Post your question

 

    Asked By: డి.బంధ్యానాయక్‌

    Ans:

    సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచికి సంబంధించిన ఉద్యోగాలు, ఇతర ఇంజినీరింగ్‌ బ్రాంచీల ఉద్యోగాలకంటే తక్కువ సంఖ్యలో ఉంటాయి. ప్రముఖ ఐటీ కంపెనీలతో పోలిస్తే ప్రభుత్వరంగ సంస్థల్లో వేతనాలు, ప్రమోషన్‌లు కూడా తక్కువగానే ఉంటాయి. కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు నెట్‌వర్క్‌ ఇంజినీర్, ఐటీ సపోర్ట్‌ స్పెషలిస్ట్, నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, ఐటీ టెక్నీషియన్, వెబ్‌ డెవలపర్, సిస్టమ్స్‌ ప్రోగ్రామర్, సిస్టమ్స్‌ అనలిస్ట్, సిస్టమ్స్‌ మేనేజర్, సైబర్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డేటాబేస్‌ మేనేజర్, అప్లికేషన్‌ డెవలపర్, హార్డ్‌వేర్‌ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. బీహెచ్‌ఈఎల్, బీఈఎల్, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్, ఈసీ‡ఐఎల్, ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, డీఆర్‌డిఓ, ఐఓసీ‡ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్, సెయిల్, సి-డాక్, ఇస్రో, ఇండియన్‌ రైల్వేస్, బ్యాంకులు, యూనివర్సిటీలు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలుంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ కాలేజీల్లో, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ పాఠశాలల్లో కూడా ప్రయత్నించవచ్చు. ఐటీ కంపెనీలతో పాటు రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా, ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, హిందుస్తాన్‌ యూనిలివర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌ బాస్కెట్, మింత్రా, స్నాప్‌ డీల్, పేటీఎం, ఇండియామార్ట్, ఈబే, బుక్‌ మై షో, మేక్‌ మై ట్రిప్, ఎయిర్‌టెల్, బజాజ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జయశ్రీ

    Ans:

    -  స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌)ను కాలేజ్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్‌/ 12 క్లాస్‌ పూర్తయినవారు ఈ పరీక్ష రాయవచ్చు.  శాట్‌లో రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్‌ అనే మూడు విభాగాలుంటాయి. రీడింగ్‌లో లిటరేచర్, హిస్టారికల్‌ డాక్యుమెంట్స్, సోషల్‌ సైన్సెస్, నేచురల్‌ సైన్సెస్‌లో ప్యాసేజ్‌లు ఉంటాయి. రైటింగ్‌లో గ్రామర్, ఒకాబ్యులరీ, ఎడిటింగ్‌ మెలకువలు ఉంటాయి. మ్యాథ్స్‌ విషయానికొస్తే దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించి సమాధానాలు కనుగొనడం, మరొకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా సమాధానాలు కనుగొనడం. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగొనమెట్రీల నుంచి ఉంటాయి. శాట్‌ని ఒక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహిస్తారు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. జేఈఈ మెయిన్స్, శాట్‌ అనేవి రెండు విభిన్నమైన పరీక్షలు. జేఈఈ మెయిన్స్‌లో మ్యాథ్స్‌ కంటే, శాట్‌లో మ్యాథ్స్‌ సులభంగానే ఉంటుంది. శాట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే శాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. -  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.చైతన్య

    Ans:

    యూజీసీ ఇటీవల జారీ చేసిన రెగ్యులేషన్స్‌ ప్రకారం ఒకే సమయంలో ఒక డిగ్రీని రెగ్యులర్‌ పద్ధతిలో, మరో డిగ్రీని ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్దతిలో చేయవచ్చు. కానీ బీఈడీ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉన్నందువల్ల వారి మార్గదర్శకాలు అనుసరించవలసి ఉంటుంది. ఎన్‌సీటీఈ సంస్థ ఇప్పటివరకు డీ… ఈడీ/బీఈడీ/ ఎంఈడీలతో పాటు మరో డిగ్రీ చేయవచ్చనే విషయాన్ని చెప్పలేదు కాబట్టి, మీరు బీఈడీ పూర్తిచేసిన తరువాతే, ఎంఏ చదవండి. బీఈడీ ప్రొఫెషనల్‌ కోర్సు కాబట్టి, మీరు బీఈడీపై శ్రద్ధ పెట్టి, ఆ కోర్సులో సరైన శిక్షణ పొందండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: గాయత్రి

