• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

152 మైన్‌ ఓవర్‌మ్యాన్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ

ఝూర్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్‌-1లో రాత పరీక్ష, స్టేజ్‌-2లో స్కిల్‌ టెస్ట్‌ ఉంటాయి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 152 ఖాళీల్లో.. మైన్‌ ఓవర్‌మ్యాన్‌-84, ఓవర్‌మ్యాన్‌ (మ్యాగజైన్‌)-7, మెకానికల్‌ సూపర్‌వైజర్‌-22, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌-20, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌-3, మైన్‌సర్వే-9, మైనింగ్‌ సర్దార్‌-7 పోస్టులు ఉన్నాయి. 

మైన్‌ ఓవర్‌మ్యాన్, ఓవర్‌మ్యాన్‌ (మ్యాగజైన్‌) పోస్టులకు మైనింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఓవర్‌మ్యాన్, ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. 

మెకానికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు మెకానికల్‌/ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 

ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌ పోస్టుకు ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. 

ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుకు 60 శాతం మార్కులతో మైనింగ్‌ డిప్లొమా పాసవ్వాలి. ఓవర్‌మ్యాన్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. 

మైన్‌ సర్వే పోస్టుకు మైన్‌ సర్వే/మైనింగ్‌ ఇంజినీరింగ్‌/ మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి.

మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు ఇంటర్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. సర్దార్, ఫస్ట్‌ఎయిడ్‌ సర్టిఫికెట్లు ఉండాలి. ఈ పోస్టులన్నింటికీ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసయితే సరిపోతుంది.  అన్ని పోస్టులకూ ఏడాది అనుభవం ఉండాలి.  

అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరితేదీ అయిన 05.05.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (నాన్‌ క్రీమీలేయర్‌) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

రాతపరీక్ష: మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి పోస్టును బట్టి గంట నుంచి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకూ సమాన మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం సంపాదించాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. 

స్కిల్‌టెస్ట్‌: దీన్ని 100 మార్కులకు నిర్వహిస్తారు. సంబంధిత విభాగానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. దీంట్లో జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 30 శాతం కనీసార్హత మార్కులు సాధించాలి. రాత పరీక్షలో సంపాదించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. స్టేజ్‌-1, 2 పరీక్షలను రాంచీ, ఝూర్ఖండ్‌ కేంద్రాల్లోనే నిర్వహిస్తారు. పరీక్ష వేదిక, చిరునామాలను అడ్మిట్‌ కార్డ్‌లో తర్వాత తెలియజేస్తారు. 

గమనించాల్సినవి: దరఖాస్తు గడువు తేదీ నాటికి సంబంధిత విద్యార్హతలు, అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేయాలి. 

ఎంపికైన అభ్యర్థులను ఎన్‌టీపీసీకి చెందిన ఝూర్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశాల్లోని కోల్‌ మైనింగ్‌ ప్రాజెక్టుల్లో ఎక్కడైనా నియమించవచ్చు. కాబట్టి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. 

ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు స్కిల్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి. 

రాత, స్కిల్‌ టెస్టుల్లో పాసైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 05.05.2023   

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

‣ ఎంబీబీఎస్‌తో ఉన్నత ఉద్యోగం

‣ స్టాటిస్టిక్స్‌తో ఉన్నత ఉద్యోగం

‣ సమ్మర్‌ జాబ్‌తో లాభాలెన్నో..

‣ ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం

Posted Date : 03-05-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