• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

సమగ్రతకు... సార్వభౌమత్వానికి సంరక్షణలు!

మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేందుకు, అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణలను సంరక్షించడానికిరాజ్యాంగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిని వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు లభించి దేశం ఏకతాటిపై ఉండే వీలుంటుంది. ఈ అధికారాల నేపథ్యం, రాజ్యాంగ వివరణ, వినియోగించిన సందర్భాలు,  ఆ సమయంలో దేశంలో సంభవించిన మార్పులు లాంటి అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

అత్యవసర అధికారాలు

అత్యవసర పరిస్థితి అధికారాలను మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించారు. వీటిని వినియోగించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను జర్మనీ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. కానీ వాటి అమలు సమయంలో ‘జీవించే హక్కు’ను రద్దు కాకుండా ఉండే విధానాన్ని జపాన్‌ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.  

రాజ్యాంగ సభలో అనుకూల, వ్యతిరేక వాదనలు 

రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు తప్పనిసరిగా పొందుపరచాలని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి.కృష్ణమాచారి ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరం లేదంటూ హెచ్‌.వి.కామత్, కె.టి.షా, సి.డి.దేశ్‌ముఖ్‌ పూర్తిగా వ్యతిరేకించారు. 

* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్‌ 352 నుంచి 360 మధ్య మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. 

1) జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) - ఆర్టికల్‌ 352 

2) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి (Constitutional Emergency) - ఆర్టికల్‌ 356 

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergency) - ఆర్టికల్‌ 360

జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency)

దీన్ని ఆర్టికల్‌ 352 ప్రకారం భారత రాష్ట్రపతి రెండు రకాల కారణాలతో కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు విధిస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో మూడుసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

A. బాహ్య కారణాలు: మన దేశంపై విదేశీ దాడి జరిగినప్పుడు లేదా మన దేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశ సమగ్రతను పరిరక్షించడానికి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు.

B. ఆంతరంగిక కారణాలు: దేశంలో అంతర్గతంగా కల్లోలాలు  చెలరేగి శాంతిభద్రతలు క్షీణించినప్పుడు దేశ సమగ్రతను పరిరక్షించడానికి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. 

44వ రాజ్యాంగ సవరణ చట్టం - మార్పులు: 

* ‘ఆంతరంగిక అల్లకల్లోలాలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు. 

* కేంద్ర కేబినెట్‌ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.

* కేంద్ర కేబినెట్‌ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. కానీ కేంద్ర కేబినెట్‌ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి. 

* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ 30 రోజుల్లోగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. అంతకు ముందు పార్లమెంట్‌ రెండు నెలల్లోగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలని ఉండేది. 

 ఆమోదం-రద్దు

* ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ 2/3 ప్రత్యేక మెజార్టీతో 30 రోజుల్లోగా ఆమోదించాలి. 

* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఈ ప్రకటనను ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. 

* దీన్ని ఆమోదించే విషయంలో పార్లమెంట్‌ ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. 

* పార్లమెంట్‌ ఆమోదంతో 6 నెలలకొకసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు.

* జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే ఎప్పుడైనా రద్దుచేయవచ్చు.

* ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ రద్దు చేయగలదు. 

* 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు సభ్యుల సంతకాలతో జాతీయ అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ ఒక తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌/రాష్ట్రపతికి అందజేయాలి. దీని ప్రకారం సాధారణ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు.

దేశంలో సంభవించే మార్పులు 

ఆర్టికల్‌ 250:

* రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. 

* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.

ఆర్టికల్‌ 353:

* రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలపై కేంద్రం పరిమితులను విధించగలదు.

ఆర్టికల్‌ 354:

* కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే వనరులను కేంద్రం నిలిపివేయవచ్చు.

* రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలపై కేంద్రం పరిమితులను విధించగలదు. 

ఆర్టికల్‌ 358:

* దీని ప్రకారం ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సహజంగానే రద్దవుతాయి.

* 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ప్రకారం బాహ్య కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సహజంగా రద్దు అవుతాయి. ఆంతరంగిక/సాయుధ కారణాలతో విధించినప్పుడు ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సహజంగా రద్దు కావని, రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేక ప్రకటనల ద్వారా మాత్రమే రద్దు అవుతాయని, దీన్ని పార్లమెంట్‌ ఆమోదించాలని నిర్దేశించారు.

ఆర్టికల్‌ 359:

* జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులను మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్‌ చేయవచ్చు. 

* ఉన్నత న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు జారీ చేసే రిట్స్‌పై పార్లమెంట్‌ చట్టబద్ధమైన పరిమితులను విధించగలదు.

చట్టసభల పదవీకాలం పొడిగింపు

* జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాననసభల పదవీకాలం గడువు ముగిసినప్పటికీ పొడిగించవచ్చు.

- 5వ లోక్‌సభ పదవీకాలం 1976 మార్చి 18న ముగిసేనాటికి ఆంతరంగిక కారణాలతో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. దాంతో ఆ లోక్‌సభ పదవీకాలాన్ని 1977 మార్చి 18 వరకు పొడిగించారు. కానీ 1977 జనవరి 18న లోక్‌సభను రద్దు చేశారు. మొత్తంగా 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది. 

- 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు. 

- ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం అదనంగా (1977 - 78) పొడిగించారు.

 జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు

* 1962లో భారతదేశంపై చైనా దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మన దేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది 1962 అక్టోబరు 26 నుంచి 1968 జనవరి 10 వరకు అమలులో ఉంది. 

* 1971 డిసెంబరు 3 నుంచి 1977 మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేశారు. 1971లో బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి విధించారు.

* 1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నియంత్రించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ విధించారు. 

* 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్‌ 352(4) ద్వారా ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చని నిర్దేశించారు. 1975 నుంచి 1977 మధ్య మన దేశంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు. 

విమర్శలు 

* ‘అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి శ్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది’ - హెచ్‌.వి.కామత్‌

* ‘అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిపే దోపిడీ లాంటివి’ - కె.ఎం.నంబియార్‌

* ‘భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు’ - డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 19-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటు - అధికారాలు, విధులు

   మాదిరి ప్ర‌శ్న‌లు

1. మనదేశంలో తొలిసారిగా ఏ చట్టం ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణశాఖను వేరుచేశారు?

1) చార్టర్‌ చట్టం, 1813        

2) చార్టర్‌ చట్టం, 1833

3) భారత ప్రభుత్వ చట్టం, 1935

4) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1892


2. కింద పేర్కొన్న అంశాల్లో సరైనవి?

ఎ) ప్రపంచ పార్లమెంటులకు తల్లి లాంటిది బ్రిటన్‌.

బి) మనదేశం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్‌ నుంచి గ్రహించింది.

సి) దేశంలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ పార్లమెంటు.

డి) మింటోమార్లే సంస్కరణల చట్టం, 1909 ప్రకారం మనదేశంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.

1) ఎ, బి, డి        2) ఎ, సి, డి       3) ఎ, బి, సి       4) ఎ, బి, సి, డి 


3. మన రాజ్యంగంలో పార్లమెంట్‌కు సంబంధించిన వివరణ ఎక్కడ ఉంది?

1) అయిదో భాగం, ఆర్టికల్‌ 79 నుంచి 122

2) ఆరో భాగం, ఆర్టికల్‌ 79 నుంచి 129

3) ఏడో భాగం, ఆర్టికల్‌ 76 నుంచి 102

4) అయిదో భాగం, ఆర్టికల్‌ 77 నుంచి 112


4. పార్లమెటు తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 1952, ఏప్రిల్‌ 3    2) 1952, ఏప్రిల్‌ 17

3) 1952, మే 13        4) 1952, జూన్‌ 18


5. పార్లమెంటుకు గల శాసనాధికారానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) ఆర్టికల్‌ 3 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ

బి) ఆర్టికల్‌ 11 పౌరసత్వానికి సంబంధించిన అంశాలు

సి) ఆర్టికల్‌ 71 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు

డి) ఆర్టికల్‌ 169(1) రాష్ట్రాల్లో ఎగువసభ అయిన విధానపరిషత్‌ ఏర్పాటు/తొలగింపు

1) ఎ, బి, డి సరైనవి         2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి సరైనవి         4) ఎ, బి, సి, డి సరైనవి


6. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్‌ చట్టాలను రూపొందించే సందర్భాన్ని గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 249 - జాతీయ ప్రాధాన్యతరీత్యా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేసినప్పుడు

బి) ఆర్టికల్‌ 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు

సి) ఆర్టికల్‌ 253 - అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం

డి) ఆర్టికల్‌ 356 - రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాలకు

1) ఎ, బి, సి సరైనవి        2) ఎ, బి, డి సరైనవి

3) ఎ, సి, డి సరైనవి        4) ఎ, బి, సి, డి సరైనవి


7. పార్లమెంటు కేంద్ర కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే పద్ధతిని గుర్తించండి.

ఎ) కోత తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా

బి) అవిశ్వాస, విశ్వాస తీర్మానాల ద్వారా

సి) ద్రవ్య బిల్లులు, బడ్జెట్‌ను తిరస్కరించడం ద్వారా

డి) ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా

1) ఎ, బి, డి       2) ఎ, సి, డి       3) ఎ, బి, సి      4) ఎ, బి, సి, డి 


8. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంట్‌ రాజ్యాంగాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా సవరించగలదు?

1) ఆర్టికల్‌ 368    2) ఆర్టికల్‌ 362

3) ఆర్టికల్‌ 358    4) ఆర్టికల్‌ 378


9. పార్లమెంటు అనుమతి లేనిదే ప్రజల వద్ద నుంచి నూతన పన్నులు వసూలు చేయరాదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 355     2) ఆర్టికల్‌ 265

3) ఆర్టికల్‌ 275     4) ఆర్టికల్‌ 382


10. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే పార్లమెంట్‌ నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటుచేస్తుంది?

1) ఆర్టికల్‌ 312     2) ఆర్టికల్‌ 362

3) ఆర్టికల్‌ 372    4) ఆర్టికల్‌ 216


11. ప్రధాని నాయకత్వంలోని కేంద్రమంత్రి మండలి ఎవరికి సమష్టి బాధ్యత వహించాలి?

1) రాష్ట్రపతి    2) రాజ్యసభ    3) లోక్‌సభ    4) సుప్రీంకోర్టు


12. మనదేశంలో జాతీయస్థాయిలో తొలిసారిగా ఏ చట్టం ద్వారా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు?

1) రెగ్యులేటింగ్‌ చట్టం, 1773  

2) మింటోమార్లే సంస్కరణల చట్టం, 1909

3) చార్టర్‌ చట్టం, 1833      

4) మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919


సమాధానాలు

1-2; 2-3; 3-1; 4-3; 5-4; 6-4; 7-4; 8-1; 9-2; 10-1; 11-3; 12-4.


 

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి - శాసనాధికారాలు

మాదిరి ప్రశ్నలు

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంట్‌ అంటే?
1) రాజ్యసభ, లోక్‌సభ
2) రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ
3) కేబినెట్, రాజ్యసభ, లోక్‌సభ
4) ప్రధానమంత్రి, రాజ్యసభ, లోక్‌సభ


2. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైంది?
ఎ) పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని 'సమన్స్‌' అంటారు.
బి) పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడాన్ని 'ప్రోరోగ్‌' అంటారు.
సి) లోక్‌సభ రద్దు చేయడాన్ని 'డిసాల్వ్‌' అంటారు.
డి) రాజ్యసభను కొనసాగించడాన్ని 'అడార్ఫ్‌' అంటారు. 

1) ఎ, బి, సి   2) ఎ, బి, డి  3) ఎ, సి, డి  4) ఎ, బి, సి, డి

 

3. ఆర్టికల్‌ 80(3) ప్రకారం కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతమందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు?
1) 6              2) 8           3) 12        4) 17

 

4. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదముద్ర ద్వారా చట్టాలుగా మారతాయి?
1) ఆర్టికల్‌ 110          2) ఆర్టికల్‌ 111         3) ఆర్టికల్‌ 113              4) ఆర్టికల్‌ 114

 

5. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు దేశ శ్రేయస్సు కోసం ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవితకాలం ఎంత?
1) పార్లమెంటు సమావేశమైన 6 వారాలు
2) పార్లమెంటు సమావేశమైన 6 నెలలు
3) పార్లమెంటు సమావేశమైన 3 నెలలు
4) పార్లమెంటు సమావేశమైన 8 వారాలు

 

6. ఆర్టికల్‌ 108 ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన జరిగిన పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాలకు సంబంధించి సరికానిది?
1) 1961లో వరకట్న నిషేధ బిల్లుపై సమావేశం జరిగింది.
2) 1965లో జాతీయ వ్యవసాయ బిల్లుపై సమావేశం జరిగింది. 
3) 1978లో బ్యాంకింగ్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లుపై సమావేశం జరిగింది.
4) 2002లో పొటో (POTO) బిల్లుపై సమావేశం జరిగింది. 

 

సమాధానాలు
1-2;  2-1;  3-3;  4-2;  5-1;  6-2.

Posted Date : 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 రాష్ట్రప‌తి అధికారాలు-విధులు

నమూనా ప్రశ్నలు


1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 74(1) ప్రకారం పరిపాలనా వ్యవహారాల్లో రాష్ట్రపతికి సహకరించేది ఎవరు?

 1) పార్లమెంట్‌                 2) ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి       

 3) కేంద్ర ఆర్థిక సంఘం      4) సుప్రీంకోర్టు


2. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయసలహాదారుడిగా వ్యవహరించేది?

1) రాష్ట్రపతి                                        2) కేంద్ర న్యాయశాఖామంత్రి   

3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి        4) అటార్నీ జనరల్‌


3. కింద పేర్కొన్న ఏ పదవిని రాష్ట్రపతి భర్తీచేయరు?

1) లోక్‌పాల్‌ ఛైర్మన్, సభ్యులు                2) లోకాయుక్త ఛైర్మన్, సభ్యులు 

3) జాతీయ సమాచార కమిషన్‌ ఛైర్మన్‌    4) హైకోర్టు న్యాయమూర్తులు


4. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ప్రకారం ‘పార్లమెంట్‌’ అంటే...

1)   రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ                     2) ప్రధానమంత్రి, రాజ్యసభ, లోక్‌సభ 

 3) కేంద్ర మంత్రిమండలి, రాజ్యసభ, లోక్‌సభ       4) సుప్రీంకోర్టు, రాజ్యసభ, లోక్‌సభ


5. భారత రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సామాజిక సేవ, క్రీడారంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతమంది సభ్యులను రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు?

1) 14               2) 2               3)12              4)16


6. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?

1) పార్లమెంట్‌ సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్‌’ అంటారు. 

2) రాజ్యసభను రద్దుచేయడాన్ని ‘రిగ్రెట్‌’ అంటారు.

3) పార్లమెంట్‌ సమావేశాలను దీర్ఘకాలంపాటు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్‌’ అంటారు. 

4) లోక్‌సభను రద్దుచేయడాన్ని ‘డిసాల్వ్‌’ అంటారు.


7. సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో పార్లమెంట్‌ ఉభయసభల మధ్య అభిప్రాయభేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

1)  ఉపరాష్ట్రపతి                               2) ప్రధానమంత్రి   

3)  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి     4) లోక్‌సభ స్పీకర్‌


8. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు దేశశ్రేయస్సు కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ను ఎవరు జారీచేస్తారు? 

1) ప్రధానమంత్రి                 2) రాష్ట్రపతి           

3) లోక్‌సభ స్పీకర్‌              4) రాజ్యసభ ఛైర్మన్‌


9. ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవితకాలాన్ని గుర్తించండి.

1) పార్లమెంట్‌ సమావేశమైన 6 వారాలు      2) 6 నెలల 6 వారాలు     

3) ఏడున్నర నెలలు లేదా 222 రోజులు      4) పైవన్నీ  


10. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను’ ఎవరి అనుమతితో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి?

1) సంబంధిత రాష్ట్ర శాసనసభ      2) సంబంధిత రాష్ట్ర గవర్నర్‌   

 3) రాష్ట్రపతి                            4) రాజ్యసభ ఛైర్మన్‌


11. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ‘కేంద్ర వార్షిక బడ్జెట్‌’ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది?

1)  ఆర్టికల్‌ 110          2) ఆర్టికల్‌ 111         

 3) ఆర్టికల్‌ 112          4) ఆర్టికల్‌ 113


12. ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు భారత ప్రభుత్వం రాష్ట్రపతి నియంత్రణలో ఉండే ఏ నిధిని ఆశ్రయిస్తుంది?

1) భారత సంఘటిత నిధి            2) భారత అసంఘటిత నిధి       

3) భారత సంకల్పిత నిధి            4) భారత రిజర్వ్‌ నిధి


13. మనదేశం తరఫున మిత్రదేశాలకు రాయబారులను నియమించేది?

1) ప్రధానమంత్రి                2)విదేశాంగ శాఖామంత్రి           

3) పార్లమెంట్‌                   4) రాష్ట్రపతి


14. శత్రుదేశాలపై యుద్ధం ప్రకటించేది, శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించేది ఎవరు?

1) ప్రధానమంత్రి      2) రాష్ట్రపతి   

3) రక్షణమంత్రి       4) హోంమంత్రి


15. భారతదేశంలో త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌గా ఎవరు వ్యవహరిస్తారు?

1) రక్షణమంత్రి           2) హోంమంత్రి     

3) ప్రధానమంత్రి         4)రాష్ట్రపతి


16. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు?

1) ఆర్టికల్‌ 70           2) ఆర్టికల్‌ 72     

  3) ఆర్టికల్‌ 73         4) ఆర్టికల్‌ 74
 

17. భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితి అధికారాలను ఎక్కడ పేర్కొన్నారు?

    1) XVII వ భాగం - ఆర్టికల్‌ 352 నుంచి 360 వరకు 

    2) XVIII వ భాగం - ఆర్టికల్‌ 352 నుంచి 360 వరకు

    3) XVI వ భాగం - ఆర్టికల్‌ 356 నుంచి 360 వరకు 

    4) XV వ భాగం - ఆర్టికల్‌ 356 నుంచి 360 వరకు


18. రాజ్యాంగ నిర్మాతలు అత్యవసర పరిస్థితి అధికారాలను ఎక్కడి నుంచి గ్రహించారు?

    1) 1935 భారత ప్రభుత్వ చట్టం  

    2) జర్మనీ రాజ్యాంగం  

    3) 1919 భారత ప్రభుత్వ చట్టం  

    4) జపాన్‌ రాజ్యాంగం


19. అత్యవసర పరిస్థితి అధికారాలను ప్రయోగించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

    1) అమెరికా     2) బ్రిటన్‌  

    3) జర్మనీ        4) జపాన్‌


20. రాజ్యాంగంలో పేర్కొన్న వివిధ రకాల అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది?

    1) జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 352

    2) ప్రాంతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 354 

    3) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన - ఆర్టికల్‌ 356 

    4) ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 360


21. ఆర్టికల్‌ 352 ద్వారా రాష్ట్రపతి విధించే జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్‌ 2/3వ వంతు మెజార్టీతో ఎంతకాలంలోగా ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది?

    1) 1 నెల             2) 9 నెలలు  

    3) 12 నెలలు      4) 3 నెలలు


22. ఆర్టికల్‌ 352 ద్వారా విధించే జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంట్‌ ఆమోదంతో గరిష్ఠంగా ఎంత కాలం కొనసాగించవచ్చు?

    1) 6 నెలలు             2) 12 నెలలు  

    3) 3 సంవత్సరాలు  4) ఎంతకాలమైనా


23. 1951లో దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు?

    1) కేరళ                 2) పంజాబ్‌  

    3) ఉత్తర్‌ ప్రదేశ్‌        4) రాజస్థాన్‌

 

సమాధానాలు:

1- 2     2- 4    3- 2    4- 1     5- 3    6- 2    7- 4    8- 2     9- 4     10- 3    11- 3   12- 2    13- 4    14- 2  15- 4   16- 2   17- 2    18- 1   19- 3   20- 2     21- 1    22- 4    23- 2.

 

మాదిరి ప్రశ్నలు

1. రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరైంది?

1) దేశానికి ప్రథమ పౌరుడు                    2) రాజ్యాంగ అధినేత

3) త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌       4) పైవన్నీ


2. దేశ పరిపాలనను రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

1) బ్రిటన్‌ b    2) అమెరికా       3) ఐర్లాండ్‌         4) ఆస్ట్రేలియా


3. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో ఓటర్లు కానిది?

1) లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు

2) రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు

3) రాష్ట్రాల విధానపరిషత్‌లకు ఎన్నికైన సభ్యులు

4) రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు


4. ఏ కేంద్రపాలిత ప్రాంత విధానసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు?

1) చండీగఢ్‌         2) దిల్లీ        3) పాండిచ్చేరి          4) 2, 3


5. రాష్ట్రపతి ఎన్నికను పరోక్షపద్ధతిలో ఎవరు నిర్వహిస్తారు?

1) పార్లమెంట్‌         2) కేంద్ర ఎన్నికల సంఘం

3) సుప్రీంకోర్టు         4) ఎలక్టోరల్‌ కాలేజ్‌


6. ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యుల ఓటు విలువను ఏ సంవత్సర జనాభా లెక్కల ఆధారంగా నిర్వహిస్తున్నారు?

1)1971        2) 1991      3) 2001        4) 2011


7. ‘‘నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్‌’’ అనే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?

1) జర్మనీ    2) అమెరికా      3) ఐర్లాండ్‌      4) కెనడా


8. 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో ఎవరి రెండో ప్రాధాన్యతా ఓట్ల బదిలీ ద్వారా వి.వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు?

1) నీలం సంజీవరెడ్డి                 2) సి.డి. దేశ్‌ముఖ్‌

3) దామోదరం సంజీవయ్య       4) గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌


9. రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరించేది?

1) కేంద్ర న్యాయశాఖ మంత్రి         2) పార్లమెంట్‌

3) కేంద్ర ఎన్నికల సంఘం           4) సుప్రీంకోర్టు


10. రాష్ట్రపతి రాజీనామా చేసే సమయంలో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంటే రాజీనామాను ఎవరికి సమర్పించాలి?

1) కేంద్ర మంత్రి మండలి                  2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

3) పార్లమెంట్‌                                4) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)


11. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏక కాలంలో ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు?

1) కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌     2) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

3) సీనియర్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి         4) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి


12. మన దేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?

1) జస్టిస్‌ రంగనాథ మిశ్రా            2) జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా

3) జస్టిస్‌ జగదీష్‌ శరణ్‌ వర్మ       4) జస్టిస్‌ ఎ.ఎన్‌. రే


13. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతల్లో లేని దాన్ని గుర్తించండి.

1) భారతీయ పౌరుడై ఉండాలి.        2) 35 ఏళ్లు నిండాలి.

3) దివాలాకోరై ఉండకూడదు.         4) లోక్‌సభ సభ్యుడై ఉండాలి.


14. రాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ‘ఎలక్టోరల్‌ కాలేజ్‌’ లోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించి, ఎంతమంది సభ్యులు బలపరచాలి?

1)50 మంది సభ్యులు ప్రతిపాదించి, 40 మంది సభ్యులు బలపరచాలి

2) 50 మంది సభ్యులు ప్రతిపాదించి, 50 మంది సభ్యులు బలపరచాలి
3) 50 మంది సభ్యులు ప్రతిపాదించి, 30 మంది సభ్యులు బలపరచాలి
4) 100 మంది సభ్యులు ప్రతిపాదించి, 50 మంది సభ్యులు బలపరచాలి.


15. కేంద్ర సంఘటిత నిధి నుంచి పొందే రాష్ట్రపతి జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా       2) ప్రభుత్వ ఖాతాల సంఘం

3) సుప్రీంకోర్టు                                4) పార్లమెంట్‌


16. రాష్ట్రపతి నివాసానికి సంబంధించి కింది వాటిలో సరైంది?

1) రాష్ట్రపతి నివాసం దిల్లీలోని ‘రాష్ట్రపతి భవన్‌’.

2) రాష్ట్రపతి వేసవి విడిది హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘సిమ్లా’.

3) రాష్ట్రపతి శీతాకాల విడిది తెలంగాణలోని ‘బొల్లారం’(హైదరాబాద్)

4) పైవన్నీ


17. రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు?

1) ఉపరాష్ట్రపతి                               2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

3) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా    4) ప్రధానమంత్రి


సమాధానాలు


1) 4     2) 2     3) 3     4) 4     5) 2      6) 1      7) 3      8) 2      9) 4      10) 2      11) 4      12) 2      13) 4      14) 2     15) 4      16) 4       17) 2

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఉపరాష్ట్రపతి

   ప్రారంభ ముసాయిదా రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ప్రస్తావించలేదు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన హెచ్.వి. కామత్ పేర్కొన్నారు. ఆయన సూచన మేరకు భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేశారు.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుంచి 70 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ఉపరాష్ట్రపతి పదవిని గురించి వివరించారు.
* ఆర్టికల్, 63 ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.


ఉపరాష్ట్రపతి అర్హతలు - షరతులు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
* రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతలు ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండరాదు.
* 15 వేల రూపాయలు డిపాజిట్‌గా చెల్లించాలి.
* ఎలక్టోరల్ కాలేజీలోని 20 మంది సభ్యులు అతడి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించి, మరో 20 మంది సభ్యులు బలపరచాలి.
* పోలై చెల్లుబాటయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు పొంది ఉండాలి.


ఎన్నిక పద్ధతి
* 1962 వరకు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్‌ను నిర్వహించడం ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేవారు.
* 11వ రాజ్యాంగ సవరణ చట్టం (1962) ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నికను పార్లమెంటు ఉభయసభల సభ్యుల ద్వారా ఏర్పడిన 'ఎలక్టోరల్ కాలేజీ' ద్వారా ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రాల శాసన సభ్యులకు అవకాశం లేదు. ఆర్టికల్, 66లో ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని పొందుపరిచారు.


పదవీ కాలం
* ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. కానీ ఈ పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని మన తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. దీన్నే అనుసరిస్తున్నారు.
* ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.


తొలగింపు
  అసమర్థత, దుష్ప్రవర్తన కారణాలతో ఉపరాష్ట్రపతిని పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా తొలగించవచ్చు.
* ఆర్టికల్, 67(B) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. కనీసం 1/4వ వంతు సభ్యుల సంతకాలతో కూడిన తొలగింపు తీర్మాన నోటీసును 14 రోజుల ముందు సభాధిపతికి అందించాలి.
* తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ సమావేశాలకు హాజరుకావచ్చు. కానీ అధ్యక్షత వహించరాదు.
* ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతిని తొలగించలేదు.


జీతభత్యాలు
* ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ఆర్టికల్, 97 ప్రకారం రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో మాత్రమే ఉపరాష్ట్రపతి నెలకు రూ.1,25,000 వేతనం పొందుతారు.
* ఈ వేతనానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
* వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీరి వేతనంపై పార్లమెంటులో ఓటింగ్‌కు అవకాశం లేదు.


ఉపరాష్ట్రపతి అధికారాలు - విధులు
   ఆర్టికల్, 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.
* ఆర్టికల్, 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక పదవీ బాధ్యతలను నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో రాష్ట్రపతి పొందే జీతభత్యాలను పొందుతారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరిస్తారు.
* 'భారతరత్న' లాంటి అత్యున్నత పౌరపురస్కారాల ఎంపిక కమిటీకి అధ్యక్షత వహిస్తారు.
* 'ఉపరాష్ట్రపతి తన మేథోసంపత్తి, వ్యక్తిగతమైన నైతిక విలువలు, హుందాతనంతో వ్యవహరించడం వల్ల రాష్ట్రపతి, ప్రధానమంత్రులు అనేక విషయాల్లో ఉపరాష్ట్రపతిని సంప్రదించేలా చేయుచున్నారు' - నార్మన్.డి. పామర్
* భారత ఉపరాష్ట్రపతి పదవిని 'వేల్స్ యువరాజు'తో పోల్చవచ్చు - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
* 'భారత రాజ్యాంగం రాష్ట్రపతి పదవికి ఇచ్చినంత గొప్ప గౌరవం ఉపరాష్ట్రపతి పదవికి ఇవ్వక పోయినప్పటికీ ఆ పదవి ఉపయోగకరమైంది, ప్రతిష్ఠాత్మకమైంది' - ఎమ్.వి. పైలీ


కీలకాంశాలు
* మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* మన దేశానికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.
* రెండు సార్లు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టినవారు.
1. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2. హమీద్ అన్సారీ
* తొలి దళిత ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్.
* పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి కె. కృష్ణకాంత్.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వారు భైరాన్‌సింగ్ షెకావత్.
* తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* జ్ఞానీ జైల్‌సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు 1982, అక్టోబరు 6 నుంచి 31 వరకు 25 రోజులపాటు తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన వారు హిదయతుల్లా.
* అత్యధిక మెజార్టీతో ఎన్నికైన ఉపరాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ (700 ఓట్లు).
* కేంద్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీదేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం చేయించిన తాత్కాలిక రాష్ట్రపతి - బి.డి. జెట్టి.
* బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి జులై 25 వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* పదవికి రాజీనామా చేసిన మొదటి ఉపరాష్ట్రపతి వి.వి. గిరి.
* పదవికి రాజీనామా చేసిన రెండో ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్.
*  ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీరీత్యా 14వ వారు, వ్యక్తులరీత్యా 12వ వారు.
* ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంగా ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి సమర్పించాలి. రాజీనామా పత్రాన్ని మాత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి మాత్రమే రాయాలి.


ముగింపు
  అమెరికా ఉపాధ్యక్ష పదవితో మన ఉపరాష్ట్రపతి పదవిని పోల్చవచ్చు. ఎందుకంటే ఇద్దరూ తమ దేశాల్లో ఎగువసభకు అధ్యక్షత వహిస్తారు. అయితే మనదేశంలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా 6 నెలలు మించి ఉండటానికి వీల్లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రం తాత్కాలిక అధ్యక్షుడిగానే కాకుండా అధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు మిగిలిన అధ్యక్ష పదవీకాలమంతా అధ్యక్షుడిగా కొనసాగుతారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర‌మంత్రి మండ‌లి

          రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి. అయితే మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థ. రాజ్యాంగం ప్రకారం విధినిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహకశాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహం.


కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ : 
          భారతదేశంలో 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి 'మంత్రిమండలి' ఏర్పాటయినప్పుడు దాన్ని మంత్రిపరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు. నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం మంత్రిమండలిని మూడు వర్గాలుగా విభజించి, ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి, హోదా కల్పించి, తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులను పూర్తిగా కాకున్నా, చాలావరకు పాటించి మూడు అంచెలలో కేంద్ర మంత్రిమండలిని ఏర్పరచారు. అవి:
1. క్యాబినెట్ మంత్రులు
2. స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు
3. డిప్యూటీ లేదా సహాయ మంత్రులు.


క్యాబినెట్ మంత్రులు :
* కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదాగల మంత్రులు వ్యవహరిస్తారు.
* క్యాబినెట్ మంత్రులు తమ మంత్రిత్వశాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
* కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది.
* అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు.
* క్యాబినెట్‌మంత్రులు అధికారపార్టీలో అత్యంత ప్రాబల్యం, విశేష పరిపాలనానుభవం పొందినవారై ఉంటారు.


రాజ్య మంత్రులు లేదా స్టేట్ మంత్రులు :
* క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వశాఖల్లో ఒక శాఖను స్టేట్‌మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వీరు తమ మంత్రిత్వశాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు. కొన్ని మంత్రిత్వశాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు రాజ్య మంత్రులు ఉండవచ్చు.


డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు :
* మంత్రిత్వశాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయమంత్రులు. బ్రిటన్‌లో వీరిని జూనియర్ మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులని పిలుస్తారు.
* డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు.
* పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారు.
* ఈ విధంగా కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఉంటారు. మొత్తం కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి అధినేత.


మంత్రిమండలి నియామకం :
* 75(1) ప్రకరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు.
మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం.
* ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి వారిని నియమిస్తారు.
* సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు.
* సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీలవారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరు కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడచుకోవాలి.


మంత్రుల సంఖ్య :
* మంత్రిమండలిలో ఎందరిని నియమించాలి? కనిష్ఠ, గరిష్ఠ సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాజ్యాంగంలో వివరణలేదు.
* మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 16కు మించరాదని, మొత్తం మంత్రుల సంఖ్య 45కు మించరాదని సిఫారసు చేసింది. కానీ ఈ నియమం ఆచరణలో లేదు.
* 2003లో రాజకీయపార్టీల్లో చీలికల నిరోధానికిగాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు. దీనికోసం 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువసభ అంటే లోక్‌సభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు.


మంత్రుల అర్హతలు :
* కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులయ్యేవారికి కొన్ని అర్హతలుండాలి.
1. పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి.
2. ఒకవేళ సభ్యత్వం లేనిపక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరునెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది.


పదవీ ప్రమాణం : రాష్ట్రపతి మంత్రులతో పదవీప్రమాణం చేయిస్తారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో పదవీ ప్రమాణ స్వీకార నమూనా పత్రం ఉంటుంది.


మంత్రి మండలి కాలపరిమితి :
        కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు. 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి ప్రకారం మంత్రిమండలి అయిదేళ్లు ఉండవచ్చు.


మంత్రుల తొలగింపు :
       మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవినుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి తనకు ఇష్టంలేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతిచే తొలగించబడతారు. దీనినే 'మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం' అంటారు.


మంత్రిమండలి సమష్టి బాధ్యత : 
* రాజ్యాంగ నిబంధన 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సమష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* సమష్టి బాధ్యత అంటే, కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడం. మంత్రిమండలి తమవల్ల జరిగే తప్పొప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది.
* సమష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదలుకుంటారు.
* సమష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు, అమలులో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు.
* కార్య నిర్వాహకశాఖ సమష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకు పార్లమెంటు, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది.
* సమష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్‌సభకు సంబంధించిన అంశం. శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, సదవగాహనతో వ్యవహరించేందుకు సమష్టి బాధ్యత దోహదపడుతుంది.
* సమష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వశాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతోపాటు తన సహచర మంత్రుల మంత్రిత్వశాఖ విధానాలు, పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు.


మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సంప్రదాయాలు - సూత్రాలు :

1. రాష్ట్రపతి పేరిట పరిపాలనా నిర్వహణ : రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి దేశాధినేత. రాష్ట్రపతి స్వయంగాగానీ, అధికారుల ద్వారాగానీ విధులు, బాధ్యతలు నెరవేరుస్తారు. 74(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి బాధ్యతల నిర్వహణలో సలహాలు, సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
* రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా భిన్నంగా భావించిన పక్షంలో మంత్రిమండలి సలహాను కేవలం ఒక్క పర్యాయం మాత్రమే పునః పరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలించిన నిర్ణయం తన ఆమోదంకోసం వస్తే రెండోసారి తప్పకుండా ఆమోదముద్ర వేయాలి.


2. మంత్రులు లోక్‌సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం పొందాలి :  మంత్రులుగా నియమితులయ్యేవారు పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొందడం తప్పనిసరి. ఒకవేళ సభ్యులుకానివారిని మంత్రిపదవిలో నియమిస్తే, పదవీ స్వీకారం తేదీ మొదలుకుని ఆరునెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి.
 

3. మంత్రులు ఉభయసభలకు బాధ్యులు : మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ వారు ఉభయసభలకు జవాబుదారీగా ఉంటారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తమకు సభ్యత్వం లేని సభల్లో ఓటు వేయరు.


4. లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రుల పదవీకాలం : మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే పదవిలో ఉంటుంది. లోక్‌సభ ప్రధానమంత్రికి వ్యతిరేకంగాగానీ లేదా మంత్రిమండలికి వ్యతిరేకంగాగానీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మంత్రిమండలి పతనం అవుతుంది.


5. మంత్రులమధ్య సామరస్య భావన - సమైక్యత :  మంత్రులందరూ సాధారణంగా ఒకే రాజకీయపార్టీకి చెందినవారై ఉంటారు. మంత్రిమండలి ఒక జట్టుగా పని చేస్తుంది. పార్టీలో క్రమశిక్షణ మూలంగా వారి మధ్య ఐక్యత ఉంటుంది.


6. మంత్రిమండలిపై పార్లమెంటు నియంత్రణ : పార్లమెంటు ప్రశ్నలు, తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం, విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు మొదలైనవాటిద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండే విధంగా చేస్తుంది.


7. ప్రధానమంత్రి నాయకత్వం : మంత్రిమండలి ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తుంది. లోక్‌సభలో అధికారపార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి మంత్రిమండలిమీదా, పార్లమెంటులోనూ మంచి పట్టు ఉంటుంది.


మంత్రిమండలి - క్యాబినెట్ పాత్ర : 
* మంత్రిమండలిలో క్యాబినెట్ అతి ముఖ్యమైంది. భారత రాజ్యాంగంలో మొదట క్యాబినెట్ అనే పదం లేదు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు.
* కేంద్ర మంత్రిమండలిలోని సీనియర్ మంత్రులు క్యాబినెట్‌లో సభ్యులుగా ఉంటారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతలు, పాలనా సామర్థ్యం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగిన కొందరు వ్యక్తులను సాధారణంగా ప్రధానమంత్రి క్యాబినెట్ సభ్యులుగా ఎంపిక చేస్తారు.
* భారత రాజకీయ వ్యవస్థలో క్యాబినెట్ కింది సూత్రాల ప్రాతిపదికపై పనిచేస్తుంది.
1. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అధికార విధులను క్యాబినెట్ నిర్వర్తిస్తుంది.
2. పార్లమెంటులోని దిగువసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
3. క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
4. క్యాబినెట్ సభ్యులు కనీసం వారానికోసారి లేదా అనివార్యమైతే ముందుగానే సమావేశమవుతారు.
5. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ రహస్యంగా, విశ్వసనీయంగా ఉంచుతుంది.
6. పార్లమెంటులోని దిగువసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటుంది.


క్యాబినెట్ విధులు :
1. కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి అంతర్గత, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తర్వాత ఖరారు చేస్తుంది.
2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతి విధుల నిర్వహణలో క్యాబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.
3. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరమని భావిస్తే ఆర్డినెన్స్‌లను జారీచేయాల్సిందిగా రాష్ట్రపతికి సలహాలిస్తుంది. ఆర్డినెన్స్ అంటే పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టం లేదా శాసనం.
4. భూకంపం, వరదలు, అనావృష్టి, తుపాను మొదలైన ప్రకృతి ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధిత ప్రజలను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది.


క్యాబినెట్‌పై ప్రముఖుల వ్యాఖ్యానాలు :

రామ్‌సేమ్యూర్ : రాజ్యమనే నౌకకు క్యాబినెట్ అనేది చోదక చక్రం వంటిది.
జాన్‌మారియట్ : మొత్తం రాజకీయ వ్యవస్థ క్యాబినెట్ చుట్టూనే పరిభ్రమిస్తుంది.
సర్ ఐవర్ జెన్నింగ్స్ : రాజ్యాంగ ప్రధాన భూమికయే క్యాబినెట్.

 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గవర్నర్

      మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రాల్లో కూడా అదే విధానాన్ని అమలుచేశారు. కేంద్రంలో రాజ్యాధికారి అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా, ప్రభుత్వాధికారం ఉన్న ప్రధాని, మంత్రిమండలి వాస్తవ అధికారాలు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రాల్లో రాజ్యాధికారి అయిన గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వాస్తవ అధికారాలు ముఖ్యమంత్రి, మంత్రిమండలికి ఉంటాయి.
* రాజ్యాంగంలో 6వ భాగంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసనసభ నిర్మాణం, అధికారాలు మొదలైన వాటిని వివరించారు (జమ్మూకశ్మీర్ మినహాయించి).
* ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిబంధన 153 సూచిస్తుంది. కానీ 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు.
* ప్రపంచంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోన్న ఎక్కువ దేశాల్లో రాష్ట్ర గవర్నర్లను ప్రజలు ఎన్నుకుంటారు.
ఉదా: యూఎస్ఏ. మన దేశంలో గవర్నర్లను నిబంధన 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కెనడాలో కూడా నామినేషన్ పద్ధతినే అనుసరిస్తున్నారు.
* మన దేశంలో రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ ఉండాలనీ, గవర్నర్‌ను కూడా ప్రజలే ఎన్నుకుంటే రెండు అధికార కేంద్రాలు (ముఖ్యమంత్రి, గవర్నర్) ఏర్పడతాయనే కొన్ని కారణాల వల్ల గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే పద్ధతిని అనుసరిస్తున్నారు.
* నిబంధన 156 ప్రకారం గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసమున్నంత వరకూ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి గవర్నర్‌ను తొలగించినప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని 1983లో సూర్యనారాయణ Vs భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* గవర్నర్ వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ నెల వేతనం రూ.3,50,000. ఇతర సౌకర్యాలుంటాయి. గవర్నర్‌కు అధికార నివాసముంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉంది. చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌లో వేసవి విడిది గృహం కూడా ఉంది.
* ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉంటే ఏ రాష్ట్రం ఎంత వేతనం చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గవర్నర్ వేతనాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* గవర్నర్‌గా నియమించడానికి నిబంధన 157 ప్రకారం భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సభ్యుడై ఉండకూడదు. ఉంటే నియమించిన తర్వాత రాజీనామా చేయాలి.
* సంప్రదాయం ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించకూడదు. ఒక రాష్ట్ర గవర్నర్‌ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం, రాష్ట్రేతరుడిని గవర్నర్‌గా నియమించడం మంచి సంప్రదాయం.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా పాటించాలి. నియమించే అధికారిని (రాష్ట్రపతి) సంతృప్తి పర్చాలి. దాంతో కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ విధి నిర్వహణ క్లిష్టతరమవుతుంది.
* గవర్నర్ పదవి గౌరవప్రదమైంది. గవర్నర్‌ను రాజ్యపాల్ అని కూడా అంటారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి. గవర్నర్ తన అధికారాలను వినియోగించుకున్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాను పాటించాలి. కాబట్టి గవర్నర్ నామమాత్రపు అధికారి మాత్రమే.
* 'గవర్నర్ పదవి బంగారు పంజరంలో చిలుక లాంటిది' అని సరోజిని నాయుడు వ్యాఖ్యానించారు.

 

అధికారాలు విధులు

కార్య నిర్వాహణాధికారాలు:
     గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన నిర్వహణకు కేంద్రంలో రాష్ట్రపతిలా కొంతమంది ఉన్నతాధికారులను నియమిస్తారు.
* నిబంధన 164 ప్రకారం రాష్ట్ర విధాన సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి అతడి సలహాతో మంత్రిమండలిని నియమిస్తారు.
* చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖా మంత్రులను నియమించే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంటుంది.
* నిబంధన 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను, నిబంధన 233 ప్రకారం జిల్లా కోర్ట్ న్యామూర్తులను, నిబంధన 233 (I), 243 (Y) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నిబంధన 243 (K), 243 (2A), ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు.
* రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. పై నియామకాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే చేయాలి.

 

శాసన నిర్మాణాధికారాలు
రాష్ట్రపతి కేంద్ర పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా, అంతర్భాగం. అలాగే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకపోయినా శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.
* రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదంతో శాసనాలు అవుతాయి (నిబంధన 200).
* గవర్నర్ తిరస్కరిస్తే ఆ బిల్లులు రద్దవుతాయి. దీన్నే 'నిరపేక్ష వీటో' అంటారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపవచ్చు. Suspensive veto అంటారు. బిల్లు తిరిగి యథాతథంగా వస్తే తప్పనిసరిగా ఆమోదించాలి. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా బిల్లును తన వద్దే ఉంచుకునే 'Pocket Veto' అధికారం గవర్నర్‌కు లేదు.
* నిబంధన 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పునః పరిశీలనకు రాష్ట్ర శాసనసభకు పంపవచ్చు. బిల్లు యథాతథంగా తిరిగి వస్తే తప్పనిసరిగా ఆమోదించాలని లేదు. కానీ 'Pocket Veto' వినియోగించి రాష్ట్రపతి తన వద్ద ఉంచుకోవచ్చు. నిబంధన 143 ప్రకారం ఆ బిల్లుపై సుప్రీంకోర్టు  సలహా కోరవచ్చు.
* రాష్ట్ర గవర్నర్ నిబంధన 331 ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను, నిబంధన 171 ప్రకారం విధానసభకు (ఉంటే) 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. నిబంధన 332 ప్రకారం గవర్నర్ విధానసభలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయిస్తారు.
* నిబంధన 174 ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడం, వాయిదా వేయడం చేయవచ్చు.
* నిబంధన 175 ప్రకారం శాసనసభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు.
* నిబంధన 176 ప్రకారం గవర్నర్ శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు.
* నిబంధన 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు 'ఆర్డినెన్స్‌లు' జారీ చేయవచ్చు.
* విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒకేసారి ఖాళీ ఏర్పడితే సభా కార్యక్రమాల నిర్వహణకు నిబంధన 180 ప్రకారం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు.
* పార్లమెంట్ ఉభయ సభలకు ఏదైనా బిల్లు విషయంలో భేదం ఏర్పడితే, అలాంటి పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రపతి నిబంధన 108 ప్రకారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్ర గవర్నర్‌కు ఆ అధికారం లేదు.

 

ఆర్థిక అధికారాలు
రాజ్యాంగ నిబంధన 202 ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్‌ది.
* నిబంధన 199 ప్రకారం ఆర్థిక బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ పూర్వానుమతి ఉండాలి.
* నిబంధన 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే ఏ విధమైన కేటాయింపులూ చేయకూడదు.
* బడ్జెట్ సమావేశాల ఆరంభంలో గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

న్యాయాధికారాలు
నిబంధన 161 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వర్తించే విషయాల్లో న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దుచేయవచ్చు. మరణశిక్షను రద్దుచేసి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్‌కు లేదు కానీ వాయిదా వేయవచ్చు.
* రాష్ట్రపతి సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలకు కూడా క్షమాబిక్ష పెట్టవచ్చు. రాష్ట్రంలో గవర్నర్‌కు అలాంటి అధికారాలు ఉండవు. ఎందుకంటే రాష్ట్రాలకు సైన్యం ఉండదు.
* నిబంధన 217 ప్రకారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్‌ను సంప్రదించాలి.
* రాష్ట్రపతికి ఉన్న సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు గవర్నర్‌కు ఉండవు.

 

విచక్షణాధికారాలు
రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు తన అధికారాలను వినియోగించుకోవాలి. కింద పేర్కొన్న కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా లేకుండా తనకు తానే నిర్ణయాలు చేయవచ్చు. వాటినే 'విచక్షణాధికారాలు' అంటారు. అందులో రాజ్యాంగబద్ధమైనవి:
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు.
* రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడంలో విఫలమై, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని భావించినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని (నిబంధన 356) రాష్ట్రపతికి నివేదిక పంపవచ్చు.
* నిబంధన 371 ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో (నాగాలాండ్, అసోం, మణిపూర్ మొదలైనవి) గవర్నర్‌కు స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
* నాగాలాండ్ గవర్నర్‌కు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
* మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను  ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
* గవర్నర్ కొన్ని సందర్భోచితమైన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదం అవుతున్నాయి.
* రాష్ట్రంలో పరిపాలన నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రిని, విధానసభలో మెజారిటీ కోల్పోయారనే కారణంగా రద్దుచేసి, వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.
ఉదా: 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరారు అప్పటి గవర్నర్ రామ్‌లాల్. ఈ చర్య వివాదాస్పదం కావడంతో ఆయన్ను గవర్నర్ పదవి నుంచి 'రీకాల్' చేశారు.
* 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (పార్టీలో చీలిక కారణంగా) విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించి, ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరారు.
* విధాన సభలో ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం, మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించడం లాంటి గవర్నర్ అధికారాలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఉదా: ఇటీవల కర్ణాటకలో జరిగిన సంఘటన. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీ నాయకుడు యడ్యూరప్పను గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించి 15 రోజుల్లోపు మెజారిటీని నిరూపించుకోమని కోరారు. ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, మెజారిటీ నిరూపించుకోవడానికి అంత సమయం అవసరం లేదని కోర్టు ఆ వ్యవధిని రెండు రోజులకు తగ్గించింది.
* నిబంధన 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించమని, రాష్ట్రపతికి గవర్నర్లు సిఫారసు చేయడం ఇంతవరకు 124 సార్లు (వివిధ రాష్ట్రాల్లో) జరిగింది. 1951లో మొదటిసారిగా పంజాబ్‌లో, 124వ సారి ఇటీవల ఉత్తరాఖండ్‌లో గవర్నర్‌లు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. గవర్నర్‌లు ఈ అధికారాలు వినియోగించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అవుతున్నాయి.
* గవర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, ఆ కాలంలో రాష్ట్రపతి తరపున రాష్ట్ర పాలనా బాధ్యతలను గవర్నర్ నిర్వర్తిస్తారు.
* గవర్నర్ పదవీకాలం అయిదు సంవత్సరాలు పూర్తికాక ముందే అతడిని తొలగించడానికి మహాభియోగ, అభిశంసన తీర్మానాలేవీ లేవు. పదవీకాలం ముగియక ముందు రాష్ట్రపతి గవర్నర్‌ను 'రీకాల్' చేయవచ్చు. రాష్ట్రపతి చేసిన ఆ చర్యను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాను 2016, సెప్టెంబరు 12న రాష్ట్రపతి 'రీకాల్' చేశారు.
* భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీనాయుడు (ఉత్తర్‌ ప్రదేశ్).
* దేశంలో ఎక్కువ కాలం గవర్నర్‌గా పనిచేసింది బి.సి. అలెగ్జాండర్. 1988 - 90 వరకు తమిళనాడుకు, 1993 - 2002 వరకు మహారాష్ట్రకు ఈయన గవర్నర్‌గా పనిచేశారు.
* ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సి.ఎం. త్రివేది.
* ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ.
రెండో మహిళా గవర్నర్ కుముద్‌బెన్ జోషి.
* ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. ఈయన గవర్నర్‌గా 2009 డిసెంబరు నుంచి కొనసాగుతున్నారు.
* మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కె.రోశయ్య తమిళనాడు గవర్నర్లుగా పనిచేశారు.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత పార్లమెంట్ - లోక్‌సభ

1. 'వెస్ట్ మినిస్టర్' తరహా పార్లమెంట్ అంటే?
జ‌: వెస్ట్ మినిస్టర్ అనే ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ పార్లమెంట్


2. భారతదేశానికి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని కాదని పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు అనుసరించడానికి కారణం?
     a. బ్రిటిష్ పాలనాకాలం నుంచి ప్రజలకు పరిచయం ఉండటం 
     b. బాధ్యతాయుత ప్రభుత్వం 
     c. పార్లమెంట్, మంత్రి మండలి మధ్య వివాదాలకు అవకాశం 
     d. వివిధ రాష్ట్రాల మధ్య భిన్నత్వం ఎక్కువగా ఉండటం
జ‌: a, b, c, d సరైనవి


3. లోక్‌సభ స్పీకర్ ఏ సందర్భంలో నిర్ణాయక ఓటు కంటే ముందే మొదటి ఓటింగ్‌లో పాల్గొనవచ్చు?
జ‌: స్పీకర్‌ను తొలగించే తీర్మానం


4. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ఎవరి పేరు మీద ప్రవేశపెడతారు?
జ‌: రాష్ట్రపతి

 

5. రాజ్యసభ ఆమోదించిన సాధారణ బిల్లును లోక్‌సభ ఎంతకాలంలో ఆమోదించాలి?
జ‌: కాల పరిమితి లేదు


6. కింది జాబితాల్లోని అంశాలను జతపరచండి.
               List A                       List B
      a. వైస్ ఛాంబర్                                1. 102వ అధికరణ 
      b. అవిశ్వాస తీర్మానం                      2. రాజ్యసభ
      c. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం     3. లోక్‌సభ
      d. పార్లమెంట్ సభ్యుల అనర్హతలు       4. IV షెడ్యూల్
జ‌: a-2, b-3, c-4, d-1


7. ఏ విషయాల్లో లోక్‌సభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి?
     a. రాజ్యాంగ సవరణ బిల్లు 
     b. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం 
     c. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులపై అభిశంసన 
     d. జాతీయ అత్యవసర పరిస్థితి
జ‌: అన్నీ సరైనవే

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 రాష్ట్రప‌తులు

1.    భారత రాష్ట్రపతి పదవిని ఏ దేశ రాజమకుట పదవితో పోల్చవచ్చు?


    1)  సౌదీ అరేబియా      2)  బ్రిటన్‌      3) నేపాల్‌           4) జపాన్‌

 

2.    భారతరత్న పురస్కారం పొందిన ఏ రాష్ట్రపతి ‘ఇండియా డివైడెడ్‌’ అనే గ్రంథాన్ని రాశారు?


    1) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌      2)  డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌     3)  డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌    4)  వి.వి.గిరి

 

3.    రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి కిందివాటిలో సరికానిది?


    1) రెండుసార్లు ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు.


    2) ప్రజాసమస్యల పరిష్కారానికి రాష్ట్రపతి భవన్‌లో ‘ప్రజాదర్బార్‌’ నిర్వహించారు.


    3) అమెరికా ప్రభుత్వం నుంచి ‘టెంపుల్‌టన్‌’ అవార్డు పొందారు.


    4)  హిందూ కోడ్‌ బిల్లు విషయంలో  కేంద్ర మంత్రిమండలితో విభేదించారు.

 

4.    రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికైనవారు?


    1)  డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌   2)  డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌     3)  వి.వి.గిరి     4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌

 

5.    ఉపరాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను నిర్వహించినవారు?


    1)  వి.వి.గిరి     2) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌   3)  బి.డి.జెట్టి     4)  ఆర్‌.వెంకట్రామన్‌

 

6.    ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతుల్లో లేనివారు?


    1)  డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌   2) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌   3) వి.వి.గిరి   4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌

 

7. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి?


    1) ఆర్‌.వెంకట్రామన్‌   2)  జాకీర్‌హుస్సేన్‌       3)  వి.వి.గిరి        4)  జ్ఞానీ జైల్‌సింగ్‌

 

8. 1977లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ ఆకస్మిక మరణంతో తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించినవారు?


    1)  జస్టిస్‌ మహ్మద్‌ హిదయతుల్లా    2) బి.డి.జెట్టి     3) నీలం సంజీవరెడ్డి       4) కె.ఆర్‌.నారాయణన్‌

 

9.    1975లో ఆంతరంగిక సంక్షోభంతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి?


    1)  డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌     2) జ్ఞానీ జైల్‌సింగ్‌   3)  నీలం సంజీవరెడ్డి     4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్

 

10. 1980లో తొమ్మిది కాంగ్రెసేతర రాష్ట్రప్రభుత్వాలను ఆర్టికల్‌ 356 ద్వారా రద్దుచేసిన రాష్ట్రపతి?


    1)  జ్ఞానీ జైల్‌సింగ్‌    2) నీలం సంజీవరెడ్డి    3)  ఆర్‌.వెంకట్రామన్‌   4) శంకర్‌ దయాళ్‌శర్మ

 

11. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం పంపిన ‘పోస్టల్‌ బిల్‌పై’ పాకెట్‌ వీటోను ప్రయోగించిన రాష్ట్రపతి?


1)  ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌    2) నీలం సంజీవరెడ్డి    3) జ్ఞానీ జైల్‌సింగ్‌   4) ఆర్‌.వెంకట్రామన్‌

 

జవాబులు


1-2     2-1      3-4     4-3      5-1     6-1      7-3    8-2     9-4     10-2     11-3. 

నమూనా ప్రశ్నలు


1. అమెరికా నుంచి స్ఫూర్తి పొందిన ఎవరి సూచన మేరకు భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవిని పొందుపరచారు?

1) కె.టి.షా 2) హెచ్‌.వి.కామత్‌ 3) ఎం.వి.పైలీ 4) కె.ఎం.మున్షీ


2. భారత ఉపరాష్ట్రపతి పదవిని ‘వేల్స్‌ యువరాజు’తో పోల్చినవారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ 2) అనంతశయనం అయ్యంగార్‌

3) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 4) జవహర్‌లాల్‌ నెహ్రూ


3. 1962లో రూపొందించిన ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉపరాష్ట్రపతిని ‘ఎలక్టోరల్‌ కాలేజి’ సభ్యులతో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు?

1) ఎనిమిదో రాజ్యాంగ సవరణ చట్టం 2) తొమ్మిదో రాజ్యాంగ సవరణ చట్టం

3) పదో రాజ్యాంగ సవరణ చట్టం 4) పదకొండో రాజ్యాంగ సవరణ చట్టం


4. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్‌ కాలేజి’లో ఓటర్లుగా ఎవరుంటారు?

1) లోక్‌సభ, రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులు

2) లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన మొత్తం సభ్యులు

3) రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు

4) 1, 3


5. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ఎలక్టోరల్‌ కాలేజిలోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించి, ఎంతమంది సభ్యులు బలపరచాలి?

1) 20 మంది ప్రతిపాదించి, 30 మంది బలపరచాలి.

2) 30 మంది ప్రతిపాదించి, 20 మంది బలపరచాలి.

3) 40 మంది ప్రతిపాదించి, 40 మంది బలపరచాలి.

4) 20 మంది ప్రతిపాదించి, 20 మంది బలపరచాలి.


6. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయాలంటే ఉండాల్సిన కనీస వయసు?

1) 25 ఏళ్లు 2) 30 ఏళ్లు 3) 35 ఏళ్లు 4) 21 ఏళ్లు

 

7. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనవారు ఎవరి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు?

1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2) రాష్ట్రపతి

3) ప్రధానమంత్రి 4) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌


8. ఉపరాష్ట్రపతి పదవిరీత్యా ఏ సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు?

1) రాజ్యసభ 2) విధానసభ 3) లోక్‌సభ 4) విధానపరిషత్‌


9. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరికానిది గుర్తించండి.

1) పదవీకాలం 5 సంవత్సరాలు

2) వేతనం రాష్ట్రపతి నిర్ణయిస్తారు.

3) వేతనం భారత సంఘటితనిధి నుంచి చెల్లిస్తారు.

4) వేతనానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.


10. ఉపరాష్ట్రపతిని తొలగించేది ఎవరు?

1) రాష్ట్రపతి 2) పార్లమెంట్‌ 3) సుప్రీంకోర్టు 4) కేంద్ర కేబినెట్‌


11. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలో ఎంతమంది సభ్యుల సంతకాలతో ప్రవేశపెట్టాలి?

1) 1/2వ వంతు 2) 1/3వ వంతు 3) 2/3వ వంతు 4) 1/4వ వంతు


12. కిందివాటిలో ఉపరాష్ట్రపతి అధికార, విధికి సంబంధించి సరైంది?

1) దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు.

