Post your question

 

  Asked By: జి. లక్ష్మణ్‌

  Ans:

  గేట్‌తో సంబంధం లేకుండా కూడా చాలా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఈఎస్‌ఈ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌) కు ప్రతి సంవత్సరం యు.పి.ఎస్‌.సి పరీక్షను నిర్వహిస్తుంది. దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాల కోసం డి.ఆర్‌.డి.ఒ. ప్రత్యేకంగా రాత పరీక్ష నిర్వహిస్తుంది. త్రివిధ దళాల విషయానికొస్తే- ఇండియన్‌ నేవీలో యూనివర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా, ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు ద్వారా, వైమానిక దళంలో ఏఎఫ్‌ క్యాట్‌ ద్వారా ఉద్యోగాలు భర్తీ అవుతాయి. ఇవే కాకుండా భాభా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్, ఇస్రో లాంటి పరిశోధన సంస్థల్లోనూ మెకానికల్‌ ఇంజినీర్‌లకు వారి విద్యార్హత ఆధారంగా ఉద్యోగ అవకాశాలున్నాయి.
  వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్, కోల్‌ ఇండియా లిమిటెడ్, బీహెచ్‌ఈఎల్, ఆర్‌ఐటీఈఎస్‌ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా గేట్‌తో కాకుండా వారు నిర్వహించే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఇంజినీరింగ్‌ పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఏఈఈ, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి పోస్టులను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. రైల్వే శాఖలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లాంటి సంస్థలు కూడా గేట్‌తో సంబంధం లేకుండా వారి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌లు జారీ చేస్తాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. యశ్వంత్‌

  Ans:

  బీఎస్సీ ఎలక్ట్ట్రానిక్స్‌ పూర్తిచేశాను. ఏ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పొందొచ్చు?
  మీరు కోడింగ్, పైతాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్, డేటా సైన్స్, ఐఓటీ¨, వెబ్‌ డిజైన్, ఆండ్రాయిడ్‌ ఆప్‌ డెవలప్‌మెంట్, పీసీబీ డిజైన్‌లలో శిక్షణ తీసుకొంటే మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు. ఇవే కాకుండా సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) వారు అందించే మాట్‌ ల్యాబ్, మైక్రో కంట్రోలర్‌ ప్రోగ్రామింగ్, వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్‌ ఎంబెడెడ్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ డిజిటల్‌ డిజైన్, డీప్‌ లెర్నింగ్, సిస్టమ్‌ వేరిలాగ్, ఎస్‌టీడీ సెల్‌ డిజైన్, ఐసీ ఫిజికల్‌ డిజైన్, హెచ్‌డీఎల్‌ సింథసిస్, మాట్‌ ల్యాబ్‌- డీఎస్‌పీ, మాట్‌ ల్యాబ్‌-ఇమేజ్‌ ప్రాసెసింగ్, మెకట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌ రిపేరింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, రోబోటిక్స్‌ లాంటివాటిలో నచ్చిన కోర్సు చేస్తే మంచి ఉద్యోగాలను పొందవచ్చు. సీ- డాక్‌ సంస్థ కూడా ఎలక్ట్ట్రానిక్స్‌ చదివినవారికి కొన్ని సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్త్తోంది. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీల్లో పీజీ డిప్లొమా ఇన్‌ టెలికమ్యూనికేషన్‌ కోర్సు చేసే అవకాశం ఉంది.  - బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శివకుమార్‌

  Ans:

