Post your question

 

    Asked By: swetha

    Ans:

    మీరు గ‌వ‌ర్నెన్స్ సబ్జెక్టుకు సంబంధించి తెలుగు అకాడ‌మీ పుస్త‌కాల‌ను చ‌ద‌వండి.

    Asked By: Guguloth

    Ans:

    మీకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 55 నుంచి 60 మార్కులు వ‌స్తున్నాయ‌న్నారు కాబ‌ట్టి మీకు మెయిన్స్‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్‌.

    Asked By: sales.

    Ans:

    ప‌రీక్ష తేదీకి ముందు సంవ‌త్స‌రకాలానికి సంబంధించిన క‌రెంట్ అఫైర్స్ అంశాల‌ను త‌ప్ప‌నిస‌రిగా చద‌వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప‌రీక్ష తేదీకి ముందు నాలుగు నెల‌ల క‌రెంట్ అఫైర్స్‌ను బాగా చ‌ద‌వాలి.

    Asked By: సీహెచ్‌. సిరి

    Ans:

    మీరు పీజీలో డిజిటల్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ స్పెషలైజేషన్‌ సంబంధిత కోర్సులు చదవడం శ్రేయస్కరం. బీబీఏ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఈ రంగాల్లో ఏదైనా ఉద్యోగం చేసి CAT, XAT, NMAT, SNAP, MAT, CMAT, IIFT టెస్ట్‌ లాంటి ప్రవేశ పరీక్షలు రాసి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. చాలా ఎంబీఏ కళాశాలల్లో డిజిటల్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ లాంటి స్పెషలైజేషన్‌లు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ మార్కెటింగ్, ఆపరేషన్స్‌ లాంటి స్పెషలైజేషన్లలో ఇవి కోర్సులుగా ఉంటాయి. ఒకవేళ కోర్సులుగా అందుబాటులో   లేనప్పటికీ మీరు సమ్మర్‌ ప్రాజెక్ట్, ఫైనల్‌ ప్రాజెక్ట్‌లను ఈ రంగాల్లో చేస్తే గత అనుభవం ఆధారంగా మెరుగైన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి.సతీష్

    Ans:

    ఎంబీఎ మార్కెటింగ్‌ చేశాక మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, కంటెంట్‌ మార్కెటింగ్, బ్రాండింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్, కస్టమర్‌ సెంట్రిక్‌ మార్కెటింగ్, డేటా మైనింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్, వెబ్‌ అనలిటిక్స్, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ రీసెర్చ్‌ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవి చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. సాధారణంగా ఎంబీఏ మంచి కళాశాలలో చేస్తే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లోనే ఉద్యోగం వస్తుంది. అలా రానిపక్షంలో, పైన చెప్పిన కోర్సుల్లో కనీసం రెండు చేసే ప్రయత్నం చేయండి. వీటిని ఐఐఎం, మైకా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తే మెరుగైన  ఉద్యోగాలు లభిస్తాయి. అవకాశం ఉంటే, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రయత్నించండి. మీ పనితీరు నచ్చితే, అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Harijana

    Ans:

    తెలుగు మీడియంలో చదువుకున్నారని కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో తెలుగు మీడియంలో చదువుకున్నవారు చాలామంది పని చేస్తున్నారు. అలాగే ఈసారి ఎస్‌బీఐ అసోసియేట్‌ఉద్యోగ పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ మీడియంలలో కూడా నిర్వహిస్తున్నారు.