2) రాజ్యసభ సమావేశాల ప్రారంభానికి అవసరమైన కోరం ్బశ్య్నీ౯్య్ఝ్శ ను ధ్రువీకరిస్తారు.

3) పార్టీ ఫిరాయింపులకు పాల్పడు రాజ్యసభ సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు.

4) పైవన్నీ


13. భారతదేశానికి రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించింది?

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 2) హమీద్‌ అన్సారీ


3) 1, 2 4) కె. కృష్ణకాంత్‌

 

సమాధానాలు


1) 2 2) 1 3) 4 4) 2 5) 4 6) 3 7) 2 8) 1 9) 2 10) 2 11) 4 12) 4 13) 3

 


 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత రాష్ట్రపతి

 భారత రాజ్యాంగంలో 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వ నిర్మాణం, విధివిధానాలను  ఆర్టికల్స్ 52 నుంచి 151 మధ్య వివరించారు. మన దేశంలో శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటు దేశానికి అవసరమైన చట్టాలను రూపొందిస్తే... కార్యనిర్వాహక శాఖ అయిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చట్టాలను అమలుపరుస్తాయి. న్యాయశాఖ అయిన సుప్రీంకోర్టు శాసన, కార్యనిర్వాహక శాఖలు నిర్వర్తించే విధులు రాజ్యాంగబద్దంగా ఉండేలా పర్యవేక్షిస్తూ, నియంత్రిస్తుంది.
 

A. కేంద్ర కార్యనిర్వాహక శాఖ
  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తున్నాయి. కార్య నిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.

 

రాష్ట్రపతి
  రాజ్యాంగంలోని 52 - 62 వరకు ఉన్న 11 ప్రకరణలు రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేందుకు కావాల్సిన అర్హతలు, షరతులు, ఎన్నిక విధానం, పదవీ కాలం, తొలగింపు తదితర అంశాలను వివరిస్తున్నాయి.
* మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు రకాలైన కార్యనిర్వహణాధికారులు ఉంటారు.
1. దేశాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉండి, భారత దేశానికి రాజ్యాంగ రీత్యా అధిపతిగా వ్యవహరిస్తారు.
2. ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి వాస్తవ కార్యనిర్వహణాధికారాలు చెలాయిస్తుంది.
* దేశ పరిపాలనా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్రను పోషించినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 ప్రకారం దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది.

 

ఆర్టికల్ 52
* భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు.  దేశాధినేత, రాజ్యాంగ అధిపతి, సర్వ సైన్యాధ్యక్షుడు.

 

ఆర్టికల్ 53
* దేశ కార్యనిర్వహణాధికారాలను రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరిట నిర్వహించే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు. రాష్ట్రపతి పరిపాలనను స్వయంగా లేదా, ఇతర అధికారుల సహకారంతో నిర్వహిస్తారు.

 

ఆర్టికల్ 54
* రాష్ట్రపతి ఎన్నిక గురించి వివరిస్తుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు.

 

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు
* లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు - 543
* రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు - 233
* దేశంలోని 31 విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ఏలు - 4,120
* 70వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి విధానసభలకు ఎన్నికైన ఎంఎల్ఏలను ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా చేర్చారు. ఈ చట్టం 1995, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీరు 1997లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో తొలిసారిగా ఓటును వినియోగించుకున్నారు.

 

ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు
* లోక్‌సభకు నామినేట్ అయిన ఆంగ్లో ఇండియన్లు - 2
* రాజ్యసభకు నామినేట్ అయిన విశిష్ట వ్యక్తులు - 12
* రాష్ట్రాల విధానసభలకు నామినేట్ అయ్యే ఆంగ్లో ఇండియన్లు - 31
* రాష్ట్రాల విధాన పరిషత్‌లకు ఎన్నికైన ఎంఎల్‌సీలు - 7
* రాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష విధానంలో నిర్వహిస్తుంది.

 

ఆర్టికల్ 55
* రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది.
* రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది.
* భారత రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో రహస్యంగా జరుగుతుంది. దీన్నే దామాషా ఓటింగ్ పద్ధతి ప్రకారం రహస్య ఎన్నిక అని కూడా అంటారు. రాష్ట్రపతి పదవికి ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటర్లు ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అంటారు.
* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో కొన్ని సీట్లు ఖాళీ ఉన్నప్పటికీ రాష్ట్రపతి ఎన్నికను
నిర్వహించవచ్చు.

* రాష్ట్ర శాసనసభ రద్దవడం, పార్లమెంటులో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయన్న కారణాలతో రాష్ట్రపతి ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.
*1967లో రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఆర్టికల్ 356(1)(C) ప్రకారం రాజస్థాన్ శాసనసభ సుప్తచేతనావస్థలో ఉన్నప్పటికీ, ఆ శాసనసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వినియోగించుకున్నారు
* 1974లో గుజరాత్ శాసనసభ రద్దయినప్పుడు రాష్ట్రపతి ఎన్నికను నిర్వహించవచ్చా లేదా అనే అంశంపై అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహాను కోరినప్పుడు ఎన్నికను నిర్వహించవచ్చని కోర్టు పేర్కొంది.
* రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
* 1950లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా హెచ్.వి.ఆర్.అయ్యంగార్ వ్యవహరించారు.
* 2007లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.డి.టి.ఆచారి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ వి.కె.అగ్నిహోత్రి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.
* 1971 జనాభా లెక్కల ఆధారంగానే రాష్ట్రపతి ఎన్నికలో ఎంఎల్ఏ, ఎంపీల ఓటు విలువను లెక్కిస్తున్నారు.
* ఎక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
   ఉత్తర్‌ప్రదేశ్ = 208, తమిళనాడు = 176, మహారాష్ట్ర = 175
* తక్కువ ఎంఎల్ఏ ఓటు విలువ ఉన్న రాష్ట్రాలు
    సిక్కిం = 7, అరుణాచల్‌ప్రదేశ్ = 8, మిజోరం = 8, నాగాలాండ్ = 9
*  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంఎల్ఏ ఓటు విలువ = 148
*  విభజనానంతరం ఏపీలో ఎంఎల్ఏ ఓటు విలువ = 158
* తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ఏ ఓటు విలువ = 133
*  మన దేశంలో అన్ని రాష్ట్రాల మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474

 

రాష్ట్రాలవారీగా ఓట్లు, ప్రతి రాష్ట్రంలో మొత్తం ఓట్ల విలువ

ఓటు బదలాయింపు పద్ధతి:
* ఓటు బదలాయింపు పద్ధతిని తొలిసారిగా ప్రస్తావించినవారు థామస్ హేర్. అందుకే దీన్ని హేర్ పద్ధతి అంటారు.
* ఈ పద్ధతిని డెన్మార్క్‌లో ఆండ్రే అనే వ్యక్తి మొదటిసారి అమలు పరచడం వల్ల దీన్ని ఆండ్రే పద్ధతి అని కూడా అంటారు.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ఓటు బదలాయింపు పద్ధతిని ప్రతిపాదించారు.

 


* 2012లో జరిగిన 13వ రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓటు విలువ = 708

* మన దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓట్ల విలువ, మొత్తం ఎంపీల ఓట్ల విలువకు సమానంగా ఉండటం సమాఖ్య విధానాన్ని ప్రతిఫలిస్తోంది.
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల సంఖ్య = 4,120
* దేశంలో మొత్తం ఎంఎల్ఏల ఓటు విలువ = 5,49,474
దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య = 776
* దేశంలో ఎన్నికైన మొత్తం ఎంపీల ఓటు విలువ = 5,49,408
* 50 శాతం మించి ఓట్లను అంటే కోటా ఓట్లను ఏ అభ్యర్థీ పొందని సందర్భంలో పోటీలో ఉన్న చివరి అభ్యర్థి రెండో ప్రాధాన్యతా ఓట్లను పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు.
* 1969లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం ద్వారా గెలిచిన వ్యక్తి వి.వి.గిరి. ఈ ఎన్నికలో సి.డి.దేశ్‌ముఖ్ రెండో ప్రాధాన్యతా ఓట్లను బదిలీ చేయడం వల్ల వి.వి.గిరి గెలిచారు.
* రాష్ట్రపతిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించినవారు హెచ్.వి.కామత్, కె.టి.షా.
* ప్రస్తుతం రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు వినియోగించే పద్ధతి ప్రత్యక్ష ఎన్నికతో సమానమని పేర్కొన్నవారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ.
* మన దేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రతిపాదించినవారు కె.టి.షా.


రాష్ట్రపతి ఎన్నిక - వివాదాలు - పరిష్కారం
ఆర్టికల్ 71 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదానికి సంబంధించిన అన్ని విషయాలను సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది.
* రాష్ట్రపతి ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేస్తూ ఎలక్టోరల్ కాలేజీలోని కనీసం 25 మంది సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేయాలి.
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కింద పేర్కొన్న మార్పులను రాష్ట్రపతి ఎన్నిక విధానంలో వచ్చే వివాదాల్లో చేర్చారు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో ఖాళీలు ఉన్నాయనే కారణంపై ఎన్నికను వాయిదా వేయమని న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు.
* పార్లమెంటు ఒక చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగ పరిధికి లోబడి నిర్ణయించవచ్చు.
* సస్పెండ్ అయిన ఎంఎల్ఏ, ఎంపీలు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనవచ్చు.
* రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు ప్రకటిస్తే, వారు గతంలో తీసుకున్న నిర్ణయాలు, జారీ చేసిన ఆదేశాలు చెల్లుబాటు అవుతాయి.
* రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను సాధారణ పౌరులు న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు.
* రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు, ఎంఎల్ఏలకు నిర్దేశించిన విధంగా ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్ జారీ చేసే అధికారం రాజకీయ పార్టీలకు ఉండదు. దీనికి కారణం ఈ ఎన్నికలు శాసనసభ బయట జరుగుతాయి. విప్ శాసనసభలో జరిగే తీర్మానాలకు, బిల్లులకు మాత్రమే వర్తిస్తుంది.

ఆర్టికల్ 56: రాష్ట్రపతి పదవీ కాలం
* సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. కానీ కింది సందర్భాల్లో రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడవచ్చు.
A. మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు
B. దీర్ఘకాలిక అస్వస్థతకు గురైనప్పుడు
C. అకాల మరణం చెందినప్పుడు
D. రాజీనామా చేసినప్పుడు
* భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి.
* 1969లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి.


ఇంటరెగ్నం:
* రాష్ట్రపతి పదవీ కాలం ముగిసినప్పటికీ, నూతన రాష్ట్రపతి పదవి ఎన్నిక ప్రారంభమై, ఒకవేళ నిర్ణీత కాల వ్యవధిలో పూర్తికానప్పుడు అంటే నూతన రాష్ట్రపతి పదవిలోకి రాలేకపోయినప్పుడు ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే వరకు పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడాన్ని ఇంటరెగ్నం అంటారు.
ఆర్టికల్ 57: రాష్ట్రపతి పదవికి తిరిగి ఎన్నిక కావడం
* భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు. మన తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి పదవిని ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు.
ఆర్టికల్ 58: అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.
* లోక్‌సభకు ఎన్నికవడానికి కావాల్సిన అర్హతలుండాలి.
* శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి.
* దివాలా తీసి ఉండకూడదు.
* ఎంపీ లేదా ఎంఎల్ఏగా ఉన్న అభ్యర్థి ఆ పదవులకు రాజీనామా చేయకుండానే రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికైన వెంటనే ఎంపీ లేదా ఎంఎల్ఏ పదవి రద్దవుతుంది. ఓడిపోతే సంబంధిత పదవి కొనసాగుతుంది.
* 1952 నాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం ప్రకారం ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంది.


షరతులు:
*  రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని ఎలక్టోరల్ కాలేజీలోని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరో 50 మంది సభ్యులు బలపరచాలి.
* అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు రూ.15,000 ధరావత్తుగా రిజర్వ్ బ్యాంకులో చెల్లించాలి.
*  పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6వ వంతు లభిస్తే డిపాజిట్ (ధరావత్తు) లభిస్తుంది.


ఆర్టికల్ 59: జీతభత్యాలు
* రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* రాజ్యాంగంలోని 2వ షెడ్యూల్‌లో జీతభత్యాలను పొందుపరిచారు.
* రాష్ట్రపతి వేతనాన్ని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఐటీ పరిధిలోకి రాదు.
* రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ ప్రవేశపెట్టరాదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితిలో కూడా రాష్ట్రపతి జీతంలో కోత విధించరాదు.
* ప్రస్తుతం రాష్ట్రపతి వేతనం నెలకు రూ.1,50,000.
* పదవీ విరమణ అనంతరం సంవత్సరానికి రూ.9,00,000 పెన్షన్ లభిస్తుంది.
* రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. ఈ భవన రూపకర్తలు ఎడ్విన్ ల్యూటిన్స్ అండ్ బేకర్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మొఘల్ గార్డెన్స్ ఇక్కడే ఉంది.
* 1921 - 26 మధ్య రాష్ట్రపతి భవన్ నిర్మాణం జరిగింది. ఈ భవనంలోకి అధికారికంగా మొదట అడుగు పెట్టిన వ్యక్తి లార్డ్ ఇర్విన్.
* రాష్ట్రపతి భవన్‌ను 320 ఎకరాల్లో 340 గదులతో నిర్మించారు. దీన్ని ప్రారంభంలో Vice Regal అని పిలిచేవారు. సామాన్య ప్రజలు దీన్ని లాట్ సాహెబ్ కా దఫ్తర్ అని పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రైజీనా హిల్స్ (Raisina Hills) అంటారు.
* రాష్ట్రపతికి హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వేసవి విడిది, సికింద్రాబాద్‌లోని బొల్లారంలో శీతాకాల విడిది ఉన్నాయి.
* విదేశీ పర్యటనల కోసం ఎయిరిండియా వన్ అనే అధికారిక విమానం ఉంది.
* దేశంలో, విదేశాల్లోనూ పర్యటించేటప్పుడు రాజ్య గౌరవాన్ని పొందుతారు.
* ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి తన పదవీ కాలంలో చేపట్టిన చర్యలకు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
* రాష్ట్రపతిపై క్రిమినల్ కేసు నమోదు చేయకూడదు. సివిల్ కేసు వేయాలన్నా 2 నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి.


ఆర్టికల్ 60: ప్రమాణ స్వీకారం
* రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి లేకపోతే తదుపరి సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణం చేస్తారు.
* రాష్ట్రపతి తన ప్రమాణాన్ని దేవుడి పేరుతో లేదా ఆత్మసాక్షిగా చేస్తారు. రాజ్యాంగ శాసనాన్ని పరిరక్షించి, సంపూర్ణ సామర్థ్యం మేరకు భారత ప్రజల సేవకు, వారి సంక్షేమం కోసం అంకితమవుతానని ప్రమాణం చేస్తారు.
* ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినప్పుడు కూడా పైన పేర్కొన్న విధంగానే పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి.


రాష్ట్రపతి రాజీనామా:
* రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి. ఇదే విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు కూడా తెలియజేయాలి. ఇలాంటి పరిస్థితి 1969లో అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ మరణించడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి.గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ రాజీనామా చేయడంతో ఏర్పడింది.


ఆర్టికల్ 61: మహాభియోగ తీర్మానం
*  రాష్ట్రపతిని రాజ్యాంగ అతిక్రమణ అనే కారణంతో ఆర్టికల్ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం ద్వారా పార్లమెంటు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు.
*  రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి గ్రహించారు.
*  మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
*  ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 1/4వ వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందస్తు నోటీసును సంబంధిత సభకు, రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆ తర్వాత తీర్మానం ప్రవేశపెట్టిన సభలో తొలగించే విషయంలో చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యులు ఆ అభియోగాన్ని ఆమోదిస్తే మహాభియోగ ప్రక్రియలో మొదటి దశ పూర్తవుతుంది.
*  తర్వాత మహాభియోగ తీర్మానం రెండో సభకు చేరుతుంది. రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, ఆమోదించిన రోజు నుంచి రాష్ట్రపతిని తొలగించినట్లు ప్రకటిస్తారు.
*  తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ సభ తిరస్కరిస్తే, ఆ తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు.
*  మహాభియోగ తీర్మానాన్ని ఒక సభ ఆమోదించి, మరొక సభ తిరస్కరించినప్పుడు తీర్మానం వీగిపోతుంది.
*  రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనవచ్చు.
*  1971లో వి.వి.గిరిపై తొలిసారిగా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి తర్వాత విరమించుకున్నారు.

ఆర్టికల్ 62
* రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే 6 నెలల్లోగా ఎన్నిక జరపాలి. రాష్ట్రపతి పదవీ కాలం ముగియడానికి 15 రోజుల ముందు నుంచి నూతన రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలి.


మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 - 1963)
   పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
* బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
* మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* ఆర్టికల్, 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
* 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
* హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
* ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
* తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
* హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
* అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
* రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.


2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 - 1975)
  పదవీకాలం:  1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
* తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
* అమెరికా ప్రభుత్వం ప్రసాదించే 'టెంపుల్‌టన్' అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
* ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
* విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* 8 దేశాల్లో 'విజిటింగ్ ప్రొఫెసర్‌'గా పనిచేశారు.
* ప్రజల సమస్యల పరిష్కారం కోసం 'ప్రజా దర్బార్‌'ను ఏర్పాటు చేశారు.
*" Hindu View Of Life", "All Idealist View Of Life"అనే గ్రంథాలను రచించారు.
* దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
* రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
* 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
* ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.


3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 - 1969)
  పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
* జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
* మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
* పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
* జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో
(1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
* దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


4. వి.వి. గిరి (1884 - 1980)
  పదవీకాలం:  1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
* వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
* నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
* అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
* రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
* తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
* కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
* బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
* 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
* ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
* ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి


5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 - 1977)
  పదవీకాలం:  1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
* ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
* టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
* ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
* 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
* ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని 'రబ్బర్‌స్టాంప్‌'గా విమర్శకులు పేర్కొన్నారు.
* ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.


6. నీలం సంజీవ రెడ్డి (1913 - 1996)
  పదవీకాలం:  1977, జులై 25 నుంచి 1982, జులై 25
* నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
* 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
* 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
* లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
* రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.


7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 - 1994)
  పదవీకాలం:  1982, జులై 25 నుంచి 1987, జులై 25
* ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
* హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
* మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
* బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై "Pocket Veto"ను వినియోగించారు.
* వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
* 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై 'ఆపరేషన్ బ్లూ స్టార్' అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
* రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
* ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
* 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non - Aligned Movements) సదస్సు జరిగింది.


8. ఆర్. వెంకట్రామన్: (1910 - 2009)
 పదవీకాలం:  1987, జులై 25 నుంచి 1992, జులై 25
* ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
* అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
* కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
* ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
* పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
* 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
* మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
* 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.


9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 - 1999)
 పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
* ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
* జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
* విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
* ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
* రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
* దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
* 'రాజనీతిజ్ఞ రాష్ట్రపతి'గా పేరుపొందారు.
* ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.


10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)
   పదవీకాలం:  1997 జులై 25 నుంచి 2002, జులై 25
* ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
* టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి దళిత రాష్ట్రపతి.
* పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
* వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
* విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
* ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
* ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
* గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి  కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
* అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

 

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 - 2015)
  పదవీకాలం:  2002 జులై 25 నుంచి 2007 జులై 25
* ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
* లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
* ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
* భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
* భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
* దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
* వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
* సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
* 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
* 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
* డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
* కలాం జన్మదినమైన అక్టోబరు 15న 'స్టూడెంట్స్ డే'గా నిర్వహిస్తున్నారు.
* PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
* కలాం 2015, జులై 27న మరణించారు.


2. ప్రతిభాపాటిల్ (1934)
  పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
* ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
* భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* తొలి మహిళా రాష్ట్రపతి.
* రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
* రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
* సుఖోయ్ యుద్ధ విమానం, టీ - 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
* గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
* ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
* బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
* విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.


13. ప్రణబ్ ముఖర్జీ (1935)
   పదవీకాలం:  2012 జులై 25 నుంచి - ప్రస్తుతం
* ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా 'మిరాటి' గ్రామంలో జన్మించారు.
* పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
* 1982 - 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
* 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
* 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
* 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
* 2011లో 'బెస్ట్ అడ్మినిస్ట్రేటర్' అవార్డును అందుకున్నారు.
* ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
* 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
* ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 - 2012 మధ్య
వ్యవహరించారు.
* ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
* 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
* లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.
ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు:
* The Dramatic Decade
* Midterm
* Off the Track
* కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.


రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు
1. సుమిత్రాదేవి (1962)
2. మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
3. లక్ష్మీ సెహగల్ (2002)
4. ప్రతిభా పాటిల్ (2007)


తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు
1. వి.వి. గిరి
2. జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
3. బి.డి. జెట్టి


ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు
1. బాబూ రాజేంద్ర ప్రసాద్
2. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
3. నీలం సంజీవరెడ్డి
4. జ్ఞానీ జైల్‌సింగ్
5. అబ్దుల్ కలాం
6. ప్రతిభా పాటిల్
7. ప్రణబ్ ముఖర్జీ


ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు
1. జి.ఎస్ పాఠక్
2. బి.డి. జెట్టి
3. జస్టిస్ హిదయతుల్లా
4. కె. కృష్ణకాంత్
5. భైరాన్‌సింగ్ షెకావత్


ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు
1. సర్వేపల్లి రాధకృష్ణన్
2. జాకీర్ హుస్సేన్
3. వి.వి. గిరి
4. ఆర్. వెంకట్రామన్
5. శంకర్ దయాళ్‌శర్మ
6. కె.ఆర్. నారాయణన్


భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు
1. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
2. డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
4. వి.వి. గిరి (1975)
5. ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి అధికారాలు - విధులు

రాష్ట్రపతి అధికారాలు - విధులు
       రాజ్యాంగంలో రాష్ట్రపతి అధికారాలను ఎక్కడా వర్గీకరించలేదు. పరిపాలనాంశాల సౌలభ్యం కోసం రాష్ట్రపతి అధికారాలను కింది విధంగా విభజించవచ్చు.
1) సాధారణ అధికారాలు     2) అత్యవసర/ అసాధారణ అధికారాలు


1. సాధారణ అధికారాలు
కార్యనిర్వహణాధికారాలు (Executive Powers)
* ఆర్టికల్ 53 ప్రకారం భారతదేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి. రాష్ట్రపతి దేశ పాలనను స్వయంగా లేదా ఇతర అధికారుల సహాయంతో నిర్వహిస్తారు.
* ఆర్టికల్ 77 ప్రకారం భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదు గానే నిర్వహించాలి. ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
తన కార్యనిర్వహణాధికారాలను నిర్వహించడంలో భాగంగా రాష్ట్రపతి కింద పేర్కొన్న నియామకాలు జరుపుతారు. అవి:
ఆర్టికల్ 75(1) - లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలి సహచరులను నియమిస్తారు.
ఆర్టికల్ 76(1) - భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌ను నియమిస్తారు.
ఆర్టికల్ 124 - సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 155 - రాష్ట్రాల్లో గవర్నర్లను
ఆర్టికల్ 148 - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులను, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జరనల్ (కాగ్)ను
ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రాల హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను
ఆర్టికల్ 263 - కేంద్రం - రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్ రాష్ట్ర మండలిని
ఆర్టికల్ 280 - కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని
ఆర్టికల్ 315 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను
ఆర్టికల్ 316 - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 324 - కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర అధికారులను
ఆర్టికల్ 239 - కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్లను, పరిపాలకులను
ఆర్టికల్ 323 (A) - సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 - జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 338 (A) - జాతీయ ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
ఆర్టికల్ 340 - జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
¤ జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ సమాచార కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* జాతీయ మైనార్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.


శాసనాధికారాలు:
ఆర్టికల్ 79 - పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ. రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగంగా కొనసాగుతారు.
ఆర్టికల్ 80 - కళలు, సాహిత్యం, సాంఘిక సేవ, సైన్స్, క్రీడా రంగాల్లో విశిష్ట వ్యక్తులైన 12 మందిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 331 - లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో  ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
ఆర్టికల్ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభిస్తారు. (Summons)
                  పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు.(Prorogue)
                  లోక్‌సభను రద్దు చేస్తారు. (Dissolve)
ఆర్టికల్ 86 - లోక్‌సభ, రాజ్యసభలకు సంయుక్తంగా లేదా విడివిడిగా సందేశాలను పంపుతారు.
ఆర్టికల్ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ప్రత్యేక/ విశేష ప్రసంగాలను పంపగలరు.
ఆర్టికల్ 99 - పార్లమెంటు సభ్యులు 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి సమక్షంలో లేదా రాష్ట్రపతితో నియమితులైన అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆర్టికల్ 103 - పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించడం.
ఆర్టికల్ 108 - పార్లమెంటు ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన నిర్వహిస్తారు.
ఆర్టికల్ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతో చట్టాలుగా మారుతాయి.
ఆర్టికల్ 123 - ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. ఈ ఆర్డినెన్స్‌లకు సాధారణ చట్టాలకు ఉండే విలువ ఉంటుంది.
 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవిత కాలం
 పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా)
 6 నెలలు + 6 వారాలు (లేదా)
 7  నెలలు (లేదా) 222 రోజులు.
* పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే ఆర్డినెన్స్ రద్దవుతుంది.


ఆర్డినెన్స్ - సుప్రీంకోర్టు తీర్పులు
* 1987లో కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ దురుద్దేశంతో జారీ చేసిన ఆర్డినెన్సును న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చని పేర్కొంది.
* 1987లో డి.సి.వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన తర్వాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యధాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరో ఆర్డినెన్స్‌ను జారీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని, అది రాజ్యాంగంపై దాడి లాంటిదని పేర్కొంది.
ఆర్టికల్ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.
ఆర్టికల్ 95(1) - లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సభాధ్యక్షులు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 201 - రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల్లో ఏదైనా రాజ్యాంగబద్ధ సందేహం ఉందని గవర్నర్ భావిస్తే సంబంధిత బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు.


రాష్ట్రపతి వీటో అధికారాలు
* వీటో (Veto) అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫర్బిడ్ (Forbid) అంటారు. వీటో అధికారం అంటే తిరస్కరించే అధికారం, నిరోధించే అధికారం, నిలుపుదల చేసే అధికారం.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి 3 రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. అవి:


1. అబ్సల్యూట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, కారణంతో లేదా కారణం లేకుండా తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు.
ఉదా: 1954లో రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ PEPSU (Pantiala East Punjab States Union) బిల్లు విషయంలో; 1991లో రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లుల విషయంలో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు.
* రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను పార్లమెంట్ లేదా మంత్రిమండలి రద్దు చేయవచ్చు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి ఆమోందించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లుల‌ను గ‌వ‌ర్నర్‌లు రాష్ట్రప‌తి ప‌రిశీల‌నకు రిజ‌ర్వు చేసిన‌ప్పుడు ఆర్టిక‌ల్ 201 ప్రకారం రాష్ట్రప‌తి వాటిని తిర‌స్కరించ‌వ‌చ్చు. ఈ బిల్లుల‌ను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపిన‌ప్పుడు కూడా వారు దాన్ని త‌ప్పనిసరిగా ఆమోదించాల్సిన అవ‌స‌రం లేదు.


2. సస్పెన్సివ్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా సవరణలు, సూచనలు చేస్తూ, పునఃపరిశీలనకు తిరిగి వెనుకకు పంపడాన్నే సస్పెన్సివ్ వీటో అంటారు.
* ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2006లో జోడు పదవుల బిల్లుల విషయంలో తన సస్పెన్సివ్ వీటోను వినియోగించుకున్నారు.
* కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ రెండోసారి అవే బిల్లుల్ని రాష్ట్రపతికి పంపడం ద్వారా వాటికి సస్పెన్సివ్ వీటోను రద్దు చేయవచ్చు.


3. పాకెట్ వీటో
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినేట్ లేదా పార్లమెంట్ పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా, ఎలాంటి నిర్ణయం తెలపకుండా వాటిని తన దగ్గరే పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు.
ఉదా: 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్‌ను అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్ పాకెట్‌వీటోకు గురిచేశారు. సుమారు 18 నెలలపాటు బిల్లును తన వద్దే పెట్టుకున్నారు.


4. క్వాలిఫైడ్ వీటో
* ఈ వీటో అధికారం 'భారతరాష్ట్రపతి'కి లేదు.
* అమెరికా అధ్యక్షుడికి ఈ రకమైన అధికారం ఉంటుంది.
* అమెరికా అధ్యక్షుడు వీటో చేసిన అంశాన్ని అమెరికా శాసన వ్యవస్థ 10 రోజుల నిర్ణీత గడువులోగా 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో మాత్రమే రద్దు చేసే వీలుంటుంది.
రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లులు
* ఆర్టికల్, 3 ప్రకారం - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు.
* ఆర్టికల్, 109 ప్రకారం - ద్రవ్య బిల్లులు
* ఆర్టికల్, 112 ప్రకారం - బడ్జెట్
* ఆర్టికల్, 31(A) ప్రకారం - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు
* ఆర్టికల్, 19(1)(G) ప్రకారం - వ్యాపార వాణిజ్య, స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు
* ఆర్టికల్, 117 ప్రకారం - మొదటి రకమైన ఆర్థిక బిల్లులు
* ఆర్టికల్, 349 ప్రకారం - జాతీయ అధికార భాషలో చేసే మార్పులు, చేర్పులకు సంబంధించిన బిల్లులు
* ఆర్టికల్, 368 ప్రకారం - రాజ్యాంగ సవరణ బిల్లులు


ఆర్థిక అధికారాలు:
* ఆర్టికల్, 117 - పార్లమెంటులో ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి
* ఆర్టికల్, 112 - ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 151 - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్రప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతారు.
* ఆర్టికల్, 292 - భారత ప్రభుత్వం విదేశీరుణాలు సేకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
* ఆర్టికల్, 265 - నూతన పన్నులు వసూలు చేసే బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.
* ఆర్టికల్, 267 - భారత ప్రభుత్వం ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి ఆయన అనుమతితో నగదును తీసుకోవాలి.
* ఆర్టికల్, 280 - మనదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సిఫారసు చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని  5 ఏళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.


దౌత్యాధికారాలు:
* భారతదేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు కృషిచేయడం.
* అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రాతినిధ్యం వహించడం.
* మిత్ర దేశాలకు భారతదేశం తరపున రాయబారులను నియమించడం, మిత్రదేశాల నుంచి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరించడం.
* మనదేశం తరపున ప్రతినిధులను ఐక్యరాజ్యసమితి (UNO) కి నియమించడం.
* మనదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులను, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిచడం.


సైనిక అధికారాలు
* ఆర్టికల్, 53(2) ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వసైన్యాధిపతి, త్రివిధ దళాలకు అధిపతి.
* ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.
* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించేది, శత్రుదేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేసేది రాష్ట్రపతి మాత్రమే.
* మనదేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతుంది.
* రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రిస్తారు. ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని నియమిస్తారు.


న్యాయాధికారాలు:
* ఆర్టికల్, 72 ప్రకారం రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి మొత్తం 5 రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు. అవి:
1. పార్డన్ (Absolving entire Punishment):
* న్యాయ స్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దు చేసి, క్షమాభిక్షను ప్రసాదించడం.
2. రెమిషన్ (Reduction of Sentence)
* శిక్షాస్వభావాన్ని మార్చకుండా శిక్షాకాలాన్ని తగ్గించడం.
3. కమ్యుటేషన్: (Changing Nature of Sentence)
* శిక్షాకాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం.
ఉదా: రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగారశిక్షగా మార్చారు.
4. రిప్రైవ్: (Postponement of Sentence)
* శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
5. రెస్పైట్: (Providing Relief)
* ముద్దాయి ప్రత్యేక పరిస్థితులను పరిగిణనలోకి తీసుకుని దీన్ని ప్రసాదిస్తారు.
ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యత కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, వయోభారం ఉన్నప్పుడు, గర్భిణి అయినప్పుడు ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది.
క్షమాభిక్ష అధికారాలు న్యాయ సమీక్షకు గురవుతాయా?
* రాష్ట్రపతి గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలను న్యాయ సమీక్షకు గురిచేయవచ్చని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గౌరు వెంకట్ రెడ్డి కేసులో ఆర్జిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ 2006లో పేర్కొంది.
దేవేందర్‌పాల్ సింగ్ దిల్లార్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా ధరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై భారత రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలుపకపోతే మరణశిక్షను యావజ్జీవ కారగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.
* ఉరిశిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు వర్తించవు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహామేరకు మాత్రమే రాష్ట్రపతి న్యాయాధికారాలను వినియోగించాలి.


రాష్ట్రపతి - ప్రత్యేక రక్షణలు
* ఆర్టికల్, 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు, మినహాయింపులు ఇచ్చారు.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా అతడిని అరెస్ట్ చేయకూడదు, ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయరాదు.
* రాష్ట్రపతిపై సివిల్ కేసులు నమోదు చేయాలంటే 2 నెలలు ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై దేశంలో ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు; రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు; రాష్ట్రాల లోకాయుక్తలను నియమించేది గవర్నర్లు అయినప్పటికీ వారిని తొలిగించేది మాత్రం రాష్ట్రపతి.
* ఆర్టికల్, 244 ప్రకారం మనదేశంలో ఆదివాసీ ప్రాంతాలు, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.


రాష్ట్రపతి  అత్యవసర పరిస్థితి  అధికారాలు
* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థతి అధికారాలను వివరించారు.
* భారత రాజ్యాంగ నిర్మాతలు 1935 భారత ప్రభత్వ చట్టం నుంచి అత్యవసర పరిస్థితి అధికారాలను గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించేటప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ నుంచి గ్రహించారు.
* అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ జీవించే హక్కును రద్దుచేయకుండా ఉండే పద్ధతిని జపాన్ నుంచి గ్రహించారు.
* రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలను పొందుపరచాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి. కృష్ణమాచారి ప్రతిపాదించారు.
* అత్యవసర పరిస్థితి అధికారాలను పూర్తిగా వ్యతిరేకించిన వారిలో హెచ్.వి. కామత్, కె.టి. షా, సి.డి. దేశ్‌ముఖ్ కీలకమైనవారు.
* అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఐక్యత, రక్షణ..... లాంటివి పరిరక్షించడానికి అత్యవసర అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవి వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తాయి.
భారత రాజ్యాంగంలో 3 రకాలైన అత్యవసర పరిస్థితులను పేర్నొన్నారు. అవి:
1. జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) ఆర్టికల్, 352
2. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (Constitutional Emergency) ఆర్టికల్, 356 (రాష్ట్రపతి పాలన)
3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergnecy) ఆర్టికల్, 360


జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352
     జాతీయ అత్యవసర పరిస్థితిని రెండు కారణాల వల్ల విధించవచ్చు. అవి:
A. బాహ్య కారణాలు:
* మన దేశంపై విదేశీ దాడి లేదా మనదేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
B. ఆంతరంగిక కారణాలు:
* దేశంలో ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ సమగ్రతకు, ఐక్యతకు భంగం వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినప్పుడు
* 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆంతరంగిక అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి, సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చింది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేబినెట్ అనే పదాన్ని ఆర్టికల్ 352(7) లో చేర్చి, కేంద్ర కేబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని పేర్కొన్నారు.
* కేంద్ర కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు కానీ కేంద్ర కేబినెట్ రెండోసారి అమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయసభలు నెలరోజుల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. (ఇంతకు ముందు పార్లమెంటు 2 నెలల్లోగా 2/3 వ వంతు  ప్రత్యేక మోజార్టీతో ఆమోదించాలని ఉండేది.)
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించే నాటికి ఒకవేళ లోక్‌సభ రద్దయితే, దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కానీ నూతన లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితిని 6 నెలలకు ఒకసారి చొప్పున గరిష్ఠంగా ఎన్నిసార్లయినా, ఎంతకాలమైనా విధించవచ్చు, పొడిగించవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - రద్దు
* రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే దీన్ని రద్దు చేయవచ్చు.
* పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా దీన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు మంది సభ్యుల సంతకాలతో అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు/రాష్ట్రపతికి అందజేయాలి.
* 14 రోజుల ముందు ఇచ్చే ఈ నోటీసు ప్రకారం లోక్‌సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సాధారణ మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దుచేయవచ్చు.


జాతీయ అత్యవసర పరిస్థితి - పరిణామాలు
* రాష్ట్ర జాబితాతోసహా అన్ని జాబితాల్లోని అంశాలపై కేంద్రమే శాసనాలు రూపొందిస్తుంది.
* కేంద్ర కార్యనిర్వహక వర్గం అధికారాలు విస్తృతం అవుతాయి.
* ఆర్టికల్, 353 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసే పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* ఆర్టికల్, 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన చట్టాలు జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత 6 నెలల వరకు అమల్లో ఉంటాయి. 6 నెలల అనంతరం ఈ చట్టాలు వాటంతటవే రద్దు అవుతాయి.
* ఆర్టికల్, 354 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థిక పరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* లోక్‌సభ, రాష్ట్రాల శాసనభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు.
* 5వ లోక్‌సభ పదవీకాలం 1976, మార్చి 18తో ముగిసింది. అదే సమయంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుండటంతో 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 1977, మార్చి 18 వరకు పొడిగించారు. కానీ మధ్యలోనే 1977, జనవరి 18న రద్దు చేశారు. 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది.
* రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని కూడా పార్లమెంటు ఒక ఏడాది పాటు పొడిగించవచ్చు.
* 1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసన సభ పదవీ కాలాన్ని 1977 నుంచి 1978 వరకు ఒక సంవత్సరంపాటు పొడిగించారు.
* ఆర్టికల్, 358 ప్రకారం ఆర్టికల్, 19 సహజంగానే సస్పెండ్ అవుతుంది.
* 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా విదేశీ కారణాలతో  జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్, 19 సహజంగా రద్దు అవుతుంది. ఆంతరంగిక కారణాల ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఆర్టికల్, 19 సహజంగా సస్పెండ్ కాదని, రాష్ట్రపతి జారీచేసే ప్రత్యేక ప్రకటన ద్వారా మాత్రమే సస్పెండ్ చేస్తారని దీన్ని పార్లమెంటు ఆమోదించాలని నిర్దేశించారు.
* ఆర్టికల్, 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్ 20, 21 లలో పేర్కొన్న హక్కులను మినహాయించి, మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు.
* ఉన్నత న్యాయస్థానాల న్యాయసమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకోసం ఆర్టికల్, 32 ప్రకారం సప్రీంకోర్టు; ఆర్టికల్, 226 ప్రకారం హైకోర్టులు రిట్స్ జారీచేసే అధికారాలపై పార్లమెంటు చట్టబద్ధ పరిమితులను విధించవచ్చు.


మనదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు
1. 1962, అక్టోబరు 26 - 1968, జనవరి 10 మధ్య మనదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1962లో చైనా భారతదేశంపై దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
2. 1971, డిసెంబరు 3 - 1977, మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి, కొనసాగించారు.
* 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభమవడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి. గిరి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
3. 1975, జూన్ 25 - 1977, మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించి, కొనసాగించారు.
* 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నివారించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్ధీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం సంభవించినప్పటికీ ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించలేదు. దీనికి కారణం 1962లో విధించిన అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగడమే.
* 1975 నుంచి 1977 మధ్య ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాల వల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు.
* 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352కు సవరణ చేసి, ఒకే సమయంలో రెండు రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే వీలును కల్పించారు.

 

ఆర్టికల్ - 358, ఆర్టికల్ - 359 మధ్య వ్యత్యాసం

ఆర్టికల్, 358 ఆర్టికల్, 359
1. దీని ప్రభావం ఆర్టికల్, 19లో ప్రస్తావించిన
వ్యక్తిగత స్వేచ్ఛలకు మాత్రమే పరిమితం.
1. దీని ప్రభావం అన్ని ప్రాథమిక హక్కులకు వర్తిస్తుంది.
2. దీని ప్రభావం బాహ్య కారణాల వల్ల విధించిన అత్యవసర పరిస్థితికే పరిమితం. 2. ఇది ఆంతరంగిక, బాహ్య జాతీయ అత్యవసర పరిస్థితులకు కూడా వర్తిస్తుంది.
3. దీని ప్రభావం దేశం మొత్తానికి వర్తిస్తుంది. 3. దీని ప్రభావం దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు వర్తిస్తుంది.
4. అత్యవసర పరిస్థితి ఉన్నంతవరకు ప్రాథమిక హక్కులపై ప్రభావం ఉంటుంది. 4. రాష్ట్రపతి నిర్ణయించిన సమయం వరకు మాత్రమే
ఉంటుంది. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కుల అమలు రద్దు చేయకపోవచ్చు.

 

జ్యాంగ అత్యవసర పరిస్థితి - రాష్ట్రపతి పాలన (ఆర్టికల్, 356)
* ఆర్టికల్, 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగపరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
* ఆర్టికల్, 356(1) ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు, రాజ్యాంగపరంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగలేదని రాష్ట్ర గవర్నర్ నివేదిక ఇచ్చినప్పుడు ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలనను ఆర్టికల్, 356 ద్వారా విధిస్తారు.
రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?
  * ప్రభుత్వం పనిచేయకపోవడం.
  * శాంతిభద్రతలు క్షీణించడం.
  * ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
  * రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా పడిపోవడం.
  * ప్రభుత్వమే ఏర్పడకపోవడం.
  * ఆర్టికల్, 365 ప్రకారం కేంద్రం ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోవడం.
» రాష్ట్రపతి పాలనను పార్లమెంటు 2 నెలల్లోగా సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
» ఆర్టికల్, 356(3) ప్రకారం ఒకవేళ రాష్ట్రపతిపాలన విధించే సమయానికి లోక్‌సభ రద్దు అయితే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పాటైన నెలరోజుల్లోగా తప్పనిసరిగా రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే రద్దు అవుతుంది.
* పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదం ద్వారా 6 నెలలకు ఒకసారి చొప్పున రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.
» 1997లో ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలనను విధించాలని, ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు.
* రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసును రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపినప్పుడు కేంద్ర కేబినెట్ అదే అంశాన్ని రెండోసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి.
ఉదా: అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ బిహార్‌లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలనను విధించాలని చేసిన సిఫారసును రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ పునఃపరిశీలనకు పంపారు. అదే సిఫారసును కేంద్ర కేబినెట్ రెండోసారి పంపడంతో కె.ఆర్. నారాయణన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి వచ్చింది.
* రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. రాష్ట్రపతి పాలన రద్దు అవుతుంది.
ఉదా: బిహార్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను లోక్‌సభ ఆమోదించి, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఆర్టికల్, 356(5) ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం కొనసాగాలంటే..
     44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా కింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి:
* దేశంలో లేదా రాష్ట్రాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతూ ఉండాలి.
* సంబంధిత రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా నిర్వహించడం సాధ్యంకాదని కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
* 3 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రపతి పాలనను పొడిగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదా: పంజాబ్‌లోని అసాధారణ పరిస్థితుల దృష్ట్యా 59, 64, 68 రాజ్యాంగ సవరణల ద్వారా అక్కడ రాష్ట్రపతి పాలనను 5 ఏళ్ల వరకు పొడిగించారు.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన ద్వారా లేదా పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా రాష్ట్రపతి పాలనను రద్దు చేయవచ్చు.

 


రాష్ట్రపతి పాలన - పర్యవసానాలు
* రాష్ట్రప్రభుత్వాన్ని (మంత్రి మండలి) రద్దు చేయవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
* రాష్ట్ర విధానసభను రద్దు చేసినట్లయితే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.
* రాష్ట్ర విధానసభను సుప్తచేతనావస్థలో ఉంచితే, దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి అవకాశం ఉంది.
ఉదా: జమ్మూకశ్మీర్ విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఆర్టికల్, 356 ప్రకారం అక్కడ రాష్ట్రపతి పరిపాలనను విధించి శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచారు. పీడీపీ (పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ), బీజేపీ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడంతో రాష్ట్ర శాసనసభను పునరుద్ధరించారు.
* రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమిస్తాయి.
* హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
* రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను రాష్ట్రపతి ఆర్టికల్, 123 ప్రకారం ఆర్డినెన్స్ రూపంలో వెలువరిస్తారు.
* రాష్ట్రపతి పాలనను గవర్నర్ రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు. గవర్నర్‌కు రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణాధికారాలు ఉంటాయి.
* గవర్నర్‌కు తన విధి నిర్వహణలో సహాయాన్ని, సలహాలను అందించడానికి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉంటారు.
» ఆర్టికల్, 357(2) ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే, అవి రాష్ట్రపతి పాలన రద్దు అయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ చట్టాలను రాష్ట్ర శాసన సభ కొనసాగించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలన - న్యాయ సమీక్ష
» 38వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్, 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, ఆ నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించరాదని ఇందిరా గాంధీ ప్రభుత్వం నిర్దేశించింది.
» మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షకు అతీతం కాదని నిర్దేశించారు.
ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994)
» ఈ కేసులో సుప్రీం కోర్టు రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. అవి
  * భారత సమాఖ్యకు భంగం కలిగించే విధంగా ఆర్టికల్, 356ను ప్రయోగించరాదు.
  * రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర విధాన సభను రద్దు చేయరాదు.
  * రాష్ట్రపతి పాలనను సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, విధాన సభను పునరుద్ధరించాలి.
  * రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.
  * రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
  * రాష్ట్ర ప్రభుత్వానికి మెజారిటీ ఉందా? లేదా? అనే అంశాన్ని శాసనసభ లోపల మాత్రమే పరీక్షించాలి.
  * లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకిక తత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర  ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయవచ్చు.
  * రాష్ట్రపతి పాలనను దురుద్దేశంగా విధిస్తే, దానికి సమంజసమైన కారణాలు లేకపోతే న్యాయస్థానాలు వాటిని  రద్దు చేయవచ్చు.


రాష్ట్రపతి పాలనా విశేషాలు
* 2015, ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 123 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1951లో పంజాబ్‌లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించారు.
* అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం పంజాబ్. 1987, మే 11 - 1992, ఏప్రిల్ 25 వరకు అంటే 4 సంవత్సరాల 9 నెలల 3 రోజులు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు.
* అతి తక్కువ కాలం రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రం కర్ణాటక. 1990, అక్టోబరు 10 - 1990, అక్టోబరు 17 వరకు అంటే కేవలం 8 రోజులు మాత్రమే కర్ణాటకలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది.
* మణిపూర్‌లో 12 , ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 , కేరళలో 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.
* ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు - ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ.
* 1975 - 77 మధ్య కాలంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 21 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫారసు మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన బి.డి. జెట్టి 9 కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
* 1980లో ఇందిరా గాంధీ ప్రభుత్వం 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ద్వారా ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయించారు.
* ఆర్టికల్, 356ను దుర్వినియోగం చేయకుండా 2000 లో వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో అంతర్‌రాష్ట్ర మండలి నుంచి జార్జి ఫెర్నాండెజ్ నేతృత్వంలో ఒక సబ్ కమిటీ ఏర్పడి పలు సూచనలు చేసింది.
* ఆర్టికల్, 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో ఎం.ఎన్. వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ పేర్కొంది.

జాతీయ అత్యవసర పరిస్థితికి, రాష్ట్రపతి పాలనకు మధ్య వ్యత్యాసాలు

జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 352 రాష్ట్రపతి పాలన - ఆర్టికల్, 356
1. దీన్ని పార్లమెంటు నెలరోజుల్లోగా ఆమోదించాలి. 1. పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాలి.
2. పార్లమెంటు  వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. 2. పార్లమెంటు సాధారణ మెజార్టీ ద్వారా ఆమోదించాలి.
3. దేశం మొత్తం లేదా దేశంలోని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో విధించవచ్చు. 3. రాష్ట్రం మొత్తం విధించాలి.
4. దీన్ని విధిస్తే లోక్‌సభను రద్దు చేయాల్సిన అవసరం లేదు. 4. దీన్ని విధిస్తే రాష్ట్ర శాసనసభను రద్దు చేయ వచ్చు లేదా సుప్తచేతనావస్థలో ఉంచవచ్చు.
5. దీన్ని విధిస్తే కేంద్ర మంత్రిమండలి రద్దు కాదు. 5. దీన్ని విధించిన వెంటనే రాష్ట్ర మంత్రిమండలి రద్దు అవుతుంది.
6. దీన్ని విధిస్తే ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు. 6. దీన్ని విధించినప్పటికీ ప్రాథమిక హక్కులు మనుగడలోనే ఉంటాయి.
7. గరిష్ఠంగా ఎంతకాలమైనా విధించవచ్చు. 7. గరిష్ఠంగా 3 ఏళ్ల వరకు విధించవచ్చు.

 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన
1. ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధ విషయంపై టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ సి.ఎం. త్రివేది సిఫారసుల మేరకు 1954, నవంబరు 15 నుంచి 1955, మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
2. ఆంధ్రప్రదేశ్‌లోని జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి. నరసింహా రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ సిఫారసుల మేరకు 1973, జనవరి 11 నుంచి 1973, డిసెంబరు 10 మధ్య 335 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.
3. ఆంధ్రప్రదేశ్‌లో 'ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం' నేపథ్యంలో ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అప్పటి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ సిఫారసుల మేరకు 2014, మార్చి 1 నుంచి 2014 జూన్ 8 మధ్య 3 నెలల 7 రోజులపాటు రాష్ట్రపతి పాలనను విధించారు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్, 360
* దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినా, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేకపోయినా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్, 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రెండు నెలల్లోగా పార్లమెంటు ఆమోదిస్తే ఆరు నెలల వరకు కొనసాగుతుంది. దీన్ని పార్లమెంటు ఆమోదంతో ఆరు నెలలకొకసారి చొప్పున గరిష్ఠంగా ఎంత కాలమైనా విధించవచ్చు.
* లోక్‌సభ, రాజ్యసభల మధ్య ఆర్థిక అత్యవసర బిల్లు ఆమోదం విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే అది రద్దవుతుంది. ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన నాటికి లోక్‌సభ రద్దయితే రాజ్యసభ ఆమోదంతో అది కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.
» రాష్ట్రపతి ఒక సాధారణ ప్రకటన , పార్లమెంటు ఒక సాధారణ తీర్మానం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటనను రద్దు చేయవచ్చు.


ఆర్థిక అత్యవసర పరిస్థితి - పర్యవసానాలు
* కేంద్రం జారీచేసే ఆర్థిక ఆంక్షలను, ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి.
* కేంద్రం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్ కాపీలను కేంద్రానికి పంపాల్సిందే.
* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు; సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలు తగ్గిస్తారు.
* ఆర్టికల్, 275 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రూపొందించిన చట్టాలు అది రద్దయిన అనంతరం 6 నెలల వరకు అమల్లో ఉంటాయి.
» ఇప్పటి వరకు మనదేశంలో ఒకసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు.

 

జాతీయ అత్యవసర పరిస్థితి - షా కమిషన్ నివేదిక
* 1975, జూన్ 25 నుంచి 1977, మార్చి 21 వరకు సుమారు 21 నెలలపాటు ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, ప్రతిపక్ష రాజకీయ పార్టీల పట్ల అణిచివేత చర్యలు లాంటివి జరిగాయి.
* వీటిని విచారించేందుకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1977లో జయంత్‌లాల్ ఛోటాలాల్ షా
(జె.సి. షా) నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తన నివేదికను 1978లో సమర్పించింది.
* ఈ కమిషన్ నివేదికలో తెలిపిన అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలను విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో జనతా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* 1980లో 'ఇందిరాను పిలవండి - దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో ఇందిరా గాంధీ అధికారానికి వచ్చి, షా కమిషన్ నివేదికను రద్దు చేసింది.


అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యలు
» 'అత్యవసర పరిస్థితులను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపైన జరిపే దోపిడీ లాంటివి' - కె.ఎం. నంబియార్
» 'అత్యవసర పరిస్థితి అధికారాలనేవి మన రాజ్యాంగంలోని అవశ్యక్లేశాలు అంటే అవసరమైన చెడు' -టి.టి. కృష్ణమాచారి
» 'అత్యవసర పరిస్థితులు అసాధారణ పరిస్థితుల్లో రాజ్యాంగానికి రక్షక కవచాల లాంటివి' - మహావీర్ త్యాగి
» 'అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగానికి శ్వాసను అందించే మార్గాలు, మృత సంజీవని లాంటివి' - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
» 'భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు' -డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఒకవేళ రాష్ట్రపతి అత్యవసర అధికారాలను నిజంగా వినియోగిస్తే, ఆ రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది' - హెచ్.వి. కామత్
» 'అత్యవసర పరిస్థితి అధికారాల వల్ల రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నియంతగా మారిపోతారు' - అలెన్ గ్రేడ్‌హిల్
» 'డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ మరణించారు, కానీ ఆర్టికల్, 356 సజీవంగానే ఉంది' -హెచ్.వి. కామత్
» 'వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కంటే దేశ సార్వభౌమత్వం గొప్పది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'ఆర్టికల్, 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వులాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'అత్యవసర అధికారాలను రాజకీయ ఉద్దేశాల కోసం దుర్వినియోగం చేయరు అనే అభిప్రాయాలతో నేను అంగీకరించను. ఆర్టికల్, 356 అనేది మృతాక్షరం (Dead Article)' - డాక్టర్ బి.ఆర్. అంబ్కేడర్
» 'ఆర్టికల్, 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన అనేది కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మలా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పావులుగా మారారు' - జస్టిస్ వి. కృష్ణయ్యర్
» 'ఆర్టికల్, 356 అనేది రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం యొక్క కత్తి అంటే ఆ ప్రభుత్వాలను ఎప్పుడైనా వధించవచ్చు' - డి.కె. చటర్జీ

 

రాష్ట్రపతి - విచక్షణాధికారాలు
* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో ప్రధానమంత్రిని నియమించే సమయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు.
* 1989లో మనదేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్ పార్లమెంట్‌గా అవతరించిన సమయంలో 191 స్థానాలతో కాంగ్రెస్ పెద్దపార్టీగా  ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఏర్పాటుకు  ముందుకు రాకపోవడంతో 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీగా ఏర్పడిన జనతాదళ్‌కు చెందిన వి.పి. సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ ఆహ్వానించారు.
* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఆహ్వానించారు. కానీ మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైన వాజ్‌పేయీ 13 రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు.
» కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి అవకాశాన్ని కల్పించడం లేదా లోక్‌సభను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునివ్వడం అనేది రాష్ట్రపతి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది.
ఉదా:1979లో మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసినప్పుడు చరణ్‌ సింగ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాగా, రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి చరణ్‌ సింగ్‌ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌సింగ్ పార్లమెంటుకు హాజరుకాకుండానే 23వ రోజున పదవికి రాజీనామా చేశారు.
» చరణ్‌ సింగ్ రాజీనామా అనంతరం బాబూ జగజ్జీవన్‌రామ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చినప్పటికీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు.
» 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం బీజేపీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానిగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ 1999లో వాజ్‌పేయీ ప్రభుత్వం కేవలం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ 12వ లోక్‌సభను రద్దు చేశారు.
» మన దేశంలో అతి తక్కువ కాలం అంటే 13 నెలలు మాత్రమే పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.
* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్ ప్రసంగం బదులుగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
* 1999లో అటల్‌బిహారీ వాజ్‌పేయీ నాయకత్వంలోని 'ఆపద్ధర్మ ప్రభుత్వం' నూతన టెలికాం విధానం, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ. 125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
* 2006లో లాభదాయక పదవుల బిల్లును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు పంపారు.


రాష్ట్రపతి పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు
» 'మంత్రిమండలి సలహా లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. రాష్ట్రపతి పదవిని బ్రిటిష్ రాజమకుటంతో పోల్చవచ్చు. ఎందుకంటే వారు దేశానికి ఏలిక మాత్రమే, పాలకులు కాలేరు. రాష్ట్రపతి మంత్రిమండలికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» 'రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యమైన పాత్రను పోషిస్తారు' - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» 'రాష్ట్రపతి పదవి భారత జాతి నిర్ణయాలను తెలియజేసే ఆమోదముద్ర లాంటిది' - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
» '42వ, 44వ రాజ్యాంగ సవరణల అనంతరం రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలింది' - ఎమ్.పి జైన్
» 'భారత్‌లో పార్లమెంటరీ విధానం ఉండటం వల్ల ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి వ్యవహరించాలి' - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» 'భారత రాష్ట్రపతులందర్నీ ప్రధానమంత్రి రాష్ట్రపతులుగానే పరిగణించాలి' - టి.ఎన్. శేషన్
» 'భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ, రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యాన్ని కూడా ఇచ్చింది' - జవహర్‌లాల్ నెహ్రూ
షంషేర్ సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: 1974
» ఈ కేసులో జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిస్తూ ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని పేర్కొంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు

1. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాల గురించి ఎక్కడ పేర్కొన్నారు?

1) 10వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
2) 11వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 246 నుంచి 256 వరకు


2. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు
3) 13వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 300 వరకు
4) 14వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 262 వరకు


3. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?

1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 244 నుంచి 261 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 263 నుంచి 290 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 300 నుంచి 322 వరకు
 

4. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు అనే మూడు రకాల అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్‌లో పేర్కొన్నారు?

1) 5          2) 6               3) 7              4) 8


5. భారత ప్రభుత్వం అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డ్‌ ్బళిi్ర’౯ త్న్చీ౯్ట్శ చట్టాలను ఎప్పుడు రూపొందించింది?

1) 1956        2) 1958         3) 1959         4) 1963


6. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో ఎవరి అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది?

1) ఫజుల్‌ అలీ       2) కేదారనాథ్‌      3)  మొరార్జీ దేశాయ్‌       4) జయప్రకాష్‌ నారాయణ్‌


7. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎవరి అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది?

1) ఎం.సి. సెతల్‌వాడ్‌        2) నరహరిరావు      3)  అశోక్‌బింద్రా        4) సందీప్‌ వాఘేలా


8. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ‘అంతర్‌ రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 261        2) ఆర్టికల్‌ 262         3)  ఆర్టికల్‌ 263          4) ఆర్టికల్‌ 264


9. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 1969లో తమిళనాడులోని కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?

1) పి.వి. రాజమన్నార్‌       2) పి.కె.తుంగన్‌        3)  వి.కె.అన్నామలై         4) దత్తుమిశ్రా


10. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) నానీపాల్కీవాలా కమిటీ            2)రంగరాజన్‌ కమిటీ 
3)  పి.వి. రాజమన్నార్‌ కమిటీ     4) చంద్రశేఖర్‌ కమిటీ


11. పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో రూపొందించిన ‘ఆనందపూర్‌ సాహెబ్‌’ తీర్మానంలో కేంద్రం యొక్క అధికార పరిధి దేనికి పరిమితం కావాలని సిఫారసు చేసింది?

