Post your question

 

    Asked By: అమనగంటి

    Ans:

    మీరు శాశ్వత నివాస ఆధారాలు చూపించి సంగారెడ్డి జిల్లాలో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

    Asked By: సోమా

    Ans:

    గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. అయితే గ్రూప్‌-4కి అదనంగా సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ను చదవాలి. మీరు కంగారుపడకుండా రెండింటికీ ఏకకాలంలో ప్రిపరేషన్‌ను కొనసాగించండి.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    సర్టిఫికెట్స్‌పై డూప్లికేట్‌ అని ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్యా ఉండదు. అయితే మీరు ఇచ్చిన ఫిర్యాదు, దానికి పోలీసు శాఖవారు ఇచ్చిన రిపోర్ట్‌ మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడానికి కచ్చితంగా అర్హత ఉంది. కంగారు పడకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

     

    Asked By: శివకృష్ణ

    Ans:

    ఆరో తరగతి ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి స్థానికత వర్తించదు. మీరు నాన్‌లోకల్‌ కిందకు వస్తారు.

    Asked By: మిథున్ చౌహాన్

    Ans:

    ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పూర్తయ్యి, డిగ్రీ పట్టా మీ వద్ద ఉంటేనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది.

    Asked By: లవకుమార్

    Ans:

    మీరు సంబంధిత తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించి నివాస ధ్రువీకరణ పత్రాన్ని పొందవచ్చు.

    Asked By: ఉమా మహేశ్

    Ans:

    మీరు దరఖాస్తు చేసినప్పుడు ఏ సర్టిఫికెట్లనూ అప్‌లోడ్‌ చేయకపోయినా పర్వాలేదు. కానీ వెరిఫికేషన్‌ సమయంలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.