ramana or his friends have come

 

Rule-4:

రెండు subjects.. with/ along with/ together with/ as well as/and not / in addition to/ unlike, like/ no less than అనే వాటితో జతగా వస్తే verb first subject కు agreement కావాలి. 

Eg: The Chief Minister along with his Cabinet Ministers has been waiting for the arrival of the P.M.

 

Rule-5:

రెండు subjects 'and' అనే conjunction తో జతగా వస్తే plural verb వస్తుంది. 

Eg: Sriram and Rajani are going there

 

Rule-6:

రెండు uncountable nouns 'and' అనే conjunction తో జతగా వచ్చి, రెండు వేర్వేరు అంశాలను చర్చిస్తే.. plural verb వస్తుంది. 

Eg: poverty and misery come together

 

Rule-7:

Article అనేది first subject ముందు మాత్రమే వాడితే person/thing ఒక్కటే అని అర్థం కాబట్టి singular verb ఉండాలి. 

Eg: A white and black gown was bought by her.

 

Rule-8:

రెండు subjects ముందు Article వాడితే అప్పుడు Two persons/ two things అనే అర్థం వస్తుంది కాబట్టి plural verb వాడాలి. 

Eg: The Director and the Manager have attended

 

Rule-9:

కొన్ని sentences Imaginary position లో ఉండి I wish/ as if/as though/ suppose/ if లతో మొదలైతే అప్పుడు past plural be form అయిన 'were' వస్తుంది. 

Eg: I wish I were an MLA If he were rich, he would help others

 

Rule-10:

Plural Numbers Plural Verb ను మాత్రమే తీసు  కుంటాయి. 

Eg: Hundred girls are there in the hostel

 

Rule-11:

Collective Nouns ను singular గా పరిగణించాలి కాబట్టి singular verb రావాలి. 

Eg: The committee has unanimously taken its decision

 

Rule-12:

Collective Nouns ఉపయోగించే సందర్భంలో విభజనగాని ఉన్నట్లయితే verb plural లో ఉండాలి. 

Eg: The jury are divided in their opinion


 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో అధికారులుగా అవకాశం

‣ బీటెక్‌తో సైన్యంలోకి..

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

Posted Date : 06-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