1) రక్షణ, కరెన్సీ        2) అంతర్జాతీయ సంబంధాలు 
3)  కమ్యూనికేషన్ల వ్యవస్థ         4) అన్నీ


12. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది? 

1) రంజిత్‌ సింగ్‌ సర్కారియా         2) రంగనాథ్‌ మిశ్రా 
3)  గోపాల ద్వివేది         4) నానీపాల్కీవాలా


13. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసు? 

1) ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు. 
2) క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్‌గా నియమించకూడదు.
3)  గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
4) పైవన్నీ


14. రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిషన్‌ 247 సిఫారసులతో 1987లో తన నివేదికను ఎవరికి సమర్పించింది?

1) ఇందిరా గాంధీ        2) రాజీవ్‌ గాంధీ         3)  వి.పి.సింగ్‌         4) చంద్రశేఖర్‌


15. కిందివారిలో సర్కారియా కమిషన్‌లోని సభ్యులు? 

1) బి. శివరామన్‌      4) ఎస్‌.ఆర్‌. సేన్‌     3)  బి. శివరామన్, ఎస్‌.ఆర్‌. సేన్‌      4) ఎల్‌.ఎన్‌.సిన్హా


16. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 2007లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది?

1) మదన్‌మోహన్‌ పూంచీ     2) రఘురాం రాజన్‌      3)  వినీత్‌ బ్రిజ్‌లాల్‌      4) రాజేంద్రసచార్‌


17. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం చొరవతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై రాజకీయ తీర్మానాన్ని ఎక్కడ చేశారు? 

1) హైదరాబాద్‌         2) విశాఖపట్నం         3)  విజయవాడ          4) కర్నూలు


18. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న జరిగిన సమావేశానికి ఎన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు హాజరయ్యాయి? 

1) 9            2) 14           3)  16              4) 18


19. విజయవాడలో 1983 మే 28న జరిగిన సమావేశంలో పాల్గొన్నవారు?

1) అటల్‌ బిహారి వాజ్‌పేయీ       2) చంద్రశేఖర్‌ 
3)  ఫరూక్‌ అబ్దుల్లా                4) పైవారందరూ


20. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చర్చించడానికి 1983లో ప్రతిపక్షాల రెండో సమావేశం ఫరూక్‌ అబ్దుల్లా అధ్యక్షతన ఎక్కడ జరిగింది?

1) శ్రీనగర్‌        2) సిమ్లా          3)  గాంధీనగర్          ‌     4) అలహాబాద్‌


21. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్న సమావేశం 1984 జనవరి 13న ఎక్కడ జరిగింది?

1) మద్రాసు         2) మైసూరు              3)  కలకత్తా          4) హైదరాబాద్‌


22. రాష్ట్ర జాబితాలోని ఏ అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘ఉమ్మడి జాబితా’లోకి మార్చింది?


1) విద్య            2) తూనికలు, కొలతలు         3)  కుటుంబ నియంత్రణ      4) అన్నీ


23. 1967లో జరిగిన ఎన్నో లోక్‌సభ సాధారణ ఎన్నికల అనంతరం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి?

1) 3వ       2) 4వ           3)  5వ           4) 6వ


24.  సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల సక్రమ పంపిణీకి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన ఏ కమిటీ 1971లో తన నివేదికను  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?


1) డి.ఆర్‌.గాడ్గిల్‌        2) దంతెవాలా        3)  రిజువరై        4) భిమల్‌జలాన్‌


25.     గవర్నర్‌లకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని, వారిని 5 ఏళ్లపాటు పదవిలో కొనసాగించాలని సిఫారసు చేసిన కమిటీ? 

1) మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం     2) రాజమన్నార్‌ కమిటీ 
3)  మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌     4) లక్డావాలా కమిషన్‌


26. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని సిఫారసు చేసిన కమిషన్‌? 


1) సర్కారియా కమిషన్‌         2) మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌ 
3)  రంగరాజన్‌ కమిషన్‌          4) రాగ్యానాయక్‌ కమిషన్‌


27. రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని 2005లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?

1) జయప్రకాష్‌ నారాయణ్‌         2) వీరప్ప మొయిలీ     3)  చంద్రలాల్‌ మిశ్రా        4) ఉషా మెహ్రా


సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-3; 5-1; 6-3; 7-1; 8-3; 9-1; 10-3; 11-4; 12-1; 13-4; 14-2; 15-3; 16-1; 17-3; 18-2; 19-4; 20-1; 21-3; 22-4; 23-2; 24-1; 25-3; 26-1;  27-2. 

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారత పార్లమెంట్ - లోక్‌సభ

కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత శాసన నిర్మాణ సంస్థ భారత పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ (79వ అధికరణ) అంటారు. రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి వివరిస్తాయి.
     పార్లమెంట్‌లోని దిగువ సభను లోక్‌సభ House of the People అంటారు. ఇందులో రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 552 మంది ఉండవచ్చు. 550 మందిని జనాభా ఆధారంగా విభజించిన ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు 543 మంది, ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఆ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుతం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 80 మందికి, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన జాతీయ రాజధాని దిల్లీకి ఏడుగురు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి నియమించిన ప్రోటెం స్పీకర్ (Pro Tem Speaker) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంప్రదాయం ప్రకారం సభలో అత్యధిక అనుభవం ఉన్న సీనియర్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రోటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ 10 మంది సభ్యులతో ప్యానల్ స్పీకర్ల జాబితాను రూపొందిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకపోతే సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించుకుంటారు.
* ప్రధానమంత్రి లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే ఆయన రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తూ, లోక్‌సభలో సభ్యత్వం ఉన్న తన మంత్రివర్గ సహచరుడిని లోక్‌సభ నాయకుడిగా నియమిస్తారు.
* ప్రస్తుత లోక్‌సభలో (16వ లోక్‌సభ) 38 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కనీసం 10 శాతం స్థానాలు పొందలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను పొందలేకపోయాయి. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే.
* లోక్‌సభలోని సభ్యులు ఎన్నుకున్న స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ఉపసభాపతి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా, యం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు రాయాల్సి ఉంటుంది. స్పీకర్ సంతృప్తి మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* స్పీకర్ అనుమతి లేకుండా సభ సమావేశాలకు 60 రోజులు గైర్హాజరు అయితే వారి సభ్యత్వం రద్దవుతుంది.

 

నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ: 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత పార్లమెంట్ నియమించే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజక వర్గాల సంఖ్యను పెంచడం లేదా ప్రాదేశిక సరిహద్దులను మార్చడం, షెడ్యూల్డ్ కులాలు, తెగల నియోజక వర్గాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47, మొత్తం 131 (24.03%) స్థానాలను రిజర్వు చేశారు.
 

లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు.
 

లోక్‌సభ స్పీకర్
     రాజ్యాంగంలో 93 నుంచి 97 వరకు ఉన్న అధికరణలు స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. లోక్‌సభకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1921 వరకు కేంద్ర శాసన మండలికి గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించేవారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ప్రెసిడెంట్ (స్పీకర్), డిప్యూటీ ప్రెసిడెంట్ (డిప్యూటీ స్పీకర్) పదవులను ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఫ్రెడరిక్ వైట్ ప్రెసిడెంట్‌గా, సచ్చిదానంద సిన్హా (వైస్ ప్రెసిడెంట్)డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కేంద్రశాసన మండలికి విఠల్‌భాయ్ జె. పటేల్ మొదటిసారిగా ఎన్నికైన ప్రెసిడెంట్ (స్పీకర్). 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చాయి.

* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రమాణ స్వీకారం అనేది ప్రత్యేకంగా ఉండదు.
* లోక్‌సభ రద్దు అయినప్పటికీ తిరిగి లోక్‌సభ ఏర్పడేంతవరకూ స్పీకర్ పదవిలో కొనసాగుతారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు లోక్‌సభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది.
* స్పీకర్ లోక్‌సభను తాత్కాలికంగా వాయిదా వేయగలరు.
* పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఒక బిల్లును ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయించే అంతిమ అధికారం లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుంది.
* లోక్‌సభ సభ్యులకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అయితే స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్ట్ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.

 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

విచక్షణ.. వివక్ష.. విభేదాలు!

  ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య తలెత్తుతున్న విభేదాలు పరిపాలనకు అవరోధాలుగా మారుతున్నాయి. సమాఖ్య వ్యవస్థ సామరస్యంగా సాగిపోడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంధానకర్తగా వ్యవహరించాల్సిన గవర్నర్‌ పదవి చుట్టూ వివాదాలు ముసురుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నాయి. రాజకీయ లేదా ఇతర కారణాలతో రాష్ట్రాధినేత, ప్రభుత్వాధిపతి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. విచక్షణ, వివక్షగా మారుతోందనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఆ రెండు హోదాలకు సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు, వివిధ కమిషన్లు-కమిటీలు చేసిన సిఫార్సులపై అభ్యర్థులు పరీక్షల కోణంలో అవగాహన పెంచుకోవాలి. 

                 భారతదేశం పరిపాలనా పరమైన సమాఖ్యగా కొనసాగడంలో, కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో గవర్నర్‌ కీలకపాత్ర పోషిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా వ్యవహరిస్తారు. రాష్ట్రాధినేత గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి పరస్పరం సహకరించుకుంటూ సమన్వయంతో పరిపాలన నిర్వహిస్తే ప్రజాస్వామ్యం విజయవంతమై ప్రజలకు మేలు జరుగుతుంది. అలాకాకుండా ఇరువురి మధ్య పరిపాలనాపరమైన అభిప్రాయ భేదాలు వస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్షీణించి అంతిమంగా ప్రజలకు అభిలషణీయమైన పరిపాలన దూరమవుతుంది.

 

రాజ్యాంగ నిర్మాతల ఆలోచన

* రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రస్థాయిలో పార్లమెంట్‌ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కేంద్రం నియమించే గవర్నర్‌ రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తూ నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు. ఓటర్ల ద్వారా ప్రాతినిధ్యం పొందిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తూ వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. 

* గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని రాజ్యాంగ సభ సలహాదారుడైన బెనగళ నరసింగరావు ప్రతిపాదించారు. కానీ డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించాలని పేర్కొన్నారు. ఈ వాదననే రాజ్యాంగ సభ సమర్థించింది. 

 

గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడానికి కారణాలు 

* గవర్నర్‌ను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ముఖ్యమంత్రితో వివాదాలు ఏర్పడతాయి. 

* గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. 

* గవర్నర్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటే ఆ పదవి పార్టీ రాజకీయాలకు లోనవుతుంది. అప్పుడు గవర్నర్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.

 

విచక్షణాధికారాలు 

ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సలహా లేకుండా లేదా ఆ సలహాకు వ్యతిరేకంగా గవర్నర్‌ చేపట్టే చర్యలను ‘విచక్షణాధికారాలు’ అంటారు. వీటి వల్ల గవర్నర్‌ పదవి తరచూ వివాదాస్పదమవుతుంది. ఈ విచక్షణాధికారాలు రెండు రకాలు.  


1) రాజ్యాంగపరమైనవి 

భారత రాజ్యాంగంలో అంతర్గతంగా గవర్నర్‌కు కొన్ని విచక్షణాధికారాలను పేర్కొన్నారు. వీటిని నిర్వహించడంలో గవర్నర్‌ మంత్రిమండలి సలహాను పాటించాల్సిన అవసరం లేదు. 

* రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయడం. 

* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా రాజ్యాంగ పరమైన కారణాలతో రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయడం. 

* రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని కోరడం. 

* రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను చెలాయించడం. 

 

2) సందర్భాన్ని అనుసరించి లభించేవి 

రాజకీయ పరిస్థితుల్లో వచ్చే మార్పుల ఆధారంగా గవర్నర్‌ కొన్ని విచక్షణాధికారాలను పొందుతారు. 

* రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించని సమయంలో ముఖ్యమంత్రిని నియమించడం.

* రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రత్యేక విచారణ కమిషన్‌లను ఏర్పాటు చేయడం.

* శాసనసభలో మెజార్టీ కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ రద్దు చేయవచ్చు.

* అధికారంలో ఉన్న ప్రభుత్వం పతనమైనప్పుడు, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేనప్పుడు శాసనసభ కాలపరిమితి ముగియకముందే శాసనసభను రద్దుచేయడం.

* శాసనసభను రద్దుచేయాలనే ముఖ్యమంత్రి సిఫారసును గవర్నర్‌ తిరస్కరించగలరు లేదా ఆమోదించగలరు. 

 

ఉదాహరణకు... 

* 1985లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫార్సు చేస్తే గవర్నర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ రద్దు చేశారు.

* 1994లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫార్సు చేస్తే గవర్నర్‌ కృష్ణకాంత్‌ తిరస్కరించారు.

* 2004లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దుచేయాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు సిఫార్సు చేస్తే గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా రద్దు చేశారు. 

 

గవర్నర్‌ పదవి - సుప్రీంకోర్టు తీర్పులు

 

ఆర్‌.ఎస్‌.మెహతా Vs (స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసు (2013)

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ గవర్నర్‌ తన అధికారాల నిర్వహణలో పార్లమెంట్‌కు లేదా రాష్ట్ర శాసనసభకు లేదా రాష్ట్ర మంత్రిమండలికి ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

 

పురుషోత్తం నంబూద్రి Vs (స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1962)

రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌ ఎంతకాలంలోగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఎలాంటి కాలపరిమితి లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.  

* కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసిన వివిధ కమిటీలు గవర్నర్‌ వ్యవస్థపై కీలకమైన సిఫార్సులు చేశాయి. 


కమిషన్‌లు, కమిటీల సిఫార్సులు

 

సర్కారియా కమిషన్‌ 

* క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనేవారిని గవర్నర్‌గా నియమించరాదు.

* గవర్నర్‌లకు ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేయాలి.

* గవర్నర్‌ల పేర్లను సూచించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.

* కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్‌లుగా నియమించరాదు.

* గవర్నర్‌ను నియమించే సమయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి.

* విశిష్ట వ్యక్తిత్వం, వివాదాస్పదం కాని వారిని మాత్రమే గవర్నర్‌గా నియమించాలి.

* గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించరాదు.

* ఒక వ్యక్తిని సొంత రాష్ట్రంలో గవర్నర్‌గా నియమించకూడదు.

 

మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌ 

* కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసిన మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌ గవర్నర్‌ వ్యవస్థపై కింది సిఫార్సులను చేసింది. 

* గవర్నర్‌ పదవీకాలం నిర్దిష్టంగా 5 సంవత్సరాలు ఉండాలి.

* రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా మంత్రులపై న్యాయ విచారణ జరపడానికి అనుమతించే అధికారం గవర్నర్‌కు కల్పించాలి.

* రాష్ట్రంలోని ప్రాంతీయ విశ్వవిద్యాలయాలకు వైస్‌ ఛాన్సెలర్‌లను నియమించడానికి గవర్నర్‌లకు ఉండే అధికారాన్ని వెంటనే తొలగించాలి.

* రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడినప్పుడు గవర్నర్‌ను రాష్ట్ర శాసనసభ 2/3వ వంతు మెజార్టీతో తొలగించేలా చట్టం చేయాలి.

* ప్రధానమంత్రి నేతృత్వంలోని స్క్రీనింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు గవర్నర్‌ను ఎంపిక చేయాలి.

 

రాజమన్నార్‌ కమిటీ 

* గవర్నర్‌ను నియమించేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తప్పనిసరిగా సంప్రదించాలి. 

* గవర్నర్‌ సంతృప్తిగా ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రి మండలి అధికారంలో ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి.

* గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధించరాదు.

 

గవర్నర్‌ పదవి - రాజ్యాంగ ఆర్టికల్స్‌ 

* ఆర్టికల్‌ 153 - ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్‌ ఉంటారు

* ఆర్టికల్‌ 154 - రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు గవర్నర్‌ పేరు మీదుగా నిర్వహిస్తారు 

* ఆర్టికల్‌ 155 - గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు

* ఆర్టికల్‌ 156 - గవర్నర్‌ పదవీకాలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది

* ఆర్టికల్‌ 157 - గవర్నర్‌ పదవికి ఉండాల్సిన అర్హతలు

* ఆర్టికల్‌ 158 - గవర్నర్‌ జీతభత్యాలు, వసతి

* ఆర్టికల్‌ 159 - ప్రమాణస్వీకారం (హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో)

* ఆర్టికల్‌ 160 - గవర్నర్‌ పదవికి ఖాళీ ఏర్పడితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు

* ఆర్టికల్‌ 161 - గవర్నర్‌కు గల క్షమాభిక్ష అధికారాలు

 

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గవర్నర్‌

ఇటీవల కాలంలో గవర్నర్‌ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్‌లు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రాజకీయాంశాలను ప్రభావితం చేస్తున్నారు. ఇది దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. గవర్నర్‌ల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతుంది. రాజకీయ నాయకుడు ముదిరితే గవర్నర్‌ అవుతారనే విమర్శకుల వాదనకు బలం చేకూరుతుంది.

 

గవర్నర్‌ వ్యవస్థ 

రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్‌ వ్యవస్థను భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించారు. గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని కెనడా దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్రంలో రాజ్యాంగ పరమైన అధిపతిగా రెండు సున్నితమైన, సంక్లిష్టమైన పాత్రలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పరిపాలనాపరమైన ఆదేశాలు, నియామకాలు గవర్నర్‌ పేరు మీదుగానే జరుగుతాయి.

 

గవర్నర్‌ - రాజ్యాంగ వ్యవస్థ

రాజ్యాంగంలోని 6వ భాగంలో రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంది. దీనిలో గవర్నర్, ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్‌ జనరల్‌ అంతర్భాగంగా ఉంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 163(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు పరిపాలనా వ్యవహారాల్లో సహకరించేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. ఈ మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్‌ తన అధికారాలు, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం గవర్నర్‌ శాసనసభలో అంతర్భాగం. 

* గవర్నర్‌ శాసనసభ సమావేశాలను ప్రారంభించడాన్ని "Summans" (సమన్స్‌) అంటారు.

* గవర్నర్‌ శాసనసభ సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని "Prorogue" (ప్రోరోగ్‌) అంటారు.

* గవర్నర్‌ శాసనసభను రద్దు చేయడాన్ని "Dissolve" (డిసాల్వ్‌) అంటారు.

 

గవర్నర్‌ పదవి వివాదాస్పదమవుతున్న తీరు

గవర్నర్‌ల నియామకం, వారి పాత్ర, వ్యవహార శైలి తరచూ విమర్శలకు గురవుతుంది. రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేయడం, రాజకీయ అవసరాల కోసం గవర్నర్‌ పదవిని, దాని ఔనత్యాన్ని దుర్వినియోగం చేయడం సమర్థనీయం కాదు. గవర్నర్‌ పదవిని రాజకీయాలకు అతీతంగా, సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భంగం వాటిల్లకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని 1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

 

పరిణామాలు

* పశ్చిమ్‌ బంగలో గవర్నర్‌ జగ్దీప్‌ ధనకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య పరిపాలనాపరమైన విభేదాలు రావడంతో గవర్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శలకు దిగింది. ఇక్కడ గవర్నర్‌ ఉన్నతాధికారులను తరచూ రాజ్‌భవన్‌కు పిలిపించి సమీక్షలు నిర్వహించడం మమతా బెనర్జీ ప్రభుత్వానికి నచ్చలేదు.

* రాజస్థాన్‌లో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా వైఖరితో విసుగు చెందిన ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ శాసనసభ సమావేశాలను తక్షణం నిర్వహించాలని, సభలో తన ప్రభుత్వ విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు అవకాశం కల్పించాలని 102 మంది శాసన సభ్యులతో రాజ్‌భవన్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో సద్దుమణిగింది.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో 1990వ దశకంలో గవర్నర్‌ రొమేష్‌ భండారీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఇక్కడ గవర్నర్‌ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ అగ్రనేత అటల్‌బిహారి వాజ్‌పేయీ దీక్షను చేపట్టారు.

* తమిళనాడులో జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రిని నియమించడంలో అక్కడి గవర్నర్‌ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల తమిళనాడులోని స్టాలిన్‌ ప్రభుత్వం నీట్‌ పరీక్షల నుంచి తమిళనాడును మినహాయిస్తూ రాష్ట్ర శాసనసభలో ఒక బిల్లును ఆమోదించి, గవర్నర్‌ వద్దకు పంపగా, గవర్నర్‌ సంబంధిత బిల్లుపై ఆమోదముద్ర వేయకుండా తీవ్ర జాప్యం చేశారు.

* దిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పకుండానే అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బదిలీ చేయడం తీవ్ర దుమారం లేపింది.

* అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరపడం విమర్శలకు దారితీసింది.

* పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీతో విభేదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెను పిలవకుండానే బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించింది. 

* కేరళలో పినరయి విజయన్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు మధ్య తీవ్రమైన పరిపాలనా పరమైన విభేదాలు వచ్చాయి. 

* ఆంధ్రప్రదేశ్‌లో 1984లో అప్పటి గవర్నర్‌ రాంలాల్‌ శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో గవర్నర్‌ రాంలాల్‌ రీకాల్‌ చేయబడి పదవీచ్యుతులయ్యారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో అప్పటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌తో విభేదాలు వచ్చాయి.

 

తెలంగాణ

 

రాజ్‌భవన్‌ vs ప్రగతి భవన్‌

ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యవహరిస్తున్న తీరు తెలంగాణలో కె.చంద్రశేఖర్‌ రావు ప్రభుత్వానికి రుచించడంలేదు. దీనికి కారణాలు...

* రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ప్రజా దర్బార్‌ను నిర్వహించడం.

* విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సెలర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఖాళీల భర్తీపై గవర్నర్‌ ప్రకటన చేయడం. 

* గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం, ప్రగతిని విస్మరించడం.

* గవర్నర్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం.

* రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్‌ ఆకస్మిక పర్యటనలు జరపడం.

 

గవర్నర్‌ వ్యవస్థ - సుప్రీంకోర్టు తీర్పులు

 

షంషేర్‌ సింగ్‌ vsస్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను గవర్నర్‌ తప్పనిసరిగా పాటించాలని, గవర్నర్‌ సంతృప్తి అంటే రాష్ట్ర మంత్రిమండలి సంతృప్తిగానే భావించాలని పేర్కొంది.

 

రఘుకుల తిలక్‌ vs హరగోవింద్‌ కేసు

గవర్నర్‌లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే సంస్థ కాదు. గవర్నర్‌లు రాష్ట్ర అధిపతులుగా రాజ్యాంగం ప్రకారమే తమ విధులను నిర్వహించాలి అని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

బి.పి. సింఘాల్‌ vsయూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

కేంద్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో గవర్నర్‌లను మార్పు చేయరాదని, వారిని తొలగించడానికి ప్రత్యేక నియమావళిని అనుసరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ఎస్‌.ఆర్‌.బొమ్మై vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు 

ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విశ్వాసాన్ని గవర్నర్‌ రాజ్‌భవన్‌లో కాకుండా శాసనసభలోనే పరీక్షించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

సమీక్ష

కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌లను రాజకీయ పావులుగా ఉపయోగించకూడదు. కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి రాష్ట్రాల గవర్నర్‌లను మార్పుచేయడం సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.

* 1989లో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే 17 రాష్ట్రాల గవర్నర్‌లను తొలగించింది.

* 1991లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన వెంటనే 14 రాష్ట్రాల్లో గవర్నర్‌లను ఒకేసారి తొలగించింది.

* 1998లో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన తర్వాత 13 రాష్ట్రాల గవర్నర్‌లను తొలగించింది.

* 2004లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 రాష్ట్రాల్లోని గవర్నర్‌లను తొలగించింది.

* 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లోని గవర్నర్‌లను తొలగించడం ప్రారంభించింది.

* గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమాంతర అధికార వ్యవస్థ కాదు.

* గవర్నర్‌లుగా సీనియర్‌ రాజకీయ నాయకులను నియమించిన ప్రాంతాల్లో పాలనా వ్యవహారాల్లో జోక్యం పెరుగుతుంది. అలాకాకుండా మాజీ బ్యూరోక్రాట్లను గవర్నర్‌లుగా నియమించిన చోట వివాదాలు తక్కువగా ఉన్నాయి. గవర్నర్‌ వ్యవస్థ అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దీన్ని రాజ్యాంగ నియమావళికి అనుగుణంగా కొనసాగిస్తే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.

* డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ప్రకారం గవర్నర్‌ పదవి కేంద్రం యొక్క రాజకీయ పదవి కాదు. ఇది రాజ్యాంగబద్ధమైంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి పాలన 

సమాఖ్య సంరక్షణకు అది ఆఖరి అస్త్రమే!

భారత సమాఖ్యను ఏకతాటిపై ఉంచేందుకు రాజ్యాంగంలోని పద్దెనిమిదో భాగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిలో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేది తరచూ వివాదాస్పదమవుతోంది. సమాఖ్య వ్యవస్థ సంరక్షణకు ఆఖరి అస్త్రంగా మాత్రమే దీన్ని ఉపయోగించాలని నిపుణులు సూచించినా పరిణామాలు మాత్రం వేరుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాలిటీ అధ్యయనం చేసే అభ్యర్థులు ఆ ఆర్టికల్‌ను, రాజ్యాంగ వివరణలను, దాన్ని విధించినప్పుడు రాష్ట్రాల్లో ఏర్పడే మార్పులను, సుప్రీం కోర్టు తీర్పులను తెలుసుకోవాలి. 

 

ఆర్టికల్‌ 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగ పరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిపాలన సక్రమంగా లేనప్పుడు, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది.

 

విధింపు -  కారణాలు

ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గవర్నర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను విధిస్తారు. లేదా ఆర్టికల్‌ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు, ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు.
 

రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?

* ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం.

* శాంతిభద్రతలు క్షీణించడం.

* రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించడం.

* ప్రభుత్వాలు తరచూ పడిపోవడం.

* ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.
 

రాష్ట్రపతి పాలన - ప్రకటన, పార్లమెంటు ఆమోదం

* రాష్ట్రపతి ఆర్టికల్‌ 356(1) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను జారీ చేస్తారు.

* ఆర్టికల్‌ 356(2) ప్రకారం రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.

* ఆర్టికల్‌ 356(3) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు 2 నెలల్లోపు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన ప్రకటన వెలువడే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రాష్ట్రపతి పాలన ప్రకటనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆ ప్రకటన రద్దవుతుంది.

కాలపరిమితి: ఆర్టికల్‌ 356(4) ప్రకారం పార్లమెంటు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి పాలన 6 నెలలు కొనసాగుతుంది. ఆరు నెలలకొకసారి చొప్పున పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో గరిష్ఠంగా మూడేళ్లపాటు కొనసాగించవచ్చు.

 

44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978

ఆర్టికల్‌ 356(5) ప్రకారం ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలనను కొనసాగించాలంటే కింది నియమాలు తప్పనిసరి అని నిర్దేశించారు.

* దేశం మొత్తం మీద లేదా దేశంలోని ఏదైనా ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి.

* సంబంధిత రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ఇవ్వాలి.

ఏదైనా రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత కూడా ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను కొనసాగించాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేయాలి.

ఉదా: 59వ రాజ్యాంగ సవరణ చట్టం-1988; 68వ రాజ్యాంగ సవరణ చట్టం-1991 ద్వారా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల కంటే ఎక్కువ కొనసాగించారు. 

 

రాష్ట్రంలో సంభవించే మార్పులు

* ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.

* రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు.

* రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను కలిగి ఉంటారు.

* రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో (suspended animation) ఉంచుతారు.

* రాష్ట్రానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.

* పార్లమెంటు సమావేశాలు లేకపోతే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీచేస్తారు.

* రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటు రాష్ట్రపతికి లేదా రాష్ట్రపతి సూచించిన అథారిటీకి అప్పగిస్తుంది.

* రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.

* హైకోర్టు అధికార పరిధిలో ఎలాంటి మార్పులు ఉండవు.

* గవర్నర్‌కు పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తారు. 

* రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తే అవి రాష్ట్రపతి పాలన రద్దయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఈ చట్టాలను రాష్ట్ర శాసనసభ కొనసాగించవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు.

 

న్యాయ సమీక్ష

* ఇందిరా గాంధీ ప్రభుత్వం 38వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ద్వారా రాష్ట్రపతి తన అభీష్టం మేరకు లేదా సంతృప్తి మేరకు ఆర్టికల్‌ 356ను ప్రయోగించవచ్చని, రాష్ట్రపతి నిర్ణయమే తుది నిర్ణయమని, దాన్ని న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదని నిర్దేశించింది.

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978 ద్వారా రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని, రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్షకు అతీతం కాదని నిర్దేశించింది.

 

ఆర్టికల్‌ 356 దుర్వినియోగమవుతున్న తీరు

1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫార్సుల మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి.జెట్టి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు. 1980లో అధికారాన్ని చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.

ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ పేర్కొంది.

 

ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - 1994

ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ ఆర్టికల్‌ 356 ద్వారా విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది.

* భారత సమాఖ్యకు భంగం కలిగే విధంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించకూడదు.

* రాష్ట్రపతి పాలనను న్యాయసమీక్షకు గురిచేయవచ్చు.

* రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేయకూడదు.

* న్యాయస్థానం రాష్ట్రపతి పాలనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభను పునరుద్ధరించాలి.

* లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగం. లౌకికతత్వానికి విఘాతం కలిగించే రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేయవచ్చు.

* కేంద్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం సమంజసం కాదు.

* ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలికి పూర్తి మెజార్టీ ఉందా, లేదా అనే అంశాన్ని శాసనసభలోనే పరీక్షించాలి.

 

ఆంధ్రరాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన

* ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సంబంధించి టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అప్పటి గవర్నర్‌ చందూలాల్‌ మాధవ్‌ త్రివేది చేసిన సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజుల పాటు కొనసాగింది.

* ఆంధ్రప్రదేశ్‌లో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అప్పటి గవర్నర్‌ ఖండూభాయ్‌ దేశాయ్‌ చేసిన సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 1973 జనవరి 11 నుంచి డిసెంబరు 10 మధ్య 335 రోజుల పాటు కొనసాగింది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం నేపథ్యంలో ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 2014 మార్చి 1 నుంచి జూన్‌ 8 మధ్య 3 నెలల 7 రోజుల పాటు కొనసాగింది.

* 1951లో పంజాబ్‌ రాష్ట్రంలో తొలిసారి రాష్ట్రపతి పాలనను విధించారు. అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 10 సార్లు, కేరళలో 9 సార్లు, పంజాబ్‌లో 8 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆర్టికల్‌ 356ను 48 సార్లు ప్రయోగించారు.

 

వ్యాఖ్యానాలు

* 'డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ ‘ఆర్టికల్‌ 356 ఏనాడూ వినియోగానికి నోచుకోని మృత అధికరణగా (Dead Article) ఉంటుందని ఆశిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు. 

* 'ఆర్టికల్‌ 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా మారింది' - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌  

* 'డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ మరణించారు కానీ ఆర్టికల్‌ 356 నేటికీ సజీవంగానే ఉంది' - హెచ్‌.వి.కామత్‌
 

జాతీయ అత్యవసర పరిస్థితి - రాష్ట్రపతి పాలన మధ్య వ్యత్యాసాలు

 

మాదిరి ప్రశ్నలు
 

1. ఆర్టికల్‌ 356 ప్రకారం విధించిన రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు ఎంతకాలంలోపు ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది?

1) ఒక నెల   2) 2 నెలలు   3) 3 నెలలు   4) 6 నెలలు 

 

2. ఒక రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా ఎంతకాలం కొనసాగించవచ్చు?

1) ఒక సంవత్సరం    2) రెండేళ్లు   3) మూడేళ్లు    4) ఎంతకాలమైనా

 

3. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?

1) రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం.

2) రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించడం.

3) ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.

4) పైవన్నీ

 

4. పంజాబ్‌లో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి పాలనను మూడేళ్ల తర్వాత కూడా కొనసాగించారు?

1) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988  

2) 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988  

3) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991

4) 1, 3

 

5. రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంభవించే మార్పుకు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.

బి) రాష్ట్రానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.

సి) హైకోర్టు అధికారాలపై పరిమితులు విధించబడతాయి.

డి) గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను కలిగి ఉంటారు.

1) ఎ, బి, సి    2) ఎ, బి, డి 3) ఎ, సి, డి    4) ఎ, బి, సి, డి

 

6. ఆర్టికల్‌ 356 ద్వారా ప్రయోగించే రాష్ట్రపతి పాలనను న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978  

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976  

3) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985  

4) 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 1989

 

7. 1977లో మొరార్జీ  దేశాయ్‌ ప్రభుత్వ సిఫార్సుల మేరకు 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేసిన అప్పటి తాత్కాలిక రాష్ట్రపతి ఎవరు?

1) జాకీర్‌ హుస్సేన్‌   2) నీలం సంజీవరెడ్డి    3) బి.డి.జెట్టి     4) వి.వి.గిరి

 

8. ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని సిఫార్సు చేసిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌కు అధ్యక్షులు ఎవరు?

1) జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా     2) జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య    3) జస్టిస్‌ జె.ఎస్‌.వర్మ      4) జస్టిస్‌ నానావతి

 

9. లౌకికతత్వం అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది?

1) షంషేర్‌ సింగ్‌ Vs  స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

2) ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మేనకా గాంధీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) డి.కె.చటర్జీ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసు

 

10. ‘డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ మరణించారు కానీ ఆర్టికల్‌ 356 నేటికీ సజీవంగానే ఉంది’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) అనంతశయనం అయ్యంగార్‌   2) నానీ పాల్కీవాలా  3) హెచ్‌.వి.కామత్‌             4) కె.టి.షా

 

11. ఆర్టికల్‌ 356 ప్రయోగానికి సంబంధించి ఎస్‌.ఆర్‌.బొమ్మై Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన మార్గదర్శకాన్ని గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలనను న్యాయసమీక్షకు గురిచేయవచ్చు.

బి) భారత సమాఖ్యకు విఘాతం కలిగే విధంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించరాదు.

సి) రాష్ట్రపతి పాలనను సూచించే ఆర్టికల్‌ 356ను రాజ్యాంగం నుంచి తొలగించాలి.

డి) రాష్ట్ర ప్రభుత్వానికి మెజార్టీ ఉందా, లేదా అనే అంశాన్ని శాసనసభలోనే పరీక్షించాలి.

1) ఎ, బి, సి   2) ఎ, బి, డి  3) ఎ, సి, డి  4) అన్నీ

 

12. ఆర్టికల్‌ 356ను రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా ఎవరు పేర్కొన్నారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌  2) రజనీకుమార్‌ ఠాగూర్‌ 

3) కె.టి.షా             4) ఎన్‌.గోపాల స్వామి అయ్యంగార్‌

 

సమాధానాలు : 1-2, 2-3, 3-4, 4-4, 5-2, 6-1, 7-3, 8-2, 9-2, 10-3, 11-2, 12-1. 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 25-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఆర్థిక అత్యవసర పరిస్థితి

ఆర్థిక అల్లకల్లోలాలకు అత్యవసర పరిష్కారం

 

దేశ ఆర్థిక వ్యవస్థకు భంగం వాటిల్లినప్పుడు, విదేశీమారక చెల్లింపుల సమస్య ఏర్పడినప్పుడు, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 360ని అనుసరించి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. దీని పర్యవసానాలు, రాజ్యాంగ వివరణపై పోటీపరీక్షార్థులకు అవగాహన ఉండాలి. 

  భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్‌ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితిని పేర్కొంటుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్‌ 360ని ప్రయోగించి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. 

ఆర్టికల్‌ 360(1): దేశం మొత్తానికి లేదా దేశంలోని కొన్ని ప్రాంతాలకు వర్తించే విధంగా రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారు. 

ఆర్టికల్‌ 360(2): రాష్ట్రపతి ప్రకటించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంట్‌ రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన సమయం నాటికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో అది అమల్లోకి వస్తుంది. కానీ కొత్తగా ఏర్పడిన లోక్‌సభ దాన్ని నెలరోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. 

కాలపరిమితి: ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత దాన్ని ఉపసంహరించే వరకు అది కొనసాగుతుంది. అంటే పార్లమెంటు ఆమోదం పొందిన ఆర్థిక అత్యవసర పరిస్థితి నిరంతరం కొనసాగుతుంది. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు. దానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు. 

 

పర్యవసానాలు 

* కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. 

* కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రాలు తమ బడ్జెట్‌ కాపీలను కేంద్రానికి పంపాలి.

* ఆర్టికల్‌ 275 ప్రకారం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది. 

* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించాలని కేంద్రం ఆదేశించవచ్చు.

* రాష్ట్రపతి మినహా దేశంలోని ఉన్నత ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను గణనీయంగా తగ్గిస్తారు.  

* ఆర్థిక అత్యవసర పరిస్థితిని మన దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించలేదు. దీన్ని అవసరమైన సమయంలో విధించడం వల్ల ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో వివరించారు. 

* ఆర్థిక అత్యవసర పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్‌.ఎన్‌.కుంజ్రూ పేర్కొన్నారు. 

 

మాదిరి ప్రశ్నలు 

 

1. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన్నారు? 

1) 18వ భాగం, ఆర్టికల్‌ 360 

2) 19వ భాగం, ఆర్టికల్‌ 360 

3) 17వ భాగం, ఆర్టికల్‌ 360 

4) 20వ భాగం, ఆర్టికల్‌ 360

 

2. ఆర్టికల్‌ 360 ప్రకారం విధించే ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి కిందివాటిలో సరైంది? 

ఎ) రాష్ట్రపతి ప్రకటనను పార్లమెంట్‌ రెండు నెలల్లోపు ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది. 

బి) పార్లమెంట్‌ 2/3 ప్రత్యేక మెజార్టీ ద్వారా దీన్ని ఆమోదించాలి. 

సి) పార్లమెంట్‌ ఆమోదంతో దీన్ని ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. 

డి) రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా దీన్ని ఎప్పుడైనా ఉపసంహరించవచ్చు. 

1) ఎ, బి, సి               2) ఎ, బి, డి             3) ఎ, సి, డి          4) ఎ, బి, సి, డి 

 

3. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు జరిగే మార్పును గుర్తించండి. 

ఎ) కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లను నిలిపివేస్తుంది. 

బి) ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను గణనీయంగా తగ్గిస్తుంది. 

సి) రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ కాపీలను తనకు పంపాలని కేంద్రం ఆదేశిస్తుంది. 

డి) రాష్ట్రపతి జీతభత్యాలను తగ్గిస్తారు.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి             3) ఎ, బి, డి             4) ఎ, బి, సి, డి 

 

4. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా ఆర్థిక, విత్తపరమైన ఆటంకాలను సమర్థంగా ఎదుర్కోవచ్చని రాజ్యాంగ సభలో ఎవరు వివరించారు? 

1) హెచ్‌.ఎన్‌.కుంజ్రూ 2) హెచ్‌.వి.కామత్‌ 

3) కె.టి.షా        4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 

 

సమాధానాలు

1-1     2-3     3-1     4-4

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

 కేంద్ర‌మంత్రి మండ‌లి

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి-విచక్షణాధికారాలు

విచక్షణతో విశిష్ట‌ముద్ర!

  రాజ్యాంగం ప్రకారం ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు రాజకీయ, ఇతర సందర్భాల్లో రాష్ట్రపతి తన విచక్షణతో అధికారాలను వినియోగించి పాలనపై విశిష్టముద్రలు వేస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములవుతారు. ఈ అంశాలను పరిశీలించి అభ్యర్థులు రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం కల్పించిన గౌరవం, ప్రాధాన్యంపై అవగాహన పెంచుకోవాలి. 

  రాష్ట్రపతి విచక్షణాధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఇవి సందర్భానుసారం రాష్ట్రపతికి లభించి, పరిపాలనలో ఆయన ముద్రను తెలియజేస్తాయి. 

1) లోక్‌సభ  సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ రాజకీయ పార్టీకి లభించని సందర్భంలో ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. 

* 1989లో మన దేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్‌ పార్లమెంట్‌గా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ (లోక్‌సభలో 272 స్థానాలు) ఏ రాజకీయ పార్టీకి లభించలేదు. ఈ ఎన్నికల్లో 191 స్థానాలతో పెద్ద రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ అవతరించినప్పటికీ రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ముందుకు రాలేదు. ఫలితంగా 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీ కూటమిగా అవతరించిన జనతాదళ్‌కు చెందిన విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ఆహ్వానించారు. 

* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించకపోవడంతో 161 లోక్‌సభ స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానమంత్రిగా అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ నియమించారు. కానీ లోక్‌సభలో మెజార్టీని నిరూపించుకోవడంలో విఫలమైన అటల్‌బిహారి వాజ్‌పేయీ 13 రోజులకే పదవిని కోల్పోయారు.

 

2) కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని కల్పించాలా లేదా లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునివ్వాలా అనేది రాష్ట్రపతి విచక్షణ పైనే ఆధారపడి ఉంటుంది. 

* 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చరణ్‌ సింగ్‌ ముందుకు వచ్చారు. దీంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, చరణ్‌ సింగ్‌తో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌ సింగ్‌ పార్లమెంట్‌కు హాజరుకాకుండానే పదవిని చేపట్టిన 23 రోజులకే రాజీనామా చేశారు. 

* చరణ్‌ సింగ్‌ రాజీనామా అనంతరం బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. కానీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆ అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు. 

* 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 182 స్థానాలను గెలుపొందింది. ఇదే పార్టీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ప్రధానమంత్రిగా నియమించారు. కానీ 1999లో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ 12వ లోక్‌సభను రద్దు చేశారు. మన దేశంలో అతి తక్కువ కాలం (13 నెలలు మాత్రమే) పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.

 

3) పదవిలో ఉన్న ప్రధానమంత్రి అకస్మాత్తుగా మరణించిన సందర్భంలో మళ్లీ ప్రధాని నియామకంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురవడంతో  అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్‌ తన విచక్షణాధికారాన్ని వినియోగించి రాజీవ్‌గాంధీని ప్రధానిగా నియమించారు. ఆ సమయంలో సాధారణ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించలేదని విమర్శలు ఎదురయ్యాయి. 

 

4) ఇతర సందర్భాలు

* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్‌ రూపొందించిన ప్రసంగానికి బదులు అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

* 1999లో అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం రూపొందించిన నూతన టెలికాం విధానం, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ.125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006లో రూపొందించిన లాభదాయక పదవుల బిల్లుకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆమోద ముద్ర వేయకుండా పునఃపరిశీలనకు పంపారు. 

* 1997లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పునఃపరిశీలనకు పంపారు. 

భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యతను ఇచ్చిందని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. 

 

రాజ్యాంగ సవరణలు - రాష్ట్రపతి అధికారాలపై పరిమితులు  

* ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు. 

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చని, మళ్లీ తిరిగి వచ్చిన వాటికి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర ద్వారా అంగీకారాన్ని తెలియజేయాలని నిర్దేశించారు.

 

మాదిరి ప్రశ్నలు 

 

1. 1989లో 9వ లోక్‌సభ హంగ్‌ పార్లమెంట్‌గా ఏర్పడటంతో అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ఎవరిని ప్రధానిగా నియమించారు? 

1) రాజీవ్‌ గాంధీ           2) వి.పి.సింగ్‌           3) చంద్రశేఖర్‌           4) పి.వి.నరసింహారావు 

 

2. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఎవరిని ప్రధానిగా నియమించారు?

1) ఐ.కె.గుజ్రాల్‌           2) హెచ్‌.డి.దేవెగౌడ           3) చంద్రశేఖర్‌             4) అటల్‌బిహారి వాజ్‌పేయీ 

 

3. 1979లో చరణ్‌ సింగ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌ ముందుకు వచ్చినప్పటికీ అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి ఎవరు? 

1) శంకర్‌దయాళ్‌ శర్మ           2) నీలం సంజీవరెడ్డి          3) జ్ఞాని జైల్‌సింగ్‌             4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 

 

4. 1997లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ ప్రభుత్వం చేసిన సిఫార్సును పునఃపరిశీలనకు పంపిన రాష్ట్రపతి ఎవరు? 

1) కె.ఆర్‌.నారాయణన్‌           2) డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం 

3) ఆర్‌.వెంకట్రామన్‌                4) జాకీర్‌ హుస్సేన్‌ 

 

సమాధానాలు

 1-2     2-4     3-2     4-1

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣  భారత రాష్ట్రపతి

  ఉపరాష్ట్రపతి

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 09-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి - శాసనాధికారాలు

చట్టాలకు అత్యున్నత ఆమోదముద్ర!

  రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతికి విస్తృతమైన శాసనాధికారాలు ఉన్నాయి. పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేయడం ద్వారా వాటిని చట్టాలుగా అమల్లోకి తీసుకువస్తారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి సంక్రమించిన శాసనాధికారాలపై తరచూ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వీటిపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

 

  భారత రాష్ట్రపతి.. పార్లమెంటు సభ్యుడు కాదు. కానీ అందులో అంతర్భాగంగా కొనసాగుతారు. ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంటు అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభ అని అర్థం. పార్లమెంటు రూపొందించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ద్వారా వాటిని చట్టాలుగా మారుస్తారు.

 

ఆర్టికల్‌ 80(3) - రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్‌ చేస్తారు (కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లోని ప్రావీణ్యులు). 

 

ఆర్టికల్‌ 85 - పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్‌’ అంటారు.

* పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్‌’ అంటారు.

* లోక్‌సభను రద్దు చేయడాన్ని ‘డిసాల్వ్‌’ అంటారు.

 

ఆర్టికల్‌ 86 - పార్లమెంటు ఉభయ సభలకు తన సందేశాలను పంపగలరు.

 

ఆర్టికల్‌ 87 - పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగాలు, విశేష ప్రసంగాలు చేయగలరు. లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే మొదటి సమావేశానికి, ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్‌ సమావేశాలకు హాజరై ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం పార్లమెంటు మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభ సందేశం చేస్తారు.

 

ఆర్టికల్‌ 91(1) - రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షులు అందుబాటులో లేకపోతే తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 95(1) - లోక్‌సభ సమావేశాల నిర్వహణకు సభాధ్యక్షులు అందుబాటులో లేకపోతే తాత్కాలిక సభాధ్యక్షులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 103 - కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి పార్లమెంటు సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు.

 

ఆర్టికల్‌ 111 - పార్లమెంటు ఆమోదించిన బిల్లులు.. రాష్ట్రపతి ఆమోదముద్ర ద్వారానే చట్టాలుగా రూపొందుతాయి.

 

ఆర్టికల్‌ 201 - రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లుల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని గవర్నరు భావించినప్పుడు.. సంబంధిత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్‌ చేస్తారు. ఇలాంటి బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగలరు లేదా పునఃపరిశీలనకు పంపగలరు లేదా తిరస్కరించగలరు.

 

 

ఆర్డినెన్స్‌ : ఆర్టికల్‌ 123

ప్రజా/దేశ శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.  దీనికి సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ ఉంటుంది. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవిత కాలం కింది విధంగా ఉంటుంది.

* పార్లమెంటు సమావేశమైన 6 వారాలు (లేదా) 

* 6 నెలల 6 వారాలు (లేదా) 

* 7 1/2 నెలలు లేదా 222 రోజులు  

పైన పేర్కొన్న గడువులోగా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్‌ పార్లమెంటు ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే రద్దవుతుంది.

 

ఆర్డినెన్స్‌ - సుప్రీంకోర్టు తీర్పులు

 

కూపర్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు (1970)

  రాష్ట్రపతి ఆర్టికల్‌ 123 ప్రకారం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను న్యాయసమీక్షకు పంపొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

డి.సి.వాద్వా Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు (1987)

  ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసినప్పుడు అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యథాతథంగా దాన్ని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్‌ను జారీచేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది రాజ్యాంగంపై దాడి లాంటిదని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం

సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 108 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఏర్పాటయ్యే ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ స్పీకర్‌ అందుబాటులో లేకపోతే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఇప్పటివరకు మన దేశంలో కేవలం మూడుసార్లు మాత్రమే పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాలను ఆర్టికల్‌ 108 ప్రకారం ఏర్పాటు చేశారు. అవి...

* 1961లో వరకట్న నిషేధం బిల్లుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌.

* 1978లో బ్యాంకింగ్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లు ఆమోదం విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే.

* 2002లో POTO (ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆర్డినెన్స్‌) బిల్లు ఆమోదం విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అటల్‌ బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ డిప్యూటి స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు. (స్పీకర్‌ జి.ఎం.సి.బాలయోగి ఈ సమావేశాలకు కొద్దిరోజుల ముందు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.

* పైన పేర్కొన్న మూడు సమావేశాల్లో పాల్గొని ఓటుహక్కును వినియోగించుకున్న ప్రముఖ వ్యక్తి అటల్‌ బిహారి వాజ్‌పేయీ.

 

వీటో అధికారాలు

వీటో (veto) అంటే తిరస్కరించడం, నిరోధించడం, నిలుపుదల చేయడం అని అర్థం. పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి మూడు రకాలైన వీటో అధికారాలకు గురిచేయవచ్చు. ఇవి శాసనాధికారాల్లో అంతర్భాగం.

 

1) అబ్జల్యూట్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా, ఏదైనా కారణం చూపి లేదా కారణం చూపకుండానే తిరస్కరించడాన్ని అబ్జల్యూట్‌ వీటో అంటారు.

ఉదా: * 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ PE-P-SU (పటియాలా ఈస్ట్‌ పంజాబ్‌ స్టేట్స్‌ యూనియన్‌) బిల్లు విషయంలో, 1991లో అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సుల బిల్లు విషయంలోను అబ్జల్యూట్‌ను వీటోను వినియోగించారు.

* రాష్ట్రపతి అబ్జల్యూట్‌ వీటోను పార్లమెంటు రద్దు చేయగలదు. అదే బిల్లును సవరణలతో లేదా సవరణలు లేకుండా రెండోసారి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా బిల్లును ఆమోదించాలి.

* రాష్ట్రాలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నరులు రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వు చేసినప్పుడు ఆర్టికల్‌ 201 ప్రకారం రాష్ట్రపతి సంబంధిత బిల్లులను తిరస్కరించవచ్చు. అవే బిల్లులను రాష్ట్రాలు రెండోసారి ఆమోదించి పంపినప్పుడు కూడా వాటిని రాష్ట్రపతి తిరస్కరించవచ్చు.

 

2) సస్పెన్సివ్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేయకుండా సవరణలు, సూచనలు చేస్తూ బిల్లులను పునఃపరిశీలనకు పంపడాన్ని సస్పెన్సివ్‌ వీటో అంటారు.

ఉదా: * 2006లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం లాభదాయక పదవుల బిల్లుపై ఆమోద ముద్ర వేయకుండా సస్పెన్సివ్‌ వీటోను వినియోగించారు. 

* రాష్ట్రపతి సస్పెన్సివ్‌ వీటోను పార్లమెంటు రద్దు చేయగలదు. సంబంధిత బిల్లులను రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలి.

 

3) పాకెట్‌ వీటో: పార్లమెంటు ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా, పునఃపరిశీలనకు పంపకుండా, ఎలాంటి నిర్ణయం తెలియజేయకుండా తన దగ్గర అట్టిపెట్టుకోవడాన్ని పాకెట్‌ వీటో అంటారు.

ఉదా: 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో రూపొందించిన పోస్టల్‌ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ పాకెట్‌ వీటోను ప్రయోగించి 18 నెలల పాటు అట్టిపెట్టారు.

 

రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే కింద పేర్కొన్న బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

* ఆర్టికల్‌ 3 - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులు

* ఆర్టికల్‌ 19(1)(G) - వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛను నియంత్రించే రాష్ట్రాల బిల్లులు.

* ఆర్టికల్‌ 31(A) - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు

* ఆర్టికల్‌ 112 - కేంద్ర బడ్జెట్‌

 

ర‌చ‌యిత‌: బంగారు స‌త్య‌నారాయ‌ణ‌

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

‣  రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

‣  ఆర్థిక అత్యవసర పరిస్థితి

 

ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

 

 

Posted Date : 16-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటరీ పదజాలం

ఆదేశిస్తే విప్‌.. తీర్పు ఇస్తే రూలింగ్‌!

  పార్లమెంటు గురించి చదివేట‌ప్పుడు ఎజెండా, సమన్స్, ప్రోరోగ్, జీరో అవర్‌ అంటూ రకరకాల సాంకేతిక పదాలు ఎదురవుతుంటాయి. వాటి అర్థాలను అభ్యర్థులు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్పుడే పార్లమెంటరీ వ్యవహారాలపై సరైన అవగాహన ఏర్పడుతుంది. వీటిపై పరీక్షల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. 

 

పార్లమెంటు నిర్వహణలో అనేక రకాల ప్రత్యేక పదాలను ఉపయోగిస్తుంటారు. ఆ పదజాలం అత్యున్నత శాసనవ్యవస్థ కార్యకలాపాలను, విధి విధానాలను తెలియజేస్తుంది.

 

ఎజెండా: సభలో చర్చించాల్సిన కార్యక్రమాల పట్టికను ఎజెండా అంటారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను రూపొందిస్తుంది. సభా కార్యక్రమాలను ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు.

 

విప్‌: విప్‌ అంటే ఆదేశం అని అర్థం. ఒక రాజకీయ పార్టీ పార్లమెంటు లేదా శాసనసభలో తమ సభ్యులు ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ జారీ చేసే ఆదేశాన్ని విప్‌ అంటారు.

 

హంగ్‌ పార్లమెంటు: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఏ రాజకీయ పార్టీకీ లభించకపోతే ఏర్పడే పరిస్థితిని హంగ్‌ పార్లమెంట్‌ లేదా త్రిశంకు సభ అంటారు. ఇప్పటివరకు మన దేశంలో 7 సార్లు హంగ్‌ పార్లమెంట్లు ఏర్పడ్డాయి. అవి..

* 9వ లోక్‌సభ - 1989

* 10వ లోక్‌సభ - 1991

* 11వ లోక్‌సభ - 1996

* 12వ లోక్‌సభ - 1998

* 13వ లోక్‌సభ - 1999

* 14వ లోక్‌సభ - 2004

* 15వ లోక్‌సభ - 2009

 

సమన్స్‌: రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను ప్రారంభించడాన్ని సమన్స్‌ అంటారు.

 

ప్రోరోగ్‌: రాష్ట్రపతి పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని ప్రోరోగ్‌ అంటారు.

 

డిసాల్వ్‌: రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయడాన్ని డిసాల్వ్‌ అంటారు.

 

మెయిడెన్‌ స్పీచ్‌: పార్లమెంటుకు మొదటిసారి ఎన్నికైన సభ్యుడు సభలో చేసిన తొలి ప్రసంగాన్ని మెయిడెన్‌ స్పీచ్‌ అంటారు.

 

కార్పెట్‌ క్రాసింగ్‌: అధికార పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్‌ క్రాసింగ్‌ అంటారు.

 

ఫ్లోర్‌ క్రాసింగ్‌: ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్ష పార్టీలోకి మారడాన్ని ఫ్లోర్‌ క్రాసింగ్‌ అంటారు.

 

కార్పెట్‌ బెగ్గర్‌: ఒక స్థానికేతర అభ్యర్థి స్థానిక అభ్యర్థిపై ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నిక కావాలని కోరుకోవడాన్ని కార్పెట్‌ బెగ్గర్‌ అంటారు.

 

ప్రశ్నోత్తరాల సమయం: పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిరోజు మొదటి గంట సమయాన్ని (11 నుంచి 12 గంటలు) ప్రశ్నోత్తరాల సమయం అంటారు. ప్రభుత్వ విధానాలు, పాలనకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

 

ప్రశ్నలు 4 రకాలు

1) నక్షత్రపు గుర్తున్న ప్రశ్నలు: నక్షత్రపు గుర్తు ఉన్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు మౌఖికంగా సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నల సమయంలో సభ్యులు అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. ఒక రోజులో గరిష్ఠంగా ఇలాంటి ప్రశ్నలను 20 వరకు అనుమతిస్తారు. ఈ ప్రశ్నలను ఆకుపచ్చ రంగులో ముద్రిస్తారు.

2) నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు: నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలకు సంబంధిత మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నల సమయంలో అనుబంధపు ప్రశ్నలు అడిగే వీలులేదు. ఒక రోజులో గరిష్ఠంగా ఇలాంటి ప్రశ్నలు 230 వరకు అనుమతిస్తారు. ఈ ప్రశ్నలను తెలుపు రంగులో ముద్రిస్తారు.

3) స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు: ఏదైనా అత్యవసర అంశంపై 10 రోజుల కంటే తక్కువ నోటీసుతో అడిగే ప్రశ్నలను స్వల్పకాలిక నోటీసు ప్రశ్నలు అంటారు. వీటికి మౌఖిక సమాధానాలు ఇవ్వాలి. ఈ ప్రశ్నలను లేత గులాబీ రంగులో ముద్రిస్తారు.

4) ప్రైవేట్‌ వ్యక్తులను అడిగే ప్రశ్నలు: ఏదైనా బిల్లుకు సంబంధించిన లేదా సభావ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సభలో ఎవరు బాధ్యత వహిస్తారో ఆ వ్యక్తిని అడిగే ప్రశ్నలు. ఈ ప్రశ్నలను పసుపు రంగులో ముద్రిస్తారు. వీటికి మౌఖిక సమాధానాలు ఇవ్వాలి.

 

జీరో అవర్‌

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, సభా కార్యకలాపాలు ప్రారంభమవడానికి ముందున్న సమయాన్ని జీరో అవర్‌ (శూన్య కాలం) అంటారు. ఇది మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. 1962లో జీరోఅవర్‌ను సృష్టించారు. ఇది భారత పార్లమెంటరీ సంప్రదాయంలో అప్పట్లో కొత్తగా అవతరించిన ఒరవడి. దీనికి నిర్దిష్ట సమయం ఉండదు. 1964 నుంచి శూన్యకాలాన్ని క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఏ విధమైన ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు.

 

సమావేశ కాలం: పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరిరోజు వరకు ఉన్న మధ్య కాలాన్ని 'సమావేశ కాలం' అంటారు. ఈ మధ్య కాలంలో సభ ప్రతిరోజు సమావేశమవుతుంది. సభా వ్యవహారాలు కొనసాగుతూ, నిర్ణీత గడువు ప్రకారం వాయిదా పడుతూ, మళ్లీ కొనసాగుతూ ఉంటాయి.

 

కోరం: సభా సమావేశాలు జరగడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సభాధ్యక్షుడితో కలిపి సభలోని మొత్తం సభ్యుల్లో 1/10వ వంతును కోరంగా పరిగణిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం ఉందా? లేదా? అనేది సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం లేకపోతే సభా సమావేశాలను వాయిదా వేస్తారు.

