• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

74 సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌, ఎంటీ ఖాళీలకు ప్రకటన

భారతదేశంలోనే మొదటి ఎరువుల కర్మాగారం.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌).. కేరళలోని కొచ్చిలో ఉంది. ఎరువుల తయారీ, మార్కెటింగ్‌లో ప్రత్యేకత సాధించిన ఈ సంస్థ 74 వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.  

సేల్స్, ప్రాసెస్, హ్యూమన్‌ రిసోర్స్, సివిల్, ఫిట్టర్‌ కమ్‌ మెకానిక్, క్రాఫ్ట్స్‌మ్యాన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మొదలైన విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. 

ఏ అర్హతలుండాలి?

1. సీనియర్‌ మేనేజర్‌ (సివిల్‌): సివిల్‌ ఇంజినీరింగ్‌ పాసై కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఎగ్జిక్యూటివ్‌గా తొమ్మిదేళ్ల అనుభవం ఉండాలి. లేదా భారీ ఫెర్టిలైజర్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌ మెయింటెనెన్స్‌ విభాగంలో పనిచేసిన అనుభవం అవసరం.  

2. సీనియర్‌ మేనేజర్‌ (హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌): హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/లేబర్‌ వెల్ఫేర్‌/సోషల్‌ వర్క్‌లో పీజీ పాసవ్వాలి. పైన పేర్కొన్న విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌గా తొమ్మిదేళ్ల అనుభవం ఉండాలి. మేనేజర్‌ కేటగిరీ పోస్టులకు వయసు 45 సంవత్సరాలు మించకూడదు. 

3. ఆఫీసర్‌ (సేల్స్‌): అగ్రికల్చర్‌ బీఎస్సీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 26 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసు 26 సంవత్సరాలు. 

4. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (కెమికల్‌): కెమికల్‌ ఇంజినీరింగ్‌ /పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ /కెమికల్‌ టెక్నాలజీ /పెట్రోకెమికల్‌ టెక్నాలజీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.  

5. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌): ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.

6. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 

7. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌): మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌/ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 

8. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌): చార్టర్డ్‌ అకౌంటెన్సీ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూఏ పాసవ్వాలి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులన్నింటికీ గరిష్ఠ వయసు 26 సంవత్సరాలు. 

9. టెక్నీషియన్‌ (ప్రాసెస్‌): కెమికల్‌/ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ డిప్లొమా పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి. 

10. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌: పదోతరగతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సులో డిప్లొమా పాసవ్వాలి. హాస్పిటళ్లు/ పరిశ్రమలు/ ప్రభుత్వ విభాగాల్లో ఐదేళ్ల పని అనుభవం ఉండాలి. 

11. క్రాఫ్ట్స్‌మ్యాన్‌ (ఫిట్టర్‌ కమ్‌ మెకానిక్‌): పదోతరగతి పాసై.. ఫిట్టర్‌/ మెకానిక్‌ నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. భారీ ఫెర్టిలైజర్‌/ కెమికల్‌/ పెట్రోకెమికల్‌ పరిశ్రమలో రెండేళ్ల పని అనుభవం అవసరం.

12. క్రాఫ్ట్స్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌): పదో తరగతి పాసై.. ఎలక్ట్రీషియన్‌గా నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. ఫెర్టిలైజర్‌/ కెఇకల్‌/ పెట్రో కెమికల్‌/ ఎలక్ట్రికల్‌ పవర్‌ జనరేషన్‌ ప్లాంట్‌లో రెండేళ్ల పని అనుభవం అవసరం. 

13. క్రాఫ్ట్స్‌మ్యాన్‌ (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): పదో తరగతి పాసై.. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. భారీ పరిశ్రమల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం అవసరం. 

14. రిగ్గర్‌ అసిస్టెంట్‌: పదో తరగతి పాసవ్వాలి. మెటీరియల్స్‌ హ్యాండ్లింగ్, రిగ్గింగ్‌ ఉద్యోగాల్లో ఐదేళ్ల అనుభవం అవసరం. టెక్నీషియన్‌ పోస్టులన్నింటికీ గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. 

ఎంపిక ఇలా

పోస్టును బట్టి సీబీటీ/ ప్రాక్టికల్‌ టెస్ట్‌/ షార్ట్‌లిస్టింగ్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 

1, 2 పోస్టులకు అర్హతల ఆధారంగా షార్ట్‌లిస్టును తయారుచేసి.. అర్హులకు కొచ్చిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

పోస్ట్‌ నంబర్‌ 3కి సీబీటీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష దిల్లీ, హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, కొచ్చీల్లో.. పర్సనల్‌ ఇంటర్వ్యూ కొచ్చిలో జరుగుతుంది. 

4-8 పోస్టులకు అభ్యర్థులను సీబీటీ, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. 

9, 10 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక సీబీటీ ఆధారంగా ఉంటుంది. 

11-13 పోస్టులకు అభ్యర్థులను సీబీటీ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. 

14 పోస్టుకు అభ్యర్థుల ఎంపిక ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఉంటుంది. 

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)

దీంట్లో రెండు పార్ట్‌లు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో.. ఆబ్జెక్టివ్‌ టైప్, మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుంది. మేనేజర్‌ (3-8) పోస్టులకు పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. పార్ట్‌-1లోని 60 ప్రశ్నల్లో.. మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ (40), జనరల్‌ ఇంగ్లిష్‌ (10), జనరల్‌ నాలెడ్జ్‌ (10) ఉంటాయి. కరెక్టు సమాధానానికి 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 0.33 మార్కులు తగ్గిస్తారు. 

పార్ట్‌-2లో టెక్నికల్‌ ఆప్టిట్యూడ్‌/ సబ్జెక్టు పరిజ్ఞానంపై 60 ప్రశ్నలుంటాయి. సరైన సమాధానానికి 1.5 మార్కులు. తప్పు రాస్తే అర మార్కు తగ్గిస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 16.05.2023

వెబ్‌సైట్‌: https://fact.co.in/home/Dynamicpages?MenuId=90
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date : 03-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