  మీరు యు.ఎస్‌. టాక్సేషన్‌ కంపెనీలో ఏ రోల్‌లో పనిచేశారో చెప్పలేదు. ఈ రంగంలో ఎదగాలంటే ఎకౌంటింగ్‌ రంగంలో సర్టిఫికెట్‌ ఉండడం అవసరం. ఏసీసీఏ వారు అందించే షార్ట్‌ టర్మ్‌ కోర్సులైన ఐఎఫ్‌ఆర్‌ డిప్లొమా లేదా ఐఎఫ్‌ఆర్‌ సర్టిఫికెట్‌ కోర్సును ఎంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.accaglobal.com/in/en.html ను సందర్శించండి. మీరు లాంగ్‌ టర్మ్‌ కోర్సులను ఎంచుకోదలిస్తే యూఎస్‌- సీపీఏ కోర్సును లేదా యూఎస్‌- సీఎంఏ కోర్సును ఎంచుకోవచ్చు. నిర్దిష్టంగా యు.ఎస్‌. టాక్సేషన్‌ కోర్సులు మనదేశంలో అందుబాటులో లేవు. ఇలా కాకుండా ఎంబీఏ ఫైనాన్స్‌ కోర్సును ఎంచుకుని మీ అభిరుచికి తగ్గట్టు ఫైనాన్స్‌ రంగంలో ఉపాధి పొందొచ్చు. మీరు టాక్సేషన్‌ రంగంలోనే స్థిరపడాలనుకొంటే సీఏ, ఏసీఎస్, ఐసీడబ్ల్యూఏ లాంటి కోర్సుల గురించీ ఆలోచించండి. - బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: బి. నరేంద్ర

  Ans:

  ఏ రంగంలో డిగ్రీ చేసినవారైనా బ్రాంచిలకు అతీతంగా ఐటీ, సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన కొలువులకు మొగ్గు చూపడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ నేర్చుకోవడానికి ఇప్పుడు ఆన్‌లైన్‌ మాధ్యమంలో చాలా కోర్సులున్నాయి. టెస్టింగ్‌ నేర్చుకొని సాఫ్ట్‌వేర్‌ టెస్టర్‌గా కెరియర్‌ను మొదలు పెట్టాలనుకుంటే సెలీనియం (Selenium suite of tools) నేర్చుకోవలసి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీ జావా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అందుకని మీరు జావాను ముందుగా నేర్చుకోవలసి ఉంటుంది. ఈ కోర్సునూ, దీనికి అనుసంధానమైన వివిధ మాడ్యూళ్లనూ పూర్తి చేసిన తరువాత సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం సంపాదించే అవకాశాలున్నాయి. వివిధ రకాల ప్రాజెక్టుల్లో పనిచేసి అనుభవం సంపాదించాక సాఫ్ట్‌వేర్‌ రంగంలో మీ కెరియర్‌ ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.
  రోబోట్‌ అండ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ టెస్ట్‌ ఆటోమేషన్, కంప్యూటర్‌ నెట్‌ వర్కింగ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ గ్రీన్‌ బెల్ట్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లైఫ్‌ సైకిల్, గూగుల్‌ ఐటీ ఆటోమేషన్‌ విత్‌ పైతాన్, గూగుల్‌ ఐటీ సపోర్ట్, లీన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ లాంటి ఆన్‌లైన్‌ కోర్సులను లిండా, యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వేదికలపై నేర్చుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ని కూడా పెంచుకొనే ప్రయత్నం చేయండి.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎం. శ్రీనివాస్

  Ans:

  బీటెక్‌ సివిల్‌ చేసినవారికి ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సివిల్‌ ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ప్రైవేటు రంగంలో సైట్‌ ఇంజినీర్‌గా, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌గా, అసిస్ట్టెంట్‌ ఇంజినీర్‌గా, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌గా, కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించే పరీక్షలు రాసి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, పురపాలక శాఖ, గ్రామీణ నీటి సరఫరా పనుల శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు రాసి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో చేరవచ్చు. గేట్‌ పరీక్ష రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా, ఇంజినీర్‌ ట్రైనీగా కూడా స్థిరపడవచ్చు. 
  ఇవన్నీ కాకుండా సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకొని డిజైన్‌లు, డ్రాయింగ్‌లతో పాటు వాల్యుయేషన్‌ కూడా చేయవచ్చు. కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉద్యోగావకాశాల్ని పెంచుకోవచ్చు. అమ్మాయిలకు కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ సరైన ఎంపికే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా, ఏ ఇంజినీరింగ్‌ అయినా అమ్మాయిలందరికీ అర్హత ఉంటుంది. ఆసక్తి ఉంటే నిస్సంకోచంగా అమ్మాయిలూ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎంచుకోవచ్చు.
   