 

వాయిదా: సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు, భోజన విరామం లాంటి కారణాలతో సభాధ్యక్షులు సభా కార్యక్రమాలను తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి ఆ తర్వాత కొనసాగించడాన్ని 'వాయిదా' అంటారు.

 

నిరవధిక వాయిదా: సభాధ్యక్షులు సభా కార్యక్రమాలను కాలపరిమితి తెలియజేయకుండా వాయిదా వేయడాన్ని 'నిరవధిక వాయిదా' అంటారు.

 

లేమ్‌డక్‌ సెషన్‌: లేమ్‌డక్‌ అంటే ఓడిపోయిన వారు అని అర్థం. లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత రద్దయిన లోక్‌సభకు సభ్యులుగా ఉండి ప్రస్తుత లోక్‌సభకు ఎన్నిక కాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు కలిసి చివరిసారిగా ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని 'లేమ్‌డక్‌ సెషన్‌' అంటారు. ఈ విధానం అమెరికాలో ప్రాచుర్యంలో ఉంది.

 

ఈల్డింగ్‌ ది ఫ్లోర్‌: చట్టసభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు ఆ సభ్యుడిని నిరోధించి, మరొక సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించడాన్ని 'ఈల్డింగ్‌ ది ఫ్లోర్‌' అంటారు.

 

ఫిలిబస్టరింగ్‌: సభలో బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం చేస్తూ నిర్ణీత గడువు ముగిసేలా చేసే ప్రక్రియను 'ఫిలిబస్టరింగ్‌' అంటారు.

 

కాంపోజిట్‌ ఫ్లోర్‌ టెస్టింగ్‌: సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ లభించనప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయినప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తాయి. అలాంటి సమయంలో రాష్ట్రపతి సంబంధిత పార్టీల బలాబలాలను నిరూపించుకునేందుకు సభలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

 

రూలింగ్‌: సభలో తలెత్తే వివాదాలు, నిబంధనల అన్వయంపై సభాధ్యక్షులు ఇచ్చే తీర్పును రూలింగ్‌ అంటారు. ఈ రూలింగ్‌ను సభ్యులు ప్రశ్నించకూడదు. ఇది సభ్యులందరికీ శిరోధార్యం.

 

ఆపద్ధ‌ర్మ ప్రభుత్వం: అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు పరిపాలన బాధ్యతలను కొనసాగించడానికి అదే ప్రభుత్వాన్ని ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు అధికారంలో కొనసాగిస్తే దాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు. ఈ ప్రభుత్వం విధానపరమైన కీలక నిర్ణయాలను తీసుకోకూడదు.

 

అర్ధగంట చర్చ: పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ రోజు సమావేశాన్ని ముగించేందుకు చివరి అరగంటను 'అర్ధగంట చర్చ'కు కేటాయిస్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో తగిన ప్రాధాన్యం లభించని అంశాలపై చర్చించేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

* లోక్‌సభలో సోమ, బుధ, శుక్రవారాల్లో; రాజ్యసభలో ప్రతిరోజూ అర్ధగంట చర్చ ఉంటుంది.

 

ఆర్డినెన్స్‌: పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు దేశ శ్రేయస్సురీత్యా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 123 ప్రకారం ఆర్డినెన్స్‌ జారీచేస్తారు. ఈ ఆర్డినెన్స్‌కు సాధారణ శాసనాలకు ఉన్నంత విలువ ఉంటుంది. ఆర్డినెన్స్‌ను నిర్ణీత గడువులోగా పార్లమెంటు ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవిత కాలం ఏడున్నర నెలలు.

 

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌: ఎన్నికల సమయంలో లేదా దేశం అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు వీలులేనప్పుడు రెండు నెలల కాలపరిమితితో ప్రభుత్వం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌ను ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 116 ప్రకారం దీన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. సాధారణ బడ్జెట్‌ మొత్తం అంచనా వ్యయంలో 1/6వ వంతుకు సమానంగా, అంటే రెండు నెలలకు సరిపడే గ్రాంటుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఇస్తారు. తర్వాత దీన్ని పూర్తిస్థాయి బడ్జెట్‌లో విలీనం చేస్తారు.

 

పునరాయనం (రీకాల్‌): అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులను అసమర్థులుగా ఉన్నప్పుడు లేదా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని కారణంగా వారి పదవీకాలం ముగియకుండానే పదవి నుంచి తొలగించడానికి వెనక్కి పిలవడాన్ని పునరాయనం (రీకాల్‌) అంటారు. ఈ విధంగా తొలగించిన వారి స్థానంలో కొత్త ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకుంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న స్విట్జర్లాండ్‌లో రీకాల్‌ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తారు.

 

రెఫరెండం: ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోడానికి ఉపయోగించే ప్రక్రియను రెఫరెండం అంటారు. ఈ విధానాన్ని తొలిసారిగా ఫ్రాన్స్‌లో నెపోలియన్‌ నిర్వహించారు.

 

ఎగ్జిట్‌ పోల్‌: సాధారణ ఎన్నికల సమయంలో ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల మనోభావాలు, అభిప్రాయాలు తెలుసుకొని ఎన్నికల ఫలితాలను ముందుగానే అంచనా వేయడాన్ని ఎగ్జిట్‌పోల్‌గా పేర్కొంటారు.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి - అత్యవసర అధికారాలు

మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించి సరైంది?

ఎ) వీటిని భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించారు. 

బి) వీటి గురించి రాజ్యాంగంలోని 18వ భాగంలో వివరణ ఉంది.

సి) వీటిని వినియోగించినప్పుడు పాటించే పద్ధతులను జర్మనీ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు   

డి) వీటిని వినియోగించినప్పుడు జీవించే హక్కు కూడా రద్దు అవుతుంది.

1) ఎ, సి, డి    2) ఎ, బి, సి   3) ఎ, బి, డి    4) ఎ, బి సి, డి 


2. వివిధ రకాల అత్యవసర పరిస్థితి అధికారాలను వివరిస్తున్న రాజ్యాంగ ఆర్టికల్స్‌కు సంబంధించి సరికానిది?

1) జాతీయ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 352 

2) ఆర్థిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 360 

3) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 356 

4) ఆంతరంగిక అత్యవసర పరిస్థితి - ఆర్టికల్‌ 362 


3. జాతీయ అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదం ద్వారా గరిష్ఠంగా ఎంతకాలం కొనసాగించవచ్చు?

1) 6 నెలలు        2) 12 నెలలు   

3) 3 సంవత్సరాలు   4) ఎంతకాలమైనా  


4. ఆర్టికల్‌ 352 ప్రకారం ఆంతరంగిక కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి సంబంధించిన కారణాల్లో ‘ఆంతరంగిక అల్లకల్లోలాలు’ అనే పదం స్థానంలో ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? 

1) 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971    

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976  

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978  

4) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 


5. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఏ ఆర్టికల్‌లో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు రద్దు అవుతాయి?

1) ఆర్టికల్‌ 19   2) ఆర్టికల్‌ 20   3) ఆర్టికల్‌ 21   4) ఆర్టికల్‌ 24 


6. ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన రాష్ట్రపతుల్లో లేని వారు?

1) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌    

2) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌   

3) వరాహగిరి వెంకటగిరి    

4) జాకీర్‌ హుస్సేన్‌ 


7. జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింపు ఫలితంగా ఏ లోక్‌సభ పదవీ కాలాన్ని పొడిగించారు?

1) 4వ లోక్‌సభ   2) 5వ లోక్‌సభ   3) 6వ లోక్‌సభ    4) 7వ లోక్‌సభ 


8. ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్దేశించారు?

1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975   

2) 41వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976   

3) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976  

4) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 


9. మనదేశంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కాలంలో కొనసాగింది?  

1) 1974 - 77    2) 1975 - 76    

3) 1975 - 77    4) 1977 - 79 


10. జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు కారణంగా ఏ రాష్ట్ర శాసనసభ పదవీకాలాన్ని పొడిగించారు?

1) కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌  

2) కేరళ, తమిళనాడు, గుజరాత్‌   

3) ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌  

4) ఒరిస్సా, అస్సాం, కేరళ 


11. ‘భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు’ అని ఎవరు పేర్కొన్నారు? 

1) అనంతశయనం అయ్యంగార్‌  2) హెచ్‌.వి.కామత్‌  

3) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌    4) బెనగళ నరసింగరావు 


12. భారత్‌పై చైనా దురాక్రమణ ఫలితంగా మనదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు విధించారు? 

1) 1962, ఫిబ్రవరి 22   2) 1962, అక్టోబరు 26   

3) 1962, డిసెంబరు 9    4) 1962, జనవరి 10 


13. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి? 

1) 4   2) 3    3) 5   4) 2 


14. అత్యవసర పరిస్థితి సమయంలో కూడా కింది ఏ హక్కు తాత్కాలికంగా రద్దు కాదు? 

1) ఆర్టికల్‌ 21 కింద హక్కు   2) ఆర్టికల్‌ 19 కింద హక్కు   

3) ఆర్టికల్‌ 14 కింద హక్కు  4) ఆర్టికల్‌ 22 కింద హక్కు 


15. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి రాష్ట్రపతికి గల అధికారాల్లో సరికానిది?

1) కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను తగ్గించవచ్చు.   

2) కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను రద్దు చేయవచ్చు.

3) జాతీయ అత్యవసర పరిస్థితిని దేశం మొత్తం లేదా ఒక భాగంలో విధించవచ్చు.   

4) కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను పెంచవచ్చు. 

 

సమాధానాలు

1-2, 2-4, 3-4, 4-3, 5-1, 6-4, 7-2, 8-1, 9-3, 10-1, 11-3, 12-2, 13-2, 14-1, 15-4. 

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రపతి - కార్యనిర్వాహక అధికారాలు

దౌత్యం.. యుద్ధం.. శాంతి!

దేశపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది. అత్యున్నత నియామకాలన్నీ ఆయన/ఆమె జరుపుతారు. బడ్జెట్లు ప్రవేశపెడతారు. ఆర్థికం సహా అన్ని బిల్లులను ఆమోదిస్తారు.యుద్ధం ప్రకటించడం, శాంతి చేసుకోవడం, దౌత్యం నడపడం వంటి అధికారాలన్నీ రాష్ట్రపతి పరిధిలోనే ఉంటాయి. వీటిని అభ్యర్థులు ఆర్టికల్స్‌తో సహా తెలుసుకోవాలి. 

 

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 53 ప్రకారం రాష్ట్రపతి భారతదేశ ప్రధాన కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే నిర్వహించాలి. రాష్ట్రపతి మన దేశ పాలనను స్వయంగా లేదా ఇతర రాజ్యాంగ బద్ధ అధికారులు, ప్రతినిధుల ద్వారా నిర్వహిస్తారు. ఆర్టికల్‌ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది. 

 రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాలను చెలాయించడంలో భాగంగా పలు రకాల నియామకాలు చేపడతారు. 

ఆర్టికల్‌ 75(1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలి సహచరులను నియమిస్తారు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తుంది. 

 

ఆర్టికల్‌ 76(1): భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌.

 

ఆర్టికల్‌ 124: సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

 

ఆర్టికల్‌ 155: రాష్ట్రాలకు గవర్నర్లు.

 

ఆర్టికల్‌ 239: కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు. 

 

ఆర్టికల్‌ 148: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌).

 

ఆర్టికల్‌ 217: హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

 

ఆర్టికల్‌ 263: కేంద్రం, రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్‌ రాష్ట్రమండలి.

 

ఆర్టికల్‌ 280: కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాలను సిఫార్సు చేసే కేంద్ర ఆర్థిక సంఘం, దానికి ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 315: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 316: జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 324: కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు.

 

ఆర్టికల్‌ 323(A): సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 338: జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 338(A): జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 340: జాతీయ వెనుకబడిన కులాల ఛైర్మన్, సభ్యులు.

* జాతీయ మహిళా కమిషన్, జాతీయ సమాచార కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, లోక్‌పాల్‌కు ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

 

ఆర్థిక అధికారాలు 

భారతదేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే పలు అధికారాలు, విధులు రాష్ట్రపతికి ఉన్నాయి.

 

ఆర్టికల్‌ 112:  కేంద్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతి ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

 

ఆర్టికల్‌ 117:  ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.

 

ఆర్టికల్‌ 151:  కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే, ఆయన / ఆమె వాటిని పార్లమెంటు ముందు ఉంచుతారు. 

 

ఆర్టికల్‌ 265:  ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.

 

ఆర్టికల్‌ 292:  భారత ప్రభుత్వం విదేశీ రుణాలు సేకరించేందుకు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.

 

ఆర్టికల్‌ 267: భారత ప్రభుత్వానికి ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి రాష్ట్రపతి అనుమతితో నగదును తీసి ఖర్చు చేయవచ్చు.

 

ఆర్టికల్‌ 280:  కేంద్ర ఆర్థిక సంఘాన్ని అయిదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.

 

దౌత్యాధికారాలు

* మన దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు రాష్ట్రపతి కృషి చేస్తారు.

* మిత్ర దేశాలకు మన దేశం తరఫున రాయబారులను నియమిస్తారు. మిత్ర దేశాల నుంచి మన దేశానికి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరిస్తారు. 

* మన దేశంలో ఉంటూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తారు. 

* అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. 

 

సైనిక అధికారాలు

* రాష్ట్రపతి భారతదేశ సర్వసైన్యాధిపతిగా, త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.

* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించగలరు. శత్రు దేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేయగలరు. 

* మన దేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. 

* ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని కీలకమైన అధికారులను నియమిస్తారు.

 

న్యాయాధికారాలు 

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష/న్యాయాధికారాలను కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను రాష్ట్రపతి నిలిపివేయగలరు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాల ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. నిందితులు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి అయిదు రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు.

 

పార్డన్‌ (అబ్సాల్వింగ్‌ ఎంటైర్‌ పనిష్‌మెంట్‌): న్యాయస్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దుచేసి క్షమాభిక్షను ప్రసాదించడం. 

ఉదా: ఉరిశిక్షను రద్దుచేసి సంబంధిత వ్యక్తికి ఉపశమనం కలిగించడం.

 

కమ్యుటేషన్‌ (ఛేంజింగ్‌ నేచర్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): న్యాయస్థానాలు విధించిన ఒకరకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్పు చేయడం. 

ఉదా: ఒక వ్యక్తికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేయడం.

 

రెమిషన్‌ (రిడక్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): శిక్ష స్వభావంలో మార్పు లేకుండా శిక్షాకాలంలో మార్పు చేయడం.

ఉదా: ఒక వ్యక్తికి విధించిన 7 సంవత్సరాల జైలు శిక్షను 3 సంవత్సరాలకు తగ్గించడం.

 

రెస్పైట్‌ (ప్రొవైడింగ్‌ రిలీఫ్‌): ప్రత్యేక కారణం రీత్యా శిక్ష అమలును వాయిదా వేయడం లేదా మరొక రకమైన శిక్షగా మార్పు చేయడం.

ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యతను కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, గర్భిణి అయితే ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది. 

 

రిప్రైవ్‌ (పోస్ట్‌పోన్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా నిలిపివేయడం.

ఉదా: శిక్షకు గురైన వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు.

 

సుప్రీంకోర్టు తీర్పులు

సుధాకర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు: రాష్ట్రపతి, గవర్నర్‌లు ప్రసాదించే క్షమాభిక్ష అధికారాలను న్యాయసమీక్షకు గురి చేయవచ్చని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. 

దేవేందర్‌ పాల్‌ సింగ్‌ థిల్లార్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలియజేయకపోతే మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.

* ఉరి శిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు లేవు. 

* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు మాత్రమే రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను వినియోగించాలి.

న్యాయసలహా (ఆర్టికల్‌ 143): రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో రాజ్యాంగపరమైన ధర్మసందేహాలు ఎదురైనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయసలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు.

 

ప్రత్యేక రక్షణలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు మినహాయింపులు ఉన్నాయి. 

* పదవిలో ఉన్న రాష్ట్రపతిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదు. అరెస్టు చేయకూడదు. 

* రాష్ట్రపతిపై సివిల్‌ కేసులు నమోదు చేయాలంటే రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. 

* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై పదవీ విరమణ అనంతరం దేశంలో ఏ న్యాయస్థానానికి కూడా బాధ్యులు కారు. 

* రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు, రాష్ట్రాల లోకాయుక్తలను గవర్నర్లు నియమించినప్పటికీ వారిని తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244 ప్రకారం మన దేశంలో ఆదివాసీ, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. రాష్ట్రపతి నియమించే వివిధ రాజ్యాంగ పదవులకు సంబంధించి సరికానిది?

1) ఆర్టికల్‌ 76(1) - అడ్వకేట్‌ జనరల్‌

2) ఆర్టికల్‌ 148 - కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

3) ఆర్టికల్‌ 324 - కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు 

4) ఆర్టికల్‌ 315 - యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

 

2. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లును గుర్తించండి. 

ఎ) ఆర్టికల్‌ 112 - కేంద్ర వార్షిక బడ్జెట్‌

బి) ఆర్టికల్‌ 117 - ఆర్థిక బిల్లులు 

సి) ఆర్టికల్‌ 265 - సహాయక గ్రాంట్లు 

డి) ఆర్టికల్‌ 292 - విదేశీ రుణాల సమీకరణ బిల్లులు

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) ఎ, బి, సి, డి

 

3. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి అయిదేళ్లకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేస్తారు?

1) ఆర్టికల్‌ 275   2) ఆర్టికల్‌ 280   3) ఆర్టికల్‌ 265    4) ఆర్టికల్‌ 117

 

4. న్యాయస్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దుచేసి, రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదించడం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది?

1) కమ్యుటేషన్‌     2) పార్డన్‌    3) రెస్పైట్‌    4) రిప్రైవ్‌  

 

5. పరిపాలనా వ్యవహారాల్లో రాష్ట్రపతికి రాజ్యాంగ పరమైన ధర్మసందేహాలు ఎదురైనప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందగలరు?

1) ఆర్టికల్‌ 143   2) ఆర్టికల్‌ 124    3) ఆర్టికల్‌ 151   4) ఆర్టికల్‌ 361

 

సమాధానాలు

1-1,   2-3,   3-2,   4-2,   5-1.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత రాష్ట్రపతి

‣ ఉపరాష్ట్రపతి

 రాష్ట్రపతి పాలన

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటు తీర్మానాలు

ప్రభుత్వాలకు ప్రతిపక్షాల పగ్గాలు!


అపరిమిత అధికారం నియంతృత్వానికి దారితీస్తుంది. ఆ ప్రమాదాన్ని నివారించడానికి రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్య లక్ష్యాలను పరిరక్షించే అధికారాన్ని అత్యున్నత ప్రజాప్రతినిధుల సభకు అప్పగించారు. ప్రభుత్వాల ఏకపక్ష చర్యలను అడ్డుకోడానికి పార్లమెంటు తీర్మానాలను సంధిస్తుంది. కార్యానిర్వాహక విభాగాన్ని కట్టడి చేస్తుంది. ఆ తీర్మానాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. వాటిని ప్రతిపక్షాలు అస్త్రాలుగా చేసుకొని ప్రభుత్వాలకు పగ్గాలు వేసే తీరుపై అవగాహన పెంచుకోవాలి. 

 

పార్లమెంటు తీర్మానాలు

తీర్మానం అంటే పార్లమెంటు చేసే ఒక నిర్ణయం. ఈ తీర్మానాన్ని మంత్రులు లేదా ప్రైవేట్‌ సభ్యులు సభాధ్యక్షుల అనుమతితో సభలో ప్రవేశపెట్టవచ్చు. కొన్ని తీర్మానాల వల్ల ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిన సందర్భాలున్నాయి.

 

విశ్వాస తీర్మానం 

విశ్వాస తీర్మానం (Confidence Motion) గురించి రాజ్యాంగంలో నేరుగా ఎక్కడా పేర్కొనలేదు. ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్రపతి కోరినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ లోక్‌సభలో ప్రవేశపెడుతుంది. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. వీగిపోతే అధికారాన్ని కోల్పోతుంది.

* విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన మొదటి ప్రధాని చరణ్‌ సింగ్‌. కానీ తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ జరగకుండానే చరణ్‌ సింగ్‌ ప్రభుత్వం రాజీనామా చేసింది.

* 9వ లోక్‌సభ కాలంలో 1990లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ రాజీనామా చేశారు.

* 11వ లోక్‌సభ కాలంలో 1997లో లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోవడంతో హెచ్‌.డి.దేవెగౌడ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.

* 15వ లోక్‌సభ కాలంలో 2008లో లోక్‌సభలో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రభుత్వం కొనసాగింది.

 

అవిశ్వాస తీర్మానం 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని (No Confidence Motion) ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రవేశపెడతాయి. కనీసం 50 మంది సభ్యుల సంతకాలతో ఈ తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు అందజేయాలి. తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం చూపాల్సిన అవసరం లేదు. దీని గురించి రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. కానీ లోక్‌సభ నియమావళిలోని రూల్‌ నం.198లో దీని ప్రస్తావన ఉంది. ‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంట్‌- 1950’ చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీనిపై లోక్‌సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఇది నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య విరామం 6 నెలలు ఉండాలి. ఈ తీర్మానాన్ని మొత్తం ప్రభుత్వంపై ప్రవేశపెడతారు. వ్యక్తిగతంగా మంత్రులపై ప్రవేశపెట్టకూడదు

* అవిశ్వాస తీర్మానాన్ని మొదటిసారిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో జె.బి.కృపలానీ ప్రవేశపెట్టారు. 62 మంది సభ్యులు తీర్మానాన్ని సమర్థించగా, 347 మంది సభ్యులు వ్యతిరేకించారు. దీంతో నెహ్రూ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

* ఇందిరాగాంధీ ప్రభుత్వంపై 15 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.

* ఒకే పదవీకాలంలో (5 సంవత్సరాల వ్యవధి) పి.వి.నరసింహారావు ప్రభుత్వంపై 8 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టినప్పటికీ విఫలమయ్యాయి.

* 1999లో అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో నెగ్గడంతో వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారానికి దూరమైంది.

* 2018లో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం విఫలమైంది.

 

అభిశంసన తీర్మానం 

ప్రభుత్వంలోని ఒక మంత్రిపై లేదా కొందరు మంత్రులపై లేదా మొత్తం ప్రభుత్వంపైన అభిశంసన తీర్మానం (Censure Motion) ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు తప్పనిసరిగా కారణం చూపాలి, కనీసం 10 మంది సభ్యుల మద్దతు ఉండాలి. సభాహక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు, సభకు తప్పుడు సమాచారం అందించినప్పుడు, సంబంధిత మంత్రుల శాఖల్లో అవకతవకలు జరిగినప్పుడు ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. తీర్మానం నెగ్గితే ప్రభుత్వం/ మంత్రులు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. రాజీనామా చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తుల నైతికతకు వదిలేశారు.

 

వాయిదా తీర్మానం 

ప్రజాప్రాముఖ్యం కలిగిన ఏదైనా అంశంపై చర్చించేందుకు ‘ఎజెండా’లోని కార్యక్రమాలను వాయిదా కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానమే వాయిదా తీర్మానం (Adjournment Motion). ఈ తీర్మానం ప్రభుత్వాన్ని అభిశంసించేదిగా ఉంటుంది. అందుకే దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో చర్చకు స్వీకరించరు.  తీర్మానాన్ని 50 మంది సభ్యుల సంతకాలతో అందజేయాలి. దీన్ని అనుమతించాలా? వద్దా? అనేది లోక్‌సభ స్పీకర్‌ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. తీర్మానంలో చర్చించాల్సిన అంశం ప్రజాప్రాధాన్యాన్ని కలిగి ఉండాలి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభుత్వం బాధ్యత వహించేదై ఉండాలి. తీర్మానాన్ని చర్చకు అనుమతిస్తే ఆ రోజు జరగాల్సిన సభాకార్యకలాపాలన్నీ వాయిదా పడతాయి. కనీసం 2 1/2 గంటలకు తగ్గకుండా అంశంపై చర్చించాలి. సాధారణంగా ఈ తీర్మానానికి సంబంధించిన చర్చ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు ఉంటుంది. చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వాన్ని అభిశంసించినట్లుగా భావిస్తారు. కానీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.  తీర్మానంపై చర్చ జరిగే సమయంలో సభను వాయిదా వేసే అధికారం సభాపతికి లేదు.

 

ధన్యవాద తీర్మానం 

ప్రభుత్వ విధానాలు, విజయాలతో కూడిన ఒక నోట్‌ను ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ రూపొందిస్తుంది. దీన్ని రాష్ట్రపతి పార్లమెంటులో పేర్కొంటూ ప్రసంగిస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను దీనిలో వివరిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం లోక్‌సభలో ‘ధన్యవాద’ తీర్మానాన్ని  (Motion of thanks) ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.  తీర్మానంపై చర్చ తర్వాత ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. ఓడిపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది.

 

సావధాన తీర్మానం 

అత్యవసర ప్రజాప్రాధ్యాన్యం కలిగిన అంశంపై ప్రభుత్వం నుంచి అధికారపూర్వకంగా సమాధానం (Authoritative Statement) రాబట్టడానికి సావధాన తీర్మానం  (Calling attention motion) ప్రవేశపెడతారు. 1954 నుంచి అనుసరిస్తున్న ఈ తీర్మానానికి సంబంధించిన నిబంధనల్ని పార్లమెంటరీ నియమాల్లో పేర్కొన్నారు. సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత దీన్ని అనుమతిస్తారు. దీనిపై చర్చ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేస్తుంది.

 

కోత తీర్మానాలు 

ప్రభుత్వం వివిధ పద్దుల కేటాయింపు కోసం ‘బడ్జెట్‌’ను లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరుతుంది. ఇదే తరుణంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం కోరుతున్న పద్దులపై తగ్గింపులు చేయాలని కోరుతూ ‘కోత తీర్మానాలు (Cut motions)’ సభలో ప్రవేశపెడుతుంటాయి. ఇవి ఆమోదం పొందితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

కోత తీర్మానాలు 3 రకాలు..

ఆర్థిక కోత తీర్మానం (Economy cut motion): ప్రభుత్వం అవసరమైన దానికంటే ఎక్కువగా మితిమీరిన ఖర్చు చేస్తోందని ప్రతిపక్షాలు భావించినప్పుడు ప్రభుత్వ వ్యయంలో పొదుపును పాటింపజేసే ఉద్దేశంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీని ద్వారా డిమాండ్‌ చేసిన మొత్తం నుంచి కొంత తగ్గించమని ప్రతిపాదిస్తారు. చర్చ అనంతరం ఓటింగ్‌ ఉంటుంది. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

నామమాత్ర కోత తీర్మానం (Token cut motion): ప్రభుత్వం డిమాండ్‌ చేసిన మొత్తం నుంచి రూ.100 తగ్గించాలని ప్రతిపాదిస్తారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

విధాన కోత తీర్మానం (Policy cut motion): ప్రభుత్వం డిమాండ్‌ చేసిన మొత్తం ఒక రూపాయికి తగ్గించాలని ప్రతిపాదిస్తారు. దీనిపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

 

ప్రత్యేక తీర్మానం 

ప్రశ్నల రూపంలో అడిగేందుకు వీలుకాని, అత్యవసర ప్రజాప్రాధాన్యం కలిగిన అంశాలు, ఏ ఇతర పద్ధతుల ద్వారా చర్చించలేని అంశాలను ప్రత్యేక తీర్మానం (Special Motion) ద్వారా చర్చిస్తారు. లోక్‌సభలో రూల్‌ 377 నోటీసుతో, రాజ్యసభలో రూల్‌ 180 (B) నోటీసుతో దీన్ని ప్రవేశపెడతారు.

 

ముగింపు తీర్మానం 

సభలో జరుగుతున్న చర్చను ఇక ముగించాలని ఒక సభ్యుడు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ముగింపు తీర్మానం (Closure Motion) అంటారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదిస్తే చర్చ అంతటితో ముగిసిపోతుంది. ఈ విషయాన్ని ఓటింగ్‌లో పెడతారు.

ముగింపు తీర్మానం - 4 రకాలు

సాధారణ ముగింపు (Simple Closure): చర్చించాల్సిన విషయాన్ని పూర్తిగా చర్చించాం. కాబట్టి దీన్ని ఓటింగ్‌లో పెడుతున్నామని ఎవరైనా సభ్యుడు తీర్మానాన్ని ప్రతిపాదించడం.

విభాగపరమైన ముగింపు (Closure by Compartments): చర్చ ప్రారంభమయ్యే ముందు బిల్లుని వివిధ క్లాజులుగా చేస్తారు. ప్రతి క్లాజుని చర్చించి, చివరికి అన్నింటినీ కలిపి ఓటింగ్‌లో పెడతారు.

కంగారు ముగింపు: దీనిలో భాగంగా ముఖ్యమైన క్లాజులను చర్చిస్తారు. ప్రాధాన్యం లేని క్లాజులను వదిలివేసి, ఆ తర్వాత తీర్మానాన్ని ఆమోదిస్తారు.

గిలటిన్‌ ముగింపు (Guillotine Closure):  ఈ విధానంలో బిల్లులో చర్చించిన విషయంతోపాటు చర్చించని క్లాజులను కూడా చేర్చి ఆమోదిస్తారు.

 

సభాహక్కుల తీర్మానం 

సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా అలాంటి వారిపై సభాహక్కుల తీర్మానం (Privilege Motion) ప్రవేశపెడతారు.

రచయిత: బంగారు సత్యనారాయణ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

‣ కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రధానమంత్రి 

ప్రజలు ఎన్నుకునే రారాజు!

దేశ ప్రగతి, భవిష్యత్తు ప్రభుత్వాలు అనుసరించే, అవలంబించే విధానాలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి. ప్రధాని సలహా మేరకే రాష్ట్రపతి దేశ పాలన సాగిస్తారు. అధికారాలన్నీ ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చేతుల్లో ఉంటాయి. రాజ్యాంగ రీత్యా ఆ పదవి అత్యంత కీలకం. అందుకే ప్రధానిని ప్రజలు ఎన్నుకునే రారాజుగా వ్యవహరిస్తారు. 

 

  భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్స్‌ 74, 75, 78లలో ప్రధానమంత్రి, కేంద్ర మత్రిమండలి గురించి వివరణ ఉంది.

 

ఆర్టికల్‌ 74(1): దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సహకరించేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర మంత్రిమండలి ఉంటుంది.

 

ఆర్టికల్‌ 74(2): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి పదవీకాలం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

 

ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి కింది సందర్భాల్లో అధికారాన్ని కోల్పోతుంది

* లోక్‌సభలో అధికారపక్షం ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానం వీగిపోయినప్పుడు

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గినప్పుడు 

* లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు

* లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు 

* లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం తిరస్కరణకు గురైనప్పుడు 

* లోక్‌సభలో అధికారపక్షం వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ప్రైవేట్‌ బిల్లులు నెగ్గినప్పుడు

 

ఆర్టికల్‌ 75(1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా మెజారిటీ పార్టీల కూటమి నాయకుడిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు.

* ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి మంత్రివర్గ సహచరులను నియమించి వారికి మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

* లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించకపోతే రాష్ట్రపతి తన విచక్షణ మేరకు ప్రధానిని నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 75(1)(A): కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు.

 

ఆర్టికల్‌ 75(1)(B): పార్టీ ఫిరాయంపుల నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా చట్టసభ సభ్యుడిని సభాపతి అనర్హుడిగా ప్రకటిస్తే అలాంటి సభ్యుడిని ఆ సభ పదవీకాలం కొనసాగినంత వరకు ఎలాంటి లాభదాయకమైన పదవిలోనూ నియమించ కూడదు.

* ఆర్టికల్స్‌ 75(1)(A),  75(1)(B) లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగంలో చేర్చింది.

 

ఆర్టికల్‌ 75(2): ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించాలి.

 

ఆర్టికల్‌ 75(3): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహించాలి. లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే కేంద్ర మంత్రిమండలి అధికారంలో ఉంటుంది.

 

ఆర్టికల్‌ 75(4): ప్రధాని నాయకత్వంలోని కేంద్రమంత్రి మండలి సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

ఆర్టికల్‌ 75(5): ప్రధానమంత్రిగా లేదా కేంద్రమంత్రిగా నియమితులవ్వాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో ఏదైనా సభలో సభ్యులై ఉండాలి. ఏ సభలోనూ సభ్యత్వం లేనివారు ప్రధానిగా లేదా కేంద్రమంత్రిగా నియమితులైతే ఆరు నెలల్లోగా ఏదో ఒక సభలో తప్పనిసరిగా సభ్యత్వం పొందాలి. లేకపోతే పదవిని కోల్పోతారు.

సుప్రీంకోర్టు తీర్పు: బి.ఆర్‌. కపూర్‌ వర్సెస్‌  స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికవడానికి అర్హతలున్న వారిని మాత్రమే ప్రధానిగా లేదా కేంద్ర మంత్రులుగా నియమించాలని పేర్కొంది. 

 

ఆర్టికల్‌ 75(6): ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 78(1): కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేయాలి.

 

ఆర్టికల్‌ 78(2): దేశ పరిపాలనకు సంబంధించిన కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలను రాష్ట్రపతి స్వయంగా తెలుసుకోవచ్చు.

ఉదా: బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోలు విషయమై 1986లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్‌ రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 

 

ఆర్టికల్‌ 78(3): రాష్ట్రపతి తన ఆమోద ముద్ర కోసం వచ్చిన బిల్లులు/ తీర్మానాలను మొత్తం మంత్రిమండలి పరిశీలించలేదని, దాన్ని పునఃపరిశీలన చేసి పంపాలని ప్రధానిని కోరవచ్చు.

 

ప్రధానమంత్రి - అధికారాలు, విధులు

* ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు. ప్రధాని సలహా మేరకే కేంద్ర మంత్రులను రాష్ట్రపతి నియమించి, మంత్రిత్వ శాఖలను కేటాయిస్తారు.

* ప్రధానమంత్రి పదవి ఏ కారణంతోనైనా ఖాళీ అయితే మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

* ప్రధానమంత్రి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. 

* ప్రధాని లోక్‌సభకు నాయకుడిగా, జాతికి ప్రతిబింబంగా వ్యవహరిస్తారు.

* ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దుచేస్తారు. 

* మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య ప్రధానమంత్రి సంధానకర్తగా వ్యవహరిస్తారు. 

* భారతదేశ విదేశాంగ విధానం ప్రధాని ఆధ్వర్యంలోనే రూపొందిస్తారు.

* విదేశాలతో వ్యవహరించేటప్పుడు ప్రధాని మనదేశానికి నాయకుడిగా వ్యవహరిస్తారు.

* రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపడితే, లోక్‌సభలో తన ప్రతినిధిగా మరొకరిని నియమిస్తారు.

* ప్రభుత్వం, పార్లమెంటు, ప్రజలకు నాయకుడు ప్రధానమంత్రి. రాష్ట్రపతికి ప్రధాన సలహాదారుడు. దేశ ప్రగతి, ప్రభుత్వ భవిష్యత్తు ప్రధానమంత్రి అనుసరించే విధానాల మీద ఆధారపడి ఉంటుంది.

 

ప్రధాని పదవి - ప్రముఖుల వ్యాఖ్యానాలు

* ప్రధాని సమానుల్లో ప్రథముడు - లార్డ్‌ మార్లే

* ప్రధానమంత్రి ఎన్నికైన రారాజు - హింటన్‌

* ప్రధానమంత్రి సూర్యుడు అయితే అతడి మంత్రివర్గ సహచరులందరూ అతడి చుట్టూ పరిభ్రమించే గ్రహాల లాంటివారు - ఐవర్‌ జెన్నింగ్స్‌

* ప్రధానమంత్రి చుక్కల్లో చంద్రుడిలాంటివారు - విలియం వెర్నార్‌ కోట్‌

* ప్రధానమంత్రి పార్లమెంటరీ ప్రభుత్వమనే పడవను నడిపే కెప్టెన్‌ లాంటివారు - రాంసేమ్యూర్‌

* రెండో ప్రపంచ యుద్ధానంతరం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా మారింది - ఆర్‌.ఎస్‌.క్రాస్‌మన్‌ 

 

పలు సంస్థలకు అధ్యక్షుడిగా 

పదవిరీత్యా ప్రధానమంత్రి పలు సంస్థలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

* నీతిఆయోగ్, జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమైక్యతా మండలి, అంతర్‌రాష్ట్ర మండలి

* జాతీయ భద్రతా మండలి, జాతీయ జనాభా నియంత్రణ మండలి

* జాతీయ విపత్తు నిర్వహణ మండలి

* జాతీయ జలవనరుల మండలి

 

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

  కేంద్ర‌మంత్రి మండ‌లి

‣  రాష్ట్రపతి పాలన 

 

ప్ర‌తిభ పేజీలు

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 04-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటు - శాసన నిర్మాణ ప్రక్రియ


ముసాయిదా మొదలు... ఆమోద‌ ముద్ర వ‌రకు!

పాలన సక్రమంగా నియంత్రణలో సాగాలంటే కొన్ని నియమ నిబంధనలు అవసరం. వాటిని దేశ సార్వభౌమాధికార పరిధిలో న్యాయబద్ధంగా రూపొందించి, అమలు అధికారాన్ని ప్రభుత్వానికి అందించేదే శాసనం. ఇందుకోసం రాజ్యాంగ నిర్మాతలు పటిష్ఠమైన విధానాలను ఏర్పాటు చేశారు.  ఆ వివరాలను ముసాయిదాతో మొదలు పెట్టి శాసన నిర్మాణం వరకు సమగ్రంగా అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

పార్లమెంటు - శాసన నిర్మాణ ప్రక్రియ

దేశానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. మన దేశం శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్‌ నుంచి గ్రహించింది. ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఏడు దశలు అధిగమించాల్సి ఉంటుంది. ‘బిల్లు’ అంటే ‘శాసనం లేదా చట్టం’ చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదన/ముసాయిదా. ఇది చట్టం నిర్మాణంలో మొదటి దశ.

బిల్లును ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లు ప్రతిని న్యాయమంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపుతారు. ఆ శాఖ నుంచి సూచనలు, సలహాలు సేకరించిన తర్వాత ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచుతారు. కేబినెట్‌ ఆమోదించిన బిల్లును ప్రవేశపెట్టబోయే సభాధిపతికి 7 రోజులు ముందుగా నోటీసు ఇచ్చి వారి అనుమతి కోరతారు. సభాధిపతి నిర్ణయించిన తేదీన బిల్లును సభలో ప్రవేశపెడతారు.

 

ఏడు దశలు

1) ప్రవేశ దశ: ఈ దశలో బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి, సభాధిపతి అనుమతితో బిల్లుకు సంబంధించిన శీర్షికను ప్రకటిస్తూ దాన్ని ప్రవేశపెట్టేందుకు సభ అనుమతి కోరతారు. అవసరమైతే ఈ దశలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఓటింగ్‌లో నెగ్గితే బిల్లు ప్రతిని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురిస్తారు. ఈ దశలో ఓటింగ్‌లో ఓడిపోతే కేవలం బిల్లు మాత్రమే రద్దవుతుంది. ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు.

2) మొదటి పఠనం: ఈ దశలో బిల్లు ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, బిల్లు చట్టంగా మారితే దానివల్ల చేకూరే ప్రయోజనాల గురించి బిల్లును ప్రవేశపెట్టే వ్యక్తి/మంత్రి వివరిస్తారు.

3) ద్వితీయ పఠనం: ఈ దశలో బిల్లుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సమగ్రంగా సభకు వివరిస్తారు. బిల్లును సభ మొత్తంగా చర్చించాలా లేదా కమిటీకి అప్పగించాలా అనే అంశంపై చర్చ జరుగుతుంది. సాధారణంగా ఏ బిల్లునైనా పార్లమెంటరీ కమిటీలకు అప్పగిస్తుంటారు.

4) కమిటీ దశ: ఆధునిక కాలంలో పార్లమెంటు చేసే చట్టాల తయారీలో పార్లమెంటరీ కమిటీలదే కీలక పాత్ర. సంబంధిత రంగాలకు చెందిన నిపుణుల సలహాలు, రాజ్యాంగ, న్యాయ నిపుణుల సూచనలు, ప్రజాభిప్రాయాన్ని ఈ కమిటీ సేకరిస్తుంది. ఈ విధంగా సేకరించిన అంశాలతో కూడిన నోట్‌ను బిల్లుకి జతపరచి సభాపతికి సమర్పిస్తారు.

5) నివేదిక దశ: వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల ఆధారంగా బిల్లులో చేసే సవరణలు, అవసరమైన సూచనలు, నిపుణుల సలహాలను క్రోడీకరించి ఒక నివేదిక రూపొందించి సభ ముందు ఉంచుతారు.

6) తృతీయ పఠనం: పార్లమెంటరీ కమిటీ సమర్పించిన బిల్లులోని అంశాలపై చర్చిస్తూ ఒక్కో క్లాజుపైన లేదా మొత్తం బిల్లుపై సమగ్ర చర్చ జరిపి, సభ్యుల అభిప్రాయాన్ని కోరుతూ ఓటింగ్‌కు ప్రవేశపెడతారు. ఈ దశలో లోక్‌సభలో జరిగే ఓటింగ్‌లో బిల్లు వీగిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది.

7) రాష్ట్రపతి ఆమోదం: పైన పేర్కొన్న దశలన్నీ రెండో సభలో కూడా పూర్తయిన తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుంది. రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా రూపొందుతుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజులో ఒక బిల్లు శాసనంగా రూపొందేందుకు కనీసం 19 రోజులు పడుతుంది.

 

బిల్లులు - రకాలు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 107 నుంచి 122 మధ్య శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, బిల్లుల వివరాలను పొందుపరిచారు.

 

సాధారణ బిల్లులు:  ఆర్టికల్‌ 107 ప్రకారం ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు కాని వాటిని సాధారణ బిల్లులుగా పరిగణిస్తారు. సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ బిల్లులు ఉభయ సభల్లో వేర్వేరుగా గాని, సంయుక్తంగా గాని ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టాలు/శాసనాలుగా మారతాయి. సాధారణ బిల్లులను ఆమోదించే సందర్భంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేస్తారు. ఈ విధంగా ఏర్పాటయ్యే సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఇంతవరకు మన దేశంలో మూడు సార్లు మాత్రమే పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాలు జరిగాయి.  

* 1961, మే 6న వరకట్న నిషేధ బిల్లు విషయమై రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ అధ్యక్షత వహించారు.

* 1978, మే 17న బ్యాంకింగ్‌ సర్వీస్‌ రెగ్యులేషన్‌ బిల్లు విషయమై సభల మధ్య భినాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దానిక అప్పటి లోక్‌సభ స్పీకర్‌ కేఎస్‌ హెగ్డే అధ్యక్షత వహించారు.

* 2002, మార్చి 26న ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిజం ఆర్డినెన్స్‌ (POTO) విషయమై సభల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి అప్పటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు.

 

ద్రవ్య బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 109లో ద్రవ్యబిల్లుల (Money Bills) ఆమోద ప్రక్రియ గురించి వివరించారు. ఆర్టికల్‌ 110లో ద్రవ్య బిల్లుల నిర్వచనం గురించి వివరించారు. భారత సంఘటిత నిధి, ఆగంతక నిధి నుంచి నగదు తీసుకోవడం, జమ చేయడం, పన్నులు విధించడం, తగ్గించడం, క్రమబద్ధీకరించడం, ఆర్థిక లావాదేవీలు లాంటి వాటిని ద్రవ్య బిల్లులుగా పరిగణిస్తారు.

* ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనేది లోక్‌సభ స్పీకర్‌ నిర్ణయిస్తారు. స్పీకరు నిర్ణయాన్ని దేశంలోని ఏ న్యాయస్థానంలోనూ సవాల్‌ చేయరాదు.

* ద్రవ్య బిల్లును రాష్ట్రపతి అనుమతిలో లోక్‌సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదం పొందిన ద్రవ్య బిల్లు స్పీకర్‌ ధ్రువీకరణతో రాజ్యసభకు వెళ్తుంది.

* ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలియజేయాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. 

 

ఆర్థిక బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117లో ఆర్థిక బిల్లుల (Financial Bills) ప్రస్తావన ఉంది. ఆర్థిక బిల్లులను కింది విధంగా వర్గీకరించవచ్చు. అవి:

* ద్రవ్య బిల్లులు - ఆర్టికల్‌ 110

* మొదటి రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్‌ 117 (1)

* రెండో రకం ఆర్థిక బిల్లులు - ఆర్టికల్‌ 117 (3)

 

ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లుల్లో అంతర్భాగమే. ద్రవ్య బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే. కానీ ఆర్థిక బిల్లులన్నీ ద్రవ్య బిల్లులు కాదు. స్పీకర్‌  ధ్రువీకరించిన ఆర్థిక బిల్లులు ద్రవ్య బిల్లులు అవుతాయి. అంటే ద్రవ్య బిల్లులకు, ఆర్థిక బిల్లులకు తేడా స్పీకర్‌ ధ్రువీకరణ మాత్రమే.

మొదటి రకం ఆర్థిక బిల్లులు ఆర్టికల్‌: కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే అంశాలపై చట్టాలు చేయాలనుకున్నప్పుడు రుణాలను సేకరించే నియమాలతో పాటు, సాధారణ నియమాలు కూడా ఉంటాయి. ఈ రకమైన బిల్లు ద్రవ్య బిల్లులతో సరిసమానమైంది. ఈ బిల్లును రాష్ట్రపతి అనుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.

రెండో రకం ఆర్థిక బిల్లులు: ఈ రకమైన ఆర్థిక బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలుంటాయి. ఆర్టికల్‌ 110లో పేర్కొన్న అంశాలు దీనిలో ఉండవు. అందువల్ల దీన్ని సాధారణ బిల్లులా పార్లమెంటు ఉభయసభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టే ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ బిల్లుపై ఉభయసభల సంయుక్త సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

 కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 08-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటు - అధికారాలు, విధులు

శాసన నిర్మాణంలో సర్వోన్నతం

  ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత శాసన నిర్మాణ వేదిక పార్లమెంటు. దేశ అవసరాల మేరకు శాసనాలను రూపొందిస్తుంది, సరిచేస్తుంది, రద్దు చేస్తుంది. ప్రభుత్వాలకు మార్గదర్శనం చేస్తుంది, నియంత్రిస్తుంది. ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపంగా పాలన సాగేవిధంగా చూస్తుంది.

 

  పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు. ఈ విధానానికి పుట్టినిల్లు బ్రిటన్‌. ప్రపంచ పార్లమెంటులకు మాతగా బ్రిటన్‌ పార్లమెంటును పేర్కొంటారు. మన దేశం పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్‌ నుంచి గ్రహించింది.

 

భారత్‌లో పార్లమెంటు పరిణామ క్రమం 

* చార్టర్‌ చట్టం-1833 ప్రకారం మన దేశంలో తొలిసారిగా కార్యనిర్వాహక శాఖ నుంచి శాసన నిర్మాణ శాఖను వేరు చేశారు. 

* చార్టర్‌ చట్టం-1853 ప్రకారం మన దేశంలో జాతీయ స్థాయిలో తొలిసారిగా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. 

* ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం-1861 ప్రకారం కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ముగ్గురు భారతీయులకు తొలిసారి ప్రాతినిధ్యం కల్పించారు.

* ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం-1892 ప్రకారం మన దేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు. 

* మింటో - మార్లే సంస్కరణల చట్టం-1909 ప్రకారం మన దేశంలో పరిమిత ప్రాతిపదికపై కొద్దిమందికి ఓటుహక్కును కల్పించి  ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.

* మాంటేగ్‌ - ఛేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం-1919 ప్రకారం జాతీయ స్థాయిలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎగువ సభను కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌గా, దిగువ సభను లెజిస్లేటివ్‌ అసెంబ్లీగా పేర్కొన్నారు. ఈ ద్విసభా విధానం 1921 నుంచి అమల్లోకి వచ్చింది. 

* భారత పార్లమెంటు భవనాన్ని 1921 - 1927 మధ్య నిర్మించారు. దాన్ని ఎడ్విన్‌ ల్యూటిన్స్, ఎడ్వర్డ్‌ బేకర్‌ రూపకల్పన చేశారు. 1921లో గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఛేమ్స్‌ఫర్డ్‌ పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1927, జనవరి 18న గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. 

 

రాజ్యాంగ వివరణ

భారత రాజ్యాంగంలోని అయిదో భాగంలో ఆర్టికల్స్‌ 79 నుంచి 122 మధ్య పార్లమెంటు నిర్మాణం, శాసన ప్రక్రియ, అధికార విధులను వివరించారు. ఆర్టికల్‌ 79 ప్రకారం భారతదేశానికి ఒక అత్యున్నత శాసన నిర్మాణ శాఖ ఉంటుంది. దాని పేరు  పార్లమెంటు. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్‌సభలను కలిపి పార్లమెంటు అంటారు. రాజ్యాంగ నిర్మాతలు జాతీయ స్థాయిలో రెండు సభలు ఉన్న పార్లమెంటరీ వ్యవస్థను ఏర్పరిచారు. మన దేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా రూపొందించడంతో సమాఖ్య స్ఫూర్తికి అవసరమైన రెండు సభలను అంటే రాజ్యసభ, లోక్‌సభలను ఏర్పాటు చేశారు. మన దేశంలో 1952, ఏప్రిల్‌ 3న రాజ్యసభ, 1952, ఏప్రిల్‌ 17న లోక్‌సభ ఏర్పడ్డాయి. పార్లమెంటు తొలి సమావేశం 1952, మే 13న జరిగింది. రెండు సభల సభ్యులను పార్లమెంటు సభ్యులుగా పరిగణిస్తారు. అందుకే ఏ సభలోని సభ్యుడినైనా మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంటు (ఎంపీ) అంటారు. 

 

శాసనాధికారాలు

భారతదేశానికి అవసరమైన సమగ్ర శాసనాలను రూపొందించేది పార్లమెంటు మాత్రమే. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలను రూపొందిస్తుంది.  

 

ఆర్టికల్‌ 249 - జాతీయ ప్రాధాన్యం రీత్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేసినప్పుడు.

 

ఆర్టికల్‌ 252 - రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు. 

 

ఆర్టికల్‌ 253 - అంతర్జాతీయ ఒప్పందాల అమలు కోసం.

 

ఆర్టికల్‌ 356 - రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రాలకు. 

 

ఆర్టికల్‌ 250 - జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్‌ 352 ప్రకారం కొనసాగుతున్నపుడు.

 

ఇతర శాసనాధికారాలు 

 

ఆర్టికల్‌ 2 - కొత్త రాష్ట్రాల ఏర్పాటు 

 

ఆర్టికల్‌ 3 - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

 

ఆర్టికల్‌ 11 - పౌరసత్వానికి సంబంధించిన అంశాలు 

 

ఆర్టికల్‌ 71 - రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యవహారాలు 

 

ఆర్టికల్‌ 33 - సైనికులు, శాంతిభద్రతల ఉద్యోగుల ప్రాథమిక హక్కులపై

 

ఆర్టికల్‌ 248 - అవశిష్టాంశాలపై 

 

ఆర్టికల్‌ 169(1) - రాష్ట్రాల్లో ఎగువ సభ అయిన విధాన పరిషత్‌ ఏర్పాటు లేదా తొలగింపు 

 

ఆర్టికల్‌ 312 - రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే కొత్త అఖిల భారత సర్వీసుల ఏర్పాటు 

 

ఆర్టికల్‌ 123 - రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్‌ను ఆమోదించడం ద్వారా 

 

కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించే అధికారాలు

ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలిని పార్లమెంటు వివిధ పద్ధతుల ద్వారా నియంత్రిస్తుంది. 

* కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి.

* పార్లమెంటులో సభ్యులు అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే వాయిదా తీర్మానం, అవిశ్వాస తీర్మానాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి.

లోక్‌సభ ప్రభుత్వంపై వివిధ రూపాల్లో నియంత్రణను కలిగి ఉంటుంది. 

* ద్రవ్య బిల్లులు, బడ్జెట్‌ను తిరస్కరించడం  

* రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తిరస్కరించడం 

* కోత తీర్మానాలను ప్రవేశపెట్టడం 

* అభిశంసన తీర్మానం, అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం  

* ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టడం 

* ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌  

 

రాజ్యాంగ సవరణ అధికారాలు 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 368 ప్రకారం పార్లమెంటు భారత రాజ్యాంగాన్ని మూడు రకాల పద్ధతుల ద్వారా సవరింస్తుంది. 1951 లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం మొదటిసారిగా రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో (1976) 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని అనేక అంశాలను సవరించారు.

 

ఆర్థిక అధికారాలు 

* పార్లమెంటు అనుమతి లేనిదే ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేయకూడదు. ఆర్టికల్‌ 265 ప్రకారం చట్టబద్ధంగా తప్ప ఇతర పద్ధతుల ద్వారా పన్నులు విధించకూడదు.

* బడ్జెట్, ఆర్థిక, పారిశ్రామిక తీర్మానాలను పార్లమెంటు ఆమోదిస్తుంది.

* ఆర్టికల్‌ 266 ప్రకారం కేంద్ర సంఘటిత నిధిపై పార్లమెంటు పూర్తిస్థాయి నియంత్రణ కలిగి ఉంటుంది.

* ఆర్టికల్‌ 292 ప్రకారం విదేశాల నుంచి ప్రభుత్వం రుణాలు పొందాలంటే పార్లమెంటు అనుమతి ఉండాలి.

* పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ, ఎస్టిమేట్స్‌ కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ తమ నివేదికలను పార్లమెంటుకు సమర్పిస్తాయి.

* ఆర్టికల్‌ 151 ప్రకారం కాగ్‌ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.

 

అర్ధన్యాయాధికారాలు

* ఆర్టికల్‌ 61 ప్రకారం మహాభియోగ తీర్మానం (ఇంపీచ్‌మెంట్‌ మోషన్‌) ద్వారా పార్లమెంటు రాష్ట్రపతిని తొలగిస్తుంది.

* సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులను తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది.

* కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్‌లను తొలగించే తీర్మానాలను పార్లమెంటు విచారిస్తుంది. 

* సభా హక్కులకు భంగం కలిగించిన వారిని శిక్షిస్తుంది.

జీతభత్యాలను నిర్ణయించడం: పార్లమెంటు సభ్యులు, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, ఇతర జాతీయ ప్రాధాన్యం ఉన్న పదవుల జీత భత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

‣  ఉపరాష్ట్రపతి

 కేంద్ర రాష్ట్ర సంబంధాలు - గవర్నర్‌ పాత్ర

 

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 17-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రధానమంత్రి

మాదిరి ప్రశ్నలు

1. ప్రధానమంత్రి పదవి గురించి రాజ్యాంగ వివరణ ఎక్కడ ఉంది?

1) రాజ్యాంగంలోని జువ భాగం, ఆర్టికల్‌ 73, 74, 77

2) రాజ్యాంగంలోని జువ భాగం, ఆర్టికల్‌ 74, 75, 78

3) రాజ్యాంగంలోని జువ భాగం, ఆర్టికల్‌ 78, 79, 80

4) రాజ్యాంగంలోని జువ భాగం, ఆర్టికల్‌ 75, 76, 77

 

2. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి అధికారాన్ని కోల్పోయే మార్గానికి సంబంధించి సరైంది?

ఎ) లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోయినప్పుడు

బి) లోక్‌సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పుడు

సి) లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు

డి) లోక్‌సభలో కోత తీర్మానాలు నెగ్గినప్పుడు

1) ఎ, బి, సి   2) ఎ, బి, డి   3) ఎ, సి, డి   4) ఎ, బి, సి, డి

 

3. కేంద్రమంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించరాదని ఆర్టికల్‌ 75(1)(A) నిర్దేశిస్తుంది?

1) 15%    2) 10%    3) 8%    4) 20%

 

4. పార్లమెంటు సభ్యులు కానివారు ప్రధాని/కేంద్రమంత్రిగా నియమితులైనప్పుడు ఎంతకాలంలోగా పార్లమెంటుకు ఎన్నిక కాకపోతే పదవిని కోల్పోతారు?

1) 3 నెలలు   2) 4 నెలలు   3) 5 నెలలు  4) 6 నెలలు

 

5. ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) రాష్ట్రపతి   2) పార్లమెంటు  3) రిజర్వ్‌బ్యాంక్‌   4) సుప్రీంకోర్టు

 

6. బోఫోర్స్‌ ఆయుధాల కొనుగోలు విషయమై రాజీవ్‌ గాంధీ ప్రభుత్వాన్ని వివరణ కోరిన రాష్ట్రపతి ఎవరు?

1) జ్ఞానీ జైల్‌సింగ్‌   2) ఆర్‌.వెంకట్రామన్‌   3) శంకర్‌దయాల్‌ శర్మ   4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌

 

7. ప్రధానమంత్రి పదవీరీత్యా అధ్యక్షత వహించే సంస్థకు సంబంధించి సరికానిది?

1) జాతీయ అభివృద్ధి మండలి   2) అంతర్‌ రాష్ట్రమండలి

3) జోనల్‌ కౌన్సిల్స్‌   4) నీతి ఆయోగ్‌

 

8. ప్రధాని అధికారాలు, విధులకు సంబంధించి సరైంది?

ఎ) మంత్రిమండలి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.

బి) లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు.

సి) కేంద్ర కేబినెట్‌కు నాయకుడిగా వ్యవహరిస్తారు.

డి) ప్రధాని సలహామేరకు రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేస్తారు.

1) ఎ, బి, సి   2) ఎ, సి, డి   3) ఎ, బి, డి   4) ఎ, బి, సి, డి

 

9. ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆర్టికల్‌ 75(3) ప్రకారం ఎవరికి సమష్టి బాధ్యత వహించాలి?

1) లోక్‌సభ  2) రాజ్యసభ   3) రాష్ట్రపతి   4) సుప్రీంకోర్టు

 

10. ప్రధానిని సమానుల్లో ప్రథముడు అని ఎవరు అభివర్ణించారు?

1) విలియం వెర్నార్‌ కోట్‌   2) లార్డ్‌ మార్లే 

3) ఐవర్‌ జెన్నింగ్స్‌    4) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌

 

సమాధానాలు  

1-2, 2-3, 3-1, 4-4, 5-2, 6-1, 7-3, 8-4, 9-1, 10-2. 

