Post your question

 

  Asked By: కె. విజయ్‌కుమార్‌

  Ans:

  ఏఐసీటీఈ గెజెట్‌ నోటిఫికేషన్‌ (28 ఏప్రిల్, 2017) ప్రకారం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్‌ రెండు డిగ్రీలు కూడా ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కానీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో గానీ ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్‌ రెండు డిగ్రీలూ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో అయినా, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో అయినా ఉండాలి.
  ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ 23 అక్టోబర్, 2020 నాడుఏఐసీటీఈ మరికొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమాల ప్రకారం మీరు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు అర్హులు కారు. ప్రస్తుతం మీకున్న విద్యార్హతలతోనే బోధన రంగంలో స్థిరపడాలనే ఆలోచన ఉంటే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. అలా కాకుండా ఇంజినీరింగ్‌ కళాశాల్లోనే పనిచేయాలన్న ఆసక్తి ఉంటే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంటెక్‌ చేసి, ఆ విభాగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. జాతీయ విద్యావిధానం అమలు జరిగినపుడు  సబ్జెక్టుల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతాయి. ఉద్యోగ అర్హతా నియమాల్లోనూ  మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

  Asked By: ఎ. అరవింద్‌

  Ans:

  ఏ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసినవారికైనా పూర్వ విద్యార్హతలతో సంబంధం లేకుండా సమస్యా పరిష్కార సామర్థ్యం, కోడింగ్, ప్రోగ్రామింగ్, అనలిటికల్‌ నైపుణ్యాలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. మీరు డిగ్రీ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం పెద్ద సమస్య కాదు. డిగ్రీ పూర్తి చేశాక ఏ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో వచ్చిన మార్కులను కాకుండా మీకున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొనే కంపెనీలు చాలా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ  చేయడం అనేది మీకో అదనపు అర్హత అవుతుంది. ముందుగా మీరు డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ కోర్సులను మరొకసారి పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకోండి. కొన్ని లైవ్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి మీ బయోడేటాను మెరుగుపర్చుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, వెబ్‌ డెవలప్‌మెంట్, బిగ్‌ డేటా, మెషిన్‌ లర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి వాటిలో మీకు నచ్చిన కోర్సుల్ని చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: nayudupalli

  Ans:

  - రెండు ఇంజినీరింగ్‌ బ్రాంచిల్లో దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తీ, అభిరుచులకు అనుగుణంగా ఏ బ్రాంచినైనా ఎంచుకోవాల్సివుంటుంది.

  ఈసీఈలో ఇంజినీరింగ్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ట్రాన్స్‌మిటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ లాంటి కమ్యూనికేషన్‌ పరికరాల గురించి చదువుతారు. వీటితో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌మిషన్, డేటా, వాయిస్, వీడియో రిసెప్షన్‌ (ఉదాహరణ ఏఎం, ఎఫ్‌ ఎం, డీటీహెచ్‌), మైక్రోప్రాసెసర్‌లు, శాటిలైట్‌ కమ్యూనికేషన్, మైక్రోవేవ్‌ ఇంజనీరింగ్, యాంటెన్నా, వేవ్‌ ప్రోగ్రెషన్‌ల గురించీ తెలుసుకుంటారు. ఉపగ్రహాలు, టెలివిజన్, రేడియో, కంప్యూటర్లు, మొబైల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి అప్లికేషన్ల తయారీలో ఈ ఇంజినీర్లు కీలక పాత్ర పోషిస్తారు.

  టెలికమ్యూనికేషన్, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ఐటీ, పవర్‌ సెక్టర్, హార్డ్‌వేర్‌ తయారీ, గృహోపకరణాలు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, టెలివిజన్‌ పరిశ్రమ, పరిశోధన- అభివృద్ధి, ఆధునిక మల్టీమీడియా సేవా సంస్థల్లో, సివిల్‌ ఏవియేషన్, డిఫెన్స్, ఆలిండియా రేడియో, రైల్వే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, డీఆర్‌డీ…ఓ లాంటి వివిధ రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువ. 

  కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో కంప్యుటేషన్‌కు సంబంధించిన వివిధ అంశాలతో పాటు కంప్యూటర్‌ నెట్‌ వర్క్, అల్గారిద]మ్‌ల విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌ భాషలు, ప్రోగ్రామ్‌ డిజైన్, సాఫ్ట్‌వేర్, డేటా మైనింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ల గురించి చదువుతారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మూలాలు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, గణితం, ఎలక్ట్రానిక్స్, భాషాశాస్త్రంలో ఉన్నాయి. వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించి అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్క్‌లను నిర్వహించడంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. పర్సనల్‌ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, స్కానర్‌ లాంటి కంప్యూటింగ్‌ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం కోడ్, సెక్యూరిటీ, అల్గారిద]మ్‌లను తయారుచేస్తారు. ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, అభివృద్ధి, టెస్టింగ్, నెట్‌వర్కింగ్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగావకాశం ఉంది.

  ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్, డేటా సైన్స్‌ లాంటి వినూత్న రంగాల్లో కూడా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లకు మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయి.

  Asked By: వి. విజయ్‌కుమార్, జగ్గంపేట

  Ans:

  - ఉద్యోగం చేస్తూ కూడా ఎంటెక్‌ చదవాలనుకోవడం అభినందనీయం. ఎంటెక్‌ను దూరవిద్యలో చేయడానికి అవకాశం లేదు. ఈ కోర్సును చాలా ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌గా అందిస్తున్నాయి. మీరు ఎంటెక్‌ కోర్సును రెగ్యులర్‌గా చదవాలనుకొంటే రెండు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, మంచి విద్యాసంస్థలో చదివే ప్రయత్నం చేయండి.

  అతి తక్కువ యూనివర్సిటీల్లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో క్లాసులు సాయంత్రం పూట నిర్వహిస్తారు.  బిట్స్‌ పిలానిలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది.

  Asked By: మేఘనా పట్నాయక్‌

  Ans:

  ఎంటెక్‌ కోర్సును చాలా ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు రెండు సంవత్సరాల ఫుల్‌టైమ్‌ ప్రోగ్రామ్‌గా అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో మీలాంటి ఉద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంది. పార్ట్‌ టైమ్‌ ఎంటెక్‌ కోర్స్‌ కాలవ్యవధి మూడు సంవత్సరాలు. ఈ కోర్సులో సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు. బిట్స్‌ పిలానీలో వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ ఉంది. మీరు పిలానీ వెళ్ళే అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో చదివి, ఆన్‌లైన్‌లో కానీ, ఎంపిక చేసిన నగరాల్లోని  పరీక్షకేంద్రాల్లో కానీ పరీక్షలు రాసి ఎంటెక్‌ కోర్సు పూర్తి చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: ఇ. శ్రీను

  Ans:

  టెస్ట్‌ ఇంజినీర్‌గా రాణించాలంటే ప్రాథమికంగా డెవ్‌ ఓపీఎస్‌ అండ్‌ ఎజైల్‌ మెథడాలజీ, ఆటోమేషన్, వెబ్‌ అండ్‌ మొబైల్‌ టెక్నాలజీస్, ఎస్‌డీఎల్‌సీ‡ సైకిల్, రేషనల్‌ అనాలిసిస్‌ అండ్‌ లాజికల్‌ థింకింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్, టెస్టింగ్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్, ప్రోగ్రామింగ్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటలెక్చువాలిటీ అండ్‌ క్రియేటివిటీ, టెస్ట్‌ ప్లానింగ్‌ అండ్‌ డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ సపోర్ట్, రిపోర్టింగ్, ఇండిపెండెంట్‌ వర్కింగ్‌లలో మెలకువలు ఉండాలి. వీటితోపాటు డొమైన్‌ పరిజ్ఞానమూ చాలా అవసరం. సాధారణంగా చాలా సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌ల్లో వాడే సెలెనియం, జావా, జేఐఆర్‌ఏ, జీఐటీ అండ్‌ ఎస్‌వీఎన్, బేసిక్‌ యునిక్స్‌ కమాండ్స్, బేసిక్‌ ఎస్‌క్యూఎల్‌ కమాండ్స్‌లో ప్రావీణ్యం అవసరం. మీరు ఈ రంగంలో స్కిల్స్‌ మెరుగుపరుచుకోవాలంటే ఇటీవల కాలంలో డిమాండ్‌ ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్, ఎన్‌ఎల్‌పీ‡, బిగ్‌డేటా ఆటోమేషన్‌ టెస్టింగ్, ఐఓటీ ఆటోమేషన్‌ టెస్టింగ్, రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, మొబైల్‌ టెస్ట్‌ ఆటోమేషన్, బ్లాక్‌ చైన్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లలో మీకు నచ్చిన రంగాల్లో శిక్షణ పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: పి. గురుమనోహర్‌