    Ans:

    మీరు నిరభ్యంతరంగా బీఈడీ కోర్సు చెయ్యొచ్చు. డిగ్రీలో మీరు తెలుగు, హిస్టరీ సబ్జెక్టులు చదివారు కాబట్టి, ఆ రెండు మెథడాలజీలతో బీఈడీ చేసే అవకాశం ఉంది. మీ ఐదు సంవత్సరాల డిగ్రీ కోర్సులో మొదటి రెండు సంవత్సరాలను పీడీసీ (ప్రీడిగ్రీ కోర్సు) అంటారు కాబట్టి, మీరు డీ…ఈడీ కూడా చేసే అవకాశం ఉంది. కాకపోతే, మీ పీడీసీ కోర్సును డీ…ఈఈసెట్‌ కమిటీ వారు ఇంటర్మీడియట్‌కు సమానమని నిర్ణయించాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: తేజస్వి

    Ans:

    - ఎంబీఏ తర్వాతŸ పీహెచ్‌డీ చేయాలనే ఆలోచన అభినందనీయం. కానీ, ఎంబీఏ, పీహెచ్‌డీలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతర్జాతీయ ర్యాంకుల్లో మెరుగైన స్థానంలో ఉన్న మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఎంబీఏ చేసినవారు విదేశాల్లో నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎంబీఏ చదివిన కళాశాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లేనట్లయితే, విదేశాల్లో మరో పీజీ చేసి, పీహెచ్‌డీ చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో పీజీ... ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి, మీరు ఇక్కడే ఏదైనా ఉద్యోగం చేసి, ఆర్థికంగా స్థిరపడ్డాక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఐరోపా దేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు మాత్రం మన పీజీతో కూడా పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

    సాధారణంగా విదేశాల్లో పీహెచ్‌డీ చేసేవారికి చాలా ఫెలోషిప్‌లు అందుబాటులో ఉంటాయి. కొన్ని ఐఐటీలు, ఐఐఎంలు విదేశీ యూనివర్సిటీలతో కలిసి జాయింట్‌ పీహెచ్‌డీ చేసే అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. అందులో భాగంగా కనీసం రెండు సంవత్సరాలు విదేశీ యూనివర్సిటీలో పరిశోధన చేసుకోవచ్చు. అలా కాకుండా, మనదేశంలోనే ఏదైనా యూనివర్సిటీలో ప్రముఖ ప్రొఫెసర్‌ పర్యవేక్షణలో కనీసం రెండు నాణ్యమైన పరిశోధన పత్రాలను అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించి, మంచి పరిశోధనాంశంతో విదేశాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసినట్లయితే మరో పీజీ చేయకుండానే, పూర్తి ఫెలోషిప్‌తో పరిశోధన చేయవచ్చు. ఎంబీఏ తరువాత మీరు ఇక్కడే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం యూజీసీ నిర్వహించే నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత అవసరం. ప్రైవేటు రంగానికొస్తే- ఎంబీఏలో మీ స్పెషలైజేషన్‌కు అనుగుణమైన కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సంజీవరావు

    Ans:

    ఫార్మకాలజీ అనేది జీవ వ్యవస్థలపై ఔషధాలు ఎలా పనిచేస్తాయి, ఔషధానికి శరీరం ఎలా స్పందిస్తుంది లాంటి విషయాలను అధ్యయనం చేసే శాస్త్రం. రసాయన లక్షణాలు, జీవ ప్రభావాలు, ఔషధాల చికిత్సా ఉపయోగాల గురించి ఈ విభాగం అధ్యయనం చేస్తుంది. ఔషధం, ఫార్మసీ, డెంటిస్ట్రీ, నర్సింగ్, వెటర్నరీ మెడిసిన్‌తో సహా అనేక విభాగాల పరిజ్ఞానం ఫార్మకాలజీ రంగంలో ఉపయోగపడుతుంది.
    ఈ కోర్సు చదివినవారు క్లినికల్‌ స్టడీస్, బయో అనలిటికల్‌ స్టడీస్, టిష్యూ స్టడీస్, బ్లడ్‌ స్టడీస్, ఫార్మకో విజిలెన్స్‌ విభాగాలున్న అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలతో పాటు పరిశోధన కూడా చేయొచ్చు. బోధనపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