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  పార్లమెంటు సభ్యులు

దేశానికి శాసనకర్తలు!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సక్రమంగా, సంతృప్తికరంగా కార్యనిర్వాహక విధులను నిర్వర్తించేందుకు కొన్ని శాసనాలు అవసరం. వాటిని పార్లమెంటు సభ్యులు రూపొందిస్తారు. దేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆ శాసనాలను నిర్మించే ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికవుతారు? వారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర అన్ని రకాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  

భారతదేశంలో అత్యున్నత శాసననిర్మాణ వ్యవస్థ పార్లమెంటు. ఇందులో లోక్‌సభకు ప్రత్యక్షంగా, రాజ్యసభకు పరోక్షంగా ఎన్నికయ్యే వారే పార్లమెంటు సభ్యులు (ఎంపీలు). శాసననిర్మాణ వ్యవస్థలో వీరంతా కీలక వ్యక్తులు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు, షరతులను రాజ్యాంగం నిర్దేశించింది. ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం, వారికి ఉండే ప్రత్యేక రక్షణలు, అనర్హతకు గురయ్యే సందర్భాలను వివరంగా పేర్కొంది.

 

అర్హతలు

* భారతీయ పౌరసత్వం ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* నేరారోపణ రుజువై ఉండకూడదు (క్రిమినల్‌ కేసుల్లో).

* దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

* మానసిక సమతౌల్యత కలిగి ఉండాలి.

* ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* లోక్‌సభ సభ్యత్వానికి 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యత్వానికి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

 

షరతులు: * ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్‌ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా (ధరావతు) రూ.25 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి.

* అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా, ఒక సెక్యూరిటీ డిపాజిట్‌ సరిపోతుంది.

* ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం పోలై, చెల్లుబాటు అయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రాని అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కోల్పోతారు.

* నామినేషన్‌ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలి.

 

ప్రమాణస్వీకారం: పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎదుట లేదా రాష్ట్రపతి ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి సమక్షంలో లేదా రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లోని ఆర్టికల్‌ 99 ప్రకారం ‘భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్ఠలతో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సంరక్షిస్తానని, తాను చేపట్టిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తానని’ ప్రమాణస్వీకారం చేయాలి. పదవీ ప్రమాణస్వీకారం చేయకుండా సభాకార్యక్రమాల్లో పాల్గొనే పార్లమెంటు సభ్యుడికి రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు.

 

రాజీనామా: పార్లమెంటు సభ్యుల రాజీనామా గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(3)్బ్జ్శ పేర్కొంటుంది. సభ్యులు తమ రాజీనామా పత్రాలను నిర్ణీత ప్రొఫార్మాలో సంబంధిత సభాధ్యక్షులకు పంపాలి. సభ్యులు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని సభాధ్యక్షులు ధ్రువీకరించుకున్న తర్వాత అవి ఆమోదం పొందుతాయి.

 

జీతభత్యాలు: ఆర్టికల్‌ 106 ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2019లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం సభ్యుల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి.

* వేతనం - రూ.1,00,000

* నియోజకవర్గ అలవెన్స్‌ - రూ.70,000

* ఆఫీసు ఖర్చులు - రూ.60,000

* సెక్రటేరియట్‌ అలవెన్స్‌ - రూ.40,000

* దినసరి అలవెన్స్‌ - రూ.2,000

* ఉచిత నివాసం, ఉచిత రవాణా, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. పదవీవిరమణ తర్వాత నెలకు రూ.25,000 పెన్షన్‌ లభిస్తుంది.

* వీరి జీతభత్యాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావు.

 

ప్రత్యేక హక్కులు, రక్షణలు

* పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105లో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. వీరు ఓటు చేసిన విధానం గురించి న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలులేదు.

* పార్లమెంటు సమావేశాలకు 40 రోజుల ముందు లేదా సమావేశం తర్వాత 40 రోజుల వరకు లేదా సమావేశాలు జరుగుతున్నపుడు సభాధ్యక్షుల అనుమతి లేకుండా సభ్యులను అరెస్ట్‌ చేయకూడదు.

* సభా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుడి అనుమతి లేకుండా ఏ సభ్యుడిని న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి హాజరు కావాలని న్యాయస్థానాలు ఆదేశించలేవు.

 

సమావేశాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలకు మించకూడదు ప్రత్యేక పరిస్థితుల్లో, అవసరమైనప్పుడు ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో పార్లమెంటు సమావేశాలను సాంప్రదాయికంగా సంవత్సరానికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు.

* బడ్జెట్‌ సమావేశాలు (Budget Sessions): ఫిబ్రవరి - మార్చి

* వర్షాకాల సమావేశాలు (Monsoon Session): జులై - ఆగస్టు

* శీతాకాల సమావేశాలు (Winter Session): నవంబరు - డిసెంబరు

 

అనర్హతలు

 పార్లమెంటు సభ్యులు అనర్హతకు గురై, సభ్యత్వాన్ని కోల్పోయే సందర్భాలను ఆర్టికల్‌ 102 వివరిస్తుంది.

- లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టడం.

- మానసిక స్థితి సక్రమంగా లేదని న్యాయస్థానం ప్రకటించడం.

- దివాలా తీశాడని న్యాయస్థానం ధ్రువీకరించడం.

- ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడం.

- ఎన్నికల వ్యయ పరిమితికి సంబంధించిన వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమవడం.

- భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోవడం.

- ఇతర దేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం.

- వరకట్న నిషేధ చట్టం, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురవడం.

 రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఒక పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.

ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హత: ఆర్టికల్‌ 101 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా కొనసాగడాన్ని నిషేధించారు. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఒక సభలో సభ్యత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సి ఉంటుంది.

* ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటులోని ఉభయసభలకు ఎన్నికైతే అతడు 10 రోజుల్లోగా ఏ సభలో కొనసాగాలని కోరుకుంటున్నాడో తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే అతడు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు.

* ఒక వ్యక్తి ఒకే సభలో రెండు సీట్లకు ఎన్నికైతే ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితిలోగా ఒకదాన్ని వదులుకోవాలి. లేదంటే రెండు సీట్ల సభ్యత్వాన్నీ కోల్పోతాడు.

* ప్రస్తుతం ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు ఎన్నికయితే అతడు మొదటి సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు.

*  ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు రెండింటికీ ఎన్నికైతే 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేకపోతే అతడు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు.

 

గైర్హాజరు: పార్లమెంటు సభ్యుడు సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు గైర్హాజరైతే ్బత్జి(’-్మ్శ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(4) ప్రకారం అతడు సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు. 60 రోజుల కాలవ్యవధిని లెక్కించడంలో సభ వాయిదా పడిన కాలం లేదా వరుసగా నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా పడిన రోజులను పరిగణనలోకి తీసుకోకూడదు.

 

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన ఆధారంగా అనర్హత: మన దేశంలో చట్టసభల సభ్యులలో నైతికత, బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు మరో పార్టీలోకి మారితే అతడు సభలో సభ్యత్వాన్ని ఏ విధంగా కోల్పోతాడో నిర్దేశించారు. చట్టసభల సభ్యుల అనర్హతలను నిర్ణయించే అధికారం లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో ఛైర్మన్‌కు ఉంటుంది.

 

పదవిని కోల్పోయే సందర్భాలు

* ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికవుతారో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసినప్పుడు.

* రాజకీయ పార్టీ జారీ చేసిన ‘విప్‌’నకు వ్యతిరేకంగా సభలో ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరైతే.

* స్వతంత్రంగా (ఇండిపెండెంట్‌) గెలిచిన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు.

* పార్లమెంటుకి నామినేట్‌ అయిన సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరితే.

అనర్హతకు గురయ్యే ఇతర సందర్భాలు: పార్లమెంటు సభ్యుడు కింది సందర్భాల్లో సభలో సభ్యత్వం కోల్పోయి అనర్హతకు గురవుతాడు.

- సభ నుంచి సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు.

- సభ్యుడి ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్చు ఇచ్చినప్పుడు.

- సభ్యుడు రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైనప్పుడు.

- సభ్యుడు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైనప్పుడు.

 

సుప్రీంకోర్టు తీర్పులు

కిహోటా Vs జాచీలూ కేసు: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చే రూలింగ్‌ను న్యాయసమీక్షకు (Judicial Review) గురిచేయవచ్చు.

లిల్లీ థామస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: క్రిమినల్‌ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యే చట్టసభల సభ్యులను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతకంటే తక్కువ ఓట్లు వస్తే తమ డిపాజిట్‌ను కోల్పోతారు?

1) 1/2  2) 1/3  3) 1/4  4) 1/6

 

2. పార్లమెంటు సభ్యుల పదవీ ప్రమాణస్వీకారం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 91   2) ఆర్టికల్‌ 97   3) ఆర్టికల్‌ 99   4) ఆర్టికల్‌ 100

 

3. రాజ్యాంగంలోని ఆరిక్టల్‌ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశమవ్వాలి?

1) రెండుసార్లు 2) మూడుసార్లు 3) నాలుగుసార్లు  4) ఐదుసార్లు

 

4. ఆర్టికల్‌ 102 ప్రకారం కింద పేర్కొన్న ఏ కారణం వలన పార్లమెంటు సభ్యుడు అనర్హతకు గురవుతాడు?

1) లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టడం

2) భారత పౌరసత్వాన్ని కోల్పోవడం

3) దివాలా తీశాడని న్యాయస్థానం ప్రకటించడం

4) పైవన్నీ

 

5. ఒక వ్యక్తి ఏకకాలంలో రెండుసభలలో సభ్యుడిగా కొనసాగడాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తుంది?

1) ఆర్టికల్‌ 101     2) ఆర్టికల్‌ 102    3) ఆర్టికల్‌ 103     4) ఆర్టికల్‌ 104

 

6. సభాధ్యక్షుల అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడు వరుసగా ఎన్ని రోజులపాటు సమావేశాలకు గైర్హాజరు అయితే సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు?

1) 30 రోజులు     2) 40 రోజులు     3) 50 రోజులు     4) 60 రోజులు

 

7. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రూపొందించారు?

1) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

3) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985

4) 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

 

8. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ప్రకారం పార్లమెంటు సభ్యుడు ఏ సందర్భంలో తన సభ్యత్వాన్ని కోల్పోతాడు?

ఎ) రాజకీయ పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించినపుడు

బి) ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసినపుడు.

సి) ఇండిపెండెంట్‌గా గెలిచిన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినపుడు

డి) నామినేటెడ్‌ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరినపుడు

1) ఎ, బి, సి సరైనవి 2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి 4) అన్నీ సరైనవి

 

9. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

3) పార్లమెంటు

4) కేంద్ర ఆర్థిక సంఘం

 

10. పార్లమెంటుసభ్యుల ప్రత్యేక హక్కులు, రక్షణలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 105    2) ఆర్టికల్‌ 107

3) ఆర్టికల్‌ 109     4) ఆర్టికల్‌ 111

 

సమాధానాలు

1-4, 2-3, 3-1, 4-4, 5-1, 6-4, 7-3, 8-4, 9-3, 10-1.

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  ఆర్థిక అత్యవసర పరిస్థితి

  గవర్నర్‌

 ఉపరాష్ట్రపతి

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటరీ కమిటీలు/సంఘాలు

స‌మ‌గ్ర శాస‌నాల‌కు స‌మ‌ర్థ సాధ‌నాలు

  సంవ‌త్స‌రంలో ప‌రిమిత కాలం సమావేశ‌మయ్యే పార్ల‌మెంటుకు అన్ని అంశాల‌ను సంపూర్ణంగా అధ్య‌యనం చేసి ప‌రిశీలించేందుకు స‌మ‌యం స‌రిపోదు. అందుకే ర‌క‌ర‌కాల క‌మిటీలు లేదా సంఘాల‌ను ఏర్పాటు చేసి ప‌రోక్షంగా ప‌ర్య‌వేక్షిస్తుంది. వాటి ద్వారా ప్ర‌భుత్వాల జ‌వాబుదారీత‌నాన్ని స‌మీక్షిస్తుంది. స‌భ్యుల హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డంతోపాటు ప‌రిధి దాటిన వారిని నియంత్రిస్తుంది. శాస‌న ప్ర‌క్రియ‌ను బ‌లోపేతం చేస్తుంది. స‌మ‌ర్థ పాల‌న‌కు సాయ‌ప‌డే శాస‌నాల‌ను రూపొందిస్తుంది.

 

దేశానికి అవసరమైన శాసనాల రూపకల్పన ప్రక్రియలో పార్లమెంటు తరఫున నిపుణులైన కొంతమంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ కమిటీలకు విశేష ప్రాధాన్యం ఉంది.

లక్షణాలు: * ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. 

* కమిటీ తన నివేదికను సభాధ్యక్షుడికి సమర్పిస్తుంది.

* లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌; రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

* సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.

* కమిటీ సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన కనీస సభ్యుల హాజరు (కోరం) 1/3వ వంతు.

* సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్‌లను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు.

* సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.

 

వర్గీకరణ

భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను పేర్కొనలేదు. కానీ ఆర్టికల్స్‌ 88, 105ల్లో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది. ఇలాంటి కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్‌. వాటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) స్థాయీ కమిటీలు (Standing committee): ఇవి నిరంతరం కొనసాగే కమిటీలు. వీటిలో సభ్యులు మారుతుంటారు.

2) తాత్కాలిక కమిటీలు (Adhoc committee): ఇవి అవసరాన్ని బట్టి వివిధ సందర్భాల్లో ఏర్పాటవుతాయి. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటుచేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించిన తర్వాత రద్దవుతాయి.

 

ఆర్థిక కమిటీలు

ఆర్థిక పరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటులో మూడు కమిటీలు ఉంటాయి. 

 

ప్రభుత్వ ఖాతాల సంఘం (Public accounts committee): ఇది పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీన కమిటీ. దీన్ని మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919 సిఫార్సుల మేరకు 1921లో ఏర్పాటుచేశారు. ఇందులో మొత్తం సభ్యులు 22 మంది. వీరిలో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు నియమితులవుతారు. కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్‌ నియమిస్తారు. నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తారు. 1967 నుంచి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందిన సభ్యుడిని నియమించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

విధులు: * పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం జరుగుతోందా లేదా అనే అంశాన్ని పరిశీలించడం.

* ప్రభుత్వ ఖాతాలపై పార్లమెంటుకు రాష్ట్రపతి సమర్పించే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికను పరిశీలించడం. ఏమైనా అవకతవకలు జరిగాయని నిరూపణయితే బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయడం.

* కాగ్‌ని ప్రభుత్వ ఖాతాల సంఘానికి మిత్రుడు, తాత్వికుడు, మార్గదర్శి అని పేర్కొంటారు.

 

అంచనాల సంఘం (Estimates committee): జాన్‌మతాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఈ సంఘాన్ని 1950లో ఏర్పాటుచేశారు. 1921లో ఏర్పడిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీ తరహాలో ఇది ఏర్పాటైంది. 1956 వరకు ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం దీనిలోని సభ్యుల సంఖ్య 30. వీరంతా లోక్‌సభ సభ్యులే. రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం లేదు. ఛైర్మన్‌ను స్పీకర్‌ నియమిస్తారు.

విధులు: * ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.

* వివిధ పద్దులకు అంచనాలను పార్లమెంటులో ఏ రూపంలో సమర్పించాలో తెలియజేస్తుంది.

* పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తుంది. అందుకే దీన్ని నిరంతర పొదుపు కమిటీగా పేర్కొంటారు.

* ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను ‘పార్లమెంటు కవలలు’గా అభివర్ణిస్తారు.

 

ప్రభుత్వ రంగ సంస్థల సంఘం (Committee on public undertakings): ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అప్పట్లో అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం వి.కె.కృష్ణమీనన్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 1964లో ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 1974 వరకు 15 మంది (లోక్‌సభ 10, రాజ్యసభ 5) సభ్యులు ఉండేవారు. 1974లో ఆ సంఖ్యను 22 మందిగా నిర్దేశించారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. ఛైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు.

విధులు: * ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యం, స్వయంప్రతిపత్తిని పెంపొందించడంలో భాగంగా అనుసరించాల్సిన సూచనలు ఇవ్వడం.

* ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను పరిశీలించడం.

* ప్రభుత్వరంగ సంస్థలపై కాగ్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించడం.

 

సాధారణ కమిటీలు

 

సభా వ్యవహారాల కమిటీ (Business advisory committee): సభా కార్యకలాపాలు, సమయ పట్టికను క్రమబద్ధం చేయడానికి లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా సభా వ్యవహారాల కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలకు సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. లోక్‌సభ వ్యవహారాల కమిటీలో స్పీకర్‌ సహా 15 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ వ్యవహారాల కమిటీలో ఛైర్మన్‌ సహా 11 మంది సభ్యులు ఉంటారు. సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను ఎంపిక చేస్తారు. సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు అందిస్తూ, దానికి సరైన చర్యలు చేపట్టడమే ఈ కమిటీల విధి.

 

ప్రభుత్వ హామీల కమిటీ (Committee on government assurance): 1953లో లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలను ఏర్పాటుచేశారు. లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ రకాల బిల్లులు, తీర్మానాల మీద చర్చ జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయో ఈ కమిటీలు నిరంతరం పరిశీలిస్తాయి.

 

మహిళా సాధికారత కమిటీ (Committee on empowermentt of women): ఇది ఉభయ సభల సంయుక్త కమిటీ. 1997లో ఏర్పాటు చేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 30 (లోక్‌సభ 20, రాజ్యసభ 10). మహిళలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలుతీరును పర్యవేక్షించి నివేదిక రూపొందిస్తుంది. మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్‌ సమర్పించిన నివేదికను పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తుంది. మహిళా సాధికారత, సమానత్వం కోసం చేపట్టే వివిధ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది.

 

షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమ కమిటీ (Committee on welfare of SC, ST): ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30 (లోక్‌సభ 20, రాజ్యసభ 10). ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది. పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976; షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలపై అకృత్యాల నిరోధక చట్టం - 1989కి సంబంధించిన అంశాల అమలును పరిశీలిస్తుంది.

 

నైతిక విలువల కమిటీ (Ethics committee): ఈ కమిటీని రాజ్యసభలో 1997లో ఏర్పాటు చేశారు.సభ్యుల సంఖ్య 10. లోక్‌సభలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీలు పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళిని, అమలుతీరును పరిశీలిస్తాయి. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సభ్యులపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తాయి. పార్లమెంటు సభ్యుల్లో క్రమశిక్షణ, నైతికత పెంపుదలకు అవసరమైన సిఫార్సులు చేస్తాయి. 

 

గ్రంథాలయ కమిటీ (Library comittee): పార్లమెంటు సభ్యులకు గ్రంథాలయ సేవలు అందించడానికి ఈ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిలోని మొత్తం సభ్యులు సంఖ్య 9 మంది (లోక్‌సభ 6, రాజ్యసభ 3).

 

దత్త శాసనాల కమిటీ (Committee on delegated legislation): ఈ కమిటీని నియోజిత శాసనాల కమిటీ అంటారు. 1953లో లోక్‌సభలో, 1964లో రాజ్యసభలో ఏర్పాటు చేశారు. రెండు సభల్లోని ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున సభ్యులు ఉంటారు. పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలు, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను ఇవి పరిశీలిస్తాయి.

 

సభాహక్కుల కమిటీ (Committee on privileges): లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరు సభాహక్కుల కమిటీలు ఉంటాయి. లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. పార్లమెంటు సభ్యుల హక్కులను పరిరక్షిస్తూ, సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై శిక్షలను ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయి. ఇవి అర్ధ న్యాయ సంబంధమైన ్బ్స్య్చ(i ్య్ౖటi‘i్చః్శ అధికారాలను కలిగి ఉంటాయి. 

 

ప్రైవేట్‌ సభ్యుల బిల్లులపై కమిటీ (Committee on private members bills): ఇది లోక్‌సభకు మాత్రమే ఉద్దేశించిన కమిటీ. ఇందులో సభ్యుల సంఖ్య 15. డిప్యూటీ స్పీకర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడం దీని విధి.

 

లాభదాయక పదవుల కమిటీ (Committee on office profit): ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 15 (లోక్‌సభ 10, రాజ్యసభ 5). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో ఏర్పాటుచేసే విచారణ సంఘాల్లో పార్లమెంటు సభ్యులను నియమిస్తే ఆ సంఘాల స్వభావాన్ని పరిశీలించి అవి లాభదాయక సంస్థలా, కాదా అని తేలుస్తుంది. లాభదాయక సంస్థలైతే వాటిలో ఉన్న పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించమని సిఫార్సు చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం ఆదాయాన్ని ఇచ్చే లాభదాయక పదవిని చేపట్టిన పార్లమెంటు సభ్యులు సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు.

 

ప్రముఖల వ్యాఖ్యానాలు

* వివిధ శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. - మారిస్‌ జోన్స్‌

* ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చెవులు, చేతులుగా, కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి. - థామస్‌ రీడ్‌

* ఆధునిక కాలంలో పార్లమెంటరీ కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి. - ఉడ్రోవిల్సన్‌

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 07-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పార్లమెంటు - శాసన నిర్మాణ ప్రక్రియ

మాదిరి ప్ర‌శ్న‌లు
 

1. కింద పేర్కొన్న అంశాల్లో సరైంది?

ఎ) మన దేశం శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటన్‌ నుంచి గ్రహించింది.

బి) చట్టం చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా ప్రతిని బిల్లు అంటారు.

సి) మనదేశంలో ఒక బిల్లు శాసనంగా మారాలంటే 7 దశలను అధిగమించాలి

డి) బిల్లును రాజ్యసభ తిరస్కరిస్తే ప్రభుత్వం రాజీనామా చేయాలి.

1) ఎ, బి, డి   2) ఎ, బి, సి  3) ఎ, సి, డి  4) ఎ, బి, సి, డి


2. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న రోజుల్లో ఒక బిల్లు శాసనంగా రూపొందడానికి కనీసం ఎన్ని రోజుల సమయం పడుతుంది?

1) 12 రోజులు 2) 14 రోజులు  3) 19 రోజులు  4) 21 రోజులు


3. శాసన నిర్మాణంలో అనుసరించాల్సిన విధానాలు, బిల్లుల విధి విధానాలను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు?

1) ఆర్టికల్స్‌ 107 నుంచి 122   2) ఆర్టికల్స్‌ 109 నుంచి 121

3) ఆర్టికల్స్‌ 106 నుంచి 119   4) ఆర్టికల్స్‌ 117 నుంచి 121


4. ఆర్టికల్‌ 108 ప్రకారం సాధారణ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి ఏర్పాటు చేసే పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?

1) ఉపరాష్ట్రపతి  2) ప్రధానమంత్రి  3) లోక్‌సభ స్పీకర్‌  4) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌


5. 1961, మే 6న వరకట్న నిషేధ బిల్లు విషయమై జరిగిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?

1) జి.వి.మౌలాంకర్‌  2) అనంతశయనం అయ్యంగార్‌   3) హుకుం సింగ్‌  4) కె.ఎస్‌.హెగ్డే


6. కిందివాటిలో సరైంది?

ఎ) ఆర్టికల్‌ 109 - ద్రవ్య బిల్లుల ఆమోద ప్రక్రియ 

బి) ఆర్టికల్‌ 110 - ద్రవ్య బిల్లుల నిర్వచనం

సి) ఆర్టికల్‌ 117(1) - మొదటి రకం ఆర్థిక బిల్లులు

డి) ఆర్టికల్‌ 117(3) - రెండో రకం ఆర్థిక బిల్లులు

1) ఎ, బి, సి   2) ఎ, బి, డి  3) ఎ, సి, డి  4) ఎ, బి, సి, డి


7. ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అని ఎవరు ధ్రువీకరిస్తారు?

1) లోక్‌సభ స్పీకర్‌  2) రాజ్యసభ ఛైర్మన్‌  3) రాష్ట్రపతి   4) కేంద్ర ఆర్థిక మంత్రి


8. లోక్‌సభ ఆమోదించి పంపిన ద్రవ్య బిల్లును రాజ్యసభ ఎన్ని రోజుల్లోగా ఆమోదించాలి?

1) 7 రోజులు 2) 12 రోజులు  3) 14 రోజులు  4) 21 రోజులు


9. 1978లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఏర్పాటు చేసిన పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ స్పీకర్‌ ఎవరు?

1) కె.ఎస్‌.హెగ్డే   2) పి.ఎం.సయీద్‌  3) జి.ఎం.సి. బాలయోగి  4) హుకుంసింగ్‌

 

సమాధానాలు

1-2, 2-3, 3-1, 4-3, 5-2, 6-4, 7-1, 8-3, 9-1.


  

Posted Date : 12-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ - నిర్మాణం

ప్రతిష్ఠాత్మక సభలో ప్రజల నేతలు

  పార్లమెంటులో అత్యున్నతమైనది, అత్యంత శక్తిమంతమైనది లోక్‌సభ. ప్రజలు నేరుగా ఎన్నుకున్న నాయకులు ప్రాతినిధ్యం వహించే ప్రతిష్ఠాత్మక వేదిక. శాసన నిర్మాణంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజావాణిని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రజల సభ ఎలా ఉంటుంది? ఇందులోని సభ్యులు, రిజర్వేషన్లు, సభాధ్యక్షుల వివరాలను పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే మన దేశంలో పార్లమెంటులో భాగమైన లోక్‌సభలో మెజార్టీ సాధించినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సభ సభ్యులను ఓటర్లు నేరుగా, నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. లోక్‌సభను దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, మొదటి సభ, అనిశ్చిత సభగా పేర్కొంటారు. దిగువ సభకు ‘లోక్‌సభ’ అని నామకరణం చేసినవారు జి.వి.మౌలాంకర్‌. అందుకే ఈయనను ‘లోక్‌సభ పితామహుడు’గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 లోక్‌సభ నిర్మాణం, ఎన్నిక లాంటి అంశాలను తెలియజేస్తుంది. ఓటు హక్కు ప్రాతిపదికన లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

 

నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82 ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ అనంతరం లోక్‌సభ స్థానాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారు. మన దేశంలో ప్రాదేశిక నియోజకవర్గాల హద్దులను నిర్ణయించడానికి నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను (Delimination Commission) ఏర్పాటుచేస్తారు. ఈ కమిషన్‌ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు.

* 1952లో మొదటి డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 489.  రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ (1962) సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 525.  మూడో డీలిమిటేషన్‌ కమిషన్‌ (1972) సిఫార్సుల మేరకు 31వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973 ద్వారా నిర్ణయించిన లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552.

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81(1)(A) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్యను 530గా,  ఆర్టికల్‌ 81(1)(B) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 20గా పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేయవచ్చు. 

 

మార్పులు

* జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.

* ప్రస్తుతం మన దేశంలోని 28 రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 524. ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 19.

* 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రకారం లోక్‌సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు. ఇది 2020, జనవరి 25 నుంచి అమల్లోకి రావడంతో ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానం రద్దయింది. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543గా పేర్కొనవచ్చు. 

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది.

* అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది.

* ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు.

 

ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు

ఆర్టికల్‌ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, వారి జనాభా ఆధారంగా కొన్ని స్థానాలు రిజర్వ్‌ చేశారు. దీన్ని ప్రారంభంలో 10 సంవత్సరాల వరకే అంటే 1960 వరకు అని పేర్కొన్నారు. లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను కొనసాగించేందుకు ఏడుసార్లు రాజ్యాంగాన్ని సవరించారు. 

1) 8వ రాజ్యాంగ సవరణ చట్టం-1960 ద్వారా 1970 వరకు

2) 23వ రాజ్యాంగ సవరణ చట్టం-1969 ద్వారా 1980 వరకు

3) 45వ రాజ్యాంగ సవరణ చట్టం-1980 ద్వారా 1990 వరకు

4) 62వ రాజ్యాంగ సవరణ చట్టం-1989 ద్వారా 2000 వరకు

5) 79వ రాజ్యాంగ సవరణ చట్టం-1999 ద్వారా 2010 వరకు

6) 95వ రాజ్యాంగ సవరణ చట్టం-2009 ద్వారా 2020 వరకు

7) 104వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా 2030 వరకు

 

4వ డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్‌: 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కుల్‌దీప్‌ సింగ్‌ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్‌ కమిషన్‌ను 2002లో వాజ్‌పేయీ ప్రభుత్వం నియమించింది. షెడ్యూల్డు కులాలు, తెగల జనాభా పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు చేర్పులు చేయాలని ఈ కమిషన్‌ పేర్కొంది. దీనికి అనుగుణంగా 2001 జనాభా లెక్కల ఆధారంగా వాజ్‌పేయీ ప్రభుత్వం 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా లోక్‌సభలో ఎస్సీ రిజర్వు స్థానాలను 79 నుంచి 84కు, ఎస్టీ రిజర్వ్‌ స్థానాలను 41 నుంచి 47కు పెంచింది. ఈ మార్పులు జరిగినప్పటికీ మొత్తం లోక్‌సభ స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదు.

* తెలంగాణలో ఎస్సీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు 3. అవి వరంగల్, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌. ఎస్టీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు ఆదిలాబాద్, మహబూబాబాద్‌

* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు 4. అవి చిత్తూరు, తిరుపతి, అమలాపురం, బాపట్ల. ఎస్టీ రిజర్వు లోక్‌సభ స్థానం అరకు.

 

లోక్‌సభ స్థానాలు 

* రాష్ట్రాల వారీగా

 

* కేంద్రపాలిత ప్రాంతాల వారీగా 

 

స్పీకర్‌ వ్యవస్థ 

ప్రొటెం స్పీకర్‌: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడానికి సభ్యుల్లోని సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా రాష్ట్రపతి నియమిస్తారు. లోక్‌సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేవరకు వారే సభకు అధ్యక్షత వహిస్తారు. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రొటెం స్పీకర్‌ పదవిని ఫ్రాన్స్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ జి.వి.మౌలాంకర్‌.

* 2014లో ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ కమల్‌నాథ్‌.

* 2019లో ఏర్పడిన 17వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్రకుమార్‌.

* లోక్‌సభకు ఎక్కువసార్లు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినవారు బి.డి.దాస్‌ (4 సార్లు), ఇంద్రజిత్‌ గుప్తా (4 సార్లు).

* ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్‌ పదవికి పోటీ చేయాలంటే ప్రొటెం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలి

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌: * మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం సిఫార్సుల ఆధారంగా మన దేశంలో 1921లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఉనికిలోకి వచ్చాయి. ప్రారంభంలో ఈ పదవులను ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్‌గా పేర్కొనేవారు.

* 1921లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ప్రెసిడెంట్‌గా ఫ్రెడరిక్‌ వైట్, వైస్‌ ప్రెసిడెంట్‌గా డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా నియమితులయ్యారు. 1925లో దీనికి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్‌భాయ్‌ పటేల్‌.

* భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్‌ పదవుల పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్పు చేశారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులను బ్రిటన్‌ నుంచి గ్రహించారు.

* బ్రిటన్‌లో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మన దేశంలో అలా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరికీ ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం ఉండదు. స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

*ప్రస్తుత లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీగా ఉంది. 

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల తొలగింపు

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే విధానాన్ని తెలియజేస్తోంది. వీరు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు పదవులనూ కోల్పోతారు. లోక్‌స‌భ స‌భ్యులు ఒక సాధారణ తీర్మానం ద్వారా 14 రోజుల ముందస్తు నోటీసుతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను తొలగించవచ్చు.

* ఆర్టికల్‌ 95 ప్రకారం స్పీకర్‌ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆ విధులను డిప్యూటీ స్పీకర్‌ నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్‌ పదవి కూడా ఖాళీగా ఉంటే లోక్‌సభ నియమాల ప్రకారం సభలోని సభ్యుల్లో అర్హుడైన వ్యక్తిని స్పీకర్‌ విధులను నిర్వహించడానికి రాష్ట్రపతి నియమిస్తారు.

* ఆర్టికల్‌ 96 ప్రకారం స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌ని తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టారో వారు సభకు అధ్యక్షత వహించకూడదు.

* స్పీకర్‌ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో వారు చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ తీర్మానంపై  సాధారణ సభ్యులుగానే ఓటు హక్కు వినియోగించుకోవాలి.

* డిప్యూటీ స్పీకర్‌పై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తన నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్‌ ఓట్‌)ను వినియోగించుకుంటారు. అలాగే స్పీకర్‌పై తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఓటింగ్‌లో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానంగా వస్తే అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ తన నిర్ణయాత్మక ఓటు వినియోగించుకుంటారు.

 

ప్యానల్‌ స్పీకర్లు: ప్యానల్‌ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సమావేశాలకు హాజరుకాని సమయంలో సమావేశాల నిర్వహణకు సభాధ్యక్షులుగా ఉండేందుకు నియమించే వారినే ప్యానల్‌ స్పీకర్లు అంటారు. లోక్‌సభ సమావేశం తొలిరోజునే స్పీకర్‌ 1 నుంచి 6 ప్రాధాన్యంతో ఆరుగురిని ప్యానల్‌ స్పీకర్లుగా నియమిస్తారు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ ఎన్నికలు - ప్రత్యేకతలు

(1 నుంచి 9వ లోక్‌స‌భ వ‌ర‌కు)

సంపూర్ణం నుంచి.. సంకీర్ణం వరకు!

  అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు నిర్దేశంలో దేశపాలన సాగుతుంది. అందులో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులుండే లోక్‌సభ అత్యంత కీలకం. దీనికి పోటీపడిన రాజకీయపార్టీలు, సాధించిన సీట్లు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన నాయకులు, మధ్యంతర ఎన్నికల విశేషాలను పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి. తొలి విడతగా తొమ్మిది లోక్‌సభల ఎన్నికల వివరాలను పరిశీలిస్తే పార్టీలు పొందిన మెజారిటీ తీరు సంపూర్ణం నుంచి సంకీర్ణం దిశగా సాగినట్లు తెలుస్తోంది.

 

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభకు నిష్పక్షపాతంగా, సమర్థంగా ఎన్నికలు నిర్వహించింది. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తుంది.

 

తొలి సమరం -1952

  మొదటి లోక్‌సభ ఎన్నికలు 1951 - 52లో జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణకు నాలుగు నెలల సమయం పట్టింది. 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటుహక్కు కల్పించారు. నాటికి మన దేశ ఓటర్ల సంఖ్య సుమారు 17.3 కోట్లు. ఈ ఎన్నికల్లో 489 స్థానాలకు 17,500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి లోక్‌సభ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడంగా’ విమర్శకులు పేర్కొనగా, ‘విశ్వాసంతో కూడిన చర్య’ అని ఆశావహులు అభివర్ణించారు.

 

రాజకీయ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య
* భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 364
* కమ్యూనిస్టులు, మిత్రపక్షాలు  23
* సోషలిస్ట్‌లు  12
* కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ  9
* హిందూ మహాసభ  4
* జనసంఘ్‌  3
* రామరాజ్యపరిషత్‌  3
* స్వతంత్రులు  41
* ఇతర రాజకీయ పార్టీలు  30

మొత్తం: 489

 

* నమోదైన పోలింగ్‌ 46%, ఎన్నికైన మహిళలు 22 మంది.

* లోక్‌సభ పదవీకాలం 1952, ఏప్రిల్‌ నుంచి 1957 ఏప్రిల్‌ వరకు.

* మొదటి లోక్‌సభకు స్పీకర్‌గా గణేశ్‌వాసుదేవ మౌలాంకర్, డిప్యూటీ స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్‌ వ్యవహరించారు.

* పదవిలో ఉండగా మరణించిన తొలి స్పీకర్‌ జి.వి.మౌలాంకర్‌

* మొదటి లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 

2) 1957

  రెండో లోక్‌సభ ఎన్నికలు 1957లో జరిగాయి. కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 371 స్థానాలు, కమ్యూనిస్టులు 27 స్థానాలు గెలుపొందారు. నమోదైన పోలింగ్‌ 48%. ఎన్నికైన మహిళల సంఖ్య 27. స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్, డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకంసింగ్‌ వ్యవహరించారు. సభా నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ లోక్‌సభ 1957, మే నుంచి 1962, మార్చి వరకు కొనసాగింది.

 

3) 1962

  మూడో లోక్‌సభ ఎన్నికలు 1962లో జరిగాయి. కాంగ్రెస్‌ 361, కమ్యూనిస్టులు 29, జనసంఘ్‌ 14 స్థానాలు గెలుపొందాయి. పోలింగ్‌ 55% నమోదైంది. 34 మంది మహిళలు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా సర్దార్‌ హుకంసింగ్, డిప్యూటీ స్పీకర్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. 1962 ఏప్రిల్‌ నుంచి 1967 మార్చి వరకు సభ పదవీకాలం. సభా నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ మూడోసారి ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1964లో నెహ్రూ మరణించడంతో లాల్‌బహదూర్‌ శాస్త్రి లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని కొనసాగించారు. శాస్త్రి ప్రధాని పదవిలో ఉండగానే తాష్కెంట్‌లో మరణించారు.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడి సీపీఐ(ఎం), సీపీఐ ఏర్పాటయ్యాయి.

 

4) 1967

  నాలుగో లోక్‌సభ ఎన్నికలను 1967లో నిర్వహించారు. కాంగ్రెస్‌ 283, జనసంఘ్‌ 35, సీపీఐ 23, సీపీఐ(ఎం) 19 స్థానాలు గెలిచాయి. 61% పోలింగ్‌ నమోదైంది. 31 మంది మహిళలు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి వ్యవహరించారు. 1969లో ఆయన రాజీనామా చేయడంతో గురుదయాళ్‌ సింగ్‌ ధిల్లాన్‌ స్పీకర్‌ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా కాదిల్‌కర్‌ వ్యవహరించారు. లోక్‌సభ నాయకులుగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడి కాంగ్రెస్‌(ఓ), కాంగ్రెస్‌ (ఆర్‌) గా ఏర్పాటయ్యాయి. 1967 మార్చి నుంచి 1970 డిసెంబరు వరకు ఈ లోక్‌సభ పదవీకాలం కొనసాగింది. ఈ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయి, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్‌ మొదటిసారిగా కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించింది.

 

5) 1971

  దేశంలో మొదటిసారిగా 1971లో అయిదో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఇది మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన మొదటి లోక్‌సభ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 352, భారతీయ జనసంఘ్‌ 22, సీపీఐ 23, సీపీఎం 25 స్థానాలు గెలుపొందాయి. 55% పోలింగ్‌ నమోదైంది. ఎన్నికైన మహిళలు 22 మంది. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ‘ఇందిరాకో హఠావో - భారత్‌కో బచావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. లోక్‌సభా నాయకురాలుగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటుచేశారు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ‘సంపూర్ణ విప్లవాని’కి పిలుపునిచ్చారు.

* ఈ సభాకాలంలోనే 19 రాజ్యాంగ సవరణ చట్టాలు (24 నుంచి 42 వరకు) జరిగాయి. పత్రికలపై ఆంక్షలు, రాజకీయ నాయకుల నిర్బంధాలు కొనసాగాయి.

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించింది. 1971లో ఇందిరాగాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన విధానంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ఆమె ఎన్నిక చెల్లదని 1975లో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఆయుధంగా మలచుకున్న ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టాయి.

* 5వ లోక్‌సభ పదవీకాలం 1971 మార్చి నుంచి 1977 జనవరి వరకు కొనసాగింది. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక కాలం అనగా 5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు కొనసాగిన లోక్‌సభ ఇదే. ఈ కాలంలోనే న్యాయస్థానాలకు ఉన్న న్యాయసమీక్షాధికారంపై పరిమితులు విధించారు. నాటి లోక్‌సభకు స్పీకర్‌గా గురుదయాళ్‌ సింగ్‌ ధిల్లాన్‌ వ్యవహరించారు. ఈయన 1975లో రాజీనామా చేయడంతో బలిరాం భగత్‌ స్పీకర్‌ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.జి.స్వాల్‌ వ్యవహరించారు.

 

6) 1977

  జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, సంస్థా కాంగ్రెస్‌లు ‘జనతా పార్టీ’గా ఏర్పడి పోటీ చేశాయి. ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌’ అనే కొత్త పార్టీ ఏర్పడి జనతా పార్టీకి మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295, కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 154, సీపీఐ 7, సీపీఐ(ఎం) 22 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో 60% పోలింగ్‌ నమోదైంది. 19 మంది మహిళలు ఎన్నికయ్యారు.

* జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్‌ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ, కాంగ్రెసేతర ప్రభుత్వం. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో, చరణ్‌సింగ్‌ ఆ పదవిని చేపట్టారు. అయితే 4 నెలల వ్యవధిలోనే పదవిని కోల్పోయారు. 6వ లోక్‌సభ స్పీకర్‌గా తొలుత నీలం సంజీవరెడ్డి, ఆయన రాజీనామా అనంతరం కె.ఎస్‌.హెగ్డే స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.మురహరి విధులు నిర్వహించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1977 మార్చి నుంచి 1979 ఆగస్ట్‌ వరకు కొనసాగింది. ‘ప్రధాన ప్రతిపక్ష పార్టీ’గా గుర్తింపు పొందాలంటే లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10% స్థానాలు పొందాలని చట్టం ద్వారా నిర్దేశించారు. లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాంగ్రెస్‌కు చెందిన వై.బి.చవాన్‌ గుర్తింపు పొందారు.

 

7) 1980

  ఏడో లోక్‌సభకు 1980లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 353, సీపీఐ 10, సీపీఐ(ఎం) 37, జనతా పార్టీ 31 స్థానాలు గెలుపొందాయి. నమోదైన పోలింగ్‌ 57% కాగా ఎన్నికైన మహిళల సంఖ్య 28. ‘ఇందిరాకో బులావో - దేశ్‌కో బచావో’ అనే నినాదంతో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ఆకర్షించి భారీ విజయం సాధించింది. ఇందిరాగాంధీ లోక్‌సభా నాయకులుగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా జి.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ 1980, జనవరి నుండి 1984 డిసెంబరు వరకు కొనసాగింది. ఈ కాలంలోనే ఇందిరాగాంధీ 1984లో పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ సైనిక చర్యకు ఆదేశింశారు. 1984, అక్టోబర్‌ 31న ఆమెÅ హత్యకు గురయ్యారు. అనంతరం రాజీవ్‌గాంధీ ప్రధాని పదవి చేపట్టారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది.

 

8) 1984

  కాంగ్రెస్‌ 414 స్థానాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 30 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2,  సీపీఐ 6, సీపీఐ(ఎం) 22, జనతా పార్టీ 10 స్థానాలు గెలుపొందాయి. రాజీవ్‌గాంధీ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, 30 స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988 ద్వారా వయోజన ఓటు హక్కు కనీస వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది.  64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ సభ కాలంలోనే రాజీవ్‌గాంధీ బోఫోర్స్, ఫెయిర్‌ఫాక్స్‌ కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ 64%, ఎన్నికైన మహిళలు 44 మంది. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎం.తంబిదొరై వ్యవహరించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1984, డిసెంబరు నుంచి 1989 నవంబర్‌ వరకు కొనసాగింది. 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టం’ను రూపొందించింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్న వి.పి.సింగ్‌ తన పదవికి రాజీనామా చేసి 1988లో జనతాదళ్‌ పార్టీని స్థాపించారు.

 

9) 1989

  తొమ్మిదో లోక్‌సభకు 1989లో ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ 197, జనతాదళ్‌ 143, బీజేపీ 85, సీపీఐ 12, సీపీఐ(ఎం) 33 స్థానాలు గెలుపొందింది. నమోదైన పోలింగ్‌ 62%. ఎన్నికైన మహిళల సంఖ్య 27. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ‘హంగ్‌ పార్లమెంట్‌’ ఏర్పడింది. ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమి ఏర్పాటైంది. జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్‌ను లోక్‌సభా నాయకుడిగా ప్రభుత్వం కొలువుతీరింది. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చాయి. 11 నెలల అనంతరం బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో వి.పి.సింగ్‌ ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం వీగిపోవడంతో ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. అనంతరం జనతాదళ్‌ పార్టీకే చెందిన చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతికాలంలోనే ఆ ప్రభుత్వం కూడా పతనమైంది. ఈ లోక్‌సభ పదవీకాలం 1989 డిసెంబరు నుంచి 1991 మార్చి వరకు కొనసాగింది. స్పీకర్‌గా రబీ రే, డిప్యూటీ స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ వ్యవహరించారు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ ఆర్థిక అత్యవసర పరిస్థితి

 రాష్ట్రపతి-విచక్షణాధికారాలు

  పార్లమెంటు తీర్మానాలు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 26-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ (10 - 17) ఎన్నికలు - విశేషాలు

అస్థిరతను దాటి.. సుస్థిరతకు చేరి!

ఒకే లోక్‌సభా కాలంలో మూడు సంకీర్ణ సర్కారులు పాలించాయి. ఒక్క ఓటు తేడాతో ఒక ప్రభుత్వం పడిపోయింది. విశ్వాస తీర్మానాలను గట్టెక్కలేక ఇంకొన్ని కూలిపోయాయి. క్రమంగా ఆ అనిశ్చితి తొలగింది. బలహీన దశలు దాటి బలమైన స్థితికి పార్టీలు చేరాయి. అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగగలిగిన సంపూర్ణ సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ పది నుంచి పదిహేడో లోక్‌సభ వరకు జరిగిన పరిణామాలు. ఈ అంశాలను అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 

 

భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ దేశ శాసన నిర్మాణంలో అత్యంత కీలకం. ఈ సభలో ఆధిపత్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజకీయపార్టీలు ప్రయత్నిస్తుంటాయి. మొదటి నుంచి తొమ్మిదో లోక్‌సభ వరకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సంపూర్ణంతో మొదలై సంకీర్ణానికి పడిపోయింది. తర్వాత పదో లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీని ఏ పార్టీ సాధించలేదు. పదిహేడో లోక్‌సభకు వచ్చేసరికి స్థిరమైన ప్రభుత్వాలు పాలనలోకి వచ్చాయి. 


10) 1991

పదో లోక్‌సభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ 232, భారతీయ జనతా పార్టీ 129, జనతాదళ్‌ 59, సీపీఐ 14, సీపీఐ(ఎం) 35 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 56%, ఎన్నికైన మహిళల సంఖ్య 39. పి.వి.నరసింహారావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ప్రచార సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. పదో లోక్‌సభ పదవీకాలం 1991, జూన్‌ నుంచి 1996, మే వరకు. స్పీకర్‌గా శివరాజ్‌పాటిల్, డిప్యూటీ స్పీకర్‌గా మల్లికార్జునయ్య వ్యవహరించారు.

* పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రతిపాదించారు. వీటిని ప్రభుత్వం అమలుచేయడంతో భారతదేశ ఆర్థిక ప్రగతి పుంజుకుంది.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1992, డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించారు. 1993, డిసెంబరు 23న ఎంపీ లాడ్స్‌ (Local Area Development Scheme) పథకం ప్రారంభించారు. దీనికింద పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక నిధులు మంజూరవుతాయి.


11) 1996 

పదకొండో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 161, కాంగ్రెస్‌ 140, జనతాదళ్‌ 46, సీపీఐ 12, సీపీఐ(ఎం) 32, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 16 స్థానాలు గెలుపొందాయి. ఈ సభ పదవీకాలం 1996, మే నుంచి 1997, డిసెంబరు. ఈ సభాకాలంలో 3 సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. 1996లో బీజేపీ నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ లోక్‌సభలో మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమై 13 రోజుల్లోనే అధికారం కోల్పోయింది.

* జనతాదళ్‌ ఇతర పార్టీలతో కలిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల మద్దతుతో హెచ్‌.డి.దేవెగౌడ 1996, జూన్‌ 1న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. లోక్‌సభలో దేవెగౌడ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోవడంతో ప్రభుత్వం పతనమైంది.

* ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1997 ఏప్రిల్‌లో అధికారం చేపట్టింది. కానీ కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో ఈ ప్రభుత్వం కూడా 1998 మార్చిలో అధికారం కోల్పోయింది.

* 11వ లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 58%, ఎన్నికైన మహిళల సంఖ్య 40.

* స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా, డిప్యూటీ స్పీకర్‌గా సూరజ్‌భాన్‌ వ్యవహరించారు.

 

12) 1998

పన్నెండో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182, కాంగ్రెస్‌ - 141, సీపీఐ 9, సీపీఐ(ఎం) 32, టీడీపీ 12 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 62%, ఎన్నికైన మహిళల సంఖ్య 43. వాజ్‌పేయీ లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటుచేశారు. ఏఐఏడీఎంకే పార్టీ వాజ్‌పేయీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. దీంతో వాజ్‌పేయీ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం కేవలం ఒక్క ఓటు తేడాతో వీగిపోవడంతో అధికారాన్ని కోల్పోయింది. ఈ సభ పదవీకాలం 1998, మార్చి నుంచి 1999, ఏప్రిల్‌. అంటే కేవలం 13 నెలల 4 రోజులు మాత్రమే కొనసాగింది. స్పీకర్‌గా జి.ఎం.సి.బాలయోగి, డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎం.సయీద్‌ వ్యవహరించారు. బడ్జెట్‌ను సమర్పించే సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు.


13) 1999

పదమూడో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 182, కాంగ్రెస్‌ 114, సీపీఐ 4, సీపీఐ(ఎం) 33, టీడీపీ 29, శివసేన 15 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 59%, ఎన్నికైన మహిళలు 49 మంది. 21 రాజకీయ పార్టీలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి- ఎన్‌డీఏ’ నాయకుడిగా వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ 1999, అక్టోబరు నుంచి 2004, ఏప్రిల్‌ వరకు కొనసాగింది. ఈ సమయంలోనే పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధం జరిగింది. 2001, డిసెంబరు 13న భారత పార్లమెంట్‌పై పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడి చేశారు. 2002లో పోటా చట్టం విషయంలో పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం జరిగింది. భారతదేశం వెలిగిపోతుంది (Shine India) అనే నినాదం ప్రాచుర్యం పొందింది. స్పీకర్‌గా జి.ఎమ్‌.సి.బాలయోగి ఉన్నారు. పదవిలో ఉండగానే ఆయన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. తర్వాత స్పీకర్‌గా మనోహర్‌ జోషి వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా పి.ఎం.సయీద్‌ ఉన్నారు.


 14) 2004

పద్నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 145, బీజేపీ 138, సీపీఐ 10, సీపీఐ(ఎం) 43, టీఆర్‌ఎస్‌ 5, టీడీపీ 5, శివసేన 12 స్థానాలు గెలిచాయి. నమోదైన పోలింగ్‌ 58%, ఎన్నికైన మహిళలు 45 మంది. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌) వినియోగించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ)గా ఏర్పడి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్‌ ఛటర్జీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా చరణ్‌జిత్‌ సింగ్‌ అతవాల్‌ వ్యవహరించారు. 2004, మే నుంచి 2009, మే వరకు ఈ సభ కొనసాగింది. ఈ కాలంలో రాష్ట్రపతి (డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం), ఉప రాష్ట్రపతి (హమీద్‌ అన్సారీ), ప్రధాని (మన్మోహన్‌ సింగ్‌) ముగ్గురూ మైనార్టీ వర్గానికి చెందినవారే.


* భారత్, అమెరికా మధ్య 123 పేరిట ‘పౌర అణు ఒప్పందం’ కుదిరింది. ఈ ఒప్పందంపై ఓటింగ్‌ సమయంలో తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి పార్లమెంటు సభ్యులు కొందరు లంచం తీసుకున్నారు. ఈ ఓటుకు నోటు కుంభకోణం 2008, జులై 22న వెలుగులోకి వచ్చింది. ఈ సభాకాలంలో 2005లో గృహహింస చట్టం ఆమోదం పొందింది. అది 2006, అక్టోబరు 26 నుంచి అమల్లోకి వచ్చింది. జాతీయ సమాచార హక్కు చట్టం-2005 అదే ఏడాది అక్టోబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం-2005 రూపొంది 2006, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది.


15) 2009

పదిహేనో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 206, బీజేపీ 116, తృణమూల్‌ కాంగ్రెస్‌ 19, తెలుగుదేశం పార్టీ 6, టీఆర్‌ఎస్‌ 2, సీపీఐ 4, సీపీఐ(ఎం) 16 స్థానాలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో 58% పోలింగ్‌ నమోదవగా, 59 మంది మహిళలు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వం మన్మోహన్‌ సింగ్‌ అధ్యక్షతన రెండోసారి అధికారాన్ని చేపట్టింది. ఆహార భద్రతా బిల్లు, లోక్‌పాల్‌ బిల్లు, నిర్భయ బిల్లు చట్టాలుగా మారాయి. 6 - 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలకు ‘ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యాహక్కు చట్టం-2009 రూపొంది 2010, ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సభ 2009, మే నుంచి 2014 మే వరకు కొనసాగింది. ఈ కాలంలో కేవలం 165 బిల్లులు ఆమోదం పొందాయి. స్పీకర్‌గా మీరాకుమార్‌ (లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌), డిప్యూటీ స్పీకర్‌గా కరియా ముండా వ్యవహరించారు.


16) 2014

పదహారో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 336 స్థానాలు గెలుపొందింది. ఈ కూటమిలో బీజేపీ 282, శివసేన 18, తెలుగుదేశం 16, లోక్‌ జనశక్తి 6, శిరోమణి అకాలీదళ్‌ 4 స్థానాలు గెలుపొందాయి. ఇతర పార్టీల్లో టీఆర్‌ఎస్‌ 11, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ 9, ఏఐఏడీఎంకే 37, తృణమూల్‌ కాంగ్రెస్‌ 34 స్థానాలు సాధించాయి. ఈ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ 66%. ఎన్నికైన మహిళల సంఖ్య 62. స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, డిప్యూటీ స్పీకర్‌గా తంబిదొరై వ్యవహరించారు. లోక్‌సభా నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సభ పదవీకాలం 2014, మే నుంచి 2019, మే.


17) 2019

పదిహేడో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 353 స్థానాలు సాధించింది. 

కూటమిలో పార్టీల వారీగా సీట్లు (నాడు ఎన్నికల అనంతరం)

* భారతీయ జనతా పార్టీ - 303

* శివసేన - 18

* జనతాదళ్‌ (యునైటెడ్‌) - 16

* లోక్‌జనశక్తి పార్టీ - 6

* అప్నాదళ్‌ పార్టీ - 2

* శిరోమణి అకాలీదళ్‌ - 2

* ఏఐఏడీఎంకే - 1

* రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ - 1

* నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ - 1

* నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ - 1

* మిజో నేషనల్‌ ఫ్రంట్‌ - 1

* ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ - 1

 

యూపీఏ కూటమి 91 స్థానాలు సాధించింది. 

పార్టీల వారీగా సాధించిన సీట్లు

* భారతీయ జాతీయ కాంగ్రెస్‌ - 52

* ద్రవిడ మున్నేట్ర కజగం - 23

* నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ - 5 

* ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ - 3

* జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్పరెన్స్‌ - 3

* జనతాదల్‌ (సెక్యులర్‌) - 1

* ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా - 1

* కేరళ కాంగ్రెస్‌ - 1

* రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ - 1

* విథుతలై చిరుత్తైగల్‌ కచ్చి - 1


ఇతర పార్టీలు గెలిచిన స్థానాలు

* ఆలిండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ - 22

* వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ - 22

* బిజూ జనతాదళ్‌ - 12

* తెలంగాణ రాష్ట్ర సమితి - 9

* తెలుగుదేశం పార్టీ - 3

 

17వ లోక్‌సభ 2019, జూన్‌ 7న ఏర్పడి ప్రస్తుతం కొనసాగుతోంది. స్పీకర్‌గా ఓం ప్రకాశ్‌ బిర్లా వ్యవహరిస్తున్నారు. ఈయన రాజస్థాన్‌లోని ‘కోట’ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 1.04% నోటా ఓట్లు నమోదయ్యాయి. నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 17వ లోక్‌సభకు మొదటిసారిగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 267, ఈ సభకు ఎన్నికైన ముస్లిం ఎంపీల సంఖ్య 27.


17వ లోక్‌సభకు స్వతంత్రులుగా నలుగురు ఎన్నికయ్యారు.

1) సుమలత (మాండ్యా - కర్ణాటక)

2) నాబాకుమార్‌ సరోనియో (కోక్రాజర్‌ - అస్సాం)

3) నవనీత్‌ కౌర్‌ (అమరావతి - మహారాష్ట్ర)

4) సంజీభాయ్‌ థేల్కర్‌ (దాద్రానగర్‌ హవేలి)

 

 వైశాల్యపరంగా దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గాలు

* లద్దాఖ్‌ - జమ్మూ కశ్మీర్‌ (1,73,266 చ.కి.మీ.)

* బార్మర్‌ - రాజస్థాన్‌ (76,601 చ.కి.మీ.)

* కచ్‌ - గుజరాత్‌ (41,644 చ.కి.మీ.)

 

అతిచిన్నవి

* చాందినీ చౌక్‌ - దిల్లీ (10.59 చ.కి.మీ.)

* వాయవ్య కోల్‌కతా - పశ్చిమ బెంగాల్‌ (13.23 చ.కి.మీ.)

* దక్షిణ ముంబై - మహారాష్ట్ర (13.73 చ.కి.మీ.)


రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣ లోక్‌సభ ఎన్నికలు - ప్రత్యేకతలు (1 నుంచి 9వ లోక్‌స‌భ వ‌ర‌కు)

 రాష్ట్రప‌తి - అత్య‌వ‌స‌ర అధికారాలు

 భారత పార్లమెంట్ - లోక్‌సభ

 కేంద్ర‌మంత్రి మండ‌లి

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యసభ

సమాఖ్య స్ఫూర్తికి.. శాసనాల సమగ్రతకు!

 

మేధోమథనాలు, విస్తృత చర్చల మధ్య సిద్ధమయ్యే చట్టసభల బిల్లుల్లో ఇంకా ఏమైనా లోపాలు, పొరపాట్లు ఉంటే సరిదిద్దే సమున్నత బాధ్యతను ఎగువసభ తలకెత్తుకుంటుంది. శాసనాల రూపకల్పన, ఆమోదాల్లో దిగువసభ తొందరపాటును, ఆవేశాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. ప్రత్యక్ష రాజకీయాలతో ప్రమేయంలేని కొందరు మేధావులు, వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులు ఈ శాశ్వత సభలో భాగస్వాములుగా ఉండటం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి సమగ్ర ప్రాతినిధ్యం లభిస్తుంది. రాష్ట్రాల మండలిగా సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.  

 

పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభ దేశ శాసన నిర్మాణంలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోంది.పెద్దల సభగా ప్రసిద్ధి చెందిన ఈ సభలో మేధావులు, వివిధ రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. దిగువ సభ అయిన లోక్‌సభ చేసే చట్టాలను అవసరమైన సమయాల్లో రాజ్యసభ నియంత్రిస్తుంది. బ్రిటిష్‌ పార్లమెంట్‌లోని ఎగువ సభ ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’ (ప్రభువుల సభ) అంతటి బలహీనమైంది కాదు మన రాజ్యసభ. అదేవిధంగా అమెరికా శాసన వ్యవస్థలో ఎగువ సభ ‘సెనేట్‌’ అంతటి బలమైనదీ కాదు. అమెరికా సెనేట్‌లో ఆ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ మన దేశంలో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆయా రాష్ట్రాల జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

 

నిర్మాణం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. ఇందులో గరిష్ఠంగా 250 మంది సభ్యులు ఉండవచ్చు. ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో రాష్ట్రాల నుంచి 225 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం కలిగిన 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి ఈ సభకు నామినేట్‌ చేస్తారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాల్లోని శాసనసభల సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నుకుంటారు. ఆ ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్లు కేటాయించారు. దీనికి నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నికలు జరగవు. ఈ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల రాజ్యసభను ‘రాష్ట్రాల మండలి’గా పేర్కొంటారు. 