  Ans:

  ఈసీఈ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌)లో ఇంజినీరింగ్‌ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ట్రాన్స్‌మిటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ లాంటి కమ్యూనికేషన్‌ పరికరాల గురించి చదువుతారు. వీటితో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్స్, అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ ట్రాన్స్‌మిషన్, డేటా, వాయిస్, వీడియో రిసెప్షన్‌ (ఏఎం, ఎఫ్‌ఎం, డీటీహెచ్‌), మైక్రోప్రాసెసర్‌లు, శాటిలైట్‌ కమ్యూనికేషన్, మైక్రోవేవ్‌ ఇంజినీరింగ్, యాంటెనా, వేవ్‌ ప్రోగ్రెషన్‌ల గురించి కూడా తెలుసుకొంటారు. ఉపగ్రహాలు, టెలివిజన్, రేడియో, కంప్యూటర్లు, మొబైల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్‌ లాంటి అప్లికేషన్ల తయారీలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ ఇంజినీర్లది కీలక పాత్ర. టెలికమ్యూనికేషన్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ఐటీ, పవర్‌ సెక్టర్, హార్డ్‌వేర్‌ తయారీ, గృహోపకరణాలు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, టెలివిజన్‌ పరిశ్రమ, పరిశోధన- అభివృద్ధి, ఆధునిక మల్టీమీడియా సేవా సంస్థల్లో, సివిల్‌ ఏవియేషన్, డిఫెన్స్, ఆలిండియా రేడియో, రైల్వే, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, డీ…ఆర్‌డీ…ఓ లాంటి వివిధ రంగాల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఎక్కువ. 
  సీఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌)లో కంప్యుటేషన్‌ అంశాలతో పాటు కంప్యూటర్‌ నెట్‌వర్క్, అల్గారిదమ్‌ల విశ్లేషణ, ప్రోగ్రామింగ్‌ భాషలు, ప్రోగ్రామ్‌ డిజైన్, సాఫ్ట్‌వేర్, డేటా మైనింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ల గురించి చదువుతారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) మూలాలు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, గణితం, ఎలక్ట్రానిక్స్‌లో ఉన్నాయి. వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను రూపొందించి అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్‌ నెట్‌వర్క్‌లను నిర్వహించడంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లు ముఖ్య పాత్ర పోషిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీర్‌లు పర్సనల్‌ కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, స్కానర్‌ లాంటి కంప్యూటింగ్‌ పరికరాల కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు విండోస్, లైనక్స్, మ్యాక్‌ లాంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల కోసం కోడ్, సెక్యూరిటీ, అల్గారిదమ్‌లను తయారుచేస్తారు. వీరు ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, అభివృద్ధి, టెస్టింగ్, నెట్‌వర్కింగ్‌ అండ్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగాలను పొందే అవకాశం ఉంది. కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్, డేటా సైన్స్‌ లాంటి వినూత్న రంగాల్లోనూ ఈ ఇంజినీర్లకు మెరుగైన ఉపాధి అవకాశాలున్నాయి.

  Asked By: జి. దిలీప్‌సాయి

  Ans:

  మీరు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ఇప్పటినుంచే ఎంఎస్‌ కోర్సు చదవడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టండి. కెనడాలో ఎంఎస్‌ చేయాలంటే జీఆర్‌ఈ స్కోర్‌ తోపాటు, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ అవసరం. వీటిల్లో మంచి స్కోర్‌ సంపాదిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశంతోపాటు, స్కాలర్‌షిప్‌ కూడా లభించే అవకాశం ఉంది.
  కొన్ని యూనివర్సిటీలు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల్లో వచ్చిన స్కోర్‌తోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కెనడాతో పోలిస్తే జర్మనీలో ట్యూషన్‌ ఫీజు నామమాత్రం. జర్మనీలో చాలా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ స్కోర్‌ ఆధారంగానే అడ్మిషన్‌లు ఇస్తున్నాయి. కొన్ని జర్మన్‌ యూనివర్సిటీలు మాత్రం  ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌తో పాటు జీఆర్‌ఈ స్కోర్‌ కూడా పరిగణనలోకి తీసుకొంటున్నాయి.
  ముందుగా ఏ దేశంలో, ఏయే యూనివర్సిటీలో ఎంఎస్‌ని ఏ స్పెషలైజేషన్‌తో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి ఫీజు వివరాలను, ఆ నగరంలో వసతికయ్యే ఖర్చుల వివరాలను తెలుసుకొని, అవసరమైన ఆర్థిక వనరుల గురించి కూడా ఆలోచించండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: డి. కిరణ్‌కుమార్‌