  Asked By: Chaitanya Prakash

  Ans:

  మనదేశంలో ఎంబీబీఎస్‌ చదవాలనుకునే వారు టెన్‌ ప్లస్‌ టూ విధానంలో ఇంటర్మీడియట్‌ను బయాలజీ ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా ఎన్‌.టి.ఎ వారు ఏటా నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)లో మంచి ర్యాంకు తెచ్చుకున్నవారికి ఎంబీబీఎస్‌ చదివే అర్హత ఉంది. ఇక వయసు విషయానికొస్తే నీట్‌ రాసేవారికి కనీసం 17 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్‌ క్రీమీ లేయర్‌), పీడబ్ల్యూడీ) కేటగిరీ వారికి 5 సంవత్సరాల వెసులుబాటు ఉంది. మీ వయసు 24 సంవత్సరాలు కాబట్టి, మీరు జనరల్‌ కేటగిరీకి చెందిన వారయితే ఒక్క సంవత్సరం, రిజర్వ్‌డ్‌ కేటగిరీకి చెందినవారైతే ఇంకో ఆరు సంవత్సరాల పాటు నీట్‌ రాసే అవకాశముంది. భారత సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి 25 సంవత్సరాలు నిండినవారూ నీట్‌ రాయవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: M Srinivas

  Ans:

  బీటెక్‌ సివిల్‌ చేసినవారికి ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సివిల్‌ ఇంజినీర్ల అవసరం ఎక్కువ. ప్రైవేటు రంగంలో సైట్‌ ఇంజినీర్‌గా, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌గా, అసిస్ట్టెంట్‌ ఇంజినీర్‌గా, క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌గా, కన్‌స్ట్రక్షన్‌ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ నిర్వహించే పరీక్షలు రాసి అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, పురపాలక శాఖ, గ్రామీణ నీటి సరఫరా పనుల శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చు.యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలు రాసి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో చేరవచ్చు. గేట్‌ పరీక్ష రాసి ప్రభుత్వరంగ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా, ఇంజినీర్‌ ట్రైనీగా కూడా స్థిరపడవచ్చు. 
  ఇవన్నీ కాకుండా సొంతంగా కన్సల్టెన్సీ పెట్టుకొని డిజైన్‌లు, డ్రాయింగ్‌లతో పాటు వాల్యుయేషన్‌ కూడా చేయవచ్చు. కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉద్యోగావకాశాల్ని పెంచుకోవచ్చు. అమ్మాయిలకు కూడా సివిల్‌ ఇంజినీరింగ్‌ సరైన ఎంపికే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఉద్యోగం అయినా, ఏ ఇంజినీరింగ్‌ అయినా అమ్మాయిలందరికీ అర్హత ఉంటుంది. ఆసక్తి ఉంటే నిస్సంకోచంగా అమ్మాయిలూ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఎంచుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: SaiKrishna Reddy Milkuri

  Ans:

  Candidates should have completed 17 years of age as on 31st December of the year of admission and an upper age limit of 22 years for all the candidates and 25 years in respect of scheduled caste and scheduled tribe candidates as on 31st December of the year of Admissions.

  Asked By: Sivaram T

  Ans:

  Yes it is available in our website. Material prepared by experienced faculty. 

  Asked By: Sunil G

  Ans:

  There are so many branches in Polytechnic. All are equally special and good.  It depends upon which subject and course you choose for having a desired career. Choose any course on the basis of your interests.