 

నిరంతర సభ: శాశ్వత సభగా వ్యవహరించే రాజ్యసభ మొత్తం సభ్యుల ఎన్నిక ఒకేసారి జరగదు. అలాగే వీరు ఒకేసారి పదవీ విరమణ కూడా చేయరు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3వ వంతు మంది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. అంతే సంఖ్యలో కొత్తవారు ఎన్నికవుతారు.

ఆర్టికల్‌ 84 ప్రకారం రాజ్యసభకు ఎన్నికయ్యేవారికి కింది అర్హతలు ఉండాలి.

అర్హతలు: 

భారతీయ పౌరుడై ఉండాలి.

30 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

భారతదేశంలోని ఏదైనా పార్లమెంటు నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి.

 

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్‌-3 ప్రకారం ఒక వ్యక్తి రాజ్యసభకు ఒక రాష్ట్రం నుంచి ఎన్నిక కావాలంటే, సంబంధిత రాష్ట్ర నివాసి అయి ఉండాలని పేర్కొన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 2003లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, ఒక వ్యక్తి ఏ రాష్ట్ర నివాసితుడు అయినప్పటికీ, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా రాజ్యసభకు ఎన్నిక కావచ్చని నిర్దేశించారు.

 

రాజ్యసభ ఛైర్మన్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ‘ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌’గా వ్యవహరిస్తారు. ఈయన రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహిస్తారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు. సభా నియమాలను పాటించని సభ్యులను శిక్షిస్తారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన కనీస సభ్యుల హాజరు (కోరం) 1/10వ వంతును ధ్రువీకరిస్తారు. సభలో ప్రవేశపెట్టిన బిల్లులపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వస్తే అధ్యక్ష స్థానంలో ఉండి ‘నిర్ణాయక ఓటు’ను వినియోగించుకొని బిల్లును గెలిపించగలరు లేదా ఓడించగలరు. రాజ్యసభలో పబ్లిక్, ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇస్తారు. రాజ్యసభకు తొలి ఛైర్మన్‌గా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. ప్రస్తుత చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖఢ్‌.

 

డిప్యూటీ ఛైర్మన్‌: రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఈయన పదవీకాలాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్ధారించకపోయినప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినంత కాలం అంటే 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. రాజ్యసభకు మొదటి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌. ఈ పదవికి ఇప్పటివరకు ముగ్గురు మహిళలు ఎన్నికయ్యారు. వారు వయోలెట్‌ అల్వా, ప్రతిభా పాటిల,్ నజ్మాహెప్తుల్లా.

 

రాజీనామా - తొలగింపు: రాజ్యసభ ఛైర్మన్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. డిప్యూటీ ఛైర్మన్‌ తన రాజీనామాను ఛైర్మన్‌కు పంపించాలి. రాజ్యసభ ఛైర్మన్‌ను పార్లమెంటు, డిప్యూటీ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందస్తు నోటీసు ఇచ్చి సాధారణ మెజార్టీతో తొలగించవచ్చు. ఛైర్మన్‌/డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభకు అధ్యక్షత వహించకూడదు. కానీ సభా సమావేశాల చర్చల్లో పాల్గొని తమ వివరణ ఇచ్చుకోవచ్చు.

 

ప్రత్యేక అధికారాలు

ఆర్టికల్‌ 67(b) ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.

ఆర్టికల్‌ 249(1) ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి జాతీయ ప్రాధాన్యం ఉందని రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే, దానిపై పార్లమెంటు శాసనం చేస్తుంది. ఆ విధంగా రూపొందిన శాసనం దేశం మొత్తానికి లేదా దేశంలోని కొంత భాగానికి వర్తిస్తుంది.

ఉదా: 1952లో దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, వాణిజ్యాలను క్రమబద్ధం చేయడానికి రాజ్యసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

ఆర్టికల్‌ 312 ప్రకారం రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు ‘నూతన అఖిల భారత సర్వీసుల’ను ఏర్పాటు చేస్తూ శాసనాన్ని రూపొందిస్తుంది. 

 

ఆర్టికల్‌ 312 ప్రకారం ఇంతవరకు రాజ్యసభ ఆమోదించిన తీర్మానాలు: 

1961లో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్, ఇండియన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇంజినీర్స్, ఇండియన్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌. 

1965లో ఇండియన్‌ అగ్రికల్చర్‌ సర్వీసెస్, ఇండియన్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌. వీటిలో ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ను మాత్రమే 1966లో ఆలిండియా సర్వీసుల్లో చేర్చారు. 

ఆర్థిక, కార్యనిర్వాహకవర్గాన్ని నియంత్రించే అంశాలు మినహా మిగిలిన అన్ని అంశాల్లో రాజ్యసభకు లోక్‌సభతో సమానమైన అధికారాలు ఉన్నాయి.

ఉదా: 1961లో వరకట్న నిషేధ బిల్లును రాజ్యసభ తిరస్కరించింది. 1970లో స్వదేశీ సంస్థానాధిపతుల హక్కుల రద్దు బిల్లుకు ఆమోదం ఇవ్వలేదు. 1978లో బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/రద్దు బిల్లును, గుంటూరులో ఉన్న టొబాకో బోర్డును మరో ప్రదేశానికి మార్చడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ అంగీకరిచలేదు. 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించినప్పుడు అందులోని 7 అంశాలను రాజ్యసభ వ్యతిరేకించగా, వాటిని తొలగించింది. ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన’, ఆర్టికల్‌ 356 ప్రకారం ‘రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ప్రకటన’, ఆర్టికల్‌ 360 ప్రకారం ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన’ లాంటివి అమల్లోకి రావాలంటే రాజ్యసభ అనుమతి తప్పనిసరి. ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో, రాజ్యసభలోని మొత్తం సభ్యులు (ఎన్నికైన, నామినేటెడ్‌) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో ఓటర్లుగా ఉంటారు.

 

సభానాయకుడు

రాజ్యసభలో ప్రభుత్వం తరఫున సభానాయకుడిగా ఒకరు వ్యవహరిస్తారు. మొదటి సభా నాయకుడిగా ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభకు సభానాయకుడిగా పీయూష్‌ గోయల్‌ కొనసాగుతున్నారు. రాజ్యసభకు అత్యధిక కాలం సుమారు 10 సంవత్సరాలు (2004 నుంచి 2014 వరకు) సభా నాయకుడిగా మన్మోహన్‌ సింగ్‌ వ్యవహరించారు.

 

ప్రధాన ప్రతిపక్షం

1967లో కాంగ్రెస్‌(ఓ) పార్టీకి చెందిన శ్యాంనందన్‌ మిశ్రాను రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ధ్రువీకరించారు. 1977లో భారత పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుర్తింపునిచ్చే చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లభించాలంటే సభలోని మొత్తం స్థానాల్లో 1/10వ వంతు స్థానాలు పొంది ఉండాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకు కేంద్ర కేబినెట్‌ మంత్రికి లభించే వసతి, హోదా లభిస్తాయి. ఈ చట్టం చేసిన అనంతరం రాజ్యసభలో గుర్తింపు పొందిన మొదటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కమలాపతి త్రిపాఠి (1977) నిలిచారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా కాంగ్రెస్‌కు చెందిన మల్లిఖార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు.

శుక్రవారం - ప్రైవేటు మెంబర్‌ బిల్లు: పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి శుక్రవారం రాజ్యసభలో ‘రెండున్నర గంటల పాటు’ ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చించేందుకు అవకాశం కల్పిస్తారు.

రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణకు సెక్రటేరియట్‌ ఉంటుంది. రాజ్యసభకు మొదటి సెక్రటరీ జనరల్‌ ఎస్‌.ఎన్‌.ముఖర్జీ, ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ ప్రమోద్‌ చంద్ర.

 

రాజ్యసభలో సీట్ల కేటాయింపులు 

1. ఆంధ్రప్రదేశ్‌ - 11

2. తెలంగాణ - 7

3. పశ్చిమ బెంగాల్‌ - 16

4. మధ్యప్రదేశ్‌ - 11

5. రాజస్థాన్‌ - 10

6. బిహార్‌ - 16

7. ఒడిశా - 10

8. తమిళనాడు -18

9. అస్సాం - 7

10. కేరళ - 9

11. కర్ణాటక - 12

12. ఝార్ఖండ్‌ - 6

13. ఉత్తరాఖండ్‌ - 3

14. ఛత్తీస్‌గఢ్‌ - 5

15. గోవా - 1

16. అరుణాచల్‌ప్రదేశ్‌ - 1

17. మణిపుర్‌ - 1

18. మేఘాలయ - 1

19. మిజోరం - 1

20. హిమాచల్‌ ప్రదేశ్‌ - 3

21. హరియాణా - 5

22. సిక్కిం - 1

23. త్రిపుర - 1

24. పంజాబ్‌ - 7

25. నాగాలాండ్‌ - 1

26. మహారాష్ట్ర - 19

27. గుజరాత్‌ - 11

28. ఉత్తర్‌ప్రదేశ్‌ - 31

 

కేంద్రపాలిత ప్రాంతాలు

1. దిల్లీ - 3

2. పాండిచ్చేరి - 1

3. జమ్మూ-కశ్మీర్‌ - 4

 

ఎగువ సభ ఎందుకు?

మారిస్‌జోన్స్‌ తన గ్రంథమైన ‘ది గవర్నమెంట్‌ అండ్‌ పాలిటిక్స్‌ ఆఫ్‌ ఇండియా’లో రాజ్యసభకు సంబంధించి మూడు ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు.

లోక్‌సభ తొందరపాటుతో చేసే శాసనాలను పునరాలోచన చేసి లోటుపాట్లను సరిచేయడానికి, సవరించడానికి తోడ్పడుతుంది.

అవసరం ఉన్న, ప్రాధాన్యం కలిగిన అదనపు రాజకీయ పదవులను రాజ్యసభ సమకూరుస్తుంది.

శాసన నిర్మాణపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి, అభిలషణీయమైన శాసనాల రూపకల్పనకు తోడ్పడుతుంది.

 

‘ఎగువ సభ ఉదాత్తమైన చర్చలు జరుపుతుంది. క్షణికమైన ఆవేశాల వల్ల జరిగే శాసన నిర్మాణాన్ని ఆలస్యం చేస్తుంది. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండే మేధావులు, విజ్ఞానవేత్తలు ఈ సభా కార్యకలాపాల్లో పాల్గొని, తమ విద్యా, విజ్ఞానాల ప్రయోజనాన్ని దేశానికి అందజేయడానికి అవకాశం కల్పిస్తుంది’. - ఎన్‌.గోపాలస్వామి అయ్యంగార్‌ (రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడు)

 

- రచయిత: బంగారు సత్యనారాయణ
 

Posted Date : 11-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గవర్నర్‌

సమాఖ్య వ్యవస్థకు సంరక్షకులు!

  రాష్ట్రాలకు తొలి పౌరులు. కేంద్రానికి ప్రతినిధులు. పదవీ కాలానికి పరిమితులు లేవు. పాలన అంతా వారి పేరు మీదే జరుగుతుంది. అయినా నిర్ణయాల్లోని లోపాలకు బాధ్యత ఉండదు. న్యాయస్థానాల ద్వారా ప్రశ్నించే వీలులేదు. విచక్షణ మేరకు వ్యవహరిస్తారు. అలా అని అధికారాలు అపరిమితం కాదు. అలంకారప్రాయం అంతకంటే కాదు. అన్నింటికీ మించి సమాఖ్య వ్యవస్థకు సంరక్షకులుగా విధులు నిర్వహిస్తారు.

 

భారత రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్ర స్థాయిలోనూ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రాష్ట్రాధినేతగా గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. పరిపాలన అంతా గవర్నర్‌ పేరు మీద జరుగుతుంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్‌ వ్యవహరిస్తారు. రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరించారు. అందులో గవర్నర్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్‌ జనరల్‌ అంతర్భాగంగా ఉంటారు. 

 

రాజ్యాంగ వివరణ

 

ఆర్టికల్‌ 153: ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్‌ ఉంటారు. 

  అయితే జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం రూపొందించి, రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తి గవర్నర్‌గా వ్యవహరించవచ్చని నిర్దేశించారు.

 

ఆర్టికల్‌ 154: గవర్నర్‌ రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారు. రాష్ట్రాధినేత, రాష్ట్ర ప్రథమ పౌరుడు. రాజ్యాంగం ద్వారా తనకు లభించిన అధికారాలను  స్వయంగా లేదా తన కింది అధికారుల ద్వారా అమలు చేస్తారు.

 

ఆర్టికల్‌ 155: రాజ్యాంగ ముసాయిదా ప్రతిపై చర్చ జరిగినప్పుడు గవర్నర్‌ను ఎన్నుకోవాలా లేదా నియమించాలా అనే అంశంపై అనేక వాదనలు తలెత్తాయి. గవర్నర్‌ను ఓటర్లే ప్రత్యక్షంగా ఎన్నుకోవాలని రాజ్యాంగ సభ సలహాదారుడైన బి.ఎన్‌.రావు ప్రతిపాదించారు. కానీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడైన డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌ గవర్నర్‌ను నియమించే పద్ధతినే బలపరిచి దాన్నే అమలుచేయాలని తీర్మానించారు. అందుకు కింది కారణాలను పేర్కొన్నారు.

* గవర్నర్‌ ఓటర్ల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికైతే రాష్ట్రస్థాయిలో రెండు రకాల అధికార కేంద్రాలు ఏర్పడి పరిపాలనలో సమన్వయం లోపిస్తుంది. దీనివల్ల ముఖ్యమంత్రితో విభేదాలు వస్తాయి. 

* గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించడం వల్ల రాష్ట్రంపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది.

* రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్నే అమలు చేస్తుండటం వల్ల గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలే ఉంటాయి. అందుకే ఎన్నిక అవసరం లేదు.

* గవర్నర్‌ పదవికి ఎన్నిక నిర్వహిస్తే ఆ పదవి పార్టీ రాజకీయ ప్రేరేపితమవుతుంది. దానివల్ల గవర్నర్‌ నిష్పాక్షికంగా, స్వతంత్రంగా పనిచేయలేరు.

* గవర్నర్‌ నియామకం విషయంలో మన రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగ నమూనాను అనుసరించారు. దాని ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

 

సర్కారియా కమిషన్‌ సిఫార్సులు

జస్టిస్‌ రంజిత్‌ సింగ్‌ సర్కారియా ఆధ్వర్యంలోని కమిషన్‌ గవర్నర్లకు సంబంధించి కొన్ని సిఫార్సులు చేసింది. 

* ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.

* క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేనివారిని, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే నియమించాలి.

* గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.

* సాధ్యమైనంత వరకు మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను నియమించాలి.

* విశిష్ట వ్యక్తిత్వం, ఏదైనా రంగంలో ప్రావీణ్యం ఉన్నవారిని నియమించాలి.

 

ఆర్టికల్‌ 156: సాధారణంగా గవర్నర్‌ పదవీకాలం 5 సంవత్సరాలు. కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారు.

* రాష్ట్రపతి ఎప్పుడైనా గవర్నర్‌ను పదవి నుంచి తొలగించవచ్చు లేదా వేరే రాష్ట్రానికి బదిలీ చేయవచ్చు.

* పదవీకాలం ముగియక ముందే గవర్నర్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు.

* గవర్నర్‌ పదవికి ఆకస్మికంగా ఖాళీ ఏర్పడితే సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు.

 

అభీష్ట సూత్రం: గవర్నర్‌ను తొలగించేందుకు మహాభియోగ తీర్మానం లేదా మరే ఇతర పద్ధతిని రాజ్యాంగంలో పేర్కొనలేదు. రాష్ట్రపతి ఎలాంటి కారణం తెలియజేయకుండానే గవర్నర్‌ను తొలగించవచ్చు. దీన్నే అభీష్ట సూత్రం అంటారు.

 

బి.పి.సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 2010: గవర్నర్‌ ప్రవర్తన సరిగ్గా లేదనే ఆరోపణలు వచ్చిప్పుడు, ఏవైనా అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు తలెత్తినప్పుడు, అవి రుజువైతేనే పదవి నుంచి తొలగించాలి. సరైన కారణాలు లేకుండా గవర్నర్‌ను పదవి నుంచి తప్పించకూడదని 2010, మే 7న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 

సూర్యనారాయణ్‌ చౌదరి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు, 1982: రాజ్యాంగంలో గవర్నర్‌ను తొలగించడానికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను నిర్దేశించలేదు. కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు రాష్ట్రపతి ద్వారా గవర్నర్‌ను పదవి నుంచి తొలగిస్తుంది. రాష్ట్రపతి అభీష్ట సూత్రాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ఆర్టికల్‌ 157: గవర్నర్‌గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలను వివరిస్తుంది.

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

* గరిష్ఠ వయసు పరిమితిని పేర్కొనలేదు.

 

ఆర్టికల్‌ 158: గవర్నర్‌గా నియమితులయ్యే వారికి సంబంధించిన షరతులు, జీతభత్యాలు, నివాస భవనం గురించి ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది. 

షరతులు: * పార్లమెంటు, రాష్ట్ర శాసనవ్యవస్థలో ఏ సభలోనూ సభ్యుడై ఉండకూడదు. ఒకవేళ చట్టసభలో సభ్యత్వం ఉంటే గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి దాన్ని కోల్పోయినట్లుగానే పరిగణిస్తారు. 

* ఎలాంటి లాభదాయకమైన పదవిని నిర్వహించకూడదు. 

* కోర్టు ద్వారా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటితమై ఉండకూడదు.

జీతభత్యాలు: * ఆర్టికల్‌ 158(3) ప్రకారం గవర్నర్‌ జీతభత్యాలు, ఇతర సౌకర్యాలను పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. రాజ్యాంగంలోని రెండో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా గవర్నర్‌కు జీతభత్యాలు అందుతాయి.

* ప్రస్తుతం గవర్నర్‌ నెల జీతం రూ.3,50,000. దీన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

* ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తే అతడి జీతభత్యాలను సంబంధిత రాష్ట్రాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రాలు ఏ నిష్పత్తిలో చెల్లించాలనే విషయాన్ని రాష్ట్రపతి నిర్దేశిస్తారు.

* గవర్నర్‌ నివాసాన్ని రాజ్‌భవన్‌ అంటారు.

 

ఆర్టికల్‌ 159: ‘రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించి పరిరక్షిస్తాను. రాజ్యాంగ విలువలకు లోబడి నా విధులను నిర్వర్తిస్తాను. ఎలాంటి రాగద్వేషాలకు లోబడకుండా నా పదవీ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తాను’ అని గవర్నర్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

 

చట్టపరమైన రక్షణలు 

రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలు, విధులు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వర్తించడానికి; రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి పాలన సాగించే విధంగా చూసేందుకు రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని చట్టపరమైన రక్షణలను కల్పించింది.

* అధికార హోదాలో గవర్నర్‌ తీసుకున్న ఏ చర్యకు లేదా గవర్నర్‌ తీసుకున్నట్లుగా భావించే ఏ నిర్ణయానికైనా వ్యక్తిగతంగా బాధ్యులను చేయకూడదు.

* తన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపే విధివిధానాలకు, ఆ సందర్భంగా చేసే నిర్ణయాల్లోని లోటుపాట్లకు సంబంధించి గవర్నర్‌ ఎవరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

* తన అధికార హోదాలో పదవీ నిర్వహణలో భాగంగా గవర్నర్‌ చేపట్టిన ఏ చర్యకు, కార్యక్రమానికి గవర్నర్‌పై చట్టపరంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు.

* పదవిలో ఉన్న గవర్నర్‌పై ఏ న్యాయస్థానం క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించకూడదు.

* గవర్నర్‌ అరెస్ట్‌కు లేదా జైలుకు పంపేందుకు న్యాయస్థానం ఎలాంటి చర్యలను చేపట్టకూడదు.

* గవర్నర్‌పై సివిల్‌ కేసులను నమోదు చేయాలంటే కనీసం రెండు నెలలు ముందుగా నోటీసు అందించాలి.

* రాజ్యాంగపరమైన హోదాలో రాష్ట్రపతికి, గవర్నర్‌కు కొన్ని విషయాల్లో ప్రధానమైన తేడాలు ఉన్నాయి

- రాజ్యాంగం గవర్నర్‌కు కొన్ని సందర్భాల్లో విచక్షణాధికారాన్ని ఇస్తుంది. కానీ రాష్ట్రపతికి అలాంటి అధికారాన్ని ఇవ్వలేదు.

- ఏదైనా విషయం తన విచక్షణలోకి వస్తుందా లేదా అనే అంశంలో గవర్నర్‌ నిర్ణయమే అంతిమం. తద్వారా గవర్నర్‌ నిర్వర్తించిన ఏ పనిని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించకూడదు.

ఉదా: * రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం.

* రాష్ట్రపతి పరిశీలనకు రాష్ట్ర బిల్లులను రిజర్వ్‌ చేయడం.

* రాష్ట్ర పరిపాలన, శాసన సంబంధమైన విషయాలపై సమాచారాన్ని ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకోవడం.

 

రాష్ట్రపతి ఆదేశంతో గవర్నర్‌కు లభించే బాధ్యతలు: రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేసినప్పుడు గవర్నర్‌కు నిర్దిష్టమైన, ప్రత్యేకమైన బాధ్యతలు లభిస్తాయి. వాటిని రాజ్యాంగం ప్రకారం తన విచక్షణ మేరకు గవర్నర్‌ నిర్వహిస్తారు. 

ఉదా: * మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు.

* గుజరాత్‌లో సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక బోర్డుల ఏర్పాటు.

* సిక్కింలో వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, శాంతి భద్రతలను నెలకొల్పడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.

* మణిపుర్, అస్సాం రాష్ట్రాల్లో కొండ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాల పరిపాలనకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం.

 

గవర్నర్, రాష్ట్రపతి మధ్య వ్యత్యాసాలు

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 27-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

గవర్నర్‌ - అధికారాలు, విధులు

సలహాలు పాటిస్తూ.. విచక్షణ వినియోగిస్తూ!

  సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల అధిపతులుగా వ్యవహరించే గవర్నర్‌లకు రాజ్యాంగం పలురకాల అధికారాలను అప్పగించింది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వంలోని కీలక పదవులకు గవర్నర్‌ నియామకాలు జరుపుతారు. పరిపాలన రాజ్యాంగబద్ధంగా సాగే విధంగా పర్యవేక్షిస్తారు. మంత్రిమండలి సలహా మేరకు పాలన సాగిస్తారు. అవసరమైన సందర్భాల్లో విచక్షణాధికారాలను వినియోగిస్తారు. పాలనా యంత్రాంగం విఫలమై రాష్ట్రపతి పాలన విధిస్తే వాస్తవ కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.  అందుకే రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ పదవికి సంబంధించిన అధికారాలు, విధులపై పోటీ పరీక్షార్థులకు అవగాహన అవసరం. 

 

  గవర్నర్‌ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలన్నీ గవర్నర్‌ పేరు మీదే జరుగుతాయి. రాష్ట్రానికి ప్రథమ పౌరులు. సందర్భానుసారం రాజ్యాంగపరంగా అధికారాలను వినియోగిస్తారు.

 

కార్యనిర్వాహక అధికారాలు

 

ఆర్టికల్‌ 154: గవర్నర్‌ రాష్ట్రాధినేత, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వాహణాధికారి. రాష్ట్ర పరిపాలన గవర్నర్‌ పేరు మీద నిర్వహించాలి. 

 

ఆర్టికల్‌ 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది. 

 

ఆర్టికల్‌ 164(1): శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ సాధించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.

* మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో తప్పనిసరిగా గిరిజన సంక్షేమ మంత్రిని నియమించడం సంబంధిత రాష్ట్రాల గవర్నర్ల బాధ్యత. 94వ రాజ్యాంగ సవరణ చట్టం, 2006 ద్వారా గిరిజన సంక్షేమ మంత్రిని రాష్ట్ర మంత్రివర్గంలో తప్పనిసరిగా ఉండాలనే నియమం నుంచి బిహార్‌ను తొలగించి ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకే పరిమితం చేశారు.

కీలకమైన పదవులకు నియామకాలు: గవర్నర్‌ రాష్ట్రంలోని మరికొన్ని కీలకమైన పదవులకు నియామకాలు జరుపుతారు. 

 

ఆర్టికల్‌ 165 - రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడైన రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ 

 

ఆర్టికల్‌ 316 - రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

 

ఆర్టికల్‌ 243 (i) - రాష్ట్ర ఆర్థిక సంఘానికి ఛైర్మన్, సభ్యులు

 

ఆర్టికల్‌ 243 (k) - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

 

ఆర్టికల్‌ 233 - రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు దిగువస్థాయి న్యాయస్థానాలకు న్యాయమూర్తులు.

- రాష్ట్రస్థాయిలో లోకాయుక్తకు ఛైర్మన్, సభ్యులు.

- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు గవర్నర్‌ తాను కులపతి (ఛాన్సలర్‌)గా వ్యవహరిస్తూ, ఉపకులపతులను (వైస్‌ ఛాన్సలర్లు) నియమిస్తారు.

- రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు

- రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు

- రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు

- రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులు

- రాష్ట్ర అధికార భాషా సంఘానికి ఛైర్మన్, సభ్యులు

- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లకు ఛైర్మన్, సభ్యులు

 

శాసనాధికారాలు

 

ఆర్టికల్‌ 168 - గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం. శాసనసభ అంటే గవర్నర్, విధాన సభ, విధాన పరిషత్తు (ఒకవేళ విధాన పరిషత్తు ఉంటే) అని అర్థం.

 

ఆర్టికల్‌ 171 - కళలు, సాహిత్యం, సామాజిక సేవా రంగాల్లో ప్రావీణ్యం ఉన్న విశిష్ట వ్యక్తులను విధాన పరిషత్తులోని మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు నామినేట్‌ చేస్తారు.

 

ఆర్టికల్‌ 174 - శాసనసభ సమావేశాలను ప్రారంభించడం (సమన్స్‌), దీర్ఘకాలంపాటు వాయిదా వేయడం (ప్రొరోగ్‌), విధానసభ రద్దు (డిజాల్వ్‌) లాంటి అధికారాలను కలిగి ఉంటారు. 

 

ఆర్టికల్‌ 175 - శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

ఆర్టికల్‌ 176 - శాసనసభకు ప్రత్యేక సందేశాలను పంపవచ్చు.

 

ఆర్టికల్‌ 186 - విధానసభకు ప్రొటెం స్పీకర్‌ను నియమిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ అందుబాటులో లేనప్పుడు సభా సమావేశాల నిర్వహణకు సభలోని సభ్యుల్లో ఒకరిని నామినేట్‌ చేస్తారు.

 

ఆర్టికల్‌ 192 - కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు.

 

ఆర్టికల్‌ 200 - శాసనసభ ఆమోదించిన బిల్లులు గవర్నర్‌ ఆమోదముద్రతో చట్టాలుగా మారతాయి.

*శాసనసభ పంపిన సాధారణ బిల్లులను గవర్నర్‌ ఆమోదించవచ్చు. పునఃపరిశీలనకు పంపవచ్చు. అయితే పునఃపరిశీలన అనంతరం వచ్చిన బిల్లులను గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదించాలి.

 

ఆర్టికల్‌ 201 - రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల్లో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని భావిస్తే వాటిని గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపుతారు.

 

ఆర్టికల్‌ 213 - ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారం.

*రాష్ట్ర శాసనసభ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సిఫారసుల మేరకు గవర్నర్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 213 ప్రకారం ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు. అది చట్టంతో సమానం.

 

ఆర్డినెన్స్‌ గరిష్ఠ జీవితకాలం: శాసనసభ సమావేశమైన ఆరు వారాలు లేదా ఆరు నెలల ఆరు వారాలు లేదా 7 1/2 నెలలు లేదా 222 రోజులు. గవర్నర్‌ జారీ చేసే ఆదేశం ఆ గడువులోగా శాసనసభ ఆమోదం పొందితే చట్టంగా మారుతుంది. లేకపోతే రద్దవుతుంది.

 

ఆర్టికల్‌ 333 - రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేస్తారు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రకారం ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు. ఇది 2020, జనవరి 25 నుంచి అమల్లోకి వచ్చింది.

* రాష్ట్ర స్థాయిలో బిల్లుల ఆమోదం విషయంలో విధానసభ, విధానపరిషత్తుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేసే అధికారం గవర్నర్‌కు లేదు.

 

సుప్రీంకోర్టు తీర్పులు

ఆర్‌.ఎ.మెహతా వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసు (2013): గవర్నర్‌ తన పరిపాలన, అధికారాల నిర్వహణలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర మంత్రిమండలికి ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

 

నంబూద్రి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు (1962): రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌ ఎంతకాలంలోగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఎలాంటి కాలపరిమితి లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

 

ఆర్థికాధికారాలు

 

ఆర్టికల్‌ 199 - ఆర్థిక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.

 

ఆర్టికల్‌ 202 - రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గవర్నర్‌ అనుమతితోనే శాసనసభలో ప్రవేశపెట్టాలి.

 

ఆర్టికల్‌ 293 - రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రుణాలు సేకరించాలంటే సంబంధిత బిల్లులను గవర్నర్‌ అనుమతితోనే శాసనసభలో ప్రవేశపెట్టాలి.

 

ఆర్టికల్‌ 243 (i) - అయిదేళ్లకొకసారి రాష్ట్ర ఆర్థికసంఘాన్ని ఏర్పాటు చేస్తారు.

 

ఆర్టికల్‌ 267(2) - రాష్ట్ర అసంఘటిత నిధి (contingency fund of the state) గవర్నర్‌ నియంత్రణలో ఉంటుంది.

* రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వార్షిక నివేదికను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీఏజీ) గవర్నర్‌కు సమర్పిస్తారు. ఆ నివేదికను గవర్నర్‌ రాష్ట్ర శాసనసభకు పంపుతారు

 

న్యాయాధికారాలు

ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌కు క్షమాభిక్ష/న్యాయాధికారాలు ఉంటాయి. మరణ శిక్షలు, సైనిక కోర్టులు విధించే శిక్షలు, కేంద్రం శాసనాలు ధిక్కరించడం వల్ల విధించిన శిక్షలు మినహాయించి మిగిలిన అన్ని శిక్షలకు రాష్ట్రపతి మాదిరిగానే గవర్నర్‌ క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. 

* Pardon-  క్షమాభిక్షను ప్రసాదించడం

* Communication-  శిక్షలో మార్పు 

* Remmesssion-  శిక్ష రకంలో మార్పు

* Respite - శిక్షా కాలంలో మార్పు

* Reprieve - శిక్ష అమలు వాయిదా

* గవర్నర్‌ క్షమాభిక్ష అధికారాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికే పరిమితం.

* పదవీ కాలంలో చేపట్టిన పనులకు, పదవీ విరమణ అనంతరం దేశంలోని ఏ న్యాయస్థానానికీ గవర్నర్‌ బాధ్యులు కాదు.

* ఆర్టికల్‌ 233 ప్రకారం గవర్నర్‌ జిల్లా కోర్టులకు న్యాయమూర్తులను నియమిస్తారు.

 

విచక్షణ అధికారాలు

* రాష్ట్ర విధాన సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం సగాని కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.

* విధానసభ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే గవర్నర్‌ తన విచక్షణతో ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఆ విధంగా నియమితులైన ముఖ్యమంత్రి నిర్ణీత గడువులోగా విధానసభలో తన విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. లేకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు.

 

మంత్రిమండలి రద్దు విషయంలో:  విధాన సభలో మెజార్టీ కోల్పోయిన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలిని రద్దు చేసే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుంది. గవర్నర్‌ విధాన సభ సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే మంత్రిమండలిని రద్దు చేసిన సందర్భాలున్నాయి.

ఉదా: 1984లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి, నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ రాంలాల్‌ నియమించారు. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో రాంలాల్‌ను పదవి నుంచి తొలగించారు.

 

శాసనసభ రద్దు విషయంలో: శాసనసభ కాలపరిమితి పూర్తికాకుండానే గవర్నర్‌ శాసనసభను రద్దు చేయవచ్చు. శాసనసభను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చేసిన సిఫారసును గవర్నర్‌ పాటించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

ఉదా:  * 1985లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు, మంత్రిమండలి సిఫారసు మేరకు నాటి గవర్నర్‌ శంకర్‌దయాళ్‌ శర్మ శాసనసభను రద్దు చేశారు. 

* 1994లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను రద్దు చేయాలని నాటి ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు సిఫారసు చేశారు. కానీ అప్పటి గవర్నర్‌ కె.కృష్ణకాంత్‌ తిరస్కరించారు.

* 2004లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సిఫారసు మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన సభను  నాటి గవర్నర్‌ సూర్జిత్‌సింగ్‌ బర్నాలా రద్దు చేశారు.

* 2018లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మంత్రిమండలి సిఫారసును అనుసరించి అప్పటి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శాసన సభను రద్దుచేశారు. 

 

రాష్ట్రపతి పాలనకు సిఫార్సు (ఆర్టికల్‌ 356): ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనా, శాంతిభద్రతలు క్షీణించినా, తరచూ ప్రభుత్వం పడిపోతున్నా, రాజకీయ అస్థిరత ఏర్పడినా సంబంధిత రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాల్లో వాస్తవ కార్యనిర్వాహణాధికారాలను గవర్నర్‌ నిర్వర్తిస్తారు.

 

* కొన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రత్యేక అధికారాలుంటాయి. ఆ మేరకు సంబంధిత రాష్ట్రాల అభివృద్ధికి ఆ గవర్నర్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

 

ఆర్టికల్‌ 371 - మహారాష్ట్రలోని విదర్బ, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి బోర్డుల ఏర్పాటు.

 

ఆర్టికల్‌ 371 (A) - నాగాలాండ్‌లోని కొండప్రాంతాల అభివృద్ధి, శాంతిభద్రతలు

 

ఆర్టికల్‌ 371 (B) - అస్సాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

 

ఆర్టికల్‌ 371 (C) - మణిపుర్‌లోని కొండ ప్రాంతాల అభివృద్ధి

 

ఆర్టికల్‌ 371 (D) - సిక్కింలో శాంతిభద్రతల పరిరక్షణ

 

ఆర్టికల్‌ 371(E) - మిజోరంలో కొండప్రాంతాల అభివృద్ధి

 

ఆర్టికల్‌ 371 (F) - అరుణాచల్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిరక్షణ

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

ప్ర‌స్తుత రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌ల వివ‌రాలు

Posted Date : 03-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ముఖ్యమంత్రి - రాష్ట్ర మంత్రిమండలి

సమస్తం.. సమున్నతం!

  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ప్రజా సంక్షేమం, పురోగతి పూర్తిగా మంత్రిమండలి పరిధిలోనే ఉంటుంది. అందులో ఒకరు నాయకులై నిర్దేశిస్తే, సలహాలు-సూచనలతో సభ్యుల బృందం సమష్టిగా యంత్రాంగాన్ని నడిపిస్తుంది. ఆ నిర్ణయాలకు తిరుగు ఉండదు. అధికారానికి అడ్డులేదు. విధానాల రూపకల్పన నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు సమస్త విషయాల్లోనూ వాస్తవ అధికారంతో సమున్నత పాలనాకేంద్రంగా క్యాబినెట్‌ వ్యవహరిస్తుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆ అంశాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. 

 

  రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవ అధిపతి ముఖ్యమంత్రి. ఆ పదవిని చేపట్టే వారి సమర్థత, పనితీరు, వ్యక్తిత్వంపై ప్రగతి ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడిగా వ్యవహరిస్తూ, పరిపాలనను నిర్వహిస్తారు.

 

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్స్‌ 163, 164, 167 ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రిమండలి (క్యాబినెట్‌) గురించి వివరిస్తాయి. జాతీయ స్థాయిలో ఉన్నట్లే, రాష్ట్రస్థాయిలో కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని  రాజ్యాంగ నిర్మాతలు ప్రవేశపెట్టారు. ఆ ప్రకారం రాష్ట్రస్థాయిలో రాష్ట్రాధినేత అయిన గవర్నర్‌కు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారాలు ఉంటే, ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికి వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.

 

ఆర్టికల్, 163(1): గవర్నర్‌కు పరిపాలనలో సహకరించేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది.

 

ఆర్టికల్, 163(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి పదవీకాలం గవర్నర్‌/విధానసభవిశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది.

ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి కింది కారణాల వల్ల పదవి కోల్పోతుంది.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం ఓడిపోయినప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులు తిరస్కరణకు గురైనప్పుడు.

* విధానసభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన కోత తీర్మానాలు నెగ్గినప్పుడు.

* విధానసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఓడిపోయినప్పుడు.

* ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరణించినా, పదవికి రాజీనామా చేసినా, ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించినా మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది.

 

నియామకాలు

ఆర్టికల్‌ 164(1): విధానసభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత సగం కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీ నాయకుడిని/రాజకీయ పార్టీల కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమిస్తారు. ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు మంత్రివర్గ సహచరులను నియమిస్తారు.

 

ఆర్టికల్‌ 164(2): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.

 

ఆర్టికల్‌ 164(3): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి విధానసభకు సమష్టిగా బాధ్యత వహింస్తుంది.

 

ఆర్టికల్‌ 164(4): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు గవర్నర్‌ సమక్షంలో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారు.

 

ఆర్టికల్‌ 164(5): ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులు కావాలంటే శాసనసభలో సభ్యత్వం ఉండాలి. ఒకవేళ సభ్యత్వం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా/రాష్ట్ర మంత్రిగా నియమితులైతే 6 నెలల్లోగా శాసనసభలో సభ్యత్వం పొందాలి. లేకపోతే వారు పదవిని కోల్పోతారు.

 

ఆర్టికల్‌ 164(6): ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 167(1): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన మంత్రివర్గ నిర్ణయాలను, మంత్రిమండలి జరిపిన తీర్మానాలను గవర్నర్‌కు ముఖ్యమంత్రి తెలియజేయాలి.

 

ఆర్టికల్‌ 167(2): రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని తనకు తెలియజేయాలని గవర్నర్‌ ముఖ్యమంత్రిని కోరవచ్చు. గవర్నర్‌కు, రాష్ట్ర మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు.

 

ఆర్టికల్‌ 167(3): గవర్నర్‌ ఆమోదం కోసం ఏదైనా బిల్లు/ తీర్మానం వచ్చినప్పుడు దాన్ని మొత్తం మంత్రిమండలి సమగ్రంగా పరిశీలించలేదని గవర్నర్‌ భావిస్తే సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని మంత్రిమండలి పునఃపరిశీలనకు పంపవచ్చు. మంత్రిమండలి సంబంధిత బిల్లు/ తీర్మానాన్ని పునఃసమీక్షించి/సమీక్షించకుండా రెండోసారి గవర్నర్‌ ఆమోదముద్రకు పంపితే, తప్పనిసరిగా ఆమోదించాలి. 

 

ముఖ్యమంత్రి అధికారాలు - విధులు

* రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతిగా వ్యవహరిస్తారు.

* రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటులో తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటారు. తన పార్టీలో లేదా సంకీర్ణ ప్రభుత్వమైతే భాగస్వామ్య పార్టీల్లో కొందరు సభ్యులను ఎంపిక చేసుకుని వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసి, వారు మంత్రులుగా నియమితులయ్యే విధంగా చూస్తారు. మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రిమండలి పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై గవర్నర్‌కు సలహా ఇస్తారు. రాష్ట్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి సమావేశాల అజెండాను నిర్దేశిస్తారు.

* శాసనసభకు ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు, కార్యక్రమాలను శాసనసభలో ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాల్లో, శాసనసభ బయట ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు ఎంతో ప్రభావం ఉంటుంది.

* రాష్ట్ర పరిపాలనకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. మంత్రిమండలికి, గవర్నర్‌కు మధ్య వారధిగా ఉంటారు. 

పదవీరీత్యా కింద పేర్కొన్న సంస్థల్లో ముఖ్యమంత్రి సభ్యులుగా ఉంటారు.

* జాతీయ అభివృద్ధి మండలి

* జాతీయ సమగ్రతా మండలి

* నీతి ఆయోగ్‌ 

* జాతీయ జనాభా కమిషన్‌

* అంతర్‌ రాష్ట్ర మండలి

* జోనల్‌ కౌన్సిల్‌ (ప్రాంతీయ మండలి)

* రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

రాష్ట్ర మంత్రిమండలి

రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉంటారు.

* ఆర్టికల్‌ 164(1)(ఎ) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. చిన్న రాష్ట్రాల్లో మంత్రుల సంఖ్య 12 మంది కంటే తక్కువ ఉండకూడదు.

* ఆర్టికల్‌ 164(1)(బి) ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన శాసనసభ్యులను ఎలాంటి లాభదాయక పదవిలోనూ నియమించకూడదు.

* ఆర్టికల్స్‌ 164 (1)(ఎ), 164(1)(బి)లను 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2003) రాజ్యాంగానికి చేర్చారు.

 

మంత్రిమండలి - అధికారాలు, విధులు

 

ప్రభుత్వ విధానాల రూపకల్పన: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధానాలను రూపొందించి, అమలుచేసే బాధ్యత ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలికి ఉంటుంది. ప్రజల సంక్షేమం కోసం రూపొందించే విధానాలపై మంత్రిమండలి లోతుగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది.


రాష్ట్ర పరిపాలన: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను రాష్ట్ర మంత్రిమండలి నిర్వహిస్తుంది. ప్రభుత్వ విధానాల ప్రకారం శాసనసభ ఆమోదించిన తీర్మానాలను అనుసరించి మంత్రివర్గ సభ్యులు పరిపాలన సాగిస్తారు. ప్రతి మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి లేదా అంతకుమించిన శాఖల పరిపాలనపై నియంత్రణ, బాధ్యత కలిగి ఉంటారు.


సమన్వయ సాధన:  రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మధ్య మంత్రిమండలి సమన్వయాన్ని పెంపొందిస్తుంది. ఒకవేళ మంత్రుల మధ్య సమన్వయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన లోపభూయిష్టంగా మారుతుంది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులంతా ఏకగ్రీవంగా ఆమోదించి, అమలు చేస్తారు.


శాంతి భద్రతల పరిరక్షణ: ఇది రాష్ట్ర జాబితాలోని అంశం. ప్రజల ప్రాణాలను పరిరక్షించి శాంతిభద్రతలను నెలకొల్పడం, సాధారణ ప్రజానీకం శాంతియుత సహజీవనాన్ని సాగించే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

 

శాసన నిర్మాణంలో పాత్ర: రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన శాసనాల రూపకల్పనలో రాష్ట్ర మంత్రిమండలి కీలకపాత్ర పోషిస్తుంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు సంబంధించిన విషయాలన్నింటినీ మంత్రిమండలి నిర్ణయిస్తుంది. శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం మంత్రిమండలి శాసనాల రూపకల్పనలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. శాసనసభ సమావేశాల తేదీల నిర్ణయం, సమావేశాల ప్రారంభం, కొనసాగింపు, దీర్ఘకాలిక వాయిదాలకు సంబంధించిన విషయాలపై రాష్ట్ర మంత్రిమండలి గవర్నర్‌కు సలహాలిస్తుంది.

 

నియామక అధికారాలు: రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరినీ గవర్నర్‌ పేరుతో మంత్రిమండలి నియమిస్తుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి అభీష్టం చెల్లుబాటవుతుంది. మంత్రిమండలి ద్వారా జరిగే నియామకాల్లో అడ్వకేట్‌ జనరల్, విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు, లోకాయుక్త, ఉపలోకాయుక్త మొదలైన కీలక పదవులు ఉంటాయి.

 

సమష్టి బాధ్యతా సూత్రాన్ని పాటించడం: ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్ర శాసనసభ/ విధానసభకు సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాల్లో రాష్ట్ర మంత్రిమండలి ఒక సమష్టి జట్టుగా వ్యవహరిస్తుంది. శాసనసభలో విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర మంత్రిమండలి కొనసాగుతుంది.

 

గవర్నర్‌కు వ్యక్తిగత బాధ్యతను వహించడం: రాష్ట్ర మంత్రిమండలి సభ్యులందరూ తమ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై గవర్నర్‌కు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగించే ఉపన్యాస సారాంశాన్ని మంత్రిమండలి రూపొందిస్తుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన సలహాలు, సహాయాన్ని గవర్నర్‌కు అందిస్తుంది.

 

ఆర్థికపరమైన విధులు: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై మంత్రిమండలికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విత్త విధానాన్ని మంత్రిమండలి నిర్ణయిస్తుంది. రాష్ట్ర ప్రగతికి అవసరమైన వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, విద్యావిధానం, ప్రణాళికల రూపకల్పన మొదలైన బాధ్యతలను మంత్రిమండలి నిర్వహిస్తుంది. శాసనసభ ఆమోదించిన వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలుచేస్తుంది.

 

కొన్ని ముఖ్యాంశాలు 

* తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి - కె. చంద్రశేఖర్‌రావు (టీఆర్‌ఎస్‌)

* దేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి - సుచేత కృపలానీ (ఉత్తర్‌ప్రదేశ్‌) (ఐఎన్‌సీ) 

* దేశంలో రెండో మహిళా ముఖ్యమంత్రి - నందినీ శతపతి (ఒడిశా) (ఐఎన్‌సీ)

* మొదటి కాంగ్రెసేతర మహిళా ముఖ్యమంత్రి - శశికళా గురుదత్‌ కకోద్కర్‌ (గోవా) (మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ)

* దక్షిణాదిలో తొలి మహిళా ముఖ్యమంత్రి - జానకీ రామచంద్రన్‌ (తమిళనాడు) (ఏఐఏడీఎంకే)

* ఈశాన్య రాష్ట్రాల్లో తొలి మహిళా ముఖ్యమంత్రి - సయ్యద్‌ అన్వర్‌ తైమూర్‌ (అస్సాం) (ఐఎన్‌సీ)

* దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి (ఉత్తర్‌ప్రదేశ్‌) (బీఎస్పీ)

* దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌)

* దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించినవారు - పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ (25 ఏళ్లు) (సిక్కిం)

* అతి తక్కువకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించింది - జగదాంబికా పాల్‌ (2 రోజులు) (ఉత్తర్‌ప్రదేశ్‌)

* పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి - షేక్‌ అబ్దుల్లా (జమ్ము-కశ్మీర్‌)

* రాష్ట్ర శాసనసభలో ‘సీఎం అవర్‌’ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి - దిగ్విజయ్‌ సింగ్‌ (మధ్యప్రదేశ్‌)

* హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి, చివరి ముఖ్యమంత్రి - బూర్గుల రామకృష్ణారావు

* ప్రస్తుతం పదవిలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి - మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)

* శాసనసభలో సభ్యత్వం లేకుండా ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, తర్వాత జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఓడిపోయి పదవి కోల్పోయినవారు - త్రిభువన్‌ నారాయణ్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌),  శిబూ సోరెన్‌ (ఝార్ఖండ్‌)

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 29-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్ర శాసనసభ

విధాన నిర్ణయాల విశిష్ట వేదిక!

  ఒక శాసనం ప్రజల అవసరాలను ప్రతిబింబిచాలి. సంక్షేమాన్ని కాంక్షించాలి. అందుకోసం ఎన్నో సమాలోచనలు సాగాలి. చర్చలు జరగాలి. అందరి అభిప్రాయాలు వ్యక్తం కావాలి. సమతౌల్యత సాధించాలి. అంతిమంగా అత్యుత్తమైన నిర్ణయం వెలువడాలి. ఈ ప్రక్రియకు జాతీయస్థాయిలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధానంగా విధానసభ అలాంటి విధాన నిర్ణయాలకు విశిష్ట వేదికగా నిలిచింది. ఆ అత్యున్నత సభ నిర్మాణం, సభ్యుల ఎన్నిక, ఇతర రాజ్యాంగపరమైన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

రాష్ట్రస్థాయిలో రాష్ట్రానికి అవసరమైన శాసనాలను రూపొందించే అత్యున్నత వ్యవస్థ శాసన సభ. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రజాస్వామ్య విధానాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది.

 

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 168 నుంచి 212 మధ్య రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అధికారాలు, విధులు, సభ్యుల ఎన్నిక, అర్హతలు, అనర్హతల గురించి పేర్కొన్నారు.

 

ఆర్టికల్‌ 168: ప్రతి రాష్ట్రానికి ఒక శాసన సభ ఉంటుంది. అదే రెండు సభలు ఉన్నప్పుడు గవర్నర్‌ + విధాన సభ + విధాన పరిషత్‌గానూ, ఒకే సభ ఉన్నప్పుడు గవర్నర్‌ + విధానసభగానూ ఉంటుంది. గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా కొనసాగుతారు. కానీ శాసన సభలో సభ్యత్వం ఉండదు.

 

విధానసభ

దీన్ని దిగువసభ, ప్రజాప్రతినిధుల సభ, శాసనసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 విధానసభ గురించి వివరిస్తుంది.

* 1950 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర విధానసభలో ఉండాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 60. గరిష్ఠ ఎమ్మెల్యేల సంఖ్య 500.

* జనాభా తక్కువ ఉన్న చిన్న రాష్ట్రాల్లో కనీస ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.

ఉదా: సిక్కిం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 32. గోవా విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40. మిజోరం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40.

* రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు) సంబంధిత రాష్ట్ర జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

* ప్రస్తుతం మనదేశంలో విధానసభల సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా నిర్ణయించింది.

* ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014’లోని సెక్షన్‌ 26 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేల సంఖ్యను 225కి, తెలంగాణ విధానసభలో ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల సంఖ్యను 153కి పెంచే అవకాశం కల్పించారు. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేదు.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 29 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 7 స్థానాలు రిజర్వు చేశారు.

* ప్రస్తుతం తెలంగాణ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 119. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 19 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 12 స్థానాలు రిజర్వు చేశారు.

 

సభ్యుల అర్హతలు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 173 రాష్ట్ర విధానసభ/శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటుంది. అవి 

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 25 ఏళ్లు నిండి ఉండాలి.

* లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* కాలానుగుణంగా పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.

* సభ్యులు దివాలా తీసినట్లుగా న్యాయస్థానం ప్రకటించి ఉండకూడదు.

* మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ జరిగి ఉండకూడదు.

 

ఎన్నికల ప్రక్రియ: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధాన సభలకు కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతాయి. ఏ రాజకీయ పక్షానికి చెందనివారు కూడా ‘స్వతంత్ర అభ్యర్థులు’గా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

 

ఎలక్షన్‌ మేనిఫెస్టో: ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని (ఎలక్షన్‌ మేనిఫెస్టో) ప్రకటిస్తాయి. ఈ మేనిఫెస్టోలో తాము ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో, ఏయే వాగ్దానాలను నెరవేరుస్తారో తమ నియోజక వర్గ ప్రజలకు తెలియజేస్తూ హామీ ఇస్తారు. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునేందుకు ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ దోహదం చేస్తుంది.

 

పోలింగ్‌ నిర్వహణ: ఎన్నికల రోజు ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ఓటు వేస్తారు. పోలింగ్‌ బూత్‌ అధికారి (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ - పీఓ) ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. సాధారణంగా ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. ఓటు హక్కును ఓటర్లు రహస్యంగా వినియోగించుకోవాలి

 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌

 

కంట్రోల్‌ యూనిట్‌: కంట్రోల్‌ యూనిట్‌లో ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలట్‌ బటన్‌ నొక్కగానే ఓటు వేసేందుకు ఈవీఎమ్‌ సిద్ధంగా ఉంటుంది. బ్యాలట్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగానే కంట్రోల్‌ యూనిట్‌పై ఉన్న బల్బు ఆగిపోయి, అదే సమయంలో ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి, ఓటు నమోదవుతుంది.

 

బ్యాలట్‌ యూనిట్‌: ఇది మూడు విధాలుగా ఉంటుంది.

ఎ) యంత్రం మీద ‘ఆకుపచ్చ రంగు బల్బు’ వెలుగుతున్నట్లయితే ఓటు వినియోగించుకోవడానికి ఈవీఎం సిద్ధమని అర్థం.

బి) ఓటరు అభ్యర్థి గుర్తుకి ఎదురుగా ఉన్న ‘నీలం రంగు బటన్‌’ను గట్టిగా నొక్కాలి.

సి) నీలం రంగు బటన్‌ను నొక్కగానే దానికి ఎదురుగా ఉన్న ‘ఎరుపు రంగు బల్బు బటన్‌’ వెలిగి, ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి ఓటు నమోదవుతుంది.

 

ప్రమాణ స్వీకారం: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 188 పేర్కొంటుంది. వీరు గవర్నర్‌ సమక్షంలో లేదా గవర్నర్‌ నియమించిన వ్యక్తి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో ఉదహరించిన విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

 

ప్రొటెం స్పీకర్‌: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా గవర్నర్‌ నియమిస్తారు. ఆ వ్యక్తి గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.  మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో జరుగుతుంది.

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌: * విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 178 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉంటారు. విధానసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తప్పనిసరిగా విధానసభలో సభ్యులై ఉండాలి.

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ స్పీకర్‌ - తమ్మినేని సీతారాం

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ డిప్యూటీ స్పీకర్‌ - కోలగట్ల వీరభద్రస్వామి

* హైదరాబాద్‌ రాష్ట్ర విధానసభకు తొలి, చివరి స్పీకర్‌ - కాశీనాథ్‌రావు వైద్య

* మన దేశంలో విధానసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ - షాణోదేవి (హరియాణా)

 

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తొలగింపు: * రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు ప్రక్రియను వివరిస్తుంది.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే తీర్మానాన్ని ఎమ్మెల్యేలు 14 రోజుల ముందస్తు నోటీసుతో విధాన సభలో ప్రవేశపెడతారు. విధాన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు) సాధారణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ విధానసభ/ శాసనసభలో సభ్యత్వం కోల్పోతే పదవులను కూడా కోల్పోతారు.

* స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

* విధానసభ స్పీకర్‌పైన గానీ, డిప్యూటీ స్పీకర్‌పైనగానీ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరిపై తీర్మానం ప్రవేశపెడతారో వారు సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అవిశ్వాస తీర్మానంపై/ తొలగింపు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో వీరు విధానసభ సమావేశాలకు హాజరుకావచ్చు. చర్చ పాల్గొనవచ్చు. సాధారణ సభ్యుల్లా సభలో ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

 

సభలో సభ్యత్వం కోల్పోవడం

ఆర్టికల్‌ 191(1) ప్రకారం కింది సందర్భాల్లో శాసన సభ్యులు తమ పదవిని కోల్పోతారు. 

* విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత స్పీకర్‌ దాన్ని ఆమోదించినప్పుడు.

నోట్‌: విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పంపిన రాజీనామా పత్రాన్ని సంబంధిత వ్యక్తి స్వచ్ఛందంగా రాసింది కాదని, విశ్వసించదగినది కాదని స్పీకర్‌ భావిస్తే అలాంటి రాజీనామాను ఆమోదించరు. ఈ నియమాన్ని 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విధానసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగితే స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

* విధానసభ సభ్యులు ఎవరైనా సభాధ్యక్షుడి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సభా సమావేశాలకు గైర్హాజరైతే వారు పదవి కోల్పోతారు.

* ఆర్టికల్‌ 190 ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో విధానసభలో ఎమ్మెల్యేగా, విధాన పరిషత్తులో ఎమ్మెల్సీగా ఉండకూడదు. అంటే ద్వంద్వ సభ్యత్వానికి అనుమతి లేదు.

* ఆర్టికల్‌ 193 ప్రకారం చట్టసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా సభా సమావేశాల్లో పాల్గొనడం, ఓటు వేయడం నిషేధం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి సభలో ఎన్ని రోజులు ప్రవేశించారో అన్నిరోజులకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.

 

స్పీకర్‌ అధికారాలు - విధులు

* విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులను శిక్షించడం.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యుల అనర్హతలను ప్రకటించడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అని ధ్రువీకరించడం.

* అర్థన్యాయాధికారాలను కలిగి ఉండటం.

* సభా వ్యవహారాల కమిటీ, రూల్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించడం.

* సభా కార్యక్రమాల నిర్వహణ, వాయిదా వేయడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తన నిర్ణాయక ఓటు/ కాస్టింగ్‌ ఓటు/ కొసరు ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

* విధానసభ సభ్యులకు రక్షణ కల్పించడం. విధాన సభ్యులను పోలీసులు అరెస్టు చేయాలంటే ముందుగా స్పీకర్‌ నుంచి అనుమతి పొందాలి.

* సభా సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన ‘కోరం’ను స్పీకర్‌ ధ్రువీకరిస్తారు.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విధానసభల్లో ఎమ్మెల్యేల సంఖ్య 


1. ఉత్తర్‌ప్రదేశ్‌ - 403 


2. పశ్చిమ బెంగాల్‌ - 294


3. మహారాష్ట్ర - 288


4. బిహార్‌ - 243


5. తమిళనాడు - 234


6. మధ్యప్రదేశ్‌ - 230


7. కర్ణాటక - 224


8. రాజస్థాన్‌ - 200


9. గుజరాత్‌ - 182


10. ఆంధ్రప్రదేశ్‌ - 175


11. ఒడిశా - 147


12. కేరళ - 140


13. అస్సాం - 126


14. తెలంగాణ - 119


15. పంజాబ్‌ - 117


16. హరియాణా - 90


17. ఛత్తీస్‌గఢ్‌ - 90


18. ఝార్ఖండ్‌ - 81


19. ఉత్తరాఖండ్‌ - 70


20. హిమాచల్‌ప్రదేశ్‌ - 68


21. మేఘాలయ - 60


22. మణిపుర్‌ - 60


23. నాగాలాండ్‌ - 60


24. అరుణాచల్‌ ప్రదేశ్‌ - 60


25. త్రిపుర - 60


26. గోవా - 40


27. మిజోరం - 40


28. సిక్కిం - 32

 

కేంద్రపాలిత ప్రాంతాలు


1. దిల్లీ- 70


2. పుదుచ్చేరి - 30


3. జమ్ము-కశ్మీర్‌ - 83


 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విధాన పరిషత్తు

 శాశ్వతమే.. కానీ రద్దవుతుంది!

  అది మేధావుల సభ. కళాకారులు గళం విప్పే వేదిక. అక్కడ జరిగే సమావేశాల్లో ఉపాధ్యాయులూ ఉత్సాహంగా పాల్గొంటారు. విధాన నిర్ణయాల్లో సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, సేవారంగాల నిపుణులు భాగస్వాములవుతారు. శాసన ప్రక్రియలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. విభిన్న వర్గాల ప్రాతినిధ్యంతో విరాజిల్లే ఆ విశిష్ట మండలి ఉనికి శాశ్వతం. కానీ కావాలనుకున్నప్పుడు రద్దు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పునరుద్ధరించుకోవచ్చు.