  Ans:

  బీటెక్‌ డిగ్రీలో పోషకాహారానికి (న్యూట్రిషన్‌) సంబంధించిన కోర్సులు ఏమీ చదివివుండరు కాబట్టి, ఈ సబ్జెక్టు గురించి మీరు ప్రాథమిక స్థాయి నుంచి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేయడానికి ఇంటర్మీడియట్‌ విద్యార్హత సరిపోతుంది. సాధారణంగా న్యూట్రిషన్‌ కోర్సును డిగ్రీలో హోమ్‌ సైన్స్‌తో పాటు కానీ, లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టులు, ఫుడ్‌ టెక్నాలజీ కాంబినేషన్‌లో కానీ చదివే అవకాశం ఉంది. న్యూట్రిషన్‌ కోర్సును పీజీ స్థాయిలో చదవాలనుకొంటే, న్యూట్రిషన్‌కు సంబంధించిన డిగ్రీ చదివి ఉండాలి. సెంటర్‌ ఫర్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ స్టడీస్, డిల్లీలో న్యూట్రిషన్‌కు సంబంధించిన పీజీ డిప్లొమా చేయడానికి ఏ డిగ్రీ చదివినవారైనా అర్హులే. Course Era, Udemy, ed X లాంటి ఆన్‌లైన్‌ అభ్యాస వేదికల్లో న్యూట్రిషన్‌ సబ్జెక్టులను నేర్చుకోండి. పైన పేర్కొన్న ఆన్‌లైన్‌ కోర్సులు పోషకాహారంపై అవగాహన మాత్రమే కల్పిస్తాయి. న్యూట్రిషనిస్ట్‌గా స్థిరపడటానికి మాత్రం న్యూట్రిషన్‌ కోర్సుని పీజీ స్థాయిలో చదివి ఉండాలి.

  Asked By: శ్యామ్‌ప్రసాద్‌

  Ans:

  ఐటీ రంగంలో స్థిరపడటానికి ఏ బ్రాంచిలో ఇంజినీరింగ్‌ చేసినా సరిపోతుంది. కాకపోతే, ఇంజినీరింగ్‌లో చదివిన బ్రాంచికి సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు ఉంటే సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచితో సంబంధమున్న ఐటీ అప్లికేషన్స్‌ గురించి కొంత అవగాహన ఉంటుంది. మీరు ఐటీ రంగంలో ప్రవేశించాలంటే రెండు మార్గాలున్నాయి. కెమికల్‌ ఇంజనీరింగ్‌కి సంబంధించిన ఐటీ అప్లికేషన్స్‌లో శిక్షణ పొంది, రసాయనిక పరిశ్రమ కోసం ఐటీని వృద్ధి చేస్తున్న సంస్థల్లో ఉద్యోగావకాశాల కోసం ప్రయత్నించడం;  అన్ని రంగాలకూ సంబంధించిన ఐటీ సంస్థలకు కావాల్సిన జనరల్‌ సాఫ్ట్‌వేర్‌ నేర్చుకొని ఆ సంస్థల్లో స్థిరపడటం.
  మీరు కెమికల్‌ ఇంజినీరింగ్‌ సంబంధిత ఐటీ ఉద్యోగాల కోసం MATLAB, SCILAB, ASPEN, HYSYS, CHEMCAD లాంటి సాఫ్ట్‌వేర్‌ నేర్చుకోండి. ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా ఏదైనా ఐటీ రంగంలోకి ప్రవేశించాలంటే ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మ్యాట్‌ ల్యాబ్, సీ ప్రోగ్రామింగ్, జావా, విజువల్‌ బేసిక్, ఎస్‌క్యూఎల్‌ లాంటివి నేర్చుకోవడం ముఖ్యం. కంప్యుటేషన్, సిమ్యులేషన్, ఆటోమేషన్‌లకు సంబంధించిన ఐటీ టూల్స్‌ గురించీ తెలుసుకోండి. ఐటీ రంగంలో రాణించాలంటే కోడింగ్, ప్రోగ్రామింగ్, ప్రాబ్లం సాల్వింగ్‌ లాంటి నైపుణ్యాలతో పాటు భావ వ్యక్తీకరణ సామర్ధ్యం, ఆంగ్ల భాషపై పట్టు, బృందాల్లో పనిచేయగలగటం, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