Post your question

 

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు తెలంగాణ రాష్ట్రంలో స్థానికత వర్తించదు. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కిందకు వస్తారు.

    Asked By: సునీత

    Ans:

    డీఎస్సీ పరీక్ష రాయడానికి టెట్‌ ఉత్తీర్ణత అనేది కనీస అర్హత. కాబట్టి, మీకు డీఎస్సీ రాయడానికి అవకాశం ఉండదు.

    Asked By: సుమన్ తేజ్ బదావత్

    Ans:

    - ప్రపంచవ్యాప్తంగా ఇటీవలికాలంలో మల్టీ డిసిప్ల్లినరీ పరిశోధనలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ మనదేశంలో ఐఐటీ/ యూనివర్సిటీల్లో, ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలంటే గణితంలో కచ్చితంగా ఎంఎస్సీ/ఎంఏ చదివి ఉండాలి. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే మాత్రం ఈ విషయంలో వెసులుబాటు ఇవ్వొచ్చు. బీటెక్‌ డిగ్రీతో పాటు, మేథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లో అత్యంత విషయపరిజ్ఞానం కలిగినవారికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్, చెన్నై మేథమెటికల్‌ ఇన్‌స్ట్టిట్యూట్, ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ లాంటి అతికొద్ది పరిశోధన సంస్థల్లో మేథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయడానికి అర్హత ఉంది. అయితే, మీరు ప్రవేశ పరీక్ష/ ఇంటర్వ్యూల్లో ఎంఎస్సీ/ఎంఏ మేథమెటిక్స్‌ చదివినవారితో పోటీపడవలసి ఉంటుంది. విదేశాల్లో చాలాచోట్ల నాలుగు సంవత్సరాల డిగ్రీ తరువాత పీజీ చేయకుండానే నచ్చిన సబ్జెక్టులో పీహెచ్‌డీ… చేసే అవకాశం ఉంటుంది.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హరిచరణ్‌

    Ans:

    మీ అనుభవాన్ని బట్టి ళీతిశి కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మీరు ఏయే విభాగాల్లో పనిచేశారో, ఏ విభాగంలో మీకు ఆసక్తి ఉందో ళీతిశి లో సంబంధిత మాడ్యూల్‌ని చేయండి. ఐటీ ఉద్యోగాలు అంటే టెస్టింగ్, డెవలపింగ్‌ మాత్రమే కాదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉన్న మీకు మెకానికల్‌ డిజైన్స్, డ్రాయింగ్, అనాలిసిస్‌ల్లో కూడా ఐటీ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే ప్రోగ్రామింగ్, కోడింగ్‌ కోర్సులు చేయండి. డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సులు చేసి ఆ రంగంలోనూ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఫ్రెషర్స్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగావకాశాలు ఎక్కువ. కాబట్టి మీకు అనుభవమున్న మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల్లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించండి.

    Asked By: మౌన దాసి

    Ans:

    చాప్టర్ల వారీగా చదివి, ప్రభుత్వ విధానాల వివరాలను గుర్తుపెట్టుకోండి. డేటా మొత్తం బట్టీ పట్టాల్సిన అవసరంలేదు.

    Asked By: దినేష్ గౌడ్

    Ans:

    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ చేసినవారికి జేఎల్‌ఎం పోస్టులకు అర్హత ఉండదు.

    Asked By: బోగి చిరు

    Ans:

    మీకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్, గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. మీరు ఏదైనా ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు సంబంధించి బీఈడీ లాంటివి చేసి ఉంటే గురుకుల్లాల్లో టీచర్‌ పోస్టులకు కూడా అర్హత ఉంటుంది.

    Asked By: మాతంగి అనుష

    Ans:

    కంప్యూటర్‌ ఆపరేటర్‌ లాంటి కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్‌ సర్టిఫికెట్‌ అవసరం ఉంటుంది. మిగిలినవాటికి అవసరం లేదు.

    Asked By: పల్లపు రాజశేఖర్

    Ans:

    అవును, ఈ రెండింటికీ పరీక్షలు వేర్వేరుగా జరుగుతాయి.