 

  రాష్ట్రస్థాయిలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ శాసనసభ. ఇందులో రెండు రకాల సభలు ఉంటాయి. మొదటిది ఎగువసభ. దీనినే విధాన పరిషత్తు అంటారు. రెండోది దిగువసభ, దానినే విధానసభగా వ్యవహరిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో విధానపరిషత్తు ఉండదు.ఎగువ సభ బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థ. విధాన పరిషత్తును ఎగువ సభ, పెద్దలసభ, శాశ్వతసభ, శాసన మండలిగా కూడా పేర్కొంటారు. దీనిలో ఉండే సభ్యులను ఎమ్మెల్సీ (మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌) అంటారు. 1950 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం విధాన పరిషత్తులో ఉండే కనీస ఎమ్మెల్సీల సంఖ్య 40. గరిష్ఠ ఎమ్మెల్సీల సంఖ్య విధానసభ సభ్యుల (ఎమ్మెల్యే) సంఖ్యలో 1/3వ వంతు మించకూడదు.

* భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం అప్పటి 11 రాష్ట్రాల శాసనసభల్లోని 6 రాష్ట్రాల శాసనసభల్లో ‘ద్విసభా’ విధానాన్ని అమలు చేసి ఎగువసభగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆ ఆరు రాష్ట్రాల్లో మద్రాస్, బాంబే, అస్సాం, బెంగాల్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌.ఉన్నాయి.

 

రాజ్యాంగ సభలో చర్చ

రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో విధాన పరిషత్తుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఎగువసభ శాసన నిర్మాణంలో జాప్యాన్ని కొనసాగిస్తుందని, అప్రజాస్వామికమైందని, అనవసర ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని రాజ్యాంగ సభ సభ్యుడైన హెచ్‌.వి.కామత్‌ పేర్కొన్నారు.చివరికి విధాన పరిషత్తును ఏర్పాటు చేయడం/రద్దుచేయడం అనేది సంబంధిత రాష్ట్ర అభీష్టానికి వదిలిపెట్టాలని రాజ్యాంగ సభ తీర్మానించింది.

 

విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169(1) ఒక రాష్ట్రంలో విధాన పరిషత్తు ఏర్పాటు/తొలగింపు ప్రక్రియ గురించి వివరిస్తుంది. దీని ప్రకారం ఏదైనా రాష్ట్రంలో ఎగువసభ అయిన విధాన పరిషత్తును కొత్తగా ఏర్పాటు చేయాలన్నా లేదా ఉన్న విధాన పరిషత్తును తొలగించాలన్నా ఆ రాష్ట్ర విధాన సభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి పార్లమెంటుకి పంపాలి.పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆ మేరకు చట్టం చేస్తుంది. ‘విధానపరిషత్తును పూర్తిగా లేకుండా చేయడం కుదరదు, కానీ రద్దుచేయవచ్చు’ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు.

 

సభ్యుల అర్హతలు

* విధాన పరిషత్తు సభ్యులుగా పోటీ చేసేందుకు ఉండాల్సిన కనీస వయసు - 30 సంవత్సరాలు.

* సభ్యుల పదవీ కాలం - 6 సంవత్సరాలు

* ప్రతి రెండేళ్లకొకసారి 1/3వ వంతు విధాన పరిషత్తు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.

* బహుళ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సభ లక్ష్యం.

 

నిర్మాణం

 

విధాన పరిషత్తుకు సభ్యులు అయిదు రకాలుగా ఎన్నికవుతారు.

1) పరిషత్తు మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని స్థానిక సంస్థలైన పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సభ్యులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

2) మొత్తం సభ్యుల్లో మరో 1/3వ వంతు మంది సభ్యులను విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు) ఎన్నుకుంటారు.

3) మొత్తం సభ్యుల్లో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలో కనీసం మూడేళ్లపాటు నివాసం ఉంటున్న అన్ని విశ్వవిద్యాలయాల పట్టభద్రులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

4) మొత్తం సభ్యుల్లో ఇంకో 1/12వ వంతు మంది సభ్యులను రాష్ట్రంలోని సెకండరీ పాఠశాల స్థాయికి తగ్గకుండా కనీసం మూడేళ్లపాటు పనిచేసిన ఉపాధ్యాయులతో కూడిన ఎన్నికల గణం ఎన్నుకుంటుంది.

5) మొత్తం సభ్యుల్లో 1/6వ వంతు మంది సభ్యులను రాష్ట్ర గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. ఈ సభ్యులు కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్నవారై ఉంటారు.

విధాన పరిషత్తు సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఏక ఓటు బదిలీ సూత్రం ప్రకారం ఎన్నికవుతారు.

ప్రస్తుతం మన దేశంలో 6 రాష్ట్రాల్లో  విధాన పరిషత్తులు ఉన్నాయి. అవి 1) ఉత్తర్‌ప్రదేశ్‌ (100 మంది సభ్యులు), 2) మహారాష్ట్ర (78), 3) బిహార్‌  (75), 4) కర్ణాటక  (75), 5) ఆంధ్రప్రదేశ్‌  (58), 6) తెలంగాణ (40).

* జమ్ము-కశ్మీర్‌ విధాన పరిషత్తులో 36 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. జమ్ము-కశ్మీర్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 ప్రకారం అక్కడి విధాన పరిషత్తును రద్దుచేశారు.

* విధాన పరిషత్తు మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు సభ్యులు ఎన్నిక ద్వారా ఎన్నికవుతారు. మిగిలిన 1/6వ వంతు సభ్యులను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు.

 

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీల ఎన్నిక వివరాలు

ఆంధ్రప్రదేశ్‌-58

తెలంగాణ-40 ఎన్నిక విధానం
20 14 స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా
20 14 విధానసభ సభ్యుల (ఎమ్మెల్యేలు) ద్వారా
5 3 ఉపాధ్యాయుల ద్వారా
5 3 పట్టభద్రుల ద్వారా
8 6 గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధాన పరిషత్తు ఏర్పాటు, తొలగింపు, పునరుద్ధరణ

* 1958, జులై 1న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. అప్పటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ మాడపాటి హనుమంతరావు, డిప్యూటీ ఛైర్మన్‌ జి.ఎన్‌.రాజు.

* 1985, జూన్‌ 1న ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును రద్దుచేశారు. నాటి విధాన పరిషత్తు ఛైర్మన్‌ సయ్యద్‌ ముఖ్‌సిర్‌షా, డిప్యూటీ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి.

* 2007, మార్చి 30న వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్తును పునరుద్ధరించారు. అప్పటి సభ ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్‌ మహ్మద్‌ జాని.

* విభజన అనంతరం కొత్త ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ ఎ.చక్రపాణి, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎస్‌.వి.సతీష్‌కుమార్‌ రెడ్డి.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్తు ఛైర్మన్‌ కొయ్యె మోషెన్‌రాజు, డిప్యూటీ ఛైర్మన్‌ మయానా జకియా ఖానమ్‌.

* తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తుకు తొలి ఛైర్మన్‌ కె.స్వామిగౌడ్, తొలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌.

* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విధాన పరిషత్తు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది.

 

 

ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవులు

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 182 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల గురించి వివరిస్తుంది. సభ్యులు (ఎమ్మెల్సీలు) సభా కార్యకలాపాల నిర్వహణ కోసం తమలో నుంచి ఒకరిని ఛైర్మన్‌గాను, మరొకరిని డిప్యూటీ ఛైర్మన్‌గాను ఎన్నుకుంటారు.

* ఆర్టికల్‌ 183 విధాన పరిషత్తు ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు తమ పదవులను ఏ విధంగా కోల్పోతారనే విషయాన్ని వివరిస్తుంది. శాసనమండలి/ విధాన పరిషత్తులో సభ్యత్వం రద్దయినప్పుడు, తమ పదవులకు రాజీనామా చేసినప్పుడు, విధాన పరిషత్తులో తొలగింపు తీర్మానం నెగ్గినప్పుడు పదవులను కోల్పోతారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లను తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాలి.

* ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లలో ఎవరిపై తొలగింపు తీర్మానం ప్రవేశపెడతారో వారు సభా సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అయితే సభా సమావేశాల్లో పాల్గొనవచ్చు. ఛైర్మన్‌ తన రాజీనామాను డిప్యూటీ ఛైర్మన్‌కు, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు (ఎమ్మెల్సీలు) తమ రాజీనామాలను ఛైర్మన్‌కు సమర్పించాలి.

* ఆర్టికల్‌ 184 ప్రకారం ఛైర్మన్‌ పదవి ఖాళీ అయినప్పుడు  డిప్యూటీ ఛైర్మన్‌ సభా సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

* రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్తు సమావేశాలు సంవత్సరానికి తప్పనిసరిగా రెండు సార్లు జరగాలి. రెండు సమావేశాల మధ్య వ్యత్యాసం 6 నెలలు మించకూడదు.

 

విధాన పరిషత్తు - సమీక్ష

* సాధారణ బిల్లులను విధానసభలో లేద విధాన పరిషత్తులో ప్రవేశపెట్టవచ్చు.

* విధాన సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను విధాన పరిషత్తు గరిష్ఠంగా 4 నెలలు పాటు నిలిపి ఉంచగలుగుతుంది.

* విధాన పరిషత్తును ఒక చేతికి ఉండే 6వ వేలిగా, రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించే సంస్థగా విమర్శకులు పేర్కొన్నారు.

* విధాన పరిషత్తు భవితవ్యం విధాన సభ చేసే ప్రత్యేక తీర్మానంపై ఆధారపడి ఉంటుంది.

* విధాన సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను విధాన పరిషత్తు 14 రోజుల్లోగా ఆమోదించాలి. లేకపోతే ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు.

 

రాజ్యసభ, విధాన పరిషత్‌ల మధ్య వ్యత్యాసాలు

* రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కానీ రాష్ట్రాల విధాన పరిషత్తు సభ్యులకు (ఎమ్మెల్సీలు) ఎలాంటి ఓటు హక్కు లేదు.

* సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్రస్థాయిలో విధాన పరిషత్తు, విధాన సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే గవర్నర్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు.

* లోక్‌సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై రాజ్యసభ 6 నెలల్లోగా నిర్ణయం ప్రకటించాలి. విధానసభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై విధాన పరిషత్తు 3 నెలల్లోగా నిర్ణయాన్ని ప్రకటించాలి.

* రాజ్యసభ శాశ్వతసభ. దీన్ని రద్దుచేయడానికి వీలులేదు. విధాన పరిషత్తును పార్లమెంటు చేసే చట్టం ద్వారా రద్దు చేయవచ్చు.

* రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ పాల్గొంటుంది. కానీ విధాన పరిషత్తుకు ఎలాంటి ప్రాతినిధ్యం లేదు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 23-12-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - కమిటీల సిఫార్సులు

సమగ్రత సాధనలో సహకార పాలన!

 


  భిన్న జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులతో నిండిన సువిశాల భారతదేశంలో పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా సాగడానికి రాజ్యాంగం అనేక ఏర్పాట్లు చేసింది. అందులో ప్రధానమైనది సమాఖ్య వ్యవస్థ. జాతీయస్థాయిలో కేంద్రం, రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యం, పరస్పర సహకార పాలన, వనరుల కేటాయింపులో సమానత్వం, మొత్తం మీద దేశ సమగ్రతను, ఐకమత్యాన్ని పరిరక్షించడం సమాఖ్య వ్యవస్థ లక్ష్యం. ఇందుకోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  మెరుగైన సంబంధాలు ఉండాలి. ఈ విషయాన్ని సందర్భానుసారం అనేక కమిటీలు స్పష్టం చేశాయి. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 


  రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సిద్ధాంతపరమైన సమాఖ్యగా కాకుండా కేవలం పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. 1947 నుంచి 1967 వరకు కేంద్రం, రాష్ట్రాల్లో ఒకే రాజకీయ పార్టీ (భారత జాతీయ కాంగ్రెస్‌) అధికారంలో ఉండటంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు సజావుగా, సాఫీగా సాగాయి. 1967లో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, 7 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. ఆ తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రజాదరణతో అధికారంలోకి వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని ప్రశ్నిస్తూ, తమకు ఎక్కువ అధికారాలు బదిలీ చేయాలని డిమాండ్‌ చేసేవి. దీంతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆ అంశంపై అధ్యయనం చేసి, నిర్మాణాత్మక సిఫార్సులు చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.

 


మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం (1966): కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో మొరార్జీ దేశాయ్‌ అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో ఆరుగురు సభ్యులున్నారు. మొరార్జీ దేశాయ్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో కె.హనుమంతయ్య ఆ సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు. * మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎం.సి.సెతల్వాడ్‌ నేతృత్వంలో అధ్యయన బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ బృందం సూచనల ఆధారంగా మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం తన నివేదికను 1969లో కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక కేంద్ర, రాష్ట్ర సంబంధాల  మెరుగు పరిచేందుకు 22 సిఫార్సులు చేసింది.  

 


కీలక సిఫార్సులు: * ప్రజాసేవ, పరిపాలనలో విశేష అనుభవం ఉన్న వ్యక్తులు, వివాదాస్పదం కాని వ్యక్తులను మాత్రమే గవర్నర్లుగా నియమించాలి.


* ఆర్టికల్‌ 280 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ జరగాలి.


* ఆర్టికల్‌ 263లో నిర్దేశించిన విధంగా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి.

 

* రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదు.


* రాష్ట్ర ప్రభుత్వాల వినతి మేరకే కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాలకు పంపాలి.


* ప్రణాళికా సంఘంలో ప్రతి రాష్ట్రం నుంచి ఒక ఆర్థికవేత్తకు ప్రాతినిధ్యం కల్పించాలి.


* ఆర్టికల్‌ 356 దుర్వినియోగం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలి.


* ఆర్టికల్‌ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే సహాయక గ్రాంట్లను ఉత్పాదకతతో కూడిన పరిశ్రమలకు మాత్రమే ఇవ్వాలి.


* ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు.

 


సర్కారియా కమిషన్‌ (1983): కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో రంజిత్‌ సింగ్‌ సర్కారియా (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సభ్యులుగా బి.శివరామన్, ఎస్‌.ఆర్‌.సేన్‌; కార్యదర్శిగా ఆర్‌.ఎం.సుబ్రహ్మణ్యం, రాజ్యాంగ సలహాదారుగా ఎల్‌.ఎన్‌.సిన్హా వ్యవహరించారు.1987, అక్టోబరు 27న సర్కారియా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి (రాజీవ్‌గాంధీ ప్రధాని) నివేదిక సమర్పించింది. 1988, జనవరిలో ఈ నివేదికలోని అంశాలను వెల్లడించారు.ఇందులో 247 సిఫార్సులు ఉన్నాయి.

 


శాసన సంబంధ సిఫార్సులు: * అఖిల భారత సర్వీసుల ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదు. కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.* అవశిష్టాంశాల్లో పన్నులకు సంబంధించిన అంశాలను పార్లమెంటు పరిధిలో ఉంచి, మిగిలిన అంశాలను రాజ్యాంగ సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయాలి.


* భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుచేసి, దాన్ని క్రియాశీలకంగా మార్చాలి.


* అంతర్రాష్ట్ర మండలిని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేయాలి.


* అన్నిరకాల సూచనలు చేసిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు ఆర్టికల్‌ 365 ప్రకారం ఆదేశాలు జారీ చేయాలి.


* ఆర్టికల్‌ 258 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమానుగత శ్రేణిలో వికేంద్రీకరించాలి.


* ఆర్టికల్స్‌ 256, 257, 365లలో సూచించిన కేంద్ర శాసనాలు, జాతీయ విధానాలను అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్ఠంగా ఉండాలి.

 


గవర్నర్‌ వ్యవస్థపై: * గవర్నర్‌ పదవికి ప్రవర్తనా నియమావళి ఏర్పాటు చేయాలి. ఒక వ్యక్తిని తన సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.


* వివాదరహితులు, విశిష్ట వ్యక్తిత్వం ఉన్నవారినే గవర్నర్‌గా నియమించాలి.


* గవర్నర్‌ను నియమించే ముందు కేంద్రం తప్పనిసరిగా సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.


* గవర్నర్‌ పదవి నిర్వహించినవారు పదవీవిరమణ అనంతరం తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించకూడదు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు మాత్రమే పోటీ చేయవచ్చు.


* గవర్నర్ల పేర్లను సిఫార్సు చేయడానికి ప్రధాని అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.


* గవర్నర్‌ పదవికి వ్యక్తులను ఎంపికచేసే సమయంలో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి.


* విశ్వవిద్యాలయాలకు ఛాన్సెలర్‌గా వ్యవహరించేటప్పుడు గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించాలి.


* ఏదైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనప్పుడు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రాజ్యాంగపరమైన ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలి. ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలి.


* శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు, విశ్వాసం ఉన్నంతకాలం రాష్ట్ర మంత్రిమండలిని గవర్నర్‌ రద్దు చేయకూడదు.


* బలమైన కారణం ఉంటే తప్ప గవర్నర్‌ పదవీకాలానికి (5 సంవత్సరాలు) భంగం కలిగించకూడదు.


* కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వ్యక్తులను ఇతర రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించకూడదు.

 


ఆర్థిక అంశాలపై: * జాతీయాభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థికాభివృద్ధి మండలిగా మార్చాలి.


* కార్పొరేషన్‌ పన్నులో కొంత భాగాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలి.


* రైల్వే ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేయాలి.


* వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థిక నిపుణులకు కేంద్ర ఆర్థిక సంఘంలో భాగస్వామ్యం కల్పించి వారి సేవలను వినియోగించుకోవాలి.


* ప్రకృతి వైపరీత్యాలు, సంక్షోభాల సందర్భంలో కేంద్రం రాష్ట్రాలకు కాలపరిమితి లేని రుణాలు ఇచ్చి ఆదుకోవాలి.


* కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దుర్వినియోగం చేసిన రాష్ట్రాలపై తగిన చర్యలు తీసుకోవాలి.


* బ్యాంకుల నుంచి ఒక సంవత్సరం కాలపరిమితితో రుణాలు తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాలి.

 


సర్కారియా కమిషన్‌ - ఇతర సిఫార్సులు:  * రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు సంబంధిత రాష్ట్రం అనుమతి లేకపోయినా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను పంపవచ్చు.


* దేశంలో అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలుచేయాలి.


* స్థానిక స్వపరిపాలనా సంస్థలకు నిర్దిష్ట పదవీకాలం ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి.


* రాష్ట్ర స్థాయిలో ఎగువసభ అయిన శాసనమండలి (విధాన పరిషత్‌) ఏర్పాటు/రద్దు విషయంలో పార్లమెంటు నిర్ణీత సమయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలి.


* గనులకు సంబంధించిన కీలకమైన విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.


* జోనల్‌ కౌన్సిళ్లను పునర్వ్యవస్థీకరించాలి. ప్రసార భారతికి స్వయంప్రతిపత్తి కల్పించాలి.


* జాతీయ కార్యక్రమాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయడం ద్వారా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, సమగ్రతను పెంపొందించవచ్చు.


* సర్కారియా కమిషన్‌ చేసిన 247 సిఫార్సుల్లో 180 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది.

 


రాజమన్నార్‌ కమిటీ:  1969 సెప్టెంబరులో తమిళనాడులోని కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి పి.వి.రాజమన్నార్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై సమగ్ర అధ్యయనంతో పాటు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ఈ కమిటీలో లక్ష్మణస్వామి మొదలియార్, పి.పి.చంద్రారెడ్డి సభ్యులు. ఇది 1971లో తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

 


సిఫార్సులు: * అవశిష్టాధికారాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలి.


* అఖిల భారత సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను రద్దు చేయాలి.


* రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి.


* ప్రణాళికా సంఘాన్ని శాశ్వత సంస్థగా ఏర్పాటుచేసి చట్టబద్ధత కల్పించాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణను తగ్గించాలి.


* కేంద్ర మంత్రిమండలిలో రాష్ట్రాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలి.


* ఉమ్మడి జాబితాలోని అంశాలను వెంటనే పునఃసమీక్షించి రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో బదిలీ చేయాలి.


* రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది విశిష్ట వ్యక్తులను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేయాలి.


* రాజ్యాంగం నుంచి ఆర్టికల్స్‌ 356, 357, 365లను తొలగించాలి. రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ 2/3వ వంతు మెజార్టీతో సవరించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్రను పెంచాలి.


* ఆర్టికల్‌ 252 ప్రకారం పార్లమెంట్‌ రూపొందించిన చట్టాన్ని మార్పు చేసే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించాలి. హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియలో రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.


* రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించకపోతే శాసనసభను సమావేశపరిచి మెజార్టీ సభ్యులు బలపరిచిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియమించాలి.


* గవర్నర్‌ సంతృప్తి ఉన్నంతవరకే రాష్ట్ర మంత్రిమండలి పదవిలో ఉంటుందన్న నియమ నిబంధనను రాజ్యాంగం నుంచి తొలగించాలి.


* ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ప్రయోజనాలను ప్రభావితం చేసే బిల్లులను అంతర్రాష్ట్ర మండలి అనుమతితోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి.


* రాష్ట్రాల ఆర్థిక వనరులను పెంచడం కోసం పన్నుల వ్యవస్థలో మార్పులు చేయాలి. గవర్నర్‌ నివేదిక లేనిదే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించకూడదు.


* ‘రాజమన్నార్‌ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే భారతదేశం ముక్కలు చెక్కలవుతుంది. దేశ సమైక్యత, సమగ్రత ప్రమాదంలో పడతాయి. అనేక రంగాలు అభివృద్ధికి నోచుకోకుండా పోతాయి’ అని ఎం.సి.సెతల్వాడ్‌ వ్యాఖ్యానించారు.

 


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 05-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు - వివిధ కమిటీల సిఫార్సులు

పరస్పర సహకారంతో పరిపూర్ణ సమాఖ్య!
 

భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించారు. రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికార విధులు, వాటి పరిధులను నిర్దేశించింది. మారుతున్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇరు ప్రభుత్వాల మధ్య వివాదాలు పెరుగుతూ వస్తున్నాయి. అధికారాల విభజన, నిధుల పంపిణీ, గవర్నర్‌ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులపై నియంత్రణ వంటి అంశాల్లో స్పర్థలు ఎక్కువయ్యాయి. ఆ విభేదాలను తొలగించి, ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కుదిర్చేందుకు ఇటీవల కాలంలో పలు కమిషన్‌లు ఏర్పాçయ్యాయి. రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు కీలక సిఫార్సులు చేశాయి. వాటిపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి.

భారతదేశం పరిపాలనాపరమైన సమాఖ్యగా కొనసాగాలంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు అవసరం. వీటి మధ్య అభిలషణీయ బంధాలను పెంపొందించేందుకు అవసరమైన సిఫార్సులను వివిధ కమిటీలు చేశాయి.

మదన్‌ మోహన్‌ పూంచీ కమిషన్‌:  కేంద్ర, రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసి, తగిన సిఫార్సులు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ మోహన్‌ పూంచీ నేతృత్వంలో 2007, ఏప్రిల్‌ 28న ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌లో సభ్యులు 1) వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ 2) ధీరేంద్ర సింగ్‌ 3) అమరేష్‌ బాగ్చి 4) ఎన్‌.ఆర్‌.మాధవ మేనన్‌

పూంచీ కమిషన్‌ ఏడు అధ్యాయాలతో కూడిన నివేదికను 2010, ఏప్రిల్‌ 20న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో 273 సిఫార్సులున్నాయి.

* మొదటి అధ్యాయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిణామ క్రమం వివరించారు.

* రెండో అధ్యాయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 19, 355, 356, 263 లకు సంబంధించిన అంశాలపై సిఫార్సులు ఉన్నాయి.

* మూడో అధ్యాయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, ఆర్థిక వనరుల పంపిణీ, ప్రాంతీయ అసమానతల తొలగింపునకు అవసరమైన ప్రణాళికా నమూనాను వివరించారు. 

* నాలుగో అధ్యాయంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం(1992), 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ల అమలు తీరుకు సంబంధించిన అంశాలు, 4వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సిఫార్సులు ఉన్నాయి.

* ఐదో అధ్యాయంలో జాతీయ ఆంతరంగిక భద్రతకు విఘాతం కలిగిస్తున్న నక్సలిజం, తీవ్రవాదం, మతకల్లోలాలు, హింస మొదలైన అంశాల ప్రభావం, నియంత్రణకు చేపట్టాల్సిన సిఫార్సులు వివరించారు.

* ఆరో అధ్యాయంలో పర్యావరణ సమస్యలు, సహజ వనరుల విభజనకు సంబంధించిన అంశాలపై సిఫార్సులున్నాయి.

* ఏడో అధ్యాయంలో సామాజికాభివృద్ధి, సుపరిపాలనకు సంబంధించిన సిఫార్సులు ఉన్నాయి.


కీలక సిఫార్సులు:

 * ఆరోగ్యం, ఇంజినీరింగ్, విద్య, న్యాయ అంశాలకు సంబంధించి కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి.

* రాష్ట్రాల జనాభా, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యం కల్పించాలి.

* అంతర్గత సంఘర్షణల నేపథ్యంలో మొత్తం రాష్ట్రానికి ఆర్టికల్‌ 356 ప్రకారం కేంద్రపాలన విధించే బదులు పరిమిత ప్రాంతానికి ‘స్థానిక కేంద్ర పాలన’ను విధించాలి. ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356(3)ను సవరించాలి.

* ఆర్టికల్‌ 355 ప్రకారం దేశంలోని రాష్ట్రాలను సంరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుంది. ఈ ఆర్టికల్‌ను సమర్థంగా వినియోగిస్తే ఆర్టికల్స్‌ 352, 356లను ఉపయోగించే పరిస్థితులు ఉండవు.

* రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఆర్టికల్‌ 356ను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు 1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసు సందర్భంగా ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలి. తద్వారా కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పటిష్ఠమై అపోహలు తొలగుతాయి.

* గవర్నర్‌లను సరైన కారణం లేకుండా తొలగించ కూడదు. గవర్నర్‌ పదవీకాలం కేంద్రం (రాష్ట్రపతి) అభీష్టసూత్రంపై ఆధారపడటం సరైన విధానం కాదు. గవర్నర్‌లను తొలగించడంలో రాష్ట్ర శాసనసభలు మహాభియోగ తీర్మానాన్ని అనుసరించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.

* వివాదాస్పదం కాని, రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే గవర్నర్‌గా నియమించాలి. రాష్ట్ర ప్రథమ పౌరుడిని నియమించేటప్పుడు సంబంధిత ముఖ్యమంత్రిని సంప్రదించాలి.

* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.

* దేశ అఖండత, సమగ్రత, సాంఘిక, ఆర్థికాభివృద్ధికి పరిష్కారంగా సహకార సమాఖ్యను ఏర్పాటు చేయాలి.

* గవర్నర్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరించే సంప్రదాయాన్ని తొలగించాలి.

 

పూంచీ కమిషన్‌ కొత్తగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినవి:

 * సామాజిక రంగంలో ప్రమాణాలు కాపాడటానికి ‘జాతీయ ప్రమాణాల సంస్థ’.

* ఆర్థిక సంఘానికి ‘ప్రత్యేక సచివాలయం’.

* ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ‘ప్రాంతీయ మౌలిక వసతుల సలహా మండలి’. 

* బొగ్గు, చమురు, గ్యాస్‌లకు ఉమ్మడిగా ఒకే రెగ్యులేటరీ అథారిటీ. 

* అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్య మండలి 

* సమీకృత ఈశాన్య జలవనరుల అథారిటీ 

* ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం ‘ప్రాంతీయ భద్రత ఏజెన్సీ’. 

* అంతర్రాష్ట్ర మండలికి మరిన్ని అధికారాలతో ‘ప్రత్యేక సచివాలయం’.


మతకల్లోలాల నియంత్రణకు సిఫార్సులు:  

* బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

* జాతీయ సమైక్యతా మండలికి మరిన్ని అధికారాలు కల్పించాలి. దీనికి కేంద్ర హోంమంత్రి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించాలి.

* మతకల్లోలాలు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని 48 గంటల్లోగా జాతీయ సమైక్యతా మండలి బృందం సందర్శించాలి.

* దేశ ప్రజల మధ్య మత సామరస్యాన్ని సాధించేందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కన్వీనర్‌గా ఆరు (ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ, మధ్య, ఈశాన్య) ప్రాంతాల హోం మంత్రులు రొటేషన్‌ పద్ధతిలో సభ్యులుగా ఉండే స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలి.

* జాతీయ సమగ్రతా మండలికి రాజ్యాంగ హోదా కల్పించాల్సిన అవసరం లేదు.

 

హంగ్‌ అసెంబ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అనుసరించాల్సిన నియమాలు: 

* శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ పార్టీని లేదా మెజార్టీ పార్టీల కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. 

* ఎన్నికల కంటే ముందే ఏర్పడిన కూటమిని ఒక పార్టీగా భావించి, ఎన్నికల్లో ఈ కూటమి మెజార్టీ సాధిస్తే దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

 * ఒకవేళ ఎన్నికలకు ముందే ఏర్పడిన ఏ పార్టీకి లేదా సంకీర్ణ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాకపోతే ముఖ్యమంత్రిని నియమించడానికి గవర్నర్‌ కొన్ని ప్రాధాన్యాలు అనుసరించాలి. అవి 

ఎ) ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటముల్లో ఎక్కువ స్థానాలు గెలిచిన కూటమిని ఆహ్వానించాలి. బి) అత్యధిక స్థానాలు పొంది, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన పార్టీని పిలవాలి. 

సి) ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కూటమిని పరిగణనలోకి తీసుకోవాలి. డి) ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడి, కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో చేరి స్వతంత్రులతో సహా మరికొన్ని రాజకీయ పార్టీలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఆ కూటమిని స్వాగతించాలి. 

 

ఇతర సిఫార్సులు: 

* ఆర్థిక సంఘానికి, ప్రణాళికా సంఘానికి సమన్వయం ఉండాలి. 

* కేంద్ర జాబితాలోని వివిధ అంశాలు కేంద్ర, రాష్ట్ర అధికార పరిధిలో అతివ్యాప్తి ఉండే అవకాశం ఉన్న కారణంగా జాతీయ ప్రయోజనార్థ  ఏకరూపత సాధించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. 

* వృత్తి పన్నుపై గరిష్ఠ పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.

* ప్రధాన ఖనిజాల రాయల్టీని ప్రతి మూడేళ్లకు సవరించాలి. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే రాష్ట్రాలకు సముచిత నష్టపరిహారం చెల్లించాలి.

రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌:  రాజ్యాంగాన్ని పునఃసమీక్షించేందుకు 2000 సంవత్సరంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన కమిషన్‌ ఏర్పాటైంది. ఈ కమిషన్‌ రాజ్యాంగ పునఃసమీక్షలో భాగంగా కేంద్ర, రాష్ట్రాల సంబంధాల మెరుగుదలకు పలు సూచనలతో 2002లో నివేదిక సమర్పించింది.


సిఫార్సులు: * అంతర్రాష్ట్ర మండలి సమావేశాలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలి. * జలవనరుల ట్రైబ్యునల్‌ వెలువరించిన తీర్పులను రెండు నెలల్లోగా అమలుచేయాలి.* గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నియమాన్ని నిర్దేశించాలి. * పార్లమెంటు ఆమోదం తర్వాతే ఆర్టికల్‌ 356ను ప్రయోగించి, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించాలి.* రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్‌ ఆరు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాలి.


రెండో పరిపాలన సంస్కరణల సంఘం:  దేశ పరిపాలనలో రావాల్సిన మార్పులు సూచించేందుకు 2007లో వీరప్ప మొయిలీ నేతృత్వంలో రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులు వి.రామచంద్రన్, ఎ.పి.ముఖర్జీ, ఎ.హెచ్‌.కరో, జయప్రకాష్‌ నారాయణ, వినీతా రాయ్‌.

 * వీరప్ప మొయిలీ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేయడంతో వి.రామచంద్రన్‌ నేతృత్వం వహించారు.

 * రెండో పరిపాలనా సంస్కరణల సంఘం ప్రభుత్వ పాలనా వ్యవస్థను సమగ్రంగా పునర్‌ వ్యవస్థీకరించడానికి, బాధ్యతాయుత పరిపాలన, జవాబుదారీతనం, సమర్థ పరిపాలనకు సంబంధించిన 15 నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అవి:

1. సమాచారహక్కు, మంచి పాలనకు మూలం

2. సంక్షోభ నిర్వహణ, నియంత్రణ 

3. మానవ మూలధనం అన్‌లాకింగ్‌ చేయడం 

4. సంఘర్షణల పరిష్కారం కోసం సామర్థ్యం పెంపు

5. స్థానిక పాలన 

6. పబ్లిక్‌ ఆర్డర్‌ 

7. పాలనలో నీతి 

8. లోకల్‌ గవర్నెన్స్‌ 

9. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం 

10. ఆర్థిక పరిపాలన 

11. పౌరుల చుట్టూ పరిపాలన

12. భారత ప్రభుత్వం సంస్థాగత నిర్మాణం 

13. సోషల్‌ క్యాపిటల్‌ 

14. సిబ్బంది పరిపాలన పునరుద్ధరణ

15. ఇ-పరిపాలనకు ప్రోత్సాహం 


ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ తీర్మానం:  పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో ఆనంద్‌పుర్‌ సాహిబ్‌ అనే ప్రాంతంలో సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దేశంలో నిజమైన సమాఖ్య స్ఫూర్తిని తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వం కేవలం రక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, కమ్యూనికేషన్‌లు, కరెన్సీ లాంటి అంశాలకే పరిమితం కావాలని అందులో పేర్కొంది.


పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మెమొరాండం:  కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మెరుగుపడాలంటే అనుసరించాల్సిన నియమ నిబంధనలను పేర్కొంటూ 1977లో పశ్చిమ బెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం ఒక మెమొరాండాన్ని ఆమోదించింది.


ముఖ్యాంశాలు: * అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలి.* రాజ్యాంగంలోని యూనియన్‌ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో సమాఖ్య అనే పదాన్ని చేర్చాలి.* రాజ్యసభకు లోక్‌సభతో సమానంగా అధికారాలు కల్పించాలి. * జోనల్‌ కౌన్సిల్‌ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించాలి. * నూతన రాష్ట్రాల ఏర్పాటు విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.* రాజ్యాంగం నుంచి ఆర్టికల్‌ 356, 360లను తొలగించాలి.

 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర కార్యనిర్వాహక శాఖ - అధికారాలు, విధులు (అత్యవసర పరిస్థితులు)

అత్యవసరం మూలాలు ఆ చట్టంలోనే!


కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధిపతిగా వ్యవహరించే రాష్ట్రపతికి ఉన్న విశేషాధికారాల్లో అత్యవసర పరిస్థితి విధింపు విశిష్టమైనది. దీనిని మూడు సందర్భాల్లో ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు ఆ  అధికారాన్ని వినియోగించిన ప్రభుత్వాలు, అప్పట్లో అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు సాధారణ పాలనలో జరిగే మార్పులు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై వాటి ప్రభావం తదితర వివరాలను రాజ్యాంగ ఆర్టికల్స్‌ సహా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 



1.    మన దేశంలో ఆర్టికల్‌ 352 ప్రకారం తొలిసారి  విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ఎప్పటివరకు కొనసాగింది?

 1) 1966, జనవరి 10   2) 1967, జనవరి 10

 3) 1968, జనవరి 10   4) 1965, నవంబరు 21



2.   ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలాన్ని గుర్తించండి.

1) 1971, ఏప్రిల్‌ 6 నుంచి 1977, జనవరి 18 వరకు

2) 1971, డిసెంబరు 3 నుంచి 1977, మార్చి 21 వరకు

3) 1971, సెప్టెంబరు 18 నుంచి 1977, నవంబరు 26 వరకు

4) 1971, డిసెంబరు 26 నుంచి 1977, డిసెంబరు 3 వరకు



3.  ఆర్టికల్‌ 352 ప్రకారం రెండోసారి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించిన సందర్భంలో వివిధ పదవులు నిర్వహించిన ప్రముఖులకు సంబంధించి సరైన జవాబు?

ఎ) రాష్ట్రపతిగా డా.వి.వి.గిరి

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ

 సి) రక్షణ మంత్రిగా డా. బాబూ జగ్జీవన్‌రాం

డి) విదేశాంగ మంత్రిగా హెచ్‌.సి.ముఖర్జీ

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి    4) బి, సి, డి 



4.   బంగ్లాదేశ్‌ జాతీయ గీతమైన ‘అమర్‌ సోనార్‌ బంగ్లా’ను ఎవరు రచించారు?

1) ముజఫర్‌ రెహ్మాన్‌     2) షేక్‌ సలీం హసీనా

3) సచిన్‌ సన్యాల్‌       4) రవీంద్రనాథ్‌ ఠాగూర్‌



5.  మన దేశంలో రెండోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి  కారణం?

1) భారత్‌పై పాకిస్థాన్‌ దురాక్రమణ

2) బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ మధ్య యుద్ధం

3) పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌ దురాక్రమణ

4) భారత విదేశాంగ విధానంలో చైనా జోక్యం చేసుకోవడం


6.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించడానికి కారణం?

1) ఆంతరంగిక అల్లకల్లోలాలు

2) భారత్‌ - పాకిస్థాన్‌Â మధ్య యుద్ధం

3) భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య యుద్ధం

4) భారత్‌ - చైనా మధ్య యుద్ధం



7.  మన దేశంలో మూడోసారి ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కాలం?

1) 1975, ఫిబ్రవరి 21 నుంచి 1977, జనవరి 16 వరకు

2) 1975, నవంబరు 18 నుంచి 1977, డిసెంబరు 9 వరకు

3) 1975, ఆగస్టు 21 నుంచి 1977, జులై 16 వరకు

4) 1975, జూన్‌ 26 నుంచి 1977, మార్చి 21 వరకు



8.  మన దేశంలో 1975లో ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ విధించారు. ఈ సందర్భంలో ఉన్న ప్రముఖులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌.

బి) ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ.

సి) రక్షణ శాఖామంత్రిగా ఇందిరా గాంధీ.

డి) హోంశాఖ మంత్రిగా వి.కె.కృష్ణమీనన్‌.

1) ఎ, సి, డి          2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి డి       4) ఎ, బి, సి



9.   మన దేశంలో ఏ కాలంలో బాహ్య, ఆంతరంగిక కారణాలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగింది?

1) 1975 - 1977      2) 1971 - 1977

 3) 1962 - 1971      4) 1971 - 1977



10. రాయ్‌బరేలి లోక్‌సభ నియోజక వర్గం నుంచి 1971లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లుబాటు కాదని 1975, జూన్‌ 12న ఏ న్యాయస్థానం తీర్పునిచ్చింది?

1) చండీగఢ్‌ హైకోర్టు   2) సుప్రీంకోర్టు 

3) బాంబే హైకోర్టు     4) అలహాబాద్‌ హైకోర్టు



11. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం జరిపిన అక్రమాలపై 1977, మే 28న జె.సి.షా కమిషన్‌ ఏర్పడింది.

బి) కేంద్రంలో 1977, మార్చి 24న జనతా ప్రభుత్వం ఏర్పడింది.

సి) జె.సి.షా కమిషన్‌ తన నివేదికలో ఇందిరా గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

1) ఎ, బి        2) ఎ, బి, సి

3) ఎ, సి         4) బి, సి



12. బాహ్య కారణలతో ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ కొనసాగుతున్న కాలంలో అంతర్గత కారణాలతో కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనను గుర్తించండి.

1) ఆర్టికల్‌ 352 (9)     2) ఆర్టికల్‌ 352 (11)

3) ఆర్టికల్‌ 352 (13)    4) ఆర్టికల్‌ 353 (8)


 

13. ఆర్టికల్‌ 352 ప్రకారం విధించిన జాతీయ అత్యవసర పరిస్థితిని దేశవ్యాప్తంగా గాని, దేశంలో కొన్ని ప్రాంతాల్లో గాని, ఒక రాష్ట్రంలో గాని, ఒక రాష్ట్రంలోని కొంత భాగంలో గాని విధించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

 1) 38వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1979



14. ‘హెబియస్‌ కార్పస్‌ కేసు’గా దేన్ని పేర్కొంటారు?

1) అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ జబల్‌పుర్‌ vs శివకాంత్‌ శుక్లా కేసు

2) రంగనాథ్‌ మిశ్రా vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) మేనకా గాంధీ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ vs  ఎస్‌.ఎన్‌.మిశ్రా కేసు



15. ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణ, అంతర్గత అల్లకల్లోలాల నుంచి రక్షించి, రాజ్యాంగ బద్ధంగా పరిపాలన సాగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 353      2) ఆర్టికల్‌ 354 

3) ఆర్టికల్‌ 355      4) ఆర్టికల్‌ 357



16. ఏదైనా రాష్ట్రంలో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ‘రాష్ట్రపతి పాలన’ కింది కారణంతో విధిస్తారు?

ఎ) రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం లోపించి, తరచూ ప్రభుత్వాలు అధికారాన్ని కోల్పోవడం

బి) రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, రాజ్యాంగ యంత్రాంగం విఫలం కావడం

సి) కేంద్రం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రం ధిక్కరించడం

డి) రాష్ట్రపతి పాలన విధించాలని సంబంధిత రాష్ట్ర మంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం

1) ఎ, బి, సి           2) ఎ, సి, డి

3) బి, సి, డి          4) ఎ, బి, సి, డి



17. కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఆర్టికల్‌ 356 (1) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి జారీ చేస్తారు.

బి) ఆర్టికల్‌ 356 (2) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.

సి) ఆర్టికల్‌ 356 (3) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటనను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అమల్లోకి వస్తుంది.

డి) ఆర్టికల్‌ 356 (4) ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ ప్రకటన ఆమోదం విషయమై పార్లమెంటు ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉభయసభల సంయుక్త సమావేశం జరుగుతుంది.

 1) ఎ, సి, డి సరైనవి   2) ఎ, బి, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి   4) ఎ, బి, సి సరైనవి


18.  ‘రాష్ట్రపతి పాలన’ కాలపరిమితికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదిస్తే 6 నెలల వరకు కొనసాగుతుంది.

బి) రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదంతో 6 నెలలకోసారి చొప్పున పొడిగించవచ్చు.

సి) రాష్ట్రపతి పాలనను ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

డి) రాష్ట్రపతి పాలనను గరిష్ఠంగా మూడేళ్లు పొడిగించవచ్చు/ కొనసాగించవచ్చు.

 1) ఎ, బి, సి, డి   2) ఎ, బి, డి

3) ఎ, బి, సి     4) బి, సి, డి 



19. రాష్ట్రపతి పాలనా కాలంలో ఒక రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి. 

ఎ) రాష్ట్ర మంత్రిమండలి ‘సుప్తచేతనావస్థ’లో ఉంటుంది.

బి) రాష్ట్రంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలను గవర్నర్‌ నిర్వహిస్తారు.

సి) ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర  మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.

డి) రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేస్తారు లేదా సుప్త చేతనావస్థలో ఉంచుతారు.

 1) ఎ, బి, సి సరైనవి      2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి   4) బి, సి, డి సరైనవి



20. పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం కొనసాగించేందుకు ఏ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించారు?

1) 59వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

2) 68వ రాజ్యాంగ సవరణ చట్టం, 1991

3) 1, 2 సరైనవి 

4) 72వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992

 


21.  రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో సంభవించే మార్పును గుర్తించండి.

ఎ) రాష్ట్ర బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.

బి) హైకోర్టు అధికారాల్లో ఎలాంటి మార్పులుండవు.

సి) ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు.

డి) రాష్ట్రంలో రాష్ట్రపతికి ప్రతినిధిగా గవర్నర్‌ పరిపాలన నిర్వహిస్తారు.

1) ఎ, బి, డి సరైనవి      2) ఎ, బి, సి సరైనవి

3) ఎ, బి, సి, డి సరైనవి    4) బి, సి, డి సరైనవి



22. ‘రాష్ట్రపతి పాలన’ మూలాలు ఎక్కడ ఉన్నాయి?

1) 1773, రెగ్యులేటింగ్‌ చట్టంలోని సెక్షన్, 193

2) 1861, ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టంలోని సెక్షన్, 113

3) 1919, మాంటేగ్‌ ఛెెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టంలోని సెక్షన్‌ 101

4) 1935, భారత ప్రభుత్వ చట్టంలోని సెక్షన్‌ 93



23.  కింద ఇచ్చిన అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.

ఎ) రాష్ట్రపతి పాలన విధించిన తొలి రాష్ట్రం - పంజాబ్‌

 బి) ఒకే నెలలో రెండు సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం - కర్ణాటక

సి) రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో ‘ఆర్డినెన్స్‌’ జారీ చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

డి) ఇంతవరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రం - తెలంగాణ

1) ఎ, బి, సి, డి           2) ఎ, బి, సి 

 3) ఎ, బి, డి            4) ఎ, సి, డి 

 

సమాధానాలు 

13; 22; 31; 44; 52; 61; 74; 84; 91; 104; 112; 121; 132; 141; 153; 161; 174; 182;  194; 203; 211; 224; 233.  

Posted Date : 16-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు

సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!


భారతదేశం పటిష్ఠమైన సమాఖ్య వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. అందుకు తగినట్లుగా ప్రభుత్వాల పరిధులు, శాసనాలు చేయాల్సిన అంశాలతో జాబితాలు సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించారు. దేశ సమైక్యత, సమగ్రత లక్ష్యం కావడంతో జాతీయ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు దక్కాయి. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా వ్యవహరించే విధంగా రూపొందిన ఈ శాసన సంబంధాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో జరిగిన సవరణలు, రాష్ట్ర చట్టాలపై కేంద్రం నియంత్రణ తదితర వివరాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఏయే అంశాలపై శాసనాలు చేయవచ్చో వివరించే ప్రక్రియనే ‘కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాలు’గా పేర్కొంటారు. పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే పరిమితమవుతాయి.

అధికారాల విభజన: రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొన్నారు.


1) కేంద్ర జాబితా: దీనిలో ప్రారంభంలో 97 అంశాలు ఉండేవి. ప్రస్తుతం 98 ఉన్నాయి. ఈ జాబితాలో జాతీయ ప్రాధాన్యం ఉన్న రక్షణ, కరెన్సీ, రైల్వేలు, తంతితపాలా, విదేశీ వ్యవహారాలు, విమాన, నౌకాయానం, బ్యాంకింగ్, పౌరసత్వం, అఖిలభారత సర్వీసులు, జనాభా లెక్కలు, సర్వే ఆఫ్‌ ఇండియా, నల్లమందు, సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికార పరిధి లాంటి అంశాలు ఉన్నాయి.

* 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రజాప్రయోజనాల దృష్ట్యా వస్తువుల ఉత్పత్తి, పంపిణీ అనే అంశాన్ని (33వ ఎంట్రీ) ఈ జాబితా నుంచి తొలగించారు.

* 1956లో 6వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘అంతర్‌ రాష్ట్ర వ్యాపార వాణిజ్యం’పై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(A) అంశం ద్వారా).

* 1982లో 46వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రాల్లో వస్తువుల దిగుమతిపై కన్‌సైన్‌మెంట్‌ ట్యాక్స్‌ను విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు. (ఎంట్రీ 92 (B))

* 2004లో 88వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సేవలపై పన్నులు విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ ఈ అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చారు (ఎంట్రీ 92(C)).

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని ఎంట్రీ 92, 92(C)లను తొలగించారు.

* కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

 

2) రాష్ట్ర జాబితా: ఈ జాబితాలో ప్రారంభంలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 66 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ జాబితాలోని 5 అంశాలు (విద్య, అడవులు, తూనికలు-కొలతలు, న్యాయ వ్యవహారాలు, జనాభా నియంత్రణ) తొలగించి ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేశారు.

* 2016లో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 52, 55 అంశాలను తొలగించారు.

* ప్రస్తుతం రాష్ట్ర జాబితాలోని అంశాలు 59. వీటిలో కీలకమైనవి శాంతిభద్రతలు, వ్యవసాయం, స్థానిక స్వపరిపాలన, జైళ్లు, మార్కెట్లు, వినోదం, ఆరోగ్యం, భూములు, భవనాలు, సత్రాలు, దస్తావేజులు, భూమిశిస్తు, శ్మశాన వాటికలు, పశుసంపద మొదలైనవి. రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 249, 250, 252 ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.

 

3) ఉమ్మడి జాబితా: ఈ జాబితాలో ప్రాంతీయ ప్రాధాన్యం, జాతీయ దృక్పథానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ప్రారంభంలో దీనిలో 47 అంశాలు ఉండేవి. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయడంతో 52కు చేరింది. ఈ జాబితాలో కీలకమైనవి వివాహం, విడాకులు, సామాజిక, ఆర్థిక ప్రణాళికలు, పత్రికలు, ధరల నియంత్రణ, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, న్యాయవాద వృత్తి, ఇతర వృత్తులు, వార్తాపత్రికలు, కర్మాగారాలు, జ్యుడీషియల్‌ స్టాంపులు, కార్మిక సంఘాలు.

* ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనాల మధ్య వైరుధ్యం ఏర్పడితే పార్లమెంటు శాసనమే చెల్లుబాటవుతుంది.

* ఈ మూడు జాబితాల్లో లేని వాటిని ‘అవశిష్ట అంశాలు’ అంటారు. వీటిపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఏదైనా ఒక అంశం అవశిష్టాంశమా, కాదా అని సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని శ్రీఖివ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న ఆర్టికల్స్‌ కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన సంబంధాల గురించి పేర్కొంటున్నాయి.

ఆర్టికల్‌ 245: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని తెలియజేస్తుంది.

ఆర్టికల్‌ 245(1): పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. రాష్ట్ర శాసనసభలు రూపొందించే శాసనాలు సంబంధిత రాష్ట్ర భూభాగ పరిధికి మాత్రమే వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 245(2): పార్లమెంటు రూపొందించే శాసనాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకూ వర్తిస్తాయి.

ఆర్టికల్‌ 246: పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు రాజ్యాంగ పరిధికి లోబడి రూపొందించే శాసనాల రూపకల్పనను వివరిస్తుంది.

ఆర్టికల్‌ 246(1): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే సర్వాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

ఆర్టికల్‌ 246(2): రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే ఈ జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు రూపొందించిన శాసనానికి, రాష్ట్ర శాసనసభ రూపొందించిన శాసనానికి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు చేసిన శాసనమే కొనసాగుతుంది.

ఆర్టికల్‌ 246(3): 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు:  వాదియా జు( స్టేట్‌ ఆఫ్‌ బాంబే కేసు: భారత ప్రభుత్వం రూపొందించే ఆదాయ పన్ను చట్టాలు భారత్‌లో శాఖలు ఉన్న విదేశీ సంస్థలకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

ఆర్టికల్‌ 247: కేంద్ర జాబితాలోని పేర్కొన్న అంశాలపై పార్లమెంటు రూపొందించిన శాసనాలను సమర్థంగా అమలు చేయడానికి అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటుచేసే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్‌ 248: అవశిష్టాంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీనికి స్ఫూర్తి కెనడా రాజ్యాంగం. కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాల్లో లేని విషయాలను, నూతనంగా వచ్చే అంశాలను ‘అవశిష్టాంశాలు’ అంటారు.

ఆర్టికల్‌ 249: జాతీయ ప్రయోజనాలరీత్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు శాసనాన్ని రూపొందిస్తుంది. దీని కోసం ముందుగా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రాజ్యసభ చేసిన తీర్మానాన్ని అనుసరించి పార్లమెంటు రూపొందించిన చట్టం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని కొనసాగించాలంటే మరో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.

ఆర్టికల్‌ 250: రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే, ఆర్టికల్‌ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఈ విధంగా పార్లమెంటు రూపొందించిన శాసనాలు జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు కొనసాగి రద్దవుతాయి.

ఆర్టికల్‌ 251: ఆర్టికల్‌ 249, 250 ప్రకారం పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర శాసనసభ ఎలాంటి శాసనాలు రూపొందించరాదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.

ఆర్టికల్‌ 252: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందించాలని పార్లమెంటును కోరితే రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందించిన శాసనాలు సంబంధిత రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి.

ఉదా: * ఎస్టేట్‌ సుంకం చట్టం-1955 

* ప్రైజ్‌ కాంపిటీషన్‌ చట్టం-1955 

* వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 

* జలకాలుష్య సంరక్షణ చట్టం-1974 

* పట్టణ ఆస్తుల భూపరిమితి చట్టం-1976

పార్లమెంటు రూపొందించిన ఈ చట్టాలను సవరించే లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఈ చట్టాలను ఇతర రాష్ట్రాలు శాసనసభ తీర్మానం ద్వారా తమకు కూడా అన్వయించుకోవచ్చు.

ఆర్టికల్‌ 253: భారత ప్రభుత్వం విదేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలు, శాంతి సంధి లాంటివి మనదేశంలో అమలుపరిచే సందర్భంలో పార్లమెంటు రూపొందించే శాసనాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు అవరోధంగా ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.

ఉదా: * యూఎన్‌ఓ ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం-1947 

* జెనీవా ఒప్పంద చట్టం-1960 

* హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం-1982

ఆర్టికల్‌ 254: ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు రూపొందించినప్పుడు రెండింటి మధ్య విభేదాలు వస్తే పార్లమెంటు రూపొందించిన శాసనమే చెల్లుతుంది. అయితే ఉమ్మడి జాబితాలోని ఏదైనా ఒక అంశంపై కేంద్రం గతంలో రూపొందించిన శాసనానికి విరుద్ధంగా రాష్ట్రాలు రాష్ట్రపతి అనుమతితో ప్రత్యేక శాసనం రూపొందించినప్పుడు రాష్ట్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది.

ఆర్టికల్‌ 255: కీలకమైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి, శాసనసభలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి.

ఆర్టికల్‌ 200: రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేయవచ్చు.

ఆర్టికల్‌ 201: రాష్ట్ర గవర్నర్‌ రాష్ట్రపతికి రిజర్వ్‌ చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 27-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు

 పాలనలో సహకారం.. సమతూకం! 
 


తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల పంపిణీపై, మరో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదాలు తలెత్తాయని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. వాటిని ఎవరు, ఏ విధంగా పరిష్కరించాలి? రాష్ట్రాల సమాఖ్యగా ఏర్పడిన దేశంలో ఇలాంటి ఇబ్బందులను తొలగించడానికి భారత రాజ్యాంగం స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తోంది. సహకార సమాఖ్యగా కొనసాగడానికి అవసరమైన అధికారాలను కేంద్ర, రాష్ట్రాల మధ్య విభజించింది. దీని వల్ల దేశంలో రక్షణ, శాంతిభద్రతల నిర్వహణ, ఆర్థిక వనరుల పంపిణీ, సమర్థ పాలనకు వీలు కలుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా పరమైన సంబంధాలను అర్థం చేసుకోవడానికి సంబంధిత ఆర్టికల్స్, అందులోని వివరణలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి లోబడి పరిపాలన నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికార పరిధిని తెలియజేస్తున్నాయి.

రాజ్యాంగంలోని XI భాగంలో ఆర్టికల్‌ 256 నుంచి 263 మధ్య కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను వివరించారు.

ఆర్టికల్‌ 256(1): కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికారాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు తమ పరిపాలనను నిర్వహించకూడదు.

ఆర్టికల్‌ 256(2): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేస్తుంది. వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.

ఆర్టికల్‌ 257(1): జాతీయ స్థాయిలో పార్లమెంటు రూపొందించిన పరిపాలనా విధానాలకు విరుద్ధంగా రాష్ట్రాలు తమ కార్యనిర్వహణ అధికారాలను వినియోగించకూడదు.

ఆర్టికల్‌ 257(2): జాతీయ లేదా సైనిక ప్రాధాన్యం కలిగిన సమాచార వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ 257(3): రైలుమార్గాల సంరక్షణ కోసం రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వవచ్చు.

ఆర్టికల్‌ 257(4): రాష్ట్రాలకు అప్పగించిన పనుల నిర్వహణకు అయిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాలి. దీనికి సంబంధించిన అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఉండాలి. అవసరమైతే కావాల్సిన మధ్యవర్తిని సుప్రీంకోర్టు నియమిస్తుంది.

ఆర్టికల్‌ 258(1): కేంద్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికార పరిధిలోని అంశాలను షరతులతో లేదా షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించవచ్చు. దీనికి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ అంగీకారం అవసరం.

ఆర్టికల్‌ 258(2): పార్లమెంటు రూపొందించిన ఏదైనా ఒక శాసనం రాష్ట్రాల శాసనాధికార పరిధిలోనిది కాకపోయినప్పటికీ సంబంధిత శాసనాన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని రాష్ట్రాలకు/రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేయవచ్చు.

ఆర్టికల్‌ 258(A):ఒక రాష్ట్ర గవర్నర్‌ సంబంధిత రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని అంశాలను షరతులతో లేదా షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు అప్పగించవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వ పూర్వానుమతిని గవర్నర్‌ పొందాలి. ఈ అంశాన్ని 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (ఆర్టికల్, 258(A)) రాజ్యాంగంలో చేర్చారు.

ఆర్టికల్‌ 259: రాష్ట్రాల్లో శాంతిభద్రతల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలను మోహరించవచ్చు. ఈ ఆర్టికల్‌ను 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.

ఆర్టికల్‌ 260: అంతర్జాతీయ ఒప్పందాలు, విదేశాలతో కుదుర్చుకున్న ఒడంబడికల ఆధారంగా భారతదేశ పరిధిలో లేని ఏ ప్రాంతంలోనైనా యూనియన్‌ పరిపాలనా విధులను చేపట్టవచ్చు.

ఆర్టికల్‌ 261(1): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన నియమాలను దేశమంతటా గౌరవించాలి.

ఆర్టికల్‌ 261(2): వివిధ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలు లాంటి వాటిని రుజువు చేసే విధానం, వాటి ప్రభావాన్ని పార్లమెంటు ఒక శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.

ఆర్టికల్‌ 261(3): సివిల్‌ కోర్టులు వెలువరించే అంతిమ తీర్పులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా చట్టప్రకారం అమలు చేయవచ్చు.

ఆర్టికల్‌ 262(1): అంతర్రాష్ట్ర నది లేదా నదీలోయకు సంబంధించిన జలాల వినియోగం, పంపిణీ, నియంత్రణకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం పార్లమెంటు చట్టం చేస్తుంది. దీనిలో భాగంగా 1956లో పార్లమెంటు అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డు యాక్ట్‌ను రూపొందించింది.

ఆర్టికల్‌ 262(2): అంతర్రాష్ట్ర నదీజలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రైబ్యునల్‌ తీర్పును అనుసరించి భారత పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తూ న్యాయస్థానాల జోక్యాన్ని నియంత్రిస్తూ నిర్దేశించవచ్చు.


