Post your question

 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    గ్రూప్‌-4 పరీక్షకు ఇంటర్‌ పాసైతే సరిపోతుంది. ఎలాంటి సందేహాలు లేకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: అనిల్ యాదవ్

    Ans:

    డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే అర్హత ఉండదు. నోటిఫికేషన్‌ వచ్చిన నాటికి ఫలితాలు కూడా విడుదలైతే మీకు గ్రూప్‌-2 దరఖాస్తుకి అర్హత ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు కచ్చితంగా అర్హత ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మీరు తెలంగాణలోనే చదివి ఉంటే ఇక్కడి స్థానికత కూడా వర్తిస్తుంది.

    Asked By: బాలరాజు

    Ans:

    ఎలాంటి సమస్యా ఉండదు. ఏ సందేహాలు లేకుండా గ్రూప్స్‌ పరీక్షలకు బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    ఒకటో తరగతికి సంబంధించి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఒకటో తరగతి చదివి ఉంటే ఆ స్కూల్‌ నుంచి స్టడీ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే ఏ సమస్యా ఉండదు.

    Asked By: పి. నూకరాజురెడ్డి

    Ans:

    సివిల్స్, ఏపీపీఎస్సీ గ్రూప్‌-1, గ్రూప్‌-2 లాంటి పరీక్షలకు శిక్షణ ఎంత ముఖ్యమో ఆ శిక్షణ సంస్థ విశ్వసనీయత కూడా అంతే ముఖ్యం. సాధ్యమైనంతవరకు గ్రూప్స్‌/సివిల్స్‌ శిక్షణను ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం శ్రేయస్కరం. గ్రూప్స్‌/ సివిల్స్‌ శిక్షణలో తరగతి గదిలో నేర్చుకొనే సబ్జెక్టుతో పాటు, తోటి అభ్యర్ధుల నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ అవకాశం లేకపోతేనే ఆన్‌లైన్‌ శిక్షణ తీసుకోండి. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్‌ కారణంగా చాలా సంస్థలు ఆన్‌లైన్‌లో సివిల్స్‌/గ్రూప్స్‌ కోచింగ్‌ను అందిస్తున్నాయి. ఆఫ్‌లైన్‌లో నాణ్యమైన శిక్షణ అందించే సంస్థల నుంచే ఆన్‌లైన్‌ శిక్షణ పొందండి.

    ఆన్‌లైన్‌ శిక్షణ సంస్థ ఎంపికలో ఏ విషయాలు గమనించాలంటే.. 1. కంటెంట్‌ నాణ్యత 2. పరీక్షల నాణ్యత 3. వ్యక్తిగత శ్రద్ధ 4. విశ్లేషణాత్మక వీడియో పరిష్కారాలు 5. సాంకేతిక సేవలు 6. ఇతర అభ్యర్థులతో చర్చించగలిగే డిస్కషన్‌ ఫోరమ్‌ 7. అధ్యాపకుల విషయ పరిజ్ఞానం/ అనుభవం  8. నిరంతర ఆన్‌లైన్‌ సహాయం. వీటిని దృష్టిలో పెట్టుకొని గత రెండు, మూడు సంవత్సరాలుగా ఆన్‌లైన్‌ శిక్షణ పొందినవారిని సంప్రదించి, వారి సూచనల ప్రకారం మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,

    Asked By: సీహెచ్‌. లక్ష్మయ్య

    Ans:

    సాధారణ డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుతూ సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలన్న లక్ష్యం బలంగా ఉంటే ఏ కోర్సులో చేరినప్పటికీ విజయం సాధించవచ్చు. సోషల్‌ సైన్సెస్‌లో డిగ్రీ చేస్తూ సివిల్స్‌కు సన్నద్ధమయితే హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఫిలాసఫీ, సోషియాలజీ, ఆంత్రొపాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్ లాంటి సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన ఉంటుంది. ఆ తరువాత, మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేస్తే, అదే సబ్జెక్టును ఆప్షనల్‌గా తీసుకొని సివిల్స్‌ పరీక్ష రాయవచ్చు. సాధారణ డిగ్రీకి  బదులుగా, ఇంజినీరింగ్‌ డిగ్రీ చేస్తే ఎకాలజీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలపై అవగాహన వస్తుంది. ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల లాజికల్‌ థింకింగ్, అనలిటికల్‌ థింకింగ్, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌ నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇంజినీరింగ్‌ చేసిన చాలామంది అభ్యర్ధులు సివిల్స్‌లో సోషల్‌ సైన్స్, లిటరేచర్‌ సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకొంటున్నారు. ఈ రెండు రకాల డిగ్రీలకూ కొన్ని అనుకూలతలూ, ఇబ్బందులూ ఉన్నాయి. ఒకవేళ సివిల్స్‌ సాధించలేకపోతే, సాధారణ డిగ్రీ చదివినవారికంటే, ఇంజినీరింగ్‌ చదివినవారికి వేరే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. పత్రికా పఠనంతోపాటు ఎడిటోరియల్‌ పేజీల్లో వచ్చే వ్యాసాలను చదివి సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. . - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వినయ్‌కుమార్‌

    Ans:

    రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు ప్రవేశ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో బైపీసీ చదివి ఉండాలి. కానీ ఐసీ‡ఏఆర్‌ వారు నిర్వహించే ఏఐఈఈఏ పరీక్షకు ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించినవారు నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -కర్నాల్, రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ-ఝాన్సీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ- పూసాల్లో 100% సీట్లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ యూనివర్సిటీల్లో  15% సీట్ల కోసం పోటీపడి ప్రవేశం పొందొచ్చు. మీరు ఇంటర్‌లో బయాలజీ చదవలేదు కాబట్టి అగ్రికల్చర్‌ కోర్సులో చేరేముందు బయాలజీ, అగ్రికల్చర్‌ సబ్జెక్టుల్లోని ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: వి. ఉదిత్‌ నారాయణ్‌

    Ans:

    బీఎస్సీ తరువాత మేథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో ఎమ్మెస్సీ చేయొచ్చు. ఎమ్మెస్సీ చేసిన తరువాత ఆసక్తి ఉంటే బోధన రంగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి.  బీఈడీ/డీ…ఈడీ చేసి ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించవచ్చు. క్రీడల్లో ఆసక్తి ఉంటే ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో బీపీఈడీ చేయొచ్చు. ఇంగ్లిష్‌/ తెలుగు భాషలపై ఆసక్తి ఉంటే ఆ సబ్జెక్టుల్లో కూడా పీజీ చేయొచ్చు. మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ప్రవేశించాలనుకొంటే ఎంబీఏ, పత్రికా రంగంలోకి వెళ్లాలనుకొంటే జర్నలిజం, కంప్యూటర్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఎంసీఏ, న్యాయరంగంపై ఆసక్తి ఉంటే బీఎల్, గ్రంథాలయాల్లో ఉద్యోగాలకోసం లైబ్రరీ సైన్స్‌ లాంటి కోర్సులు చేయటానికి వీలుంది. డేటాసైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే, ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి కోర్సులు చేయండి. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రవేశించదలిస్తే ఎంబెడెడ్‌ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్, వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొంది నచ్చిన ఉద్యోగంలో స్థిరపడండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