Post your question

 

    Asked By: కృష్ణ

    Ans:

    - ఎథికల్‌ హ్యాకింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన రంగం. ఈ రంగంలో రాణించాలంటే విపరీతమైన ఆసక్తి, విషయ పరిజ్ఞానం చాలా అవసరం. ఈ రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సవాళ్ళ దృష్ట్యా నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ పొందినవారికి పెనట్రేషన్‌ టెస్టర్, వల్నరబిలిటీ అసెసర్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజినీర్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. నెట్‌ వర్కింగ్, కంప్యూటర్‌ సిస్టమ్స్, వివిధ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్, వివిధ రకాల పాస్‌వర్డ్స్‌ను ఛేదించగలగటం, ఎథికల్‌ హ్యాకింగ్‌పై పూర్తి పరిజ్ఞానం, ఎన్‌క్రిప్షన్, క్రిప్టోగ్రఫీ, కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్, ప్రొఫెషనల్‌ కాండక్ట్‌లపై పట్టు సాధించాలి. ఎథికల్‌ హ్యాకింగ్‌లో నిలదొక్కుకోవాలంటే, సీ, సీ++, పైతాన్, ఎస్‌క్యూఎల్, జావా, పీహెచ్‌పీ..లాంటి కోడింగ్‌ లాంగ్వేజ్‌లూ నేర్చుకోవాల్సిందే. కాబట్టి మీరు సీ, సీ++, పైతాన్‌లు నేర్చుకోవడం ద్వారా ఎథికల్‌ హ్యాకింగ్‌తో పాటు, ఇతర సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలనూ ప్రయత్నించవచ్చు.

    Asked By: క్రిష్

    Ans:

    మీరు ఇంటర్‌ కనీస అర్హతగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంకోచించకుండా అన్నింటికీ బాగా ప్రిపేర్‌ అవ్వండి.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు ఎస్‌జీటీకి మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు కచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎలాంటి సంకోచం లేకుండా అన్నింటికీ బాగా సిద్ధమవ్వండి.

    Asked By: షేక్

    Ans:

    డిగ్రీ పూర్తయితే గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలు రాసుకోవడానికి కచ్చితంగా అర్హత ఉంటుంది. అయితే నోటిఫికేషన్‌ సమయానికి ఫలితాలు వచ్చి మార్కుల శాతం తెలిసి ఉండాలి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయానికి సర్టిఫికెట్‌ చేతిలో ఉండాలి.

    Asked By: భవాని

    Ans:

    ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయితో వివాహమైనప్పటికీ మీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా తెలంగాణలోనే జరిగింది కాబట్టి, మీకు ఇక్కడి స్థానికత వర్తిస్తుంది.