ఇప్పటివరకు మన దేశంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర నదీజలాల ట్రైబ్యునల్స్‌ 9 ఉన్నాయి. 

1) కృష్ణా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌  - I:  1969లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

2) గోదావరి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1969లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలున్నాయి.

3) నర్మదా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1969లో ఏర్పాటైంది. దీని పరిధిలోని రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.

4) రావి, బియాస్‌ నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1986లో ఏర్పాటైన దీని పరిధిలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

5) కావేరి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 1990లో ఏర్పాటు చేశారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు; కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి దీని పరిధిలో ఉన్నాయి. 

6) కృష్ణా నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌ - II: 2004లో ఏర్పాటు చేశారు. దీని పరిధిలోని రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.

7) వంశధార నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2010లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా దీని పరిధిలో ఉన్నాయి.

8) మహదాయి నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2010లో ఏర్పాటు చేశారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక దీని పరిధిలో ఉన్నాయి.

9) మహానది నదీజలాల వివాదాల ట్రైబ్యునల్‌: 2018లో ఏర్పాటైంది. దీని పరిధిలోని రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌.

 

1956 నాటి అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టాన్ని 2019లో సవరించారు. 2019లో రూపొందించిన ‘అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల సవరణ చట్టం’ ప్రకారం అంతర్రాష్ట్ర నదీజలాలు, నదీ లోయల వివాదాలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వివాద పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు.

ఆర్టికల్‌ 263: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు వచ్చినప్పుడు; ఒక రాష్ట్రానికి, మరో రాష్ట్రానికి మధ్య వివాదాలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించేందుకు, సమన్వయం సాధించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 263 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర మండలిని (ఇంటర్‌ స్టేట్‌ కౌన్సిల్‌) ఏర్పాటు చేస్తుంది.


* సర్కారియా కమిషన్‌ సిఫార్సుల్లో కీలకమైంది అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు. వి.పి.సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1990, మే 28న అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసింది. ఈ మండలి విధుల నిర్వహణకు 1991లో ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర మండలి ఏడాదికి 3 సార్లు సమావేశం కావాలి.

అంతర్రాష్ట్ర మండలి - నిర్మాణం:  * ఛైర్మన్‌ - ప్రధానమంత్రి * సభ్యులు - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు (లెఫ్టినెంట్‌ గవర్నర్లు) * కేంద్ర హోంమంత్రితో కలిపి ఆరుగురు కేబినెట్‌ మంత్రులు * ప్రధాని నామినేట్‌ చేసే శాశ్వత ఆహ్వానితులు 10 మంది (కేంద్ర మంత్రులు).


రాజ్యాంగ ఇతర భాగాల్లో వివరించిన సంబంధాలు:

ఆర్టికల్‌ 352: జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు కేంద్రం కార్యనిర్వాహక ఆదేశాలను రాష్ట్రాలకు జారీ చేయవచ్చు. ఆ సమయంలో రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తుంది.

ఆర్టికల్‌ 355: రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన బాధ్యతలను రాష్ట్రాల పట్ల నిర్వహించాలి. ఎ) ప్రతి రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణ, అంతర్గత అల్లకల్లోలాల నుంచి రక్షించడం. బి) ప్రతి రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగం ప్రకారం జరిగే విధంగా చూడటం.

ఆర్టికల్‌ 356: ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రంలో సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్ర పరిపాలనను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది.

ఆర్టికల్‌ 365: కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే సంబంధిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉదా: కేరళలో 1959లో నంబూద్రిపాద్‌ ప్రభుత్వం కేంద్రం ఆదేశాలను ధిక్కరించడంతో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.

ఆర్టికల్‌ 312: మన దేశంలో అఖిలభారత సర్వీసులను కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల నియామకం యూపీఎస్సీ ద్వారా జరిపి వివిధ రాష్ట్రాలకు కేటాయిస్తుంది.

ఆర్టికల్‌ 315: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది.

ఆర్టికల్‌ 155: రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాధినేతలుగా వ్యవహరించే గవర్నర్లు రాష్ట్ర పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది, నియంత్రిస్తుంది.

ఆర్టికల్‌ 339: షెడ్యూల్డ్‌ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన ప్రణాళికలను రూపొందించి, అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు.

ఏకీకృత న్యాయవ్యవస్థ: రాజ్యాంగ నిర్మాతలు దేశంలో ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు, దానికి దిగువన రాష్ట్ర స్థాయిలో హైకోర్టులతో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పడింది. కేంద్రం, రాష్ట్రాలు రూపొందించే చట్టాలను ఈ ఏకీకృత న్యాయ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.

* హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తే, గవర్నర్‌ వారితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.

* రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటుచేస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

 

Posted Date : 14-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఒకే పదవీ కాలంలో ఏకంగా ఎనిమిది అవిశ్వాసాలు!

ప్రధానులు - విశేషాలు

 

 

 

 

 

మన దేశంలో ప్రభుత్వాధినేతగా విస్తృత అధికారాలను చెలాయించే ప్రధానమంత్రి పదవి అత్యంత కీలకమైనది. అందుకే భారత ప్రధానిని మకుటం లేని మహారాజుగా పేర్కొంటారు. దేశ పాలన, ప్రగతి ప్రధాని పనితీరుపైనే ఆధారపడి ఉంటాయి. స్వాతంత్య్రానంతరం ఎనభయ్యో దశకం నుంచి దేశ రాజకీయాల్లో అస్థిరత చోటు చేసుకుంది. కేంద్రంలో ప్రభుత్వాల  మనుగడ కష్టంగా మారింది. ఆ దశలో రాజీవ్‌గాంధీ నుంచి వాజ్‌పేయీ పాలనా కాలం వరకు చోటుచేసుకున్న వివిధ రాజకీయ పరిణామాలు, ముఖ్యమైన సంఘటనలు, విధాన మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...


1. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగుచూసిన కుంభకోణాలు గుర్తించండి.

1) ముంద్రా కుంభకోణం, రఫేల్‌ కుంభకోణం    

2) బోఫోర్స్‌ కుంభకోణం, ఫెయిర్‌పాక్స్‌ కుంభకోణం

3) బోఫోర్స్‌ కుంభకోణం, ముంద్రా కుంభకోణం  

4) బోఫోర్స్‌ కుంభకోణం, సెయింట్‌కిట్స్‌ ఫోర్జరీ కుంభకోణం


2. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కిందివాటిలో సరైనవి-

ఎ) ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

బి) శ్రీలంకకు భారత శాంతి సైనిక దళాలను పంపారు.

సి) అయిదేళ్ల పదవీ కాలలో 13 సార్లు కేంద్ర కేబినెట్‌ను పునర్‌ వ్యవస్థీకరించారు.

డి) పాకిస్థాన్‌తో ‘కరాచీ ఒప్పందం’ కుదుర్చుకున్నారు.

1) ఎ, బి, డి       2) ఎ, బి, సి 

3) ఎ, సి, డి       4) బి, సి, డి 


3. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 63వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

బి) 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

సి) 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

డి) 1991లో భారతరత్న పురస్కారాన్ని పొందారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి     4) బి, సి, డి 


4. రాజీవ్‌ గాంధీ ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో ఎప్పుడు హత్యకు గురయ్యారు?

1) 1991, మే 21      2) 1991, జులై 18

3) 1991, అక్టోబరు 3   4) 1991, డిసెంబరు 21


5. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలం?

1) 1989, ఆగస్టు 18 నుంచి 1990, జులై 26

2) 1989, నవంబరు 12 నుంచి 1990, డిసెంబరు 2

3) 1989, డిసెంబరు 2 నుంచి 1990, నవంబరు 12

4) 1989, జనవరి 19 నుంచి 1990, డిసెంబరు 6


6. విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) ఉత్తర్‌ప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బి) నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

సి) ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం దినేష్‌ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు.

డి) బాబ్రీ మసీదు దుర్ఘటన ఇతడి పాలనా కాలంలోనే జరిగింది.

1) ఎ, బి, సి          2) ఎ, సి, డి

3) ఎ, బి, డి          4) ఎ, బి, సి, డి


7. విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌కు రాజ్యాంగ భద్రతను కల్పించింది?

1) 69వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990     

2) 67వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990 

3) 66వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990     

4) 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990


8. వి.పి.సింగ్‌ ప్రభుత్వం ఏ కమిషన్‌ చేసిన సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వారికి 27% రిజర్వేషన్లు కల్పించింది?    

1) రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌      2) సి.కె.చటర్జీ కమిషన్‌

3) బి.పి.మండల్‌ కమిషన్‌    4) సూర్జిత్‌ బర్నాలా కమిషన్‌


9. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) విశ్వాస తీర్మానంలో ఓడి అధికారం కోల్పోయిన తొలి ప్రధాని.

బి) అవిశ్వాస తీర్మానంలో ఓడి అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని.

సి) అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ‘జనమోర్చా’ అనే సంస్థను స్థాపించారు.

డి) పదవిలో ఉండగా మరణించిన మూడో ప్రధాని.

1) ఎ, బి, సి            2) ఎ, సి, డి 

3) బి, సి, డి            4) ఎ, బి, సి, డి


10. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కాలానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబు ఏది?

ఎ) 1990లో ‘అంతర్‌ రాష్ట్రమండలి’ని ఏర్పాటు చేశారు.

బి) పరిపాలనా ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేశారు.

సి) అయోధ్య వివాదంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు.

డి) రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో వెలుగుచూసిన బోఫోర్స్‌ కుంభకోణానికి నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి 

3) ఎ, బి, సి, డి     4) ఎ, సి, డి 


11. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండానే పదవి కోల్పోయిన ఏకైక ప్రధాని?

1) విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌  2) చంద్రశేఖర్‌

3) హెచ్‌.డి.దేవేగౌడ      4) ఇంద్రకుమార్‌ గుజ్రాల్‌


12. ప్రధానిగా చంద్రశేఖర్‌ పదవీ కాలాన్ని గుర్తించండి.

1) 1990, నవంబరు 10 నుంచి 1991, జూన్‌ 21

2) 1990, ఆగస్టు 21 నుంచి 1991, మే 26

3) 1990, డిసెంబరు 9 నుంచి 1991, నవంబరు 18

4) 1990, అక్టోబరు 3 నుంచి 1991, జులై 20


13. ప్రధానిగా చంద్రశేఖర్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది-

ఎ) ‘భోండ్సీ’ బాబాగా పేరొందారు.

బి) భారత రాజకీయాల్లో ‘యంగ్‌టర్క్‌’గా పేరొందారు.

సి) భారత్‌లో తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి.

డి) దేశంలో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు.

1) ఎ, సి, డి          2) ఎ, బి, సి 

3) ఎ, బి, డి          4) ఎ, బి, సి, డి 


14. ప్రధాని చంద్రశేఖర్‌కు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.    

ఎ) బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో మన దేశ బంగారాన్ని తాకట్టు పెట్టారు.

బి) 1991లో గల్ఫ్‌ యుద్ధకాలంలో అమెరికా యుద్ధ విమానాలకు చమురు సరఫరా చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

సి) ఇతడి పాలనా కాలంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు.

డి) అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు.

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి 

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి


15. పి.వి.నరసింహారావు భారతదేశ ప్రధానిగా వ్యవహరించిన కాలం?

1) 1991, జులై 1 నుంచి 1996, మే 16     

2) 1991, ఆగస్టు 13 నుంచి 1995, ఫిబ్రవరి 26

3) 1991, జూన్‌ 21 నుంచి 1996, మే 16    

4) 1991, జూన్‌ 21 నుంచి 1996, జులై 1


16. పి.వి.నరసింహారావుకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తి.

బి) ఇతడి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు.

సి) ఒకే పదవీ కాలంలో అత్యధికంగా 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నారు.

డి) ‘ద ఇన్‌సైడర్‌’ పేరిట ఆత్మకథ రాశారు.

1) ఎ, సి, డి         2) ఎ, బి, సి

3) ఎ, బి, డి        4) ఎ, బి, సి, డి 


17. పి.వి.నరసింహారావుకి సంబంధించి కిందివాటిలో సరైన జవాబు ఏది?

ఎ) మైనార్టీ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు పూర్తిగా నిర్వహించారు.

బి) మన దేశంలో 1991లో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

సి) ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. 

డి) 14 భాషల్లో ప్రావీణ్యులు.

1) ఎ, బి, సి       2) ఎ, బి, డి

3) ఎ, సి, డి        4) ఎ, బి, సి, డి 


18. పి.వి.నరసింహారావుకి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) భారత విదేశాంగ విధానంలో ‘లుక్‌ ఈస్ట్‌’ పాలసీని ప్రవేశపెట్టారు.

బి) ‘దేశ్‌ బచావో, దేశ్‌ బనావో’ అనే నినాదం ఇచ్చారు.

సి) ‘సెయింట్‌ కిట్స్‌ ఫోర్జరీ’ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

డి) ముఖ్యమంత్రి పదవి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) నిర్వహించారు.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి   

3) ఎ, బి, సి, డి     4) ఎ, బి, సి


19. పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవి నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు?

1) చంద్రశేఖర్‌       2) పి.వి.నరసింహారావు 

3) అటల్‌ బిహారి వాజ్‌పేయీ 4) హెచ్‌.డి.దేవేగౌడ


20. వాజ్‌పేయీ ప్రధానిగా వ్యవహరించిన కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1996, మే 16 నుంచి 1996, జూన్‌ 1

బి) 1998, మార్చి 19 నుంచి 1999, అక్టోబరు 13

సి) 1999, అక్టోబరు 13 నుంచి 2004, మే 22

డి) 1999, డిసెంబరు 6 నుంచి 2003, నవంబరు 21

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి

3) ఎ, బి, డి       4) ఎ, బి, సి, డి


21. వాజ్‌పేయీ పాలనా కాలానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) 11వ లోక్‌సభ కాలంలో 13 రోజులు ప్రధానిగా వ్యవహరించారు.

బి) పాకిస్థాన్‌తో కార్గిల్‌ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు.

సి) యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.

డి) ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌’ అనే నినాదం ఇచ్చారు.

1) ఎ, బి, డి     2) ఎ, బి, సి

3) ఎ, సి, డి       4) ఎ, బి, సి, డి


22. వాజ్‌పేయీ ఏ లోక్‌సభకాలంలో 13 నెలలు ప్రధానిగా పనిచేసి తదుపరి అధికారాన్ని కోల్పోయారు?

1) 12వ   2) 13వ   3) 11వ  4) 10వ 


23. వాజ్‌పేయీ పాలనా కాలానికి సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ) 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు.

బి) 1999లో పాకిస్థాన్‌తో స్నేహం కోసం ‘లాహోర్‌ బస్సు యాత్ర’ నిర్వహించారు.

సి) 2001లో దిల్లీలో జరిగిన 9వ అలీన దేశాల శిఖరాగ్ర సదస్సుకు అధ్యక్షత వహించారు.

డి) ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించారు.

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి

3) ఎ, బి, సి, డి       4) ఎ, బి, డి


24. వాజ్‌పేయీ ప్రభుత్వ కాలంలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు భారత పార్లమెంట్‌పై ఎప్పుడు దాడి చేశారు?

1) 2001, అక్టోబరు 19  2) 2001, డిసెంబరు 13

3) 2002, మే 16     4) 2003, జనవరి 24

 


సమాధానాలు

1-2; 2-2; 3-4; 4-1; 5-3; 6-1; 7-4; 8-3; 9-1; 10-4; 11-2; 12-1; 13-3; 14-1; 15-3; 16-4; 17-2; 18-3; 19-2; 20-1; 21-1; 22-1; 23-4; 24-2. 
 

ర‌చ‌యిత‌: బంగారు స‌త్య‌నారాయ‌ణ‌


 

 

ఆన్‌లైన్ ప‌రీక్ష కోసం క్లిక్ చేయండి...

 

Posted Date : 24-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

  కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు

 విస్పష్టంగా పన్నుల వసూళ్లు.. పంపకాలు! 


సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక బంధాలు నిర్దిష్టంగా ఉన్నప్పుడే వాటి మధ్య సఖ్యత, సహకారం సాధ్యమవుతాయి. మన దేశంలో ఆ రెండు ప్రభుత్వాల ఆదాయ మార్గాల విభజన, పన్నుల విధింపు, వసూలు, పంపకాల విషయంలో విధివిధానాలను రాజ్యాంగం స్పష్టంగా వివరించింది. తగిన పరిధులను, పరిమితులను నిర్దేశించింది. అంతిమంగా పాలన, ప్రజా సంక్షేమాల కోసం పన్ను ఆదాయం సమకూర్చుకుంటూ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఉపకరించే ఈ నియమ నిబంధనలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను అంశాలవారీగా, ఆర్టికల్స్‌తో సహా వివరంగా తెలుసుకోవాలి.


భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీటికి సంబంధించి రాజ్యాంగంలో సమగ్ర వివరణను పొందుపరిచారు. XIIవ భాగంలో ఆర్టికల్‌ 264 నుంచి 300(A) మధ్య కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించి వివరణ ఉంది.


ఆర్టికల్‌ 264: ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఆర్థిక సంఘం నియమాలను పరిగణనలోకి తీసుకోవాలి.


ఆర్టికల్‌ 265: మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయకుండా ఎలాంటి పన్నులు విధించకూడదు. పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా, రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలకు అనుగుణంగా రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయవచ్చు.


* కేంద్ర జాబితాలో పేర్కొన్న 15 అంశాలపై పన్నులు విధించే అధికారం పార్లమెంటుకు, రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన 20 అంశాలపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాల శాసనసభలకు ఉంటుంది. ఉమ్మడి జాబితాలోని ఆర్థిక అంశాలపై పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు చట్టాలు చేయవచ్చు. అవశిష్ట అంశాలపై అంటే సంపదపై పన్ను, బహుమతిపై పన్ను, వ్యయంపై పన్ను లాంటి వాటిపై చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

 

ఆదాయ మార్గాలు


కేంద్ర ప్రభుత్వం:

పన్నులు: ఆదాయపు పన్ను, ఎగుమతి-దిగుమతి సుంకాలు, కార్పొరేషన్‌ పన్ను, ఎక్సైజ్‌ సుంకం, ఎస్టేట్‌ సుంకం (వ్యవసాయ భూములు మినహా), వారసత్వ పన్ను (వ్యవసాయ భూములు మినహా), విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ.


ఇతర మార్గాలు: వార్తాపత్రికల కొనుగోళ్లు, అమ్మకాలు, వాటిలో ప్రచురించిన ప్రకటనలపై పన్నులు, రైల్వే రవాణా, జల, వాయు మార్గాల ద్వారా వస్తు, ప్రయాణికుల రవాణాకు విధించే టెర్మినల్‌ పన్నులు.


రాష్ట్ర ప్రభుత్వం:

పన్నులు: భూమి శిస్తు, వినియోగ వస్తువులపై పన్ను, విద్యుచ్ఛక్తి అమ్మకం/వినియోగంపై పన్ను, ప్రకటనలపై పన్ను (వార్తాపత్రికలు కాకుండా రేడియో, టెలివిజన్‌ వంటి ప్రసార సాధనాల్లో వచ్చే వాటిపై), రహదారులపై తిరిగే వాహనాలపై విధించే పన్ను, వృత్తి పన్ను.

ఇతర మార్గాలు: అడవులు, నీటిపారుదల, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయం.

ఆర్టికల్‌ 266: కేంద్ర సంఘటిత నిధి గురించి వివరిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని కేంద్ర సంఘటిత నిధిలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల కోసం చేసే ఖర్చులన్నీ ఈ నిధి నుంచే చెల్లిస్తారు. ఈ నిధి నుంచి నగదు తీసి ఖర్చు చేయాలంటే పార్లమెంటు ముందస్తు అనుమతి తప్పనిసరి.


ఆర్టికల్‌ 266(1): రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని దీనిలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులన్నీ ఈ నిధి నుంచే చెల్లిస్తారు. ఈ నిధి నుంచి నగదు ఖర్చు చేయాలంటే రాష్ట్ర శాసనసభ ముందస్తు ఆమోదం ఉండాలి.


ఆర్టికల్‌ 267: కేంద్ర ఆగంతుక నిధి గురించి వివరిస్తుంది. ఈ నిధి రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది. జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు లాంటి ఊహించని, అనుకోని ఖర్చులు కేంద్ర ప్రభుత్వానికి ఎదురైనప్పుడు రాష్ట్రపతి అనుమతితో ఆగంతుక నిధి నుంచి నగదు తీసి ఖర్చు చేయవచ్చు. తర్వాత ఈ ఖర్చుకు సంబంధించిన ఆమోదాన్ని పార్లమెంటు నుంచి పొందవచ్చు.


* భారత ఆగంతుక నిధి చట్టం-1950 ద్వారా 1950, ఆగస్టు 14న రూ.50 కోట్లతో ఈ నిధిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.


ఆర్టికల్‌ 267(1): రాష్ట్ర ఆగంతుక నిధి గురించి వివరిస్తుంది. ఈ నిధి గవర్నర్‌ నియంత్రణలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని, అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు గవర్నర్‌ అనుమతితో ఈ నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు.  తర్వాత శాసనసభ ఆమోదం ద్వారా ఆ ఖర్చును చట్టబద్ధం చేస్తారు.


క్యాపిటేషన్‌ పన్ను: ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా వ్యక్తులపై విధించే పన్నును ‘క్యాపిటేషన్‌ పన్ను’ అంటారు.


ఉదా: వినోదం, జూదం, పందేలపై విధించే పన్ను, స్టాంపు డ్యూటీ (ఆర్థిక సంబంధ పత్రాలు మినహాయించి).


టోల్‌ట్యాక్స్‌: రహదారుల నిర్మాణానికి అయ్యే ఖర్చు వసూలు, నిర్వహణ వ్యయం, వాహనాల భద్రత కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తారు. జాతీయ హైవేల చట్టం-1956, జాతీయ హైవేల నిబంధనలు-2008 ప్రకారం దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ట్యాక్స్‌ వసూలు చేస్తారు.


ఆర్టికల్‌ 268: కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది. వాటిని రాష్ట్రాలు వసూలు చేసి ఉపయోగించుకుంటాయి.


ఉదా: టాయిలెట్‌ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం, ఆల్కహాల్‌ ఆధారంగా తయారు చేసిన ఔషధాలు, బీమా పాలసీల బదలాయింపు, విత్త సంబంధ పత్రాలపై స్టాంప్‌ డ్యూటీ.


ఆర్టికల్‌ 268(A): దీన్ని 88వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా చేర్చారు. దీని ప్రకారం సర్వీస్‌ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది. వసూలైన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 10వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 80వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి, కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 29% వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు 42% బదిలీ చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ వాటాను 41%గా నిర్ణయించారు.


ఆర్టికల్‌ 269: కేంద్రం కొన్నిరకాల పన్నులను విధించి, వసూలు చేసి వాటిలో కొంత వాటాను రాష్ట్రాలకు ఇస్తుంది.


ఉదా: వారసత్వపు పన్ను, నౌకాయాన, రైల్వే, వైమానిక స్థావరాలను రాష్ట్ర భూభాగంలో ఏర్పాటు చేసి వినియోగిస్తుండటంతో, వాటి ఆదాయంలో కొంత మొత్తాన్ని రాష్ట్రాలకు చెల్లిస్తారు.


ఆర్టికల్‌ 269(A): ఇది సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించింది. అంతర్‌ రాష్ట్రాల మధ్య జరిగే వాణిజ్య, వ్యాపారాలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి, వసూలు చేసి, కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది.


ఆర్టికల్‌ 270: దీని ప్రకారం ఆదాయ పన్నును కేంద్రం విధించి, వసూలు చేసి రాష్ట్రాలతో పంచుకుంటుంది.


* కార్పొరేషన్‌ పన్ను, సంపద పన్ను, కస్టమ్స్‌ సుంకం, బహుమతిపై పన్ను, ఆదాయ పన్నుపై సర్‌ఛార్జీ లాంటి వాటిని కేంద్రం విధించి, వసూలుచేసి కేంద్రమే ఉపయోగించుకుంటుంది.


* కమర్షియల్‌ ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ట్యాక్స్‌ లాంటి వాటిని రాష్ట్రాలు విధించి, వసూలు చేసి రాష్ట్రాలే వినియోగించుకుంటాయి.

ఆర్టికల్‌ 271: ఆదాయపు పన్నుపై వేసే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వాడుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు వాటా ఉండదు.


ఆర్టికల్‌ 272: కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన వివిధ పన్నుల వివరాలను పేర్కొంటుంది. ఈ ఆర్టికల్‌ను 80వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు.


ఆర్టికల్‌ 273: బిహార్, అస్సాం, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ లాంటి జౌళి వస్తువులను ఎగుమతి చేసే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుంది.


ఆర్టికల్‌ 274: రాష్ట్రాల ప్రయోజనాలపై ప్రభావం చూపే బిల్లులను రాష్ట్రపతి ఆమోదం ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.


ఆర్టికల్‌ 275: కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు సహాయక గ్రాంట్లను మంజూరు చేస్తుంది. ఈ సహాయం రాష్ట్రాల వారీగా వేర్వేరుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం రాష్ట్రాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు అవసరమైన సహాయక గ్రాంట్లను కేంద్రమే మంజూరు చేస్తుంది.


ఆర్టికల్‌ 276: వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500 మించకుండా పన్నును విధించి వసూలు చేయవచ్చు.


ఆర్టికల్‌ 277: ఆర్థికపరమైన వివిధ రకాల మినహాయింపుల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 278: రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పరచుకునే వివిధ రకాల పన్నుల ఒప్పందాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 279: పన్నులకు సంబంధించిన నియమ నిబంధనలు కేంద్రం రాష్ట్రాలకు ఆదాయ వనరులను సమకూర్చేటప్పుడు పాటించే పద్ధతులను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 279(A): 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజుల్లోపు  రాజ్యాంగబద్ధమైన ‘వస్తువులు, సేవల పన్నుల’ కౌన్సిల్‌ను రాష్ట్రపతి ఏర్పాటు చేయాలి.


ఆర్టికల్‌ 280: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ చేసేందుకు అయిదేళ్లకోసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు.


ఆర్టికల్‌ 281: కేంద్ర ఆర్థిక సంఘం సమర్పించిన సిఫార్సులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాష్ట్రపతి పార్లమెంటుకు నివేదిస్తారు.


ఆర్టికల్‌ 282: కొన్ని రకాల ప్రజాప్రయోజనాల కోసం శాసనం రూపొందించే అధికారం పార్లమెంటుకు లేదా రాష్ట్ర శాసనసభలకు లేకపోయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి ఆ ప్రజాప్రయోజనాల కోసం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.


ఆర్టికల్‌ 283: ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలియజేస్తుంది. వీటికి అవసరమైన నియమాలను జాతీయ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో శాసనసభలు నిర్ణయిస్తాయి.


ఆర్టికల్‌ 284: కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు భారత ప్రభుత్వ/రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల కోసం ప్రజలు/ఇతర సంస్థలు చెల్లించే సొమ్ము సందర్భానుసారం ఆయా ఖాతాల్లో జమ అవుతుంది. 


* న్యాయస్థానాలు స్వీకరించే పిటిషనర్‌ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము సందర్భానుసారం ఆయా ఖాతాలకు జమ అవుతుంది.


ఆర్టికల్‌ 285: కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 286: కొన్ని రకాల క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 287: కేంద్ర ప్రభుత్వం వినియోగించిన, కొనుగోలు చేసిన విద్యుత్తుపై రాష్ట్రాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 288: అంతర్‌ రాష్ట్ర నదులు, నదీలోయల అభివృద్ధి కోసం పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించుకునే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 289: రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.


ఆర్టికల్‌ 290: కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్ల గురించి వివరిస్తుంది. కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాన్ని వివరిస్తుంది.


ఆర్టికల్‌ 291: మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజ భరణాల గురించి వివరిస్తుంది. ఇందిరాగాంధీ ప్రభుత్వం 26వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 ద్వారా రాజ భరణాలను రద్దు చేసింది.


ఆర్టికల్‌ 292: పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలు పొందవచ్చు.


ఆర్టికల్‌ 293: రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రుణాలను సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు.


ఆర్టికల్‌ 294: కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యతలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 295: ఇతర వివాదాల విషయంలో వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 296: స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉండే హక్కులను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 297: సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి ఉండే అధికారాన్ని వివరిస్తుంది.


ఆర్టికల్‌ 298: వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన విధానాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 299: ఆర్థిక, వాణిజ్య ఒప్పందాల గురించి వివరిస్తుంది.


ఆర్టికల్‌ 300: ఆర్థికపరమైన వివాదాలు, వ్యాజ్యాల్లో అనుసరించాల్సిన మార్గాలను వివరిస్తుంది.


ఆర్టికల్‌ 300(A): చట్టప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు. ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా పరిగణిస్తారు.

 


రచయిత: బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 25-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

లోక్‌సభ - ప్రత్యేక అధికారాలు

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం! 

ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత ప్రాథమిక శాసనసభ లోక్‌సభ. చట్టాలను చేయడంలో, బడ్జెట్లను ఆమోదించడంలో, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. జాతీయ విధానాలను రూపొందిస్తుంది. ప్రజల అభీష్టాలను ప్రతిబింబిస్తుంది. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుంది.  కేంద్ర కార్యనిర్వాహక శాఖపై నియంత్రణ కలిగి ఉంటుంది. ఇందుకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ ఆధికరణలు, సంబంధిత తీర్మానాల ఉద్దేశాలను ఉదాహరణలతో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన దిగువ సభ కూర్పు, సభ్యుల సంఖ్యలో మార్పుచేర్పులు, రిజర్వేషన్లు, సభ కాలపరిమితి తదితర అంశాలతో పాటు శాసన, ఆర్థిక సంబంధ విషయాల్లో రాజ్యసభపై ఆధిక్యాన్ని ప్రదర్శించే సందర్భాలనూ అర్థం చేసుకోవాలి.

భారతదేశ ప్రజలకు లోక్‌సభ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సభలోని సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. అందుకే ఈ సభ కేంద్ర శాసన నిర్మాణ శాఖలో శక్తిమంతమైనదిగా, ప్రజాస్వామ్యయుతమైనదిగా, సంపూర్ణ ప్రాతినిధ్యానికి వేదికగా నిలుస్తోంది. దేశాభివృద్ధికి, దేశ ప్రజల శ్రేయస్సుకు అవసరమైన చట్టాలు, విధానాలు రూపొందించడంలో కీలక భూమిక పోషిస్తోంది.


ప్రభుత్వ ఏర్పాటు: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం సగానికన్నా ఎక్కువ స్థానాలు గెలుపొందిన రాజకీయ పార్టీకి చెందిన లేదా మద్దతు పొందిన నేత లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారు.


ఉదా: 1952లో మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 489 స్థానాలకుగాను 364 స్థానాలను భారత జాతీయ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) గెలుపొందింది. ఈ పార్టీ నాయకుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ లోక్‌సభకు నాయకుడిగా ఎన్నికై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.


* లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ రాకపోతే కొన్ని రాజకీయ పక్షాలు ఒక కూటమిగా ఏర్పాటై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.


ఉదా: 1989లో 9వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్, మిగిలిన రాజకీయ పార్టీలతో కలిసి ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి, లోక్‌సభ నాయకుడిగా ఎన్నికై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 

ప్రభుత్వాన్ని నియంత్రించడం: కేంద్ర ప్రభుత్వ మితిమీరిన పోకడలను లోక్‌సభ వివిధ పద్ధతుల ద్వారా నియంత్రించి, పరిపాలనను రాజ్యాంగబద్ధంగా కొనసాగే విధంగా చూస్తుంది. 


అవిశ్వాస తీర్మానం: ప్రభుత్వ పనితీరు పట్ల ప్రతిపక్ష పార్టీలు అసంతృప్తి చెందితే లోక్‌సభలో ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెడతాయి. అది నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


ఉదా: 1999లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మంత్రివర్గం అధికారాన్ని కోల్పోయింది.


* అవిశ్వాస తీర్మాన నోటీసుపై 50 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసిన అనంతరం స్పీకర్‌కు అందజేయాలి. దానిపై సభలో చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో సాధారణ మెజార్టీతో తీర్మానం నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. రెండు అవిశ్వాస తీర్మానాల మధ్య కనీసం 6 నెలల విరామం ఉండాలి. ‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంటు-1950’’ చట్టాన్ని అనుసరించి అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టాలి.


విశ్వాస తీర్మానం: ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది.అవసరమైనప్పుడు లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఆదేశిస్తారు. ఆ సందర్భంలో లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో  సాధారణ మెజార్టీతో తీర్మానం ఓడిపోతే ప్రభుత్వం అధికారం కోల్పోతుంది.


ఉదా: 1990లో 9వ లోక్‌సభలో అప్పటి ప్రధాని వి.పి.సింగ్‌ లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం వీగిపోవడంతో ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది.


కోత తీర్మానాలు: సాధారణంగా లోక్‌సభలో కోత తీర్మానాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. వాటిపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అందులో ఆ తీర్మానాలు నెగ్గితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది. ఈ తీర్మానాలు 3 రకాలుగా ఉన్నాయి. 


1) విధానకోత తీర్మానం(Policy cut motion): వివిధ పద్దుల నుంచి కోరిన మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసే తీర్మానాన్ని ‘విధాన కోత తీర్మానం’ అంటారు. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో ప్రభుత్వం ఎంచుకున్న విధానానికి ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా సూచించవచ్చు.


2) ఆర్థిక కోత తీర్మానం(Economy cut motion):  ప్రభుత్వ దుబారాను నియంత్రించే ఉద్దేశంతో వివిధ పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ఆర్థిక కోత తీర్మానం.


3) నామమాత్రపు కోత తీర్మానం (Token cut motion):  పద్దుల నుంచి రూ.100 తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానమే ‘నామమాత్రపు కోత తీర్మానం’. బడ్జెట్‌లో ప్రభుత్వం విస్మరించిన ప్రత్యేక అంశాన్ని ఎత్తిచూపడం దీని ఉద్దేశం.

 

సమష్టి బాధ్యత: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహించాలి. ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తే మంత్రులు పదవులను కోల్పోతారు.


* ఉదా: హిందూ కోడ్‌ బిల్లు విషయమై జవహర్‌లాల్‌ నెహ్రూతో విభేదించిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌


* చైనాతో యుద్ధం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వి.కె.కృష్ణమీనన్‌


* పాకిస్థాన్‌తో 1966లో లాల్‌బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వం కుదుర్చుకున్న తాష్కెంట్‌ ఒప్పందాన్ని వ్యతిరేకించడం వల్ల మహావీర్‌ త్యాగి.


* 1986లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం రూపొందించిన ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల హక్కుల చట్టం’ను వ్యతిరేకించడం వల్ల అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌.


* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం ప్రణాళిక సంఘానికి విశేష ప్రాధాన్యం కల్పించడాన్ని వ్యతిరేకించడం వల్ల వి.వి.గిరి. పదవులు కోల్పోయారు

ఆర్థిక బిల్లులపై - విశేష ఆధిపత్యం: ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా అని ధ్రువీకరించే విశేష అధికారం లోక్‌సభకు ఉంది. దీనిని స్పీకర్‌ నిర్ణయిస్తారు. ఆర్థిక బిల్లులను ముందుగా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. ఆ సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయం తెలియజేయాలి. లేకపోతే సంబంధిత బిల్లులను ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. ఆర్థిక బిల్లుల విషయమై లోక్‌సభ, రాజ్యసభల మధ్య విభేదాలు వస్తే ‘పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం’ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదు. 

అంచనాల సంఘం: ఇది పార్లమెంటు నుంచి ఏర్పడే కీలకమైన ఆర్థిక కమిటీ. జాన్‌ మత్తాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 1950లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని 30 మంది సభ్యులు లోక్‌సభకు చెందినవారే. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు లేదా మితవ్యయం పాటించే పద్ధతులను ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. సభ్యులు లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నికవుతారు.

పార్లమెంటరీ కమిటీలు: పార్లమెంటు నుంచి ఏర్పడిన మొత్తం 24 శాఖాపరమైన పార్లమెంటరీ కమిటీల్లో 16 కమిటీలకు ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు. ప్రభుత్వ ఖాతాల సంఘంలోని 22 మంది సభ్యుల్లో 15 మంది లోక్‌సభ సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులను నియమించడం ఒక సంప్రదాయంగా 1967 నుంచి కొనసాగుతోంది. ఇది అతిపురాతనమైన పార్లమెంటరీ కమిటీ.

పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం: సాధారణ బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ బిల్లులను ఆమోదించే క్రమంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. లోక్‌సభ ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యసభ తిరస్కరించినా, సవరణలు సూచించినా, 6 నెలల్లోగా ఎలాంటి నిర్ణయం తెలియజేయకపోయినా ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా భావిస్తారు. సంయుక్త సమావేశంలో జరిగే ఓటింగ్‌ను అనుసరించి బిల్లు భవిష్యత్తును నిర్ణయిస్తారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లోక్‌సభ అభిప్రాయమే నెగ్గుతుంది. అలాంటి ఉభయసభల సంయుక్త సమావేశాలు ఇప్పటివరకు మూడు సార్లు నిర్వహించారు.


1) 1961, మే 6న ‘వరకట్న నిషేధ బిల్లు’ను ఆమోదించే విషయంలో ఉభయసభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాటి లోక్‌సభ స్పీకర్‌ అనంతశయనం అయ్యంగార్‌ అధ్యక్షత వహించారు.


2) 1978, మే 26న బ్యాంకింగ్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు/రద్దుకు సంబంధించిన సర్వీసు నిబంధనలను ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. స్పీకర్‌ కె.ఎస్‌.హెగ్డే అధ్యక్షత వహించారు.


3) 2002, మార్చి 26న పోటా (POTA) బిల్లును ఆమోదించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రధాని వాజ్‌పేయీ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. డిప్యూటీ స్పీకర్‌ పి.ఎం.సయీద్‌ అధ్యక్షత వహించారు. (స్పీకర్‌ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహించారు).

జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ ప్రకటిస్తారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్‌సభకు ప్రత్యేక అధికారాన్ని కల్పించారు. దీని ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్‌సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలని కోరుతూ లోక్‌సభలోని 1/10 వంతు సభ్యులు ఒక తీర్మాన నోటీసును లోక్‌సభ స్పీకర్‌కు లేదా రాష్ట్రపతికి సమర్పించవచ్చు. 14 రోజుల్లోగా లోక్‌సభ ఈ అంశాన్ని చర్చించి సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదిస్తే అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తారు.

ప్రభుత్వం - అధికారాన్ని కోల్పోయే సందర్భాలు: లోక్‌సభలో కొన్ని బిల్లుల విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుంది.


- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లోక్‌సభలో వీగిపోయినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరించినప్పుడు.


- ప్రభుత్వం వ్యతిరేకిస్తుండగా, ప్రైవేటు సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు నెగ్గినప్పుడు.


- ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పబ్లిక్‌ బిల్లు’ తిరస్కరణకు గురైనప్పుడు.

లోక్‌సభ సభ్యుల సంఖ్యలో మార్పులు, చేర్పులు: రాజ్యాంగం లోక్‌సభ సభ్యుల సంఖ్యను నిర్ధారించలేదు. కానీ ఆ సంఖ్యను నిర్ధారించే పద్ధతిని మాత్రం పేర్కొంది. ఆర్టికల్‌ 82 ప్రకారం దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రభుత్వం ‘నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌’(Delimitation Commission) ను ఏర్పాటు చేస్తుంది. ఈ కమిషన్‌ సూచనల మేరకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశిస్తుంది. 1950లో ఒకటో ‘డీలిమిటేషన్‌ కమిషన్‌’ సిఫార్సుల మేరకు 489 స్థానాలు నిర్దేశించారు. 1962లో రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు 525 స్థానాలు నిర్దేశించారు. 1972లో మూడో డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు, 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 550గా పేర్కొన్నారు. వీటిలో 530 మంది రాష్ట్రాలకు, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించాలని పేర్కొన్నారు.


* ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు. అయితే 104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2020 ప్రకారం ఈ నామినేషన్‌ విధానాన్ని రద్దు చేశారు.

రిజర్వేషన్లు: లోక్‌సభలో అన్నివర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ వర్గాల వారికి 84 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 47 స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం ఇవే స్థానాలు కొనసాగుతున్నాయి.

లోక్‌సభ కాలం: ఆర్టికల్‌ 83 ప్రకారం సాధారణంగా లోక్‌సభ కాలం 5 సంవత్సరాలు. అయితే కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు లోక్‌సభను ఆ కాలం కంటే ముందే రాష్ట్రపతి రద్దు చేయవచ్చు.ఆర్టికల్‌ 352 ప్రకారం ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ అమలులో ఉన్న సందర్భంలో లోక్‌సభ కాలాన్ని ఒక సంవత్సరం వరకు అదనంగా పొడిగించవచ్చు (5 నుంచి 6 సంవత్సరాల వరకు).

 

 

బంగారు సత్యనారాయణ


 

 

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిల్లులు - వివరణ

చట్టాల తయారీలో సభాపర్వం!

ప్రజల ఆకాంక్షలు, కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఎప్పటికప్పుడు పార్లమెంటు కొత్త చట్టాలను  చేస్తుంది. ఒక చట్టాన్ని రూపొందించేందుకు ముందు ఉభయ సభల్లో ముసాయిదా బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లులు రకరకాలుగా ఉంటాయి. వాటి గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఆ ప్రక్రియలపై, సాంకేతిక పదజాలంపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే సాధారణ, ద్రవ్య, ఆర్థిక బిల్లులు, పబ్లిక్, ప్రైవేట్‌ బిల్లుల రకాలు, నిర్వచనాలు, సంబంధిత రాజ్యాంగ నిబంధనలు, మౌలికాంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. 

భారతదేశంలో ‘బిల్లులు’ పార్లమెంటులోని ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభలు అంగీకరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో ‘శాసనాలు’గా మారతాయి.


సాధారణ బిల్లులు:

ఆర్టికల్‌ 107: సాధారణ బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభల ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో శాసనంగా మారుతుంది.

ఆర్టికల్‌ 108: రాష్ట్రపతి పలు సందర్భాల్లో పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.

* ఒక సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించి, రెండో సభ తిరస్కరించినప్పుడు. 

* ఒక సభ ఆమోదించిన బిల్లును రెండో సభ 6 నెలలకుపైగా ఆమోదించకుండా నిలువరించినప్పుడు. 

* బిల్లులో ప్రతిపాదించిన సవరణల విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు. 

* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్‌ అందుబాటులో లేకపోతే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. ఆ వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

* పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం కేవలం సాధారణ బిల్లుల ఆమోద ప్రక్రియల సందర్భంలో మాత్రమే ఏర్పాటవుతుంది. ద్రవ్యబిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోద ప్రక్రియల్లో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించాలంటే రెండు సభల్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో పదో వంతు (10%) సభ్యుల కోరం ఉండాలి. సమావేశం నిర్వహణ లోక్‌సభలోని నియమావళి ప్రకారం ఉంటుంది. సమావేశంలో సభ్యులు హాజరై ఓటింగ్‌లో పాల్గొని, సాధారణ మెజార్టీతో బిల్లులను ఆమోదిస్తే రెండు సభలు ఆమోదించినట్లుగా పరిగణిస్తారు. అనంతరం ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే చట్టంగా మారుతుంది.


ద్రవ్య బిల్లులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 110 ద్రవ్య బిల్లుల గురించి నిర్వచించింది. భారత సంఘటిత నిధిపై భారం మోపే ప్రతి బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటారు. రాష్ట్రపతి పూర్వానుమతితో ముందుగా లోక్‌సభలో మాత్రమే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టాలి. దీనిని పబ్లిక్‌ బిల్లుగా పరిగణిస్తారు. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. రాజ్యసభ 14 రోజుల్లోగా ఈ బిల్లుపై తన అభిప్రాయాన్ని/ ఆమోదాన్ని తెలియజేయాలి.


ద్రవ్య బిల్లుపై రాజ్యసభ అధికారాలు:  ద్రవ్య బిల్లుపై రాజ్యసభకు కేవలం నామమాత్రపు అధికారాలే ఉన్నాయి. ఈ బిల్లుపై రాజ్యసభ చర్చించవచ్చు. కొన్ని సిఫార్సులు చేయవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదించవచ్చు. ‘ద్రవ్య బిల్లు’ను తిరస్కరించే అధికారంలేదా సవరించే అధికారం రాజ్యసభకు లేదు. ద్రవ్య బిల్లుపై రాజ్యసభ 14 రోజుల్లోగా నిర్ణయాన్ని వెల్లడించాలి. లేకపోతే బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించి, రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపుతారు. 

*  ఆర్టికల్‌ 110(1) ప్రకారం పన్నుల విధింపు, రద్దు, తగ్గింపు, మార్పు చేయడం, క్రమబద్ధీకరించడం మొదలైన అంశాల్లో ఏ ఒక్క అంశం ఉన్నా దాన్ని ‘ద్రవ్య బిల్లు’గా పేర్కొంటారు.


* ఆర్టికల్‌ 110(2) ప్రకారం జరిమానాలు, లైసెన్స్‌ ఫీజులు, స్థానిక  స్వపరిపాలనా సంస్థలు విధించే సుంకాలు ఉన్నంత మాత్రాన దాన్ని ద్రవ్యబిల్లుగా పరిగణించరు. 

 

*  ఆర్టికల్‌ 110(3) ప్రకారం ఒక బిల్లు ద్రవ్య బిల్లా? కాదా? అనే ప్రశ్న వచ్చినప్పుడు లోక్‌సభ స్పీకర్‌ తుది నిర్ణయం ప్రకటిస్తారు. ఆ అధికారం స్పీకర్‌కే ఉంటుంది. ఆ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో లేదా పార్లమెంటులో సవాలు చేయడానికి వీల్లేదు. రాష్ట్రపతి కూడా దీనిపై ప్రశ్నించకూడదు. ప్రతి ద్రవ్య సంబంధ బిల్లుని ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. దీనిని మంత్రివర్గ సభ్యుడు మాత్రమే సభలో ప్రవేశపెట్టాలి. 

 

* ఆర్టికల్‌ 110(4)ను అనుసరించి ద్రవ్య బిల్లును ఆర్టికల్‌ 109 ప్రకారం రాజ్యసభకు పంపేటప్పుడు, ఆర్టికల్‌ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి పంపేటప్పుడు సంబంధిత బిల్లును ద్రవ్య బిల్లుగా లోక్‌సభ స్పీకర్‌ ధ్రువీకరించాలి.


ఆర్థిక బిల్లు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 117 ఆర్థిక బిల్లుల గురించి వివరిస్తుంది. ప్రభుత్వ ఆదాయం, వ్యయానికి సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ‘ఆర్థిక బిల్లులు’ అంటారు. వీటిని 2 రకాలుగా వర్గీకరించవచ్చు.


మొదటి తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం రుణాలను సేకరించే నియమ నిబంధనలు ఉంటాయి. దీనిని రాష్ట్రపతి పూర్వానుమతితో లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. ఇది లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో ఓటింగ్‌కు వచ్చినప్పుడు సాధారణ బిల్లుగానే పరిగణించి, రాజ్యసభ కూడా లోక్‌సభతో సమానంగా అధికారాలను కలిగి ఉంటుంది. బిల్లును సవరించే ప్రక్రియను రాజ్యసభ సూచించవచ్చు లేదా బిల్లును తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అంగీకారం కుదరకపోతే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు.


రెండో తరగతి ఆర్థిక బిల్లు: ఈ బిల్లులో కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేసే అంశాలు ఉంటాయి. ఆర్టికల్‌ 110లో పేర్కొన్న అంశాలు ఉండవు. ఈ బిల్లును సాధారణ బిల్లుగానే పరిగణించవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తరహా బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఆమోదించే క్రమంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. నీ ద్రవ్య బిల్లులను, మొదటి తరగతి ఆర్థిక బిల్లులను కేవలం రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే లోక్‌సభలో ప్రవేశపెట్టాలి. 

* రెండో తరగతి ఆర్థిక బిల్లులను, సాధారణ బిల్లులను రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సంబంధం లేకుండానే పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులో అయినా ప్రవేశపెట్టవచ్చు.


వార్షిక బడ్జెట్‌: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 112 ‘వార్షిక బడ్జెట్‌’(Anual Financial Statement) గురించి వివరిస్తుంది. బడ్జెట్‌ అనేది ఒక రకమైన ఆర్థిక బిల్లు. వార్షిక ఆదాయ, వ్యయాల అంచనాల విత్త పట్టికను ‘బడ్జెట్‌’ అంటారు. భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఈ విధానం 1863 నుంచి కొనసాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను 1947లో నాటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె.షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. 1921లో విలియం ఆక్వర్త్‌ కమిటీ సూచనల మేరకు 1924 నుంచి సాధారణ వార్షిక బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేశారు. 2017లో దెబ్రాయ్‌ కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్‌ను వార్షిక బడ్జెట్‌లో విలీనం చేశారు.


* వార్షిక బడ్జెట్‌లో వ్యయ అంచనాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి 

1) భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు. 

2) భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు.

భారత సంఘటిత నిధి నుంచి చెల్లించే వ్యయాలు: 

* రాష్ట్రపతి జీతభత్యాలు, రాష్ట్రపతి కార్యాలయ ఖర్చులు, రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ జీతభత్యాలు. 

*  సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలు, పెన్షన్, హైకోర్టు న్యాయమూర్తుల పెన్షన్‌.నీ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యుల జీతభత్యాలు, పెన్షన్‌.నీ భారత ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాలు, రుణాలపై వడ్డీ.

* ఏదైనా న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పును అమలు చేయడానికి అయ్యే ఖర్చులు, సుప్రీంకోర్టు, కాగ్, యూపీఎస్సీకి సంబంధించిన పాలనా ఖర్చులు, కార్యాలయ నిర్వహణ ఖర్చులు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్‌లు.


భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే వ్యయాలు: 

పార్లమెంటులో బడ్జెట్‌ ద్వారా ప్రవేశపెట్టే ‘డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌’లో ఉండే 109 రకాల ఖర్చులపై ఓటింగ్‌ నిర్వహించవచ్చు. ఆ సందర్భంలో ఖర్చులు తగ్గించుకోమని సూచిస్తూ కోత తీర్మానాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. ఈ కోత తీర్మానాలు 3 రకాలుగా ఉంటాయి. అవి 

1) విధాన కోత తీర్మానం 

2) పొదుపు కోత తీర్మానం 

3) టోకెన్‌ కోత తీర్మానం.

వార్షిక బడ్జెట్‌ ఆమోదంలో 6 దశలు ఉంటాయి. అవి 

1) ప్రవేశ దశ 

2) సాధారణ చర్చ 

3) డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీల ద్వారా పరిశీలన 

4) గ్రాంట్ల కోసం డిమాండ్లపై ఓటింగ్‌ 

5) ఉపకల్పన బిల్లు ఆమోదం 

6) ద్రవ్య బిల్లు ఆమోదం.


వార్షిక బడ్జెట్‌తో పాటు ఆమోదించే ఇతర గ్రాంట్లు: సాధారణ ఆదాయ, వ్యయ అంచనాలతో ఉండే వార్షిక బడ్జెట్‌తోపాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు కొన్ని ఇతర గ్రాంట్లను కూడా ఆమోదిస్తుంది. అవి  

1) అనుబంధ గ్రాంట్లు 

2) అదనపు గ్రాంట్లు 

3) ఎక్సెస్‌ గ్రాంట్లు 

4) నామమాత్రపు గ్రాంట్లు 

5) ఓట్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌.



 

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 18-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ

పరిపాలనా సౌలభ్యమే పరమలక్ష్యం!

విభిన్న జాతులు, భాషలు, ప్రాంతాల మధ్య సమతౌల్యతను సాధించి సమర్థ పాలనను అందించడమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పరమోద్దేశం. భాష, సంస్కృతుల ఆధారంగా విభజన జరిపి, పరిపాలనను సులభతరం చేయడమే లక్ష్యం. తద్వారా అసమానతలను తొలగించడం, ఆర్థికాభివృద్ధితోపాటు, భాషాపరమైన గుర్తింపును పెంపొందించడం  సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాల పునర్నిర్మాణ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.  సంబంధిత రాజ్యాంగ విధానాలను ఆర్టికల్స్‌తో సహా అభ్యర్థులు తెలుసుకోవాలి. వివిధ వేర్పాటువాద ఉద్యమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ వరకు సంభవించిన పరిణామాలు, సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీలు, అవి చేసిన సిఫార్సులు, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


రాష్ట్రాల విస్తీర్ణాల్లో మార్పులు, చేర్పులు చేయడం; కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల పేర్లు, సరిహద్దులను మార్చడం మొదలైన అంశాలన్నింటినీ ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’గా పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. పునర్వ్యవస్థీకరణకు గురయ్యే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తెలియజేయాలని రాష్ట్రపతి గడువు విధిస్తారు. అయితే ఆ అభిప్రాయం ఏదైనప్పటికీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడటం తదితర నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. 


* 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశంలో ‘ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు’ను కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. 1927లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థిస్తూ కాంగ్రెస్‌  సమావేశం తీర్మానించింది. 1928 నాటి ‘నెహ్రూ రిపోర్ట్‌’ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమర్థించింది. భాష ప్రాతిపదికన ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సైమన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. 

 1945లో కేంద్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, 1946లో రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల సందర్భంలో ‘భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు’ అంశాన్ని తన ఎన్నికల ప్రణాళిక పత్రంలో కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనే అంశం అధ్యయనానికి వివిధ కమిటీలను నెలకొల్పారు.. 


ఎస్‌.కె.థార్‌ కమిషన్‌: 1948, జూన్‌లో రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలనకు అలహాబాద్‌ హైకోర్ట్‌ న్యాయమూర్తి సరోజ్‌ కుమార్‌ థార్‌ అధ్యక్షతన నియమించిన కమిటీ 1948, డిసెంబరులో నివేదిక సమర్పించింది. అందులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ‘భౌగోళిక అవిచ్ఛిన్నత, ఆర్థిక స్వయంసమృద్ధి, అత్యధిక ప్రజల ఆమోదం’ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.


సిఫార్సులు: 

 భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు. 

 పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరగాలి.


జె.వి.పి. కమిటీ: ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో 1948, డిసెంబరులో జైపుర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసేందుకు  జె.వి.పి. కమిటీని ఏర్పాటు చేశారు.అందులో జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు. అది 1949, ఏప్రిల్‌లో తన నివేదికను సమర్పించింది. 


సిఫార్సులు:  

 భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయాలి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి. 

 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత లాంటి అంశాలు ప్రాతిపదిక కావాలి. 

 మద్రాసును వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు.


నిరశన దీక్షలు: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1951, ఆగస్టు 15న గొల్లపూడి సీతారామశాస్త్రి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 35వ రోజుకు చేరుకున్న తర్వాత ఆచార్య వినోబా భావే సూచనలతో ఆయన దీక్ష విరమించారు. మళ్లీ 1952, అక్టోబరు 19న పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజుల దీక్ష అనంతరం డిసెంబరు 15న మరణించారు. దీంతో అల్లర్లు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీనికి స్పందించిన జవహర్‌లాల్‌ నెహ్రూ 1952, డిసెంబరు 19న పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.


కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ (1953):  ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధ్యయనం చేసేందుకు 1953, జనవరి 6న కైలాష్‌నాథ్‌ వాంఛూ (రాజస్థాన్‌ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి) కమిటీని ఏర్పాటు చేశారు. అది తన నివేదికను 1953, మార్చి 23న సమర్పించింది. దాని ఆధారంగా 1953, మార్చి 25న జవహర్‌లాల్‌ నెహ్రూ 11 జిల్లాలతో ‘ఆంధ్ర రాష్ట్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించారు. దీంతో 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.


ఫజుల్‌ అలీ కమిషన్‌:  ఆంధ్ర రాష్ట్రం ఏర్పా టుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రాలను కోరుతూ ప్రజలు ఉద్యమించారు. నెహ్రూ కర్ణాటకలోని ‘బెల్గాం’ ప్రాంతాన్ని సందర్శించిన సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ప్రజలు తీవ్ర ఆందోళనలు చేశారు. దీంతో నెహ్రూ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్లను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో తగిన సిఫార్సులు చేసేందుకు 1953, డిసెంబరులో ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌’ ఏర్పాటు చేసింది. ఛైర్మన్‌గా ఫజుల్‌ అలీ, సభ్యులుగా కె.ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎన్‌.కుంజ్రు వ్యవహరించారు. ఈ కమిషన్‌ 1955, సెప్టెంబరులో కేంద్రానికి నివేదిక సమర్పించింది. 


సిఫార్సులు: 

 ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే వాదనను తిరస్కరించాలి. 

 పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ప్రాంతీయ మండళ్లు గా ఏర్పాటు చేయాలి.

 దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించాలి. 

 పార్ట్‌- ఎ, బి, సి, డి లుగా ఉన్న రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించాలి.

 జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని దిల్లీలో ఏర్పాటు చేయాలి.


రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం: ఫజుల్‌ అలీ కమిషన్‌ సిఫార్సుల మేరకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంటు 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ను  చేపట్టింది. ఈ చట్టం ద్వారా దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి.


శ్రీకృష్ణ కమిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చడంతో, సమస్య శాశ్వత పరిష్కారానికి నాటి కేంద్ర ప్రభుత్వం 2010, ఫిబ్రవరి 9న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.అది 2010, డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. 461 పేజీల నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొంది.


ప్రధాన సిఫార్సులు:  

1) ఆంధ్రప్రదేశ్‌లో ‘యథాతథ స్థితి’ని కొనసాగించడం.

2) రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలు కొత్త రాజధానులను అభివృద్ధి పరచుకోడానికి అవకాశం కల్పించడం. 

3) రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్రలుగా విభజించి, హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగం చేయడం. 4) ఆంధ్రప్రదేశ్‌ను సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించి, హైదరాబాద్‌ మహానగరాన్ని విస్తృతపరచి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయడం. 

5) రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల్లోనే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలుగా విభజించి, హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా కొనసాగించడం, సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం. 

6) రాష్ట్రాన్ని యథావిధిగానే ఉంచి, తెలంగాణ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారతకు నిర్దిష్టమైన రాజ్యాంగబద్ధ చర్యలు తీసుకోవడం, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం. శ్రీకృష్ణ కమిటీ ఆరో సూత్రానికి తమ ప్రథమ ప్రాధాన్యం అని, అది సాధ్యం కాకపోతే అయిదో సూత్రానికి రెండో ప్రాధాన్యం అని పేర్కొంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయ, భౌగోళిక, ఆర్థికాలతోపాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలూ కీలకమైనవని వివరించింది.


 

రచయిత: బంగారు సత్యనారాయణ 

Posted Date : 26-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